వినాయక నిమజ్జనంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలోని 9 మద్యం షాపులను ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి సీజ్ చేశారు.
రాయదుర్గం: వినాయక నిమజ్జనంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలోని 9 మద్యం షాపులను ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి సీజ్ చేశారు. అయితే అవేమీ పట్టనట్లు కొంతమంది లైసెన్స్‌దారులు తమ వ్యక్తులతో పాత బస్డాండు, కేబీ ప్యాలేస్ రోడ్డు, బళ్లారి రోడ్డులో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపట్టారు. అయినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారని ప్రజలే ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేశారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకునేలోగా అమ్మే వ్యక్తులు బాటిళ్లు వదిలి పరారయ్యారు. ఎక్సైజ్ సీఐ సోమశేఖర్‌ను వివరణ కోరగా పాతబస్టాండు వద్ద 20 హెచ్‌డీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాటిళ్లపై ఉన్న బ్యాచ్ నంబర్ 205 ఎల్8, 14.08.2017 ఆధారంగా ఏ షాపు వారిదో గుర్తించి, చర్యలు తీసుకుంటామన్నారు.