శివధనుర్భాణాలంకారంలో కోదండరాముడు
– భక్తులతో పొటెత్తిన రామాలయం
– ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శిధనుర్భాణాలంకారంలో ఒంటిమిట్ట కోదండరామడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివార్లు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. భజన బృందాలతో నృత్యాలు, కోలాటాలు మాఢవీధుల్లో అంగరంగవైభవంగా ఊరేగింపు కొనసాగింది. మరో వైపు భక్తులతో రామాలయం కిటకిటలాడింది. ఉదయం 4.30గంటల వరకు సుప్రభాతం, అనంతరం ఆలయశుద్ధి, ఆరాధన నిర్వహించారు. 7గంటల వరకు సర్వదర్శనం, ఆపై శుద్ధి, మొదటిగంట, మళ్లీ సర్వదర్శనం కల్పించారు.
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం..: కళ్యాణోత్సవం జరిగే ముందు రామాలయంలో ఎదుర్కొలు ఉత్సవం నిర్వహించారు. రామాలయంలోపలి ఉత్తరం వైపు మంటంపంలో సీతా, రామస్వామివార్లు ఎదురెదురుగా ఉంచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం చూడటానికిభక్తులు పోటీపడ్డారు. ఆలయ సంప్రదాయాల రీతిలో ఎదుర్కొలు ఉత్సవాన్ని తర తరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే రీతిలో సోమవారం రాత్రి కూడా ఎదుర్కోలు నిర్వహించారు.
వైభవంగా తిరువంజనం..: ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కన్నులపండవుగా నిర్వహించారు. 11గంటల నుంచి 11.30గంటల వరకు శుద్ధి, రెండవగంట, 11.30గంటల నుంచి సాయంత్ర 6 వరకు సర్వదర్శనంకు అనుమతిచ్చారు. 5గంటల నుంచి 6గంటల వరకు కాంతకోరిక, 6గంటల నుంచి 2.30గంటల వరకు శుద్ధి, మూడవగంట మోగ్రించారు.