మద్యం అక్రమ అమ్మకాలపై ఉద్యమాలు చేపట్టడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్టు జిల్లా కల్లు–మద్యం వినియోగదారుల సంక్షేమ సంఘం తెలిపింది. శుక్రవారం సంఘ సమావేశం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగింది. మద్యపాన నియంత్రణ, మద్యం అమ్మకాల్లో అక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో విద్యావేత్త చిరంజీవినీకుమారి, ఎక్సైజ్ సీఐ ఎ.వి.చలం ముఖ్యఅతిథులుగా మాట్లాడారు.
మద్యం అక్రమ అమ్మకాలపై ఉద్యమాలు
Sep 30 2016 11:05 PM | Updated on Jul 11 2019 5:38 PM
కాకినాడ సిటీ:
మద్యం అక్రమ అమ్మకాలపై ఉద్యమాలు చేపట్టడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్టు జిల్లా కల్లు–మద్యం వినియోగదారుల సంక్షేమ సంఘం తెలిపింది. శుక్రవారం సంఘ సమావేశం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగింది. మద్యపాన నియంత్రణ, మద్యం అమ్మకాల్లో అక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో విద్యావేత్త చిరంజీవినీకుమారి, ఎక్సైజ్ సీఐ ఎ.వి.చలం ముఖ్యఅతిథులుగా మాట్లాడారు. అనంతరం సంఘ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు విజ్జి సత్యానందబాబా, గౌరవాధ్యక్షుడిగా నీలాపు తోటరెడ్డి, అధ్యక్షుడిగా పంపన రామకృష్ణ, కార్యదర్శిగా ఎ.చినబాబు, ఉపాధ్యక్షులుగా ష్టీఫెన్ డానియల్, వీవీఎస్‌ఎన్.మూర్తి, ముప్పిడి శ్రీనివాస్, అర్గనైజింగ్ కార్యదర్శులుగా పాలిక చిరంజీవి దయాసాగర్, పలివెల అప్పారావు, సంయుక్త కార్యదర్శులుగా వాసంశెట్టి స్వామి, విత్తనాల హరిప్రసాద్, కోశాధికారిగా టి.రామకృష్ణలతో పాటు తొమ్మిది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
Advertisement
Advertisement