సాక్షి, హైదరాబాద్: ఇంటీరియర్‌లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆధునిక పోకడలు, అభిరుచుల మేరకు వైవిధ్యభరితమైన ఇంటీరియర్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా రబ్బర్ ఫ్లోరింగ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది ఇంటీరియర్ ప్రియులు గ్రానైట్, మార్బుల్స్, టైల్స్ బదులుగా రబ్బర్ ఫ్లోరింగ్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. గదికో రకంగా డిజైనింగ్ చేయిస్తున్నారు.
సాధారణంగా రబ్బర్ ఫ్లోరింగ్ అనేవి జిమ్‌లు, క్రీడా మైదానాలలో వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇళ్లలోనూ ఈ తరహా ఫ్లోరింగ్‌ను కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి పిల్లల గదులలో రబ్బర్ ఫ్లోరింగ్‌ను వేయిస్తున్నాయి. పై అంతస్తులో పిల్లలు ఆడుకుంటే కిందికి శబ్దాలు వినిపించకుండా, కిందపడినా దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఈ రబ్బర్ ఫ్లోరింగ్‌ను ఎంపిక చేస్తున్నారు.
తడిగా ఉంచే కిచెన్, బాత్‌రూమ్ వంటి ప్రాంతాలలో కూడా వీటిని వేసుకోవచ్చు. రబ్బర్ ఫ్లోరింగ్ ఉత్పత్తులు మ్యాట్స్, టైల్స్, రోల్స్ రూపంలో, విభిన్న శైలి రంగులలో, డిజైన్‌లలో లభ్యమవుతాయి. వీటికి దీర్ఘకాలం మన్నిక ఉంటుంది. సరిగ్గా నిర్వహణ చేస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. ఇతర ఫ్లోరింగ్‌లతో పోలిస్తే చిరిగిపోవటం, పాడైపోవటం వంటివి చాలా తక్కువ. ఫంగస్ కూడా పట్టదు.
ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!
Comments
Please login to add a commentAdd a comment