కల్యాణం..కమనీయం | glorious lakshmi chennakeshava kalyanam | Sakshi
Sakshi News home page

కల్యాణం..కమనీయం

Published Mon, May 8 2017 9:59 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

కల్యాణం..కమనీయం

కల్యాణం..కమనీయం

స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు.

మిడుతూరు: స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ నిర్వహణ అధికారి వీరయ్య , ఆలయ కమిటీ చైర్మన్‌ బన్నూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవానికి ఏర్పాట్లు చేశారు. వేదపండితులు సుబ్రమణ్యం శర్మ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల విగ్రహమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మ వార్లకు ఆలయ ఈవో పట్టు వస్త్రాలను సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కల్యాణ చెన్నకేశవుడికి సోమవారం ఉదయం శేషవాహన సేవ నిర్వమించారు. అర్చకులు వెంకటేశ్వర్లు, సహకార సొసైటీ అధ్యక్షుడు కాతా రమేష్‌రెడ్డి, గ్రామ పెద్దలు కాతా రామచంద్రారెడ్డి, కాతా నారాయణరెడ్డి, సర్వోత్తమరెడ్డి,  ఎంపీటీసీ సభ్యుడు నారాయణ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement