wine
-
గ్లాసు వైన్ 5 లక్షల డాలర్లు!
అవున్నిజమే! మన రూపాయల్లో కోటి 24 లక్షల రూపాయల పైమాటే. అంత ఖరీదెందుకు, ఏమిటా వైన్ ప్రత్యేకత వంటి సందేహాలెన్నో వస్తున్నాయి కదా! ఆ వైన్ అంతరిక్ష కేంద్రంలో తయారవుతోంది మరి! ఇదంతా జపాన్‌కు చెందిన ప్రముఖ సేక్ (వైన్) బ్రాండ్ దస్సాయ్ తయారీ సంస్థ అసాహి షుజో ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది. ముడి పదార్థాలను ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపించి అక్కడ పులియబెట్టాలని యోచిస్తోంది. ఇది విజయవంతమైన మీదట కేవలం 100 మి.లీ. వైన్ బాటిల్‌ను ఏకంగా రూ.5.53 కోట్లకు అమ్మనుంది. ఈ ప్రయోగానికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి కంపెనీ భారీ మొత్తమే చెల్లించింది. ఈ ప్రాజెక్టును 2025లో లాంచ్ చేయనుంది. అంతరిక్షంలో పులియబెట్టేందుకు కావాల్సిన పరికరాల తయారీలో బిజీగా ఉంది. అయితే గురుత్వాకర్షణ ఉండని అంతరిక్ష కేంద్రంలో పులియడానికి కావాల్సిన కిణ్వ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది చూడాలి. చంద్రుడే లక్ష్యంగా.. ప్రయోగం గనుక సక్సెసైతే ఇదే అతి ఖరీదైన పానీయం అవుతుందని అసాహి షుజో కంపెనీ బ్రూవర్ ప్రాజెక్ట్ ఇన్చార్జి సౌయా ఉట్సుకి చెప్పారు. ‘‘అయితే ఈ పరీక్ష 100% విజయవంతమవుతుందని గ్యారంటీ లేదు. కాకపోతే మా ప్రయత్నం వెనుక కేవలం ఘనత కోసం కాదు. అంతరిక్షంలో కిణ్వ ప్రక్రియ ఏ మేరకు జరుగుతుందన్న దానిపై మా కంపెనీ దృష్టి పెట్టింది. జరిగితే ఏదో ఒకనాడు చంద్రుడిపైనా వైన్‌ను పులియబెట్టడం మా కంపెనీ లక్ష్యం. మున్ముందు మనుషులు చంద్రుడిపైకి స్వేచ్ఛగా ప్రయాణించే రోజు రానుంది. పర్యాటకులు చంద్రునిపై ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదించాలన్నది మా ఉద్దేశం. అంతేగాక పులియబెట్టిన ఆహారాన్ని ఇష్టపడే భావి అంతరిక్ష పర్యాటకులకు కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. నాటో, మిసో వంటి జపనీస్ ఆహారాలు పులియబెట్టడం ద్వారానే తయారవుతాయి. ఏమిటీ సేక్? సేక్ ఒక రకమైన వైన్ లేదా సారాయి. జపనీస్ బియ్యం, నీరు, ఈస్ట్, కోజీ (ఒక రకమైన అచ్చు) తో తయారవుతుంది. నిర్దిష్ట సమయాల్లో పలు దశల్లో ఆవిరి పట్టడం, కదిలించడం, పులియబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. అందుకు 2 నెలలు పడుతుంది. ఇది జపాన్ సాంస్కృతిక వారసత్వ పానీయంగా యునెస్కో గుర్తింపు పొందింది. సేక్ బ్రాండ్లలో దస్సాయ్ అత్యంత ప్రాచుర్యం పొందింది. – వాషింగ్టన్ -
ఎమిలి ఐడియా అదుర్స్, బనానా వైన్!
‘అవసరం’ నుంచి మాత్రమే కాదు ‘నష్టం’ నుంచి కూడా ‘ఐడియా’ పుడుతుంది. విషయంలోకి వస్తే... ఈస్ట్ ఆఫ్రికా దేశమైన మలావీలో కరోంగ జిల్లాకు చెందిన శ్రీమతి ఎమిలీ చిన్నపాటి రైతు. అరటి సాగు చేసే ఎమిలీలాంటి ఎంతోమంది రైతులకు ఒక సమస్య ఏర్పడింది.విపరీతమైన వేడి వల్ల అరటిపండ్లు చాలా త్వరగా పండుతున్నాయి. పాడవుతున్నాయి. దీనివల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ‘వెరీ ఫాస్ట్ అండ్ గో టు వేస్ట్’ అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ‘బనానా వైన్’ ఐడియా పుట్టింది.ఇక ఆట్టే ఆలస్యంలోకి చేయకుండా ఎమిలీ బృందం రంగంలోకి దిగింది.‘అరటి వైన్ తయారు చేయడం ఎలా?’ అనేదానికి సంబంధించి వారు చిన్నపాటి శాస్త్రవేత్తలు అయ్యారు. ఎంతోమంది నిపుణులతో మాట్లాడారు. మెచెంజర్ అనే గ్రామంలో నాలుగు గదుల ఇంట్లో వైన్ తయారీ ప్రక్రియ మొదలు పెట్టారు. బాగా మగ్గిన అరటిపండ్లు, చక్కెర, ఎండుద్రాక్ష, నిమ్మకాయలు, నీళ్లు... మొదలైనవి ముడిసరుకుగా బనానా వైన్ తయారీ మొదలైంది. అయితే ఇదేమీ ఆషామాషీ ప్రక్రియ కాదు.ఎమిలి మాటల్లో చెప్పాలంటే ‘టైమింగ్ అనేది చాలా ముఖ్యం’ ఎలాంటి అరటిపండ్లను ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, టైమ్ ఎంత తీసుకోవాలి....ప్రతి దశలోనూ ఆచితూచి అత్యంత జాగ్రత్తగా వ్యహరించాల్సి ఉంటుంది. ఇది ‘గుడ్ క్వాలిటీ వైన్’గా పేరు తెచ్చుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ‘స్మూత్ అండ్ లైట్ వైన్’గా పేరు తెచ్చుకున్న ఈ అరటి మద్యానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.‘మలావీ నలుమూలలా అరటి మద్యానికి మంచి డిమాండ్ ఉంది’ అంటున్నాడు కమ్యూనిటీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెన్నిసన్ గోండ్వే. ‘బనానా వైన్ ఐడియా మా జీవితాలను మార్చేసింది. మాలో కొందరు ఇళ్లు కట్టుకున్నారు. కొందరు పశువులు కొన్నారు. ఇప్పుడు మేము మంచి భోజనం తినగలుగుతున్నాం’ అంటుంది ఎలీన. ఇదీ చదవండి: ‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో -
అక్కడ ఫ్రీగా కావాల్సినంత రెడ్ వైన్ తాగేయొచ్చు..!
ఇటలీ దేశంలో డోరా సర్చెస్ అనే ద్రాక్షతోట యజమానులు ఫ్రీ రెడ్ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌంటెన్ వద్ద రెడ్ వైన్ 365 రోజులు ఉచితంగా లభిస్తుంది. వాస్తవానికి ఇటలీ దేశంలో ఉచితంగా వైన్ అందించడం కొత్తకాదు. మారినో అనే పట్టణంలో ప్రతి ఏడాది గ్రేప్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒక గంట పాటు ప్రజల కోసం పబ్లిక్ వాటర్ ఫౌంటెన్ ట్యాప్ లలో వైట్ వైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు రెడ్ వైన్ అందుబాటులో ఉండటం విశేషం. ఇటలీ దేశంలో ఉన్న ఈ రెడ్ వైన్ ఉచితంగా అందించే మొదటి ఫౌంటెన్ గా ఇది గుర్తింపు పొందింది.ఎందుకిలా అంటే..ఇటలీ దేశంలో విభిన్నమైన సేవలు అందించాలని ఇక్కడి ద్రాక్ష యజమానులు అప్పట్లో భావించారు. అందులో భాగంగానే ఫ్రీ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత రోమ్ నగరం నుంచి ఒర్టోనా వరకు 196 మైళ్ళ దూరం ఉంటుంది. ఇంత దూరం ప్రతి ఏడాది సాంస్కృతిక యాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కొన్ని వేల మంది కేథలిక్ లు పాల్గొంటారు. ఈ దారి వెంట ప్రయాణం సాగించే వారి బడలిక తీర్చేందుకు ప్రసిద్ధ కామినో డి షాన్ టోమ్మాసో దగ్గర ఈ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.ప్రయాణికులు ట్యాప్ తిప్పి తమకు కావలసిన పరిమాణంలో వైన్ తాగి ముందుకు వెళ్తారు. మరింత కావలసిన వాళ్లు పెద్ద పెద్ద బాటిల్స్ లో నింపుకొని వెళ్తూ ఉంటారు. వాస్తవానికి దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లు దొరకడమే గగనమైన ఈ రోజుల్లో ఇటలీ దేశంలో ఏకంగా రెడ్ వైన్ అందించడం.. అది కూడా ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయమే కదా.. అయితే ద్రాక్ష తోట యజమానులు తమ ఎస్టేట్‌లో పండే పండ్లను ఈ వైన్ తయారీ కోసం వినియోగిస్తారు. వేలాది ఎకరాల్లో తోటలు విస్తరించిన నేపథ్యంలో బాగా పక్వానికి వచ్చిన పండ్లతో వారు ఈ వైన్ తయారు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి రసాయనాలు కలపకపోవడం విశేషం.(చదవండి: బిడ్డకు తల్లయినా ఎంతో ఫిట్‌గా ఆలియా.. సీక్రెట్ ఏంటంటే?) -
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ 'తెలుగు తమ్ముళ్లు'!
తిరుపతి: మండలకేంద్రంలో తెలుగు తమ్ముళ్లు సరికొత్త వ్యాపారానికి తెరతీశారు. టీడీపీ నేత పులివర్తి నాని అనుచరులు సారా తయారీలో తలమునకలై ఉన్నారు. గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేసి మండల వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు గుర్తించారు. చంద్రగిరి మండలం, కొటాలలో సారా తయారీ చేస్తున్నారనే సమాచారంతో గురువారం ఎస్ఈబీ సీఐ లీలాకుమారి ఆధ్వర్యంలో దాడులు చేశారు. కొటాల ఎస్టీ కాలనీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో సారా ఊటను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొటాల పంచాయతీకి చెందిన టీడీపీ నేత పులివర్తి నాని అనుచరుడు చెంగయ్యతో పాటు మరో ముగ్గురున్నట్టు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సారాతో పాటు చెంగయ్యను చంద్రగిరి ఎస్ఈబీ కార్యాలయానికి తరలించారు. తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో చెంగయ్యతో పాటు మరికొంత మంది తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అంతేకాకుండా నిందితులు గతకొంత కాలంగా ఇక్కడి నుంచి తయారు చేస్తున్న సారాను మండల వ్యాప్తంగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన నిందితుడి కుమారుడు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా జైలుశిక్ష అనుభవించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇవి చదవండి: Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్! -
దేశంలో మద్యం రాజధాని ఏది?
భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతీ నగరానికి తనదైన కథ ఉంటుంది. కొన్ని నగరాలు అక్కడి ఆహారానికి ప్రసిద్ధి చెందగా, మరికొన్ని సాంస్కృతిక వారసత్వానికి పెట్టిందిపేరుగా నిలిచాయి. దేశంలోని ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే మన దేశంలో ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ఒక నగరం ఉందనే సంగతి మీకు తెలుసా? మహారాష్ట్రలోని నాసిక్ నగరాన్ని ‘వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. అంటే భారతదేశ మద్యం రాజధాని. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మద్యంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే తయారవుతుంది. ఈ నగరంలో 52 వైన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 వేల ఎకరాల్లో ద్రాక్షసాగు చేస్తున్నారు. దీనిలో అధిక భాగం వైన్ తయారీకి ఉపయుక్తమవుతుంది. నాసిక్‌లోని నేల రెడ్ లేటరైట్ రకానికి చెందినది. అంతే కాదు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంది. ద్రాక్ష సాగుకు అవసరమైన నీటి పరిమాణం. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, ఇక్కడ ద్రాక్ష విరగకాస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఈ నగరంలో ప్రతి సంవత్సరం 20 టన్నులకు పైగా ద్రాక్ష ఉత్పత్తి జరుగుతుంది. ఇది కూడా చదవండి: ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం? -
మద్యపానంతో ఇబ్బందులు పడ్డా.. జీవితం తలకిందులైంది: సీనియర్ హీరోయిన్
బాలీవుడ్ నటి, మనీషా కొయిరాలా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లోనే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించింది. నేపాల్‌లోని ఖాఠ్మండులో జన్మించిన మనీషా కొయిరాలా.. 1991లో సుభాష్ ఘై చిత్రం సౌదాగర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతకుముందే 1989లో ఫేరి భతౌలా అనే నేపాలీ చిత్రంలో నటించింది. (ఇది చదవండి: 7 ఏళ్లకే పనిమనిషిగా.. 10 ఏళ్లకే సినిమాల్లోకి.. కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్) అప్పటి నుంచి ఆమె కెరీర్లో వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఆమె నటించిన బొంబాయి చిత్రంలో అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో నాగార్జున సరసన క్రిమినల్, అర్జున్‌తో ఒకే ఒక్కడు, నగరం, భారతీయుడు, బూచి, లేడీ టైగర్, నోటుకు పోటు లాంటి చిత్రాల్లో కనిపించింది. ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన షెహాజాదాలో హీరోకు తల్లిపాత్రలో నటించింది. అయితే మనీషా కొయిరాల ఎంత త్వరగా గొప్ప పేరు తెచ్చుకుందో.. ఆమె కెరీర్ కూడా అంతే వేగంగా పతనమైంది. ఆ తర్వాత అప్పట్లో ఆమె నేపాల్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పట్లో ఆమె మద్యానికి కూడా బానిసైంది. గతంలో మనీషా మద్యం సేవించిన ఓ వీడియో నెట్టింట్లో కనిపించింది. ఆ వీడియోలో మద్యం మత్తులో ఉన్న మనీషా కొయిరాలాను మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుండగా వద్దని వేడుకుంది. మద్యానికి బానిస కావడం పట్ల మనీషా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మద్యపానం వల్ల జీవితంలో కష్టాలు పడ్డానని తెలిపింది. మనీషా కొయిరాలా మాట్లాడుతూ.. 'మద్యం నా జీవితంలోకి వచ్చాక పరిస్థితి అంతా తలకిందులైంది. నా జీవితం ఇంతలా మారతుందనినేను గ్రహించలేదు. అప్పుడు చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా. మనం మద్యం తాగడం ప్రారంభిస్తే దానివల్ల సమస్యలు పరిష్కారం కావు. జీవితంలో అది మన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మద్యం తాగుతారు. మా నాన్న కొన్నిసార్లు తాగేవారు. కానీ మన పరిస్థితులను అర్థం చేసుకుని మెలగాలి. అప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది.' అని అన్నారు. కాగా.. 2010లో మనీషా తన తోటి నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని పెళ్లాడింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) -
Kim Jong Un: ఓ వైపు ఆహార సంక్షోభం.. కిమ్ విందు, విలాసాలకు కోట్లు!
ఉత్తర కొరియా దేశం కరువుతో అల్లాడుతోంది. ఆహార కొరతతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వైపు దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్లాడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన లగ్జరీ జీవితాన్ని వదులుకోవడం లేదు. ఉత్తర కొరియా నియంత విందులు, విలాసాలకు కోట్లలో డబ్బులు వెచ్చిస్తున్నాడు. దేశ పరిస్థితిని పట్టించుకోకుండా ఖరీదైన మద్యం, సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసం రుచిని ఆస్వాదిస్తున్నాడు. రూ. 5 లక్షల విలువ చేసే మద్యం ఈ మేరకు అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు డైలీ స్టార్ పత్రికకు వెల్లడించారు. కిమ్ అత్యంత ఖరీధైన మద్యాన్ని తాగుతాడని ఆయన తెలిపారు. దాదాపు 7 వేల డాలర్లు(ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 లక్షలకు పైగా) విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని సేవిస్తాడని పేర్కొన్నారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్ ప్రతి ఏడాది 30 మలియన్ డాలర్లు (రూ.247 కోట్లు) ఖర్చుపెడతారని వెల్లడించారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్ అడ్మిన్‌స్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిర్గతం చేసినట్లు తెలిపారు. బంగారపు రేకుతో చుట్టిన సిగరెట్లు కేవలం మద్యం మాత్రమే కాకుండా అత్యంత నాణ్యత, అరుదుగా దొరికే ప్రత్యేక ఆహారాన్ని కిమ్ తీసుకుంటారు. ఇటలీలోని పర్మా ప్రాంతంలో లభించే పర్మా హామ్(పోర్క్‌తో తయారు చేసేది), స్విస్ చీజ్‌ను దిగుమతి చేసుకుంటారు. ఆయన తాగే ఖరీదైన సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని చెబుతున్నారు. చదవండి: ఉత్తర కొరియా కిమ్ జోంగ్కు ఇన్సోమ్నియా డిజార్డర్!.. 140 కేజీల బరువు!! పిజ్జాల కోసం ఇటలీ నుంచి చెఫ్ కిమ్‌కు జంక్ ఫుడ్ అన్న అమిత ఇష్టం. 1997లో కిమ్ కేవలు పిజ్జాలు చేసేందుకు ఇటలీ నుండి ఖరీదైన చెఫ్‌ను రప్పించుకున్నాడు. తనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి సంవత్సరం 9.6 లక్షల డాలర్లను(రూ.7 కోట్ల 96 లక్షలు) వెచ్చిస్తున్నారు. కిమ్, అతని తండ్రి కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం కోబ్ స్టీక్స్, క్రిస్టల్ షాంపైన్‌తో భోజనం చేసేవారు. ఈ విషయాన్ని కిమ్ వద్ద గతంలో చెఫ్‌గా చేసిన ఒకరు పేర్కొన్నారు. స్నేక్ వైన్ యూకే మెట్రో రిపోర్ట్ ప్రకారం.. 2014లో కిమ్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడట. అయితే ఉత్తర కొరియా నియంత విపరీతమైన మద్యపానం, ధూమపానం చేస్తున్నాడని, అతని బరువు 300 పౌండ్లు (136 కిలోలు) మించిపోయిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ విలాసవంతమైన ఫుడ్ డైట్ విషయం వెలుగులోకి వచ్చింది. నార్త్ కొరియా నియంత యూఎస్ఏ నుంచి మార్ల్బోరో సిగరెట్లతో సహా, నిద్రలేమికి చికిత్సకు ఉపయోగించే జోల్పిడెమ్ వంటి మందులను కూడా దిగుమతి చేసుకుంటున్నారని సదరు నివేదిక పేర్కొంది. మరోవైపు ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు రాజ్యమేలుతోంది. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార పదార్థాలు లభ్యం కావడం లేదు. అదే విధంగా పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. చదవండి: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..! -
మందు మీద మోజు.. వైన్ బిజినెస్‌తో కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ
'ఆకాశంలో సగం' అంటూ పోవూరి లలిత కుమారి (ఓల్గా) రాసిన కవిత ఒకప్పుడు సంచలనం రేపింది. ప్రతి రంగంలోనూ అవకాశాలు కల్పించాలని, పురుషాధిక్యం తగదని తన రచనల ద్వారా సమాజం మీద విరుచుకుపడిన విషయం దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ రోజు మహిళ అడుగుపెట్టని రంగం ఏదీ లేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజు అన్ని రంగాల్లోనూ మహిళల హవా నడుస్తోంది. మహిళలకు పూర్తిగా విరుద్ధంగా భావించే వైన్ ఇండస్ట్రీలో కూడా మేము సైతం అంటున్నారు. ఇలాంటి రంగంలో అడుగు పెట్టి ప్రపంచ వ్యాపార రంగంలో ఎంతోమంది దృష్టిని ఆకర్శించి 'జోయా వోరా షా' (Zoya Vora Shah) మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలోని ప్రముఖ వైన్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ముందుకెళ్తున్న 'జోయా వోరా షా' భారతదేశానికి చెందిన మహిళ కావడం గమనార్హం. నిజానికి ఈమె కొంత కాలం క్రితం మన దేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడింది. కొన్ని రోజుల తరువాత ఒక రెస్టారెంట్లో వైన్ బిజినెస్ ప్రారంభించింది. ఈ వ్యాపారం అతి తక్కువ కాలంలోనే బాగా లాభాల బాట పట్టింది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) ఒక బ్రాంచ్‌తో మొదలైన ఆమె వ్యాపారం అదే నగరంలో ఎనిమిది బ్రాంచ్‌లకు చేరింది. ప్రస్తుతం ఈమె వైన్, స్పిరిట్ విక్రయాలకు ప్రతినిధిగా మారింది. కాలక్రమంలో ఆమె స్థాపించిన వైన్ టేస్టింగ్ రూమ్ తరువాత వైన్ బార్ అండ్ బాటిల్ షాప్‌గా రూపుదిద్దుకున్నాయి. అతి తక్కువ సమయంలో ఈమె బాగా ఎదగటానికి కారణం ఈ రంగంపై ఆమెకున్న అభిరుచే. (ఇదీ చదవండి: కుటుంబంలో 12 మంది డాక్టర్లు.. 16 సంవత్సరాలకే రికార్డు.. అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి..) ప్రారంభంలో ఇలాంటి రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావంటూ ఎంతో మంది ఆమెను విమర్శించారు. కానీ ఎవరి మాటను లెక్క చేయని జోయా వోరా షా చివరికి అనుకున్న విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం ఆమె భర్త అందించిన సహకారమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె బిజినెస్ కోట్లలో టర్నోవర్ పొందుతోంది. దీన్ని బట్టి చూస్తే మహిళ అనుకోవాలే కానీ ఆమె విజయం సాధించని రంగం అంటూ ఏది ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. -
ప్రముఖ వైన్ కంపెనీ సీవోవో రాజీనామా
ప్రముఖ ప్రీమియం వైన్ తయారీ కంపెనీ సులా వైన్యార్డ్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చైతన్య రాఠీ రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. చైతన్య స్థానంలో కంపెనీ చీఫ్ వైన్ తయారీదారు కరణ్ వాసనిని నియమించనున్నారు. కరణ్ వాసని కంపెనీ నాయకత్వ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. వైన్ తయారీ, వైనరీ కార్యకలాపాలు, వైటికల్చర్తో సహా కంపెనీ కీలక కార్యకలాపాలను చూస్తారు. సులాలో చేరడానికి ముందు ఆయన ఆర్థిక సేవల సంస్థ క్రిసిల్‌లో అనలిస్ట్‌గా పని చేశారు. చైతన్య రాఠి తమ నాయకత్వ బృందంలో కీలకంగా పనిచేశారని, కంపెనీ వృద్ధికి, విజయానికి కృషి చేశారని, చాలా సంవత్సరాలుగా తనతో సన్నిహితంగా పనిచేశారని సుల వైన్యార్డ్స్ రాజీవ్ సుమంత్ పేర్కొన్నారు. కాగా చైతన్య రాఠి 2023 సెప్టెంబర్ చివరి వరకు కంపెనీలో ఉంటారు. -
ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?
మనం ఇప్పటి వరకు మునుపటి కథనాల్లో ఖరీదైన కారు గురించి, ఖరీదైన బైకు గురించి తెలుసుకున్నాం. అయితే ఈ కథనంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం (వైన్) ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం వోడ్కా అంటే చాలా మంది నమ్మక పోవచ్చు. దీని ధర రూ. 30 కోట్లు వరకు ఉంటుంది. భారతదేశంలో ఖరీదైన మద్యం అంటే సుమారు రూ. 30 నుంచి రూ. 40 వేలు వరకు ఉంటుంది. అలాంటిది 'లియోన్ వెర్రెస్ మాస్టర్‌పీస్' (Leon Verres Masterpiece) 3.7 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది. నిజానికి ఈ మద్యం బాటిల్ కొనుగోలు చేసే ధరతో కొన్ని జీవితాలు సెటిల్ అయిపోతాయి అంటే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మద్యం ఇంత ధర ఉండటానికి ప్రధాన కారణం బాటిల్ 3000 వజ్రాలతో ఉంటుంది. అంతే కాకుండా ఈ బాటిల్ ఆకర్షణీయకంగా కనిపించేందుకు వైలెట్ హ్యూడ్ హెవీ గ్లాస్‌తో ఒక ప్రత్యేకమైన పూత ఉంటుంది. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) బాటిల్ లోపల ఉండే మద్యం ధర కంటే కూడా బాటిల్ ధర ఎక్కువ కావడం గమనార్హం. ఇది ఖరీదైన ప్లాటినం, రోడియం వంటి విలువైన లోహాల కలయికతో అందంగా తాయారు చేసి దానికి గోల్డ్ లేబుల్ అందించడం జరిగింది. బాటిల్ మొత్తం ఖరీదైన వజ్రాలతో తయారై ఉంటుంది కావున ధర భారీగా ఉంటుంది. -
ఆఫీసుల్లో కూడా వైన్, బీర్ సర్వ్ చేసేలా కొత్త పాలసీ!
ఆ రాష్ట్రంలోని కార్యాలయాల్లో(ఆఫీసుల్లో) బీర్, వైన్ సర్వ్ చేసేలా అనుమితించడం కోసం ప్రత్యేక పాలసీని కూడా తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేటే కార్యాలయాల్లో వైన్, బీర్ వంటి తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డ్రింక్స్‌ని సర్వ్ చేసేలా అనుమితిస్తున్నారు. ఈ పాలసీ నిబంధన ప్రకారం కార్పోరేట్ కార్యాలయాల్లో సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ లేదా తినుబండరాలు ఉండాలి. ఈ మేరకు గురుగ్రామ్ లేదా హర్యానాలోని అక్కడ క్యాబినేట్ మంగళవారం ఈ క్తొత పాలసీ 2023-24కి ఆమోదం తెలిపింది. రిటైల్ పర్మిట్ రుసుము కింద పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం రూ. 400 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విడదల చేసిన అధికారిక ప్రకటనలో దీని గురించి తెలిపారు. హర్యానా కొత్త మద్యం పాలసీలో ముఖ్యాంశాలు కొత్త పాలసీలో దేశీయ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ ఫారిన్ లిక్కర్ బేసిక్ కోటా పెరిగింది. దీంతో దేశీయ మద్యం, IMFL పై ఎక్సైజ్ సుంకం రేట్లలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. ఈ పెంపుదలతో ఎక్సైజ్ ఆదాయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపారం చేసే సౌలభ్యం కోసం, కొత్త విధానంలో, జిల్లా స్థాయిలో IFL (BIO) లేబుల్‌లను పునరుద్ధరించింది. అలాగే సూక్ష్మ మధ్య తరహా రంగాన్ని ప్రోత్సహించడానికి చిన్న షాపులకు లైసెన్స్ ఫీజును తగ్గించింది. రాష్ట్రంలో వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు వైన్ తయారీ కేంద్రాల పర్యవేక్షక రుసుమును తగ్గించినట్లు ప్రకటనలో తెలిపారు. పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టుపక్కల నోటిఫై చేయబడిన పవిత్ర ప్రాంతాలు, గురుకులాలు ఉన్న గ్రామాలలో మద్యం దుకాణాలు తెరవకూడదని నిర్ణయించినట్లు ప్రకటన పేర్కొంది. తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలను ప్రోత్సహించడానికి, మైల్డ్, సూపర్ మైల్డ్ కేటగిరీల కింద సిద్ధంగా ఉన్న పానీయాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పబ్ కేటగిరీలో బీర్, వైన్ వినియోగానికి మాత్రమే లైసెన్స్ ఫీజు మరింతగా తగ్గించింది. (చదవండి: మరో భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సన్నాహాలు) -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్‌లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్‌ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్‌పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్‌ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్‌ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
హెల్త్ టిప్స్
♦ రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో చిన్న పటిక బెల్లం ముక్కను వేసి ఉంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పదిహేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. ♦ చిటికెడు పసుపును గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.. ♦ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ముక్కలుగా చేసిన ఒక వెల్లుల్లి రెబ్బను వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది. ♦ దగ్గు, ఆయాసంతో బాధపడేవారు స్పూన్ అల్లం రసం, స్పూను దానిమ్మరసం, స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరి ∙చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే సమస్య తొలగుతుంది, ♦ అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. -
10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు
సాక్షి, శివాజీనగర: ఐటీ సిటీలో కొత్త సంవత్సర సంబరాల్లో మద్యం ఏరులై పారింది. కొత్త వేడుకల సమయంలో గత రెండేళ్లుగా కరోనా వల్ల మద్యం వ్యాపారం పూర్తిగా తగ్గుముఖమైంది. ఈసారి కోవిడ్ బెడద అంతగా లేకపోవడంతో మద్యం షాపులు కళకళలాడాయి. క్రిస్మస్ నుంచి నెలాఖరు వరకు వ్యాపారం ఊపందుకుంది. 20 లక్షల లీటర్ల మద్యం తాగేశారు డిసెంబర్ 31న సుమారు మూడు లక్షల లీటర్ల మద్యం, 2.41 లక్షల లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. దీనిద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకూ లెక్కిస్తే 20.66 లక్షల లీటర్ల మద్యం, 15.04 లీటర్ల బీర్లను తాగారు. తద్వారా రూ.1,262 కోట్ల వ్యాపారం జరిగితే, పన్ను రూపంలో ఎక్సైజ్ శాఖ రూ.651 కోట్లు ఆర్జించింది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇదే రికార్డు ఆదాయమని ఎక్సైజ్‌వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్‌కు చర్చి స్ట్రీట్‌లో పబ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతో మామూలు కంటే 50 శాతం ధరను పెంచారు. అయినా కూడా యువతీ యువకులతో పబ్‌లు కిటకిటలాడాయి. (చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష) -
ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్‌ని నైవేద్యంగా ఎందుకు పెడతారంటే......
ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్‌ని నైవేద్యంగా పెడతారు. పైగా ఆ దేవాలయం పేరుతో వైన్‌ని విక్రయిస్తారట కూడా. ఇదేం వింత అనుకుంటున్నారా? అక్కడ వైన్‌ని తయారు చేయడం అనేది మంచి పనిగా భావిస్తారు అక్కడి ప్రజలు. వివరాల్లోకెళ్తే...జపాన్‌లో కొండపై చెట్లతో కూడిన ఒక బౌద్ధ దేవాలయం ఉంది. అక్కడ బుద్ధుడికి ప్రజలు వైన్‌ని నైవేద్యంగా పెడతారు. ద్రాక్ష పండ్ల ఉత్పత్తికి పేరుగాంచిన ఆ ప్రాంతంలోని బౌద్ధ దేవాలయాన్ని ద్రాక్ష దేవాలయంగా పిలుచుకుంటారు అక్కడి ప్రజలు. ఐతే అధికారికంగా మాత్రం ఆ దేవాలయాన్ని డైజెంజీగా వ్యవహరిస్తారు. ఈ దేవాలయం టోక్యోకి సుమారు 100 కి.మీ దూరంలో ఉన్న యమనాషి ప్రాంతంలో ఉంది. బౌద్ధ సన్యాసులు మామాలుగా బౌద్ధ దేవాలయాల వద్ద సేవ చేస్తుంటారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధం. వారు వైన్‌ని తయారు చేసి అందిస్తుంటారు. ఆ దేవాలయాని ప్రధాన సన్యాసి వైన్యార్డ్ కో ఆపరేటివ్(వైన్ తయారీ కంపెనీకి) గౌరవాధ్యక్షుడు. పురాణల ప్రకారం ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి, గ్యోకీ అనే యాత్రికుడు జపనీస్ భాషల యకుషిన్యోరైగా అని పిలిచే ఔషధ బుద్ధుడిని కలలో కలుసుకున్నాడని చెబుతారు. అతను చేతిలో ఒక ద్రాక్ష గుత్తిని పట్టుకుని ఉన్నాడని, యమనాషి నివాసితులకు ఔషధ ప్రయోజనాల కోసం వైన్‌ని ఎలా తయారు చేయాలో నేర్పించినట్లుగా కథకథలుగా చెబుతున్నారు. మరోక కథనం ప్రకారం రైతు కగేయు ద్రాక్ష సాగును అదే ప్రాంతంలో మొదటిసారిగా ప్రారంభించాడని అందువల్ల వైన్‌ని సమర్పిస్తారని కొందరు చెబుతున్నారు. అయితే ఇక్కడ పెంచే ద్రాక్షలు చైనాకు సంబంధించిన హైబ్రేడ్ ద్రాక్ష పండ్ల డీఎన్ఏతో పోలి ఉంటుంది. చైనా నుంచి ద్రాక్ష విత్తనాలను తీసుకువచ్చి ఇక్కడ ద్రాక్ష తోటలని పెంచారా? లేక ముందు నుంచి ఇక్కడ ఈ ద్రాక్ష సాగు ఉందా? అనేది ఒక సందేహాస్పదంగా ఉంది. ఈ ఆలయం వద్ద పెంచుతున్న ద్రాక్ష తోటల నుంచే వైన్‌ని తయారు చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అంతేగాదు దేవాలయం పేరు మీద ఆ వైన్‌ని విక్రయిస్తారు కూడా. అక్కడి ప్రజలు ద్రాక్ష తోటలను పండించి వైన్‌ని తయారు చేయడాన్ని చాలా మంచి పనిగా విశ్వసిస్తారు. (చదవండి: అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు) -
దారి కాచి.. దాడి చేసి..
సాక్షి, బంజరాహిల్స్: అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిపై నలుగురు ఆకతాయిలు మద్యం మత్తులో కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్ బస్తీకి చెందిన నగేష్ కొత్త చెరువు వద్ద ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నలుగురు యువకులు డబ్బులు డిమాండ్ చేస్తూ అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా ముగ్గురు నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వెళ్లిన క్షణాల్లోనే చెట్ల మాటున దాక్కున్న మిగతా ముగ్గురు మళ్లీ అక్కడికి వచ్చి మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మరోసారి బాధితుడిపై కర్రలతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు కొద్దిసేపు నిఘా ఉంచితే మళ్లీ దాడి జరిగి జరిగే ఉండేది కాదని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. (చదవండి: భార్య గొంతుకోసి హత్య) -
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారీ.. స్నేహితుడికి తాగించడంతో..
తిరువనంతపురం: మనకంటూ ఓ మొబైల్, అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్లే. ఏది కావాలన్న, ఏం తెలుసుకోవాలన్న క్షణంలో గూగుల్, యూట్యూబ్‌లో వెతికేస్తున్నారు. సాధారణంగా యూట్యూబ్ ద్వారా చాలామంది వంటలు, అల్లికలు వంటి వాటిని నేర్చుకుంటుంటారు. తాజాగా ఓ మైనర్ బాలుడు యూట్యూబ్‌లో చూసి మద్యం ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. నేర్చుకున్నట్లే ద్రాక్ష పండ్లతో మద్యాన్ని కూడా తయారు చేశాడు. అయితే అక్కడే అతనికి దెబ్బకొట్టింది. అసలేం జరిగిందంటే కేరళలోని తిరువనంతపురం చిరాయింకీజుకు చెందిన 12 ఏళ్ల బాలుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారుచేశాడు. అంతేగాక ఈ వైన్‌ను రుచి చూడాలని చెప్పి తన స్నేహితులకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకేముంది తాగిన కాసేపటికి స్నేహితుల్లోని ఓ యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకొని ఆస్పత్రిలో చేరాడు. కల్తీ మద్యం తాగిన బాలుడిని వెంటనే చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లతోనే మద్యం తయారు చేశానని బాలుడు చెప్పాడు. అందులో ఎలాంటి రసాయనాలు కలపలేదని తెలిపాడు. యూట్యూబ్‌లో చూపించిన విధంగా వైన్ తయారు చేసి దానిని ఒక సీసాలో నింపి.. కొన్ని గంటలు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు. కాగా బాలుడు తయారు తయారు చేసిన వైన్ బాటిల్‌ను పోలీసులు స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే వైన్‌లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై జువెనల్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా?
సాక్షి, సెంట్రల్ డెస్క్: ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? అంటే.. రోజూ వ్యాయామం చేయాలి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. సమయానికి నిద్ర పోవాలి.. ఇలా రకరకాలుగా చెబుతూనే ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా (118 ఏళ్లు) ఇటీవలే గిన్నిస్ రికార్డుకెక్కిన ఫ్రెంచ్ నన్ సిస్టర్ ఆండ్రే ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా? ఆమె రోజు తీసుకునే చాక్లెట్, ఓ గ్లాస్ వైన్. ఆండ్రే నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్న డేవిడ్ టవెల్లా ఇదే చెబుతున్నారు. ‘ఆండ్రూ రోజూ తీసుకునే గ్లాస్ వైన్ వల్లే తాను జీవిత కాలం పెరగడానికి కారణమేమో. నేను మాత్రం వైన్ తాగమని ఎవరికీ సలహా ఇవ్వను’ అని డేవిడ్ అంటున్నారు. గతంలో ఎక్కువ వయసున్న వ్యక్తి రికార్డు జపాన్‌కు చెందిన కేన్ టనక పేరిట ఉండేది. తాను ఈ ఏడాది ఏప్రిల్ 19న మరణించారు. దీంతో ఈ రికార్డు ఆండ్రే సొంతమైంది. కరోనా బారిన పడి కోలుకున్న పెద్ద వయస్కురాలిగా కూడా ఆండ్రే రికార్డుకెక్కారు. -
యువతికి రూ.50 వేలు బురిడీ.. వైన్ ఆర్డర్ చేసి అగచాట్లు
బనశంకరి (బెంగళూరు): ఆన్లైన్లో వైన్ ఆర్డర్ చేసిన యువతి వైన్ అందక, డబ్బులు పోయి బిక్కమొహం వేసింది. ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ కేటుగాళ్లు సుమారు రూ.50 వేలు కాజేశారు. లాల్‌బాగ్‌రోడ్డు అపార్టుమెంట్లో నివాసం ఉండే 22 ఏళ్ల యువతి సైబర్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. మార్చి 22వ తేదీన ఆమె వైన్‌ను ఇంటికి తెచ్చివ్వాలని ఒక వెబ్సైట్లో ఆర్డర్ చేసి రూ.540 చెల్లించింది. కొద్దిసేపటికి ఒక ఆగంతకుడు కాల్ చేసి వైన్ ఇవ్వడానికి వస్తున్నాను, డెలివరీ ఫీజు కింద రూ.10 చెల్లించాలని, ఇందుకు మీ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుందని, చెప్పాలని కోరాడు. ఆమె ఓటీపీ చెప్పిన వెంటనే బ్యాంకు అకౌంట్ నుంచి రూ.49,326 నగదు విత్ డ్రా అయ్యింది. పోలీసులు వంచకుల కోసం గాలిస్తున్నారు. చదవండి: (కోర్టు ఉద్యోగిని ఆత్మహత్య) -
వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్
ఇజ్రాయెల్: బైజాంటైన్ యుగంనాటి 1500 ఏళ్ల పురాతన పారిశ్రామిక వైన్ కాంప్లెక్స్‌ని ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పట్లోనే ఇది ఏటా రెండు మిలియన్ లీటర్ల వైన్‌ని ఉత్పత్తి చేసేదని అన్నారు. అంతేకాదు ఇది ప్రపంచంలోని అతి పెద్ద కేంద్రంగా ఉండేదని చెబుతున్నారు. బైబిల్ కాలంలో యూదులు స్థావరంగా ఉండే టెల్ అవీవ్‌కి దక్షిణాన ఉన్న యవ్నేలో ఈ అత్యాధునిక సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు. (ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) క్రీస్తూ శకం 70లలో జెరుసలేం నాశనమైన తరనంతరం ఒక ముఖ్య నగరంలో ఐదు వైన్ కాంప్లెక్స్‌లు ఒక చదరపు కిలో మీటరు మేర విస్తరించి ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు వైన్‌ని నిల్వచేయడానికి ఉపయోగించే బంకమట్టి ఆంఫోరాలు, వైన్ తయారు చేయడానికి వాడే బట్టీలు, మట్టి పాత్రలు తదితర సామాగ్రి చెక్కు చెదరకుండా అత్యంత అధునాతనంగా ఉన్నాయని ఇజ్రాయెల్ పురాతన వస్తువుల ప్రాధికార సంస్థ పేర్కొంది. ఈ వైన్‌ని గాజా, అష్కెలోన్ వైన్ వంటి పేర్లతో పిలిచేవారని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు అప్పట్లోనే ద్రాక్ష రసాన్ని పులియబెట్టే ప్రక్రియలు ఉండేవని అంటున్నారు. అదే ప్రదేశంలో పురావస్తు అధికారులు రెండు సంవత్సరాల పాటు జరిపిన తవ్వాకల్లో రెండు వేల ఏళ్లనాటి పర్షియన్ కాలపు వైన్లు కూడా బయటపడ్డాయని వెల్లడించారు. (చదవండి: ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?!) -
Hyderabad: పెరుగుతున్న ‘కిక్కు’.. ముందుంది అసలైన పండుగ.. తగ్గేదే లే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా వైన్‌షాపులు, బార్లు, రెస్టారెంట్లు కళకళలాడుతున్నాయి. కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో కోవిడ్ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే వినియోగించేవారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. కానీ క్రమంగా వైరస్ ఉధృతి తగ్గిపోవడం, ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. అలాగే పర్మిట్ రూమ్‌లు సైతం మందుబాబులతో నిండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ 6 నెలల్లో 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగినట్లు అంచనా. సర్కార్ ఆదాయం సైతం అదేస్థాయిలో పెరిగింది. మరోవైపు మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి, నల్గొండ మొదటి రెండు స్థానంలో నిలవగా హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. నగరంలో 18,25,276 కేసుల మద్యం అమ్ముడైంది. చదవండి: చారిత్రక వేదిక.. సరదాల వేడుక: అసదుద్దీన్‌కు కేటీఆర్ సూచన 56 శాతం పెరిగిన బీర్ల వినియోగం కోవిడ్ కాలంలో బీర్ల వినియోగం చాలా వరకు పడిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని సైతం తగ్గించాయి. శీతల పానీయాలు, బీర్లు సేవించడం వల్ల కోవిడ్ సోకే అవకాశం ఉండవచ్చునన్న వార్తలతో బీర్బలులు బాటిల్ పక్కన పెట్టేశారు. కానీ సెప్టెంబర్ నుంచి బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే 56 శాతం వరకు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. 7,016,500 కేసుల విక్రయాలు జరిగాయి. బీర్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఒక్కో బాటిల్ పైన రూ.10 వరకు తగ్గించారు. ధరల తగ్గింపు కంటే కోవిడ్ భయం తొలగిపోవడం వల్లనే వినియోగం పెరిగినట్లు ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆదాయంలోనూ మూడో స్థానం... ►ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.14,320 కోట్ల అమ్మం అమ్మకాలు జరిగాయి. ►రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క జిల్లా నుంచే రూ.3.247 కోట్ల ఆదాయం లభించింది. ►రెండో స్థానంలో ఉన్న నల్గొండ జిల్లాలో మద్యం అమ్మకాలపైన రూ.1,599 కోట్ల ఆదాయం లభించింది. ►ఆ తరువాత మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ మద్యం ఆదాయం రూ.1510 కోట్లు ►దసరా అమ్మకాలతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ‘చదువు ఇష్టం లేదు.. ఆటలే ఇష్టం..ప్లీజ్ మాకోసం వెతకొద్దు’ -
Huzurabad Bypoll: కోడికూర ఉండాల్సిందే..!
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏమో కానీ.. టౌన్లో మాంసం, మందుకు ఒక్కసారిగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఏ నలుగురు కలిసినా అక్కడ వినిపించే మాటలు ఇవే. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఉప ఎన్నికలో రెండో ఘట్టమైన ప్రచారం పర్వం మొదలైంది. పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందుకోసం పక్క నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలను హుజూరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో పాల్గొన్న వారికి మర్యాదలు కూడా బాగానే చేస్తున్నారు. హోటళ్లు కిటకిట..! కీలకమైన ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు ఇక్కడ కొన్ని వార్డులు, కాలనీలు అప్పగించారు. వారి ఆతిథ్యం మొదలుకుని ప్రచారంలో తాగునీరు, వాహనానికి అయ్యే పెట్రోలు దాకా అన్నీ పార్టీల నాయకులే చూసుకుంటున్నారు. ఇక పగలంతా ప్రచారం చేసి ఏ రాత్రికో వీరు తమకు కేటాయించిన గదుల్లోకి చేరుతున్నా రు. అక్కడ అసలైన మర్యాదలు మొదలవుతున్నా యి. దాదాపు రెండు నెలలుగా ఇక్కడ ప్రముఖ హోటళ్లు, లాడ్జి గదులన్నీ హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాయి. కరోనా దెబ్బకు అన్ని పట్టణాల్లో టు లెట్ బోర్డులు దర్శనమిస్తుంటే.. బయటి నుంచి వచ్చిన వారితో హుజూరాబాద్‌లోని అద్దె ఇళ్లు, హోటళ్లు కిటకిటలాడిపోతున్నాయి. కోడికూర ఉండాల్సిందే..! హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ మద్యం, మాంసం విక్రయాలు పెరిగాయి. సాధారణంగా హుజూరాబాద్ పట్టణంలో రోజుకు 6 క్వింటాళ్ల చికెన్‌ను వ్యాపారులు విక్రయించేవారు. కానీ.. షెడ్యూలు ప్రకటించాక చికెన్‌కు డిమాండ్ అమాంతం పెరిగింది. ప్రతీరోజూ కార్యకర్తలకు మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం మెనూలో చికెన్ కూర తప్పనిసరి. దీంతో చికెన్ డిమాండ్ ఇప్పుడు రోజుకు 10 క్వింటాళ్లకు చేరిందని వ్యాపారులు వెల్లడించారు. ప్రస్తుతం కిలో రూ.240 పలుకుతోంది. ఈ లెక్కన క్వింటాలుకు రూ.24,000, పది క్వింటాళ్లకు రూ.2,40,000 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. స్థానికంగా బిర్యానీ, కోడికూరలకు ప్రసిద్ధి చెందిన హోటళ్లు, రెస్టారెంట్లలోనూ చికెన్‌కు డిమాండ్ పెరిగింది. వ్యాక్సిన్ కోసం పరుగులు.. కేంద్ర ఎన్నికల సంఘం రెండో డోస్ తప్పనిసరి చేయడంతో కార్యకర్తల్లో చాలామంది టీకా కోసం పరుగులు తీస్తున్నారు. ప్రచారం చేసేవాళ్లు కూడా రెండు డోసులు వేసుకోవాలి. దీంతో పెద్ద నాయకుల సాయం తీసుకుని మరీ టీకా తీసుకుంటు న్నారు. ప్రచార పర్వం ఆసాంతం కీలకంగా వ్యవహరించే కొందరు నాయకులు, అనుచరులకు వెంటనే రెండో డోసులను బడా నాయకులు దగ్గరుండి వేయిస్తున్నారు. డోసుకు డోసుకు మధ్య తక్కువ వ్యవధి ఉంటుందని అంతా కోవీషీల్డ్ వ్యాక్సిన్ కోసం పరుగులు తీస్తుండటం విశేషం. ధర రూ.1,200 దాటినా సరే వెనకాడడం లేదు. చదవండి: (Huzurabad Bypoll: సింబల్ హడల్!) రాత్రికి విందు తప్పనిసరి ఉప ఎన్నిక పుణ్యమాని అన్ని పార్టీలకు చెందిన నాయకులంతా ఇక్కడే తిష్టవేశారు. వీరిలో జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ఉన్నారు. వీరిలో చాలామంది రాత్రిపూట మందు పార్టీలకు హాజరవుతున్నారు. కొందరికి నేరుగా గదులకే బాటిళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ అక్టోబరు 1 నుంచి 9 వరకు రూ.6.17 కోట్ల విలువైన మద్యాన్ని నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో విక్రయించారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జమ్మికుంటలో రూ.2.63 కోట్లు, హుజూరాబాద్‌లో రూ.3.54 కోట్ల మద్యం విక్రయించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ స్థాయిలో వ్యాపారం చేయడం స్థానికంగా మద్యానికి పెరిగిన డిమాండ్‌కు నిదర్శనమని లిక్కర్ వ్యాపారులు తెలిపారు. జోరుగా ట్రావెల్స్ బుకింగ్స్ కరోనా కారణంగా బాగా నష్టాల్లో ఉన్న స్థానిక ట్రావెల్స్ యజమానులు ఉప ఎన్నిక పుణ్యమాని బిజీ అయిపోయారు. ఒక్కో కారును రూ.25,000 నుంచి రూ.35,000 వరకు లీజుకు తీసుకుంటున్నారు. హుజూరాబాద్ వచ్చిన నాయకులను ప్రచారానికి తిప్పడమే వీరు చేయాల్సిన ఏకైక పని. పలు పార్టీల నాయకులు, అభ్యర్థులు ఇక్కడ వాహనాలను ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు బుక్ చేసుకోవడంతో వీరంతా చేతి నిండా పనితో రేయింబవళ్లు కష్టపడుతున్నారు. -
వైరల్: జాలరికి జాక్‌పాట్.. చేప కడుపలో కిక్కెంచే బహుమతి
అనకోకుండా దొరికే వస్తువులు మనకీ భలే అనందాన్నిస్తాయి. ఇటీవల సముద్రంలో చేపల వేట కోసం వెళ్లే జాలర్లకు ఇలానే అరుదైన వస్తువులు దొరికిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. వారి దినచర్యలో ప్రతిరోజూ ఒకేలా ఉండవు ఒక్కోసారి రోజంతా వేట కొనసాగించిన చేపలతో కాకుండా నిరాశతో వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అలానే ఇంకో రోజు అనూహ్యంగా అనుకోని రూపంలో చేపలతో పాటు బహుమతులు లభిస్తుంటాయ్. ఈ తరహాలోనే ఓ మత్స్యకారుడు జాక్ పాట్ కొట్టేశాడు. వేట కోసమని వెళ్లిన అతనికి చేప మాత్రమే కాకుండా మరో అనుకోని బహుమతి లభించింది. ఇంకేముంది ఈ ఘటన కాస్త వీడియోగా మారి అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా రచ్చ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ జాలరికి అనుకున్నట్లే భారీ ఆకారంలో చేపలు వలలో పడ్డాయి. ఇంక మన వాడు ఆనందంతో ఎప్పటిలానే చేపలను కటే చేస్తూ, శుభ్రపరుస్తుండగా ఓ చేప కడుపు లోపలి భాగాల్లో ఏదో వస్తువు గట్టిగా తగులుతుండడం గుర్తించాడు. ఇక ఆలస్యం చేయక కత్తితో కోసి చూడగా అందులో మద్యం సీసా ఫుల్ బాటిల్ ఉంది. ఇంకేముంది అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కాగా ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మనుషుల బాధ్యతా రహితమైన ప్రవర్తనకు ఈ సంఘటన నిదర్శమని కొందరు కామెంట్ చేయగా.. మనం చేసే పనులు జంతుజలాలకు ఏ విధంగా ముప్పును కలిగిస్తుందో ఇది స్పష్టంగా చూపిస్తోందని మరి కొందరు జంతు ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. మరికొందరు ‘జాక్‌పాట్ కొట్టావ్.. క్యాచ్ ఆఫ్ ది డే’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. చదవండి: లవ్‌బర్డ్ .... నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది ..! -
ఆన్లైన్లో వైన్ ఆర్డర్ చేస్తే రూ 1.6 లక్షలు గల్లంతు..!
బెంగళూరు: 25 ఏళ్ల బెంగళూరు మహిళ గూగుల్‌లో సెర్చి చేసి వైన్ బాటిల్ కోసం ఆర్డర్ చేస్తే వైన్ రాకపోగా ఆమె ఖాతా నుంచి రూ.1.6 లక్షలను సైబర్ క్రిమినల్స్ కాజేశారు. ఈ సంఘటన జరిగిన మరుసటి వారం ఆమె పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత వెలుగులోకి వచ్చింది. వైట్‌ఫీల్డ్‌లో నివసిస్తున్న ఆంచల్ ఖండేల్వాల్ అనే మహిళ మార్చి 24న ఆన్లైన్లో వైన్‌ను విక్రయించి హోం డెలివరీ చేసే వారి కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా ఆమెకు రణవీర్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ నంబర్‌ను కనబడింది. తనకు ఫోన్ చేసిన తర్వాత రణ్వీర్ సింగ్ మీరు కోరుకున్న వైన్ తన వద్ద ఉందని దానిని సరఫరా చేస్తానని ఫోన్లో నమ్మించాడు. ఆన్లైన్లో అడ్వాన్స్ చెల్లిస్తే నేరుగా ఆమె ఫ్లాట్‌కి వైన్ బాటిల్‌ను డెలివరీ చేస్తామని తను పేర్కొన్నాడు. తర్వాత వారు పంపిన క్యూఆర్ స్కాన్ కోడ్‌ను ఉపయోగించి ఆమె చెల్లింపులు చేసింది. అయితే, నిందితుడు రణవీర్ తనకు ఎటువంటి నగదు రాలేదని ఆమెను ఒప్పించి మరికొన్ని లావాదేవీలు చేసేలా చేశాడు. అలా మొత్తం ఐదు లావాదేవీలు చేయడంతో ఆమె రూ.1,59,595ను కోల్పోయింది. ఒక వారం తరువాత ఆంచల్ వైన్ పంపిణీ చేయకపోగా మోసం చేశాడని గ్రహించి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణం జరిగిన వెంటనే మహిళ 100 డయల్ చేసి పిర్యాదు చేసి ఉంటే నిందితుల బ్యాంక్ ఖాతాను నిలిపివేసేవారమని ఆమె ఫిర్యాదు చేయడంలో తీవ్ర జాప్యం చేశారని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: పేద వర్గాల కోసం పీఎన్బీ సరికొత్త హోమ్ లోన్ స్కీమ్ -
విషాదం: ఆన్లైన్లో విషసర్పాన్ని ఆర్డరిస్తే!
బీజింగ్ : ఎవరైనా పాము పేరు చెబితనే వామ్మో అంటూ పరుగులు తీస్తారు. కానీ చైనాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాము వైన్‌ను తయారు చేసుకుని సేవిస్తారు. ఈ క్రమంలో ఓ యువతి ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్లో అత్యంత విషపూరిత పామును బుక్ చేసుకుని.. ఆపై అదే పాముకాటుకు గురై దుర్మరణం చెందింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చైనాలోని షాంగ్జీ ఏరియాకు చెందిన 21 ఏళ్ల యువతికి స్నేక్ వైన్ తాగాలనిపించింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. చైనాలో కొన్ని ప్రాంతాల్లో పలురకాలుగా స్నేక్ వైన్‌ను తయారుచేసుకుని ఇష్టంగా తాగుతారు. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఆ యువతి ఈ కామర్స్ వెబ్సైట్ ఝువాన్ఝువాన్లో ఓ విష సర్పాన్ని ఆర్డరిచ్చింది. తన ఇంటికి వచ్చిన పామును వైన్ ఉన్న పాత్రలో వేసింది. అయితే ఆ పాము ఎలాగోలా తప్పించుకుని పాత్రనుంచి బయటకొచ్చింది. ఆపై విష సర్పం కాటువేయడంతో యువతిని మృతిచెందినట్లు ఆమె తల్లి తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఇంటి సమీపంలోనే పామును పట్టుకుని తీసుకెళ్లారు. కాగా, ఈ కామర్స్ వెబ్సైట్లు మాధ్యమంగా విష సర్పాలు, క్రూర జంతువులను విక్రయించడం నేరమని పోలీసులు పేర్కొన్నారు. కానీ కొన్ని చిన్న ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అధిక సంపాదన కోసం ఇంకా ఇలాంటి జంతువులను విక్రయిస్తున్నారని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. -
రోజుకు రెండు గ్లాసుల వైన్ తీసుకున్నా..
లండన్ : రోజుకు కేవలం రెండు గ్లాసుల వైన్ తీసుకున్నా గాఢ నిద్రను 40 శాతం వరకూ దెబ్బతీస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఆల్కహాల్‌ను అధిక మోతాదులో సేవిస్తే ప్రజల కునుకు తీసే సామర్థ్యం ఆ మేరకు తగ్గిపోతుందని స్పష్టం చేసింది. వృద్ధుల కంటే యువతలోనే మద్యం ప్రతికూల ప్రభావాలు అధికంగా కనిపించాయని అథ్యయనంలో వెల్లడైంది. యువత, చురుకైన వారిలోనూ వారి నిద్ర నాణ్యతపై మద్యం ప్రభావం స్పష్టంగా నెలకొందని అథ్యయన సహ రచయిత, టాంపెర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ టెరో మెలిమకి చెప్పారు. యువత మద్యం తీసుకోవడాన్ని నియంత్రించుకోవడం మేలని సూచించారు. సుఖనిద్రతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్యానికి మద్యానికి దూరంగా ఉండటం మంచిదని చెప్పారు. చిన్నపాటి జీవనశైలి మార్పులతోనూ మెరుగైన నిద్రను పొందవచ్చన్నారు. మరోవైపు రోజుకు ఎనిమిది గంటల కన్నా తక్కువ నిద్రకు కుంగుబాటు, ఉద్వేగాలకు సంబంధం ఉందని ఈ ఏడాది జనవరిలో ఓ అథ్యయనం వెల్లడించింది. -
రాష్ట్రంలో వైనరీ కోసం కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వైన్ కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల్లో వైన్‌కు డిమాండ్ పెరుగుతుండటం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ద్రాక్ష తోటల పెంపకానికి అనుకూల వాతావరణం ఉండటం తదితర అనుకూలతల దృష్ట్యా టీఎస్‌బీసీఎల్ వైన్ షాపుల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది. కొత్తగా మద్యానికి అలవాటు పడుతున్న యువతలో 70% మంది వైన్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నెలకు 50 వేల కేసుల వైన్ లాగేస్తున్నారు. మన దగ్గర చెప్పుకోదగిన స్థాయి వైనరీ లేకపోవటంతో వైన్ కోసం బయటి రాష్ట్రాల మీదనే ఆధారపడాల్సి వస్తోం ది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి రోజుకు వైన్ దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందులో 70% మార్కెట్‌ను ఓ జాతీయ స్థాయి వైన్ కంపెనీ ఆక్రమించింది. తాజాగా టీఎస్‌బీసీఎల్ చైర్మన్ ఇదే కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ కంపెనీ ఆధ్వర్యంలో పెంచుతున్న ద్రాక్ష తోటలను సందర్శించారు. వైనరీ ప్లాంటు తో ఎంత మంది యువతకు ఉపాధి లభిస్తోంది ..మార్కెటింగ్ తీరు ఎలా ఉంది వంటి అంశాలను అధ్యయనం చేశారు. తెలంగాణలో రోజు కు 30 వేల కేసు లు, ఏపీలో రోజుకు 20 వేల కేసుల చొప్పు న వైన్‌ను తాగుతున్నారని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. రైతులకు, యువతకు మేలు కలిగేలా.. ఒకప్పుడు హైదరాబాద్ ద్రాక్ష తోటలకు నిలయం. నగరం చుట్టూ ద్రాక్ష తోటలే విస్తరించి ఉండేవి. నగర ఆధునీకరణ, రైతాంగం పత్తి ప ట్ల ఆసక్తి చూపడం వంటి కారణాలతో ద్రాక్ష సాగు కనుమరుగైపోయింది. వైన్ పరిశ్రమ ఏర్పాటుతో నగరం చుట్టూ ఉన్న మేడ్చల్, యాదాద్రి, శంషాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలకు చెందిన రైతాంగాన్ని పత్తి సాగు నుంచి ద్రాక్ష తోటల పెంపకం వైపు మళ్లించవచ్చు. యువతకు కూడా ఉపాధి కల్పించవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో వైన్‌కు డిమాండ్ పెరుగుతోంది యువత ఎక్కువగా వైన్ పట్ల ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో వైన్ పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంది. ఓ జాతీయ స్థాయి వైన్ కంపెనీలో వైన్ తయారీ, ద్రాక్ష తోటల పెంపకం, మార్కెటింగ్ విధానం అధ్యయనం చేశాను. – దేవీప్రసాద్, టీఎస్‌బీసీఎల్ చైర్మన్ -
వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..?
లండన్: మందుబాబులు..మీరు వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..? అయితే ఇక మీ జీవితంలో రెండు ఏళ్ల ఆయుషు తగ్గిపోయినట్లేనని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సీటీ పరిశోధకులు. ఇటీవలే వారు మద్యంపై వైద్య పరంగా ఓ విస్తృతమైన పరిశోధన చేశారు. వారి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తి వారానికి పది లేదా అంత కంటే ఎక్కువ గ్లాసుల వైన్‌ను సేవిస్తే రెండేళ్ల ఆయుషు తగ్గుతుందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధన కోసం19 దేశాలకు చెందిన దాదాపు ఆరు లక్షల మందిని పరిశీలించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 40 ఏళ్ల ఓ వ్యక్తి వారానికి 5 పెగ్గుల మద్యాన్ని సేవిస్తే తన జీవిత కాలంలో ఆరు నెలలు నష్టపోతాడని, 10 గ్లాసుల వైన్ తాగితే రెండేళ్లు, 18 గ్లాసులు తాగితే ఐదేళ్ల ఆయుషును కోల్పోతారని యూనివర్సీటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సీటీ శాస్త్రవేత్త డాక్టర్ ఎంజెలా వుడ్ మాట్లాడుతూ..ఇప్పటికే మద్యం సేవించేవారు తాగడం తగ్గించాలని లేదంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మితిమీరిన మద్యం తాగడం వల్ల లివర్ క్యాన్సర్, రక్త పోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి మద్యం సేవించడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. -
మందు కోసం ఓ యువకుడి దుశ్యర్య..
సాక్షి, అన్నానగర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు బంధువుల ఇంటికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన చెన్నైలోని కుమారపురం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మంటలు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తక్కలై సమీపం కుమారపురం, శాంతమ్మ(70) భర్త మృతిచెందడంతో తక్కలై సమీపం కుమారపురం ఒంటరిగా నివశిస్తోంది. ఈమె బంధువుల కుమారుడు రఘు(33) . అతను కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను శాంతమ్మ ఇంటి సమీపంలో నివసిస్తున్నాడు. రఘుకి మద్యం సేవించే అలవాటు ఉంది. తరచూ శాంతమ్మ దగ్గర మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. ఎప్పటిలాగే మంగళవారం రఘు మద్యం సేవించడానికి నగదు అడిగాడు. ఇందుకు శాంతమ్మ అంగీకరించలేదు. ఆవేశంతో రఘు శాంతమ్మ ఇంటికి మంటలు అంటించి పరారయ్యాడు. గమినించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. అంతలోనే ఇంటి పైకప్పు మొత్తం కాలి బూడిదైంది. కొట్రికాడు పోలీసులు కేసు నమోదు చేసి రఘుని అరెస్టు చేశారు. -
వైన్‌తో కుంగుబాటు దూరం
లండన్ : పరిమిత మోతాదులో వైన్ తీసుకుంటే కుంగుబాటు దూరమవుతుందని తాజా అథ్యయనంలో వెల్లడైంది. ద్రాక్షలో ఉండే పదార్ధాలు కుంగుబాటుకు గురైన ఎలుకల్లో ప్రశాంతతను చేకూర్చినట్టు ఈ అథ్యయనంలో గుర్తించారు. వైన్‌లో వాడే ద్రాక్ష రసంలో ఉండే కొన్ని పదార్థాలు కణాల వాపును తగ్గించడంతో పాటు మెదడులో ట్రాన్స్మిషన్ సిగ్నల్స్‌ను మెరుగుపరుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం డిప్రెషన్‌కు అందిస్తున్న చికిత్సలు కేవలం 50 శాతం కేసుల్లోనే తాత్కాలిక రిలీఫ్ ఇస్తున్నాయని తేలిన క్రమంలో తాజా అథ్యయనంలో వెల్లడైన ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని వారంటున్నారు. నేచర్ కమ్యూనికేషన్స్‌లో జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురించారు. కాగా డిప్రెషన్ చికిత్సలో మరింత మెరుగైన థెరఫీలు అవసరమని ఈ పరిశోధన చేపట్టిన న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్ రీసెర్చర్లు పేర్కొన్నారు. -
ప్రజల ఘోష పట్టని.. ప్రజాప్రతినిధి!
ఈ చిత్రం చూసి పాన్‌షాప్ అనుకుంటే పొరపాటే! మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోని తిర్లంగి గ్రామంలోని బెల్ట్‌షాప్ అది. లైసెన్స్డ్ మద్యం దుకాణం మాదిరిగానే ఇనుపరేకులతో పక్కాగా పర్మిట్రూమ్నూ ఏర్పాటు చేసుకున్నారు. విచ్చలవిడిగా మద్యం అనధికార విక్రయాలతో మందుబాబుల వీరంగం ఎక్కువైంది. ఇక సంక్రాంతి, కనుమ పండుగలకు మరింత పేట్రేగిపేతే గ్రామంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందనే ఆందోళనతో తిర్లంగి గ్రామస్తులు ఇటీవల నేరుగా రాజధానిలోని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు! మరేమైంది? సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ఫిర్యాదుతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందించింది! జిల్లా సిబ్బందిని దాడులకు పంపించింది! బెల్ట్‌షాపును సీజ్ చేశారు. నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో చర్యలు ఆగిపోయాయి! మరి ఆ మద్యం సరఫరా చేసిన వ్యాపారికి చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానా వేశారా? అతని దుకాణం లైసెన్స్ రద్దుకు సిఫారసు చేశారా? అని ప్రశ్నిస్తే... అక్కడి పరిస్థితి చూస్తే అలాంటి పరిస్థితి ఉత్పన్నంగాకుండా కేసును తేల్చేశారని విశ్వసనీయ సమాచారం. దీనివెనుక మంత్రి మంత్రాంగం పనిచేసిందని తెలిసింది. ఒకవైపు బెల్ట్ దుకాణాలు కనిపిస్తే తాటతీస్తా అని ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలు సొంత పార్టీ నాయకుల అనుచరులకు వర్తించవా? అని ప్రజలు విస్తుపోతున్నారు. డైరెక్టరేట్ నుంచే మళ్లీ ఆదేశాలు! తిర్లంగి ప్రజల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి జిల్లా ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. తిర్లంగిలోని బెల్ట్‌షాపులో మద్యం విక్రయాలు జరుగుతుండటంతో దాన్ని సీజ్ చేశారు. నిర్వాహకుడినీ అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆ బెల్ట్‌షాప్‌కు మద్యం సరఫరా చేసిన లైసెన్స్డ్ మద్యం వ్యాపారిపైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. సంబంధిత దుకాణం సీజ్ చేయాలి. రూ.లక్ష వరకూ జరిమానా విధించాలి. అది చెల్లించిన తర్వాతే మళ్లీ ఆ వ్యాపారి మద్యం విక్రయానికి అనుమతి ఉంటుంది. కానీ తిర్లంగిలో బెల్ట్‌షాప్‌కు టెక్కలిలో ఏ దుకాణం నుంచి మద్యం వచ్చిందో, దాని యజమాని ఎవ్వరో నిర్వాహకుడికి తెలుసు కదా? కానీ ఆ వ్యాపారిపై ఈగ కూడా వాలలేదు! సరికదా... తనను ఏమీ చేయలేకపోయారని తమకే సవాలు విసిరాడని తిర్లంగి గ్రామస్థులు వాపోతున్నారు. అతనికి మంత్రి మద్దతు ఉండటం వల్లే కొందరు మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారని విమర్శిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఎక్సైజ్ సిబ్బంది దాడుల గురించి తెలిసిన వెంటనే మంత్రి నేరుగా రాజధానిలోని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతోనే మాట్లాడి ఇక్కడి సిబ్బందిపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీంతో కేవలం బెల్ట్‌షాపు నిర్వాహకుడిపై కేసుతోనే చర్యలు సరిపెట్టేశారని తిర్లంగి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులతో అడ్డుకట్ట పడట్లేదని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండట్లేదని విమర్శిస్తున్నారు. బెల్ట్‌షాపుల నిర్వాహకుల తాటతీస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలు కూడా క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకుల ముందు పనిచేయట్లేదని ఆరోపిస్తున్నారు. టెక్కలి అడ్డాగా అక్రమ మద్యం... బెల్ట్‌షాపులకే కాదు కల్తీ మద్యం, దుకాణాల వద్దే అక్రమంగా లూజు అమ్మకాలు, ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు టెక్కలి నియోజకవర్గం అడ్డాగా మారిందనడానికి గతంలో అనేక ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక టెక్కలిలోనే గాకుండా జిల్లాఅంతటా చక్రం తిప్పుతున్న మద్యం సిండికేట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తి అధికార పార్టీలో కీలక నాయకుడికి కుడిభుజంగా పనిచేస్తున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి. పండుగకు ‘మందు’ జాగ్రత్త... జిల్లాలో 238 మద్యం దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి. వాటికి ఎచ్చెర్లలోని ఏపీ బ్రూవరీస్ గోదాం నుంచి రోజుకు సగటున రూ.4 కోట్ల విలువలైన మద్యం సరఫరా అవుతోంది. కానీ సంక్రాంతి, కనుమ పండుగల దృష్ట్యా ఈనెల 12వ తేదీన ఏకంగా రూ.6.65 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. మరో విషయమేమిటంటే 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ అంటే ఐదు రోజుల వ్యవధిలో దాదాపు రూ.23.41 కోట్ల మేర మద్యం దుకాణాలకు వెళ్లిందంటే ఈ పండుగకు ఎంతమేర మద్యం ఏరులై ప్రవహిస్తుందో ఊహించవచ్చు. -
వైన్ అ‘ధర’హో!
చూడండి.. ఈ బాటిల్ వైపే చూడండి.. అంతేకానీ తాగాలనుకున్నారో మీ పని ఖతమే.. అయినా ఫర్వాలేదు.. ఎంత ఖర్చయినా సరే తాగేస్తాం అనుకుంటున్నారా.. అయితే మీ ఇష్టం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ అట! ఒక్క బాటిల్ వైన్ ధర ఎంతో తెలుసా రూ.20 లక్షలు మాత్రమే. దీని పేరు ఆరమ్రెడ్ గోల్డ్. అంత ఖరీదైన దీని ప్రత్యేకతలేంటంటే.. దీన్ని టెంప్రానిల్లో అనే రకం ద్రాక్ష పళ్ల నుంచి తయారు చేశారు. దీన్ని కేన్సర్, ఎయిడ్స్, స్లీ్కరోసిస్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఓజోన్ థెరపీలో వినియోగిస్తారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతారు. -
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
రాయదుర్గం: వినాయక నిమజ్జనంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలోని 9 మద్యం షాపులను ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి సీజ్ చేశారు. అయితే అవేమీ పట్టనట్లు కొంతమంది లైసెన్స్‌దారులు తమ వ్యక్తులతో పాత బస్డాండు, కేబీ ప్యాలేస్ రోడ్డు, బళ్లారి రోడ్డులో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపట్టారు. అయినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారని ప్రజలే ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకునేలోగా అమ్మే వ్యక్తులు బాటిళ్లు వదిలి పరారయ్యారు. ఎక్సైజ్ సీఐ సోమశేఖర్‌ను వివరణ కోరగా పాతబస్టాండు వద్ద 20 హెచ్డీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాటిళ్లపై ఉన్న బ్యాచ్ నంబర్ 205 ఎల్8, 14.08.2017 ఆధారంగా ఏ షాపు వారిదో గుర్తించి, చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆత్మకూరులో స్కూల్‌డ్రింక్స్
మద్యానికి బానిసైన విద్యార్థులు తరగతి గదిలోనే మత్తులో జోగుతున్న వైనం క్రికెట్ బెట్టింగ్, మట్కా ద్వారా మద్యానికి డబ్బు సర్దుబాటు చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఏకంగా స్కూల్లోకి హాట్ డ్రింక్స్ తెచ్చుకుంటున్నారు. తరగతి గదిలోనే పూటుగా మద్యం తాగేసి మత్తులో జోగుతున్నారు. రెండు గ్రూపులుగా ఏర్పడి భౌతికదాడులు చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు మందలించినా వారిలో మార్పు రావడం లేదు. ఆత్మకూరు: మండల కేంద్రం ఆత్మకూరులోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కొందరు పదో తరగతి విద్యార్థులు హద్దులు మీరారు. చదువులు పక్కనపెట్టి జూదాలకు బానిసలుగా మారారు. క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ వేస్తూ, మట్కా ఆడుతూ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. మద్యం కొనుగోలుకు అవసరమైన డబ్బును జూదాల ద్వారా సమకూర్చుకుంటున్నారు. మద్యం మత్తులో.. ఆత్మకూరులో పది రోజులుగా మద్యం దుకాణాన్ని సీజ్ చేయడంతో విద్యార్థులకు మందు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో సోమవారం ఉదయం కూడేరుకు వెళ్లి మద్యం కొనుగోలు చేసుకుని వచ్చిన వారు.. పాఠశాల సమయంలోనే ఫుల్‌గా తాగారు. తరగతి గదిలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు దండించారు. వారి తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా వారిలో మార్పు మాత్రం కనిపించలేదు. పెడదోవ పడుతున్న విద్యార్థులకు టీసీలు ఇచ్చి బయటకు పంపించాలనే యోచనలో ఉపాధ్యాయులు ఉన్నారు. బయటి వ్యక్తుల ప్రమేయంతోనే.. విద్యార్థులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయులతో మంగళవారం ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంఈఓ నరసింహారెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కందుల ఓబుళపతి సమావేశమై చర్చించారు. విద్యార్థులు తప్పుదోవలో నడవడానికి దారితీసిన కారణాలపై సమీక్షించారు. పాఠశాల బయట ఉన్న కొందరు జులాయిలతో స్నేహమే ఇందుకు కారణంగా తేల్చారు. దీనిపై కల్పించుకుంటే తమపై దాడులకు సైతం తెగబడేందుకు వారు వెనుకాడడం లేదంటూ ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వాపోయారు. పోలీసుల చర్యలతోనే ఈ సమస్యకు పరిష్కారం దక్కుతుందని, ఆ దిశగా పోలీసుల సాయం తీసుకోవాలని తీర్మానించారు. -
నిబంధనలు బేఖాతరు
వివాదాల నడుమ వైన్ షాపుల లైసెన్సులు కొన్ని చోట్ల గుడి, బడి సమీపంలోనే షాపులు తెలుగు తమ్ముళ్లకు వర్తించని నిబంధనలు రాజమహేంద్రవరం క్రైం : వివాదాల నడుమ బ్రాందీ షాపులకు లైసెన్సుల మంజూరు జరిగింది. బ్రాందీ షాపులకు జూన్ 30తో గడువు ముగిసి జూలై 1 నుంచి కొత్తగా లైసెన్స్‌లు తీసుకున్న వారు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఈ నెల నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 534 బ్రాందీషాపులకు, 42 బార్లు, స్టార్ హోటళ్లకు లైసెన్సులు మంజూరు చేశారు. ఆదివారానికి జిల్లాలో 175 బ్రాందీ షాపుల యజమానులు, 3 బార్లకు లైసెన్సులు తీసుకున్నారు. ఇంకా బ్రాందీ షాపులు లైసెన్సులు తీసుకోవాల్సి ఉన్నాయి. తీసుకున్న కొన్ని షాపులతో పాటు, పాత బ్రాందీషాపులకు కొన్ని వివాదాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా గుడి, బడి, హాస్పటల్స్ చూడకుండా ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు ఇవ్వడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ నిబంధనల ప్రకారం బ్రాందీ షాపులకు లైసెన్సులు మంజూరు చేయాలంటే దేవాలయాలు, పాఠశాలలు, హాస్పటల్స్, జాతీయ నాయకుల విగ్రహాలకు 100 మీటర్ల దూరంలో ఇవ్వాలి. దీనితో పాటు స్థానికుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. యజమానులు స్థానికుల అనుమతులు తీసుకోకుండానే షాపులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికుల సంతకాలు ఫోర్జరీ చేసి వారి అనుమతి ఉందని ఎక్సైజ్ అధికారులను నమ్మిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే బ్రాందీషాపులకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన తరువాత స్దానికులు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా షాపులు తొలగించడం లేదు. చేసేది లేక బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. రామమందిరం సమీపంలో బ్రాందీ షాపు కొత్తగా ఇచ్చిన బ్రాందీషాపుల లైసెన్సులలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. రాజమహేంద్రవరం, ఆనాల వెంకట అప్పారావు రోడ్డులో కోదండరామ దేవాలయం సమీపంలో దేవసాయి వైన్స్‌కు అనుమతి ఇచ్చారు. ఈ షాపులు ఏర్పాటు చేయడానికి స్థానిక కోదండరామ దేవాలయం కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. అయినా షాపు యథాతథంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. గతంలో జాంపేట మార్కెట్ వద్ద ఉన్న పీఎస్ వైన్స్ ఏర్పాటులో స్థానిక ముస్లిం కుటుంబాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా స్థానికుల అభ్యంతరాలు పక్కన పెట్టి మళ్లీ ఎక్సైజ్ అధికారులు లైసెన్సును మంజూరు చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బ్రాందీషాపును తరలించాలని పోరాటం చేస్తుంటే ఏటా షాపునకు లైసెన్సులు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. దానవాయిపేటలోని చిన గాంధీ బొమ్మ వద్ద ఎస్వీఎస్ వైన్స్ ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహం ఎదురుగా బ్రాందీషాపు ఏర్పాటుపై అభ్యతరం వ్యక్తం చేసినా ఎక్సైజ్ అధికారులు తిరిగి మళ్లీ లైసెన్సులు ఇచ్చి నిబంధనలు తుంగలో తొక్కారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇచ్చిన లైసెన్సులపై వివాదాలు వ్యక్తమవుతున్నాయి. -
వైన్‌షాపు ఏర్పాటుపై మహిళల ఆందోళన
- పేరుసోములలో ధర్నా - మరోచోట ఏర్పాటు చేసుకోవాలని సూచన సంజామల: పేరుసోముల గ్రామంలో వైన్‌షాపు ఏర్పాటు నిరసిస్తూ మహిళలు సోమవారం ఐక్యంగా ఆందోళన చేపట్టారు. బస్టాండ్ సమీపంలో వైన్‌షాపు ఏర్పాటుకు నిబంధనలు అడ్డురావడంతో గ్రామంలో పెట్టేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు మహిళలు ఒప్పుకోలేదు. ఊరిబయట ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదని, గ్రామంలో ఏర్పాటు చేస్తే మందుబాబులతో ఇబ్బంది అవుతుందని తెలిపారు. మరెక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని తేల్చిచెప్పారు. -
హైవేలపై వైన్ దుకాణాలకు నో
ఏప్రిల్ నుంచి లైసెన్స్‌లను పునరుద్ధరించం కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటన 28వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నుంచి జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను అనుమతించేది లేదని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రకటించారు. 28వ రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో గురువారం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారుల వెంబడి ఉన్న వైన్ షాపుల లైసెన్స్ మార్చి నెలాఖరుతో ముగుస్తుందని, ఆ తర్వాత వాటిని పునరుద్ధరించబోమని చెప్పారు. వాహనాల సంఖ్యలోను, ప్రమాదాల్లో కూడా రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో ఉందన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామని కలెక్టర్ చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. జాతీయ రహదారుల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్డు మరమ్మతులను త్వరలో చేపడతారన్నారు. రోడ్ల భద్రత అనేది పాఠశాలల స్థాయిలో పాఠ్యంశంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వాహన డ్రైవర్లు అతి వేగానికి నిర్లక్ష్యానికి, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. దీనివల్ల పోలీసు శాఖకు చెందిన ఇంటర్ సెప్టార్ వాహనం సాయంతో ఆ ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించవచ్చన్నారు. అలాగే డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా నివారణ చర్యలు కూడా చేపట్టినట్టు తెలిపారు. రూ. 1100 కోట్లతో జాతీయ రహదారి అభివృద్ధి సమావేశంలో రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ జాతీయ రహదారి 216ను జిల్లా పరిధిలో రూ.1100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే సామర్లకోట- రాజానగరం ఏడీబీ రోడ్డును రూ.325 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరిస్తామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే 292 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇన్చార్జి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) సిరి ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ డీసీహెచ్ డాక్టర్ పవన్ కిషోర్, సమాచారశాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్ కూడా ప్రసంగించారు. అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కె.చంద్రయ్య, ఎంవీఐలు నరసింహారావు, శివకామేశ్వరరావు, వీజీఎస్ తిలక్, ఆర్.సురేష్, శ్రీనివాస్, ఆయేషా, కల్యాణి, ఎం.రవికుమార్, పరంధామరెడ్డి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
దుమారం రేపుతున్న ట్రంప్ వ్యవహారం
న్యూయార్క్: అమెరికా ఉద్యోగాలు విదేశీయులు తన్నుకుపోతున్నారని, వారిని తన్ని తరిమేస్తే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఊదరగొట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వర్జీనియా రాష్ట్రంలో ఉన్న తన వైన్ తయారీ సంస్థలోనే తాత్కాలిక వీసాలపై విదేశీ కార్మికులతో పనిచేయించుకుంటున్నారు. ఇదంతా గతమనుకుంటే పొరపాటే. సాక్షాత్తు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్న చార్లాట్స్విల్లీ వైన్యార్డ్ డిసెంబర్ 2వ తేదీన ఆరుగురు విదేశీ కార్మికులకు ఆరు నెలల కాలానికి తాత్కాలిక వీసాలను మంజూరు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా కార్మిక శాఖ తన అధికారిక వెబ్సైట్లో తెలియజేసిందని ‘వాషింఘ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఇప్పటికే ట్రంప్ వైన్ తయారీ కేంద్రంలో 19 మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వారికి గంటకు పది డాలర్ల చొప్పున జీతం చెల్లిస్తున్నామని, కార్మికులు 20 గంటల షిప్టులో పనిచేస్తున్నారని కూడా ఆ దరఖాస్తులో కంపెనీ పేర్కొంది. కంపెనీ యజమానిగా విదేశీ కార్మికులను రప్పిస్తూ, స్థానిక కార్మికుల పొట్టకొడుతున్న విదేశీ కార్మికులను దేశం నుంచి పంపిస్తానంటూ ఓ దేశాధ్యక్షుడిగా చెప్పడం ద్వంద్వ ప్రమాణాలు పాటించడమేనని బరాక్ ఒబామాకు నైతిక విలువల న్యాయవాదిగా పనిచేసిన నామ్ ఐసెన్ విమర్శించారు. ట్రంప్ తన వ్యాపారాన్నైనా వదులుకోవాలని, లేదా తన కంపెనీ కార్మికులకు తాత్కాలిక వీసాలను మంజూరు చేయడంలో వైట్‌హౌజ్ అధికారులు జోక్యం చేసుకోకుండా చూడాలని మిన్నెసోట లా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రిచర్డ్ పెయింటర్, ట్రంప్‌కు సూచించారు. 1300 ఎకరాల్లో విస్తరించి ఉన్న డోనాల్డ్ ట్రంప్ వైన్ తయారీ కేంద్రం 2014 నుంచి ప్రతిఏటా విదేశీ కార్మికుల వీసాల కోసం దరఖాస్తు చేసి వీసాలు పొందుతూనే ఉంది. గతం వదిలేస్తే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కూడా ఆరుగురు విదేశీ కార్మికుల వీసాల కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. -
ఒక గ్లాస్ వైన్‌తోనూ గుండెజబ్బులు!
పరిమిత మోతాదులో వైన్ తీసుకుంటే గుండెజబ్బులు తగ్గుతాయనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం ఒక గ్లాసు వైన్ తీసుకున్నా అది గుండె జబ్బుల లయ (రిథమ్)ను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే ఒక గ్లాసు వైన్ తీసుకునేవారిలో హార్ట్ రిథమ్ దెబ్బతినే ముప్పు ఎనిమిది శాతం ఎక్కువ. ఇక మామూలుగా తాగేవారితో పోలిస్తే ఎప్పుడో ఒకసారి తాగితే వచ్చే గుండె లయలో సమస్య వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇలా ఎప్పుడో ఒకసారి తాగితే వచ్చే సమస్యను ‘హాలీడే హార్ట్ సిండ్రోమ్’గా చెబుతుంటారు. ఎప్పుడో ఒకసారి మద్యం తాగుతామని లేదా చాలా అరుదుగా తీసుకుంటామని చెబుతూ మద్యం తీసుకునే వారిలో గుండె లయకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలా ఎప్పుడో ఒకసారి తాగుతామని చెప్పే 65 ఏళ్లు పైబడిన ప్రతి 100 మంది లోనూ ఏడుగురు గుండె లయకు సంబంధించిన సమస్యల బారిన పడుతుంటారనే ఆ అధ్యయన ఫలితాలను అమెరియన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి సంబంధించిన ఒక జర్నల్‌లో ప్రచురించారు. -
‘చుక్క’ల అంగళ్లపై.. సొంత సుంకం
బ్రాందీ షాపులతో ప్రజాప్రతినిధుల దందా ప్రతి దుకాణం నుంచీ రూ.లక్షలు వసూలు ‘సీనియర్, జూనియర్’ తేడా లేకుండా దండుడు విరాళాల మాటున రసీదులూ ఇచ్చిన ఓ నేత వాటాల కోసం ‘అనాయాస’ నేతల ఆరాటం ‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు’లా నిషాజీవులపై భారం సాక్షి, రాజమహేంద్రవరం : ‘కాదేదీ కవితకు అనర్హం’ అని కవి అంటే మన ప్రజా ప్రతినిధులు దానికి కొంచెం మార్చి ‘కాదేదీ కలెక్షన్ కు అనర్హం’ అంటున్నారు. కాంట్రాక్టులు, ఇసుక రవాణా, మద్యం వ్యాపారం.. ఇలా ప్రతి దాంట్లో తమ మామూళ్లు దండుకుంటున్నారు. ఇవ్వకుంటే ఎక్కడ తమ పని, వ్యాపారం సక్రమంగా జరగనివ్వరోనన్న భయంతో వ్యాపారులు కిమ్మనకుండా అడిగినంతా సమర్పించుకుంటున్నారు. రాజమహేంద్రవరం నగర, రూరల్ నియోజకవర్గాల్లో కొందరు ప్రజా ప్రతినిధులు తమ నుంచి లక్షలకు లక్షలు గుంజినట్టు మద్యం వ్యాపారులు చెపుతున్నారు. ‘ఎన్నికల్లో రూ. 15 కోట్లు ఖర్చయింది. అదంతా రాబట్టుకోవాలి కదా’ అంటూ ఓ సీనియర్ నేత మామూళ్ల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన ఇసుక రవాణాలో ప్రత్యేక ‘రుసుము’ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమ పార్టీ ‘ముఖ్యనేత’ కంటే సీనియర్‌ననే ఆ నేత మామూళ్ల వసూళ్లలో కూడా ముఖ్యనేతను మించిపోయారని అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. నగర, రూరల్ నియోజకవర్గాల్లో 15 బార్లు, 23 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణం నుంచి సదరు సీనియర్ నేతకు రూ. లక్ష చొప్పున చేరినట్లు సమాచారం. ఈ మధ్య ఇసుక దందాపై ఆ నేతను ముఖ్యనేత పిలిచి ‘క్లాస్’ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయినా ముఖ్యనేతే రూ. వందల కోట్లలో ముడుపులు తీసుకుంటున్నప్పుడు తాను రూ. లక్షల్లో తీసుకుంటే తప్పేంటన్నట్లుగా ఆ ‘సీనియర్ నేత’ తన దారిలో ‘ముందుకు’ పోతూనే ఉన్నారంటున్నారు. కొత్త అయినా.. సరికొత్త పంథాలో.. కొత్తగా ఎన్నికైన మరో నేత మామూళ్ల వసూళ్లలో సరికొత్తగా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా అన్ని వ్యవహారాలనూ వ్యాపార పంథాలోనే ‘చక్క’బెడుతూ సీనియర్ నేతలకే పాఠాలు చెప్పగలనంటున్నారు. స్వచ్ఛంద సంస్థను స్థాపించి మరీ ‘విరాళాలు’ వసూలు చేస్తున్నారు. ఎవరైనా తనను అభినందిస్తూ ఇచ్చే విరాళాలు ఆ సంస్థ ఖాతాలో జమ చేస్తున్నారు. ‘విరాళాలు’ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా రసీదులు కూడా ఇస్తున్నారు. అసలు మొదట మద్యం వ్యాపారుల నుంచి మామూళ్లు ఈ నేతే డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ నేతకు దుకాణాల వారీగా ‘విరాళాలు’ వెళ్లడంతోనే సీనియర్ నేత రంగంలోకి దిగారని, ’ఉభయ నియోజకవర్గాల్లోనూ నాదే ముఖ్య భూమిక’ అంటూ కన్నెర్ర జేశారని సమాచారం. స్టంట్లు చేస్తున్న అనాయాస నేతలు.. ఇద్దరు నేతలకూ మద్యం వ్యాపారుల నుంచి ముడుపు లు వెళ్లడంతో తామే తీసిపోయామా అని ‘అనాయాసం’ గా ప్రజాప్రతినిధులైన వారు వారి వాటా ల కోసం రం గంలోకి దిగారు. ‘ప్రత్యక్ష’ నేతలకే తప్ప మాకు ముడుపు లు ఇవ్వరా’ అంటూ రాయ‘బేరాలు’ నడిపారు. అప్పటికే రెండు నెలల ఆదాయాన్ని కోల్పోయిన మ ద్యం వ్యా పారులు ఇచ్చుకోలేమనడంతో తమ ధనాశకు జనప్రయోజనం ముసుగు తొడిగారు. వీరిలో ఒకరు మ ద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ, అరికట్టాలని పై అధికారులకు లేఖ రాస్తే మరొకరు ఎక్సైజ్ కార్యాల యం వద్ద ఏకంగా ఆందోళనే చేశారు. సదరు నేతలి ద్దరూ ఆ తర్వాత ఈ విషయాన్నే విస్మరించడానికి కా రణం.. వారి వాటాలు వారికి ముట్టడమేనంటున్నారు. ధర పెంచకతప్పదు.. ప్రజాప్రతినిధులు ఇలా ముడుపులు దండుకోవడంతో మద్యం వ్యాపారులు ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఒక్కొక్క బాటిల్‌పై రూ.10 చొప్పన అధికంగా తీసుకుంటున్నారు. ‘నేతలకు ముడుపులు ఇవ్వడంతో మూడు నెలల ఆదాయం కోల్పోయాం. ఇక నెలవారీగా అధికారులకు ఇచ్చే మామూళ్లు సరేసరి. ఇవన్నీ తట్టుకుని వ్యాపారం చేయాలంటే సరుకు ధర పెంచకుండా సాధ్యం కాదు’ అని ఓ మద్యం వ్యాపారి చెప్పారు. చేతనైతే జనం కన్నీరు తుడిచి, వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన వారు.. తమ స్వార్థం కోసం చివరికి ఇలా.. ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకుని, కుటుంబాలకు కటికచీకటిని మిగిల్చే నిషాజీవుల జేబులపై అదనపు భారం పడడానికి కారకులవడం ఎంత నీచం! -
మద్యం అక్రమ అమ్మకాలపై ఉద్యమాలు
కాకినాడ సిటీ: మద్యం అక్రమ అమ్మకాలపై ఉద్యమాలు చేపట్టడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్టు జిల్లా కల్లు–మద్యం వినియోగదారుల సంక్షేమ సంఘం తెలిపింది. శుక్రవారం సంఘ సమావేశం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో జరిగింది. మద్యపాన నియంత్రణ, మద్యం అమ్మకాల్లో అక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో విద్యావేత్త చిరంజీవినీకుమారి, ఎక్సైజ్ సీఐ ఎ.వి.చలం ముఖ్యఅతిథులుగా మాట్లాడారు. అనంతరం సంఘ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు విజ్జి సత్యానందబాబా, గౌరవాధ్యక్షుడిగా నీలాపు తోటరెడ్డి, అధ్యక్షుడిగా పంపన రామకృష్ణ, కార్యదర్శిగా ఎ.చినబాబు, ఉపాధ్యక్షులుగా ష్టీఫెన్ డానియల్, వీవీఎస్ఎన్.మూర్తి, ముప్పిడి శ్రీనివాస్, అర్గనైజింగ్ కార్యదర్శులుగా పాలిక చిరంజీవి దయాసాగర్, పలివెల అప్పారావు, సంయుక్త కార్యదర్శులుగా వాసంశెట్టి స్వామి, విత్తనాల హరిప్రసాద్, కోశాధికారిగా టి.రామకృష్ణలతో పాటు తొమ్మిది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
వైన్... ఇక చౌక!
రాష్ట్రంలో వైన్‌పై వ్యాట్‌ను 150 శాతం నుంచి 70 శాతానికి తగ్గించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో విక్రయించే దేశీయ తయారీ వైన్ చౌకగా లభించనుంది. వైన్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రభుత్వం భారీగా తగ్గించింది. దేశంలో తయారయ్యే వైన్ మీద వాణిజ్య పన్నుల శాఖ 150 శాతం పన్ను విధిస్తుండగా, దానిని 70 శాతానికి తగ్గించింది. అలాగే వైన్ మీద ఎక్సైజ్ డ్యూటీ, దేశీయ తయారీ పన్నులను కూడా క్రమబద్ధీకరించింది. రూ. 2 వేల లోపు ధర గల కార్టన్ (కేసు) వైన్ ప్రాథమిక ధరపై 28% ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా 90 శాతానికి పెంచింది. కాగా ఇప్పటి వరకు రూ. 2 వేలకు పైబడిన వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ. 560లలో గరిష్టంగా ఉన్న మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధిస్తున్నారు. దానిని క్రమబద్ధీకరించి రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు గల వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ.1,800లలో గరిష్ట మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధించనున్నారు. ఇక రూ. 3వేల పైబడి ధర గల వైన్ కార్టన్ల ప్రాథమిక ధరలపై 10% పన్ను లేదా రూ. 450 లలో గరిష్ట మొత్తాన్ని పన్నుగా విధించనున్నారు. అంటే ఎక్కువగా విక్రయించే తక్కువ ధర గల వైన్ ఉత్పత్తులపై పన్నును పెంచిన ప్రభుత్వం అధిక ధర గల వైన్ తయారు చేసే కంపెనీలకు పన్ను తగ్గించింది. దీంతో వ్యాట్ సగానికి పైగా తగ్గినా సర్కార్ ఆదాయానికి ఢోకాలేని పరిస్థితి. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా దేశంలో పూర్తి ద్రాక్ష పండ్లతో తయారయ్యే వైన్ బాటిళ్ల ఎంఆర్పీ ధరలు 30 నుంచి 35% వరకు తగ్గనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ తెలిపారు. ఫోర్ట్‌ఫైడ్ వైన్ ధర సీసాకు రూ. 5 పెరుగుతాయని వివరించారు. -
కుక్కల 'వైన్' వచ్చేసింది!
వాషింగ్టన్: జంతుప్రేమికులకు అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన ఓ కంపెనీ తీపి కబురు అందించింది. కుక్కల కోసం ప్రత్యేకమైన మద్యాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు అపోలో పీక్ ప్రకటించింది. జిన్ ఫ్యాన్ టెయిల్, చార్ డాగ్ నాయ్ పేర్లతో రెండు రకాలను వినియోగానికి అందుబాటులోకి తెచ్చింది. 350 ఎంఎల్ రేంజ్ లో బాటిళ్లు లభ్యకానున్నట్లు చెప్పింది. కుక్కులకు హనికలిగించే ద్రాక్ష, ఆల్కహాల్ కు సంబధించిన మిశ్రమాలేవి వీటి తయారీ ఉపయోగించలేదని పేర్కొంది. ఈ వైన్ తయారీ కోసం పెప్పర్ మింట్, చామోమైల్ లను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ పదార్ధాలు కుక్కలను కంట్రోల్ చేసేందుకు ఉపకరిస్తాయని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో పిల్లుల కోసం ప్రత్యేక వైన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. చామోమైల్ కలిగివున్న పదార్ధాలను తీసుకోవడం వల్ల పెంపుడు జంతువులు పాయిజనింగ్ కు గురయ్యే అవకాశం ఉందని ఓ అమెరికన్ పత్రిక ప్రచురించింది. దీనిపై స్పందించిన అపోలో పీక్ యాజమాన్యం అప్పుడప్పుడు మాత్రమే పెట్ కు వైన్ ఇవ్వడం వల్ల దాన్ని నిరోధించవచ్చని పేర్కొంది. -
ఆల్కహాల్... పరిమితంగానూ ప్రమాదమే!
పరిపరి శోధన చాలా పరిమితంగా తీసుకుంటే ఆల్కహాల్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనీ, మోతాదుకు మించకుండా రెడ్ వైన్ లాంటివి తీసుకుంటే కొంతవరకు గుండెజబ్బుల నివారణకు తోడ్పడుతుందనే అపోహ ఉంది. కానీ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా ఆల్కహాల్ ప్రమాదకరమే అంటున్నారు పరిశోధకులు. కనీసం ఏడు రకాల క్యాన్సర్లకు ఆల్కహాల్ దోహదపడుతుందన్నది తాజా పరిశోధనలు చెబుతున్న మాట. ఎంత పరిమితంగా తాగినా అది గొంతు, ల్యారింగ్స్, ఈసోఫేగస్, కాలేయం, పెద్దపేగులు, జీర్ణవ్యవస్థ, రొమ్ము క్యాన్సర్లకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు అధ్యయనవేత్తలు. న్యూజిల్యాండ్‌లోని ఒటాగో మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ విభాగానికి చెందిన పరిశోధకులు చెబుతున్న మాట ఇది. అక్కడి ప్రొఫెసర్ జీనీ కానర్ నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో స్పష్టంగా వెల్లడైన మాట ఇది.‘‘ఇంకా మరెన్నో క్యాన్సర్లకు కూడా మద్యం కారణం కావచ్చు. కానీ ఆ ఏడు రకాల క్యాన్సర్లను మద్యం ప్రేరేపిస్తుందని మా అధ్యయనాల్లో వెల్లడైంది’’ అన్నారు జీనీ కానర్. ‘‘మా అధ్యయనాల ప్రకారం... ఫలానా పరిమితి వరకు మద్యం సురక్షితమైనది అని చెప్పడానికి కూడా వీల్లేదు’’ అమె చెబుతున్నారు. ‘‘క్యాన్సర్ వచ్చే అవకాశాలు డోస్ డిపెండెంట్ అని కూడా చెప్పవచ్చు. అంటే మీరు తాగే మోతాదు పెరుగే కొద్దీ... క్యాన్సర్ వచ్చే అవకాశాలూ అంతే పెరుగుతుంటాయి’’ అని హెచ్చరిస్తున్నారామె. పైగా ఎనర్జీ డ్రింక్‌లతో తక్షణం ఉత్తేజం కలుగుతుందనే భావన కలిగించడం కలిగించడం కోసం వాటిల్లో ఆల్కహాల్ కలుపుతుంటారని తేలింది. కొన్ని శీతల పానీయాల్లో అమెరికాకు చెందిన నార్దరన్ కెంటకీ యూనివర్సిటీ అధ్యయనాల్లోనూ వెల్లడైంది. దీని వల్ల యువత క్రమంగా మద్యానికి అలవాటు పడటం, తర్వాత అదేపనిగా తాగడం (బింజ్ డ్రింకింగ్) జరుగుతోందని ఆ యూనివర్సిటీ చెందిన అధ్యయనవేత్తలు ఆందోళన వెలిబుచ్చారు. ఇక వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ (డబ్ల్యూసీఆర్ఎఫ్)కు చెందిన ప్రోగ్రామ్ మేనేజర్ సుసానా బ్రౌన్ మాట్లాడుతూ ‘‘మద్యం ఎంత తక్కువ మోతాదుల్లో తీసుకున్నా అది కాలేయ క్యాన్సర్‌కు దోహదం చేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘అందుకే మా అధ్యయన ఫలితాల ఆధారంగా ఎంత తక్కువ మోతాదుల్లో అయినా అసలు మద్యమే తాగకూడదని మేం సూచిస్తుంటాం’’ అంటున్నారు సుసానా బ్రౌన్. -
కొంచెం తాగినా ముప్పు ముప్పే..
మందుబాబులు తరుచుగా చెప్పుకొని సమర్థించుకునే మాటలు.. 'ఎప్పుడో ఒకసారి తాగితే ఏమీ కాదు', 'కొంచెం తాగితే ఫర్వాలేదు'. అయితే ఈ అప్పుడప్పుడు, తక్కువ పరిమాణం అనే మాటలు కూడా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించేవే అని తాజా పరిశోధనలో తేలింది. రోజుకు ఒక గ్లాసు వైన్ తీసుకునే వారిలో సైతం ఏడు రకాల క్యాన్సర్లు సంభవించే ముప్పు పెరుగుతోందని న్యూజిలాండ్‌కు చెందిన ఒటాగో మెడికల్ స్కూల్ పరిశోధక బృందం నిర్వహించిన తాజా పరిశీలనలో తేలింది. రోజుకు ఒక గ్లాసు రెడ్‌వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న వాదన అర్ధరహితమైందని ఈ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆల్కహాల్ పరిమాణం తక్కువగా తీసుకునే వారిలో సైతం నోరు, గొంతు, అహారవాహిక, కాలేయం, పెద్దప్రేగు వంటి శరీర భాగాలలో క్యాన్సర్లు సంభవించే ముప్పు పెరుగుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జెన్నీ కానర్ తెలిపారు. 2012 నుంచి క్యాన్సర్ కారణంగా సంభవించిన మరణాలను పరిశీలిస్తే.. ప్రతి 20 మరణాల్లో ఒకటి(ఐదు శాతం) ఆల్కహాల్ మూలంగానే అని కానర్ వెల్లడించారు. అయితే.. తీసుకునే ఆల్కహాల్ పరిమాణం పెరిగిన కొద్దీ క్యాన్సర్ ముప్పు శాతం కూడా పెరుగుతుందని ఆమె వెల్లడించారు. -
స్నేక్ వైన్
రెడ్ వైన్ విన్నాం కానీ ఇదేంటి స్నేక్ వైన్ అనుకుంటున్నారా? నిజమేనండి! వియత్నాం దేశంలో దీనిని కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నారంట. ఇందులో ఔషధ విలువలు ఉన్నాయని అక్కడ వారి నమ్మకం. ఒక బాటిల్లో బతికిఉన్న పామును వేసి, అందులో ఆల్కహాల్ పోస్తారు. కొన్ని రోజుల తర్వాత పాముని తీసివేసి ఆ వైన్ తాగుతారు. పాము బాటిల్లో నిద్రాణ స్థితిలో ఉంటుంది. తాగడానికి మూత తీసినప్పుడు మేల్కొంటుంది. అప్పుడు కాటేసే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు చనిపోయే అవకాశం కూడా ఉందంట. అప్పుడు పాము పరాన్నజీవులు ఆల్కహాల్లో కలిసే అవకాశం ఉందంట. అలా పాము పరాన్న జీవులు కలసిన ఆల్కహాల్ తాగితే మనిషి ప్రాణానికి ప్రమాదమని పేర్కొంటున్నారు. -
మద్యానికి రాజధాని ఏ నగరమో తెలుసా?
వేల ఏళ్ళ చరిత్రకలిగిన.. సంస్కృతికి సాక్షీభూతమైన ప్రాంతం.. భారత్ లోని నాసిక్ పట్టణం. హిందూ తీర్థ క్షేత్రాలకు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం ఇప్పుడు వైన్ రాజధానిగానూ వెలుగొందుతోంది. మహరాష్ట్ర లోని జిల్లా కేంద్రమైన నాసిక్ లో సూలా ద్రాక్షతోటలు, వైన్ పరిశ్రమలతోపాటు మరికొన్ని ప్రధాన వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో అక్కడ కొత్త ఒరవడిని తెచ్చింది. దీంతో నాసిక్ వైన్ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. లిక్కర్ అమ్మకాల నిషేధంలో గుజరాత్ మహరాష్ట్రలు ప్రత్యేక చట్టాలను కలిగి ఉన్నాయి. ఇటీవల కేరళ కూడ ఈ జాబితాలో చేరే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పటిదాకా కుంభ మేళాకు ప్రసిద్ధి చెందిన మహరాష్ట్రలోని నాసిక్ ను తీర్థక్షేత్రంగానే భావించిన పర్యాటకులు.. క్రమంగా వైనరీ కేంద్రంగాను గుర్తిస్తున్నారు. దీంతో వైన్ టూరిజానికీ నాసిక్ ప్రధాన కేంద్రంగా మారిపోయింది. సుమారు 50 వైన్ ఉత్పత్తి కేంద్రాలు నాసిక్ చుట్టుపక్కల వెలిశాయి. వాటిలోని కొన్నికేంద్రాల్లో వైన్ టేస్టింగ్ రూమ్ లను కూడ ఏర్పాటు చేశారు. వారాంతాల్లోనూ, విరామ సమయాల్లోనూ వచ్చే విధేశీ పర్యాటకులకోసం ఈ కొత్త సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. ఇది స్థానికులను సైతం ఆకట్టుకుంటోంది. అంతేకాక స్థానిక చట్టాన్ని సడలించాల్సిన స్థాయికి కూడ చేరేట్టు కనిపిస్తోంది. నాసిక్ లో వైన్ పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నా... ఇప్పటికే అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంది. 'సూలా' సావినన్ బ్లాంక్, 'వల్లోన్' మాల్బెక్ డికాంటర్లు ప్రపంచ వైన్ అవార్డులను, పురస్కారాలను పొందాయి. వైన్ పరిమితంగా తీసుకోవడవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్నది పూర్వకాలంనుంచీ తెలిసిన విషయమే. ద్రాక్షరసంతో తయారయ్యే వైన్ చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది. గుండె, ఎముకలను ధృఢపరచడమే కాక మధుమేహం, రక్తపోటు, కాన్సర్ వంటి కొన్ని రకాల రోగాలను కూడ రాకుండా చేస్తుంది. అందుకే వైన్ పరిశ్రమలకు కేంద్రమైన నాసిక్ ఇప్పుడు భారత వైన్ రాజధానిగా మారిపోయింది. -
వైన్ తాగి 107 ఏళ్ళు బతికాడు..!
ఇటీవల చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన ఓ 107 ఏళ్ళ వృద్ధుడి జీవన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడు కేవలం రెడ్ వైన్ మాత్రమే తాగి బతికాడన్న విషయం తెలిసి అంతా విస్మయం చెందారు. స్పెయిన్ గాల్సియాలోని విగోకి చెందిన యాంటోనియో డొకాంపో గార్సియా క్రితం వారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బతికున్నంత కాలం తాను స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్న రెడ్ వైన్ మాత్రమే తాగేవాడట. డొకాంపో మధ్యాహ్న భోజనానికి బదులుగా రెండు బాటిల్స్... డిన్నర్ కు బదులుగా మరో రెండు బాటిల్స్ రెడ్ వైన్ తాగేవాడు. అంటే ఒక్కసారి అతడు తాగే మొత్తం వైన్ ఒకటిన్నర లీటరు వరకు ఉంటుందని అతడి కుమారుడు మిగ్వెల్ డొకాంపో తెలిపాడు. తామిద్దరూ కలిసి ఇంట్లోనే నెలకు రెండు వందల లీటర్ల రెడ్ వైన్ తయారు చేసేవాళ్ళమని, నీళ్లు కూడా తాగకుండా తన తండ్రి వైన్ మాత్రమే ఆహారంగా తీసుకునేవాడని చెప్తున్నాడు. 107 సంవత్సరాలపాటు తన తండ్రి ఎంతో ఆరోగ్యంగా బతికారని... స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రాంకో కోసం పోరాటం తరువాత వైన్ ఉత్పత్తి కేంద్రం.. బొడేగాస్ డొకాంపో స్థాపించారని, అందుకోసం రబాదావియా టౌన్ లో స్వంత ద్రాక్షతోట ఏర్పాటు చేసుకున్నారని తెలిపాడు. డొకాంపో కేవలం కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ వైన్ ను మాత్రమే తాగేవాడు. అయితే అతడు ఉత్పత్తి చేసిన వైన్ లో ఎక్కువ భాగం అమ్మేయగా... మిగిలిన వైన్ తో పాటు, అతని ద్రాక్షతోటను ప్రస్తుతం అతడి మేనల్లుడు జెరోనిమో డొకాంపో నిర్వహిస్తున్నాడు. డొకాంపో సంవత్సరానికి 60,000 లీటర్ల వైన్ ను ఉత్సత్తి చేసి, అందులో 3 వేల లీటర్లను తన కోసం ఉంచుకొనేవాడు. అయితే తాను అన్నేళ్ళు ఆరోగ్యంగా బతకడానికి వైనే కారణమని ఎప్పుడూ చెప్తుండేవాడట. -
'చుక్క' కోసం వచ్చి ఇరుక్కుపోయింది
చలికాలం కాస్త 'చుక్కేస్తే' వెచ్చగా ఉంటుందని భావించిందో ఏమో ఓ బుజ్జి ఎలుగుబంటి పిల్ల. ఏకంగా ఓ ఇంటి కిచెన్ నుంచి వైన్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. అక్కడ ఆ ఇంటి ఆసామి కనపడటంతో.. పక్కనే ఉన్న కిటికీలోంచి దూకి పారిపోదామని ప్రయత్నించింది. కానీ కిటికీలో ఇరుక్కుపోయింది. బయట పడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయితే ఈ బుల్లి ఎలుగొడ్డును కిటికీలో నుంచి తప్పించేందుకు ఎవరూ సాహసించలేదు. చివరకు ఎలాగోలా తంటాలు పడి.. ఎలుగు కిటికీలోంచి దూకి అడవిలోకి పారిపోయింది. అచ్చం టెలివిజన్ షో 'విన్ని ది ఫూ' లో ఎలుగు పిల్ల ఎపిసోడ్‌లాగా సాగిన.. ఈ వీడియోని ఇంటి యజమాని తన సెల్ ఫోన్లో బంధించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తాజాగా ఈ వీడియో రష్యన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్‌గా మారింది. అయితే.. ఎలుగు అవస్థ చూసి తాము సాయం చేద్దామనుకున్నామని.. కానీ.చిన్ని ఎలుగు పిల్ల కూడా చాలా ప్రమాదకరమని.. ఇంటి యజమాని ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. తూర్పు రష్యా అటవీ అధికారులు కూడా 'ఇంటి యజమాని ఎలుగు దగ్గరికి పోకుండా మంచి పని చేశాడు. ఎలుగులు ఎప్పుడూ ప్రమాదకరమైనవే అంటూ' ట్విట్ చేశారు. -
ఎందరికో ఆదర్శం ఆ గ్రామం
ఆసిఫాబాద్ (ఆదిలాబాద్): మద్యాన్ని.. మాంసాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ ఓ గ్రామం తీర్మానించింది. ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్‌లో మండలంలోని బెల్గాం గ్రామస్తులు గురువారం మద్యం, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఈ నిర్ణయంతో తమ గ్రామం జిల్లాలోనే ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. -
అతిగా తాగితే... అతిగా తింటారు... జాగ్రత్త!
కొత్త పరిశోధన ప్రతిరోజూ పరిమితంగా వైన్ తీసుకుంటే గుండెజబ్బులు రావని సాకు చెబుతూ తాగేస్తుంటారు కొంతమంది. గుండెజబ్బుల మాట ఎలా ఉన్నా వైన్ తీసుకున్న తర్వాత తినడంపై ఆసక్తి పెరుగుతుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. కొందరు పరిశోధకులు 35 ఏళ్లు పైబడిన ఆరోగ్యవంతులైన వ్యక్తులను తమ పరిశోధనల కోసం ఎంచుకున్నారు. వాళ్లను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపునకు ప్రతిరోజూ పరిమితంగా వైన్ ఇవ్వడం మొదలుపెట్టారు. రెండో గ్రూపునకు వైన్ ఇవ్వలేదు. ఈ రెండు గ్రూపులవారికీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఎమ్మారై స్కాన్ చేసేవారు. వైన్ తీసుకునేవారి మెదడులోని రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరిగినట్లుగా గుర్తించారు. ఒక గ్రూపునకు వైన్ తాగడానికి ఇచ్చిన కాసేపటి తర్వాత రెండు గ్రూపులకూ భోజనం పెట్టేవారు. వైన్ తీసుకున్న గ్రూపులోని వారి హైపోథలామస్ గ్రంథి ఆహారం నుంచి వచ్చే మంచి వాసనల పట్ల బాగా స్పందించడం గుర్తించారు. అంతేకాదు... ఆ సువాసనలతో ప్రేరేపితమై, ఆకలి పెరిగి సాధారణం కంటే ఎక్కువగా భోజనం చేయడం కూడా గుర్తించారా పరిశోధకులు. ఈ వైన్ తీసుకున్న వారిలో మూడింట రెండొంతుల మంది చాలా ఎక్కువ ఆహారం తీసుకోవడాన్ని కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాలను ‘ఒబేసిటీ’ అనే జర్నల్‌లో పొందుపరిచారు. అందుకే వైన్‌తో గుండెజబ్బుల నివారణ మాట ఎలా ఉన్నా, స్థూలకాయం వచ్చి మళ్లీ అది గుండెజబ్బులకు ఒక రిస్క్ఫ్యాక్టర్గా పరిణమించవచ్చు. అందుకే వైన్‌ను గుండెజబ్బుల నివారణ అంశంగా పరిగణించక పోవడమే మంచిదని నిపుణుల అభిప్రాయం. -
మద్యం మత్తులో గొడవ: బావ హత్య
మంచిర్యాల: మద్యం మత్తులో బావ బావమరిది గొడవ పడ్డారు. ఈ ఘటనలో బావ తలపై బావమరిది కర్రతో బాదడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నాగులంచ గ్రామానికి చెందిన బావ రామ్(25), బావమరిది ప్రభుదాస్ ఇద్దరూ 10 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పనికి వెళ్లారు. అయితే, ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి విపరీతంగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరినొకరు నీ అంతు చూస్తానంటే నీ అంతూ చూస్తానని బెదిరించుకున్నారు. అయితే, మద్యం మత్తులో ఉన్న ప్రభుదాస్ ఆవేశంతో బావ రామ్ తలపై కర్రతో గట్టిగా బాదాడు. దీంతో రామ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న కొంతమంది కూలీలు ఇది గమనించి రామ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, తలపై తీవ్రంగా గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే రామ్ మార్గమధ్యలోనే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. బావ మృతి చెందడంతో ప్రభుదాస్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ప్రభుదాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
హయత్‌నగర్: పీకలదాకా మద్యం తాగించి.. ఆపై విచక్షణా రహితంగా కొట్టి, మెడకు ఉరి బిగించి గుర్తు తెలియని యువకుడిని హత్య చేసిన ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొహెడ నుంచి మంగళ్‌పల్లి వెళ్లే దారిలో సీతారామ హౌసింగ్ వెంచర్లో రోడ్డుకు కొంత దూరంలో చెట్ల పొదల్లో ఓ యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి సుమారు 25-30 ఏళ్లు ఉండవచ్చని మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు అతన్ని తీసుకొచ్చి మద్యం తాగించి కొట్టి, ఆపై మెడకు ఉరేసి ఆటోకు కట్టి సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో రక్తం మరకలతో పాటు కొద్ది దూరంలో మద్యం సీసాలు లభించాయి. తల, ముఖం, చేతులు, కళ్లు, మర్మాంగాలపై గాయాలున్నాయని, పథకం ప్రకారమే యువకుడిని ఇక్కడికి తీసుకొచ్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని షర్టుపై మైటెక్స్ డబీర్‌పురా అనే లేబుల్ ఉందని, అతను ఆటోడ్రైవర్ అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాల కోసం శోధించారు. -
మత్తు వదలండి.. 'కొత్త'ను ఆస్వాదించండి!
-
చీప్ టు కాస్ట్లీ..
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు.. వైన్ ఎంత పాతదైతే.. అంత టేస్ట్ అని చెబుతారు. మరి రేటూ అలాగే ఉంటుంది. అయితే, చిత్రం లోని సోనిక్ డికాంటర్ అనే పరికరం మన వద్ద ఉంటే.. కేవలం 20 నిమిషాల్లో చీప్ వైన్‌కు కూడా కాస్ట్లీ టేస్ట్ తెప్పించేయొచ్చట. ఇది దాని ఫ్లేవర్‌ను మార్చి.. స్మూత్‌గా ఉండేలా చేస్తుందట. దీన్ని స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. ముందుగా ఇందులో రెండు కప్పుల నీరు పోయాల్సి ఉంటుంది. తర్వాత మూత తీసిన వైన్ బాటిల్‌ను ఉంచాలి. బటన్ నొక్కితే.. 20 నిమిషాల్లో మంచి రుచి గల వైన్ రెడీ. ఈ పరికరం అల్ట్రాసౌండ్ టెక్నాలజీ ద్వారా వైన్లోని అణు, రసాయన నిర్మాణాన్ని పాత వైన్లకు తగ్గట్లు మార్చేస్తుందట. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ పరికరం ‘కిక్‌స్టార్టర్’ సైట్ ద్వారా లభిస్తుంది. ధర రూ.8 వేలు. -
మందేసి, చిందేస్తా అంటే.. ఇక కుదరదు!
-
ధరలిలా ఉంటే.. మందెలా కొనాలి!!
-
'బార్'లు ఇక బార్లా తెరుచుకోనున్నాయ్!
-
పాలు వద్దు.. మందే ముద్దు..
వీడి పేరు చెంగ్ చెంగ్.. వీడో తాగుబోతు!! ఫొటో చూశారుగా.. ఇంకా డౌటా.. వయసు రెండేళ్లే అయినా.. వాళ్ల నాన్న కన్నా వేగంగా బీరు లేదా వైన్ తాగేస్తాడట. పాలు కనిపిస్తే యాక్ అంటూ మొహం తిప్పేసుకునే చెంగ్చెంగ్.. మందు కనిపిస్తే మాత్రం ముందు నాకే అంటాడు. ప్రస్తుతం చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో వీడి గురించే చర్చ. ప్రపంచంలోనే అత్యంత పిన్న తాగుబోతుగా భావిస్తున్న చెంగ్చెంగ్ను ఎలా దారిలో పెట్టాలన్న దానిపైనే అధికారులు చర్చిస్తున్నారు. అలాగని వీడిని అనడానికి లేదు లెండి.. ముందు వీడి నాన్నను అనాలి. ఎందుకంటే.. చెంగ్‌కు పది నెలల వయసున్నప్పుడు ఓ రోజు తెగ ఏడుస్తుంటే.. వాళ్ల నాన్న వైన్ చుక్క నాలికకు నాకించాడంట. అప్పట్నుంచి అది అలవాటై.. చివరికి గ్రహపాటుగా మారింది. ఏడాది వయసొచ్చేసరికి బీరు అలవాటైంది. ఇప్పుడైతే.. ఓ బాటిల్ బీరును ఈజీగా తాగేస్తాడు. వీడి కళ్లు ఎప్పుడు మందు బాటిల్ మీదే ఉంటాయట. ఇంట్లో వాళ్లు పార్టీ అంటూ బాటిల్ బయటకు తీస్తే.. మరి నాకో అంటూ మందు కోసం మారాం చేస్తాడు. ఒక్కోసారి ఎంత గొడవ చేస్తాడంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం వైన్ ఇవ్వాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. చెంగ్ చెంగ్ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా గగ్గోలు రేగింది. వెంటనే ఈ అలవాటు మానిపించకపోతే.. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. తల్లిదండ్రుల వల్లే వీడిలా చెడిపోయాడని.. చెంగ్‌ను ప్రభుత్వ సంరక్షణ నిలయానికి పంపించాలని సామాజిక సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అటు వీడి తల్లిదండ్రులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. చెంగ్‌కు మందుకు బదులు జ్యూస్ వంటివి అలవాటు చేయించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే.. తమపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందేమోనని వీరు భయపడుతున్నారు. -
బెల్ట్ షాప్‌లు బంద్.. ఎక్కడా ?!
-
తాగండ్రా 'బాబు'.. తాగండి !!
-
కాదేదీ ప్రలోభానికనర్హం..!
-
అనంతపురంలో భారీగా పట్టుబడ్డ మద్యం
-
ఖమ్మం జిల్లాలో భారీగా కల్తీ మద్యం
-
మద్యం అలవాటును ప్రోత్సహిస్తున్న సర్కారు
-
అంబులెన్స్‌లో ప్రత్యక్షమైన నాటుసారా
-
ఈ కిక్ సమాజానికి అవసరమా?
-
కిక్ అంటే తంతాం!
-
ఇదేనా హీరోయిజం అంటే!
-
ప్రజారోగ్యాన్ని భద్రతను గాలికొదిలేసిన ప్రభుత్వం