brahmotsavam
-
ఒంటిమిట్ట రథోత్సవానికి జగన్... అవినాష్ రెడ్డి కారిటీ
-
వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
అల.. ఏకశిలానగరిలో..
రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం టీటీడీలోకి విలీనమైంది. టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ ఏడు కూడా శనివారం నుంచి ఈ నెల 15 వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. తొలిరోజున అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈనెల 11న రాములోరి కల్యాణం కన్నుల పండువగా చేయనున్నారు. ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈసందర్భంగాఒంటిమిట్ట రామయ్య క్షేత్రం ప్రత్యేక కళను సంతరించుకుంది. ఒంటిమిట్ట (రాజంపేట): ఒంటిమిట్టలోని కోదండరామాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఈ నెల 5వ తేదీ నుంచి 15 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టనున్నారు. రోజుకొక అలంకారంలో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రధాన విశేషం.. సీతారామలక్ష్మణులు కొలువుదీరిన ఏ ఆలయంలో అయినా హనుమ కూడా దర్శనమిస్తారు. అయితే ఒంటిమిట్ట గుడిలో సీతారామలక్ష్మణులు మాత్రమే ఏకశిలపై దర్శనమిస్తారు. ఆంజనేయుడి విగ్రహం లేదు. అయితే ఆలయ తూర్పు గాలిగోపురానికి తూర్పుగా రథశాల పక్కనే సంజీవరాయుడుగా వెలసిన ఆంజనేయస్వామి గుడి నిర్మించారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసం.. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారని పురాణ కథనం. అప్పుడు సీతమ్మకు దప్పిక అయింది..రాముడు బాణం సంధించి భూమిలోకి వదిలాడు. నీరుపైకి ఎగజిమ్మింది. సీతమ్మ దప్పిక తీరింది. లక్ష్మణుడు అన్న అనుజ్ఞతో తాను ఒక బాణం వదిలాడు. నీరుపైకి వచ్చింది. ఆ నీటిబుగ్గలనే నేడు రామతీర్థం..లక్ష్మణతీర్థం అని పిలుస్తున్నామనే కథ పురాణాల ద్వారా తెలుస్తోంది. ధర్మ సంస్థాపన కోసం ఒంటిమిట్ట గుడి.. రాముడిక్కడ కోదండం ధరించి ఉన్నాడు. కోదండం ధర్మరక్షణకు ప్రతీక. అలనాడు శ్రీరామచంద్రుడు అడవుల్లో తిరుగుతూ నార వస్త్రాలు ధరించినా కోదండాన్ని విడువలేదు. అది ధర్మరక్షణ కోసమే. బుక్కరాయులు తర్వాత సిద్దవటం మట్లిరాజులు ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అనంతరాజు, తిరుమలరాయలు, తిరువెంగళనాథరాజు, కుమార అనంతరాజులు ఒంటిమిట్ట కోవెలను తీర్చిదిద్దారు. ఉన్నతమైన ప్రాకారకుడ్యాలు సమున్నతమైనగోపుర శిఖరాలు రంగమంటపాల్లో అద్భుత శిల్పవిన్యాసాలు కనిపిస్తాయి. ఏకశిలానగరానికి ఎలా చేరుకోవాలంటే.. చెన్నై–ముంబాయి రైలుమార్గంలోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో దిగి ఒంటిమిట్ట(ఏకశిలానగరం)కు చేరుకోవచ్చు. కడప నుంచి రేణిగుంట తిరుపతికి వెళ్లే బస్సు మార్గంలో , కడప నుంచి 25కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట వస్తుంది. ఆలయ చరిత్ర.. విజయ నగర స్రామాజ్యంలో క్రీ.శ 1340లో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఆయన కొంతపరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ అడవుల్లో ఇద్దరు బోయలు ఉండేవారు. వారే వంటడు, మిట్టడు. వీరు రాజుగారికి సేవలందించారు. ఈ సమయంలో సమీపంలో గుట్టమీద చిన్నపాటి గుడి ఉంది. జాంబవంతుడు నిలిపిన శిలలో సీతారామలక్ష్మణులని భావించి దండం పెట్టుకొంటున్నారని, అక్కడ గుడి కట్టి పుణ్యం కట్టుకోమన్నారు. సీతమ్మను వెతుకుతూ ఒకనాడు జాంబవంతుడు ఈ గుట్టమీద విశ్రమించాడని, ఆరాత్రి అక్కడే నిద్రించాడని ఉదయం తిరిగి వెళ్తూ ఆ శిలలో సీతారామలక్ష్మణులను భావించుకొని నమస్కరించుకొని వెళ్లాడట. వంటడు..మిట్టడు చెప్పిన మేరకు కంపరాయులు గుడి, చెరువు నిర్మించేందుకు అంగీకరించారు. ఆ బాధ్యత బోయలకే అప్పగించారు. కాగా.. ఒంటడు.. మిట్టడు.. ఆలయ నిర్మాణంలో భాగం అయ్యారు గనుకనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందనే పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఏకశిలా నగరంగా.. ఒంటిమెట్ట మీద నిర్మించిన ఆలయం ఉన్న ప్రదేశం ఒంటిమిట్ట అయింది. ఒంటిమిట్ట గుడికి అనురూపంగానే ఏర్పడిన మరోపేరు ఏకశిల. ఒకేశిలలో సీతారామలక్ష్మణ విగ్రహాలు నిర్మితమై ఉన్నాయి. ఇది అరుదైన సంగతి. జాంబవంతుడు ముగ్గుర్ని ఒకే శిలలో భావించుకొన్నాడు. ఆ తర్వాత కాలంలో కంపరాయలు, బుక్కరాయలు అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేటట్లు నిర్మాణం చేయించారు. బహుశా ఒకే శిలలో ముమ్మూర్తులను నిలిపిన సంఘటన ఒంటిమిట్టలో మొదటిగా ఆవిష్కృతమైంది. అరుదుగా కొలవైన ఏకశిలావిగ్రహ ప్రాంతాన్ని ఏకశిల అని భక్తితో అన్నాడు పోతన. రాత్రిపూటే కల్యాణం.. ఒంటిమిట్ట స్వామివారి కల్యాణం రాత్రిపూట నిర్వహిస్తారు. చతుర్ధశినాటి రాత్రి వివాహమహోత్సవం, కళాపూర్ణుడైన చంద్రుడు సీతారామ కల్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడని పురాణకథ చెపుతోంది. కాగా రాత్రి కల్యాణం సంప్రదాయం ఇప్పటిదికాదు. అది ఒంటిమిట్ట ఆలయం ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది. అన్ని రామాలయాలలో నవమిరోజున కల్యాణం నిర్వహిస్తారు. అది పగటిపూట. ఒక్క ఒంటిమిట్ట కోదండరామాలయంలోనే రాత్రి పూట రాములోరి కల్యాణం జరుగుతుంది. ఈ నెల11న రాత్రి 8–10 గంటలలోపు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. రామయ్య సేవలో కవులుఒంటిమిట్ట కోదండరామాలయంలో వెలసిన రఘురాముడిని సేవిస్తూ కవులెందరో తరించారు. వారిలో అయ్యలరాజు తిప్పయ్య, బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగొండూరు వెంకట కవి, వరకవి నల్లకాల్వ అయ్యప్ప, వాసుదాసు వావిలికొలను సుబ్బారావులు తమతమ స్థాయిలో కోదండరామునిపై సాహిత్యం, కీర్తనలు, రచనలుతోపాటు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు.ఆలయ నిర్మాణం ఇలా..విజయ నగర సామా్రజ్య చక్రవర్తి బుక్కరాయలు ఒంటిమిట్ట గుడిలో ఏకశిలా విగ్రహం నిలిపిన నాటికి గర్భాలయం, అంతరాళం, చిన్నగోపురం ఉండేవి. మొదటి దశ నిర్మాణమిది. మూడవ దశలో మహా మంటపం (రంగ మంటపం), మహా ప్రాకారం, తూర్పు, ఉత్తర , దక్షిణ గాలిగోపురాలు, మహా ప్రాకారం లోపల నైరుతి దిక్కున కళ్యాణ మంటపం, ఆగ్నేయ దిశలో పాకశాల, ప్రాకారంలోపల ఉత్తరం వైపు తూర్పున, పడమర ఎదుర్కోలు మంటపాలు, రామలింగదేవుని గుడి (1966)లో లింగాన్ని నిలిపారు. సంజీవరాయస్వామి, రథం, రథశాలను ఏర్పాటుచేశారు. అనంతరం అనంతరాజు గుడిని విస్తరించాడు. మహామంటపం, మహాప్రాకారం, గాలిగోపురాల నిర్మాణాలు చేపట్టారు. తెలుగురాష్ట్రాలలో ఒంటిమిట్ట గాలిగోపురాల తరహాలో మరెక్కడా కనిపించవు. ఈ ఆల యాన్ని దర్శించిన టావెర్నియర్ అనే యాత్రికుడు ఎత్తయిన గోపురాలు చూసి విస్మయం చెందాడు. రామయ్యకు బ్రహ్మోత్సవ శోభ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలతో ఏకశిలానగం శోభాయమానంగా వెలుగొందనుంది. ఇప్పటికే కళ్యాణవేదిక ముస్తాబు, భక్తుల కోసం గ్యాలరీలు చకచకా ఏర్పాటుచేశారు. 60 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీవీఐపీ, వీఐపీ, సాధారణ భక్తులును దృష్టిలో ఉంచుకొని గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. దాశరథి కల్యాణానికి వచ్చే భక్తులకు తోపులాట వాతావరణం లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. రేపటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూరికావస్తున్నాయి. దాశరథి కోవెలలో నవమి ఏర్పాట్లు... ఒంటిమిట్టలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరోజున ఆలయంలో పోతన జయంతి కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనున్నది. కవిసమ్మేళనం నిర్వహిస్తారు. నవమి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున రానున్నారు. -
శ్రీశైలంలో ఘనంగా ఉగాది బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
వైభవంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు)
-
వైభవంగా యాదగిరిగుట్ట నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ : వైభవంగా టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలం : నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీశైలం ఆలయం
-
కరీంనగర్ : వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..వైభవంగా ఎదుర్కోలు వేడుక (ఫొటోలు)
-
తొలి గడప కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
వైభవంగా కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
Tirumala : తిరుమలలో ఘనంగా చక్ర స్నానం..(ఫొటోలు)
-
వైభవంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
శ్రీనివాసుని గరుడ సేవ.. భక్తజనంతో కిక్కిరిసిన తిరుమల (ఫొటోలు)
-
తిరుమల : మోహినీ అవతారంలో శ్రీనివాసుడు.. మంత్రముగ్ధులైన భక్తులు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం (ఫొటోలు)
-
సింహ వాహనంపై తిరుమల శ్రీవారు..
-
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు .. చిన్నశేష వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలులో ఆకట్టుకుంటున్న ప్రదర్శన శాల (ఫొటోలు)
-
వైభవంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమలలో అపశృతి
తిరుపతి,సాక్షి : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రారంభం ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం ధ్వజారోహణం సమయంలో ధ్వజస్తంభంపై గరుడ పఠాని ఈ కొక్కి ద్వారానే ఏగుర వేయాల్సి ఉందని అర్చకులు తెలిపారు. కొద్దిసేపటి క్రితం కొక్కి విరగడంతో టీటీడీ మరమ్మత్తు పనులు ప్రారంభించింది. అర్చకులు ద్వారా ధ్వజస్తంభంపై టీటీడీ మరమ్మత్తు పనులను ముమ్మరం చేసింది. -
తిరుపతి : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
వైభవంగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
గరుడ ప్రసాదం.. పోటెత్తిన జనం.. ట్రాఫిక్ నరకం
మొయినాబాద్, బండ్లగూడ: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేని మహిళలకు పిల్లలు కలుగుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయడంతో శుక్రవారం అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. ప్రసాదం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వేకువ జామున 4 గంటల నుంచే వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూడు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుని, ఎండలో కాలినడకన ఆలయానికి చేరుకున్న భక్తులకు క్యూలైన్లు ఎక్కడ ఉన్నాయో..? ప్రసాదం ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆలయ ప్రాంగణంలోనికి మహిళలను మాత్రమే అనుమతించడంతో పురుషులు బయటే ఉండిపోయారు. చేతులెత్తేసిన పోలీసులు ప్రసాదం కోసం పోటెత్తిన మహిళలను నియంత్రించడంలో ఆలయ సిబ్బంది, పోలీసులు చేతులెత్తేశారు. క్యూలైన్లలో తోపులాటలు జరగడంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కానీ వచ్చిన వారిలో సగం మందికి కూడా అందలేదు. దీంతో కొంత మంది మహిళలు నిరసన చేపట్టారు. గరుడ ప్రసాదం కొరతపై భక్తుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే వారం రోజుల పాటు ప్రసాదం ఇస్తామని, వారం రోజుల్లో ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చని ఆలయ అర్చకులు తెలిపారు. గరుడ ప్రసాదం కోసం ఏటా సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది వచ్చేవారు. ఈసారి రెండింతలు వస్తారని భావించాం.. కానీ ఇంతమంది వస్తారని ఊహించలేదని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. వేలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో సుమారు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య నెలకొంది. మెహిదీపట్నం నుంచి నానల్ నగర్, లంగర్‌హౌస్, టిప్ఖాన్పూల్ బ్రిడ్జ్, సన్‌సిటీ, కాళీమందిర్, టీఎస్పీఏ చౌరస్తా మీదుగా చిలుకూరు ఆలయం వరకు పూర్తిగా ట్రాఫిక్‌తో రోడ్డంతా స్తంభించిపోయింది. -
శ్రీశైలంలో అంగరంగ వైభవంగా రథోత్సవం (ఫొటోలు)
-
ఘనంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ఘనంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
బ్రహ్మోత్సవాలకు వేళాయే..
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో 11 రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. ఉదయం 8:10 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు భేరిపూజ, భేరీతాడనం, సకలదేవతాహ్వానపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ నిర్వహిస్తారు. కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 2న భృంగి వాహనసేవ, 3న హంస వాహన సేవ, 4న మయూర వాహన సేవ, 5న రావణ వాహన సేవ, 6న పుష్పపల్లకిసేవ, 7న గజ వాహన సేవ, 8న ప్ర¿ోత్సవం, నందివాహన సేవ, అదే రోజు రాత్రి 10గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిõÙకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం, 10న బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి చేపట్టి సాయంత్రం ధ్వజావరోహణ చేస్తారు. 11న అశ్వ వాహనసేవ, పుషో్పత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు. నేడు పట్టు వస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారిచే స్వామి అమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. అలాగే, 2న ద్వారక తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, 3న విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, 4న కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానాలు పట్టువస్త్రాలను సమర్పి0చనున్నాయి. 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు స్వామిఅమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. -
హైదరాబాద్ : హరే కృష్ణ గోల్డెన్ టింపుల్ లో ముగిసిన బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు
-
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్పెషల్ (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. పెదశేష వాహనంపై విహరించిన మలయప్పస్వామి (ఫొటోలు)
-
పిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
Tirumala Brahmotsavam 2023: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు హనుమంత వాహనంపై శ్రీనివాసుడు (ఫోటోలు)
-
గణనాథుని బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
యాదమరి (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో మంగళవారం ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలకు అర్చకులు శేఖర్ గురుకుల్, వేదపండితులు సుబ్బారావు పూజలు చేశారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అన్వేటి మండపంలో స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషికపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కోసం ధ్వజస్తంభానికి క్షీర, చందన, ఇతర ద్రవాలతో అభిషేకం చేశారు. ఈ ఉత్సవాలకు ఉభయదారులుగా కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లె గ్రామాలకు చెందిన శీర్కరుణీక వంశస్తులు వ్యవహరించారు. సిద్ధి, బుద్ధి, వినాయక స్వామి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించి పుర వీధులలో ఊరేగించారు. రాత్రి ఆలయాధికారులు ఉభయదారులు మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చి పుష్పాలతో అలంకరించిన హంస వాహనంపై ఆశీనులు చేయగా... స్వామివారు దానిపై విహరించారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి వినాయకుడికి సోమవారం ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వ్రస్తాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో చవితిరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఆనవాయితి. ఈ ఏడాది మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఊరేగింపుగా పట్టువ్రస్తాలను తీసుకువెళ్లారు. వీరికి ఆలయ చైర్మన్, ఈవో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. ఆశీర్వాద మండపంలో వేదపండితులచే ఆశీర్వాదాలు చేయించి, ప్రసాదం, చిత్రపటం అందించారు. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. -
రెండో రోజు బ్రహ్మోత్సవాల్లో శేషవాహనంపై స్వామి వారు ఊరేగింపు
-
18 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
యాదమరి(చిత్తూరు జిల్లా): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నా యి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారు నిత్యం వివిధ వాహన సేవల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వినాయక చవితి మరుసటి రోజు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఆ తర్వాత హంస వాహన సేవ, మయూర వాహన సేవ, మూషిక వాహన సేవ, చిన్న, పెద్ద శేష వాహన సేవ, వృషభ వాహన సేవ, గజవాహన సేవ, రథోత్సవం, అశ్వవాహన సేవ, ఏకాంత సేవలు తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు మాట్లాడుతూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాలు, అనుబంధ ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. -
ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
Yadagirigutta : జగన్మోహిని అవతారంలో నారసింహుడు (ఫొటోలు)
-
యాదాద్రిలో వైభవంగా సాంస్కృతికోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7గంటలకు సాంస్కృతికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. తూర్పు రాజగోపురం వద్ద ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో 100 మంది కళాకారులు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. అనంతరం టి.కే.సిస్టర్స్ కర్నాటక గాత్ర కచేరీ నిర్వహించారు. శ్రీసాయి బృందం మోర్సింగ్ వాయిద్య కచేరి భక్తులను ఆకట్టుకుంది. వేడుకల్లో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
మత్స్యావతారంలో యాదగిరీశుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం అలంకార సేవలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం నిత్య పూజలు, నిత్య పూర్ణాహుతి, ఆరాధనలు పూర్తయ్యాక.. 9గంటలకు మత్స్యావతార అలంకారంలో సేవోత్సవం నిర్వహించారు. ప్రధానాలయం తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపం వద్ద శ్రీస్వామి వారి మత్స్యావతార సేవను ప్రారంభించారు. రాత్రి ఆలయంలో నిత్యారాధనలు ముగిశాక 7గంటలకు శేష వాహనంపై శ్రీనారసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మత్సా్యవతార, శేష వాహన సేవల విశిష్టతను ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు భక్తులకు వివరించారు. -
యాదాద్రి వైభవం..
-
కన్నప్ప ధ్వజారోహణం.. ప్రారంభమైన శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో 11 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరగనుంది. ఉదయం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు త్రిశూలపూజ, భేరిపూజ, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిశ్వరస్వామి దేవస్థానం అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామిఅమ్మవార్లకు సమర్పిస్తారు. -
ఘనంగా నృసింహుడి ఎదుర్కోలు
యాదగిరిగుట్ట: పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి, అమ్మవార్లకు గురువారం ఉదయం సింహ వాహనసేవ, రాత్రి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఆలయంలో ఉదయం హవన పూజలు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్టానాలు, పారాయణికులతో వేద పారాయణాలు జరిపించిన అనంతరం శ్రీస్వామి, అమ్మవార్లను సింహవాహనం సేవపై తిరువీధుల్లో ఊరేగించారు. సాయంత్రం జరిగిన ఉత్సవంలో శ్రీస్వామి వారిని అశ్వవాహనంపై మేళతాళాలతో ఊరేగించి ఆలయ ముఖ మండపంలో ఎదుర్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్ల తిరు కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. -
ద్వారకాతిరుమలలో చినవెంకన్న బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. ద్వారకాధీశుడి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా రెండు సార్లు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలతో పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈనెల 5వ తేదీ నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. క్షేత్ర చరిత్ర ద్వారకామహర్షి తపోఫలితంగా ఉద్భవించిన క్షేత్రం ద్వారకాతిరుమల. ఇక్కడ స్వయంభూ చినవెంకన్న పుట్టలో వెలిశారు. పాదపూజ కోసం పెద్దతిరుపతి నుంచి స్వామిని తెచ్చి స్వయం వ్యక్తుని వెనుక ప్రతిష్ఠించారు. దీంతో ఒకే అంతరాలయంలో స్వామివారు ద్విమూర్తులుగా కొలువై ఉండటంతో ఏటా వైశాఖ, ఆశ్వయుజ మాసాల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి శ్రీవారు ఇక్కడ ఉండటం వల్ల, అక్కడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే సంప్రదాయం ఉంది. అభివృద్ధి ఘనం భక్తుల సౌకర్యార్థం కొండపై రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన అధికారులు, మరికొన్ని నిర్మాణాలకు ఇటీవల శంకుస్థాపనలు చేశారు. కాటేజీల నిర్మాణం, డోనర్ స్కీమ్, నిత్యాన్నదాన ట్రస్టు, నిత్యకల్యాణం, గోసంరక్షణ, విమానగోపుర స్వర్ణమయ పథకం, ప్రాణదాన ట్రస్టులకు విరాళాలను సేక రిస్తూ క్షేత్రాభివృద్ధిలో భక్తులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. కొండపైన సన్డైల్, గార్డెన్లు, క్షేత్రంలో 40 అడుగుల గరుత్మంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుని విగ్రహాలు, శ్రీవారి ధర్మప్రచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు ఇలా.. ► ఈనెల 5న ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం. ► 6న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం ధ్వజారోహణ. రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై గ్రామోత్సవం ► 7న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం. ► 8న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై గ్రామోత్సవం. ► 9న రాత్రి 8 గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం. ► 10న రాత్రి 7 గంటల నుంచి రథోత్సవం. ► 11న ఉదయం 9 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవం, రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం. ► 12న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం–పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి . సేవలు రద్దు బ్రహోత్సవాలు జరిగే రోజుల్లో ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యమిస్తాం. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాం. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా రథోత్సవం (ఫొటోలు)
-
తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం
-
బ్రహ్మోత్సవాలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆహ్వానం
-
సత్యప్రమాణాల దేవుడికి బ్రహ్మోత్సవాలు
దేశంలోని గణపతి క్షేత్రాల్లో కాణిపాకం ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం గ్రామంలో స్వయంభూ క్షేత్రంగా వెలసింది. ఇక్కడ వెలసిన గణపతి సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి పొందాడు. బాహుదా నదీతీరంలోని ఈ స్థలపురాణానికి సంబంధించి ఒక గాథ ప్రచారంలో ఉంది. బాహుదా నదీతీరాన విహారపురంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు అంధుడు, ఇంకొకరు మూగవాడు, మరొకరు బధిరుడు. వారికి ‘కాణి’ భూమి ఉండేది. ‘కాణి’ అంటే, పావు ఎకరం. అందులోనే వాళ్లు వ్యవసాయం చేసుకునేవాళ్లు. ఒకసారి కరవు వచ్చి, ఆ భూమిలోని బావి ఎండిపోయింది. నీటికోసం ఆ బావిని మరింత లోతుగా తవ్వేందుకు ముగ్గురు అన్నదమ్ములూ పలుగు పారలు తీసుకుని, అందులోకి దిగారు. తవ్వుతూ ఉండగా, ఇసుకపొరలో రాయి అడ్డు వచ్చింది. దానిపై పలుగుపోటు పడగానే, దాని నుంచి నెత్తురు చిమ్మింది. ఆ రక్తస్పర్శతో ముగ్గురు అన్నదమ్ముల వైకల్యాలూ తొలగిపోయాయి. వారి ద్వారా సంగతి తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకుని, బావిలోని ఇసుక తొలగించారు. అందులో వినాయక విగ్రహం దొరికింది. అలా ఇక్కడ స్వయంభువుగా వెలసిన గణపతిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల జనం తండోపతండాలుగా వచ్చారు. వారు కొట్టిన టెంకాయల నీటితో ‘కాణి’ విస్తీర్ణం ఉన్న పొలమంతా తడిసిపోయింది. ‘కాణి’ నేలలో నీరు పారినందున తమిళంలో దీనికి ‘కాణిపారకం’– (‘పారకం’ అంటే ప్రవహించడం) అనే పేరు వచ్చింది. కాలక్రమేణా జనుల నోట ఈ పేరు కాణిపాకంగా మారింది. ఇదీ చరిత్ర కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. మొదటి కుళోత్తుంగ చోళుడు పదకొండో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో విజయనగర రాజులు దీనిని మరింతగా అభివృద్ధిపరచారు. ఈ క్షేత్రంలో చోళ, పాండ్య, గంగవంశ రాజులు వేయించిన శాసనాలు బయటపడ్డాయి. కాణిపాకం వినాయక ఆలయ ప్రాంగణంలోనే వరదరాజ, మణికంఠేశ్వర, వీరాంజనేయ ఉపాలయాలు ఉన్నాయి. ముప్పయ్యేళ్లుగా ఈ ఆలయంలో భక్తులకు నిత్యాన్నదానం జరుగుతోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో వివాహం చేసుకోవడం శుభకరమని భక్తుల విశ్వాసం. ఇటీవలి కాలంలో ఇక్కడ వివాహాలు పెరుగుతున్నందున, దేవస్థానం నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ఏడు కళ్యాణ మండపాలను నిర్మించారు. (క్లిక్: అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా జరపుకోవాలి!) వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకునికి ఏటా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ ఏడాది ఆగస్టు 31న వినాయక చవితి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తర్వాత పన్నెండు రోజుల పాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని తర్వాత కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకునికి మాత్రమే స్వర్ణరథం ఉంది. -
రాములోరి కల్యాణానికి వేళాయె...
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసంత ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేక మహోత్సవం ఆలయం వద్ద ఉన్న మిథిలా స్టేడియంలో జరగనున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణాన్ని భారీ స్థాయి లో జరిపేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత ఆరు బయట కల్యాణోత్స వం జరగనుండటంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. కాగా, కల్యాణానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఒకవేళ సీఎం రాకపోతే ఆయన తరఫున కుటుంబసభ్యులు గానీ.. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని సమాచారం. అలాగే, జిల్లా ప్రజల తరఫున తాను స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పోచంపల్లి పట్టువస్త్రాలు ప్రత్యేకం రామయ్య కల్యాణానికి ఈ ఏడాది తొలిసారిగా పోచంపల్లి చేనేత కార్మికులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సికింద్రాబాద్‌లోని గణేశ్ టెంపుల్ చైర్మన్ జయరాజు ఆధ్వర్యం లో శనివారం ఈ పట్టు వస్త్రాలను రామాలయ ఈఓ శివాజీకి అందచేయనున్నారు. అలాగే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన భక్త బృందం గోటితో వొలిచిన 3 క్వింటాళ్ల తలంబ్రాలను సమర్పించారు. అంతేకాకుండా సీవీఆర్ వస్త్ర దుకాణం వారు స్వామి వారి ముత్యాల కొనుగోలుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. 11, 12 తేదీల్లో గవర్నర్ పర్యటన పాల్వంచ రూరల్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శ్రీరామనవమి మరుసటి రోజు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారికి నిర్వహించే మహా పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరవడం ఆనవాయితీ. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో గవర్నర్, 11న భద్రాచలం చేరుకుంటారు. సీతారామచంద్రస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, పట్టాభిషేకంలో పాల్గొంటారు. 12న దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో పర్యటిస్తారు. -
9న ఒంటిమిట్ట కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట(సిద్దవటం): ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఈనెల 9వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరగనుంది.10 తేదీన ఉదయం 8నుంచి 9 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం శేషవాహనం, 11న వేణుగాన అలంకారం, హంసవాహనం, 12న వటపత్రశాయి అలంకారం, సింహవాహనం, 13న నవనీత కృష్ణ అలంకారం, హనుమత్సేవ, 14న మోహినీ అలంకారం, గరుడసేవ, 15న శివధనుర్భాలంకారం, రాత్రి 8 గంటలకు శ్రీ సీతా రాముల కల్యాణం, గజవాహనం, 16న రథోత్సవం, 17న కాళీయమర్ధన అలంకారం, ఆశ్వవాహనం, 18న చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావ రోహణం, 19న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరగనున్నాయి. కల్యాణోత్సవానికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ కడప అర్బన్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్సోత్సవాల్లో భాంగా ఈనెల 15న నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి విచ్చేయనుండటంతో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధికసంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయపరిసరాలు, కల్యాణ వేదిక వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో ఏఆర్ డిఎస్పీ రమణయ్య, కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ బాలస్వామిరెడ్డి, ఎస్బి సీఐలు వెంకటకుమార్, రెడ్డెప్ప, ఆర్ఐ మహబూబ్‌బాషా, కడప ఒన్‌టౌన్ సీఐ టివి సత్యనారాయణ, అర్బన్ సీఐ ఎస్ఎం ఆలీ తదితరులు పాల్గొన్నారు -
పిడకల సమరంలో 50 మందికి గాయాలు
ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఆదివారం వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పిడకల సమరాన్ని (నుగ్గులాట) చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. అరగంట పాటు జరిగిన పిడకల సమరంలో సుమారు 50 మంది గాయపడ్డారు. వారందరికీ స్థానికంగా చికిత్స చేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
యాదాద్రిలో ఘనంగా ధ్వజారోహణం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపే ధ్వజారోహణాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట బ్రహ్మోత్సవాలకు వచ్చిన రుత్వికులకు ఆలయ ఈఓ గీతారెడ్డి, చైర్మన్ బి.నరసింహమూర్తి దీక్షా వస్త్రాలను సమర్పించారు. సుదర్శన మూలమంత్రం, లక్ష్మీ మూలమంత్రాలు, జపాలు, పారాయణాల అనంతరం స్వామివారిని వివిధ పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించి పురప్పాటు సేవలో బాలాలయంలో ఊరేగించారు. తెల్లని వస్త్రంపై స్వామివారి వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని వేసి స్వామి, అమ్మవార్ల ఎదుట ప్రత్యేక పూజలు చేశారు. ఆ శ్వేత వస్త్రాన్ని ధ్వజస్తంభానికి అలంకరించి గరుత్మంతుని ఆవాహన చేశారు. గరుత్మంతునికి నైవేద్యంగా గరుడ ముద్దలను నివేదన చేసి ధ్వజస్తంభం ముందు ఎగురవేశారు. ఈ ముద్దలను ప్రసాదంగా స్వీకరిస్తే సౌభాగ్యం, సంతానప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు తీసుకున్నారు. ఈ ప్రక్రియల అనంతరం బాలాలయంలో అగ్నిహోమం నిర్వహించారు. -
ప్రారంభమైన అఖండ జ్యోతి యాత్ర
యాదగిరిగుట్ట: ఈ నెల 4నుంచి ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో సిద్ధమైన స్వామి వారి అఖండజ్యోతి యాత్ర యాదగిరిభవన్ నుంచి మంగళవారం ప్రారంభమైంది. అఖండజ్యోతి యాత్రను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, అఖండజ్యోతియాత్ర చైర్మన్ ఎంఎస్ నాగరాజు, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ప్రారంభించారు. యాత్ర మొదటిరోజు ఉప్పల్ చౌరస్తాకు చేరుకుంది. బుధవారం ఉప్పల్ నుంచి బయల్దేరి శుక్రవారం ఉదయానికి భువనగిరికి, అక్కడి నుంచి రాత్రి యాదగిరిగుట్టకు చేరనుంది. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులకు అఖండజ్యోతిని అప్పగిస్తామని అఖండజ్యోతి చైర్మన్ నాగరాజు వెల్లడించారు. మరోవైపు ఈనెల 4నుంచి ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ (ఫోటోలు)
-
సర్వభూపాల వాహనంపై సర్వాంతర్యామి
-
ముత్యపు పందిరి వాహనంపై శ్రీనివాసుడు ఫొటోలు
-
సింహవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
-
కృష్ణుడి అలంకారమెత్తిన మలయప్ప ఫొటోలు
-
శ్రీవారి బ్రహ్మోత్సవ ధ్వజారోహణం ఫొటోలు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
-
కనుల పండువగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
-
మత్స్యావతారం పుష్పాలంకృతం
-
యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-
ఆది దంపతుల కల్యాణ మహోత్సవం
-
సూర్యప్రభ వాహనంపై కపిలేశ్వర స్వామి
-
శ్రీకపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-
ఉగాదికి ముందే పంచాంగం
సాక్షి, తిరుమల: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో కొలువుదీరిన కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 11, 25 తేదీల్లో వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ నెల 12, 26వ తేదీల్లో 5 సంవత్సరాల్లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనానికి అనుమతి కల్పిస్తాని పేర్కొన్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా సేవా టిక్కెట్లు పొందాలని సూచించారు. టీటీడీ వెబ్సైట్లో టికెట్లు లేనట్లయితే ఇతర సైట్లలో ఉన్న టికెట్లు నకిలీవిగా భావించాలని తెలిపారు హెచ్చరించారు. ఇక నకిలీ వెబ్సైట్లు నిర్వహిస్తున్న 19 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కాగా తెలుగు పండుగ ఉగాదిని పురస్కరించుకుని మార్చి మొదటి వారంలోనే భక్తులకు పంచాగాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. -
విశేష విహారి
-
నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
సాక్షి, కాణిపాకం(యాదమరి): లోకాలనేలే నాయకుడి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం పుణ్యక్షేత్రం ముస్తాబైంది. సోమవారం వినాయక చవితి నుంచి 21 రోజులు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఆలయాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. విద్యుత్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలు, అవసరమైన ప్రసాదాలను సిద్ధం చేశారు. ఆలయంలోని మూషిక, అన్వేటి, సుపథ మండపాలు, నవగ్రహ ఆలయం, అభయాంజనేయ స్వామి సన్నిధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన ద్వారం వద్దనున్న ధ్వజస్తంభాన్ని విదేశీ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలను శోభాయమానంగా అలం కరించారు. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఇస్తామని ఈఓ దేముళ్లు తెలిపారు. వినాయకా..భువికి దిగి రావయ్యా! కాణిపాకం (యాదమరి): వినాయకా!..భువికి దిగి రావయ్యా..అనే రీతిలో బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబైంది. భక్తులకు క్యూలు ఏర్పాటు చేశారు. భక్తుల కాలక్షేపానికి ఆస్థాన మండపంలో, వరసిద్ధుని అనుబంధ వరదరాజుల స్వామి ఆలయ ముందు ఏర్పాటు చేసి పందిట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రోజు ఉత్సవమూర్తుల ఊరేగింపులో మేళ తాళాలు, భజనలు, పిల్లన గోవి పాటలు, భక్తి గీతాలాపనలు ఏర్పాటు చేశారు. గణేష దీక్షధారుణ భక్తులు రోజూ రెండు పర్యాయాలు దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు సెల్ఫోన్లు భద్రపరచడానికి, పాదరక్షకులు పెట్టుకునేందుకు,వేర్వేరు ప్రాంతాలలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారిని ద ర్శనం చేసుకున్న భక్తులకు ఉచితంగా పులిహోర, చక్కెర పొంగలి పంపిణీ చేయనున్నారు. నేడు వరసిద్ధునికి పట్టువస్త్రాల సమర్పణ కాణిపాక శ్రీ వరసిద్ధునికి బ్రహ్మోత్సవాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదయం 9 గంటలకుకి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఈఓ దేముళ్లు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ శాఖామాత్యులు కె.నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం కాణిపాకం (యాదమరి): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి 21 రోజుల పాటు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కాణిపాక ఆలయ ఈవో దేముళ్లుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి : ఆలయ ఈఓగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఎలా ఉంది? ఈఓ: స్వామివారి బ్రహ్మోత్సవాల ముందు నేను ఇక్కడ ఈఓగా బాధ్యతలు స్వీకరించాను. పెద్ద బాధ్యతే ఇది. అందరి సహకారంతో విజయవంతం చేస్తాను. సాక్షి : భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈఓ: బ్రహ్మోత్సవాలలో రోజూ లక్ష మంది వరకు భక్తులు రావచ్చని అంచనా వేశాం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశాం. సాక్షి : ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈఓ: భక్తులకు అందుబాటులో రూ.100 గదుల 100 ఉన్నాయి. అలాగే ఏసీ రూమ్‌లు 80 ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి బస్సులలో వచ్చే యాత్రికులకు డార్మిటరీలు, కల్యాణ మండపాలు ఉన్నాయి. అలాగు బస్టాండ్ నుంచి ఆలయం వరకు ఉన్న మార్గంలో 270 వరకు బాత్రూమ్లు ఏర్పాటు చేశాం. సాక్షి : సామన్య భక్తులకు దర్శనం ఎలా కల్పిస్తారు? ఈఓ: బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నాం. ఉదయం 4.30 గంటల నుంచి స్వామి వారి దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. చవితి రోజున ఇంకా త్వరగా దర్శనం ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం. సాక్షి: వీఐపీలకు ఏ సమయంలో దర్శనం కల్పిస్తారు? ఈఓ: వీఐపీలకు ఉదయం 8 గంటల లోపు, రాత్రి 8 గంటల తరువాత దర్శనం కల్పించనున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్య సేవలు రద్దు చేస్తున్నాం. సాక్షి : భక్తులకు దర్శనాల ఏర్పాట్లు ఏమిటి? ఈఓ: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉచితం, రూ.10, రూ.51, రూ.100, ప్రముఖులకు వేర్వేరుగా దర్శనం క్యూలు ఏర్పాటు చేశాం. అలాగే చంటి పిల్లలకు, గర్భవతులకు, వృద్ధులకు ప్రత్యే క క్యూలను ఏర్పాటు చేశాం. క్యూలలో తాగునీటి వసతి కల్పించాం. ఫ్యాన్లు ఏర్పాటు చేశాం. సాక్షి : ప్రసాదాల మాటేమిటి? ఈఓ: భక్తులకు రూ.10 లడ్డూలు 80 వేలు, రూ.50 లడ్డూలు 15 వేలు, రూ.100 లడ్డూలు 10 వేలు , వడలు 5 వేల వరకు సిద్ధం చేశాం. సాక్షి : భక్తులను ఆకట్టుకునేలా ఏం చేశారు? ఈఓ: విద్యుద్దీపాలంకరణతో ఆలయానికి సరికొత్త శోభను తీసుకొచ్చాం. అలాగే ఆలయం అంతటా ప్రత్యేక పుష్పాలంకరణ చేస్తున్నాం. స్వామివారి బ్రహ్మోత్సవ విశేషాలు తెలిపే విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశాం. సాక్షి : భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారా? ఈఓ: భక్తులకు ఆలయ నిత్యాన్నదాన కేంద్రంలో రోజూ 3,500 మందికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజన వసతి కల్పిస్తాం. అలాగే 21 రోజుల పాటు నిరంతర అన్నదాన కమిటీ సభ్యులు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు అన్నదానం చేస్తారు. సాక్షి : బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక కార్యక్రమాలు? ఈఓ: ఈ ఏడాది నుంచి ఆలయంలో ప్రత్యేక పవిత్రోత్సవాలను నిర్వహించేందుకు శ్రీకారం చుడుతున్నాం, అలాగే వేద సభ నిర్వహించేం దుకు అర్చకులు, వేదపండితులను సంప్రదిస్తున్నాం. ఈ నెల 6న చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. భక్తు ల కాలక్షేపం కోసం ప్రతి రోజూ మధ్యాహ్నం హరికథ, సాయంత్రం భరతనాట్యం, కూచిపూడి, నృత్య ప్రదర్శనలు, రాత్రుల్లో నాటక ప్రదర్శనలు మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. -
గణ నాథుని బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబు
సాక్షి, కాణిపాకం(యాదమరి): సత్యప్రమాణాల దేవుడు..ప్రథమ పూజ్యడు అయిన శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబవుతోంది. సెప్టంబర్ 2వ తేదీ నుంచి 22వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారు వివిధ వాహనాలలో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయనున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. ఆలయం, ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ధ్వజారోహణం.. వినాయక చవితి మరుసటి రోజు ధ్వజారోహణంతో శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. స్వామివారి వాహనమైన మూషికచిత్రపటాన్ని ధ్వజస్తంభానికి ఆరోహణ చేసి ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవాలు నిర్వఘంగా జరిగేలా దేవతలు ఆశీర్వదించేలా పూజలు చేస్తారు. హంస వాహన సేవ.. మొదటి రోజు రాత్రి హంస వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. హంస వాహన సేవను తిలకిస్తే సద్గుణాలు అలవడుతాయని భక్తుల నమ్మకం. ఈ వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున హజరవుతారు. మయూర వాహన సేవ.. రెండవ రోజు మయూర(నెమలి) వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తారు. మనిషిలో మంచిని గుర్తించేందుకు ఈ వాహన సేవను చూసి తరలించాలని పురాణాలు చెబుతున్నాయి. మూషిక వాహన సేవ.. మూషికాశురుడిని స్వామి వారు వధించి, అతని కోరిక మేరకు మూషికాన్ని తన వాహనంగా చేసుకుంటారు. మూడోవ రోజు గణపయ్య మూషిక వాహనంపై దర్శనం ఇస్తారు. గర్వం తొలగిపోయేందుకు ఈ వాహన సేవను భక్తులు దర్శిస్తారు. శేష వాహన సేవ.. నాగలోకానికి అధిపతి నాగరాజు. అలాంటి శేషుడ్ని వాహనంగా చేసుకొని వినాయకుడు నాల్గువరోజు భక్తులకు దర్శనం ఇస్తారు. ఉత్సవాల్లో చిన్న, పెద్ద శేషవాహనాలపై స్వామివారు ఉదయం, రాత్రి వేళలో భక్తులకు దర్శనిమిస్తారు. వృషభ వాహన సేవ.. వృషభానికి అధిపతి శివుడు. ఐదో రోజు ఉత్సవంలో వినాయకుడు వృషభ వాహనంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహన సేవను తిలకిస్తే స్వామి వారి కరుణా కటాక్షాలతో పాటు శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. రథోత్సవం.. ఏడో రోజున స్వామివారు భక్తులకు రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రథంపై విహరించే స్వామివారిని దర్శిస్తే సకల దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. గజవాహన సేవ.. ఏనుగు తలను తన శిరస్సుగా మార్చుకున్న స్వామివారు ఆరో రోజు గజవాహనంపై కరుణిస్తారు. ఈ గజ వాహన సేవను దర్శిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అశ్వవాహన సేవ.. మూషికాశురుని సంహారం తర్వాత బ్రహ్మమానస పుత్రికలైన సిద్ధి, బుద్ధితో స్వామివారికి కల్యాణం జరుగుతుంది. అనంతరం స్వామి వారు స్వామివారు సిద్ధి,బుద్ధి సమేతంగా అశ్వవాహనంపై విహరిస్తు భక్తులకు దర్శనం ఇస్తారు. ఎనిమిదో రోజు అశ్వవాహన సేవ జరుగుతుంది. ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏకాంత సేవ.. బ్రహ్మోత్సవాలు పూర్తిఅయిన తర్వాత ధ్వజావరోహణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత స్వామివారి మూల విగ్రహానికి పాయసం, వడలతో అభిషేకం నిర్వహిస్తారు. దీనిని వడాయిత్తు ఉత్సవంగా అంటారు. అనంతరం స్వామివారికి ఏకాంత సేవను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల వివరాలు.. -2వ తేదీ వినాయక చవితి సందర్భంగా ఉదయం అభిషేకం, సాయంత్రం పుష్పకావళ్లు, రాత్రి గ్రామోత్సవం. -3వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం -4వ తేదీ రాత్రి నెమలి వాహనం -5వ తేదీ రాత్రి మూషిక వాహనం -6వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి బంగారు పెద్ద శేషవాహనం -7వ తేదీ ఉదయం చిలుక వాహనం, రాత్రి వృషభ వాహనం -8వ తేదీ రాత్రి గజ వాహనం -9వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం -10వ తేదీ ఉదయం భిక్షాండి, రాత్రి తిరుకళ్యాణం, అశ్వవాహనం -11వ తేదీ పగలు ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, రాత్రి ఏకాంత సేవ ప్రత్యేక ఉత్సవాలు.. -12వ తేదీ రాత్రి అధికార నంది వాహనం -13వ తేదీ రాత్రి రావణబ్రహ్మ వాహనం -14వ తేదీ రాత్రి సూర్యప్రభ వాహనం -15వ తేదీ చంద్రప్రభ వాహనం -16వ తేదీ రాత్రి యాళివాహనం -17వ తేదీ రాత్రి విమానోత్సవము -18వ తేదీ రాత్రి కల్పవృక్ష వాహనం -19వ తేదీ రాత్రి పూలంగి సేవ -20వ తేదీ రాత్రి కామధేను వాహనం -21వ తేదీ రాత్రి పుష్పపల్లకి సేవ -22వ తేదీ రాత్రి తెప్పోత్సవం భక్తులకు విస్తృత ఏర్పాట్లు.. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్వాగత ఆర్చీలు ఏర్పాటు చేశాం. రంగవల్లులు, విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దాం. క్యూల ఆధునీకరణ, పుష్పాలంకరణ, అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాం. –దేముళ్లు, ఈఓ కాణిపాం దేవస్థానం -
తిరుమలలో నాలుగో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఫోటోలు మీకోసం
-
తమిళంలో మహేష్ సినిమా
తమిళసినిమా: అనిరుధ్‌కు టైమ్ వచ్చింది. అనిరుధ్ అనగానే సంగీత దర్శకుడు అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. అనిరుధ్ పేరుతో చిత్రం రూపొందింది. ఈ చిత్ర విడుదలకు టైమ్ వచ్చింది. తెలుగులో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కథానాయకుడుగా నటించిన కలర్‌ఫుల్ భారీ చిత్రం బ్రహ్మోత్సవం. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత కథానాయికలుగా నటించిన ఇందులో సత్యరాజ్, జయసుధ, రేవతి భారీ తారాగణం నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనర్ సంస్థ సమర్పణలో స్వాతి, వర్షిణి భద్రకాళి ఫిలింస్ పతాకంపై భద్రకాళి ప్రసాద్ తమిళంలోకి అనిరుధ్ పేరుతో అనువదించారు. ఈయన ఇంతకుముందు సెల్వందన్, ప్రభాస్ బాహుబలి, ఇదుదాండా పోలీసు, మగధీర, బ్రూస్లీ, ఎవండు వంటి భారీ చిత్రాలను తమిళంలోకి అనువదించారు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనిరుధ్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 3న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబం, అనుబంధాల విలువలను ఆవిష్కరించే చిత్రంగా అనిరుధ్ ఉంటుందని తెలిపారు. చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందాయని, చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ఏఆర్కే రాజా అనువాద రచన చేసిన ఈ చిత్రానికి అడ్డాల వెంకటాద్రి, సత్యసీతలన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
వైభవంగా రామతీర్థం బ్రహ్మోత్సవాలు
-
త్యాగరాయనగర్‌లో బ్రహ్మోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: పచ్చటి పందిళ్లు, రంగుల రంగుల తోరణాలతో నాగోలు బండ్లగూడ త్యాగరాయ నగర్‌లోని శ్రీపద్మావతి, గోదాదేవి సమేత వెంకటేశ్వర ఆలయం ముస్తాబైంది. దేవస్థానంలో 21వ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 8న స్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించనున్నారు. అదే రోజు చెన్నైకి చెందిన దాసాన సంగీత కళాక్షేత్రం ఆధ్వర్యంలో సంగీత కచేరీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రఖ్యాత వాయిద్య కళాకారులను ఘనంగా సన్మానించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కెవి రమణాచారి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్‌తో పాటు పలువురు ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. -
శర్వా సినిమాతో రీలాంచ్
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఒక్క ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మాత్సవం సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ఇబ్బందుల్లో పడింది. బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్ తరువాత శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. అందుకే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రీలాంచ్ లా ప్లాన్ చేస్తున్నాడు ఈ యువ దర్శకుడు. 2016 తరువాత ఒక్క సినిమా కూడా చేయని శ్రీకాంత్ అడ్డాల లాంగ్ గ్యాప్ తరువాత ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించనున్నాడు. అన్నదమ్ముల కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో యంగ్ హీరో నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
సూర్యప్రభ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
-
సిరులతల్లీ పాహిమాం
-
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
కన్నుల పండువగా శ్రీవారి రథోత్సవం
-
పండగవేళ 28th September 2017
-
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
-
బ్రహ్మోత్సవాలపై సాక్షి 'ఫన్ డే'కు విశేష స్పందన
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అసలు చరిత్ర
-
వాహన సేవలు... వైభోగ బ్రహ్మోత్సవం
వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్ర శుభ ముహూర్తాన. అందుకే దసరా నవరాత్రులలో ఓ శుభముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు మొదలయ్యేవిధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అంకురార్పణతో ఆరంభం... వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్థనప్రదేశాల నుంచి మృత్తికను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మ్రిత్సవం గ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు) –నవధాన్యాలను పోసి, వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం బ్రహ్మాండనాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూత్నవస్త్రం మీద గరుడుని బొమ్మని చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతాడు స్వామి. చిన్నశేషవాహనం రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ‘ఆదిశేషుడి’గా, చిన్నశేషవాహనాన్ని ‘వాసుకి’గా భావించవచ్చు. హంసవాహనం రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంస వాహనాన్ని అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమ హంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉంది. కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారు. సింహవాహనం మూడోరోజు ఉదయం సింహ వాహనమెక్కి స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానే నంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. ముత్యపు పందిరి వాహనం మూడోరోజు రాత్రి శ్రీస్వామివారికి జరిగే సుకుమారసేవ ముత్యపు పందిరి వాహనం. ముక్తి సాధనకు మంచిముత్యం లాంటి స్వచ్ఛమెన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. ఈ విషయాన్ని తన భక్తకోటి గ్రహించాలనే స్వామివారు నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు. సర్వభూపాల వాహనం లోకంలోని భూపాలురు అంటే రాజులందరికీ భూపాలుడు తానేనని ప్రపంచానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ, సందర్శన భాగ్యం జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కరిస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహపరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. ఈ అవతార సందర్శనం వల్ల మాయామోహాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. గరుడవాహనం స్వామివారి వాహనం గరుత్మంతుడు. ఐదోరోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన గొడుగులను గరుడవాహనంలో అలంకరిస్తారు. హనుమంత వాహనం ఆరోరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతా యుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామి వారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు. గజ వాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగి పోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసార«థిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగడం ద్వారా సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. చంద్రప్రభ వాహనం ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని ఈ రెండు వాహనసేవల ద్వారా స్వామి లోకానికి తెలియజేస్తారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వార్‌కు వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు, దీర్ఘరోగాలు నశించి కష్టాలు తీరుతాయని విశ్వాసం. ధ్వజారోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతా మూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజ పటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. -
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: ఈఓ
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈఓ అనీల్ కుమార్ సింఘాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే రూ.9.50 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామన్నారు. బ్రహ్మోత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకుని గరుడసేవ నాడు(శనివారం) దివ్య దర్శనం రద్దు చేశామన్నారు. విఐపి దర్శనాలు ప్రొటోకాల్‌కు పరిమితం చేశామని వివరించారు. భక్తులకు వాహన సేవలతోపాటు, మూలవిరాట్ దర్శనం చేయిస్తామని తెలిపారు. గరుడసేవకు మాడవీధుల్లోని గ్యాలరీల్లో లక్షా 80వేల మంది భక్తులకు వాహన సేవలు తిలకించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో 30 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని, 2700 మంది పోలీసులు, 2 వేలమంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యిమంది స్కౌట్స్ , 5వేల మంది టీటీడీ ఉద్యోగులతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. భద్రతలో భాగంగా ఫిన్న్ సిస్టమ్, బాడీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. ఈనెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టత
-
బ్రహ్మోత్సవాలకు 7 లక్షల లడ్డూలు
తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. బ్రహ్మోత్సవానికి నాందిగా మంగళవారం కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించనున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవ పనుల కోసం రూ.8 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్ల ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయి. గోపురాలకు వెల్లవేశారు. తిరు వీధుల్లో రంగవల్లులు వేశారు. ఆలయానికి దేదీప్యమానంగా భారీ విద్యుత్ అలంకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈసారి ఎల్ఈడీ బల్పులతో సెట్టింగుల సంఖ్యను పెంచారు. బ్రహోత్సవాల్లో భక్తులకు అందించేందుకు 7 లక్షల లడ్డూలు సిద్దం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అన్ని విభాగాలు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రస్తుతం ఆలయంతో పాటు నిత్యాన్నప్రసాదం, కల్యాణకట్ట, ఇతర ముఖ్య కూడళ్లలో 650 పైచిలుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సుమారు 2,400 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, మరో 3 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. గరుడ సేవ రోజున అదనంగా మరో వెయ్యిమందిని నియమించనున్నారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులూ తిరుపతి, తిరుమల మధ్య రెండు ఘాట్ రోడ్లను 24 గంటలూ తెరిచి ఉంచి వాహనాలు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. 27వ తేదీ రాత్రి గరుడ వాహన సేవ నేపథ్యంలో 26న అర్థరాత్రి నుంచి 28 వరకు కొండపైకి ద్విచక్రవాహనాలకు అనుమతి రద్దు చేశారు. ప్రత్యేక ఆకర్షణ కానున్న శ్రీవారి సైకత శిల్పం బ్రహ్మోత్సవాల్లో భక్త కోటికి సైకత శిల్పం కనువిందు చేయనుంది. ఇక్కడి కల్యాణ వేదికలోని ఫల, పుష్ప ప్రదర్శన శాలలో ఈ సైకత శిల్పం దర్శనమివ్వనుంది. దశావతారాల్లోని మత్స్య(నృసింహ), వామన అవతారంలో ఏదో ఒక సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు సంకల్పించారు. -
23 నుండి తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ
-
బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు తిరుమల ముస్తాబు
-
సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
సెప్టెంబర్ 23 నుంచి బ్రహ్మోత్సవాలు
27న రాత్రి 7.30కి గరుడసేవ సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ సమాయత్తమవుతోంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్ల కల్పనపై మంగళవారం జేఈవో శ్రీనివాసరాజు టీటీడీ, విజిలెన్స్, పోలీసు విభాగాలతో సమావేశమై సమీక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 27వ తేది రాత్రి 7.30 గంటలకే శ్రీవారి గరుడవాహన సేవ ప్రారంభిస్తామని తెలిపారు. ఈసారి ఉత్సవాల్లో నాలుగో రోజు రాత్రి కొత్త సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామివారు ఊరేగనున్నారన్నారు. సెప్టెంబరు 6వ తేదీ పౌర్ణమి గరుడ వాహన సేవను మాదిరి బ్రహ్మోత్సవ గరుడవాహన సేవగా నిర్వహించి లోటుపాట్లు గుర్తించి, సవరిస్తామన్నారు. -
కల్యాణం..కమనీయం
మిడుతూరు: స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ నిర్వహణ అధికారి వీరయ్య , ఆలయ కమిటీ చైర్మన్ బన్నూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవానికి ఏర్పాట్లు చేశారు. వేదపండితులు సుబ్రమణ్యం శర్మ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల విగ్రహమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మ వార్లకు ఆలయ ఈవో పట్టు వస్త్రాలను సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కల్యాణ చెన్నకేశవుడికి సోమవారం ఉదయం శేషవాహన సేవ నిర్వమించారు. అర్చకులు వెంకటేశ్వర్లు, సహకార సొసైటీ అధ్యక్షుడు కాతా రమేష్‌రెడ్డి, గ్రామ పెద్దలు కాతా రామచంద్రారెడ్డి, కాతా నారాయణరెడ్డి, సర్వోత్తమరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నారాయణ పాల్గొన్నారు. -
శివధనుర్భాణాలంకారంలో కోదండరాముడు
– భక్తులతో పొటెత్తిన రామాలయం – ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శిధనుర్భాణాలంకారంలో ఒంటిమిట్ట కోదండరామడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివార్లు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. భజన బృందాలతో నృత్యాలు, కోలాటాలు మాఢవీధుల్లో అంగరంగవైభవంగా ఊరేగింపు కొనసాగింది. మరో వైపు భక్తులతో రామాలయం కిటకిటలాడింది. ఉదయం 4.30గంటల వరకు సుప్రభాతం, అనంతరం ఆలయశుద్ధి, ఆరాధన నిర్వహించారు. 7గంటల వరకు సర్వదర్శనం, ఆపై శుద్ధి, మొదటిగంట, మళ్లీ సర్వదర్శనం కల్పించారు. ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం..: కళ్యాణోత్సవం జరిగే ముందు రామాలయంలో ఎదుర్కొలు ఉత్సవం నిర్వహించారు. రామాలయంలోపలి ఉత్తరం వైపు మంటంపంలో సీతా, రామస్వామివార్లు ఎదురెదురుగా ఉంచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం చూడటానికిభక్తులు పోటీపడ్డారు. ఆలయ సంప్రదాయాల రీతిలో ఎదుర్కొలు ఉత్సవాన్ని తర తరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే రీతిలో సోమవారం రాత్రి కూడా ఎదుర్కోలు నిర్వహించారు. వైభవంగా తిరువంజనం..: ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కన్నులపండవుగా నిర్వహించారు. 11గంటల నుంచి 11.30గంటల వరకు శుద్ధి, రెండవగంట, 11.30గంటల నుంచి సాయంత్ర 6 వరకు సర్వదర్శనంకు అనుమతిచ్చారు. 5గంటల నుంచి 6గంటల వరకు కాంతకోరిక, 6గంటల నుంచి 2.30గంటల వరకు శుద్ధి, మూడవగంట మోగ్రించారు. -
భద్రాద్రిలో అంకురారోహణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవానికి శనివారం అంకురారోహణ వేడుక అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామి వారికి ఆలయం చుట్టు సేవ నిర్వహించిన అనంతరం బేడా మండపంలోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామి వారికి వేదస్వస్తి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. అనంతరం మూలవరుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకున్నారు. బేడా మండపంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం రామాలయంలోని యాగశాలలో మృత్సంగ్రహణం, వాస్తు హోమం వంటివి నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా జరిపే బ్రహ్మోత్సవాలలో పూజా కార్యక్రమాలను నిర్వహించే అర్చక స్వాములకు ఆలయ ఈవో రమేష్‌బాబు దీక్షా వస్త్రాలను అందజేశారు. వేడుకలో భాగంగా ఆదివారం ఆలయంలో ధ్వజపట భద్రక మండల లేఖన పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం దేవస్ధానం ఆధ్వర్యంలో స్ధానిక జీయర్ స్వామి మఠంలో ధ్వజపట భద్రక మండల లేఖన(గరుడ చిత్రం) పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం గరుడాదివాసం, రాత్రికి స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించిస్తారు. -
శోభాయమానం... శ్రీవారి తెప్పోత్సవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం క్షేత్రంలోని భూదేవి, లక్ష్మీసమేతుడైన శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం మంగళవారం వైభవంగా కొనసాగింది. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామి, అమ్మవారు సేద తీరేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దిగువ అహోబిలం దేవస్థాన పరిధిలో ఉన్న కోనేటిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ ప్రహ్లాదవరదస్వామి తెప్పను అధిరోహించి మూడు మార్లు ప్రదక్షణ చేశారు. అంతకు ముందు ఆలయం నుంచి ఉత్సవమూర్తులైన స్వామి, అమ్మవార్లను ప్రత్యేక పల్లకీపై మాడ వీధుల్లో ఊరేగింపుగా కోనేటి వరకు తీసుకొచా్చరు. స్వామి, అమ్మవారు తెప్పను అధిరోహించి పీఠాధిపతి శ్రీరంగనా«థ యతీంత్ర మహాదేశికన్, ఆలయ అర్చకులు, వేదపండితుల పూజలు అందుకున్నారు. సుమారు గంటపాటు తెప్పోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో కోనేరు వద్దకు చేరుకుని ఈ ఉత్సవాన్ని తిలకించారు. -
ఆధ్యాతిక పరవశం
కొనసాగుతున్న అహోబిలేశుడి బ్రహ్మోత్సవం – వేణుగోపాల స్వామి అలంకరణలో దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు -తరలివచ్చిన భక్తులు ఆళ్లగడ్డ: అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలు భక్తుల గోవిందా నామస్మరణ తో మార్మోగాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదరదస్వామి శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవతో స్వామిని మేలుకొలిపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. తర్వాత వేణుగాపాలస్వామిగా అలంకరించి వాహనంపై కూరొ్చబెట్టి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం అభిషేకం నిర్వహించారు. రాత్రి పొన్నచెట్టు వాహనం పై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. -
నమో నారసింహ
- నల్లమలలో మోరుమోగిన గోవింద నామస్మరణ - శేష వాహనంపై దర్శనమిచ్చిన జ్వాలనారసింహుడు - హనుమంత వాహనంపై ఊరేగిన ప్రహ్లాదవర స్వామి అహోబిలం(ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ విరజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలనృసింహస్వామి శేష వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలనృసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారు జామునే మేలుకొలుపు చేసి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్పాలంకరణ చేసి శేష వాహనంపై కొలువుంచి మంగళ వాయిద్యాల మధ్య భక్తి శ్రద్దలతో మాడ వీధుల్లో వైభవోపేతంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల్లో భాగంగా అభిషేకం, తిరుమంజనం నిర్వహించి భక్తుల దర్శనార్థం ప్రతేకంగా అలకంరించిన మండపంలో కొలువుంచారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారు శ్రీ యోగానృసింహ గారుడ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవ అనంతరం స్వామి అమ్మవార్లను మేలుకొలిపి శ్రీఘ్రదర్శనం అనంతరం అర్చనలు నిర్వహించి, నవకళశస్థాపన గావించిన అనంతరం జలాఅభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టువస్త్రాలు, మణి మానిక్యాల అభరణాలతో ప్రత్యేకంగా అలకంరించిన స్వామి అమ్మవార్లను శ్రీ యోగనృసింహ గరుడ విమాన వాహనంలో కొలువుంచారు. మంగళవాయిద్యాలతో వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. నేటి కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఉదయయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహణ సేవ ఉంటుంది. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ ప్రహ్లాదవరదుడు ఉదయం శేషవాహనంపై కొలువై దర్శనమిస్తారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు -
హంస వాహనంపై అహోబిలేశుడు
అహోబిలం (ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శనివారం.. శ్రీ జ్వాలా నరసింహస్వామి హంస వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామ స్మరణతో మాడా వీధుల్లో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలా నసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతేకంగా అలకంరించిన మండపంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తిరిగి రాత్రి సూర్యప్రభ వాహనముపై స్వామికి గ్రామోత్సవం నిర్వహిచారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు, మఠం ప్రతినిథి సంపత్ పాల్గొన్నారు. -
సకల దేవతలకు ఆహ్వానం
- అహోబిలంలో ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణం – గరుత్మంతునికి విశేష పూజలు అహోబిలం(ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శుక్రవారం..శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. అంతకు ముందు గరుత్మంతున్ని..పల్లకిలో కొలువుంచి ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. మొదటి జియర్ ఆదివన్ షఠకోపన్ ఉత్సవ విగ్రహం ఎదురుగా ఉంచి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశౠరు. శ్రీ జ్వాలా నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని, అమ్మవార్లను ఆశీర్వదించేందుకు వచ్చే ముక్కోటి దేవతలు, దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గరుత్మంతుడు కాపాలా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. -
యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో శ్రీకారం - 11 రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాలు యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలను విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఉత్సవమూర్తులకు అర్చకులు అభిషేకం, అర్చనలు గావించారు. ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి స్వామి, అమ్మవార్లకు ఎదురుగా ఉత్సవాలకు ఆద్యుడైన విష్వక్సేన ఆరాధన నిర్వహించారు. అనంతరం స్వస్తి వాచనం చేసి ఆలయ తిరువీధులు , గర్భాలయం, సంగీత భవనం తదితర ప్రాంతాలను శుద్ధ గంగాజలంతో సంప్రోక్షణ చేశారు. అంతకుముందు ప్రధానాలయంలోని స్వయంభూ మూర్తుల అనుమతిని తీసుకుని స్వామి, అమ్మవార్లకు కంకణధారణ చేశారు. అర్చకులు , వేద పండితులు, రుత్విక్కులకు దీక్షావస్త్రాలను సమ¯ర్పించారు. ఘనంగా అంకురార్పణ, మృత్సంగ్రహణం బ్రహ్మోత్సవాలకు కోసం సాయంకాలం మట్టి పాలికలలో నవధాన్యాలను నింపి అంకురార్పణ చేశారు. స్వామి, అమ్మవార్ల కళ్యాణ వేదికకు అవసరమయ్యే మట్టిని సేకరించే కార్యక్రమమైన మృత్సంగ్రహణంను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు ఉచితవైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. 4 నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూరి, ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగచార్యులు, సముద్రాల శ్రీనివాసాచార్యులు ఆలయ అధికారులు దోర్భల భాస్కరశర్మ, చంద్రశేఖర్, రామ్మెహన్‌రావు, మేడి శివకుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
మోహిని అవతారంలో ఊరేగిన శ్రీవారు
తిరుపతి: శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్సిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారు మోహిని అవతారంలో ఊరేగారు. సాయంత్రం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి వాహనంపై ఊరేగనున్నారు. గరుడ సేవ కోసం తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి మధ్యాహ్నం శోభాయాత్రగా బయలుదేరి వెంకన్నకు లక్ష్మీహారం సమర్పించనున్నారు. కాగా, భక్తుల గోవింద నామ స్మరణ మధ్య ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
శ్రీశైలంలో బ్రహ్మోత్సవ కళ
- శివదీక్ష శిబిరాలకు తరలివెళ్లిన ఉత్సవమూర్తులు - 21వరకు జ్యోతిర్ముడి స్వాములకు మల్లన్న స్పర్శదర్శనం శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలో్ల శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీశైలమల్లన్న దేవేరి భ్రామరితో కలిసి బుధవారం ఉదయం పల్లకీలో ఊరేగుతూ శివదీక్ష శిబిరాలకు తరలివెళ్లారు. ముందుగా శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో కూర్చోబెట్టి శాస్త్రోక్తపూజలు నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణానంతరం స్వామిఅమ్మవార్లను ప్రధాన పురవీధిగుండా ఊరేగిస్తూ శివదీక్ష శిబిరాలకు తీసుకెళ్లారు. స్వామివార్ల రాకతో దీక్ష శిబిరాలకు ఉత్సవ కళ వచ్చింది. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలను నిర్వహించి ఉత్సవమూర్తులను మండపంలో వేంచేయింపజేసి కర్పూర నీరాజనాలు అర్పించారు. అనంతరం శివదీక్ష స్వాములు ఇరుముడి ద్రవ్యాలను సమర్పించే హోమగుండానికి అగ్ని ప్రతిష్టాపన పూజలు చేసి వెలిగించారు. దీక్ష విరమణ చేసే భక్తులంతా శ్రీస్వామివారికి జ్యోతిర్ముడిని సమర్పించిన అనంతరం ఆవునెయ్యి, నారికేళం తదితర ద్రవ్యాలను హోమగుండంలో ఆహూతిగా సమర్పించారు. 21వరకు జ్యోతిర్ముడి స్వాములకు మల్లన్న స్పర్శదర్శనం జ్యోతిర్ముడితో వచ్చే శివస్వాములకు ఈ నెల 21 వరకు మల్లికార్జున స్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేక విధులపై సిబ్బందిని నియమించామని చెప్పారు. వేదపండితులు, దేవస్థానం ఆగమ పాఠశాల విద్యార్థులు, భక్తుల చేత జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం చేపడతారన్నారు. శివదీక్షా స్వాముల కోసం ఈ ఏడాది చంద్రావతి కల్యాణ మండపం నుంచి క్యూ ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. మార్చి 1 వరకు జ్యోతిర్ముడి సమర్పణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాయలసీమ జోన్ ఐజీ శ్రీధరరావు, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, పోలీస్ అధికారులు, దేవస్థానం సిబ్బంది, శివదీక్షా స్వాములు, భక్తులు పాల్గొన్నారు. -
శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
– ఫిబ్రవరి 17 నుంచి బ్రహ్మోత్సవాలు – భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు – అధికారులకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైల బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కోఆర్డినేషన్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ముందుగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి భరత్‌గుప్తా బ్రహోత్సవాలకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫిబ్రవరి 17 నుంచి 26వ తేదీ వరకు బ్రహోత్సవాలు జరుగుతాయని, 24న మహా శివరాత్రిని పురస్కరించుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతేడాది వరకు కల్యాణోత్సవాన్ని చంద్రావతి మండపంలో నిర్వహించామని, ఈ యేడాది నాగుల కట్ట లో జరిపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని, పారిశుద్ధ్య, తాగునీరు, మరుగుదొడ్లు, చలువ పందిళ్లు, భోజన సదుపాయాలపై దృష్టి సారించాలని వివరించారు. ఈ యేడాది ప్రయోగాత్మకంగా 13 జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎంపిక చేసిన భక్తులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీశైలంతో పాటు ఆత్మకూరు నుంచి దొర్నాల, అక్కడి నుంచి నుంచి శ్రీశైలం వరకు రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను ఈ నెల చివరికల్లా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికులకు సంఖ్యకు సరిపడే బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 21వ తేది ఉదయం నుంచి 27 వరకు స్పర్శ దర్శనాన్ని నిలుదల చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ..శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. సమావేశంలో జేసీ హరికిరణ్,, జేసీ–2 రామస్వామి, డీఆర్వో గంగాధర్ గౌడ్, ఆత్మకూరు డీఎఫ్ఓ సెల్వం, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో ధ్వజావరోహణ - చండీశ్వరునికి త్రిశూల స్నానం - నేడు స్వామివార్ల పుష్పోత్సవ, శయనోత్సవ సేవ శ్రీశైలం: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో ఈనెల 11 నుంచి పంచాహ్నిక దీక్షతో ప్రారంభమైన మకర సంక్రమణ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం పంచాహ్నిక దీక్షతో కొనసాగిన రుద్రయాగానికి యాగశాలలో పూర్ణాహుతి ద్రవ్యాలను సమర్పించడంతో యాగాలు ముగిశాయి. కార్యక్రమంలో ఈఓ నారాయణభరత్‌గుప్త, అర్చకులు, వేదపండితులు నారికేళం, వివిధ సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, నవధాన్యాలతో కూడిన పూర్ణాహుతి ద్రవ్యాలకు ప్రత్యేక పూజలను చేసి కర్పూర హారతితో హోమగుండానికి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చండీశ్వరపూజ, మండపారాధనలు, పంచావరణార్చన, జపానుష్ఠానము, కలశోద్వాసన చేశారు. చండీశ్వరున్ని పల్లకీలో ఊరేగిస్తూ వసంతోత్సవం నిర్వహించారు. మల్లికా గుండంలో త్రిశూల స్నానం, తీర్థప్రసాద వితరణలు జరిగాయి. అదేరోజు రాత్రి ఉత్సవాల ఆరంభంలో భాగంగా సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేసి ధ్వజారోహణ చేయడం తెల్సిందే. కాగా ఉత్సవ ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి.. గంటల తరువాత ధ్వజస్తంభంపై ఉన్న ధ్వజపటాన్ని అవరోహణ చేసి కిందకు దించారు. కార్యక్రమంలో ఏఈఓ కృష్ణారెడ్డి, సంబంధిత విభాగాధిపతులు, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు మల్లన్నకు పుష్పోత్సవ, శయనోత్సవ సేవ శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నిక దీక్షతో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. సంక్రాంతి పర్వదినాన వధూవరులైన పార్వతీదేవి, శ్రీ మల్లికార్జునస్వామివార్లకు మంగళవారం పుష్పోత్సవ, శయనోత్సవ సేవలను నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద నిర్వహించే ఈ కార్యక్రమంలో స్వామివార్లకు 11 రకాల పూలు, వివిధ రకాలైన పండ్లతో శాస్త్రోక్తంగా పుష్పోత్సవ, శయనోత్సవ సేవలను నిర్వహిస్తారని ఈఓ నారాయణభరత్‌గుప్త తెలిపారు. -
అంకురార్పణ
మల్లన్న సనిధిలో మకరసంక్రమణ మహోత్సవాలు · శాస్త్రోక్తంగా ఉత్సవపూజలకు అంకురార్పణ · సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ · నేటి నుంచి వాహనసేవలు శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మకరసంక్రమణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణం రుద్ర యాగశాలలో పంచాహ్నికదీక్షతో ఆరంభమైన ఈ ఉత్సవాల్లో దేవస్థానం ఈఓ నారాయణ భరత్‌గుప్త, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి గణపతిపూజ, కంకణ«పూజలు నిర్వహించారు. యాగశాలలో లోక కల్యాణం కోసం జరిగిన ఈ విశేషపూజల సందర్భంగా చండీశ్వరుడికి కంకణధారణ చేశారు. ఉత్సవాలో్ల పాల్గొనే వేదపండితులు, అర్చకులు భజంత్రీలకు, సంబంధిత ఆలయసిబ్బందికి దీక్షావస్త్రాలను ఈఓ అందజేశారు. ఆ తరువాత వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, పంచావరణార్చన, కలశస్థాపన నిర్వహించి అనుష్ఠానములు చేశారు. రాత్రి 8 గంటల నుంచి భేరిపూజ, భేరితాడన తో సకల దేవతాహ్వానా పూర్వక ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజ పటావిష్కరణ ః మకర సంక్రమణ మహోత్సవాలో్ల భాగంగా బుధవారం రాత్రి 8.15గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేశారు. దీనికి ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వేదమంత్రోచ్ఛారణలతో భేరి, సన్నాయిలకు వేదపండితులు, అర్చకులు పూజలు చేశారు. ధ్వజారోహణలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆధ్వర్యం వహించాల్సిందిగా బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు. పార్వతీమల్లికార్జునస్వామివార్ల కల్యాణంలో కన్యాదానం చేసేందుకు శ్రీ మహావిష్ణువును ఉత్సవాలకు రావాల్సిందిగా వేదమంత్రోచ్చారణలతో ఆహ్వానం పలికారు. పంచాహ్నికదీక్షతో వారం రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఏఈఓ కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు శ్రీహరి, దేవస్థానం వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
వాహనమే!
-
వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
-
వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
-
వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రెండోరోజు బ్రహ్మోత్సావాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తు లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ఉదయం తీర్థ బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం, ఉదయం ఆ రు గంటలకు సుప్రభాతసేవ, సభ్యుల గో త్రనామాలతో పూజలు నిత్యహోమాలు జరిగాయి. అనంతరం నివేదన, బలిహర ణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను వేదపండితులు వైఖానస యువబ్రహ్మ ఆగమ భాస్కర శ్రీ ఖండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు జరిపించారు. స్వామి వారి ఆలయంలో భక్తులకు ఆర్జిత సేవలు, అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం 9:30 గం టలకు స్వస్తివాచనం, విష్వక్సేనపూజ, పు ణ్యాహవచనం, సప్తకలశారాధన, ఉత్సవాంత స్నపనం, నిత్యహోమం, మహాసుదర్శన హోమం, విశేష అర్చన, బలిహరణ నీ రాణం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలాగే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన హంస, సింహవాహనంపై గ్రామంలో ఊరేగించారు. సా యంత్రం 5–30 గంటలకు స్వస్తివాచనము లు, నిత్యహోమాలు నిర్వహించి సాయంత్రం 7 గంటలకు స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించగా ఏ ర్పాట్లును ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షుకులు రాధకృష్ణా, సాయిరామ్ పర్యవేక్షించారు. నేటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామికి ప్రత్యేక పూజలతో పాటు విశేష నదీ జలంతో పూర్ణాభిషేకం, గరుడవాహన సేవ, స్వస్తి వాచనం, నిత్యహోమం, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం, పంచామృతమంటపారాధన, వసంతోత్సవం, నిత్యహోమం, పుష్పయాగం, నీరాజనం, బలిహరణ, హనుమద్వాహన సేవ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందకు ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో రమణమూర్తి తెలిపారు. -
కోర్కెలు ఠక్కున తీర్చే దేవుడాయన : బ్రహ్మానందం
► బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండం ► ∙సాక్షితో సినీ హాస్యనటుడు బ్రహ్మానందం తిరుపతి : ‘ఏటా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నిజం చెప్పాలంటే ఇంకా నాలుగు కళ్లు కావాలి. ఆ బ్రహ్మాండ నాయకుని వైభవం చూడాలంటే బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే. ఎంతో విశేషమైన గరుడోత్సవం రోజున స్వామి వారిని చూడాలని ఎన్నోసార్లు అనుకున్నా. ఏదీ ఎక్కడ సాధ్యమవుతుంది.? ఆ రోజొచ్చే సరికి ఏవో ఒక అత్యవసర పనులు. ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ ఆ అదృష్టం అందరికీ రాదు’ అని.. ప్రఖ్యాత సినీ హాస్యనటుడు కన్నెగంటి బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తిరుమలలో జరిగే స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, తిరుమల సందర్శన సందర్భంగా గతంలో ఆయన పొందిన అనుభూతుల గురించి ఫోన్లో ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘‘పూర్వం నెలకొకసారి చొప్పున ఏడాదికి పన్నెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవని విన్నా.. రానురాను అవి ఏడాదికోసారి జరిగే విశేషమైన ఉత్సవాలుగా మారాయి. ముక్కోటి దేవలందరూ చేరి బ్రహ్మాండనాయకుని ముక్తకంఠంతో స్తుతించి, వేడుకగా జరిపే ఉత్సవాలివి. భక్తులందరూ ప్రత్యక్షంగా వీక్షించాల్సిన అవసరం ఉంది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఒక్కో ఉత్సవంలో వేంకటేశుని దివ్వ తేజోమూర్తి వైభవం ఒక్కో విధంగా గోచరిస్తుంది. ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ వారి మది నిండా భక్తి పారవశ్యాన్ని నింపుతున్నారు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిదేవితో శ్రీనివాసుడి పెళ్లి జరిగింది. వేంకటాచల మహత్యం చదువుతుంటే ఆనాటి స్వామివారి పరిణయోత్సవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అన్నమయ్య, వెంగమాంబ వంటి పుణ్యమూర్తులు దేవదేవుడిని కీర్తించి చరితార్థులుగా మిగిలిపోయారు. సప్తగిరుల్లో కొలువైన వెంకన్నను దర్శించడం, లడ్డూ ప్రసాదాన్ని తినడం ఎప్పటికీ మరిచిపోలేని తీయటి అనుభూతి’ అన్నారు. చాలాసార్లు స్వామివారిని దర్శించా. కోరిన కోర్కెలు ఠక్కున తీర్చే దేవుడాయెన. అందుకే వీలు దొరికినప్పుడల్లా తిరుమల వెళ్లి వస్తుంటా. భక్తులకు నేను చెప్పేది ఒక్కటే.. భగవంతుడిని ఎలా ప్రార్థించినా, ఏ విధంగా ఆరాధించినా కరుణిస్తారు. కళ్లు మూసుకుని ఉంటే ధ్యానంలో దేవుడిని చూడు. కళ్లు తెర్చుకుని ఉంటే నీ ఊహల సృ జనాత్మకత లో ఆయన్ని చూడు. మనస్సు ప్రశాంత పడుతుంది’ అని కామెడీ లెజెండ్ బ్రహ్మానందం పేర్కొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్నీ రికార్డులే
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. శ్రీవారి దర్శనంతో పాటు అన్ని విభాగాల్లోనూ ఆదాయం గత ఏడాది కంటే ఈ సారి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. భక్తులకు ఆలయంలో మూలమూర్తి దర్శనం కల్పించటంతోపాటు హుండీ కానుకలు, లడ్డూ ప్రసాదాల అమ్మకం .. వంటి విభాగాల్లో భారీగా పెరుగదల కనిపించింది. విభాగం 2015 2016 పెరిగిన శాతం(%) మూలమూర్తి దర్శనం 5.75లక్షలు 7.99లక్షలు 38.85 శాతం హుండీ కానుకలు (రూ.) 17.37 కోట్లు 22.96 కోట్లు 32.20శాతం లడ్డూ ప్రసాదాల అమ్మకం 24.82లక్షలు 33.91 లక్షలు 36.63శాతం అన్నప్రసాదం 14.89 లక్షలు 24.59 లక్షలు 65.11శాతం తలనీలాలు 2.72 లక్షలు 3.83 లక్షలు 40.75శాతం రిసెప్షన్ ఆదాయం(రూ.) 1.44 కోట్లు 1.87 కోట్లు 29.59శాతం వైద్యసేవలుపొందిన భక్తులు 52,170 67,821 30 శాతం ప్రచురణల అమ్మకం(రూ.) 3.70లక్షలు 64.87 లక్షలు 16.53శాతం నీటి వినియోగం(లక్షల గ్యాలన్లు) 281.7 338.12 20.03శాతం తిరుపతి నుండి ఆర్టీసీ ప్రయాణికులు 3.75లక్షలు 4.98 లక్షలు 32.58శాతం తిరుమల నుండి ఆర్టీసీ ప్రయాణికులు4.95లక్షలు 6.95 లక్షలు 40.19శాతం -
స్వర్ణ రథంపై శ్రీవారి వైభవం
-
గరుడ వాహనంపై మలయప్పస్వామి
-
తిరుమలలో పోలీసుల ఓవరాక్షన్
తిరుమల: తిరుమలలో పోలీసుల అత్యుత్సాహం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాడవీధుల్లోకి భక్తులను అనుమతించకపోవడంతో.. పలు చోట్ల భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. భద్రత పేరుతో భక్తులను రింగ్ రోడ్డు చుట్టూ తిప్పుతూ.. ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సుమారు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు కనీసం నీరు కూడా అందించని టీటీడీ అధికారుల తీరుపై భక్తులు మండి పడుతున్నారు. సాయంత్రానికి మరో లక్షమందికి పైగా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. -
మూడో రోజు ఘనంగా బ్రహ్మోత్సవాలు
-
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ ఒక మోస్తరుగా ఉంది. మంగళవారం ఉదయానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి ఏడు గంటలు, కాలినడక భక్తులకు 5 గంటల్లో దర్శన భాగ్యం లభిస్తోంది. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లో పూర్తవుతోంది. -
తిరుమల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
-
బ్రహ్మోత్సవ బండి.. రాలేదండి
వ్యయప్రయాసలతో బస్సెక్కాల్సిందే ప్రత్యేక రైలు ప్రతిపాదనే రాలేదంటున్న రైల్వే టీడీపీ భాగస్వామ్య కేంద్ర సర్కారుకు పట్టని బ్రహ్మోత్సవ భక్తుల కష్టాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ ఏడాది కూడా ప్రత్యేక రైళ్లు లేవని తేలిపోయింది. ఏదైనా ప్రకటన వెలువడుతుందని చివరి వరకూ ఆశించిన వారికి భంగపాటే ఎదురైంది. తిరుమలలో ఏటా జరిగే ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఉత్సవాలను రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న కేంద్ర సర్కారు కాబట్టి తిరుమలకు ప్రాధాన్యత ఉంటుందనుకున్న భక్తులకు మొండిచేయి మిగిలింది. తిరుపతి అర్బన్: తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయలేదు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 13 జిల్లాల భక్తుల కోసమైనా ఏర్పాటు చేస్తారేమోనని ఆశించినా భంగపాటే ఎదురైంది. అత్యధిక భక్తుల తాకిడి ఉండే తమిళనాడు యాత్రికుల కోసమైనా ప్రత్యేక రైళ్లు , అదనపు బోగీల ఏర్పాటు జరుగుతుందని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం చెన్నై, కొయంబత్తూరు, వేలూరు నగరాలకు నడుస్తున్న ఒకట్రెండు రైళ్లు మినహా ఎక్కువ సంఖ్యలో రైళ్లు లేవు. బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేక రైళ్లు నడపాలనే డిమాండ్ ఉన్నా ఉన్నతాధికారులు స్పందించలేదు. బస్సుచార్జీలు రెండింతలు.. బ్రహ్మోత్సవాలకు తమిళనాడు, కర్ణాటక భక్తులు బస్సుల ద్వారా చేరుకోవాలంటే బస్సులకు ఎక్కువ మొత్తం చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఏటా రద్దీ ఉంటుంది. వారంతా బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఆదాయం సమకూర్చడంలో సికింద్రాబాద్ తరువాత తిరుపతిదే పైచేయి. ఏడాదికి సుమారు రూ.22కోట్లకు పైగా ఆదాయం తిరుపతి నుంచే వస్తున్నా ప్రాధాన్యం చూపడం లేదు. రైల్వేబోర్డు అధికారుల నుంచి జోనల్ అధికారుల వరకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 65 రైళ్లు.. 80వేల మంది యాత్రికులు తిరుపతి నుంచి, తిరుపతి మీదుగా రోజూ 60 నుంచి 65 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్ల ద్వారా సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 60 వేల మంది ప్రయాణిస్తారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భాల్లో ఈ సంఖ్య 80 వేలకు పైగా ఉంటుంది. అందులోనూ బ్రహ్మోత్సవాల్లో రోజుకు లక్ష దాటొచ్చని రైల్వే వర్గాలే చెబుతున్నాయి. భక్తుల్లో సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ర్ట, ఒడిశాకు చెందిన వారే ఎక్కువ గా ఉంటారు. హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో తిరుపతికి రైళ్లు లేవు. చెన్నై-తిరుపతి మధ్య సప్తగిరి, గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లు మూడు ట్రిప్పులు, 2 ప్యాసింజర్ రైళ్లు రెండు ట్రిప్పులు మాత్రమే నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి శేషాద్రి, హౌరా, ఇంటర్ సిటీ(వారంలో రెండు రోజులు మాత్రం) ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మైసూర్ ప్యాసింజర్ మాత్రమే నడుస్తోంది. ముంబై నుంచి కూడా రోజుకు 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే వస్తున్నాయి. 15 ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం బ్రహ్మోత్సవాలు, పెరటాసి నెల శనివారాల్లో తిరుమలకు వచ్చి వెళ్లేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నాం. రైళ్ల వసతి లేకపోవడం ప్రధాన కారణం. ప్రతిసారీ తమిళనాడు నుంచే ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. - మురుగేష్, ధర్మపురి, తమిళనాడు చార్జీలు భరించలేకున్నాం... బస్సు చార్జీలతో పోల్చుకుం టే రైలుచార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. విజయవా డ, వాణిజ్య రాజధాని విశాఖపట్నం నుంచి ఆశించిన స్థాయిలో బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించలేదు. దీంతో బస్సు చార్జీలను భరించలేక, స్వామివారి మొక్కు చెల్లిం చుకోవాలనే తపనతో అవస్థల ప్రయాణం చేస్తున్నాం. -మనోహర్, విజయవాడ అలాంటి ప్రతిపాదన లేదు బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు గతంలో కూడా లేవు. ఈసారి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సూచన మేరకు అవసరమైన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తాం. ఒక రైలుకు సరిపోయేంత రద్దీ ఎదురైతే ప్రత్యేక రైలును నడిపేం దుకు ఉన్నతాధికారుల ఉత్తర్వులతో చర్యలు తీసుకుంటాం. -కుప్పాల సత్యనారాయణ, సీనియర్ లైజన్ ఆఫీసర్, దక్షిణ మధ్య రైల్వే, తిరుపతి. -
బ్రహ్మోత్సవ బండి.. రాలేదండి
అవస్థలు పడుతున్నాం బ్రహ్మోత్సవాలు, పెరటాసి నెల శనివారాల్లో తిరుమలకు వచ్చి వెళ్లేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నాం. రైళ్ల వసతి లేకపోవడం ప్రధాన కారణం. ప్రతిసారీ తమిళనాడు నుంచే ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. - మురుగేష్, ధర్మపురి,తమిళనాడు చార్జీలు భరించలేకున్నాం... బస్సు చార్జీలతో పోల్చుకుంటే రైలుచార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. విజయవాడ, వాణిజ్య రాజధాని విశాఖపట్నం నుంచి ఆశించిన స్థాయిలో బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించలేదు. దీంతో బస్‌చార్జీలను భరించలేక, స్వామివారి మొక్కు చెల్లిం చుకోవాలనే తపనతో అవస్థల ప్రయాణం చేస్తున్నాం. -మనోహర్, విజయవాడ తిరుపతి అర్బన్: తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయలేదు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 13 జిల్లాల భక్తుల కోసమైనా ఏర్పాటు చేస్తారేమోనని ఆశించినా భంగపాటే ఎదురైంది. అత్యధిక భక్తుల తాకిడి ఉండే తమిళనాడు యాత్రికుల కోసమైనా ప్రత్యేక రైళ్లు , అదనపు బోగీల ఏర్పాటు జరుగుతుందని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం చెన్నై, కొయంబత్తూరు, వేలూరు నగరాలకు నడుస్తున్న ఒకట్రెండు రైళ్లు మినహా ఎక్కువ సంఖ్యలో రైళ్లు లేవు. బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేక రైళ్లు నడపాలనే డిమాండ్ ఉన్నా ఉన్నతాధికారులు స్పందించలేదు. బస్ చార్జీలు రెండింతలు.. బ్రహ్మోత్సవాలకు తమిళనాడు, కర్ణాటక భక్తులు బస్సుల ద్వారా చేరుకోవాలంటే బస్సులకు ఎక్కువ మొత్తం చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈరెండు రాష్ట్రాల నుంచి ఏటా రద్దీ ఉంటుంది. వారంతా బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఆదాయం సమకూర్చడంలో సికింద్రాబాద్ తరువాత తిరుపతిదే పైచేయి. ఏడాదికి సుమారు రూ.22కోట్లకు పైగా ఆదాయం తిరుపతి నుంచే వస్తున్నా ప్రాధాన్యత చూపడం లేదు. రైల్వేబోర్డు అధికారుల నుంచి జోనల్ అధికారుల వరకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 65 రైళ్లు.. 80 వేల మంది యాత్రికులు తిరుపతి నుంచి, తిరుపతి మీదుగా రోజూ 60 నుంచి 65 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్ల ద్వారా సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 60 వేల మంది ప్రయాణిస్తారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భాల్లో ఈసంఖ్య 80 వేలకు పైగా ఉంటుంది. అందులోనూ బ్రహ్మోత్సవాల్లో రోజుకు లక్ష దాటొచ్చని రైల్వే వర్గాలే చెబుతున్నాయి. భక్తుల్లో సరిహద్దురాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ర్ట, ఒడిస్సాకు చెందిన వారే ఎక్కువ గా ఉంటారు. హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో తిరుపతికి రైళ్లు లేవు. చెన్నై-తిరుపతి మధ్య సప్తగిరి, గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లు మూడు ట్రిప్పులు, 2 ప్యాసింజర్ రైళ్లు రెండు ట్రిప్పులు మాత్రమే నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి శేషాద్రి, హౌరా, ఇంటర్ సిటీ(వారంలో రెండు రోజులు మాత్రం) ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మైసూర్ ప్యాసింజర్ మాత్రమే నడుస్తోంది. ముంబై నుంచి కూడా రోజుకు 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే వస్తున్నాయి. అలాంటి ప్రతిపాదన లేదు బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు గతంలో కూడా లేవు. ఈసారి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సూచన మేరకు అవసరమైన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తాం. ఒక రైలుకు సరిపోయేంత రద్దీ ఎదురైతే ప్రత్యేక రైలును నడిపేందుకు ఉన్నతాధికారుల ఉత్తర్వులతో చర్యలు తీసుకుంటాం. -కుప్పాల సత్యనారాయణ, సీనియర్ లైజన్ ఆఫీసర్, దక్షిణ మధ్య రైల్వే, తిరుపతి. -
వెంకన్న బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ
సోమవారం ధ్వజారోహణం సాక్షి, తిరుమల: దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణ వైదిక కార్యక్రమంతో ఆరంభం కానున్నాయి. తిరుమలేశుని సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరుఫున ఆయన పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విష్వక్సేనుడు ఛత్రచామర మంగళవాయిద్యాలతో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించటం ఆలయ సంప్రదాయం. ఆలయంలో అంకురార్పణ వైదిక పూజలనంతరం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఎల్లుండి ధ్వజారోహణం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఆ తర్వాతే బ్రహ్మోత్సవాల వాహన సేవలకు నాంది పలుకుతారు. ప్రత్యేక ఆకర్షణగా మత్స్యావతార సైకత శిల్పం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇక్కడి కల్యాణవేదికలోని ఫల, పుష్ప ప్రదర్శన శాలలో మత్స్యావతార సైకత శిల్పం రూపుదిద్దుకుంటోంది. సుమారు ఏడు టన్నుల ఇసుకతో మైసూరుకు చెందిన సైకత శిల్ప నిపుణులు ఎంఎల్ గౌరి (25), నీలాంబిక (23)తో కలసి సైకత శిల్పాన్ని రూపొందించే ప్రక్రియ ప్రార ంభించారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
-
బ్రహ్మోత్సవాల్లో దాతలకే గదులు
సిఫారసులకు గదుల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్ రద్దు సాక్షి, తిరుమల: అక్టోబరు 3 నుంచి తిరుమలలో నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 5 రోజుల ముందుగానే సెల్ఫ్ డోనార్ స్లిప్పులు తిరుమలలోని రిసెప్షన్-1, ఉప కార్యనిర్వహణాధికారికి సమర్పించాలి. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రద్దీ కారణంగా 6, 7 తేదీల్లో దాతలకు కూడా గదులు కేటాయించడం లేదని తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా రద్దు : బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో గదుల అడ్వాన్స్ బుకింగ్‌ను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో సాంబశివరావు, నిర్ణయించారు. సిఫారసు లేఖలు కూడా మంజూరు రద్దు చేశారు. సిఫారసుల్లో కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే గదులు మంజూరు చేయనున్నారు. -
బ్రహ్మోత్సవాల దాతలకు మాత్రమే గదులు
- సిఫారసులకు గదుల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్ రద్దు - 6, 7 తేదీల్లో దాతలకు కూడా గదులు కేటాయించరు సాక్షి, తిరుమల అక్టోబరు 3 నుంచి తిరుమలలో నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు మంజూరు చేస్తామని ఆదివారం టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సిఫారసులకు గదులు కేటాయించరు. ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన దాతలకు రెండు గదులు రెండు రోజులపాటు కేటాయిస్తారు. ఒకే కాటేజీలో ఒక గదికి విరాళం ఇచ్చిన దాతలకు ఒక గది రెండురోజులపాటు కేటాయిస్తారు. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 5 రోజుల ముందుగానే సెల్ఫ్ డోనార్ స్లిప్పులు తిరుమలలోని రిసెప్షన్-1, ఉప కార్యనిర్వహణాధికారిని సమర్పించాలి. అయితే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రద్దీ కారణంగా 6, 7వ తేదీల్లో దాతలకు కూడా గదులు కేటాయించరని ఆ ప్రకటనలో తెలియజేసింది. దాతలు కూడా సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. గదుల అడ్వాన్స్ బుకింగ్ కూడా రద్దు బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో గదుల అడ్వాన్స్ బుకింగ్‌ను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నిర్ణయించారు. సిఫారసు లేఖలు కూడా మంజూరు రద్దు చేశారు. సిఫారసుల్లో కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే గదులు మంజూరు చేయనున్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరం
-
శ్రీవారికి ఏరువాడ పంచెలు సమర్పణ
తిరుమల: తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు శనివారం సమర్పించారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి చేనేత ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం సంప్రదాయంగా వస్తోంది. గద్వాల సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ తరుపున వారి ప్రతినిధి మహంకాళి కర్ణాకర్ వీటిని తిరుమలేశునికి కానుకగా సమర్పించారు. తొలుత ఆలయ పెద్ద జీయంగార్ వద్దకు తీసుకెళ్లి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. తర్వాత ఉదయం వేళ ఆలయంలో మూలమూర్తి ఎదుట అధికారులకు అందజేశారు. ఇదే సందర్భంగా గత ఏడాది సమర్పించి స్వామికి అలంకరించిన జోడు పంచెల్లో ఒకటి తిరిగి గద్వాల్ సంస్థానానికి పంపే ఆనవాయితీ ప్రకారం ఆలయ అధికారులు అమలు చేస్తూ ఒక పంచెను బహూకరించారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరం
-16న బ్రహ్మోత్సవ తరహాలో గరుడ సేవ, 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - సీసీ కెమెరాలతో నిఘా - రోజూ 7 లక్షల లడ్డూల నిల్వ సాక్షి,తిరుమల తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్టోబరు 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధానంగా శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో వాహన సేవలు తిలకించేలా భక్తులకోసం గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే తూర్పుమాడ వీధిలో దాదాపుగా ఈ పనులు పూర్తి చేశారు. దక్షిణ, పడమర,ఉత్తరమాడ వీధుల్లో కొనసాగుతున్నాయి. ఆలయంతోపాటు కూడళ్లలో భారీ కటౌట్లు ఏర్పాటు చసేందుకు విద్యుత్ అలంకరణ పనులు సాగుతున్నాయి. ఇక ఆలయ నాలుగు మాడ వీధులు రంగుల రంగవళ్లులతో శోభాయమానంగా కనిపిస్తున్నాయి. ఆలయానికి ఇప్పటికే తెల్లసున్నం అలంకరణ చేశారు. సీసీ కెమెరా నిఘా బ్రహ్మోత్సవాల భద్రత కోసం తిరుమలలోని టీటీడీ సీసీ కెమెరా, నిఘా వ్యవస్థతోపాటు అర్బన్‌జిల్లా పోలీసు విభాగాలు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాయి. ఇప్పటికే ఉత్సవాల భద్రతపై డీజీపీ సాంబశివరావు ఆదేశాలతో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకరరావు, తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్పి జయలక్ష్మి పలుమార్లు పర్యటించారు. రోజూ 3 వేల నుండి 3500 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో వెయ్యి మందిని రప్పించనున్నారు. వీటితోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆక్టోపస్, ఇతర నిఘా సంస్థల సిబ్బంది పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. రోజూ 7 లక్షల లడ్డూల నిల్వ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తరలివచ్చే భక్తుల కోసం రోజూ ఏడు లక్షల లడ్డూలు నిల్వ ఉండాలని టీటీడీ నిర్ణయించింది. వీటి తయారీకి కోసం అదనపు సిబ్బందిని నియమించారు. ఆలయంలోని ప్రధాన పోటు, అదనపు పోటుతోపాటు ఆలయం వెలుపల బూందీ పోటులోనూ తయారీ కోసం అదనపు ఏర్పాట్లు చేశారు. 16న బ్రహ్మోత్సవం తరహాలో గరుడోత్సవం ఈ 16వ తేదిన పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గరుడ సేవ ఊరేగింపులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిశీలించేందుకు పున్నమి గరుడ సేవను బ్రహ్మోత్సవం తరహాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇక 27న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. -
శ్రీకాళహస్తి విజ్ఞాన గిరిపై బ్రహ్మోత్సవం
-
కాజల్‌కు బాధ లేదట..!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. కెరీర్ ఇక ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో రెండు భారీ చిత్రాల్లో అవకాశం వచ్చినా ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ అమ్మడు హీరోయిన్గా నటించిన సర్థార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోతవ్సం సినిమాలు అభిమానులను నిరాశపరచటంతో టాలీవుడ్ కాజల్ కెరీర్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. అయితే ఈ రెండు సినిమాల రిజల్ట్ తనకు బాధ కలిగించలేదని చెపుతోంది ఈ బ్యూటి. ప్రస్తుతం తన బాలీవుడ్ సినిమా దో లఫ్జోంకీ కహాని ప్రమోషన్లో బిజీగా ఉన్న కాజల్, సర్థార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాల గురించి మీడియాతో మాట్లాడింది. ఆ రెండు సినిమాలు నేను ఇష్టంగా చేశాను. పవన్ లాంటి స్టార్ హీరో సరసన తొలి సారిగా నటించటం ఆనందంగా ఉంది. బ్రహ్మోత్సవం లాంటి భారీ చిత్రాల్లో అవకాశం రావటం అరుదు. అందుకే ఆ సినిమాల్లో నటించటం ఆనందంగా ఉంది.. అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం కాజల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కృష్ణవంశీ నక్షత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది. -
మరోసారి పోలీస్ పాత్రలో మహేష్?
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే పోకిరి, దూకుడు, ఆగడు చిత్రాల్లో పోలీస్ గెటప్‌లో ఇరగదీసిన రాజకుమారుడు... త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న మురుగదాస్ సినిమాలోనూ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. రా తరహా కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారి పాత్రలో మహేష్ కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. మురుగదాస్ టీంలో చాలాకాలంగా పనిచేస్తున్న ఆర్ట్ డైరెక్టర్ సునీల్, మహేష్ కోసం అద్భుతమైన సెట్స్ డిజైన్ చేస్తున్నాడట. ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్‌లో భారీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ సెట్ వేసే పనిలో ఉన్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇలా టాప్ టెక్నిషియన్స్ మహేష్ - మురుగదాస్‌ల సినిమా కోసం పనిచేస్తున్నారు. త్వరలోనే చిత్రయూనిట్ ముంబైలో సమావేశమై ప్రొడక్షన్ షెడ్యూల్‌ను ఫైనల్ చేయనున్నారు. బ్రహ్మోత్సవం రిలీజ్ తరువాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లిన మహేష్, తిరిగి రాగానే మురుగదాస్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. -
ఆ సినిమాలో బోర్ సీన్స్ తీసినందువల్ల..
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' ఫ్యాన్స్‌ను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. కాన్సెప్ట్ బావున్నా.. కథని తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడన్నది విశ్లేషకుల మాట. రకరకాల కామెంట్లతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాను ఏకిపారేస్తున్నారు. బ్రహ్మోత్సవం ఫలితం విషయంలో పూర్తిగా బాధ్యత తనదేనని, దర్శకుడిని ఎంచుకుంది తానేనంటూ మహేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు. అయితే తాజాగా ఓ గోడపై అంటించిన బ్రహ్మోత్సవం పోస్టర్ మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఆ పోస్టర్ ఎవరి పనో అంతుబట్టలేదుగానీ.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రిన్స్ ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతుంది. 'బోర్ సీన్స్ తీసినందువల్ల చూడదగ్గ కుటుంబ కథా చిత్రం' అని రాసున్న బ్రహ్మోత్సవం పోస్టర్ కడపలో దర్శనమిచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ ఎడిట్ చేసిన మాట నిజమేగానీ.. అయితే ఈ రకమైన ప్రచారం మాత్రం మహేష్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. -
బ్రహ్మోత్సవం రిజల్ట్కు కారణం అదేనా..?
సినీరంగంలో సెంటిమెంట్లను నమ్మేవాళ్లు చాలా ఎక్కువ. సూపర్ స్టార్లు కూడా ఈ సెంటిమెంట్ లకు అతీతులేం కాదు. అంతలా నమ్మటానికి ఇండస్ట్రీలో చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. తాజాగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం రిజల్ట్ విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంటే పని చేసిందంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా అభిమానులను అలరించలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి అనుకుంటాన్నారా..? గతంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన రెండు సినిమాలు మే నెలలో రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలో మహేష్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. ఒక్కడు లాంటి సూపర్ హిట్ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా నిజం, తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2003 మే 23న రిలీజ్ అయ్యింది. మహేష్ నటనకు మంచి మార్కులే పడినా... సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తరువాత మరోసారి నాని సినిమాతో మే నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చాడు మహేష్. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య మహేష్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మహేష్ సొంతం నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ సినిమా 2004 మే 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా ప్రిన్స్ అభిమానులను అలరించలేకపోయింది. ఆ తరువాత మే నెలలో మహేష్ నటించిన సినిమాలేవి రిలీజ్ కాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా మే 20న ఆడియన్స్ ముందుకు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా పై విమర్శలు వస్తుండటంతో మహేష్‌కు మే నెల అచ్చిరాదని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. -
అందుకే బ్రహ్మోత్సవం...ప్రతి హృదయాన్ని కదిలిస్తోంది
బాపుగారి బొమ్మని తలపించే అందం ప్రణీత సొంతం. అలాంటి అమ్మాయి లంగా, ఓణి, పరికిణీలతో కనిపిస్తూ బావా.. బావా అంటూ సందడి చేస్తే వెండితెరకి వచ్చే కళే వేరు. అందుకే ప్రణీతని దర్శకులు మరదలు పాత్రల్లో చూపించడానికి ఇష్టపడుతుంటారు. ‘బావ’ సినిమానే తీసుకోండి. అందులో ప్రణీత మరదలు పిల్లే. ‘అత్తారింటికి దారేది’లోనూ అంతే. పవన్‌కల్యాణ్‌కి మరదలే అవుతుంది. శుక్రవారం వచ్చిన ‘బ్రహ్మోత్సవం’లోనూ మహేశ్ మరదలిగా నటించింది. ఆ పాత్రల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రణీత సందడి చేస్తున్న విధానం కుర్రకారుకు భలే నచ్చుతోంది. ‘‘మరదలిగానే కావచ్చు గానీ ‘బ్రహ్మోత్సవం’లో నా పాత్ర కొత్త కోణంలో ఉంటుంది. ఇందులో భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆక ట్టుకొనే ప్రయత్నం చేశా’’ అంటున్న ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్ చాట్... ♦ నేను నటించిన మంచి చిత్రాల్లో ‘బ్రహ్మోత్సవం’ ఒకటి. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది. అందుకే ఈ కథ వినగానే నేను వెంటనే కనెక్ట్ అయిపోయా. పాత్రకి సంబంధించి కూడా ప్రతి అణువణువూ ఆస్వాదించా. ముఖ్యంగా నా పాత్ర తన మనసులోని భావోద్వేగాలను బయటపెట్టే విధానం స్వతహాగా నాకు భలే నచ్చింది. సినిమా పేరుకు తగ్గట్టుగానే సెట్లో ఉత్సవ వాతావరణం కనిపించేది. అందుకే షూటింగ్ జరుగుతున్నట్టు అనిపించేదే కాదు. మహేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక మంచి అనుభూతి. ఆయన సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా కనిపిస్తుంటారు. ఆయనతో షూటింగ్ అంటే బోల్డెంత ఫన్. ముఖ్యంగా మహేశ్‌తో కలిసి నేను చేసిన సన్నివేశాలు నాకు నటిగా మరింత సంతృప్తినిచ్చాయి. ఆస్వాదిస్తున్నారు కుటుంబం చుట్టూ సాగే కథ ‘బ్రహ్మోత్సవం. స్వతహాగా నాకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. కాబట్టి ప్రతి సన్నివేశంలోనూ నాకు నేను, నా కుటుంబం కనిపించేది. అందుకేనేమో ఏ దశలోనూ నేనేదో సినిమా చేస్తున్నట్టు, నటిస్తున్నట్టు అనిపించేది కాదు. ఇలాంటి నేపథ్యంతో కూడిన సినిమాల్లో నటించడమంటే చాలా ఇష్టం. భవిష్యత్తులోనూ కుటుంబ నేపథ్యంతో కూడిన సినిమాలు మరిన్ని చేస్తా. ‘బ్రహ్మోత్సవం’లో ప్రేక్షకుల్ని అలరించే అంశాలు భావోద్వేగాలే. ♦ ఇలాంటి చిత్రాలు ఎప్పుడో కానీ రావు. అందుకే ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో ముగ్గురు కథానాయిక లున్నప్పటికీ మా అందరి పాత్రలకీ సమ ప్రాధాన్యం దక్కింది. ప్రతి పాత్ర కూడా కథని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంటుంది. అందుకే ఇందులో కథానాయికలు ఎంత మంది అనే విషయాన్ని పట్టించుకోలేదు. సమంత, కాజల్‌లతో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది. -
బ్రహ్మోత్సవంలో అందం అదే!
ప్రేక్షకుల్లో మహేశ్‌పై ఉన్న అభిమానానికి ఆకాశమే హద్దు. చిన్నా పెద్దా... ఆడా.. మగా అనే తేడా లేకుండా మహేశ్‌ని అందరూ ఇష్టపడుతుంటారు. ఆ స్థాయిలో అభిమానులుంటే ఏ కథానాయకుడైనా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవాల్సిందే. వాళ్లని ఒప్పించేందుకని ఒక మూస సినిమాలకి పరిమితం కావాల్సిందే. కానీ మహేశ్ మాత్రం అందుకు భిన్నంగా తన కెరీర్‌ని బిల్డప్ చేసుకొన్నారు. అటు అభిమానుల్ని మెప్పిస్తూనే ఇటు కొత్త రకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. బాక్సాఫీసు దగ్గర కాసుల వర ్షం కురిపిస్తూనే... నటుడిగా తనని తాను సంతృప్తి పరుచుకుంటారు. ప్రతిసారీ ఆయన్నుంచి కొత్త రకమైన సినిమాలొస్తుంటాయి. వేరే ఏ స్టార్ కూడా చేయలేని కథల్లో ఆయన కనిపించి ఆశ్చర్యపరుస్తుంటారు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాలు చేసి సగటు ప్రేక్షకుడితో శభాష్ అనిపించుకొన్న మహేష్ తాజాగా ‘బ్రహ్మోత్సవం’ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్ తో ‘సాక్షి’ స్పెషల్ మీట్... ‘‘నేనెప్పుడూ ఏదీ ప్లాన్ చేసుకోను. ఇప్పుడొక మాస్ సినిమా చేశాను కాబట్టి, ఆ తర్వాత క్లాస్ లుక్‌లో కనిపించాలని లెక్కలేసుకొని సినిమా చేసే అలవాటు లేదు. ‘శ్రీమంతుడు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చేయడం కూడా అనుకోకుండానే జరిగింది. నా అదృష్టం కొద్దీ ‘శ్రీమంతుడు’ జరుగుతున్నప్పుడే శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ‘శ్రీమంతుడు’ లాంటి ఓ సోషల్ ఎలిమెంట్ ఉన్న సినిమా తర్వాత కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీతో కూడిన ‘బ్రహ్మోత్సవం’ చేయడం చాలా మంచిదైంది. ప్రేక్షకులు కంప్లీట్‌గా ఓ కొత్త సినిమాని చూస్తారు. నేను ఇప్పటిదాకా చేయనటువంటి కథ ఇది. అందరికీ నచ్చుతుంది కాబట్టి మళ్లీ మళ్లీ అందరూ కలిసి చూస్తారు. నటుడు ఎప్పుడూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకూడదు. నా అభిమానులు కూడా ఇలాగే కనిపించాలని ఎప్పుడూ చెప్పరు. వాళ్లకి మంచి సినిమా కావాలంతే. ఇటీవల నా నుంచి అన్నీ మంచి సినిమాలొస్తుండటంతో అభిమానులు కూడా చాలా హ్యాపీ’’. ‘‘కొన్ని కథలు ఏం కావాలో అవి సమకూర్చుకుంటాయట. ‘బ్రహ్మోత్సవం’ కథ కూడా అలా అన్నీ తనకి తానే సమకూర్చుకుంది. నిజానికి ఇది చాలా శ్రమతో కూడిన సినిమా. బోలెడు మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పని చేయాల్సి వచ్చింది. కానీ, ఈ కథని విన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఒప్పేసుకొని ఎవరికివాళ్లు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆ సహకారం తాలూకు ఎఫెక్టే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకి ప్రధాన అందం. శ్రీకాంత్ అడ్డాల గారి కథల్లో సోల్ ఉంటుంది. అదే నన్ను బాగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల్ని వాళ్ల వాళ్ల జీవితాల్లోకి తీసుకెళుతుందీ సినిమా. ఈ సినిమాలో నటిస్తూ నేను కూడా ఎన్నిసార్లు నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్లానో లెక్కే లేదు’’. అంతకంటే ఎక్కువ సంతృప్తి ‘‘అవకాశం వచ్చినప్పుడు ‘బ్రహ్మోత్సవం’ లాంటి కథల్ని ఏ కథానాయకుడూ వదులుకో కూడదు. ఈ చిత్రంతో నటుడిగా నేనెంత సంతృప్తి పొందానో, నిర్మాణ భాగస్వామిగా అంతకంటే ఎక్కువ సంతృప్తి పొందా. ఇలాంటి కథలతో భవిష్యత్తులోనూ నా ప్రయాణం కొనసాగుతుంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా నిర్మాణ వ్యవహారాన్ని, ప్రమోషన్ కార్యక్రమాల్ని నమ్రత పర్యవేక్షించింది. తనవల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి కథల్ని ఎంచుకొంటున్నా. తదుపరి మురుగదాస్ గారితో సినిమా చేయబోతున్నా. ‘గజిని’ చూసినప్పట్నుంచి ఆయనతో సినిమా చేయాలనుకొనేవాణ్ని. నా ‘ఒక్కడు’ చూసినప్పట్నుంచి ఆయన నాతో సినిమా చేయాలనుకొన్నారట. అలా మా ఇద్దరికీ ఇప్పుడు కుదిరింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా నా కెరీర్లో మరో మరపురాని చిత్రమవుతుంది’’. -
తన రికార్డులు తానే బ్రేక్ చేస్తున్నాడు
శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ సొంతం చేసుకున్న మహేష్ బాబు, తన తాజా చిత్రం బ్రహ్మోత్సవంతో తన రికార్డ్‌లు తానే బ్రేక్ చేయనున్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు రాజకుమారుడు. ఈ సినిమా రూ.85 కోట్లకు పైగా బిజినెస్ చేసేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ టాక్‌కు మరింత బలం చేకూరుస్తూ.., ఏ ఏ ఏరియాల్లో ఎంత బిజినెస్ చేసిందో లెక్కలతో సహా చెపుతున్నారు ఫ్యాన్స్. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ నెంబర్స్‌తో సూపర్ స్టార్ అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. బ్రహ్మోత్సవం రైట్స్ నైజాం ఏరియా 18 కోట్లు, సీడెడ్ 8.5 కోట్లు, ఆంధ్రా 25.5 కోట్లకు అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు కర్ణాటక హక్కులు 6.5 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలిపి 2 కోట్ల వరకు బిజినెస్ అయ్యింది. ఇక మహేష్ మార్కెట్‌కు కంచు కోట లాంటి ఓవర్సీస్లో బ్రహ్మోత్సవం రికార్డ్ స్థాయిలో 13 కోట్లకు అమ్ముడయ్యింది. ఈ మొత్తం 74 కోట్లుగా లెక్క తేలగా, శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 11 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. మొత్తంగా మహేష్, బ్రహ్మోత్సవం రిలీజ్‌కు ముందే 85 కోట్ల బిజినెస్ చేసి టాలీవుడ్ శ్రీమంతుడిగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. భారీ బడ్జెట్‌తో టాప్ కాస్టింగ్‌తో పీవీపీ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే రిలీజ్‌కు ముందే శ్రీమంతుడు సినిమాను మించి బిజినెస్ చేసిన బ్రహ్మోత్సవం, రిలీజ్ తరువాత కూడా శ్రీమంతుడు కలెక్షన్లు మించి సాధిస్తే గాని సినిమా హిట్ లిస్ట్‌లోకి చేరదు. మరి మహేష్ మరోసారి మ్యాజిక్ చేస్తాడో లేదో చూడాలి. -
సంతోషం మన మధ్యే ఉంది : శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. కుటుంబమంతా చూసి, ఆనందించే సినిమాలు తీస్తారాయన. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’... ఇలా శ్రీకాంత్ చేసినవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ని కూడా కుటుంబ సమేతంగా చూసే విధంగానే తెరకెక్కించారు. పీవీపీ పతాకంపై మహేశ్‌బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత ముఖ్య తారలుగా పీవీపీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విశేషాలు... ♦ మహేశ్‌బాబు నాకు రెండో సారి అవకాశం ఇవ్వడమే గొప్ప విషయం అనుకుంటున్నా. ఆయన దర్శకుల ఆర్టిస్ట్. ఈ చిత్రకథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ‘మనకెన్నో ఆలోచనలు ఉంటాయి. ఎన్నో లక్ష్యాలుంటాయి. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య మనం అనుకున్నది జరుగుతుందా? లేదా అన్నది ప్రతి ఒక్కరి టెన్షన్. మనుషుల మధ్య ప్రశాంతత లేకుండా పోతోందని ఎక్కడికో వెళిపోతాం. కానీ సంతోషం, ఆనందం, ప్రశాంతత మనుషుల మధ్య మాత్రమే దొరుకుతుంది’ అనే కథాంశంతో రూపొందించాం. ఈ పాయింట్ విన్న వెంటనే మహేశ్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదే ఈ సినిమా చేయడానికి కొండంత బలాన్నిచ్చింది. ♦ విజయవాడ నేపథ్యంలో సాగే అందమైన కుటుంబ కథా చిత్రమిది. ఓ సందర్భంలో కలుసుకున్న నాలుగైదు కుటుంబాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘బ్రహ్మోత్సవం’. నేనొకసారి ఓ చానల్ చూస్తున్నప్పుడు బ్రహ్మోత్సవం అనే పేరు కనబడింది. వెంటనే ఈ సినిమాకు టైటిల్ అదే అని ఫిక్స్ అయ్యాను. ఏడు తరాల కాన్సెప్ట్ అనేదే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే పాయింట్. దాని చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ♦ ఈ సినిమాలో ఎక్కువ మంది సీనియర్ నటీనటులతో పనిచేశాను. కాంబినేషన్ సీన్స్ కారణంగా కాల్షీట్లు దొరక్కపోవడంతో వాళ్ల కోసం ఎక్కువ సార్లు వెయిట్ చేశాను. అంతకు మించి నాకు ప్రత్యేకించి ఎప్పుడూ ఒత్తిడి అనిపించలేదు. ♦ సీనియర్ రచయిత గణేశ్ పాత్రో ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా కోసం ఎంతగానో నాకు హెల్ప్ చేశారు. అది నా స్థాయికి మించిన కథ. కానీ, ఆయన సహకారంతో ఆ సినిమా బాగా వచ్చింది. ‘ముకుంద’ షూటింగ్ టైమ్‌లోనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి చెప్పాను. గణేశ్ నాకు రెండు, మూడు పేజీల స్క్రీన్‌ప్లే కూడా రాసిచ్చారు. ఇప్పుడు ఆయన లేకపోవడం బాధాకరమైన విషయం. ♦ ఓ సన్నివేశంలో తండ్రి సత్యరాజ్ హడావిడిగా ఫంక్షన్‌కు వెళిపోతుంటే మహేశ్ పాత్ర ఆయన కాళ్లకు చెప్పులు తొడుగుతుంది. మామూలుగా ఏ హీరో అయినా అలా చేయడానికి కాస్త సందేహిస్తాడు. కానీ మహేశ్ ఆ సీన్లోని అంతరార్థాన్ని గ్రహించి వెంటనే ఒప్పుకున్నారు. అంతేగానీ యాడ్ కోసం ఆ సన్నివేశాన్ని చిత్రీకరించలేదు. ఆ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ♦ ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. నేను చాలా కథలు రాసుకున్నా. అయితే నెక్ట్స్ ఎలాంటి సినిమా తీస్తానో ఇప్పుడే చెప్పలేను. -
కాస్ట్యూమ్స్‌కే కోటి రూపాయలు..?
ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్‌గా ఉన్న మహేష్ బాబు లేటెస్ట్ సినిమా బ్రహ్మోత్సవంతో మరిన్ని రికార్డ్లను టార్గెట్ చేశాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ సొంతం చేసుకున్న మహేష్, తొలి రోజు హయ్యస్ట్ నెంబర్ షోస్‌తో మరో రికార్డ్ కు రెడీ అవుతున్నాడు. ఇలా సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న సూపర్ స్టార్, ఈ సినిమా మేకింగ్ విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. సాధారణంగా ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్‌కు 25 నుంచి 35 కాస్ట్యూమ్స్‌ను వినియోగిస్తారు. కానీ బ్రహ్మోత్సవం సినిమాలో మాత్రం మహేష్ ఏకంగా 100 రకాల కాస్ట్యూమ్స్‌లో కనిపించనున్నాడట. ఈ విషయాన్ని మహేష్ వ్యక్తిగత స్టైలిష్ట్ అక్షయ్ త్యాగి స్వయంగా తెలిపాడు. సింపుల్‌గా కనిపిస్తూనే మహేష్ గ్లామర్‌కు తగ్గట్టుగా కనిపించటం కోసం ఈ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. అంతేకాదు కేవలం మహేష్ వేసుకున్న దుస్తుల కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారన్న టాక్ వినిపిస్తోంది. -
మహేష్ కట్ చేయమన్నాడు
శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం టాలీవుడ్ వెండితెర మీద బ్రహ్మోత్సవానికి రెడీ అవుతున్నాడు. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల తన సినిమాల మేకింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న మహేష్, బ్రహ్మోత్సవం విషయంలో కూడా అదే కేర్ తీసుకుంటున్నాడు. సాధారణంగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కే సినిమాలు రెండున్నర గంటలకు పైగానే ఉంటాయి. భారీ కాస్టింగ్ ఉంటుంది కాబట్టి అందరికీ సరైన ఇంపార్టెన్స్ ఇవ్వటం కోసం లెంగ్త్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తారు చిత్రయూనిట్. అయితే బ్రహ్మోత్సవం విషయంలో మాత్రం మహేష్ అలా వద్దన్నాడట. ప్రస్తుతం ఆడియన్స్ మరీ ఎక్కువ సేపు థియేటర్లతో కూర్చునేందుకు ఆసక్తి చూపించటం లేదని, అందుకే ఈ సినిమాను 2 గంటల 20 నిమిషాలోనే ముగించేయాలని సూచించాడు. అందుకు అంగీకరించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొన్ని కామెడీ సీన్స్‌ను తగ్గించే ఆలోచనలో ఉన్నాడు. గతంలో శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబుల కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో కూడా మహేష్ ఇలాంటి సూచనలే చేశాడట. ఆ సినిమా రిజల్ట్ పాజిటివ్‌గా రావటంతో మరోసారి మహేష్ మాట విని సినిమా నిడివి తగ్గించారు. మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో చాలా మంది సీనియర్ నటులు కనిపించనున్నారు. -
అప్పుడు టెన్షన్... ఇప్పుడు కూల్!
మనకెంతో ఇచ్చిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం.. ఇది ‘శ్రీమంతుడు’ డైలాగ్. రీల్ కోసం ఈ డైలాగ్ మాట్లాడిన మహేశ్‌బాబు రియల్‌గా కూడా ఇదే పాటిస్తారు. తెరపై తనని చూసి, ఇష్టపడటంతో పాటు, తన సినిమాలను హిట్ చేస్తున్న ప్రేక్షకులకుమంచి సినిమాలు ఇవ్వాలనుకుంటారు. ‘శ్రీమంతుడు’ ఇచ్చారు. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ కూడా మంచి సినిమానే అంటున్నారు. వరుసగా మంచి సినిమాలిస్తే.. ఇక మహేశ్‌బాబు లావు ఎందుకు అవుతారు. ఈ హ్యాండ్సమ్ హీరోతో ‘సాక్షి’ స్పెషల్ టాక్... ♦ ‘బ్రహ్మోత్సవం’ కారణంగా వ్యక్తిగా ఎదిగానని ఆడియో ఫంక్షన్లో అన్నారు. ఒక సినిమా అంత ప్రభావితం చేస్తుందా? డెఫినెట్‌గా చేస్తుంది. ఎందుకంటే, ఒక సినిమాకి దాదాపు ఏడెనిమిది నెలలు పని చేస్తాం. ఆ ట్రావెల్లో ఆ సినిమాలో ఉన్న మంచి విషయాలు మనల్ని వెంటాడతాయి. శ్రీకాంత్‌గారి సినిమాల్లో చిన్న చిన్న విలువలు ఉంటాయి. అలాంటి చిన్న విలువలను మోడ్రన్ డే లైఫ్‌లో మనం మర్చిపోతుంటాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవి గుర్తొచ్చాయి. చూసే ప్రేక్షకులకు కూడా గుర్తొస్తాయి. ♦ మీకు గుర్తొచ్చిన రెండు, మూడు విషయాలను షేర్ చేసుకుంటారా? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెగ్యులర్‌గా లంచ్‌కి కలుస్తుంటాం. ఆ సమయంలో హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. ‘బ్రహ్మోత్సవం’లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అందరం కలిసి టూర్‌కి వెళతాం. ఆ టూర్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంజాయ్మెంట్లో ఒక పాట కూడా పాడుకుంటాం. రియల్ లైఫ్‌లో అలా పాటలు పాడుకోలేం కానీ, ఆ టూర్ తాలూకు సన్నివేశాలు చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా చాలా చాలా గుర్తొచ్చాయి. ♦ ‘శ్రీమంతుడు’ మంచి ఎమోషనల్ మూవీ... ‘బ్రహ్మోత్సవం’ కూడా అలానే ఉంటుందేమో అనిపిస్తోంది.. ‘శ్రీమంతుడు’ లార్జర్ దేన్ లైఫ్. అందుకు పూర్తిగా భిన్నంగా ఉండే సినిమా ‘బ్రహ్మోత్సవం’. ఏ సినిమా వేల్యూ దానికి ఉంటుంది. ‘శ్రీమంతుడు’తో దీనికి పోలిక లేదు. ♦ ‘శ్రీమంతుడు’తో మీ ఇమేజ్ ఒక్కసారిగా స్కై హై అయ్యింది.. దాంతో నెక్ట్స్ సినిమా ఏం చేయాలా? అనే భయం ఏర్పడిందా? ‘పోకిరి’ అప్పుడు భయం వేసింది. మళ్లీ నెక్ట్స్ సినిమా ఏంటి? అని. అప్పుడు నా వయసూ తక్కువ. కెరీర్ వయసూ తక్కువే. దాంతో కొంచెం టెన్షన్ అనిపించింది. ‘శ్రీమంతుడు’ తర్వాత భయం అనిపించలేదు. వ్యక్తిగా, నటుడిగా పరిణతి వచ్చింది. జెన్యూన్‌గా చేసిన సినిమా అందరి కితాబులు అందుకున్నందుకు హ్యాపీ అనిపించింది. ‘శ్రీమంతుడు’ తర్వాతి సినిమా ఏంటి? అని ఆలోచించాను. కాన్సన్ట్రేషన్ ‘బ్రహ్మోత్సవం’ పై పెట్టా. టెన్షన్ పడకుండా కూల్‌గా చేశా. ♦ ‘శ్రీమంతుడు’ అందరి హార్ట్‌ని టచ్ చేసింది కాబట్టి, మళ్లీ అలానే అవ్వాలని ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని కావాలనే అంగీకరించారా? ‘శ్రీమంతుడు’ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే చెప్పారు. ఆయన కథలు రియలిస్టిక్‌గా ఉంటాయి. అలా ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథతో నేను సినిమా చేయలేదు. ♦ వసూళ్ల పరంగా ‘శ్రీమంతుడు’ని ‘బ్రహ్మోత్సవం’ దాటేస్తుందనిపిస్తోందా? అసలు వసూళ్ల గురించి నేను ఆలోచించలేదు. అది మన చేతుల్లో లేదు. మన బాధ్యత అంతా మంచి సినిమా చేయడం వరకే. కష్టపడి చేయాలి. మిగతాదంతా ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ♦ టాలీవుడ్లో నంబర్ వన్ ప్లేస్‌కి సంబంధించిన స్పేస్ అలా ఉండిపోయింది. కొంతమంది మీరే ‘నంబర్ వన్’ అంటారు.. లేదండి. నేను దాని గురించి ఆలోచించను. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు నాకు ముఖ్యం. నా సినిమాలను వాళ్లు ఆదరిస్తే ఆనందపడతాను. వాళ్లకు గ్రేట్‌ఫుల్‌గా ఉండాలనుకుంటాను. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు చేయాలని అనుకుంటాను. నా దృష్టంతా ఎప్పుడూ మంచి సినిమా మీదే ఉంటుంది. నంబర్ మీద ఉండదు. ♦ ఈ మధ్య సొంతూరు బుర్రిపాలెం వెళ్లారు.. అంతకుముందెప్పుడు వెళ్లారు? నా మొదటి సినిమా ‘రాజకుమారుడు’కి వెళ్లాను. ఆ తర్వాత ఇదే వెళ్లడం. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వెళ్లినప్పటికీ ప్రజలు రిసీవ్ చేసుకున్న విధానం ఆశ్చర్యపరిచింది. ఎండని లెక్క చేయకుండా పిల్లలు, పెద్దవాళ్లందరూ నన్ను చూడ్డానికి గంటలు గంటలు నిలబడటం ఏదో చెప్పలేని ఫీలింగ్‌ని కలిగించింది. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ♦ సెలబ్రిటీలు మనుషులే అయినప్పటికీ మిమ్మల్ని చూడ్డానికి మిగతా మనుషులు వెయిట్ చేస్తుంటారు ? ఆ సమయంలో ఓ స్టార్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ‘దటీజ్ ది పవర్ ఆఫ్ సినిమా’. సినిమా ఆర్టిస్ట్ కావడం నా లక్. నిజంగానే మాతో ప్రేక్షకులకు ఏ బంధమూ ఉండదు. కానీ, విపరీతంగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ చూసినప్పుడు బాధ్యత బాగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. మంచి సినిమా చేసి, వాళ్లని ఆనందపరచాలనిపిస్తుంది. ♦ వ్యక్తిగా, నటుడిగా మీ నాన్నగారు సాధించిన దాంట్లో మీరెంత ఎచీవ్ చేశారనుకుంటున్నారు? నాన్నగారితో పోలికా? ‘హీ ఈజ్ గ్రేట్’. అందుకే నాన్నగారి చేసినదాంట్లో మనం ఎంత చేశాం? అని ఎప్పుడూ ఆలోచించలేదు. బట్.. నా కెరీర్ ప్రోగ్రెస్ అవుతున్న విధానం చూసి, ఆయన చాలా ఆనందపడతారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ♦ ఈ మధ్య ఓ ఫుట్‌బాల్ ట్రైనర్ ట్రైనప్ అయినట్లుగా అయ్యారట. రోజు రోజుకీ యంగ్‌గా కనిపించడానికి అదే రీజనా? బేసిక్‌గా నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. కొత్త కొత్త ఎక్స్ర్సైజులు ట్రై చేస్తుంటాను. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’కి అనే కాదు.. ‘శ్రీమంతుడు’ అప్పుడు కూడా వర్కవుట్స్ చేశాను. ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ♦ హ్యాండ్సమ్గా పుట్టినందుకు ఆ దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పుకున్నారా? యస్.. ఐయామ్ వెరీ మచ్ బ్లెస్డ్. గాడ్కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. నాకూ, నా సిస్టర్, బ్రదర్.. అందరికీ నాన్నగారి జీన్స్ వచ్చింది. నేను నాన్నగారిలా ఉంటాను. ♦ మీ మేనరిజమ్స్‌లో మీ అబ్బాయి గౌతమ్ ఫాలో అయ్యేవి... తల్లిదండ్రుల దగ్గర్నుంచి పిల్లలకు కొన్ని మేనరిజమ్స్ వస్తాయి. నేను ఒక రకంగా నవ్వుతాను. గౌతమ్ నవ్వు అచ్చంగా అలానే ఉంటుంది. నేను మాట్లాడేటప్పుడు చేతులు ఎలా ఊపుతానో గౌతమ్ కూడా అంతే. గౌతమ్ ఎక్కువగా నాన్నగారిలా ఉంటాడు. ♦ ఎక్కువగా హాలిడే ట్రిప్స్ వెళుతుంటారు.. ఆ ప్లేసెస్‌ని ఎవరు సెలక్ట్ చేస్తారు? పిల్లలే అడుగుతారు. ముఖ్యంగా గౌతమ్.. ‘ఆ ప్లేస్’కి వెళదాం అని సెలక్ట్ చేస్తాడు. వాళ్ల ఇష్టానికి తగ్గట్టే హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటాం. ♦ చదువులో మీ పిల్లలు మీకన్నా బెటరా? మీరే బాగా చదివేవారా? నేను బ్యాడ్ స్టూడెంట్‌ని కాదు. కానీ, నా పిల్లలు నాకన్నా బాగానే చదువుతారని చెప్పొచ్చు. ♦ చదువు విషయంలో ఒత్తిడి చేస్తుంటారా? అస్సలు లేదు. ఎందుకంటే పదేళ్ల లోపు పిల్లలను జడ్జ్ చేయకూడదు. చిన్నప్పుడు బాగా చదవకపోతే పెద్దయ్యాక కూడా చదవరనీ, చిన్నప్పుడు బాగా చదివితే పెద్దయ్యాక కూడా చదువుతారనీ అనలేం. పిల్లల్ని జస్ట్ వాళ్ల లైఫ్ వాళ్లని ఎంజాయ్ చేయనివ్వాలి.రేవతి, సత్యరాజ్, మహేశ్‌బాబు, రజిత, ఈశ్వరీ రావ్, జయసుధ ♦ మూడు చక్రాల బుల్లెట్‌కి ఇన్స్పిరేషన్ అదే! ‘‘ప్రతి ఊరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అలా ఓ ఊరిలో జరిగిన బ్రహ్మోత్సవాలను తీసుకొని మా ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తెరకెక్కించాం. కుటుంబంతో కలిసి సంతోషంగా చూసేలా తీర్చిదిద్దాం’’ అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ చిత్రం గురించి శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ - ‘‘కుటుంబ కథా చిత్రమిది. అందులోనే లవ్‌స్టోరీ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ గురించి చూపించాం. రాజస్థాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్ర టూరిజం వాళ్ల వద్ద మూడు చక్రాల బుల్లెట్ ఉండేది. చూసేందుకు డిఫరెంట్‌గా ఉండటంతో బాగుంటుందనిపించి, అలాంటి వెహికల్ తయారు చేయించాం. హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులందరితో తీసిన ‘సంగీత్’ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. మా చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ♦ ‘24’ సినిమా మీదాకా వచ్చింది కదా.. ఎందుకు అంగీకరించలేదు? ఆ సినిమా సూర్యగారు మాత్రమే చేయగలరని నా ఫీలింగ్. ఎవరెవరికి ఏది సూట్ అవుతుందో తెలుసుకోవాలి. నేను ‘24’ చేయలేను. అలాగే, ‘శ్రీమంతుడు’ క్యారెక్టర్ నాకు బాగా సూట్ అవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికే సూట్ అవుతాయి. ప్రతి యాక్టర్‌కి ఒక్కో సినిమా అలా ఉండిపోతుంది. ♦ మీ ‘ఎంబి కార్పొరేషన్’పై తీసిన మొదటి సినిమా ‘శ్రీమంతుడు’ మంచి సక్సెస్‌నిచ్చింది. ఇప్పుడు రెండో సినిమాకి కూడా ఓ నిర్మాతగా చేశారు కదా.. ప్రతి సినిమాకీ అలా చేస్తారా? అలా ఏం లేదు. డెఫినెట్‌గా నేను నమ్మిన సినిమాలకు నేను అసోసియేట్ అవుతాను. నమ్మనంత మాత్రాన అది బ్యాడ్ మూవీ అనలేం. కథ విన్నప్పుడు ఎక్కడో కనెక్ట్ అయిపోతాం. ‘బ్రహ్మోత్సవం’ నచ్చింది. అందుకే అసోసియేట్ అయ్యాను. ♦ ప్రొడక్షన్ చూసుకోవడం ఇబ్బందిగా అనిపించిందా? నేనా సైడ్ పట్టించుకోను. వేరే టీమ్ చూసుకుంటారు. పీవీపీగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కూడా కథని నమ్మారు. ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ పెట్టారు. ఆయనలాంటి నిర్మాత లేకపోతే ఇలాంటి మంచి సినిమాలు రావు. ♦ ఫైనల్లీ మీ తదుపరి సినిమా గురించి? తెలుగు, తమిళ భాషల్లో మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. ఇప్పట్నుంచీ ఓ పదిహేను, ఇరవై రోజులు బ్రేక్ తీసుకుని, ఆ తర్వాత ఆ సినిమాలో బిజీ అయిపోతా. - డి.జి. భవాని -
సూపర్ హీరో పాత్రలో నటిస్తా: మహేష్ బాబు
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రహ్మోత్సవం. పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా నిర్వహిస్తున్నారు. మహేష్ కూడా గతంలో ఎన్నడూ లేనీ విధంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్, తనకు హల్క్ లాంటి సూపర్ హీరో పాత్రలంటే ఇష్టమని తెలిపాడు. అంతేకాదు అలాంటి పాత్ర వస్తే చేయడానికి ఎప్పుడూ రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. అలాగే హాలీవుడ్ చిత్రాల్లో అవెంజర్స్ సినిమా చూడటానికి ఇష్టపడతానని, తన పిల్లలతో కలిసి ఇప్పటికే చాలా సార్లు ఆ సినిమా చూసినట్టుగా వివరించాడు.