తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు శనివారం సమర్పించారు.
శ్రీవారికి ఏరువాడ పంచెలు సమర్పణ
Published Sat, Sep 10 2016 6:06 PM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM
తిరుమల: తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు శనివారం సమర్పించారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి చేనేత ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం సంప్రదాయంగా వస్తోంది. గద్వాల సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ తరుపున వారి ప్రతినిధి మహంకాళి కర్ణాకర్ వీటిని తిరుమలేశునికి కానుకగా సమర్పించారు. తొలుత ఆలయ పెద్ద జీయంగార్ వద్దకు తీసుకెళ్లి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. తర్వాత ఉదయం వేళ ఆలయంలో మూలమూర్తి ఎదుట అధికారులకు అందజేశారు. ఇదే సందర్భంగా గత ఏడాది సమర్పించి స్వామికి అలంకరించిన జోడు పంచెల్లో ఒకటి తిరిగి గద్వాల్ సంస్థానానికి పంపే ఆనవాయితీ ప్రకారం ఆలయ అధికారులు అమలు చేస్తూ ఒక పంచెను బహూకరించారు.
Advertisement
Advertisement