chandrayaan-2
-
Chandrayaan-3: 'శివ్ శక్తి' అని పేరు పెడితే తప్పేంటి?: ఇస్రో చైర్మన్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ కేరళలోని పౌర్ణమికవు-భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులు చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన స్థలాన్ని 'శివ్ శక్తి'గా నామకరణం చేయడంపై ప్రశ్నించగా అందులో తప్పేంటన్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని భారతదేశం చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు వెళ్లి చంద్రయాన్-3 విజయంపై ఇస్రో శాస్త్రవేతలకు అభినందనలు తెలిపి విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన స్థలానికి 'శివ్ శక్తి' అని నామకారణం చేశారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్‌ను ప్రశ్నించగా నాకైతే అందులో తప్పేమీ లేదనిపిస్తోందన్నారు. అలాగే చంద్రయాన్-2 అడుగుపెట్టిన స్థలానికి 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టారు. 'శివ్ శక్తి' 'తిరంగా' రెండూ భారతీయత ఉట్టిపడే పేర్లు. మనం చేస్తున్న పనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేశ ప్రధానిగా పేరు పెట్టేందుకు ఆయనకు ప్రత్యేక అధికారముందన్నారు. ఇక అమ్మవారిని దర్శించుకోవడంపై స్పందిస్తూ నేను ఒక అన్వేషకుడిని.. నా జీవిత గమనంలో సైన్స్, ఆధ్యాత్మికత రెండూ భాగమే. అందుకే నేను అనేక దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాను వేద గ్రంధాలను చదువుతూ ఉంటాను. విశ్వంలో ఉనికిని గుర్తించడానికి శూన్యంలో విహరిస్తూ ఉంటాను. సైన్స్ బాహ్య సంతృప్తినిస్తే ఆధ్యాత్మికత ఆత్మీయ సంతృప్తినిస్తుందని అన్నారు. #WATCH | On his visit to Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram, ISRO Chairman S Somanath says, "I am an explorer. I explore the Moon. I explore the inner space. So it's a part of the journey of my life to explore both science and spirituality. So I visit many… pic.twitter.com/QkZZAdDyX3 — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
చంద్రయాన్–3 ప్రయాణం సాగిందిలా ..
గత ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్–3 ఫస్ట్‌లుక్‌ను ఇస్రో విడుదల చేసింది. తొలుత 2020లో చంద్రయాన్‌ను ప్రయోగించాలని భావించారు కానీ కోవిడ్–19తో ఆలస్యమైంది. ఈ మిషన్ కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేసింది. చంద్రయాన్–2 కంటే తక్కువ ఖర్చుతో ఈ మిషన్ పూర్తయింది. చంద్రయాన్–2కి రూ.978 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్–3 మూడు భాగాలుగా ఉంది. 1. ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం) 2. ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) 3. రోవర్ ► చంద్రయాన్ ల్యాండర్ నిర్దేశించిన చంద్రుడి ఉపరితలంపై సాప్ట్‌గా ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది.చంద్రుడిపై ఈ ల్యాండర్ (విక్రమ్) దిగిన తర్వాత రోవర్ (ప్రజ్ఞాన్) బయటకి వస్తుంది. ఈ రెండూ కలిసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్ని చేస్తాయి. ల్యాండర్, రోవర్లు పరిశోధనలకు అనుగుణమైన సైంటిఫిక్ పే లోడ్స్‌ను కలిగి ఉన్నాయి. ► ఇక ల్యాండర్ మాడ్యూల్‌ను చివరి 100 కి.మీ. దూరం వరకు మోసుకుపోవడమే ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధి. ► చంద్రయాన్–3 మిషన్ లాంచ్‌వెహికల్ మార్క్–3 (ఎల్వీఎం–3) రాకెట్‌ని ఆంధ్రప్రదేశ్‌లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం 41 రోజుల పాటు ఈ వ్యోమనౌక ప్రయాణించి సూపర్ సక్సెస్ కొట్టింది. ► ఆ మర్నాడు జులై 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► అలా అయిదుసార్లు కక్ష్యం పెంచాక ఆగస్టు 1న అర్థరాత్రి చంద్రయాన్–3 మిషన్‌ను పెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వుచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపుకు విజయవంతంగా మళ్లించారు. ► ఆగస్టు 5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 164‘‘18074 ఎత్తుకు చేరుకుంది. ► అప్పట్నుంచి కక్ష్యను అయిదుసార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆగస్టు 6, 9, 14, 16 తేదీలలో కక్ష్య తగ్గిస్తూ రావడంతో చంద్రయాన్–3 చంద్రుడికి మరింత చేరువైంది. ► ఆగస్టు 18న ల్యాండర్ మాడ్యూల్లో వున్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113‘‘157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► చంద్రయాన్–3లో మరో కీలకఘట్టం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో కూడిన లాండర్ మాడ్యూల్ (ఎల్ఎమ్) ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఆగస్టు 17న విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ ఉన్న 100 కి.మీ. వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. ► ల్యాండర్ మాడ్యూల్ చిట్టచివరి డీ బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న విజయవంతంగా పూర్తయింది. అప్పట్నుంచి ఆ ల్యాండర్ చంద్రుడి చుట్టూ 25 ్ఠ134కి.మీ. కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించింది ► ఆగస్టు 23 సాయంత్రం 5. 44 గంటలకు ల్యాండర్ విక్రమ్ ఈ ప్రత్యేక ఇంజిన్ల సాయంతో దశల వారీగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ దిగడంతో భారత్ కీర్తి పతాక చంద్రుడిపై రెపరెపలాడింది. ► రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చాక సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతూ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. అంటే సెప్టెంబర్ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణిస్తుంది. -
ఫ్లాష్ బ్యాక్: ఒక ఉపగ్రహం కూలిన వేళ
కొన్నేళ్ల క్రితం చంద్రయాన్–2ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చందమామ మీద నేలకూలి్చన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఇస్రో నేలకూలి్చన శాటిలైట్లలో అదే మొదటిది కాదు. చంద్రయాన్ 1ను పదేళ్ల క్రితమే ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేసింది. అది 2008. నవంబర్ 14. మధ్యాహ్న వేళ. ఉక్కపోత చుక్కలు చూపుతోంది. గుజరాత్‌లోని రాజ్ కోట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ శివాలెత్తుతున్నాడు. మహా మహా ఇంగ్లండ్ పేస్ బౌలర్లను వీర బాదుడు బాదుతున్నాడు. కేవలం 78 బంతుల్లో అతను చేసిన 138 పరుగుల సాయంతో భారత్ మరపురాని విజయం సాధించింది. దేశమంతా సంబరాల్లో మునిగి పోయింది. కానీ, అదే సమయంలో అక్కడికి 1,600 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులో పరిస్థితి మరోలా ఉంది. మరో దారిలేని పరిస్థితుల్లో, ఒక మినీ విస్ఫోటనానికి ఇస్రో భారంగా సిద్ధమవుతోంది. ఎందుకా విస్ఫోటనం? ఏమా కథ? అసలేం జరిగింది? చూద్దాం రండి...! 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. భూ కక్ష్యకు ఆవలికి శాటిలైట్‌ను పంపడం భారత్‌కు అదే తొలిసారి. అప్పటిదాకా రష్యా, అమెరికా, జపాన్, యూరప్ స్పేస్ ఏజెన్సీల పేరిట ఉన్న ఘనత అది. చంద్రునిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా ప్రపంచానికి పట్టిచి్చన ప్రయోగంగా చంద్రయాన్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే అందరికీ తెలిసిన ఈ ఘనత వెనక బయటికి తెలియని మరో గాథ దాగుంది... ప్రోబ్... కూలేందుకే ఎగిరింది చంద్రయాన్ లో భాగంగా 32 కిలోల బరువున్న మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రునిపైకి పంపింది ఇస్రో. ► 2008 నవంబర్ 17వ తేదీ రాత్రి 8 గంటల వేళ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రుని ఉపరితలం మీద కావాలనే కుప్పకూల్చేందుకు సిద్ధమైంది. ► అందులో భాగంగా చంద్రునికి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రోబ్ తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైంది. ► చంద్రయాన్ కక్ష్య నుంచి క్రమంగా విడివడటం మొదలు పెట్టింది. ► దానిలోని స్పినప్ రాకెట్లు జీవం పోసుకుని గర్జించాయి. అయితే, ప్రోబ్ వేగాన్ని పెంచేందుకు కాదు, వీలైనంత తగ్గించేందుకు! చంద్రుని ఉపరితలం కేసి తిప్పి అనుకున్న విధంగా క్రాష్ చేసేందుకు!! ► ఎట్టకేలకు, చంద్రయాన్ మిషన్ నుంచి విడివడి అరగంటకు క్రాష్ ల్యాండ్ అయింది. ప్రోబ్ కథ అలా కంచికి చేరింది. ► తద్వారా, అంతదాకా అందరాని చందమామతో తొలిసారిగా కరచాలనం చేసి ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. ఆ మూడింటి ముచ్చట్లు ప్రోబ్ లో మూడు పరికరాలను ఇస్రో పంపింది. అవి ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపే వీడియో ఇమేజింగ్ సిస్టం, ప్రోబ్ చంద్రునిపైకి పడ్డ వేగాన్ని కొలిచేందుకు రాడార్ ఆల్టిమీటర్, చంద్రుని వాతావరణాన్ని విశ్లేíÙంచేందుకు మాస్ స్పెక్ట్రం మీటర్. భావికి బాటలు... కూల్చేయడమే అంతిమ లక్ష్యంగా ఇస్రో ప్రయోగించిన ’విఫల’ చంద్రయాన్ మిషన్ తర్వాతి రోజుల్లో చంద్రయాన్–2, చంద్రయాన్ –3 ప్రయోగాలకు బాటలు వేసింది. ఆగస్ట్ 23న చంద్రునిపై సగర్వంగా దిగి చంద్రయాన్–3 సాధించబోయే అంతిమ విజయం కోసం దేశమంతా ఇప్పుడు ఎదురు చూసేందుకు మూల కారణంగా నిలిచింది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Chandrayaan-2: జాబిల్లిని ముద్దాడి రెండేళ్లు
సూళ్లూరుపేట: చందమామ రహస్యాలు, గుట్టుమట్లను విప్పడమే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. చంద్రయాన్–2ను ప్రయోగించి రెండేళ్లు పూర్తయ్యాయి. 2019లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్–2ను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం బెంగళూరులో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్–2లో భాగంగా మొదట ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి చంద్రుడి వైపు సుమారు కోటి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్య సమీపానికి చేరుకుంది. సెప్టెంబర్ 6న ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జాబిల్లి రహస్యాలను తెలుసుకోవడానికి వీలుగా మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను అమర్చి పంపారు. శాటిలైట్.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను చంద్రుడిపై సురక్షితంగా జారవిడిచింది. అయితే చివరి రెండు నిమిషాల్లో ఆందోళన నెలకొంది. ల్యాండర్ చంద్రుడిపై దిగే క్రమంలో దాని ఉపరితలాన్ని ఢీకొనడంతో రోవర్ కనిపించకుండా పోయింది. దీంతో ల్యాండర్, రోవర్ల నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ దేశాల సాయం తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. జాబిల్లిపై పలు పరిశోధనలు చేస్తూ ఛాయాచిత్రాలను అందించడంలో విజయవంతంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు పరిభ్రమించి అద్భుతమైన సమాచారాన్ని భూమికి చేరవేసింది. చంద్రుడిపై తేమ ఉనికి.. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇస్రో సోమవారం నుంచి రెండు రోజులపాటు బెంగళూరులో లూనార్ సైన్స్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం మాట్లాడుతూ.. చంద్రయాన్–2లో ఐదు ఉపకరణాలు ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ రెండేళ్లలో ఆర్బిటర్ పంపిన సమాచారాన్ని మీడియాకు వివరించారు. కొన్ని రోజుల క్రితం చంద్రుడి ఉపరితలంపై హైడ్రాక్సిల్ నీటి అణువులను ఆర్బిటర్ కనుగొందన్నారు. ఈ సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. చంద్రుడిపై తేమ ఉనికి ఉన్నట్టుగా కూడా తెలుస్తోందన్నారు. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా పరిభ్రమిస్తూ ఎప్పటికప్పుడు డేటాను ఇస్తోందని తెలిపారు. ఆర్బిటర్‌తోపాటు ఐదు పేలోడ్స్.. వాటి పనులివే.. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసింది. ఆర్బిటర్.. చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇందులో అమర్చిన లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్.. చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాలను మ్యాపింగ్ చేస్తుంది. ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్.. చంద్రుడిపై నీరు, మంచు వంటి వాటి ఉనికిని శోధిస్తుంది. ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్.. చంద్రుడిపై ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని అందజేస్తుంది. టెరియన్ మ్యాపింగ్ కెమెరా.. చంద్రుడిపై ఖనిజాల అధ్యయనానికి అవసరమైన త్రీడీ మ్యాప్‌లను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. కొనసాగింపుగా చంద్రయాన్–2 అతి తక్కువ ఖర్చుతో ఇస్రో 2008లో తొలిసారిగా చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి కక్ష్యలో ఉపగ్రహాన్ని తిప్పి పరిశోధనలు చేసింది. చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసేలా రూపొందించగా సాంకేతిక లోపంతో పది నెలలు మాత్రమే పనిచేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి చరిత్ర సృష్టించింది. దీనికి కొనసాగింపుగా చంద్రయాన్–2ను ప్రయోగించారు. -
2022లోనే చంద్రయాన్-3 ప్రయోగం
న్యూఢిల్లీ: భారతదేశ ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2022 మూడో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేడు(జూలై 28) తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాని పురోగతికి ఆటంకం కలిగిందని నొక్కి చెప్పారు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ చంద్రయాన్-3 ప్రయోగాన్ని రీషెడ్యూల్ చేసినట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది అని ఆయన అన్నారు. అయితే, లాక్ డౌన్ సమయాల్లో కూడా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పనులు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కాలంలో ఇస్రో శాస్త్రవేత్తలు సాధ్యమైన అన్ని పనులు చేశారు అన్నారు. అన్ లాక్ తర్వాత చంద్రయాన్-3 ప్రాజెక్టు వేగం పెరిగింది, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు చివర దశలో ఉన్నట్లు ఆయన చెప్పారు. 2019 జూలై 22న అత్యంత శక్తివంతమైన జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ ద్వారా చంద్రయాన్-2 మిషన్ చేపట్టారు. అయితే, సెప్టెంబర్ 7, 2019న చంద్రుని ఉపరితలం మీద దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయింది. ఈ ప్రయోగంతో తొలి ప్రయత్నంలోనే చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిన మొదటి అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలవాలని అనుకుంది. కానీ, చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో భవిష్యత్తులో చేపట్టేబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రయాన్-3 కీలకం కానుంది. -
చంద్రయాన్-2 డేటాను విడుదల చేసిన ఇస్రో
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్ 2 ప్రయోగాన్ని గత ఏడాది చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై దిగడానికి కొద్ది సెకన్ల ముందు చంద్రయాన్ 2 ల్యాండింగ్ అయ్యే ప్రయత్నంలో ల్యాండర్, రోవర్ ధ్వంసం కావడంతో ఆ ప్రయోగం విఫలమైంది. ఆ సమయంలో ల్యాండర్ క్రాష్ అయ్యింది కానీ.. చంద్రయాన్ 2 ఆర్బిటర్ మాత్రం బాగానే పని చేస్తుంది. ఈ ప్రయోగాన్ని చేపట్టిన 16 నెలల తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కక్ష్యలో ఉన్న ఎనిమిది పరికరాల సహాయంతో గ్రహించిన మొదటి డేటాను బయటకి విడుదల చేసింది. ఇస్రో పంపిన అన్ని మిషన్ల డేటాను బెంగళూరు సమీపంలోని ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్(ISSDC) సేకరిస్తుంది. ప్రస్తుతం చంద్రయాన్ 2 డేటాను సేకరించి పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరం ఇస్రో ప్లానెటరీ డాటా సిస్టమ్ పీడీఎస్ 4 ఫార్మాట్లో ఉన్న డేటాను గ్లోబల్ సైంటిఫిక్ కమ్యూనిటీతో పాటు సాధారణ ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉంచడం కోసం ఇస్రో ప్రధాన్ పోర్టల్ https://pradan.issdc.gov.in ద్వారా డేటాను విడుదల చేసింది. చంద్రయాన్ 2లోని ల్యాండర్ క్రాష్ అయినప్పటికీ ఆర్బిటార్, ఇస్రో మధ్య సమాచార మార్పిడి కొనసాగుతుంది. ఇప్పుడు ఆ ఆర్బిటార్ చంద్రుడి ఉపరితలానికి సంబందించిన కీలక సమాచారాన్ని ఇస్రో డేటా సెంటర్ కి పంపుతుంది. భవిష్యత్ లో అక్కడికి రోబోట్లు లేదా మనుషులను పంపడానికి ఈ సమాచారం బాగా ఉపయోగపడనుంది. -
‘చంద్రయాన్’ రోవర్ క్షేమం!
న్యూఢిల్లీ: ‘చంద్రయాన్ 2’ ప్రయోగం చివరి దశలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొని నాశనమైందని భావిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్.. నిజానికి ధ్వంసం కాలేదని చెన్నైకి చెందిన అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న టెకీ షణ్ముగ సుబ్రమణియన్ వాదిస్తున్నారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని ఫొటోలను ఆయన చూపిస్తున్నారు. ఆయన వాదన ప్రకారం.. ల్యాండర్ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ కొద్ది మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లి నిలిచిపోయింది. ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది. గతంలో మూన్‌ల్యాండర్ ‘విక్రమ్’ శకలాలను కూడా సుబ్రమణియన్ గుర్తించారు. ఆ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. తాజాగా, ప్రజ్ఞాన్ క్షేమంగా ఉందని పేర్కొంటూ, పలు ఫొటో ఆధారాలతో సుబ్రమణియన్ పలు ట్వీట్లు చేశారు. సుబ్రమణియన్ అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను పరీక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. ‘చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన తరువాత కూడా ల్యాండర్‌కు భూమి నుంచి సందేశాలు అంది ఉండవచ్చు. అయితే, అది మళ్లీ తిరిగి సమాధానం ఇవ్వలేకపోయి ఉండవచ్చు’ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. నాసా విడుదల చేసిన ఒక ఫొటోను వివరిస్తూ.. ల్యాండర్, రోవర్ ఉన్న ప్రదేశాలను ఆయన అంచనా వేశారు. రోవర్ ఇంకా పనిచేస్తూ ఉందని కచ్చితంగా చెప్పలేనన్నారు. గత సెప్టెంబర్‌లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. -
ఆ రాత్రి నిద్ర పట్టలేదు : మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ సాంకేతిక కారణాలతో విఫలమైన రోజు తనకు నిద్ర పట్టలేదని మోదీ చెప్పారు. ఆ రాత్రి నిద్రపోలేదని పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షల కాలం సమీపిస్తుండటంతో మోదీ సోమవారం ‘పరీక్ష పే చర్చా’ కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ విద్యార్థులతో మాట్లాడుతూ.. చంద్రయాన్-2 లాంచ్ మిషన్‌ను వీక్షించేందుకు వెళ్లవద్దని తనకు పలువురు సూచించారు. అది విజయవంతం అవుతుందనే నమ్మకం లేదని.. విఫలమైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు అన్నారు. కానీ నేను మాత్రం ఇస్రోకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పిన తరువాత.. నేను అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లిపోయాను. కానీ ఈ పరిణామంతో అసంతృప్తి చెందలేదు. ఆ తర్వాత పీఎంవో అధికారులును పిలిచి ఇస్రో శాస్త్రవేత్తలతో రేపు ఉదయం సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించాను. వెంటనే తన షెడ్యూల్‌ను మార్చవల్సిందిగా పీఎంవో బృందాన్ని ఆదేశించాను. మరుసటి రోజు ఉదయమే శాస్త్రవేత్తలతో భేటీ అయ్యాను. ఈ సందర్భంగా చంద్రయాన్-2 కోసం కష్టపడిన శాస్త్రవేత్తల శ్రమను అభినందించాను. నా భావాలను వారితో పంచుకున్నాను. ఈ ఘటన ఓటమి నుంచి గెలుపు పాఠాలు నేర్పిందన్నాను. రాబోయే రోజుల్లో భారీ విజయాలు సాధించవచ్చని చెప్పాను. మనం అనుకున్న విధంగా చంద్రుని ఉపరితలాన్ని చేరుకోలేపోయాం.. కానీ దీనిని ఓ కవి మాత్రం చంద్రున్ని తాకలానే తాపత్రాయంతో విక్రమ్ ల్యాండర్ వేగంగా దూసకెళ్లిందని అభివర్ణించారు’ అని తెలిపారు. -
వచ్చే ఏడాది చంద్రయాన్–3
బెంగళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 ప్రయోగంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) బుధవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది(2021)లో చంద్రయాన్–3 ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. ఇక మరో ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందడానికి భారత వాయు సేనకు చెందిన నలుగురు సిబ్బందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. జనవరి మూడో వారంలో వీరికి రష్యాలో శిక్షణ ప్రారంభంకానున్నట్లు చెప్పారు. చంద్రయాన్–3 ప్రాజెక్టుతోపాటు మొట్టమొదటి భారతదేశ మానవ సహిత గగన్‌యాన్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివన్ వెల్లడించారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని 2020లోనే చేపడతామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఇస్రో నుంచి ప్రకటన రావడం గమనార్హం. చంద్రయాన్–2లో మాదిరిగానే చంద్రయాన్–3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్–3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. చంద్రయాన్–2 ప్రయోగంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చంద్రయాన్–3పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–2 కంటే చంద్రయాన్–3 ప్రయోగానికి తక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. తమ ప్రయోగాలకు 2020–21 సంవత్సర బడ్జెట్లో రూ.14 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇస్రో విజ్ఞప్తి చేసింది. 2020లో 25 ప్రయోగాలు ప్రస్తుత ఏడాదిలో ఇస్రో సుమారు 25 వరకు ప్రయోగాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించిందని శివన్ వివరించారు. 2019లో పూర్తిచేయని ప్రయోగాలను ఈ ఏడాది మార్చి కల్లా చేపడతామని అన్నారు. వేగంలోనే విఫలం వేగాన్ని నియంత్రించే వ్యవస్థ విఫలమవడంతో చంద్రయాన్–2లోని విక్రమ్ ల్యాండర్ వైఫల్యానికి కారణమని శివన్ వివరించారు. అంతర్గత కారణాల వల్లే వేగాన్ని నియంత్రించే వ్యవస్థ వైఫల్యం చెందిందని వెల్లడించారు. ఇక విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనుగొనడంలో సాయపడిన చెన్నైకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను శివన్ అభినందించారు. క్రాష్ ల్యాండింగ్ అయిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను బయటకు విడుదల చేయకూడదన్నది సంస్థ పాలసీ అని తెలిపారు. త్వరలోనే ఇస్రో టెలివిజన్ చానెల్‌ను ఆవిష్కరించనున్నట్లు శివన్ తెలిపారు. -
ఈ ఏడాదే చంద్రయాన్ 3
సాక్షి, న్యూఢిల్లీ: ‘చంద్రయాన్-3’ ప్రయోగం ఈ సంవత్సరం (2020)లోనే ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ప్రయోగానికయ్యే ఖర్చు చంద్రయాన్-2 ప్రయోగానికి అయిన ఖర్చు కన్నా తక్కువే అవుతుందన్నారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని వైఫల్యంగా భావించరాదని ప్రధాని కార్యాలయంలో సహాయమంత్రి బాధ్యతల్లో ఉన్న సింగ్ వ్యాఖ్యానించారు. మొదటి ప్రయత్నంలోనే చంద్రుడి ఉపరితలానికి చేరామని, తొలి ప్రయత్నంలో ఈ స్థాయి విజయాన్ని ఏ దేశమూ సాధించలేదన్నారు. -
జాబిల్లిని చేరుకున్నాం.. కానీ!!
భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు ఈ ఏడాది ఘనవిజయాలే నమోదు చేశాయి. ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగం చివరి క్షణంలో వైఫల్యం ఎదుర్కోవడాన్ని మినహాయిస్తే ఇస్రో ఈ ఏడాది అభివృద్ధివైపు పురోగమించిందనే చెప్పాలి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేసుకున్న నావిగేషన్ మైక్రో ప్రాసెసర్లతో రాకెట్లు నడవడం ఒక విజయమైతే... పీఎస్ఎల్వీ తన 50వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, వివిధ దేశాలకు చెందిన 50 వరకూ ఉప గ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం ఇస్రో కీర్తి కిరీటంలో కలికి తురాయిలే. చెన్నై సాఫ్ట్వేర్ ఇంజినీర్ షణ్ముఖ సుబ్రమణియన్ విక్రమ్ ల్యాండర్ అవశేషాలను గుర్తించి నాసా ప్రశంసలు అందుకోవడం ఈ ఏడాది హైలైట్!. ఇక చంద్రయాన్ –2 గురించి... జాబిల్లిపై ఓ రోవర్‌ను దింపేందుకు, మన సహజ ఉపగ్రహానికి వంద కిలోమీటర్ల దూరంలో ఓ ఆర్బిటర్‌ను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ –2 ప్రయోగం జూలై 22న జరిగింది. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా 3840 కిలోల బరువున్న చంద్రయాన్–2 పలుమార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. జాబిల్లి కక్ష్యలోకి చేరింది. ఆ తరువాత క్రమేపీ జాబిల్లిని చేరుకుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడి పోయినప్పటికీ జాబిల్లిపైకి దిగుతున్న క్రమంలో కొంత ఎత్తు లోనే సంబంధాలు తెగి పోయాయి. ఆ తరువాత కొద్ది కాలానికి ల్యాండర్ జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది. భారతీయ శాస్త్రవేత్త పేరుతో నక్షత్రం ► సౌర కుటుంబానికి ఆవల ఉన్న ఒక గ్రహం తిరుగుతున్న నక్షత్రా నికి ఈ ఏడాది భారత శాస్త్రవేత్త బిభా ఛౌదరీ పేరు పెట్టారు. ► ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపుగా పేరొందిన థర్టీ మీటర్ టెలిస్కోపు ద్వారా పరిశీలనలు జరిపేందుకు భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందీ ఈ ఏడాదే. ► ప్రభుత్వ రంగ సీఎస్ఐఆర్కు చెందిన సంస్థ కాలుష్యం వెదజల్లని టపాసులను సిద్ధం చేయగా, బొగ్గును మండించడం ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించే పరిశోధ నలు చేపట్టేందుకు బెంగళూరులో ఓ కేంద్రం ఏర్పాటైంది. ► కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఈ ఏడాది మానవ అట్లాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ‘మానవ్’పేరుతో జరుగుతున్న ఈ ప్రయత్నంలో శరీరంలోని కణస్థాయి నెట్వర్క్ తాలూకూ వివరాలు ఉంటాయి. ► వెయ్యి మంది భారతీయుల జన్యుక్రమ నమోదును ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. -
చంద్రయాన్-2: భారత్‌కు చెడ్డపేరు వచ్చింది!
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడి ఉపరితలంపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ కూలిపోవడంతో దేశం అప్రతిష్ట పాలైందని మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విఫల ప్రయోగాల కోసం కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతరిక్ష రంగం కోసం మరిన్ని నిధులు కేటాయించడం వృథా ప్రయాసే అన్నారు. వివిధ కార్యక్రమాల కోసం అదనపు నిధుల మంజూరు విషయమై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా సౌగతా రాయ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. (చదవండి : నాసా ప్రకటనను వ్యతిరేకించిన శివన్) కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష చరిత్రలో ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచిన చంద్రయాన్-2 గురించి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా మట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇక సెప్టెంబరు 7న ఇస్రో... చంద్రుడి ఉపరితలం పైకి పంపిన విక్రమ్ ల్యాండర్ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయపడటంతో విక్రమ్ పడిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నామని నాసా పేర్కొంది. అయితే నాసా వ్యాఖ్యలను ఇస్రో చీఫ్ శివన్ వ్యతిరేకించారు. చంద్రయాన్-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకుముందే ఆ పని చేసిందని ఆయన స్పష్టం చేశారు. -
నాసా ప్రకటనను వ్యతిరేకించిన శివన్
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ జాడలను కనిపెట్టామంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించడాన్ని ఇస్రో చైర్మన్ శివన్ వ్యతిరేకించారు. చంద్రయాన్-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకుముందే ఆ పని చేసిందని పేర్కొన్నారు. ‘ ఇస్రోకు చెందిన ఆర్బిటార్ విక్రమ్ ల్యాండర్ జాడను ఎప్పుడో కనిపెట్టింది. ఈ విషయాన్ని మేము మా వెబ్సైట్లో ప్రకటించాం కూడా. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి’ అని శివన్ అసహనం వ్యక్తం చేశారు. కాగా సెప్టెంబరు 7న ఇస్రో... చంద్రుడి ఉపరితలం పైకి పంపిన విక్రమ్ ల్యాండర్ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయపడటంతో విక్రమ్ పడిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నామని నాసా పేర్కొంది. (చదవండి: ఎట్టకేలకు ‘విక్రమ్’ గుర్తింపు) ఇక ఈ ఏడాది జూలై 22న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2 నింగికి ఎగిరిన విషయం విదితమే. నెలల ప్రయాణం తర్వాత సెప్టెంబర్‌లో జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2 నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడి నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించింది. అయితే సెప్టెంబర్ 7న చివరిక్షణంలో విక్రమ్ ల్యాండర్‌తో సమాచార సంబంధాలు తెగిపోయాయి. నెమ్మదిగా ల్యాండ్ అవడానికి బదులు కొంత ఎత్తు నుంచి కుప్ప కూలిపోయినట్లు నాసా నిర్థారించింది. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్‌ను నాసా అంతరిక్ష నౌక లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) గుర్తించిందని, వివరాల కోసం ఫొటోలు చూడాల్సిందిగా నాసా మంగళవారం ఒక ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన పదిరోజులకు అంటే సెప్టెంబర్ 17న ఎల్ఆర్ఓ తీసిన కొన్ని ఛాయాచిత్రాలను నాసా విడుదల చేసింది. సెప్టెంబర్ 26న విడుదల చేసిన ఈ ఫొటోలను అదే ప్రాంతపు ఇతర ఫొటోలతో పోల్చి చూసి ల్యాండర్ జాడలను గుర్తించాలని నాసా ప్రజలను ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన చెన్నై మెకానికల్ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ (33) తన ప్రయత్నం చేశారు. అయితే శివన్ మాత్రం నాసా ప్రకటనను ఖండించడం గమనార్హం. -
ఎట్టకేలకు ‘విక్రమ్’ గుర్తింపు
వాషింగ్టన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు సెప్టెంబర్ 7న ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ జాడలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎట్టకేలకు గుర్తించింది. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయపడటంతో విక్రమ్ పడిన ప్రాంతాన్ని, శకలాలను గుర్తించగలిగామని నాసా ప్రకటించింది. ఈ మేరకు నాసా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 22న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్–2 నింగికి ఎగిరిన విషయం మనకు తెలిసిందే. నెలల ప్రయాణం తర్వాత సెప్టెంబర్‌లో జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్–2 నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడి నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించింది. అయితే సెప్టెంబర్ 7న చివరిక్షణంలో విక్రమ్ ల్యాండర్‌తో సమాచార సంబంధాలు తెగిపోయాయి. నెమ్మదిగా ల్యాండ్ అవడానికి బదులు కొంత ఎత్తు నుండి కుప్ప కూలిపోయినట్లు నాసా నిర్థారించింది. చంద్రయాన్ –2 విక్రమ్ ల్యాండర్‌ను నాసా అంతరిక్ష నౌక లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) గుర్తించిందని, వివరాల కోసం ఫొటోలు చూడాల్సిందిగా నాసా మంగళవారం ఒక ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన పదిరోజులకు అంటే సెప్టెంబర్ 17న ఎల్ఆర్ఓ తీసిన కొన్ని ఛాయాచిత్రాలను నాసా విడుదల చేసింది. సెప్టెంబర్ 26న విడుదల చేసిన ఈ ఫొటోలను అదే ప్రాంతపు ఇతర ఫొటోలతో పోల్చి చూసి ల్యాండర్ జాడలను గుర్తించాలని నాసా ప్రజలను ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన చెన్నై మెకానికల్ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ (33) తన ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు విక్రమ్ కూలిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నారు. అక్టోబర్ 3న నాసా, ఎల్ఆర్వో, ఇస్రో ట్విట్టర్ హ్యాండిళ్లను ట్యాగ్ చేసిన షణ్ముగ కొన్ని ఫొటోలను జత చేస్తూ ‘విక్రమ్ ల్యాండర్ ఇదేనా (ల్యాండింగ్ ప్రాంతానికి కిలోమీటర్ దూరం)?.. జాబిల్లి మట్టిలో కూరుకుపోయిందా?’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ‘విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతమిదే కావచ్చు. శకలాలు ఇక్కడే పడి ఉండవచ్చు’ అంటూ మరికొన్ని వివరాలు, ఫొటోలను జత చేసి నవంబర్ 17న మరో ట్వీట్ చేశాడు. 750 మీటర్ల దూరంలో... షణ్ముగ ముందు విక్రమ్ కుప్పకూలిందన్న ప్రాంతానికి వాయవ్య దిశలో 750 మీటర్ల దూరంలో శకలాలను గుర్తించాడని, భారీ ఫొటోలో ఈ శకలం ప్రకాశవంతమైన పిక్సెల్‌గా కనిపించిందని నాసా వివరించింది. షణ్ముగ ఈ సమాచారాన్ని నాసాకు అందించడంతో ఎల్ఆర్ఓ కెమెరా సిబ్బంది ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టి శకలాల గుర్తింపులో విజయం సాధించింది. షణ్ముగ సమాచారం ఇచ్చిన తరువాత ఎల్ఆర్ఓ అక్టోబర్ 14, 15, నవంబర్ 11 తేదీల్లో ఆ ప్రాంతాన్ని మళ్లీ ఫొటోలు తీసిందని తెలిపింది. ఈ కొత్త పరిశీలనల ద్వారా విక్రమ్ ల్యాండర్ ముందుగా నిర్ణయించిన సాఫ్ట్‌ల్యాండింగ్ ప్రాంతం నుంచి ఆగ్నేయంగా సుమారు 2,500 అడుగుల దూరంలో కూలిందని, శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నాసా తెలిపింది. విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించారని ధ్రువీకరించిన నాసా ఇందుకు సంబంధించి షణ్ముగకు కృతజ్ఞతలు తెలిపింది. సమాచారమిచ్చినందుకు ధన్యవాదాలని ఎల్ఆర్ఓ ప్రాజెక్టు డిప్యూటీ, సైంటిస్ట్ అయిన జాన్ కెల్లెర్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు. -
ఏబీడీ, కోహ్లిల సిక్సర్లను కూడా కనిపెట్టండి!
బెంగళూరు: ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ సాధించని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి కచ్చితంగా టైటిల్‌ను గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈనెల 19వ తేదీన ఐపీఎల్ వేలం జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ క్యాష్ రిచ్ లీగ్ హడావుడి మొదలు కాగా, ఆర్సీబీ అప్పుడే తన ట్వీట్లతో అలరిస్తోంది. వచ్చే ఐపీఎల్లో తమ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లిలు కొట్టే సిక్సర్లను కనిపెట్టడానికి నాసా సహాయం అవసరం ఉంటేందేమో అంటూ చమత్కరించింది. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనుగొన్న అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసాకు ఒక పనిపెట్టింది. ‘ నాసా టీమ్.. విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనిపెట్టిందా.. మాకు కూడా మీ అవసరం ఉంది. ఏబీడీ-కోహ్లిల బ్యాట్ల నుంచే వచ్చే సిక్సర్లను కూడా కనిపెట్టడానికి సాయం చేయండి’ అంటూ ఆర్సీబీ విన్నూత్నంగా ట్వీట్ చేసింది. ఎట్టకేలకు విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ శిథిలాలను నాసా గుర్తించింది. ఇస్రో చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిందన్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా తాజాగా ఇస్రో విక్రమ్ ల్యాండర్‌ను చందమామపై కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్లో షేర్ చేసింది.సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్ అదుపు తప్పింది. ల్యాండర్ కోసం శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆచూకీ లభించలేదు. చివరికు మంగళవారం విక్రమ్‌కు సంబంధించిన చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. లూనార్ రికయినసెన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) తీసిన ఫోటోల్లో విక్రమ్ కనిపించింది. అది కూలిన ప్రాంతాన్ని నాసా ఆర్బిటార్ చిత్రీకరించింది. విక్రమ్ శిథిలాలూ అక్కడే ఉన్నాయి. విక్రమ్ శిథిలాలను భారతీయ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ గుర్తించినట్లు నాసా చెప్పింది. విక్రమ్ గతితప్పిన వాయవ్య ప్రాంతానికి 750 మీటర్ల సమీపంలో విక్రమ్ శిథిలాలు కనిపించాయి. Could the #NASA team that found #VikramLander also help us find the cricket balls hit by ABD & Virat 👀? — Royal Challengers (@RCBTweets) December 3, 2019 -
విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభ్యం..
సాక్షి, హైదరాబాద్: విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ శిథిలాలను నాసా గుర్తించింది. ఇస్రో చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిందన్న విషయం తెలిసిందే. చందమామపై చీకటి వల్ల ఇన్నాళ్లూ ఆ ల్యాండర్ ఎక్కడ కూలిపోయిందో కనిపెట్టలేకపోయాం. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా తాజాగా ఇస్రో విక్రమ్ ల్యాండర్‌ను చందమామపై కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 ద్వారా విక్రమ్ ల్యాండర్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్ అదుపు తప్పింది. ల్యాండర్ కోసం శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆచూకీ లభించలేదు. చివరికి అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ మంగళవారం విక్రమ్‌కు సంబంధించిన చిత్రాలను రిలీజ్ చేసింది. లూనార్ రికయినసెన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) తీసిన ఫోటోల్లో విక్రమ్ కనిపించింది. అది కూలిన ప్రాంతాన్ని నాసా ఆర్బిటార్ చిత్రీకరించింది. విక్రమ్ శిథిలాలూ అక్కడే ఉన్నాయి.విక్రమ్ శిథిలాలను భారతీయ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ గుర్తించినట్లు నాసా చెప్పింది. విక్రమ్ గతితప్పిన వాయవ్య ప్రాంతానికి 750 మీటర్ల సమీపంలో విక్రమ్ శిథిలాలు కనిపించాయి. తాజాగా నవంబర్‌లో తీసిన ఫోటోలను నాసా ఇంకా పరిశీలిస్తున్నది. అయితే విక్రమ్ కూలిన ప్రాంతంలో మూడు పెద్ద పెద్ద శిథిలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి చంద్రుడి దక్షిణ ద్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ల్యాండర్‌తో ఇస్రో సంకేతాలను కోల్పోయింది. లూనార్ ఆర్బిటార్ సెప్టెంబర్ 17వ తేదీన ఫస్ట్ మొజాయిక్ ఫోటోను రిలీజ్ చేసింది. కానీ ఆ ఫోటోలో విక్రమ్ ఆచూకీ చిక్కలేదు. అయితే ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసుకున్న శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్‌కు విక్రమ్ కూలిన ప్రాంతం కనిపించింది. ఆ తర్వాత ఎల్ఆర్వో టీమ్‌తో షణ్ముగ తన డేటాను షేర్ చేశాడు. దీంతో నాసాకు చెందిన ఎల్ఆర్వో విక్రమ్ పడిన ప్రాంతాన్ని గుర్తించింది. -
చంద్రయాన్–2తో కథ ముగియలేదు
న్యూఢిల్లీ: చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌లో విఫలమైన చంద్రయాన్ –2 తో కథ ముగియలేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు సన్నద్ధం అవుతోందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. ఢిల్లీ ఐఐటీ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న శివన్ రాబోయే మరికొద్ది నెలల్లో మరింత అభివృద్ధి చెందిన అంతరిక్ష పరిశోధనలు చేయబోతున్నట్టు తెలిపారు. చంద్రయాన్–2 సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయాం. అయితే జాబిల్లి ఉపరితలంపై 300 మీటర్ల దూరం వరకు సాంకేతికంగా అన్ని వ్యవస్థలూ సరిగ్గానే పనిచేశాయి. చంద్రయాన్–2 నుంచి గుణపాఠాలను తీసుకుని భవిష్యత్‌లో సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని హామీ ఇస్తున్నానని శివన్ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌లాంటి భవిష్యత్ ప్రణాళికలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ శివన్ చంద్రయాన్–2 తో కథ అంతంకాలేదనీ, ఆదిత్య ఎల్–1 సోలార్ మిషన్, మానవ స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్స్ ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. మీకు నైపుణ్యం, ఆసక్తి ఉన్న రంగంలో ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకుని ముందుకుసాగాలని విద్యార్థులకు శివన్ సూచించారు. అయితే విజయం సాధించడమన్నది కేవలం అభిరుచిపైనే ఆధారపడి ఉండదనీ, విజయానికి అభిరుచి దోహదపడగలదని మాత్రమే గుర్తించాలని అన్నారు. -
కనిపించని ‘విక్రమ్’
వాషింగ్టన్: చంద్రయాన్–2లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపైకి ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించలేదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన చంద్రుడి ఆర్బిటర్ తాజాగా తీసిన ఫొటోల్లో విక్రమ్ జాడలేదు. సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించగా భూమితో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా దాన్ని వెతికేందుకు అన్వేషిస్తూనే ఉన్నారు. ఇందుకోసం నాసా కూడా ఇస్రోకు సాయం చేస్తోంది. ఇందులో భాగంగా నాసాకు చెందిన ‘లూనార్ రీకనోయిసెన్స్ ఆర్బిటర్’అక్టోబర్ 14న చంద్రుడి దక్షిణ ధృవం ఫొటోలను తీసింది. ఆ ఫొటోల్లో ఎక్కడ కూడా విక్రమ్ జాడ కన్పించలేదని నాసాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ పెట్రో స్పష్టం చేశారు. కెమెరా బృందం చాలా క్షుణ్నంగా ఫొటోలన్నీ గమనించారని, అయినా కూడా గుర్తించలేకపోయారని వెల్లడించారు. ‘చంద్రుడి నీడ ప్రాంతంలో కానీ, మేం వెతికిన ప్రాంతానికి వెలుపల ఉండే అవకాశం ఉంది’అని వివరించారు. -
చంద్రయాన్-2 జాబిల్లి చిత్రాలు విడుదల
చెన్నై: చంద్రయాన్-2లో భాగంగా జాబిల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్ తీసిన ఛాయాచిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం విడుదల చేసింది. జాబిల్లి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్ కెమెరా ద్వారా ఆర్బిటర్ తీసిన చిత్రాలు...బోగుస్లావ్స్కీ ప్రాంతానికి సంబంధించినవని ఇస్రో తెలిపింది. సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్ తన చిత్రాల్లో బంధించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతో పాటు చిన్న గుంతల్లాంటివి ఉన్నాయని ఇస్రో తెలిపింది. -
చంద్రయాన్–2 జాబిల్లి చిత్రాలు విడుదల
చెన్నై: చంద్రయాన్–2లో భాగంగా జాబిల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్ తీసిన ఛాయాచిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం విడుదల చేసింది. జాబిల్లి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్ కెమెరా ద్వారా ఆర్బిటర్ తీసిన చిత్రాలు.. బోగుస్లావ్స్కీ ప్రాంతానికి సంబంధించినవని ఇస్రో తెలిపింది. సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్ తన చిత్రాల్లో బంధించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతోపాటు చిన్న గుంతల్లాంటివి ఉన్నాయని ఇస్రో తెలిపింది. -
‘చంద్రయాన్’ పై ప్రేమతో ఓ యువతి..
సూరత్ : దేశవ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలతో సందడి వాతావరణం మొదలైంది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి భక్తులు నవరాత్రి పూజలు జరుపుకుంటున్నారు. పిండి వంటలు, భజనలు, పూజలుతో పండుగ జరుపుకుంటుంటే.. గుజరాత్ యువతులు మాత్రం ఈ నవరాత్రుల్ని కాస్త వింతగా జరుపుకుంటున్నారు. దేశ భక్తి పరిమళించేలా శరీరాలపై టాటూలను వేయించుకుంటున్నారు. వివరాలు.. సూరత్ లోని మహిళలంతా పండుగ సందర్భంగా అక్కడి మహిళలంతా టాటూలు వేసుకుంటున్నారు. ఒకరేమో చంద్రయాన్ 2 అని వేసుకుంటే, ఇంకొకరేమో మరో మహిళ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 ను రద్దు నిర్ణయాన్ని టాటూగా వేయించుకుంది. మరొకరేమో ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటూ.. ఈ మధ్యనే అమలైన ట్రాఫిక్ నిబంధనలను పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా తప్పు లేదని ఆ యువతులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరు వేయించుకున్న టాటూ ఫోటోలు వైరల్‌గా మారాయి. -
‘విక్రమ్’ ల్యాండ్ అయిన ప్లేస్ ఇదే.. నాసా ఫొటోలు
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థం (నాసా) శుక్రవారం చంద్రయాన్-2కు సంబంధించిన కీలక ఫొటోలను విడుదల చేసింది. నాసాకు చెందిన లునార్ రికనైజాన్స్ ఆర్బిటర్ కెమెరా (ఎల్ఆర్వోసీ) చంద్రుడి సమీపంలో తిరుగుతున్న సమయంలో ఈ ఫొటోలను తీసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో చంద్రయాన్-2ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని ఇస్రో భావించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్-2 నుంచి వేరయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ చేసిందని పేర్కొంటూ.. అది హార్డ్ ల్యాండ్ అయిన ప్రదేశానికి సంబంధించిన హై-రిజల్యూషన్ ఫొటోలను నాసా విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలంపైనున్న ఎత్తైన మైదానప్రాంతంలో విక్రమ్ ల్యాండర్‌ను సుతిమెత్తగా ల్యాండ్ చేసేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే, సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడికి చేరువుగా వెళ్లినప్పటికీ.. చివరి నిమిషంలో ల్యాండర్‌తో ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇస్రో శాయశక్తులా కృషి చేసినా.. అది వీలుపడలేదు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ అయిన విషయాన్ని ఇస్రో కూడా ఇప్పటికే నిర్ధారించింది. విక్రమ్ ల్యాండ్ కావాల్సిన నిర్ధారిత ప్రదేశాన్ని ఎల్ఆర్వోసీ తన కెమెరాలో బంధించింది. చంద్రుడిపై 150 కిలోమీటర్ల పరిధిమేర చిత్రించింది. అయితే, విక్రమ్ కచ్చితంగా ఎక్కడ హార్డ్ ల్యాండ్ చేసిందనేది ఇంకా గుర్తించాల్సి ఉందని నాసా తెలిపింది. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్ ల్యాండర్ గల్లంతైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్ ల్యాండర్.. అందులోని రోవర్ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. -
ప్రయోగాలు ప్రారంభమయ్యాయి: శివన్
అహ్మదాబాద్ : చంద్రయాన్- 2 ఆర్బిటార్ సమర్థవంతంగా పనిచేస్తోందని.. ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చైర్మన్ కె.శివన్ అన్నారు. పేలోడ్ ఆపరేషన్లు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే విక్రమ్ ల్యాండర్ నుంచి మాత్రం సిగ్నల్స్ రాకపోవడం బాధించిందని.. ల్యాండర్ విఫలమవడానికి గల కారణాలను జాతీయ స్థాయి కమిటీ విశ్లేషిస్తుందని తెలిపారు. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి శివన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూర్యుడిపై ప్రయోగాలకు సంబంధించిన మిషన్లపై ఇస్రో దృష్టిసారించిందని పేర్కొన్నారు. త్వరలోనే గగన్‌యాన్ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. అదే విధంగా చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే రాకెట్‌ను రూపొందించే అంశంపై ఇస్రో పనిచేస్తుందని తెలిపారు. కాగా ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్ ల్యాండర్ గల్లంతైంది. ఈ క్రమంలో విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకై ఇస్రో సహా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ల్యాండర్ విక్రమ్ కథ కంచికి చేరినట్లైంది. ఇక ఇస్రో వెబ్సైట్లో ఉన్న వివరాల మేరకు... చంద్రయాన్-2 ఆర్బిటార్‌లో ఉన్న ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నిజానికి ఆర్బిటార్ జీవితకాలం ఏడాది మాత్రమే అయినా.. ఇస్రో దాని జీవితకాలాన్ని పొడగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్బిటార్ ద్వారా.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు వివరాల గురించి తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన త్రీడీ మ్యాపుల రూపకల్పన చేయవచ్చు. అదే విధంగా చంద్రుడి ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం, ఐరన్, సోడియం వంటి మూలకాల ఉనికిని గుర్తించేందుకు తోడ్పడడం వంటి మరెన్నో ప్రయోజనాలు కలిగి ఉంది. -
‘చంద్రయాన్-2 వందకు వంద శాతం సక్సెస్’
న్యూఢిల్లీ : ‘చంద్రయాన్-98 శాతం సక్సెస్’ అని ఇస్రో చైర్మన్ శివన్ చేసిన వ్యాఖ్యల్ని మాజీ శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. కీలకమైన ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయినా కూడా ప్రయోగం విజయవంతమైందని చెప్పడమేంటని ఆక్షేపిస్తున్నారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయిన సమయంలోనే చంద్రయాన్-2 ప్రయోగం 90 నుంచి 95 శాతం సక్సెస్ అయిందని చెప్పారని, విక్రమ్ పత్తా లేకుండా పోయినా మరో మూడు శాతం కలిపి ప్రయోగం 98 శాతం విజయవంతమైందని చెప్పడం దేనికి సంకేతమని విమర్శించారు. మరో నాలుగు రోజులు ఆగితే.. ‘చంద్రయాన్-2 వందకు వంద శాతం సక్సెస్’ అంటారని చురకలంటించారు. వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ముందుకు సాగాలని సూచించారు. అంతర్జాతీయ మీడియా మనల్ని గమనిస్తోందని, శివన్ అర్థవంతమైన ప్రకటనలు చేస్తే మంచిదని హితవు పలికారు. (చదవండి : విక్రమ్ ల్యాండర్ కథ కంచికి!) ఇక చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల కథ దాదాపుగా ముగిసిపోయింది. చంద్రగ్రహంపై శుక్రవారం-శనివారం అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయ్యాయి. చంద్రగ్రహంపై రాత్రివేళ మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో పనిచేసే విధంగా విక్రమ్ రూపొందలేదు. చంద్రుడిపై రాత్రి అంటే.. భూమిపై 14 రోజులకు సమానం. అక్కడ పగలు కూడా పద్నాలుగు రోజలుంటుంది. చంద్రుడిపై రాత్రి ప్రారంభం కావడంతోనే విక్రమ్ ల్యాండర్ పనిచేయడం ఆగిపోతుంది. పైగా, చంద్రుడిపై విక్రమ్ ‘హార్డ్ ల్యాండింగ్’ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సోలార్ ప్యానెళ్లు అనుకున్నరీతిలో సెట్‌కాకపోతే.. చార్జింగ్ అయిపోయే.. విక్రమ్ మూగబోయే అవకాశముంది. -
చంద్రయాన్-2 ముగిసినట్లే.. ఇక గగన్‌యాన్!
భువనేశ్వర్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. చంద్రయాన్-2 ప్రయోగం 98శాతం విజయం సాధించిందన్న ఇస్రో ఛైర్మన్ శివన్.. ఇక తమ తదుపరి లక్ష్యం గగన్‌యాన్ అని ప్రకటించారు. శనివారం ఆయన ఐఐటీ భువనేశ్వర్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్-2లోని ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని వివరించారు. ఇక విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం తాము ఎంతో శ్రమించామని కానీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. చంద్రుడి దక్షిణధ్రువంపై శుక్రవారం-శనివారం అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయిన విషయం తెలిసిందే. దీని నుంచి వెంటనే తేరుకున్న ఇస్రో ఇకతమ తదుపరి లక్ష్యం గగన్‌యాన్ అని స్పష్టం చేసింది. కాగా సాయుధ బలగాల్లోని టెస్ట్ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని ఇస్రో భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. ముగ్గురిని ఎంపిక చేసి తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. విక్రమ్ ల్యాండర్ అసాధ్యమేనా.. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్ ల్యాండర్ గల్లంతైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్ ల్యాండర్.. అందులోని రోవర్ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. ఇక, 14 రోజుల తర్వాత పగటి సమయం మళ్లీ ప్రారంభమయ్యాక.. చంద్రయాన్-2 ఆర్బిటర్ మళ్లీ విక్రమ్ ల్యాండర్ కోసం వెతకనుంది. కానీ, అప్పటికీ విక్రమ్ దొరికే అవకాశాలు తక్కువేనని, మళ్లీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు ఏర్పరుచుకోవడం అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
విక్రమ్ ల్యాండర్ కథ కంచికి!
బెంగళూరు: చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల కథ దాదాపుగా ముగిసిపోయింది. చంద్రగ్రహంపై శుక్రవారం-శనివారం అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయ్యాయి. చంద్రగ్రహంపై రాత్రివేళ మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో పనిచేసే విధంగా విక్రమ్ రూపొందలేదు. చంద్రుడిపై రాత్రి అంటే.. భూమిపై 14 రోజులకు సమానం. అక్కడ పగలు కూడా పద్నాలుగు రోజలుంటుంది. చంద్రుడిపై రాత్రి ప్రారంభం కావడంతోనే విక్రమ్ ల్యాండర్ పనిచేయడం ఆగిపోతుంది. పైగా, చంద్రుడిపై విక్రమ్ ‘హార్డ్ ల్యాండింగ్’ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సోలార్ ప్యానెళ్లు అనుకున్నరీతిలో సెట్‌కాకపోతే.. చార్జింగ్ అయిపోయే.. విక్రమ్ మూగబోయే అవకాశముంది. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్ ల్యాండర్ గల్లంతైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోనుంది. 14రోజులపాటు సాగే చంద్ర రాత్రి ప్రారంభమైంది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్ ల్యాండర్.. అందులోని రోవర్ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. ఇక, 14 రోజుల తర్వాత పగటి సమయం మళ్లీ ప్రారంభమయ్యాక.. చంద్రయాన్-2 ఆర్బిటర్ మళ్లీ విక్రమ్ ల్యాండర్ కోసం వెతకనుంది. కానీ, అప్పటికీ విక్రమ్ దొరికే అవకాశాలు తక్కువేనని, మళ్లీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు ఏర్పరుచుకోవడం అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మిగిలింది 24 గంటలే..!
సాక్షి బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–2 వాహకనౌకలోని ‘విక్రమ్’ ల్యాండర్‌పై ఆశలు అడుగంటుతున్నాయి. ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రోతోపాటు నాసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సెప్టెంబర్ 17న నాసాకు చెందిన లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) విక్రమ్ పడిన ప్రాంతాన్ని ఫొటోలు తీసింది. వాటిల్లో విక్రమ్ జాడ దొరకలేదు. శుక్రవారంలోపు విక్రమ్‌ను గుర్తించకపోతే దానిపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చంద్రయాన్–2లో భాగంగా ఈ నెల 7న తెల్లవారుజామున చంద్రుడ్ని సమీపించిన ల్యాండర్ విక్రమ్ భూకేంద్రంతో సంబంధాలు కోల్పోవడంతో చంద్రుడిపై పడింది. శాశ్వతంగా మూగబోతుంది.. ‘విక్రమ్’తో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో అవిశ్రాంతంగా పనిచేస్తోంది. కానీ సెప్టెంబర్ 20లోపు ఈ ప్రయత్నం విజయవంతం కాకపోతే ల్యాండర్ నిరుపయోగంగా మారిపోతుందని చెబుతున్నారు. ఈ విషయమై ఇస్రో శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ..‘సాధారణంగా చంద్రుడిపై 14 రోజులు పగలు ఉంటే, మరో 14 రోజులు చీకటిగా ఉంటుంది. శుక్రవారంతో చంద్రుడిపై పగటి సమయం ముగుస్తుంది. అనంతరం జాబిల్లి చీకటిభాగంలో ఉష్ణోగ్రత మైనస్ 240 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతుంది. ఈ శీతల వాతావరణాన్ని తట్టుకునేలా విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ను మేం రూపొందించలేదు. కాబట్టి చలికి ఇవి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదముంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం: నాసా విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించేందుకు లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) ద్వారా తీసిన చిత్రాలను తాము పరిశీలిస్తున్నామని ఎల్ఆర్ఓ ప్రాజెక్టు డిప్యూటీ సైంటిస్ట్ జాన్ కెల్లర్ తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన పాత ఫొటోలను, తాజా ఫొటోలను పోల్చిచూడటం ద్వారా విక్రమ్ జాడను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. విక్రమ్ చంద్రుడిని ఢీకొట్టిన ప్రాంతంలో ఎత్తుపల్లాల కారణంగా భారీ నీడలు ఏర్పడ్డాయని, వెలుతురు కూడా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇస్రోతో జాబిల్లి సమాచారాన్ని, చిత్రాలను పంచుకునేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. -
ఇస్రో భావోద్వేగ ట్వీట్
బెంగళూరు: భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్–2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన అనంతరం తమకు మద్దతుగా నిలిచినవారందరికీ ఇస్రో కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘మాకు మద్దతుగా నిలిచిన దేశప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్ఫూర్తిగా భవిష్యత్తులో మరింత ముందుకు సాగుతాం. మేం అంతరిక్ష బాటలో సజావుగా సాగేందుకు మీ స్ఫూర్తి మాకెంతో తోడ్పడుతుంది’ అని తన ట్విట్టర్ ఖాతాలో ఇస్రో పేర్కొంది. కాగా, చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్–2 జూలై 22 నింగిలోకి దూసుకెళ్లింది. ఒక్కో దశ విజయవంతంగా పూర్తిచేసుకుంటూ చంద్రుడి ఉపరితల కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయింది. అయితే, చంద్రుడి ఉపరిత లానికి 2.1 కిలోమీటర్ల దూరంలో భూకేంద్రంతో విక్రమ్‌కు సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విక్రమ్‌తో తిరిగి అనుసంధానం అయ్యేం దుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. Thank you for standing by us. We will continue to keep going forward — propelled by the hopes and dreams of Indians across the world! pic.twitter.com/vPgEWcwvIa — ISRO (@isro) September 17, 2019 -
ల్యాండర్ విక్రమ్ కోసం ‘పైకి’ చేరాడు..!!
ప్రయాగ్‌రాజ్ : దేశమంతా చంద్రుడిపై క్రాస్ ల్యాండ్ అయిన ల్యాండర్ విక్రమ్ జాడకోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ వ్యక్తి మాత్రం మరో అడుగు ‘పైకి’ వేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని న్యూ యమునా బ్రిడ్జిపై ఉన్న ఓ భారీ పిల్లర్ ఎక్కి కూర్చున్నాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కనుగొనేంత వరకు దిగేది లేదని స్పష్టం చేశాడు. అతన్ని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని మండ ప్రాంతానికి చెందిన రజనీకాంత్‌గా గుర్తించారు. త్రివర్ణ పతాకం చేతపట్టుకుని సోమవారం రాత్రి రజనీకాంత్ పిల్లర్‌పైకి పైకి చేరాడని స్థానికులు చెప్తున్నారు. ఇదిలాఉండగా.. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా సెప్టెంబర్ 7న చంద్రుడికి చేరువగా వెళ్లిన ల్యాండర్ విక్రమ్ ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. ఇక విక్రమ్‌తో సంబంధాల పునరురద్ధరణకు గత పదకొండు రోజులుగా బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ సెంటర్లో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. మొదటి నుంచీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిముషంలో సంక్లిష్టంగా మారింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ విక్రమ్ గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు, యావత్ భారతం ఇస్రోకు మద్దతుగా నిలిచింది. ఇక ఇస్రోకి సాయమందించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ముందుకొచ్చింది. -
విక్రమ్ కనిపించిందా!?
వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ సోమవారం అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో సందడి చేశారు. పిట్ నటించిన యాడ్ ఆస్టా చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాసాలో సందడి చేశారు పిట్. ఈ సందర్భంగా ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో ఉన్న ఆస్ట్రోనాట్ నిక్ హెగ్యూకు వీడియో కాల్ చేసి సంభాషించారు పిట్. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన వీరి సంభాషణలో పలు ఆసక్తికర అంశాల గురించి చర్చించారు. దానిలో భాగంగా బ్రాడ్ పిట్ ‘భారత్ చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఉద్దేశించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనిపెట్టారా’ అని నిక్ని అడిగాడు. అందుకు అతడు దురదృష్టవశాత్తు ఇంకా లేదు అని బదులిచ్చాడు. ఆ తర్వాత బ్రాడ్ పిట్, స్పేస్ స్టేషన్లో సైంటిస్ట్ జీవితం, వారి మీద గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. LIVE NOW: There's an incoming call … from space! 👨🚀 @AstroHague is talking to #AdAstra actor Brad Pitt about what it’s like to live and work aboard the @Space_Station. Watch: https://t.co/yQzjEx1tr8 — NASA (@NASA) September 16, 2019 దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ వీడియో సంభాషణను నాసా టీవీలో ప్రసారం చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరణ కోసం ప్రస్తుతం ఇస్రో, నాసాతో కలిసి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
‘విక్రమ్’తో సంబంధం కష్టమే!
బెంగళూరు: చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పునరుద్ధరణకు ఇంకా వారం మాత్రమే సమయం ఉండటంతో అవకాశాలు మృగ్యమవుతున్నాయి. ఎందుకంటే ఈ ల్యాండర్ 14 రోజులు మాత్రమే (చంద్రుడిపై ఒక్కరోజు) మనుగడలో ఉంటుంది. సెప్టెంబర్ 7న విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాల్సి ఉండగా, 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలిసిందని 8వ తేదీన ఇస్రో ప్రకటించింది. అప్పటినుంచి విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘ప్రతి గంట, ప్రతి నిమిషం ఇప్పుడు ఎంతో విలువైనది. విక్రమ్‌కు ఉన్న బ్యాటరీలో శక్తి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. తిరిగి శక్తిని నింపుకొనేందుకు ఎలాంటి వెసులుబాటు లేదు. అలాంటప్పుడు వచ్చే వారం రోజులు ఎంతో కీలకమైనవి’అని ఇస్రో పేర్కొంది. అయితే, హార్డ్ ల్యాండింగ్ కారణంగా విక్రమ్ ల్యాండర్‌కు కొంత నష్టం జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘విక్రమ్’ కోసం రంగంలోకి నాసా!
న్యూఢిల్లీ : చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ అయిన విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణకై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇస్రో తెలిపింది. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ విక్రమ్‌కు రేడియో సిగ్నల్స్ పంపుతున్నట్లుగా ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ‘మూన్ ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సూర్యుడి వెలుగులో సెప్టెంబరు 20-21 దాకా విక్రమ్ ల్యాండ్ అయిన చోట సిగ్నల్స్ కోసం అన్వేషిస్తాం’ అని సదరు అధికారి తెలిపారు. కాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో చివరిక్షణంలో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎంతో ఉత్కంఠగా ప్రయోగాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలతో పాటుగా యావత్ భారతావని ఒక్కసారిగా నిరాశకు గురైంది. ఈ క్రమంలో విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ ధ్వంసం కాలేదని ఇస్రో ప్రకటించడంతో చంద్రయాన్-2 విజయంపై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. -
‘ఇస్రో’ ప్రయోగాలు పైకి.. జీతాలు కిందకు
సాక్షి, న్యూఢిల్లీ : చంద్రమండలం ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించడం కోసం ఇటీవల అక్కడికి విక్రమ్ ల్యాండర్‌ను పంపించడం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన ‘చంద్రయాన్-2’ ప్రయోగాన్ని అటు ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇస్రో సిబ్బంది, ఇటు దేశ ప్రజలు ఎంతో ఉద్విగ్న భరితంగా వీక్షించిన విషయం తెల్సిందే. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి దాదాపు 28 కిలోమీటర్లు చొచ్చుకుపోయి చంద్రుడి ఉపరితలంకు కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమవడం అందరి హృదయాలను కాస్త కలచి వేసింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయినందుకు కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో చైర్మన్ కే. శివన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అక్కున చేర్చుకొని సముదాయించారు. అంతిమ లక్ష్యం చేజారిన రోదసిలో 3,84,400 కిలోమీటర్ల దూరం వరకు విక్రమ్ ల్యాండర్‌ను తీసుకెళ్లడం సాధారణ విషయం కాదని, ఇదీ విజయమేనని పలువురు అంతర్జాతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు కూడా మన ఇస్రో సిబ్బందిని ప్రశంసించారు. అంతటి ప్రాధాన్యత గల ఇస్రో సిబ్బందిని వేతనాల విషయంలో భారత ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఇందులో పనిచేసే సిబ్బందికి ఏడాదికి 1.5 లక్షల రూపాయల నుంచి 6.12 లక్షల రూపాయల వరకు మాత్రమే వేతనాలుగా చెల్లిస్తోంది. డ్రాయింగ్లను విశ్లేషించి మ్యాప్‌లను రూపొందించే ఓ సివిల్ ఇంజనీర్‌కు ఏడాదికి 2.20 లక్షల నుంచి 6.12 లక్షల రూపాయల వరకు, టెక్నికల్ అసిస్టెంట్‌కు ఏడాదికి 2.36 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు వస్తున్నాయి. ఎక్కువ పని ఉండే ఫిట్టర్‌కు ఏడాదికి 1.53 లక్షల నుంచి 4,08 లక్షల రూపాయల వరకు వస్తున్నాయి. దేశంలోని ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీర్లకు ఏడాదికి 9 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు వేతనాలు వస్తుంటే భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇస్రోలో వేతనాలు ఇంత తక్కువగా ఉండడం పట్ల ఆశ్చర్యం కలుగుతోంది. అదే విధంగా పెనం మీది నుంచి పొయ్యిలో పడేసినట్లు గత జూన్ 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇస్రో సిబ్బందికి ఓ సర్కులర్‌ను పంపించింది. ఇస్రో సిబ్బందిని ప్రోత్సహించడం కోసం ‘డబుల్ హైక్’ కింద 1996 నుంచి అదనంగా ఇస్తున్న పది వేల రూపాయలను జూలై ఒకటవ తేదీ నుంచి కోత విధించడమే ఆ సర్కులర్ సారాంశం. ఆ మేరకు జూలై ఒకటవ తేదీన ఇస్రో సిబ్బందికి రావాల్సిన జీతంలో పదివేల రూపాయల కోత పడింది. జూలై 15వ తేదీన ‘‘చంద్రయాన్-2’ ప్రయోగం జరుగనున్న నేపథ్యంలో ఈ చర్య వారి మనుసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇస్రోకు చెందిన ‘స్పేస్ ఇంజనీర్స్ అసోసియేషన్’ రాయతీల విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా, వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయడానికి అదనంగా పదివేల రూపాయల ప్రోత్సాహక ఇంక్రిమెంట్‌ను ఇవ్వాల్సిందిగా 1996 ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంవత్సరం నుంచి కేంద్రం అదనపు ఇంక్రిమెంట్ కింద పది వేల రూపాయలను చెల్లిస్తూ వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా ఆ ఇంక్రిమెంట్‌ను కట్ చేయడం పట్ల ఇస్రో సిబ్బంది హతాశులయ్యారు. వారు ఈ విషయమై చైర్మన్ కే. శివన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ కోత ఆగకపోవడంతో వారు అన్యమనస్కంగా పనిచేయడం వల్ల కూడా ‘‘చంద్రయాన్-2’ ఆశించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలం అయ్యిందేమో! అస్తమానం దేశభక్తి గురించి నీతులు చెప్పే కేంద్ర ప్రభుత్వం నిజమైన దేశభక్తి కలిగిన ఇస్రో సిబ్బంది పట్ల చూపించాల్సిన ఆదరణ ఇదేనా? దేశంలో ఉద్యోగాలు లేక ఓ పక్క నిరుద్యోగులు చస్తుంటే ఇస్రోలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న 86 పోస్టులను ఎందుకు భర్తీ చేయరన్నది మరో ప్రశ్న. చంద్రమండలానికి మానవ యాత్రకు రంగం సిద్ధం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇస్రో సిబ్బంది వేతన వెతలు తీర్చకుండా వారి నుంచి అద్భుతాలు ఆశించడం తప్పే అవుతుంది. -
నేను సాదియా... కైరాళీ టీవీ
చంద్రయాన్ –2.. అనుకున్న లక్ష్యం నెరవేర్చినా.. వేర్చకపోయినా..ఆ వార్తలను అందించడంలో మాత్రం ఒక వర్గానికి స్పేస్ ఇచ్చింది!పనిలో.. పనిచోట ‘ఈక్వల్ రెస్పెక్ట్’ అనే కాన్సెప్ట్‌ను స్థిరం చేసింది!అలా ఓ ట్రాన్స్ ఉమన్‌ను ఇక్కడ పరిచయం చేసుకోవడానికిఓ సందర్భాన్నీ తెచ్చింది! ఆ అమ్మాయి పేరు హైదీ సాదియా. వయసు ఇరవై రెండేళ్లు. కేరళలోని ‘కైరాళి’ అనే మలయాళం వార్తా చానెల్లో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్‌గా పనిచేస్తోంది. కిందటి నెల (ఆగస్ట్) 31వ తేదీనే ఆ చానెల్లో జర్నలిస్ట్‌గా చేరింది. వెంటనే ఆమె తీసుకున్న అసైన్మెంట్.. చంద్రయాన్ 2ను రిపోర్ట్ చేయడం. స్క్రీన్ మీద ఆమె ఇచ్చిన ప్రెజెంటేషన్‌కు కేరళ ప్రేక్షకులతోపాటు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి కేకే శైలజ కూడా ముగ్ధులయ్యారు. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. చావక్కాడ్ నివాసి అయిన సాదియా ‘‘త్రివేండ్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం’’లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. కైరాళి టీవీలో ఇంటర్న్‌గా చేరింది. వృత్తి పట్ల ఆమె జిజ్ఞాస, ఉత్సాహాన్ని పసిగట్టిన అధికార సిబ్బంది వారం రోజుల్లోనే ఉద్యోగ అవకాశం ఇచ్చారు ‘‘న్యూస్ ట్రైనీ’’గా. ఆ వెంటనే చంద్రయాన్ 2 అసైన్మెంట్ను అప్పజెప్పారు. బెదురు, బెరుకు లేకుండా చక్కగా ప్రెజంట్ చేసింది న్యూస్‌ను. ‘‘ఈ అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. న్యూస్రూమే నా సెకండ్ హోమ్. ఎల్జీబీటీక్యూ పట్ల వివక్ష చూపని ప్రొఫెషనంటే జర్నలిజమే. ఫ్యూచర్లో మా కమ్యూనిటీకి ఇలాంటి చోట మరిన్ని అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను’’ అని చెప్తున్న సాదియా ‘‘ఇంట్లో మాత్రం నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. దేశంలోని చాలా చోట్ల ట్రాన్స్‌విమెన్ జీవన శైలి చూసి నా విషయంలోనూ అలాంటి భావనతోనే ఉండి ఉంటారు. ఈ విషయంలో వాళ్లనేం తప్పుపట్టట్లేదు నేను’’ అంటారు. జీవితంలో చాలా పోరాడి ఈ స్థాయికి చేరుకున్న సాదియా.. సినిమారంగంలోనూ అడుగిడాలనుకుంటోంది. నటన, దర్శకత్వం రెండింటిలోనూ తన ప్రతిభను పరీక్షించుకోవాలనుకుంటోంది. బెస్ట్ ఆఫ్ లక్ సాదియా! -
విక్రమ్‌తో సంబంధాలపై ఇస్రో ట్వీట్
సాక్షి, బెంగళూరు: చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ చేసిన ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ గుర్తించిన ల్యాండర్ నుంచి సిగ్నల్స్ రాబట్టేందుకు కృషిచేస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొంది. జాబిలిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరగకపోయినా, విక్రమ్ ఆకృతి చెక్కు చెదరకుండా ఉందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. హార్డ్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో అది ఒక పక్కకు ఒరిగిందని తెలిపింది. హార్డ్ ల్యాండ్ అయినప్పటికీ ల్యాండర్ విచ్ఛిన్నం కాలేదు. కాని, ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌కి సిగ్నల్స్ మాత్రం రావడంలేదు. ఇక, ఇస్రో చైర్మన్ కే శివన్‌కు ఎలాంటి ట్విటర్ అకౌంట్లు లేవని, ఆయన పేరు మీద సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న అకౌంట్లన్నీ ఫేకేనని ఇస్రో ట్విటర్లో స్పష్టం చేసింది. -
‘ఏకాదశి కాబట్టే అమెరికా సఫలం అయ్యింది’
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యావత్ దేశ ప్రజలు ఇస్రో శాస్త్రవేత్తలకు బాసటగా నిలిచారు. మీరు సాధించింది మామూలు విజయం కాదంటూ మద్దతు తెలిపారు. చంద్రయాన్-2 విఫలం కావడంతో మరోసారి అమెరికా మూన్ మిషన్ టాపిక్ తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త, సంచలనాలకు మారు పేరైన శంభాజీ భిఢే, అమెరికా మూన్ మిషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకాదశి రోజున ప్రయోగం నిర్వహించారు కాబట్టి అమెరికా మూన్ మిషన్ సక్సెస్ అయ్యిందన్నారు. వివరాలు.. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న భిఢే మాట్లాడుతూ ‘అమెరికా 38 సార్లు మూన్ మిషన్ చేపట్టినా విజయవంతం కాలేదు. ఆ తరువాత అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు భారతీయ కాలమానాన్ని ఆశ్రయించారు. ఫలితంగా అమెరికా తన 39వ మూన్ మిషన్ ప్రయోగాన్ని ఏకాదశి తిథి రోజున నిర్వహించి విజయం సాధించింది’ అని అన్నారు. కాగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం భిడేకు కొత్త కాదు. గతంలో తన తోటలోని మామిడి పండ్లను తింటే మగపిల్లలు పుడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
విక్రమ్ ధ్వంసం కాలేదు
బెంగళూరు/కరాచీ: చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్ ధ్వంసం కాలేదని వెల్లడించింది. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయమై ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘చంద్రుడిని ఢీకొన్న విక్రమ్ ముక్కలు కాలేదు. ఓ పక్కకు పడిపోయి ఉంది. దక్షిణ ధ్రువంలో మేం ల్యాండర్‌ను దించాలనుకున్నచోటుకు చాలా దగ్గరలో విక్రమ్ ఉన్నట్లు గుర్తించాం. విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రోలో ఓ బృందం అవిశ్రాంతంగా పనిచేస్తోంది’ అని చెప్పారు. ఇస్రో జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా జూలై 22న చంద్రయాన్–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈనెల 7న తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ జాబిల్లివైపు పయనమైంది. చంద్రుడికి 2.1 కి.మీ ఎత్తులో విక్రమ్ ఉండగా, కమాండ్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఇస్రోకు పాక్ వ్యోమగామి మద్దతు.. విక్రమ్ వైఫల్యంపై పాక్ సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ఎగతాళి చేసిన వేళ పాకిస్తాన్ నుంచే ఇస్రోకు మద్దతు లభించింది. చంద్రయాన్–2 ప్రయోగం గొప్ప ముందడుగని పాక్ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీం ప్రశంసించారు. ‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు చంద్రయాన్–2తో చారిత్రాత్మక ప్రయోగం చేపట్టిన ఇస్రోను అభినందిస్తున్నా. ఈ ప్రయోగంతో దక్షిణాసియా మాత్రమే కాదు.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశ్రమ కూడా గర్వపడేలా ఇస్రో చేసింది’ అని కితాబిచ్చారు. పారిశ్రామికవేత్త రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన ‘వర్జిన్ గెలాక్టిక్’ అనే సంస్థ ప్రయోగించిన వాహకనౌక ద్వారా అంతరిక్షంలో విహరించిన నమీరా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ. -
‘విక్రమ్’ చాంద్రాయణం చిరంజీవం!
‘‘చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వేగాన్ని తట్టుకుని దాని ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ ఆ వేగాన్ని అధిగమించలేక అమిత బలంతో చంద్రతలాన్ని ఢీకొని ఉంటుంది. ఫలితంగా చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’తో సంబం ధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాం.’’ – ఇస్రో ఛైర్మన్ కైలాసవదివు శివన్ ‘‘చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారిగా కాలూనడం కోసం భారత్ రోదసీ ప్రయోగ కేంద్రం చేసిన ప్రయోగం ప్రశంసనీయం. అంతరిక్ష ప్రయోగాలన్నవి చాలా సంక్లిష్టమైనవైనప్ప టికీ ‘ఇస్రో’ తాజా ప్రయోగం అద్భుతం. దీనితో భారత ఇంజనీరింగ్ వ్యవస్థ నైపుణ్యం, సామర్థ్యం ప్రపంచం మొత్తానికి వెల్లడయింది’’ – అమెరికా పత్రికలు ‘న్యూయార్క్ టైమ్స్’, ‘వాషింగ్టన్ పోస్ట్’ అనాదిగా చేతికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న జాబిల్లిని చేరడానికి, వీలైతే చేజిక్కించుకోవడానికి వేల సంవత్సరాలుగా మాన వులు పడుతున్న తపనను, శాస్త్రవేత్తలు పడుతున్న తపనను, పోటా పోటీలను, అందుకు అంగలు పంగలుగా వేస్తున్న పరుగుల్ని చూస్తూ వచ్చాం. అందుకోసం తొక్కిన పుంతలు, ఆరాటపడిన పాలపుం తలూ ఎన్నెన్నో విన్నాం. ఆ చందమామ కోసం పాటలతో ఆరాటప డుతూ పాటలు అల్లుకున్నాం, దాన్ని దించి పిల్లల చేతిలో అల్లారు ముద్దుగా పెడదామని కలలు కన్నాం. దానిపేరిట పిల్లలకు ‘గోరు ముద్దలు’ తినిపించాం. గోగుపూలు తెచ్చిపెట్టమని ఆవాహనం చేశాం. చివరికి ఈ అన్వేషణ ఎందాకా వెళ్లిందంటే– పాలుపోక శశి చాటున ‘నిశి’లో ముసలమ్మ రాట్నం వడుకుతున్నట్టుగా ఓ పాలు పోని కథలల్లి భువిలోని పిల్లలకు.. మొన్న అర్ధ శతాబ్దం క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ తొలి మానవులుగా చంద్రునిపై చంద్రమం డలాధిపతులుగా కాలుమోపే వరకూ అశాస్త్రీయమైన కుంటి సాకులు కథలుగానే చెబుతూ వచ్చాం. ఈ సందర్భంగా, అతి సామాన్య పేద వ్యవసాయ కుటుంబం నుంచి భారత రోదసీ పరిశోధనా శాస్త్రవేత్తగా ‘ఇస్రో’ అధినేత స్థాయికి ఎదిగివచ్చిన ప్రొఫెసర్ శివన్ ఆధ్వర్యంలో మన శాస్త్రవేత్తలు చంద్రయాన్–2 రోదసీ యాత్ర ద్వారా దాని ఆర్బి టర్ జీవితాన్ని ఉద్దేశించిన కాల వ్యవధి కన్నా మించి 6–7 సంవ త్సరాలు మనగలిగేటట్టు రూపొందించడం భారత విజ్ఞాన శాస్త్రం, ఇంజనీరింగ్ వ్యవస్థ సాధించిన ఘన విజయం. ఇదే సమయంలో, దేశంలో ఎలాంటి పాలనా వ్యవస్థ మనుగడ సాగించుకుంటున్న సమయంలో ఈ విజయం సాధ్యమయింది? దేశ నవీన విశ్వ విద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో, విద్యా వ్యవస్థలో, శాస్త్ర సాంకేతిక కేంద్రాలలో పురాణ కవిత్వాలు విన్పించడానికి ప్రయ త్నాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో, శరవేగాన విస్తరి స్తున్న ప్రకృతి పరిణామవాద సిద్ధాంతాల్ని, అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం, ఖగోళ విజ్ఞాన శాస్త్రాన్ని రోదసీ పరిశోధనలో మానవుడు సాధిస్తున్న విజయ పరంపరను గేలి చేస్తున్న కొందరు మూఢులు పాలనా వ్యవస్థలో తిష్ట వేసి ఉన్నప్పుడు, పాలనా వ్యవస్థలో చరిత్ర గతిని, దేశ ప్రగతిని పక్కదారులు తొక్కించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నప్పుడు.. మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అమోఘ ప్రయోగ వైచిత్రిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ పాలకుల్లో ఒకరు వేదాల పేరిట చార్లెస్ డార్విన్ పరిణామవాదాన్ని తిరస్కరిస్తాడు, మరొక పాలక మండలి సభ్యుడు స్టీఫెన్ హాకింగ్ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని రూఢమైన ‘బ్లాక్‌హోల్స్ (నల్ల బిలాలు)’ సిద్ధాంత తారళ్యతనూ ప్రశ్నిస్తాడు. మరొక ముక్కలో చెప్పాలంటే చరిత్రను, చరిత్ర పాఠాల్ని న్యూనపరుస్తూ దేశ చరిత్రకు ‘సున్న’ చుట్టి మూఢ విశ్వాసాల వ్యాప్తికి పాఠ్య గ్రంథాల్లో పెద్దపీట వేయమంటాడు మరొక పాలకమండలి ‘విజ్ఞాని’! మరో పురాణ ‘విజ్ఞాని’ వినాయకుడికి ఏనాడో ‘ప్లాస్టిక్ సర్జరీ’ చేసినందున ఆ స్వరూపం వచ్చిందంటాడు. నిజానికి ఆరెస్సెస్–బీజేపీ ‘హిందూత్వ’ పాక్షిక మత రాజకీయాల ఫలితంగా పూర్వ వైదికంలోని మీమాంస పరిజ్ఞానం, ఉపనిషత్తులలోని ప్రశ్నోత్తర సంవాద సంప్రదాయాల ద్వారా అను మాన నివృత్తి అవకాశాలు కూడా నేటి భారతంలో అడుగంటిపోయి, మూఢత్వం చాటలతో చెలుగుతూ స్వైర విహారం చేస్తోంది. మాన వుణ్ణి తొలిసారిగా చరిత్రలో చంద్రాధినేతగా నిలిపినవారు తొలి అమె రికన్ ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1969 జూలై 20) కాగా, రోదసీలో కాలుమోపి, భూమిని చుట్టి జయించిన తొలి మానవుడు సోషలిస్టు సోవియట్ యూనియన్ పౌరుడైన యూరీ గగారిన్ (1961 ఏప్రిల్), ఆ పిమ్మట మేడం వలెంటీనా, అంతకుముందు రోదసీలో వాతావ రణ పరిస్థితులు జీవరాశిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో పరీక్షిం చడానికి సోవియట్ ‘లైకా’ (కుక్క)తో జరిపిన సఫల ప్రయోగమూ! ఆ వరసనే రోదసీ గుహ్వరంలోని పలు రకాల పాలపుంతలకు (గెలా క్సీలు), గ్రహరాశులకు మానవులు యాత్రలు జరపడానికి రకరకాల ప్రయత్నాలలో ఉన్నారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఎదురైన విచిత్ర అనుభవం! తొలిసారి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలూనడానికి బయలుదేరే ముందు భూమ్మీద జరిపిన శాస్త్ర ప్రయోగ, తర్ఫీదు విన్యాసాల సంద ర్భంగా ఒక విచిత్రానుభవం కల్గింది. అమెరికా పశ్చిమ ప్రాంతాల్లోని ఓ మారుమూల ఎడారి ప్రాంతంలో ఆర్మ్‌స్ట్రాంగ్ అభ్యాస శిక్షణలో ఉన్నాడు. అతను శిక్షణ పొందుతున్న ప్రాంతం అనేకమంది అమెరి కన్ ఆదివాసీ (స్థానిక) తెగల నివాస కేంద్రం. ఆర్మ్‌స్ట్రాంగ్ బృందానికి వారికి మధ్య సాగిన సంభాషణ ఒక ఐతిహ్యంగానే చెప్పుకోవచ్చు. శిక్షణలో ఉన్న రోదసీ యాత్రికులైన ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లను ఆ స్థానిక ఆదివాసీ అడిగాడు: ‘ఇంతకూ మీరిక్కడ ఏం చేస్తున్నారు’ అని. అందుకు ఆర్మ్‌స్ట్రాంగ్ సమాధానమిస్తూ ‘త్వరలో చంద్రుడి ఉనికి తబిశీళ్లను కనుక్కోడానికి చేసే ప్రయత్నంలో శిక్షణ పొందు తున్నాం’ అన్నాడు. అందుకు నిర్ఘాంతపోయిన ఆదివాసీ ‘నాకో పని చేసి పెడతావా’ అని అడిగాడు. ‘మీకేం కావాలి?’ అని అడిగాడు ఆర్మ్ స్ట్రాంగ్. అందుకు ఆదివాసీ పెద్ద ‘ఆ చంద్రునిపైన కొన్ని పవిత్ర ఆత్మలు, శక్తులూ నివసిస్తుంటాయి. వాటికి మా ప్రజలిచ్చే ఓ ముఖ్య సందేశాన్ని మీరు అందజేస్తారా’ అని ప్రశ్నించాడు. ఆస్ట్రోనాట్ ఆర్మ్‌స్ట్రాంగ్: చెప్పండి, ఆ సందేశం ఏమిటో అన్నాడు కానీ ఆదివాసీ పెద్ద మనిషి ఆదివాసీ తెగల భాషలో మాట్లాడుతూ ‘మీరు విన్నదేమిటో ఒకటికి రెండుసార్లు చెప్పండి’ అన్నాడు. ‘మాకర్థం కావడం లేదు. ఇంతకూ మీరు ఏం చెబుతున్నారు?’ అనడి గాడు ఆస్ట్రోనాట్. ఆదివాసీ పెద్ద ‘అదో రహస్యం, ఆ చంద్రుడిలో దాగిన ఆ శక్తులు, ఆత్మలకు మాత్రమే మా భాష అర్థమవుతుంది’ అన్నాడు. దాంతో తికమకైపోయిన ఆస్ట్రోనాట్స్ తిరిగి తమ స్థానిక క్యాంపుకు వెళ్లిపోయి, ఆదివాసీ తెగల భాషలో మాట్లాడగల వ్యక్తి కోసం గాలించి కనిపెట్టారు. ఇంతకూ ఆ చంద్రునిలో దాగిన ఆ అజ్ఞాత శక్తులు అందించే సందేశం ఏమిటో అనువదించి చెప్పమ న్నారు ఆస్ట్రోనాట్స్. అలా వాళ్ల భాషని ఆస్ట్రోనాట్స్ పదే పదే వల్లి స్తుంటే ఆ ఆదివాసీ దుబాసీ విరగబడి నవ్వేశాడు. ఎందుకని? ఆ ఆదివాసీ పెద్ద అన్న మాటకు అసలు అర్థం– ‘ఆస్ట్రోనాట్స్ చెప్పే ఏ మాటా నమ్మొద్దు. రోదసీ యాత్రికుల పేరుతో వచ్చిన వీళ్లు మన ఆది వాసీల భూముల్ని కాజేయడానికి వచ్చినవాళ్లు’ అని ఆ ఆదివాసీ మాటల అర్థమట! వలస వాదంపై ఇదో వ్యంగ్యాస్త్రం. క్రీ.శ. 1500 సంవత్సరందాకా మానవులు ఈ భూమి ఉపరిత లాన్ని అధిగమించి పోనివాళ్లే. మççహా అయితే పెద్ద పెద్ద కోటలు, దుర్గాల నిర్మాణానికి, పర్వతారోహణకు పరిమితమైనవాళ్లు. ఆకాశ తలాన్ని మాత్రం పక్షులకు, పరమాత్మలకు ఏ దేవదూతలకో వదిలేసే వాళ్లు. ఇప్పుడలా కాదుగదా, రోదసీలో నక్షత్రాల దీవి ‘ఆండ్రోమీడా’ దీవికేసి, పాలపుంత (మిల్కీవే) కేసి శాస్త్ర పరిశోధకులు మెడలు రిక్కించి చూడగల్గుతున్నారు. లక్షల కాంతి సంవత్సరాల వ్యాసార్థం గల నక్షత్ర రాశిని లెక్కగట్టి గుర్తించగలుగుతున్నారు. శాస్త్ర పరిశోధనల్లో, ప్రయోగాల్లో జయాపజయాలు కావడి కుండ ల్లాంటివి. అందుకే ప్రస్తుత చంద్రయాన్–2 ప్రయోగంలో చంద్రుని పార్శా్వలకి చేరువదాకా వెళ్లినట్టు వెళ్లి, తొట్రుపాటుకు గురైన తాత్కా లిక అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్ర విశ్లేషకుడు, వ్యాఖ్యాత వాసుదేవన్ ముకుంత ఇలా అలంకారప్రాయంగా అని ఉంటాడు. ‘‘తాత్కాలిక ఉప్పెనలకు ఎంత దూరంగా ఉంటే వీచే ఈదురుగాలు లకూ అంత దూరంగా ఉండగల్గుతాం’’! అంతేగాదు, చంద్రుని దక్షిణ దిక్కులో పరిశోధనలకు ప్రయత్నించిన చంద్రయాన్–2 ‘విక్రమ్’ ల్యాండ్ రోవర్ ప్రయాణం దాదాపు 95 శాతం వరకూ సజా వుగా జరిగి చివరి క్షణంలో అనూహ్యంగా సశేషంగా ముగింపునకు వచ్చిన యాత్ర సందర్భంగా డాక్టర్ శివన్ హుందాగా, ఒద్దికగా చేసిన ప్రకటన ప్రశంసార్హం. ఆయన మాటల్లోనే ‘‘ఇదే ఆఖరి యత్నం కాదు, చంద్రుని దగ్గరకు మరో యాత్రను ఇస్రో నిర్వహించనున్నది. మానవుణ్ణి ఇస్రో రోదసీయాత్రకు సిద్ధం చేసే కార్యక్రమం ప్రాథమిక దశలో ఉంది, అలాగే రోదసీపై రోబోటిక్ ప్రయోగం కూడా పరిశో ధనలో ఉంది. చంద్ర, అంగారక గ్రహరాశికి ఇండియా 21వ శతాబ్ది లోనే దూసుకుపోయే దశలో ఉంది’’ అందుకే మహాకవి వాక్కు (1954) దార్శనిక దృక్కు. ‘‘చంద్ర మండలానికి ప్రయాణం/ సాధించరాని స్వప్నం కాదు/ గాలికన్నా బరువైన వస్తువుని/ నేలమీద పడకుండా నిలబెట్టడం లేదూ!/ అయితే ఇక్కడ మా భూలోకంలో అంతా బాగానే ఉందని/ అంతా సుఖంగానే ఉన్నారని/ అన్నానంటే మాత్రం అది/ అబద్ధమే అవుతుంది/ దరి ద్రాల శాతం ఇంకా/ చిరాకు కలిగిస్తూనే ఉంది’’! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
విక్రమ్ ల్యాండర్‌కు చలాన్ విధించం
చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా జాబిల్లికి చేరువగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ జాడ లేకుండా పోవడం భారతీయులను తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ సురక్షితంగా ఉందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రకటించడంతో చంద్రయాన్-2 మిషన్‌పై భారతీయుల ఆశలు సజీవంగా నిలిచాయి. విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్టు ఇస్రో ప్రకటించడంతో.. ట్విటర్లో #ISROSpotsVikram హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. మరోవైపు ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 అనుసరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్‌కు, ట్రాఫిక్ చలాన్లకు జత చేసి నాగ్‌పూర్ సిటీ పోలీసులు చేసిన ట్వీట్ పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ‘ప్రియమైన విక్రమ్.. దయచేసి స్పందించు. నువ్వు సిగ్నల్ బ్రేక్ చేసినందుకు మేము చలాన్ విధించం’ అంటూ ట్వీట్ చేశారు. నాగ్‌పూర్ సిటీ పోలీసుల ట్వీట్‌కు విపరీతమైన పైగా లైకులు వచ్చాయి. కొద్దిసేపటికే ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు కూడా దీనిపై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్ల కామెంట్లు.. ఒకవేళ విక్రమ్ స్పందిస్తే.. అది సిగ్నల్ బ్రేక్ చేసినందుకు ఆ చలాన్ నాకు పంపించండి. ఆ జరిమానాను నేను కడతాను. ఈ కేసు బెంగళూరు పోలీసుల పరిధిలోకి వస్తుంది. నాకు తెలుసు నాగ్‌పూర్ పోలీసులు చంద్రునిపై కూడా ఉన్నారు. కానీ ఓవర్ స్పీడింగ్ పరిస్థితి? Dear Vikram, Please respond 🙏🏻. We are not going to challan you for breaking the signals!#VikramLanderFound#ISROSpotsVikram @isro#NagpurPolice — Nagpur City Police (@NagpurPolice) September 9, 2019 -
చంద్రయాన్-2పై పాక్ వ్యోమగామి ప్రశంసలు
కరాచీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2పై పాకిస్తాన్‌కు చెందిన తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీమ్ అభినందనలు తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో చేసిన ప్రయత్నం చరిత్రాత్మకమైందని అన్నారు. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న సైంటియా అనే సైన్స్ మ్యాగజైన్‌తో నమీరా మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-2ను దక్షిణ ఆసియా సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు. ఇది ప్రపంచ అంతరిక్ష రంగానికి గర్వకారణమని చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రాంతీయ అభివృద్ధికి దక్షిణ ఆసియాకు చెందిన ఏ దేశం విజయం సాధించినా.. అది ఆ ప్రాంతం మొత్తానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు. కాగా, ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ వర్జిన్ గెలాక్టిక్ పంపే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు నమీరా ఎంపికయ్యారు. ఇదిలా ఉంచితే చంద్రయాన్-2 ప్రయోగంపై పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫవాద్ వ్యాఖ్యలపై భారత నెటిజన్లతోపాటు పలువురు పాకిస్తానీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే విక్రమ్ ల్యాండర్ సురక్షింతగానే ఉందని ఇస్రో తాజాగా ప్రకటించింది. ‘విక్రమ్’ హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ.. అది ముక్కలు కాలేదని ఇస్రో తెలిపింది. -
‘విక్రమ్’ ముక్కలు కాలేదు
బెంగళూరు : చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా జాబిల్లికి దగ్గరగా వెళ్లి జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరింత పురోగతి సాధించింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించామని ఇస్రో చైర్మన్ కె శివన్ ఆదివారం నాడు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విక్రమ్ ల్యాండర్ పరిస్థితి గురించి ఇస్రో నేడు కీలక ప్రకటన చేసింది. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగానే ఉందని వెల్లడించింది. చంద్రుని ఉపరితలంపై ‘విక్రమ్’ హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ.. అది ముక్కలు కాలేదని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తీవ్రంగా యత్నిస్తున్నట్టు పేర్కొంది. ల్యాండర్ ముక్కలు కాకపోవడంతో.. చంద్రయాన్-2పై శాస్త్రవేత్తల ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఏర్పడే వరకు దాని లోపలి పరిస్థితి ఏ విధంగా ఉందనేది చెప్పడం కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాగా, గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. చదవండి : ‘విక్రమ్’ను గుర్తించాం! -
‘విక్రమ్’ను గుర్తించాం!
బెంగళూరు/వాషింగ్టన్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై దూసుకెళుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన ‘విక్రమ్’ ల్యాండర్‌ను గుర్తించామని తెలిపారు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరాలు ‘విక్రమ్’కు సంబంధించిన థర్మల్ ఇమేజ్‌లను చిత్రీకరించాయని వెల్లడించారు. ఈ చిత్రాలను చూస్తే విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయినట్లు (చంద్రుడిపై పడిపోయినట్లు) అనిపిస్తోందని వ్యా ఖ్యానించారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలో శివన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విక్రమ్ ల్యాండర్ దెబ్బతిందా? అన్న మీడియా ప్రశ్నకు..‘ఆ విషయంలో మాకు స్పష్టత లేదు. ల్యాండర్ లోపలే రోవర్ ప్రజ్ఞాన్ ఉంది’ అని జవాబిచ్చారు. ఇస్రో ఈ ఏడాది జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా చంద్రయాన్–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయాయి. సమయం మించిపోతోంది.. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు సమయం మించిపోతోందని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ విషయంలో ఆలస్యమయ్యేకొద్దీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థల్ని పునరుద్ధరించడం కష్టమైపోతుంది. ఇప్పటికైనా ల్యాండర్ సరైన దిశలో ఉంటే సోలార్ ప్యానెల్స్ సాయంతో చార్జింగ్ చేసుకోగలదు. అయితే ఇది జరిగే అవకాశాలున్నట్లు కనిపించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. చంద్రుడిపై సురక్షితంగా దిగేలా విక్రమ్‌ను రూపొందించామనీ, అయితే జాబిల్లి ఉపరితలాన్ని వేగంగా తాకడం కారణంగా ల్యాండర్ దెబ్బతిని ఉండొచ్చని మరో ఇస్రో శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఇస్రో రూ.978 కోట్ల వ్యయంతో చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ కోసం రూ.375 కోట్లు, ఆర్బిటర్–ల్యాండర్–రోవర్ కోసం రూ.603 కోట్లు వెచ్చించింది. మరోవైపు విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు శివన్ తెలిపారు. ఇస్రో ప్రయోగించిన ఆర్బిటర్‌లో 8 సాంకేతిక పరికరాలు ఉన్నాయనీ, ఇవి చంద్రుడి ఉపరితలాన్ని మ్యాపింగ్ చేయడంతో పాటు బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయని వెల్లడించారు. దేశ ప్రజలకు ఇస్రో కృతజ్ఞతలు.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంలో ఒడిదుడుకులు ఎదురైనా ప్రధాని మోదీతో పాటు యావత్ భారతం తమవెంట నిలవడంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై శివన్ మాట్లాడుతూ..‘ప్రధాని మోదీతో పాటు దేశమంతా మాకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చర్య శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల నైతిక స్థైర్యాన్ని అమాంతం పెంచింది’ అని తెలిపారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ స్పందిస్తూ..‘భారత ప్రజలు చూపిన సానుకూల దృక్పథంతో మేం కదిలిపోయాం. ఇస్రో చైర్మన్ శివన్, ఇతర శాస్త్రవేత్తల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే విషయంలో ప్రధాని గొప్పగా ప్రవర్తించారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ల్యాండింగ్ ప్రక్రియ ఎంత సంక్లిష్టమైనదో ప్రజలు గుర్తించి తమకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందని ఇస్రోకు గతంలో చైర్మన్‌గా పనిచేసిన ఏఎస్ కిరణ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం తాము దేశానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ‘ఇస్రో’పై అమెరికా ప్రశంసలు.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రశంసలు కురిపించింది. ఈ ప్రయోగంతో తాము స్ఫూర్తి పొందామనీ, ఇస్రోతో కలిసి సౌర వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ప్రకటించింది. ఈ విషయమై నాసా స్పందిస్తూ.. ‘అంతరిక్ష ప్రయోగాలు అన్నవి చాలా సంక్లిష్టమైనవి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2ను స్వాగతిస్తున్నాం’ అని తెలిపింది. ఇస్రో చేపట్టిన ప్రయోగం అద్భుతమనీ, దీనివల్ల శాస్త్రీయ పరిశోధనలు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేసింది. చంద్రుడిపై దిగే తొలిప్రయత్నంలో ఇండియా విజయవంతం కాకపోయినా భారత ఇంజనీరింగ్ నైపుణ్యం, సామర్థ్యం ఏంటో చంద్రయాన్–2తో ప్రపంచం మొత్తానికి తెలిసిందని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రశంసించింది. అమెరికా చేపట్టిన ‘అపోలో మిషన్’తో పోల్చుకుంటే ఎంతో చవకగా కేవలం 141 మిలియన్ డాలర్ల వ్యయంతోనే భారత్ చంద్రయాన్–2 చేపట్టిందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. -
చంద్రునిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్
-
ల్యాండర్ విక్రమ్‌ను గుర్తించిన ఇస్రో
సాక్షి, బెంగుళూరు : చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా చందమామకు చేరువగా వెళ్లి జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ లొకేషన్‌ను ఇస్రో గుర్తించింది. త్వరలో ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ థర్మల్ ఇమేజ్ను ఆర్బిటర్ క్లిక్ చేసినట్టు పేర్కొన్నారు. అయితే, ల్యాండర్ నుంచి ఇప్పటికీ సిగ్నల్స్ అందడం లేదు. సంబంధాల పునరుద్ధరణ కోసం శాస్త్రవేత్తల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వివరాలు.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైన సంగతి తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఏడాది జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా నింగికి ఎగసిన చంద్రయాన్ –2 సుమారు ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన తరువాత ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి జాబిలివైపు ప్రయాణం ప్రారంభించింది. ఆగస్టు 20న జాబిల్లి కక్ష్యలోకి చేరిన తరువాత దశలవారీగా తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సెప్టెంబరు రెండవ తేదీ చంద్రయాన్ –2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడింది. (చదవండి : రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్) (చదవండి : రాయని డైరీ.. డాక్టర్ కె. శివన్ (ఇస్రో చైర్మన్)) -
రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్
ఇస్రో చీఫ్ కె. శివన్.. చంద్రయాన్–2కు ముందు ఈ పేరు ఎవరూ పెద్దగా వినలేదు. గత కొన్నేళ్లుగా అంతరిక్ష రంగంలో సేవలు చేస్తున్నా ఆయన పెద్దగా తెరపైకి రాలేదు. కానీ చంద్రయాన్–2 ల్యాండర్ విక్రమ్ నుంచి సంకేతాలు ఆగిపోయిన వెంటనే ఆయన పడ్డ బాధ, పసి బిడ్డలా కన్నీళ్లపర్యంతమైన తీరు చూసి యావత్ భారతావని చలించిపోయింది. చంద్రయాన్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుని నడిపించిన శివన్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కాళ్లకి చెప్పులు కూడా లేని పేదరికం తమిళనాడులోని కన్యాకుమారిలో సాధారణ రైతు కుటుంబంలో శివన్ జన్మించారు. కాళ్లకి చెప్పులు ఉండేవి కావు. ప్యాంటు, షర్టులేక ధోవతి ధరించిన రోజులున్నాయి. మామిడి తోటల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో స్కాలర్‌షిప్‌లతో విద్యాభ్యాసం చేశారు. 1980లో మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. బెంగుళూరు ఐఐఎస్సీలో ఎంఈ చేశారు. ఐఐటీ బొంబాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేశారు. భారత్ రాకెట్ మ్యాన్ పోఖ్రాన్ –1 అణుపరీక్షల తర్వాత సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో అమెరికా భారత్‌పై ఆంక్షలు విధించింది. దీంతో శీతల ఇంధనాల్ని వాడే క్రయోజెనిక్ ఇంజిన్లను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం భారత్‌కు అనివార్యమైంది. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమయ్యే క్రయోజినిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసే బృందాన్ని ముందుండి నడిపించిన శివన్ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. ► ఈ మధ్య ఇస్రో సాధించిన ఘన విజయాల వెనుక శివన్ చేసిన పరిశోధనలు, డిజైన్ చేసిన ఉపగ్రహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ► శివన్ డిజైన్ చేసిన సితార అన్న సాఫ్ట్వేర్ సహకారంతోనే ఇస్రో రాకెట్లను కక్ష్యలోకి పంపుతోంది. ► మంగళ్యాన్ వంటి ప్రాజెక్ట్‌లకు సైతం శివన్ వెన్నెముకలా ఉన్నారు. ► ఇటీవల కాలంలో ఇస్రో పరీక్షిస్తున్న మళ్లీ మళ్లీ వాడుకోవడానికి వీలయ్యే లాంచ్ వెహికల్స్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకి శివన్దే సారథ్యం. ► లక్ష్య సాధనలో ఈ రాకెట్ మ్యాన్ ఇప్పుడు కాస్త నిరాశకు లోనవచ్చు కానీ దేశ ప్రజలిచ్చే మద్దతే ఆయనకు కొండంత బలం. చీర్ అప్ శివన్.. సక్సెస్ రేటు 60 శాతమే! చంద్రుడిని తొలి ప్రయత్నంలో అందుకోవడానికి ప్రయత్నించిన అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలకు గతంలో భంగపాటు తప్పలేదు. గత 60 ఏళ్లలో చంద్రుడిని ముద్దాడేందుకు జరిగిన ప్రయోగాల్లో కేవలం 60 శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఇప్పటివరకూ చందమామ లక్ష్యంగా 109 ప్రయోగాలు జరగగా, అందులో 61 మాత్రమే విజయవంతమయ్యాయని నాసా తెలిపింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన బర్షీట్ ల్యాండర్ 2018 ఏప్రిల్‌లో చంద్రుడిని సమీపించి నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. రష్యా (యూఎస్ఎస్ఆర్) 1958–59 కాలంలో చాలా ప్రయోగాలు చేయగా కేవలం మూడు రోవర్లే చంద్రుడిపై దిగాయి. -
ముందుంది మరో నవోదయం
బెంగళూరు: చంద్రయాన్ –2 ప్రయోగం చివరి క్షణంలో ఎదురైన అడ్డంకిని చూసి శాస్త్రవేత్తలు నిరాశపడొద్దని, సరికొత్త నవోదయం మరోటి మనకోసం ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్–2లోని విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన క్షణం నుంచే ఇస్రో శాస్త్రవేత్తలను ఊరడించిన ప్రధాని శనివారం ఉదయం ఎనిమిదిగంటలకు వారందరిని కలసి మాట్లాడారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శాస్త్రవేత్తల్లో నెలకొన్న నిస్తేజాన్ని పోగొట్టి, ఉత్సాహపరిచేందుకు సాంత్వన వచనాలు పలికారు. లక్ష్యాన్ని సాధించే కొద్ది క్షణాల ముందు వైఫల్యం ఎదురవడం తనకూ తెలుసని, సైంటిస్ట్‌ల భావోద్వేగాలను అర్థం చేసుకోగలనని చెప్పారు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ నిలిచిపోయినపుడు శాస్త్రవేత్తల బాధను చూడలేకే ఇస్రో కేంద్రం నుంచి వెళ్లిపోయానని, ఏదో బోధించడానికి కాకుండా.. మీ నుంచి స్ఫూర్తి పొందేందుకే మళ్లీ ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. ఇస్రో సాధించిన గత ఘనతలన్నింటికీ భారత్ ఎంతో గర్విస్తోందని, భారత్ మీ వెన్నంటే ఉందన్నారు. ‘లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చాం. భవిష్యత్తులో మరింత పట్టుదలతో పనిచేయాలి. ఈ రోజు నేర్చుకున్న పాఠాలు మనల్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరుస్తాయి. శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో అసలైన ఘన విజయాలు ముందున్నాయని, కొత్త లక్ష్యదూరాలకు వెళ్లాలని, ఈ ప్రయాణంలో దేశ ప్రజలందరూ ఇస్రో వెన్నంటే ఉన్నారని భరోసా ఇచ్చారు. చంద్రయాన్ –2 సక్సెస్ కోసం శాస్త్రవేత్తలు చేసిన కృషి చాలా విలువైందని కొనియాడారు. విక్రమ్ జాబిల్లిని కౌగిలించుకుంది.. కవులు, కథల్లో జాబిల్లిని భావాత్మకంగా వర్ణించారని, బహుశా విక్రమ్ వీటి ప్రభావానికి లోనై, చివరి క్షణాల్లో జాబిల్లిని కౌగిలించుకుని ఉంటుందని మోదీ చమత్కరించారు. ఈ సంఘటన జాబిల్లిని అందుకోవాలన్న మన సంకల్పాన్ని దృఢం చేసిందన్నారు. ల్యాండర్‌తో సమాచారం తెగిపోయిందని తెలీగానే మీరంతా భావోద్వేగానికి లోనయ్యారు. కానీ, ఈ వైఫల్యం తాత్కాలికం మాత్రమేనని భవిష్యత్ విజయాలకు శక్తినిచ్చే విషయమన్నారు. ‘సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు. ప్రయత్నాలు, ప్రయోగాలే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. -
‘విక్రమ్’ ఎక్కడ..?
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైంది. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎంతో ఆసక్తితో ప్రయోగాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా గందరగోళం, నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు దేశ ప్రజలు, అటు శాస్త్రసాంకేతిక నిపుణుల్లో నైతికస్థైర్యం నింపేలా ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి 90 నుంచి 95 శాతం లక్ష్యాలను అందుకున్నామని తెలిపింది. చంద్రుడికి సంబంధించి తమ పరిశోధనలు కొనసాగుతాయంది. విక్రమ్ ల్యాండర్ అనుకున్న ప్రకారం తన వేగాన్ని తగ్గించుకుని చంద్రుడికి 2.1 కి.మీ దగ్గరకు సమీపించగానే సంకేతాలు నిలిచిపోయాయని చెప్పింది. రాబోయే 14 రోజుల్లో విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను తాము ప్రస్తుతం విశ్లేషిస్తున్నామని చెప్పింది. ఏడేళ్ల పాటు ఆర్బిటర్ సేవలు.. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి ఇస్రో కీలక విషయాన్ని ప్రకటించింది. ఇందులో ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం ఏడు రెట్లు పెరిగిందని చెప్పింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్–2ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం 12 నెలలు కాగా, ఇప్పుడు ఏడేళ్ల పాటు పనిచేసే అవకాశముందని ఇస్రో తెలిపింది. వాహకనౌకను అత్యంత కచ్చితత్వంతో ప్రయోగించడం, మిషన్ నిర్వహణ పద్ధతుల కారణంగా ఆర్బిటర్ జీవితకాలం 7 సంవత్సరాలు పెరిగిందని వెల్లడించింది. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో మార్పులు, ఖనిజాలు, నీటి అణువులను ఈ ఆర్బిటర్ విశ్లేషిస్తుందని చెప్పింది. ఇందులోవాడిన అంత్యంత శక్తిమంతమన కెమెరా, చంద్రుడికి సంబంధించిన కీలక ఫొటోలను చిత్రీకరిస్తుందని ఇస్రో పేర్కొంది. అసలేమైంది..? కూలిపోయిందా?... సమాచార వ్యవస్థ మాత్రమే పనిచేయడం లేదా? మళ్లీ పనిచేసే అవకాశముందా? విక్రమ్‌పై ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? శనివారం ఉదయం నుంచి భారతీయులందరి మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవే. కచ్చితమైన సమాధానాలకు కొంత కాలం వేచి చూడాల్సిందేగానీ.. నిపుణులు మాత్రం విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ వైఫల్యానికి పలు కారణాలు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్‌తో సమాచారం తెగిపోయేందుకు ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చునని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ అభిప్రాయపడ్డారు. సెన్సర్లు పనిచేయకపోవడం మొదలుకొని, విక్రమ్‌లోని సాఫ్ట్వేర్ పనితీరులో తేడాలు, చివరి సెకనులో ఇంజిన్లు అందించే థ్రస్ట్ (చోదక శక్తి)లో మార్పులు వంటి కారణాలు ఉండవచ్చునని.. అసలు కారణమేదో ఇస్రో సమాచార విశ్లేషణతో తెలుస్తుందన్నారు. విక్రమ్ ప్రయాణించాల్సిన మార్గం, వేగాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెగిపోయేంత వరకూ ఉన్న వివరాలను పరిశీలిస్తే కారణమేమిటో తెలియకపోదు అని ఆయన అన్నారు. జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో విక్రమ్ దిశ మారిపోయి ఉండవచ్చునని లేదా ఇంజిన్లు పనిచేయకపోవడం, కంప్యూటర్ సంబంధిత సమస్యలు వచ్చి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని సాట్సెర్చ్ సంస్థ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ నారాయణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇంకో 2.1 కిలోమీటర్లు మాత్రమే దిగాల్సిన స్థితిలో సమాచార సంబంధాలు తెగడం చూస్తే ఇంజిన్ సమస్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయన్నారు. విక్రమ్ క్రాష్‌ల్యాండ్ అవడంతో, దాని యంటెన్నా ధ్వంసమై సిగ్నల్స్ ఆగిపోయి ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గతి తప్పిందా? సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ క్రమేపీ తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరవడం తెల్సిందే. ఈ క్రమంలో ఇది సుమారు 35 కిలోమీటర్ల ఎత్తు నుంచి నెమ్మదిగా తన వేగాన్ని తగ్గించుకుంటూ ఉపరితలంపైకి నెమ్మదిగా ల్యాండ్ కావాలి. అయితే సమాచార సంబంధాలు తెగిపోయేందుకు క్షణం ముందు వరకూ విక్రమ్ ప్రయాణించిన మార్గాన్ని పరిశీలిస్తే... అది ముందుగా ల్యాండింగ్‌కు నిర్దేశించిన స్థానం నుంచి చాలా పక్కకు జరిగిందని ఒక నిపుణుడు తెలిపారు. విక్రమ్‌లోని నాలుగు ఇంజిన్లలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా... వేగాన్ని నియంత్రించుకోవడం విక్రమ్ వల్ల అయ్యే పనికాదని, దీంతో అది వేగంగా పడిందేమోనన్నారు. విక్రమ్ ప్రయాణమార్గాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. విక్రమ్ కిందకు దిగే సమయంలో జాబిల్లిపై గురుత్వాకర్షణ శక్తి వివరాలు కచ్చితంగా అందించాల్సిన అవసరముందని.. ఇందులో వచ్చే సూక్ష్మమైన మార్పులనూ లెక్కించాలని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సీఈవో పవన్ చందన చెప్పారు. విక్రమ్‌లోని ఆటానమస్ ల్యాండింగ్ సిస్టమ్ (తనంతట తానే కిందకు దిగేందుకు ఏర్పాటైన వ్యవస్థ), సమాచార వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విజయావకాశాలు 37 శాతమే విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ ఆషామాషీ వ్యవహారం కాదని.. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రయోగంలో విజయావకాశాలు కేవలం 37 శాతమే అని శివన్ గతంలో అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు జరిగిన ప్రయత్నాల్లో విజయవంతమైంది 37 శాతమే. ఇస్రో ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. కాబట్టి అందరిలో ఉత్సుకత నెలకొంది’ అని శివన్ శుక్రవారం అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్–2 చివరిక్షణంలో ఎదురుదెబ్బ ఎదుర్కోన్నా 95 శాతం సక్సెసే అనేది నిపుణుల మాట. -
రాయని డైరీ.. డాక్టర్ కె. శివన్ (ఇస్రో చైర్మన్)
అంతా వెళ్లిపోయారు. ప్రధాని వెళ్లిపోయారు. మూడొందల మంది జర్నలిస్టులు వెళ్లిపోయారు. అరవై మంది స్కూలు పిల్లలు వెళ్లిపోయారు. నూటా ముప్ఫై కోట్ల మంది భారతీయులూ టీవీల ముందు నుంచి వెళ్లిపోయే ఉంటారు. ఇస్రో స్టాఫ్ కూడా వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయారు. ఆపరేషన్స్ కాంప్లెక్స్‌లో ఒక్కడినే కూర్చొని ఉన్నాను. రైల్వే స్టేషన్లో ఒంటరి ప్రయాణికుడిలా ఏ నంబరూ లేని ప్లాట్‌ఫాం మీద నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. ‘దయచేసి వినండి. చంద్రుడిపైకి మీరు పంపిన ఉపగ్రహం మరికొద్ది నిమిషములలో చంద్రునిపై దిగబోవుచున్నది’ అనే ఒక అనౌన్స్‌మెంట్‌ను నా మనసు పిచ్చిగా కల్పించుకుంటోంది. కట్ అయిన సిగ్నల్స్ మళ్లీ కనెక్ట్ కావనేముంది?! ట్రాకింగ్ రూమ్‌లో గోడలపై వరుసగా కంప్యూటర్ స్క్రీన్లు. అంతరిక్షంలో ఏం జరగలేదో ఆ జరగని దానిని మాత్రమే అవి చూపగలవు. ఏం జరిగితే బాగుండేదని నా అంతరంగంలో ఉందో, ఆ బాగుండే దానిని చూపిస్తే అవి కంప్యూటర్లు ఎందుకవుతాయి? ఓదార్చి, భుజం తట్టి, ‘నెక్స్›్ట టైమ్ బెటర్ లక్’ అని చెప్పే మనుషులు అవుతాయి. వెళ్లే ముందు భుజం తట్టి వెళ్లారు ప్రధానమంత్రి. ఇంతవరకు సాధించిన దానికి, ఇక ముందు సాధించబోయే దానికీ! వెళ్లే ముందు బొటనవేళ్లు ఎత్తి చూపి వెళ్లారు జర్నలిస్టులు.. ‘మిస్టర్ శివన్, మీ అంతరిక్షంలో జరిగేది, జరగనిదీ ఏదైనా మాకు బిగ్ ఈవెంటే..’ అని అంటూ! వెళ్లే ముందు స్కూల్ పిల్లలు ‘ఫీల్ అవకండి అంకుల్’ అన్నట్లు చూసి వెళ్లిపోయారు. రాత్రి కలలోకి చందమామ వస్తే కనుక క్లాస్ పీకాలన్న కృతనిశ్చయం ఆ పిల్లల కళ్లలో కనిపించింది! ‘ఇంత కష్టపడ్డాం కదా, నువ్వెందుకు అందలేదు చందమామా?’ అని గొడవపడతారేమో వీళ్లంతా. ‘అయినా అందనంత దూరంలో ఉండటం ఏంటి నువ్వు! ఎక్కడానికి ఎవరెస్టులా, ఈదడానికి హిందూ మహాసముద్రంలా అందుబాటులో ఉండొచ్చుగా అంటారేమో వీళ్లలోనే కాస్త పెద్దపిల్లలు. మరీ చిన్నవాళ్లయితే.. ‘మాకు అందొద్దులే చందమామా.. మా అమ్మ మా తమ్ముడిని ఎత్తుకుంటే వాడి చేతికి అందేలా నువ్వుంటే చాలు’ అని బంపర్ ఆఫర్ ఇస్తారేమో చంద్రుడికి. ఆలోచనలు తెగట్లేదు. ఎక్కడ తెగి ఉంటుంది కమ్యూనికేషన్! ఎటువైపు తిరిగి ఉంటుంది ల్యాండర్ డైరెక్షన్! చంద్రుడికి రెండు కిలో మీటర్ల దగ్గరి వరకూ వెళ్లి మిస్ అయిందని కాదు, కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని కాదు, ల్యాండ్ అయి ఉంటే ఇండియాకు గొప్పగా ఉంటుందని కాదు. స్కూలు పిల్లల కేరింతల కోసమైనా చంద్రయాన్ సక్సెస్ అయి ఉండవలసింది. ‘‘సర్’’ అని పిలుపు! తల తిప్పి చూశాను. టీమ్‌లోని కుర్ర సైంటిస్ట్. ‘‘నువ్వింకా వెళ్లలేదా?’’ అన్నాను. ‘‘రండి సర్ వెళ్దాం’’ అన్నాడు. ‘‘కూర్చో. బయటికెళ్తే చంద్రుడికి ముఖమెలా చూపిస్తాం’’ అన్నాను నవ్వుతూ. అతడూ నవ్వాడు. జర్నలిస్టు అవుదామని ఇంటి నుంచి బయల్దేరి, సైంటిస్టు అయి ఇస్రోకి వచ్చిన కుర్రాడు అతడు. ‘‘సర్, మనం సక్సెస్ అయి ఉంటే మీడియా ఏం రాసేదో చెప్పమంటారా?’’ అన్నాడు నవ్వుతూ. చెప్పమన్నట్లు చూశాను. ‘‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇక బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిన ల్యాండ్ అవడమే మిగిలింది అని రాసేవి సర్’’ అని నవ్వాడు. అది నన్ను నా మూడ్‌లోంచి బయటికి లాగే ప్రయత్నమని అర్థమైంది. వాత్సల్యంగా అతడి భుజం తట్టాను. -
అంతరిక్షాన్ని గెలుద్దాం!
‘‘ఇంతింతై, వటుడింతై, మరియు తానింతై/ నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమునకల్లంతై,/ ప్రభా రాశిపై నంతై, చంద్రునికంతౖయె, / ధృవునిపైనంతై, మహ ర్వాటిపైనంతై, / సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థిౖయె’’... బలిచక్రవర్తి దగ్గరకు వామనుడిగా వచ్చిన శ్రీమహావిష్ణువు మహాకాయుడిగా ఎలా ఎదుగుతు న్నాడో వర్ణిస్తూ శ్రీ మద్భాగవతంలో బమ్మెర పోతన చెప్పిన పద్యం. ఆకాశాన్నీ, అంతరిక్షాన్నీ, చంద్రగోళాన్నీ, నక్షత్ర మండలాన్ని దాటుతూ ఎదుగుతున్నాడు వామను డని చెబుతూ అనంతమైన ఈ విశ్వరూపాన్ని పోతన కవి సాక్షాత్కరింపజేశాడు. వామన మూర్తి పెరుగుతున్న క్రమాన్ని ‘రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రం బై...’ అంటూ మరో పద్యంలో సూర్యుడితో పోలుస్తూ వర్ణిస్తాడు. ఒక దశలో సూర్యుడు వామనమూర్తికి గొడుగులా కనిపించాడట. కొంతసేపటికి శిరోరత్నమై కనిపించాడట. ఆ తరువాత క్రమంగా చెవికున్న ఆ కుండలంలాగా, కంఠహారంలాగా, నడుముకున్న వడ్డాణం గంటలాగా, చివరికి పాదాలకున్న అందెలా, పాదాల కింద వున్న పీటలాగా కనిపించాడట. సూర్య బింబం తన పాదాలకింద ఉందా అన్నంతగా వామనుడి రూపం పెరిగింది అంటే ఈ విశ్వానికి ఎల్లలు ఎక్క డున్నాయో మన ఊహలకు ఎలా అందగలదు? ఎనిమిది వందల కోట్ల మంది మానవులు, ఆ సంఖ్యకు కొన్ని కోట్ల రెట్లు అధికమైన జీవరాశిని మోస్తున్న మన భూమి లాంటివి కొన్ని కోట్లు కలిస్తే ఒక నక్షత్రమండలమట. దాన్ని గెలాక్సీ అని పిలుస్తారు. అలాంటి గెలాక్సీలు కొన్ని కోట్లున్నాయట ఈ విశ్వంలో. మన నక్షత్ర మండలంలో మనకు అత్యంత సమీపాన వున్న నక్షత్రం దగ్గరకు అత్యంత వేగంగా ప్రయాణించే యుద్ధ విమానంలో బయల్దేరితే పది లక్షల సంవత్స రాలకు గానీ చేరుకోలేము. ఒక సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు ప్రసరించే కాంతివేగంతో వెళితే పాల పుంతగా పిలుచుకునే మన గెలాక్సీని దాటడానికి ఒక లక్ష సంవత్సరాలు పడుతుంది. చిన్నతనంలో రాత్రిపూట ఆరుబయట వెల్లకిలా పడుకొని ఆకాశంలోని చుక్కలను లెక్కించడానికి ప్రయత్నించనివారు బహుశా ఎవరూ వుండరు. ఆకాశం దూరమెంత? అనంతకోటి నక్ష త్రాలకు ఆవలితీరంలో ఏముంటుంది? ఈ భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఏవీ లేకుంటే ఏమ య్యేది? ఏమీ లేని శూన్యస్థితిని మనం ఎలా ఊహిం చాలి? ఇలా బుర్ర బద్దలు చేసుకున్న బుద్ధి జీవులు కూడా ఎంతోమంది వుండి వుంటారు. ఈ భూమ్మీద వున్న కోట్ల రకాల జీవరాశిలో తెలివైన జీవి మానవుడు. తన తెలివితేటలతో మానవుడు భూగోళాన్ని పాదాక్రాంతం చేసుకున్నాడు. భూగోళం లాంటి గ్రహాలు ఈ సృష్టిలో కోట్ల సంఖ్యలో పరిభ్ర మిస్తున్నపుడు అందులో జీవం మనగలిగే అవకాశాలు న్నవి ఎక్కడున్నాయి? మానవుడి లాంటి జీవి లేదా అంతకంటే తెలివైన జీవి ఎక్కడుంది? ఈ అన్వేషణల ఫలితంగా ఉద్భవించిన అంతరిక్షశాస్త్రం ముందున్న ప్రధమ లక్ష్యం మరికొన్ని మానవ ఆవాస యోగ్యమైన గ్రహాలను కనిపెట్టడం. మానవుని స్వార్థం, దురాశల ఫలితంగా పర్యావరణం ధ్వంసమవుతున్న భూగోళం మరికొన్నాళ్ల తర్వాత జీవరాశికి ఆవాస యోగ్యం కాక పోవచ్చు లేకపోతే ఏ భారీ గ్రహశకలమో, తోకచుక్కనో తగిలి భూమిని ధ్వంసం చేయవచ్చు. ‘భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో...’ అంటాడు దాశరథి ఒక అద్భుతమైన గేయంలో. అనంత విశ్వంలోంచి అలా రాలిపడుతున్న గోళ శకలాల్లో భూమివైపు వచ్చే అవకాశం వున్నవి సుమారు 25 వేల వరకు ఉండొచ్చని ‘నాసా’ అంతరిక్ష పరిశోధనకేంద్రం అంచనా. ఇందులో భూమిని పూర్తిగా గానీ, పాక్షికంగా గాని ధ్వంసం చేయగలిగినవి ఏమైనా వున్నాయా అనే అంశంపై నాసాలో పరిశోధనలు జరుగుతున్నవి. ఈ రెండు కార ణాలవల్ల భవిష్యత్తులో మానవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే విశ్వంలోని ఆవాస యోగ్య గ్రహాలను కనిపెట్టి క్రమంగా విస్తరించాలని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. గ్రహాల్లో వలస రాజ్యాలను స్థాపించడానికి ముందు సమీప భవిష్యత్తులో భూగోళంలోని దేశాల మధ్య యుద్ధాలు జరిగితే అవి అంతరిక్ష యుద్ధాలుగానే ఉండే అవకాశం ఉంది. యుద్ధట్యాంకులు, వైమానిక దాడులకు ఇక క్రమంగా కాలం చెల్లుతుంది. శత్రుదేశాల కమ్యూని కేషన్ ఉపగ్రహాల మీద గురిపెట్టి క్షిపణులతో పేల్చగలి గితే చాలు, ఆ దేశపు నవనాడులు కృంగిపోవడం ఖాయం. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏఎస్ఏటి)ని ఇటీవలే భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది. భారత్‌తో పాటు అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ప్రస్తుతానికి ఈ శక్తి వుంది. అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో సాధించిన విజయాల ప్రాతిపదికపై చూస్తే భారత్ ఇప్పుడు నాలుగో స్థానంలో వుంది. పురోగమిస్తున్న వేగాన్ని చూస్తే ఈ స్థానం మరింత మెరుగుపడవచ్చు. గణిత, విజ్ఞాన శాస్త్రాల్లో సహజ ప్రతిభావంతులైన భారతీయ బాలబాలికలకు నాణ్యమైన విద్యను, శిక్షణను ఉచితంగా అందించ గలిగితే ఎందరో విక్రమ్సారా భాయ్‌లు, మరెందరో సునీతా విలియమ్స్‌లు భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్ట వచ్చునేమో! అగ్రస్థానానికి చేరుకున్న భారతదేశం, అటు పిమ్మట అనతికాలంలోనే నివాసయోగ్యమైన గ్రహాలను కనిపెట్టి వలసలుగా మార్చుకోవచ్చునేమో! డెబ్బయ్ రెండేళ్ల కిందటి వరకు ఈ భూ ప్రపంచంపై ఒక వలస దేశంగా వున్న భారతదేశం మరో డెబ్బయ్యేళ్లకో, వందేళ్లకో విశ్వవేదికపై అగ్రరాజ్యంగా వలస గ్రహాలను పరిపాలించడం ఎంతటి మధురోహ! ఏమో... ఆ ఊహ నిజమౌతుందేమో! నిన్నటి చంద్రయాన్–2 ప్రయోగం ఔననే సంకేతాలనే పంపిస్తు న్నది. చివరి క్షణంలో సిగ్నల్స్ నిలిచిపోయినంత మాత్రాన ఈ ప్రయోగం విఫలమైనట్టుగా భావించడం పొరపాటు. నిర్దేశించిన మార్గంలో రవ్వంత తేడా లేకుండా ప్రయాణించి, ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడివడి వేగాన్ని నియంత్రించుకుంటూ చందమామ బుగ్గను ముద్దాడేంత చేరువగా వెళ్లి సంబంధాలను కోల్పోయింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారితే శనివారమనగా ఒంటి గంటా ముప్ఫైఎని మిది నిమిషాలకు ల్యాండర్ చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. ఆఖరి పదిహేను నిమి షాల ఉత్కంఠ ఘట్టం. అందులో 13 నిమిషాలు విక్రమ్ ల్యాండర్ సజావుగానే కిందకు జారింది. స్వీయ మేథ స్సుతో అది క్రమంగా తన వేగాన్ని తగ్గించుకున్నది. ఎందుకో ఆఖరి రెండు నిమిషాల్లోనే దాని వేగం నియం త్రణకు లొంగలేదు. అంటే 3,84,000 కిలోమీటర్ల ప్రయాణంలో 3,83,997.9 కిలోమీటర్లు సజావుగా వెళ్లింది. ఇక కేవలం 2.1 కిలోమీటర్లు కిందకు దిగి చంద్రుని ఉపరితలాన్ని సున్నితంగా తాకవలసి వుంది. ఆ సమయంలో అది అదుపు కోల్పోయినట్టు స్పష్టమ వుతున్నది. ఏం జరిగిందో ఇంకా తెలియవలసి వుంది. అదుపుకాని వేగంతో క్రాష్ ల్యాండింగ్ జరిగి వుండొచ్చు. క్షేమంగా దిగి కూడా ఉండవచ్చునేమో, కమ్యూనికేషన్ల వ్యవస్థలో లోపం ఏర్పడడం వల్ల సంబంధాలు తెగి పోయి ఉండవచ్చు కూడా. కానీ ఇందుకు అవకాశాలు స్వల్పమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతా సజావుగా జరిగితే ఆర్బిటర్, ల్యాండర్, అందులోంచి బయటకు రావాల్సిన రోవర్లు అక్కడ 14 రోజులు పనిచేసి తగిన సమాచారాన్ని పంపించి ఉండేవి. ఇప్పుడు ఆర్బిటర్ సవ్యంగానే వుంది. భూ కేంద్రంతో నిరంతర సంబంధంలో వున్నది. ఏడాది పాటు అది సంచరిస్తూ చంద్రుడి ఛాయాచిత్రాలను, విలువైన సమాచారాన్ని పంపిస్తుంది. ఆఖరి క్షణంలో ఎదురైన ఆటంకానికి కారణాలను ఇస్త్రో విశ్లేషిస్తున్నది. మీరు సాధించిన విజయాలు తక్కువేమీ కాదు, ఈ చివరి నిమిషం అడ్డంకిని చూసి నిరాశపడవలసిన అవ సరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తల వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. దేశమంతా అండగా నిల బడింది. ఈ ఆత్మీయత చాలు, మన శాస్త్రవేత్తలు ఉరిమే ఉత్సాహంతో అతి త్వరలో చందమామపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయడానికి. అసలు చంద్రయాన్–2 ప్రయోగమే ఒక సవాల్‌గా ఇస్రో తీసుకున్నది. ఈ ప్రయాణానికి క్రయోజనిక్ ఇంజిన్ కీలకం. అప్పటికి దాన్ని తయారుచేసే సాంకేతిక సామర్ధ్యం మనకు లేదు. ఇస్తానన్న రష్యా మొండిచేయి చూపింది. అమెరికా ఒత్తిడి కారణంగానే రష్యా మాట తప్పినట్టు తెలిసింది. ఇస్రో శాస్త్రవేత్తలు పట్టుదలతో స్వయంగా ఇంజిన్‌ను తయారు చేసుకున్నారు. ఇంజిన్ ఒక్కటే కాదు, ఈ ప్రయోగానికి వాడిన సాంకేతిక పరిజ్ఞానమంతా నూటికి నూరుపాళ్లు స్వదేశీ. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా, ఇప్పటి వరకూ ఎవరూ సాహసించని చంద్రుని దక్షిణ ధృవ మండలం లక్ష్యంగా ప్రయోగించి నూటికి నూరుపాళ్లు కచ్చితత్వంతో దాదాపుగా గమ్యాన్ని తాకించిన శాస్త్రవేత్త లారా సాహో. ఈ మహాయజ్ఞానికి ఇస్రో చేసిన ఖర్చు 142 మిలియన్ డాలర్లు. అంటే మన రూపాయల్లో దాదా పుగా వెయ్యి కోట్లు. తెలుగు తమ్ముళ్లు ఒక్క ఏడాదిలో ఇసుకలో నాకేసినంత విలువ కూడా కాదు. బాహు బలి–2 సినిమా కొచ్చిన కలెక్షన్ల కంటే తక్కువ. ‘‘రాశి చక్రగతులలో రాత్రిందివాల పరిణామాలలో, బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో, కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువు సంకల్పంలో ప్రభవం పొందినవాడా! మానవుడా! మానవుడా!’’ అంటాడు శ్రీశ్రీ. అలా ప్రభవించిన మానవుడు వామన మూర్తి లాగా వ్యాపించి, నిరంతరం విస్తరిస్తున్న విశ్వం రహస్యాలను తరుముకుంటూ దిగంతాల దాకా పరు గులు తీసేందుకు సిద్ధం కావాలని, అందుకు తొలి అడుగు భారతీయుడు వేయాలని ఆకాంక్షిద్దాము. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
‘చంద్రయాన్–2’ది విజయమే!
సాక్షి, న్యూఢిల్లీ : చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు అక్కడికి ఇస్రో పంపించిన ఉపగ్రహం ‘చంద్రయాన్–2’ చివరి నిమిషంలో విఫలం అవడం పట్ల ఇస్రో చైర్మన్ కే. శివన్, ఇతర శాస్త్రవేత్తలు తీవ్రంగా నిరాశ చెందడం, వారిని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓదార్చడం తెల్సిందే. వాస్తవానికి చంద్రయాన్–2 విఫలమైందని చెప్పడానికి బదులు విజయవంతమైందనే విషయాన్నే ఎక్కువ చెప్పాలి. ఈ ప్రయోగంలో రెండు ప్రధాన దశలు ఉన్నాయి. మొదటి దశ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రారంభమయ్యే 30 కిలోమీటర్ల దూరం వరకు ఉపగ్రహాన్ని తీసుకెళ్లడం, రెండో దశ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి తీసుకెళ్లడం. ఈ రెండో దశనే కాస్త క్లిష్టమైనది. మొదటి దశలో చంద్రయాన్ ఉపగ్రహం అంతరిక్షంలో 3,84,400 కిలోమీటర్లు సునాయాసంగా ప్రయాణించి రెండో దశలోనూ, అంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోనికి కూడా 28 కిలోమీటర్లు చొచ్చుకొని పోయింది. చంద్రుడికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి ‘విక్రమ్ ల్యాండర్’ దూసుకుపోవడం సాధారణ విషయం కాదని, దీన్ని సక్సెస్ కిందనే పరిగణించాల్సి ఉంటుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఈ దిశగా భారత శాస్త్రవేత్తలు చేసిన కృషిని అభినందించారు. ఇక చంద్రుడి ఉపరితలంపై ఉపగ్రహాన్ని దించే మూడవ ప్రక్రియలోనూ భారత్ తదుపరి ప్రయత్నంలో విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: వారం రోజులు పస్తులున్నాను: శివన్) -
మీరే నిజమైన హీరోలు : మహేష్ బాబు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో యావత్ భారతదేశం ఇస్రోకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇస్రోకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భాసటగా నిలిచారు. ఈ క్రమంలో మహేష్ బాబు కామెంట్ చేస్తూ.. ఇస్రోకు అభినందనలు తెలిపాడు. మహర్షి సినిమాలోని డైలాగ్‌ను కోట్ చేస్తూ.. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినీ.. ఇట్స్ ఏ జర్నీ అంటూ ఇస్రోకు మద్దతు తెలిపాడు. చంద్రయాన్-2 కోసం పని చేసిన ప్రతీ ఒక్క శాస్త్రవేత్తకు సెల్యూట్ చేస్తున్నట్తు తెలిపాడు. మీరే మా నిజమైన హీరోలు.. మేము మీ వెంటే ఉంటాము.. మీ విజయగాథకు ఇది కేవలం ఆరంభమే అంటూ ట్వీట్ చేశాడు. Success is not a destination, it's a journey & @isro had a historical journey with #Chandrayaan2. I salute each & every scientist working on this project🙏You are our real heroes & we are with you. This is just the beginning of your success story. Way to go🙌#MissionMoon — Mahesh Babu (@urstrulyMahesh) September 7, 2019 -
వారం రోజులు పస్తులున్నాను: శివన్
చెన్నై: ఈ రోజు సోషల్ మీడియా వేదికలన్నింటిలో ఓ ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో చీఫ్ శివన్ కంటతడి పెట్టారు. దాంతో మోదీ ఆయనను దగ్గరకు తీసుకుని ఓదారుస్తోన్న ఫోటో యావత్‌దేశాన్ని కదిలించింది. మిషన్ పట్ల ఎంత అంకిత భావం లేకపోతే.. అంతలా బాధపడతారు అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ ప్రయోగాన్ని శివన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. కనుకే తొలిసారి ఏర్పడిన ఆటంకాన్ని కేవలం ఏడు రోజుల్లో సరి చేసి.. ప్రయోగాన్ని తిరిగి ప్రారంభించారు. ఆఖరి నిమిషంలో విఫలం కావడం బాధగా ఉన్నా అక్కడి దాకా చేరుకున్నామంటే అదంతా శివన్ కృషి వల్లే అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో శివన్ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ సమీపంలో మేళా సారకల్విలైలో జన్మించారు శివన్. అతని తల్లిదండ్రులు కైలాసవదీవానదార్, చెల్లమాల్. రైతు కుటుంబంలో జన్మించిన శివన్ పట్టుదలతో శ్రమించి ఇస్రో చీఫ్‌గా ఎదిగారు. కాలేజీలో చేరే వరకు ధోతి ధరించి.. ఉత్త కాళ్లతోనే తిరిగారు. అయితే ఈ కష్టాలేవి ఆయనను లక్ష్యం నుంచి దూరం చేయలేదు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో శివన్ మాట్లాడుతూ.. ‘కోరుకున్నది నాకు ఎప్పుడు లభించలేదు.. దాని గురించి బాధ లేదు. నాకు దక్కిన వాటితో నేను సంతృప్తిగా ఉన్నాను’ అన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.. చెప్పులు లేకుండా తిరిగే వాడిని ‘మా గ్రామంలో నేను చాలా ఆసక్తికర జీవితాన్ని గడిపాను. మా నాన్న వ్యవసాయం చేసేవారు. దాంతో స్కూల్ నుంచి రాగానే మేం పొలం వెళ్లేవాళ్లం. వేసవిలో మా నాన్న మామిడిపళ్ల వ్యాపారం చేసేవారు. మాకు స్కూల్ లేని రోజు మా నాన్న లేబర్‌ను పిలిచేవారు కాదు. మమ్మల్ని పొలం తీసుకెళ్లి పని చేయించేవారు. పొలం పనుల్లో సాయం చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజీలోనే నన్ను చేర్పించారు. కాలేజీలో చేరే వరకు ధోతినే ధరించేవాడిని. కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కావు. అయితే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడు పస్తులుంచలేదు. మూడు పూటలా కడుపు నిండా భోజనం పెట్టేవారు’ అన్నారు. ఇంజనీరింగ్‌లో చేరడానికి వారం రోజులు పస్తులు ఇక ఉన్నత చదువులు గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను. కానీ అది చాలా ఖరీదైన కోర్సు కావడంతో మా నాన్న నన్ను బీఎస్సీ(బ్యాచిలర్ ఆఫ్ సైన్స్)లో చేరమన్నారు. నేను దానికి అంగీకరించలేదు. మా నాన్న నిర్ణయం మార్చాలని వారం రోజుల పాటు తిండి తినడం మానేశాను. అయినా ఫలితం లేదు. చివరకు నా నిర్ణయాన్నే మార్చుకున్నాను. అలా బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేశాను. నేను బాగా చదవడంతో మా నాన్నలో మార్పు వచ్చింది. అప్పుడాయన ‘ఒకప్పుడు నీకు నచ్చిన కోర్సులో చేరడానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడలా చేయాలనుకోవడం లేదు. నువ్వు కోరుకున్నట్లే ఇంజనీరింగ్‌లో చేరు’’ అన్నారని తెలిపారు శివన్. ‘నన్ను ఇంజనీర్‌గా చూడటం కోసం మా నాన్న భూమి కూడా అమ్మారు. అలా ఇంజనీరింగ్‌లో చేరాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాను. కానీ నాకు వెంటనే ఉద్యోగం దొరకలేదు. ఇప్పటిలా అప్పట్లో ఎక్కువ ఉద్యోగాలు ఉండేవి కావు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో మాత్రమే ఉద్యోగాలు ఉండేవి. దాంతో ఉన్నత చదువుల కోసం ఐఐఎస్సీలో చేరాను’ అన్నారు. అయితే తన జీవితంలో తాను కోరుకుంది ఎప్పుడు దొరకలేదన్నారు శివన్. ‘నేను శాటిలైట్ సెంటర్లో చేరాలని భావించాను.. కానీ విక్రమ్ సారాభాయ్ సెంటర్లో చేరాల్సి వచ్చింది. అక్కడ కూడా ఏరోడైనమిక్స్‌లో జాయిన్ అవ్వాలనుకున్నాను. కానీ పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌లో చేరాల్సి వచ్చింది. ఇలా ప్రతి చోటా నేను కోరుకున్నది నాకు లభించలేదు’ అన్నారు శివన్. తాను ఇష్ట పడింది లభించకపోవడంతో.. వచ్చిన దాన్నే ప్రేమించి ఉన్నతంగా ఎదిగారు శివన్. (చదవండి: నా ప్రధాని మంచి మనస్సున్న మనిషి) -
వారు చాలా కష్టపడ్డారు : మమతా బెనర్జీ
సాక్షి, కోల్‌కతా : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సజావుగా సాగిన విక్రమ్ ల్యాండర్ ప్రయాణంలో కుదుపులు చోటుచేసుకున్నప్పటికీ శాస్త్రవేత్తల శ్రమకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్ 2 ప్రయోగంపై మోదీ ప్రభుత్వం అతి చేస్తోందని విమర్శించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచారు. చంద్రయాన్ 2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చాలా కష్ట పడ్డారని ప్రశంసించారు. వారి కష్టం ఎప్పటికీ వృథా కాదన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్ చేశారు. ‘ఇస్రో శాస్త్రవేత్తల పనితీరు మాకు గర్వంగా ఉంది. చంద్రయాన్-2 కోసం చాలా కష్ట పడ్డారు. శాస్త్ర-సాంకేతిక రంగంలో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిపిపేందుకు పునాది వేసిన ఇస్రో వ్యవస్థాపకులకు ఇవే నా నివాళులు’ అంటూ మమతా ట్విట్ చేశారు. (చదవండి : చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది) ఇస్రో శాస్త్రవేత్తల శ్రమ వృథాపోదని, ఈ ప్రయోగం ఎన్నో ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనలకు పునాదిగా నిలుస్తుందని ప్రశసించారు. భారతీయులంతా ఇస్రో శాస్త్ర వేత్తలకు అండగా ఉన్నామని, ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేసి దేశానికి గొప్ప పేరుతేవాలని అంటూ మరో ట్విట్ చేశారు. కాగా, శుక్రవారం బెంగాల్లో అసెంబ్లీలో మమతా మాట్లాడుతూ.. చంద్రయాన్ 2 ప్రయోగంపై నరేంద్ర మోదీ అతి చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఇదే తొలి ప్రయోగం అయినట్టు, మోదీ అధికారంలోకి రాకముందు ఇలాంటివేవీ జరగనట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారని మమతా బెనర్జీ ఆక్షేపించారు. దేశంలో ఆర్థిక విపత్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రధాని మోదీ చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. We are proud of our scientists. The @isro team worked hard for #Chandrayaan2 . A befitting tribute to our founding fathers who envisioned India’s place in the league of scientifically advanced nations far ahead of their times. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) September 7, 2019 -
‘రాష్ట్రపతే ఎందుకు.. ప్రధాని కావొచ్చుగా?’
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు ఇస్రో కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రయోగాన్ని వీక్షించేందుకు మోదీతో పాటు దాదాపు 70 మంది విద్యార్థులు కూడా ఇస్రో కేంద్రానికి వెళ్లారు. ప్రయోగం విఫలమయ్యిందని తెలిసిన తర్వాత మోదీ అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న విద్యార్థులతో మోదీ కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి ‘మోదీజీ.. నాకు రాష్ట్రపతి కావాలని కోరిక. అందుకు నేను ఏం చేయాలో చెప్తారా’ అంటూ ప్రశ్నించాడు. అందుకు మోదీ ‘రాష్ట్రపతే ఎందుకు.. ప్రధాన మంత్రివి కావొచ్చు కదా’ అని ప్రశ్నించాడు. ఆ తర్వాత వైఫల్యాలు వచ్చినప్పుడు కుంగి పోకుండా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ప్రయత్నిస్తే జీవితంలో దేన్నైనా సాధించవచ్చని మోదీ తెలిపారు. #WATCH Bengaluru: "Why President? Why not Prime Minister?", says PM Modi when a student, selected through ISRO's 'Space Quiz' competition to watch the landing of Vikram Lander along with him, asks him, ''My aim is to become the President of India. What steps should I follow?'' pic.twitter.com/rhSlY1tMc4 — ANI (@ANI) September 6, 2019 ఇస్రో ప్రతిష్టత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలం కావడంతో యావత్‌దేశం తీవ్ర నిరాశకు గురయ్యింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మోదీతో పాటు దేశ ప్రజలంతా శాస్త్రవేత్తలకు మద్దతు తెలుపుతున్నారు. మీరు సాధించిన విజయం చిన్నదేం కాదు అంటూ ఓదారుస్తున్నారు. (చదవండి: యావత్ దేశం మీకు అండగా ఉంటుంది) -
చంద్రయాన్-2: రాని పనిలో వేలెందుకు పెట్టాలి!?
న్యూఢిల్లీ: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరిదశలో చేదు ఫలితం ఎదురైన వేళ.. పాకిస్థాన్ సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ట్విటర్లో రెచ్చిపోయాడు. భారత్‌కు వ్యతిరేకంగా ఫవాద్ నోటిదురుసు వ్యాఖ్యలు చేసి.. విచ్చలవిడితనాన్ని ప్రదర్శించాడు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనై.. ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుస ట్వీట్లు చేసిన ఫవాద్ ‘రాని పనిలో వేలు పెట్టొద్దు.. డియర్ ఎండియా (Dear “Endia” )’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌కు 8,800లకుపైగా కామెంట్లు వచ్చాయి. పలువురు భారత నెటిజన్లు ఫవాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చంద్రాయాన్-2లో కితకితలు పెట్టే అంశమేమిటంటే.. అది రాత్రంతా ఫవాద్‌ను మేల్కొనే చేసింది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. పలువురు పాకిస్థానీ నెటిజన్లు కూడా ఫవాద్ తీరును తప్పుబట్టారు. భారత్ కనీసం ప్రయత్నమన్నా చేసిందని, అలాంటి ప్రయత్నాన్ని కించపరచడం పాకిస్థాన్ పేరును చెడగొట్టడమే అవుతుందని పలువురు నెటిజన్లు సూచించారు. అయినా, ఫవాద్ ఏమాత్రం వెనుకకు తగ్గలేదు. ఆ తర్వాత కూడా ఇస్రోపై, భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ ట్వీట్లు పెట్టారు. చంద్రాయన్-2 వైఫల్యానికి తానే కారణమైనట్టు ఇండియన్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారని, చంద్రాయన్ బొమ్మ మూన్‌పైన కాకుండా ముంబైలో ల్యాండ్ అయిందని ఎద్దేవా వ్యాఖ్యలు చేశారు. మోదీ శాటిలైట్ కమ్యూనికేషన్ మీద ప్రసంగాలు చేస్తున్నారని, ఆయన నిజానికి పొలిటిషియన్ కాకుండా ఆస్ట్రోనాట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరుపేద దేశానికి చెందిన రూ. 900 కోట్లు వృథా చేయడంపై లోక్‌సభలో మోదీని ప్రతిపక్షాలు నిలదీయాలని ఫవాద్ అక్కసు వెళ్లగక్కారు. అల్పులు పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తున్నారని గత ఏడాది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారని, ఫవాద్ తీరు చూస్తే అది నిజమేనని అనిపిస్తోందని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. -
ఇది ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తి: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం తుది దశలో విఫలమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్ జాతి అండగా నిలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర్నుంచీ అంతా శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాల కోసం యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన వేళ చేదు ఫలితమే ఎదురైనప్పటికీ ఇదొక స్ఫూర్తివంతమైన ప్రయోగమని కొనియాడుతున్నారు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి చంద్రయాన్-2 ప్రయోగంపై స్పందిస్తూ.. ‘ ఇస్రో శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రయోగం భారత్ జాతికే గర్వకారణం. స్పేస్ సైన్స్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచానికే వన్నె తెచ్చారు. ఈ తరహా ప్రయోగాలు లక్షల మంది భారత చిన్నారులకు స్ఫూర్తి నింపుతుంది. జైహింద్’ అని ట్వీట్ చేశాడు. ఇస్రో ఎంతగానో శ్రమించింది: కోహ్లి చంద్రయాన్-2 ప్రయోగం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయినా ఇస్రో శాస్త్రవేత్తలపై మాత్రం సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ ప్రయోగాన్ని విజయంవంతం చేయాలని సంకల్పించుకున్న ఇస్రో కృషి నిజంగా అమోఘమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొనియాడాడు. మనం చేసిన ప్రయోగమే ఒక సక్సెస్ అని కోహ్లి పేర్కొన్నాడు. సైన్స్‌లో ఫెయిల్యూర్స్ అంటూ ఏమీ ఉండవని ఈ సందర్భంగా తెలిపాడు. రాత్రింబవళ్లు ఎంతగానో శ్రమించిన శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందన్నాడు. చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన తరుణంలో విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. దాంతో చంద్రయాన్-2 ప్రయోగం తృటిలో చేజారింది. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. -
నా ప్రధాని మంచి మనస్సున్న మనిషి
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం.. చివరిక్షణంలో కుదుపులకు లోనైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రో చీఫ్ కే శివన్‌ను కలిసి ఓదార్చారు. ఎంతో శ్రమతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. వెయ్యికోట్లు విలువైన చంద్రాయన్-2 ప్రాజెక్టు చివరిక్షణంలో చేదు ఫలితాన్ని ఇవ్వడంతో శివన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీని కలిసిన సమయంలో భావోద్వేగం తట్టుకోలేక చిన్నపిల్లాడిలా కన్నీటి పర్యంతమయ్యారు. శివన్ పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ ఆయనను గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. శాస్త్రవేత్తల అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని, భవిష్యత్తులో విజయాలు సాధిస్తారంటూ ఆయనలో మోదీ ధైర్యం నింపారు. అంతకుముందు బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ రూమ్‌లో రాత్రంతా నిద్రపోకుండా గడిపిన ప్రధాని మోదీ.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్ అయ్యే ప్రక్రియను ఆసాంతం ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే, చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ్ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనవ్వడంతో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ ఒక దార్శనికుడైన నాయకుడిలా మానవీయంగా వ్యవహరించారు. శాస్త్రవేత్తల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. దాదాపు చంద్రుడి ఉపరితలం వరకు ల్యాండర్‌ను తీసుకెళ్లిన ఇస్త్రో శాస్త్రవేత్తల కృషిని ఘనంగా ప్రశంసిస్తూనే.. ఈ వైఫల్యాన్ని కుంగిపోకుండా భవిష్యత్తులో మరిని విజయాలు సాధించేదిశగా ముందడుగు వేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మోదీ ప్రదర్శించిన నాయకత్వ దార్శనికతపై ట్విటర్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. స్ఫూర్తిదాయక నాయకత్వం అంటే ఇదేనని, ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటామని మోదీని ప్రశంసిస్తూ ఇస్రో కన్నడ అకౌంట్ ట్విటర్లో కామెంట్ చేసింది. భారత్, శ్రీలంకలో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేసిన డానియెల్ కామెరాన్ కూడా మోదీ నాయకత్వ శైలిని కొనియాడారు. నా ప్రధాని మనసున్న మనిషి అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ప్రధాని మోదీ, ఇస్రో చీఫ్ శివన్ కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకొన్నారని మరొకరు ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో మోదీ శివన్‌ను హత్తుకొని సముదాయించడం ఇస్రోలో అమూల్యమైన నైతిక స్థైర్యాన్ని నింపి ఉంటుందని, ఇది తమ హృదయాలను హత్తుకుందని మరొక నెటిజన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, కిరణ్ రిజిజు, పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సైతం ప్రధాని మోదీ వ్యవహరించిన తీరును కొనియాడుతున్నారు. భవిష్యత్తు పట్ల ఆశావాదం, విశ్వాసం కల్పించే దార్శనిక నాయకుడిలా మోదీ వ్యవహరించారని, క్లిష్ట సమయంలో ఇస్రోకు యావత్ దేశం, ప్రజలు అండగా ఉన్నారనే సందేశాన్ని ఆయన ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు. -
ఇస్రోకు యావత్ దేశం అండగా ఉంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం.. చివరిక్షణంలో కుదుపులకు లోనైన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అంశంపై స్పందించారు. విక్రమ్ ల్యాండర్ దాదాపుగా చంద్రుడి ఉపరితలానికి చేరుకుందని, మన శాస్త్రవేత్తలను చూసి యావత్ భారత్ గర్విస్తోందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. చివరి ఘట్టంలో తలెత్తిన ఈ చిన్న ఎదురుదెబ్బ కూడా భావి విజయాలకు మెట్టుగా మలుచుకొని ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో యావత్ దేశం ఇస్రో బృందానికి అండగా ఉందని, ఇస్రో శాస్త్రవేత్తల అసాధారణ కృషిని కొనియాడుతోందని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైన సంగతి తెలిసిందే. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను ఆసాంతం వీక్షించిన ప్రధాని మోదీకి శివన్ ఈ విషయం తెలియజేయగా.. ఆయన ధైర్యం చెప్పారు. -
యావత్ దేశం మీకు అండగా ఉంటుంది
-
చంద్రయాన్-2పై మోదీ ఉద్వేగ ప్రసంగం
సాక్షి, బెంగళూరు: దేశం కలలను సాకారం చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారని.. వారందరికీ యావత్ దేశం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్-2 విజయం కోసం శాస్త్రవేత్తలు చూపిన తెగువకు దేశమంతా గర్విస్తోందని ప్రశంసించారు. భారతమాత తలెత్తుకునే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారని ప్రధాని అభినందించారు. బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్ట్రాక్)లో చంద్రయాన్-2 ప్రయోగంపై శనివారం ఉదయం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తొలుత ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ తెగిపోవడంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ఈ ప్రయోగం కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారు. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. మీ కృషిని యావత్ దేశం అర్థం చేసుకోగలదు. మీ కష్టం దేశానికి తెలుసు. భారతమత తలెత్తుకునేలా ప్రయోగం కోసం జీవితాన్ని ధారపోశారు. దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు ఎంతో శ్రమించారు. శాస్త్రవేత్తల కృషి ఎప్పటికీ వృథా కాదు. మీస్ఫూర్తి భారతీయులకు నిదర్శనం. శాస్త్రవేత్తల కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేస్తున్నా. దీనిలో వారి త్యాగం ఎంతో ఉంది. మన అడంకులే మన మనోబలాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీరు చూపిన తెగువ మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికి నిర్ధేశం చేసింది. మీ కృషికి ప్రతిఫలంగా దేశమంతా మీకు అండగా నిలబడుతోంది. ప్రపంచ దేశాల్లో భారత్ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. మరిన్ని లక్ష్యాలను మనం సాధించాల్సి ఉంది. దానికోసం మరికొన్ని అంతరిక్ష ప్రయోగాలను మనం చేపట్టాలి. ఎన్నో ఆటంకాలను విజయవంతగా అధిరోహించిన చరిత్ర ఇస్రోకు ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తారనే నమ్మకం నాతోపాటు ఈ దేశ ప్రజలకూ ఉంది’ అంటూ శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని నింపే విధంగా మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. కాగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్–2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ అంశంపై ఓ ప్రకటన చేస్తూ.. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని తెలిపారు. దీనిపై ల్యాండర్ పంపిన సందేశాలను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. చదవండి: చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది.. -
చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది..
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్–2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతరం ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ అంశంపై ఓ ప్రకటన చేశారు. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను ఆసాంతం వీక్షించిన ప్రధాని మోదీకి శివన్ ఈ విషయం తెలియజేయగా.. ఆయన ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు మీరు సాధించింది తక్కువ ఏమీ కాదని శివన్ భుజం తట్టారు. మీరు ధైర్యంగా ముందుకెళ్లండి.. నేను మీకు అండగా ఉంటాను అని ప్రధాని వారిలో భరోసా కల్పించారు. పసిబిడ్డను పొత్తిళ్లలో వేసినట్లే... చంద్రయాన్ –2 ప్రయోగానికి సంబంధించి అన్నీ ముందుగా అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని అంతకుముందు ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ పేర్కొన్నారు. ‘‘చంద్రయాన్ –2 ప్రాజెక్టులో పనిచేసిన శాస్త్రవేత్తలందరిలోనూ ఎంతో ఉత్కంఠత ఉంది. ఎందుకంటే ఈ ప్రయోగం చాలా సంక్లిష్టమైనది. పైగా ఇస్రో ఇలాంటి ప్రాజెక్టు చేపట్టడం ఇదే తొలిసారి కదా!!’’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘సెన్సర్లు, కంప్యూటర్లు, కమాండ్ వ్యవస్థ అన్నీ పక్కాగా పనిచేశాయి. చేస్తాయి కూడా. భూమ్మీద చాలుసార్లు వీటిని విజయవంతంగా పరీక్షించిన ధైర్యంతో ఈ మాట చెబుతున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ చాలా సున్నితమైన ప్రక్రియ అని.. అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఉయ్యాలలో ఎంత జాగ్రత్తగా వేస్తామో ఇది కూడా అంతేనని ఆ అధికారి అన్నారు. భారతీయ ప్రతిభకు తార్కాణం: మోదీ చంద్రయాన్ –2 ప్రయోగం భారతీయ ప్రతిభకు సజీవ తార్కాణమని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఒక ట్వీట్లో ప్రశంసించారు. శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేస్తూ... చంద్రయాన్ –2 విజయ వంతం కావడం కోట్లాది మంది భారతీ యులకు లాభం చేకూర్చనుందన్నారు. ‘‘130 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం ఇది. కొన్ని గంటల్లో చంద్రయాన్ –2 తుది ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత్‌తోపాటు మిగిలిన ప్రపంచం కూడా మన అంతరిక్ష శాస్త్రవేత్తల అసాధారణ ప్రతిభను మరోసారి ప్రత్యక్షంగా వీక్షించనుంది’’ అని మోదీ ఇంకో ట్వీట్లో పేర్కొన్నారు. విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్‌ను ఆయన బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్ట్రాక్) ప్రత్యక్షంగా వీక్షించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు, పొరుగుదేశం భూటాన్‌కు చెందిన యువత కూడా తనతోపాటు ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారని... వీరంతా ఇస్రో నిర్వహించిన స్పేస్ క్విజ్‌లో తమ ప్రతిభను కనపరచిన వారని మోదీ తెలిపారు. మై గవ్ వెబ్సైట్లో నిర్వహించిన స్పేస్ క్విజ్‌లో భారీ సంఖ్యలో యువత పాల్గొనడం అంతరిక్షం, సైన్స్ పట్ల దేశ యువతలో ఆసక్తి పెరుగుతోందనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ అపురూప ఘట్టాన్ని దూరదర్శన్ శుక్రవారం అర్ధరాత్రి 1.10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టగా ఇస్రో తన వెబ్సైట్లోనూ కార్యక్రమ లైవ్ వీడియోను అందించింది. వీటితోపాటు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లోనూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ను అందించింది ఇస్రో. ఈ ఏడాది జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా నింగికి ఎగసిన చంద్రయాన్ –2 సుమారు ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన తరువాత ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి జాబిలివైపు ప్రయాణం ప్రారంభించింది. ఆగస్టు 20న జాబిల్లి కక్ష్యలోకి చేరిన తరువాత దశలవారీగా తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సెప్టెంబరు రెండవ తేదీ చంద్రయాన్ –2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడింది. ‘గగన్‌యాన్’ తొలిదశ ఎంపిక పూర్తి భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో మరో ముందడుగు పడింది. ఈ యాత్రలో పాల్గొనే వ్యోమగాముల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియ తొలిదశ పూర్తయిందని భారత వాయుసేన(ఐఏఎఫ్) తెలిపింది. ఈ ప్రక్రియలో ఎంపికైన 25 మంది టెస్ట్ పైలెట్లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్‌లో శరీరదారుఢ్యంతో పాటు పలువైద్య, మానసిక పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా 2021 డిసెంబర్ కల్లా రెండు మానవరహిత, ఓ మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టాలని ఇస్రో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు(వ్యోమనాట్స్) రష్యాలోని యూరీగగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో 15 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. చివరగా వీరిలో ముగ్గురు వ్యోమగాములు గగన్‌యాన్‌లో భాగంగా అంతరిక్షంలో 7 రోజుల పాటు గడపనున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపిన నాలుగోదేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లను కేటాయించింది. -
చల్లనయ్యా చందరయ్యా
ఎంతెంత దూరం... జాబిలెంత దూరం...మనిషి చందుడ్ని అందుకోవడానికి ఆరాటపడుతూనే ఉన్నాడు.చంద్రుడిపై పారాడడానికి మారాం చేస్తూనే ఉన్నాడు.వెన్నెల కురిపించే ఆ రాజు రాజ్యంలోతన జెండాను పాతడానికి దండెత్తుతూనే ఉన్నాడు.చంద్రుడు బహుశా నవ్వుకుంటూ ఉంటాడు.మేనమామకు ఉండే వాత్సల్యంతో గమనిస్తూ ఉంటాడు.ఏం కావాలి చంద్రుడి నుంచి?ఆ ప్రశ్న, దాని జవాబు శాస్త్రజ్ఞులకు వదిలిపెడదాం.మనం మాత్రం చంద్రుడిలోని కుందేలును చూద్దాం.అక్కడ కూర్చుని రాట్నం వడికే బామ్మతో కబుర్లు చెబుదాం.చంద్రుడొచ్చే వేళ కథలకు ఊ కొడదాం.చంద్రుడి వెన్నెలలో తడుస్తూ దుప్పటి కప్పుకుని కలలు కందాం. ఆదిమ మానవునికి ప్రకృతి ఇచ్చిన తొలి టార్చ్‌లైట్ చంద్రుడు.కారడవులలో, కారుచీకట్లలో, మహావృక్షాల నీడన, రాతి గుహల భయంకర ఛాయలలో నాటి మనిషికి లభించిన తొలి ఓదార్పు చంద్రుడు.పగలల్లా వేట. రోజంతా తినీ తినక. తీరైన తిండి రాత్రి వేళలోనే. నలుగురి సమక్షంలోనే. గుంపంతా ఒకే చోట చేరి... నెగడు వేసుకొని... వేట కాల్చుకుంటూ... చంద్రుణ్ణి చూస్తూ తిన్న తిండే తిండి.అందుకే చంద్రుడు గోరుముద్దలకు తోడు వచ్చాడు.‘చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవె’ అని పసి పెదవుల నోటికి పాలబువ్వ అయ్యాడు. వారి మోమున దివ్య దరహాసమయ్యాడు. చెట్టు కింద అవ్వ చంద్రుణ్ణి ఇంత కాలంలో, ఎన్ని లక్షల కోట్ల మంది తేరిపార చూసుంటారు. చంద్రుడిలోకి చూపులు గుచ్చి ఎంత అన్వేషణ చేసి ఉంటారు. చంద్రుడి గురించి ఎన్ని ఊహలు అల్లి ఉంటారు. చంద్రుడి చుట్టూ ఉన్న మార్మికతకు ఎంత ఉద్విగ్నపడి ఉంటారు. చంద్రుడిపైకి చేరుకోవడం ఎలా అని అక్కడకు వెళితే బాగుండు అని ఎన్ని అనుకుని ఉంటారు.ఎంతసేపు చూసినా వారికి చంద్రుడి నుంచి ఏ సమాధానమూ రాదు. అక్కడ ఒక నీడ కనిపిస్తుంది.లేదంటే కుందేలు లాంటి ఛాయ కనిపిస్తుంది. ఊళ్లలోని పిల్లలు నులక మంచాలపై మెడ వరకూ దుప్పటి కప్పుకుని చంద్రుడి వైపే చూస్తూ అక్కడ చెట్టు కింద అవ్వ కూచుని దోసెలు పోస్తూ ఉంటుందని ఆకారాన్ని పోల్చుకుంటారు. తనివి తీరదు.ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. కళ్ల నిండా చూసుకోవడానికి సూర్యుడు పనికి రాడు. తారల తీరం బహుదూరం. మరి చేతికి చిక్కేవాడు... చూపుకు దక్కేవాడు ఒక్కడే. చందురుడు.వెన్నెలను తాగి మాత్రమే చకోర పక్షి జీవిస్తుందట. అదెంత ధన్యజీవి. అమావాస్య రోజు పస్తులతో అది ఏం పాటలు పాడుకొని ఉంటుందో. వెన్నెలను చూసే కలువ రెక్క విప్పుకుంటుందట. వెన్నెల ముద్దాడుతున్న కలువను చూడని, ఆ దొరవు గట్టున కాసేపైనా చేరని, ఆ రెంటి వాట్సప్ చాట్‌ను మౌనంగా చదవని జన్మ వృథా. మచ్చ తప్పలేదు ఈ చంద్రుడు ఎన్నింటికో సాక్షి. ఈ చంద్రుడు ఎన్ని విరహాగ్నులకో శ్రోత. ఎన్ని విందులలోనో సహపంక్తిదారుడు. ఎన్ని విలాపాలనో సేద తీర్చిన చందన పూత.ఈ చంద్రుడితో ప్రేమలో పడకుండా ఉండటం కష్టం. తార ఈ శశాంకుడితో మోహంలో పడి ‘తారా శశాంకాని’కి కారణమైంది. చంద్రుడికి కూడా ‘మచ్చ’ ఉంటుంది. ‘మచ్చ లేని చంద్రుడు’ అన్న పొగడ్త దొడ్డ పొగడ్త ఎవరి గురించైనా. చిన్న చిన్న తప్పులు చేసిన గొప్పవాళ్లను ‘చంద్రుడికే ఉంది మచ్చ. ఈయనది ఏ పాటి’ అని అప్పుడు కూడా చంద్రుణ్ణే అడ్డం పెట్టుకుని పొగుడుతారు.అయితే చంద్రునికి స్థిమితం లేదు. రోజు రోజుకూ కరుగుతాడు. రోజురోజుకూ ఎదుగుతాడు. ఈ అస్థిమిత దర్శనంతో మనుషుల మనసులను కూడా అస్థిమితం చేస్తాడు. అమావాస్యకీ పున్నమికీ కొందరు మనుషులకు రేగుతుందని పెద్దలు చెబుతారు. కనుక చంద్రుణ్ణి నమ్మడానికి లేదు. ఎంత ప్రియమైన మనిషి అయినా అస్తమానూ ఇంట్లో ఉంటే చేదై పోతాడు. ఇలా వస్తూ అలా వెళుతూ ఉండాలి. ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉండాలి– అమ్మని చూడటానికి వచ్చిన మేనమామలా. అందుకే చందురుడు చందమామ అయ్యాడు. అందరి మామ అతడు. బాటలో తోడు అందరం గమనించిందే. దారిలో మనం వెళుతూ ఉంటే చందమామ కూడా మనతో వచ్చినట్టు అనిపిస్తాడు. మనతో పాటే వస్తున్నట్టు కనిపిస్తాడు. ఎంత మెల్లగా నడిచినా. ఎంత వేగవంతమైన వాహనాల్లో దూసుకుపోతున్నా. ప్రయాణాలలో చంద్రుడు మన తోడు. ఎన్నో దూరాలను దాటించినవాడు. ఎన్నో తీరాలకు చేర్చినవాడు.ఒక అమ్మా నాన్న ఉండేవారట. వారికి ఇద్దరు కొడుకులట. పెద్ద కొడుకు కారం ముద్దలు పెట్టేవాడట. చిన్న కొడుకు నేతి ముద్దలు తినిపించేవాడట. తల్లిదండ్రులంటే ఎవరు? ఈశ్వర సమానులు. వీళ్లిద్దరి వాలకం చూసి ‘అరె పెద్దోడా... నువ్వు పగలు పొద్దంతా ధగధగమని మండుతా తిరుగు... అరె చిన్నోడా... నువ్వు రాత్రేళ నిమ్మళంగా మసలు’ అని ఆశీర్వదించారట. చిన్నోడు చంద్రుడయ్యి మన కోసం నేతి పూసల వంటి వెన్నెలను కురిపిస్తూ ఉంటాడు. పున్నమే పండుగ అమావాస్య రోజు చీకటి అలుముకుంటుంది. పౌర్ణమి రోజు ఆకాశాన దీపం వెలుగుతుంది. చీకటి రోజుల్లో వెలుతురు రావడమే పండుగ. అందుకే చాలా పండుగలను జానపదులు పౌర్ణమికి ముడిపెట్టారు. ‘ఏరువాక పున్నమి’ సేద్యానికి సిద్ధం కమ్మంటుంది. ‘కాముని పున్నమి’ పంచెకట్లనూ జడ కుచ్చులనూ ఒక చోట కూడమంటుంది. ‘మొలకల పున్నమి’ నేలన విత్తు గుచ్చమంటుంది. మనిషి గర్భంలో, నేలనా పంట పండిస్తాడు. జీవి కొనసాగింపుకు జీవన కొనసాగింపుకు రెండూ ముఖ్యం. జీవితాల వెలుగుకు దైహిక రసాస్వాదన కూడా ముఖ్యం. అందుకు పురిగొల్పేవాడు చందురుడు. వెన్నెల వేళ స్త్రీ పురుషులకు రమ్యవేళ అని వాత్సాయనుడు చెప్పాడు. చేను మీద బిరుసైన మంచె కట్టగలిగిన ప్రతి జానపదుడూ చెప్పాడు. సాహిత్యంలో ముఖ్యపాత్ర ‘చంద్రుడు కర్పూరపొడిలా వెన్నెలను రాలుస్తున్నాడు’ అని ఒక ప్రాచీనకవి అన్నాడు.‘పాండవులకు, కౌరవులకు సంధి కుదరదని తేలేసరికి ఆకాశాన చంద్రుడి ముఖం వివర్ణమైంది’ అని ఒక పురా రచయిత వాక్యం పలికాడు. ‘మనసున మల్లెల మాలలూగెనే మనసున వెన్నెల డోలలూగెనె’ అన్నాడు కృష్ణశాస్త్రి. కాని శ్రీశ్రీ మాత్రం ‘గగనమంతా నిండి పొగలాగా క్రమ్మి బహుళ పంచమి జ్యోత్స భయపెట్టు నన్ను’ అన్నాడు. ‘ఆకాశపుటెడారిలో కాళ్లు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి’ అని కూడా అన్నాడు. దేవరకొండ బాలగంగాధర తిలక్ తన ‘నల్లజర్ల రోడ్డు’ కథను ‘ఆకాశంలో చంద్రుడు భయంకరంగా ఉదయించాడు’ అని మొదలెడతాడు. ఆరుద్ర కవిత్వ సంపుటి పేరు ‘సినీవాలి’. ఇస్మాయిల్ కవిత ‘బాల్చీలో చంద్రుడు’ చాలా ఖ్యాతికెక్కింది. ఆధాహై చంద్రమా.. రాత్ ఆధి... హిందీ ఉర్దూ భాషలలో సాహిత్యంలో మౌఖిక వాంజ్ఞ్మయంలో చంద్రుడి ప్రస్తావన అనంతం. హిందీ సినిమా పాటల్లో ప్రతి మూడో పాట చంద్రుణ్ణి ప్రస్తావిస్తూనే సాగుతుంది. ‘ఆధా హై చంద్రమా... రాత్ ఆధి.. రెహెన జాయే తేరి మేరి బాత్ ఆధి.. ములాకాత్ ఆధి’... పాట ‘నవరంగ్’ సినిమాలో ఎందరికో ప్రీతిపాత్రమైంది. ‘ధీరే ధీరే చల్ చాంద్ గగన్ మే’, ‘ఖోయా ఖోయా చాంద్ ఖులా ఆస్మాన్’, ‘తుజే సూరజ్ కహూ యా చందా’, ‘రుక్ జా రాత్ ఠెహెర్ జారె చందా’... ఎన్నో పాటలు. చంద్రుడిపై మనిషి కుతూహలం తీరదు. చంద్రుడి చుట్టూ మానవ అన్వేషణ ఆగదు. కాని ఆకాశాన ఉన్న ఆ మహిమాన్విత దీపం ఈ ప్రయత్నాలన్నింటిని చల్లగా చూస్తూ ఉంటుంది. దయగా నవ్వుకుంటూ ఉంటుంది. పాకుతూ వచ్చిన శిశువును తల్లి ఎలా అక్కున చేర్చుకుంటుందో వేల ఏళ్లుగా తన దరికి చేరడానికి ప్రయత్నిస్తున్న మనిషిని అలాగే అక్కున చేర్చుకుంటుంది. సముద్రుడి కుమారుడు పురాణాల ప్రకారం చంద్రుడి పుట్టుక క్షీర సాగరమథన సమయంలో జరిగింది. చంద్రుడు ఉబికి వచ్చాక లక్ష్మి పైకి తేలింది. అందుకే చంద్రుడికి లక్ష్మి తోబుట్టువు అయ్యిందని అంటారు. సముద్రుడు తండ్రి. హాలాహలాన్ని గరళాన నొక్కి పట్టాక ఆ అగ్నిని చల్లార్చడానికి చంద్రుణ్ణి ధరించాడట శివుడు. అందువల్ల ఆయన చంద్రశేఖరుడు అయ్యాడు. చంద్రుడు ఎంతటి చల్లటి వాడైనా చవితినాడు చూస్తే నిందలు కలిగిస్తాడని భయం ఉంది. కాని ఆ నిందలన్నీ లోక కల్యాణానికే దారి తీశాయి. ఎడారికి రాజు అడవుల్లో కొమ్మలు అడ్డు రావచ్చు. జనావాసాలలో భవంతులు చాటు చేయవచ్చు. కాని ఎడారిలో చంద్రుడికి ఏ అడ్డంకీ ఉండదు. రాత్రయితే ఆ అనంత ఇసుక సముదాయాలకు చంద్రుడే రాజు. అందుకే ఇస్లాంలో చంద్రుడికి చాలా ప్రాధాన్యం ఉంది. నెలవంక దర్శనంతో మొదలయ్యే పనులు అనేకం ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్త తన జీవిత కాలంలో మహిమలు చూపలేదనే అసంతృప్తి ఆయన అనుయాయులకు ఉండేది. వారి కోసమని ప్రవక్త ఒక రాత్రి తన చూపుడువేలును చంద్రుడి వైపు చూపించారు. వెంటనే చంద్రుడు రెండు ముక్కలయ్యి మళ్లీ కలిశాడు. ఈ మహిమతో ప్రవక్త గొప్పతనం వారికి తెలిసింది. ప్రవక్త ఈ మహిమను చూపించారని ఇస్లాం ఆరాధకులలో బలంగా నమ్మేవారున్నారు. చంద్రుడు లేని బతుకు గుడ్డి బతుకు. చంద్రుడు లేని బతుకు ఎండ బతుకు.ఎండలో డస్సిపోయిన ప్రతి సందర్భాన ఆకాశాన లేచే ఆత్మీయబింబం చంద్రుడు.చంద్రుడు చల్లగా ఉండాలి. మనుషుల హృదయాలలో చల్లటి కాంతులే సదా విరజిమ్ముతూ ఉండాలి.– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
లవ్ యూ చందమామ
వెన్నెల రోజున భూమి ఎలా ఉంటుంది? వెన్నెల కురిసే ఆ రోజున కాస్తంత ఎత్తు మీద నుంచో, వీలైతే ఏ కొండపై నుంచో చూడండి. ఎలా కనిపిస్తుంటుంది భూమి?వెన్నెల టాల్కమ్ పౌడర్‌ను దూమెరుగ్గా రాసుకుని, ఫ్రెష్‌గా ఉన్నట్టుంటుంది భూమి.రాత్రి చీకటిలో డార్క్ కాంప్లెక్షన్ చాయతక్కువగ ఉన్నట్టుండే ధరణి... ఫెయిర్‌నెస్ క్రీము రాసుకుని ఫెయిర్‌గా కనిపిస్తున్నట్టుంటుంది. ఆ నిగారింపుల మిలమిలలతో, వెన్నెల సింగారింపుల కళకళలతో మెరిసిపోతుంటుంది. చందమామ అనగానే అందరికీ భావావేశమే. కోటిపూలతో కొండెక్కీ, బంతిపూలతో బండెక్కీ, పల్లకీలో పాలుపెరుగులతో, పరుగుపరుగున పనసపండుతో, అలయకుండా అరటిపండుతో రావాలనీ... అన్నింటినీ తెచ్చి తమ చిన్నారికి ఇవ్వాల్సిందే అని అన్నమయ్య డిమాండ్ చేశాడు. ఇక శ్రీరాముడు మాత్రం తక్కువా? చందమామ అందితేగానీ అన్నం తిననని మారాం చేశాడు. అద్దం చేతనుంచుకొని, దాంట్లో చూసి, అద్దం ఫ్రేమ్‌లో బిగించాడు కాబట్టే రామ‘చంద్ర’మూర్తి అయ్యాడేమో. ఇంతటి చందమామ గురించి ఎన్నెన్నో విశేషాలు. అందులో కొన్నింటిని తెలుసుకుందాం.గ్రహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. ఆ శక్తి కారణంగానే అవి పరిభ్రమిస్తూ ఒకదానితో ఒకటి ఢీకొనకుండా తిరుగుతూ ఉంటాయి. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగానే సముద్రజలాలు ఆకర్షితమై ఆటుపోట్లు వస్తుంటాయని తెలుసు. మరి భూభాగం సంగతో?... అక్కడా ఆ శక్తి పనిచేస్తుంటుంది. జలాలు ద్రవరూపంలో ఉంటాయి కాబట్టి ఆటుపోట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ... నీటిమట్టం పెరగడం తగ్గడం జరుగుతుంది. అలాగే మన కాళ్ల కింది భూభాగమూ కాస్తంత ఉబుకుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ భూమ్మీద ఉన్న సమస్త కొండగుట్టలూ, భవనాలూ, నిర్మాణాలూ ఒకింత పైకి లేస్తాయి. మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. కాకపోతే దాన్ని మనం గమనించలేం అంతే. చంద్రుడు సరిగ్గా భూమి చుట్టే తిరుగుతున్నాడా? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడని మనం చిన్నప్పట్నుంచీ చదువుకున్నాం. అది నిజమే అయినా పూర్తిగా వాస్తవం కాదు. భూమీ, చంద్రుడూ పరస్పరం ఆకర్షించుకుంటూ ఉంటాయి కాబట్టి చంద్రుడు తిరిగే కేంద్రం భూమి కేంద్రస్థానానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఆ ఊహాకేంద్రకాన్ని మనం ‘బ్యారీసెంటర్’ అని పిలుస్తాం. ఈ బ్యారీసెంటర్ అన్నది భూమి పైపొర అయిన క్రస్ట్‌లో ఉంటుంది. అక్కడా కావాల్సినంత చెత్త! మనిషి అంటేనే చెత్త పుట్టించేవాడు. తానెంత మంచి పిక్నిక్ స్పాట్‌కు వెళ్లినా తాగేసిన నీళ్లబాటిళ్లు, ఇతరత్రా చెత్తనక్కడ పడేస్తూ ఉంటాడు. చంద్రుడూ ఇందుకు మినహాయింపు కాడు. మీకు తెలుసా? ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకూ మానవుడు వెళ్లినప్పుడు వదిలేసినవీ, మనం పంపించిన ఉపగ్రహాల వల్ల వెలువడినవీ... ఇవన్నీ కలిసి దాదాపు లక్షా ఎనభై రెండు వేల కిలోల (కచ్చితంగా చెప్పాలంటే 1,81,437 కిలోల) చెత్త చంద్రుడి ఉపరితలం మీద చేరిందట. అదో మరుస్థలి కూడా... అంతేకాదు... అక్కడ ఓ శ్మశానం కాని శ్మశానమూ ఉంది. ఆ కథాకమామిషూ చూద్దాం. యూజీన్ షూమాకర్ అనే ఓ అద్భుతమైన ఖగోళ పరిశోధకుడూ, జియాలజిస్టూ చాలా కీలకమైన పరిశోధనలు చేశాడు. చంద్రుడి మీదకు వెళ్లాలన్నది అతడి తీరని కోరిక. కానీ అతడిలోని చిన్న శారీరక లోపం చంద్రుడిమీదకు వెళ్లడానికి అవరోధంగా మారింది. తన ప్రగాఢ వాంఛ అందని చందమామఅయ్యింది. ఖగోళరంగంలో అతడి కీలక పరిశోధనలకు ఓ నివాళిగా అతడి చివరి కోర్కెను మరోలా తీర్చారు శాస్త్రవేత్తలు. అతడు చనిపోయాక అతడి చితభస్మాన్ని లూనార్ ప్రాస్పెక్టర్ ద్వారా1998లో చంద్రుడి మీదకి తీసుకెళ్లి అక్కడి చంద్రధూళిలో ఖననమయ్యేలా చూశారు. అలా అతడి చివరి కోర్కెను తీర్చారు నాసా వారు. అంతేనా... చంద్రుడి మీద తమ చితాభస్మం పడాలన్నది చిరకాలంగా చాలా మంది మన భూలోక వాసుల కోరిక కూడా. అందుకే దాదాపు క్రీస్తుపూర్వం 450 నాటి నుంచే కొందరి కోరిక మేరకు వారి చితాభస్మాన్ని ఎల్తైన ప్రదేశం నుంచి ఆకాశంలోకి విసిరేసేవారు. అది చంద్రుడి మీదికి చేరి అక్కడ ధూళిలో కలిసిపోతుందని వాళ్ల ఆశ. అయితే ఇలాంటి కోరికలెవరికైనా ఉంటే అవి భవిష్యత్తులో తీరే అవకాశాలున్నాయి. ‘లూనార్ మెమోరియల్ సర్వీస్’ పేరిట ‘ఎసైలమ్ స్పేస్’ వంటి కొన్ని కంపెనీలు చంద్రుడి మీద వారి చితాభస్మాలనూ, అవశేషాలను ఖననం చేసే పనికి పూనుకుంటున్నాయి. 2013 నెలకొల్పిన ఎసైలస్ స్పేస్ సంస్థ ఇస్తున్న భరోసా ప్రకారం... కేవలం చంద్రుడి మీదే కాకుండా... సౌరకుటుంబానికి ఆవలనున్న సుదూర అంతరిక్ష స్థలాల్లోనూ ఆ చితాభస్మాన్ని వదులుతామంటూ ఆ కంపెనీ వాగ్దానాలు చేస్తోంది. అయితే ఈ దిశగా వారి మొదటిమజిలీ శ్మశానస్థలి మాత్రం జాబిల్లేనట. చంద్రకంపాలూ ఉంటాయి భూమ్మీద భూకంపాలు వస్తాయన్నది మనకు తెలిసిందే కదా. అలాగే చంద్రుడిమీద కూడా అలాంటివే సంభవిస్తాయి. మనం భూకంపం అన్నట్టుగానే దాన్ని చంద్రకంపం అనవచ్చు. ఇంగ్లిషులో ‘మూన్‌క్వేక్’ అన్నమాట. ఇందులోనూ మళ్లీ నాలుగు రకాలుంటాయి. చాలా లోతుగా వచ్చే డీప్ క్వేక్స్, ఏవైనా ఉల్కలు చంద్రతలం మీద పడటం వల్ల వచ్చే కంపనాలైన మీటియోరైట్ ఇంపాక్ట్స్, సూర్యుడి ఉష్ణోగ్రత ప్రభావం వచ్చే థర్మల్ క్వేక్స్... ఈ మూడూ ఒకింత తక్కువ శక్తిమంతమైనవి. కానీ రిక్టర్ స్కేలు మీద 5.5 వరకు వచ్చే ‘షాలో మూన్ క్వేక్’ లనేవి మాత్రం చాలా భయంకరమైవి. మన భూమ్మీద భూకంపం వస్తే అది సెకన్లపాటు, మహా అయితే కొన్ని అరనిమిషం ఉంటుంది. కానీ చంద్రకంపం దాదాపుగా అరగంట పాటూ రావచ్చు. నాసా పరిశీలన ప్రకారం.. ఒక గంట మోగుతున్నప్పుడు ఆ లోహంపై కలిగే ప్రకంపనల్లాగే చంద్రకంపం సమయంలో చంద్రుడి ఉపరితలం అలా ప్రకంపనాలకు లోనవుతుంటుంది. నాసా భాషలో చెప్పాలంటే ‘ద మూన్ రింగ్స్ లైక్ ఎ బెల్’! ఇప్పట్లో పిక్నిక్ స్పాట్ కాబోదు చంద్రుడి మీదకెళ్లడం మన ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. అక్కడి చంద్రధూళి మానవుల ఆరోగ్యానికెంతో ప్రమాదం. మనం స్పేస్ సూట్ తొడుక్కుని పోయినప్పటికీ ఆ ధూళి ఎలాగోలా మన బట్టల్లోకి చేరిపోతుంది. ఈ ధూళి కారణంగా మనకు ‘లూనార్ హే ఫీవర్’ అనే వైద్య సమస్య రావచ్చట. దీన్నే ‘మూన్ డస్ట్ ఫీవర్’ అని కూడా అంటారట. అందరి చంద్రుడు అందని చంద్రుడవుతున్నాడా? మనందరికీ ప్రియాతి ప్రియమైన చందమామ రోజురోజుకూ మనకు దూరమవుతున్నాడా? ఒకనాటికి మనకు అందకుండా పోతాడా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి ఏడాది చంద్రుడు మననుంచి 3.78 సెం.మీ. దూరంగా జరుగుతున్నాడట. ఇప్పటికైతే జాబిల్లి దూరమవుతున్నందువల్ల మనకా ప్రభావం గణనీయంగా కనిపించకపోవచ్చు. కానీ ఒకనాటికి బాగా దూరం వెళ్లిపోతే మన భూగోళం తిరిగే వేగం (భూభ్రమణ వేగం) కూడా తగ్గిపోతుందట. అయితే ఆ ప్రమాదం మాత్రం ఇప్పట్లో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. మీరు చందమామ అనండి. జాబిల్లి అనండి. ఇంగ్లిష్‌లో మూన్ అనండి. లూనా అనండి. కానీ చందమామ కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు. మన ఎన్నో ఎమోషనల్ అంశాలకు ఒక కేంద్రస్థానం. సౌరకుటుంబంలో మన భూమితో పాటు పుట్టిన మన ఉపగ్రహం. భూమిని మనం భూమాత అంటాం. అంటే మన తల్లిలాంటిదే మన భూగ్రహం. మరి దాని తోబుట్టువు మనకు మేనమామే కదా. అందుకే చంద్రుణ్ని మనం చందమామ అంటాం. తల్లి పుట్టిలు మనం మేనమామకు చెబితే ఎలా ఉంటుంది. అందుకే మన తల్లి అయిన భూమాత పుట్టుకకు సంబంధించిన ఎంతో సమాచారం తెలుసుకోవాలన్నా చంద్రుడికి తెలుసేమో. దాని గురించి ఆయన్నే అడగాలేమో! అలా అడగగా వెల్లడయ్యే ఎన్నో అంశాలు తెలిసిరావచ్చు. మరెన్నో రహస్యాలు విడివడవచ్చు. మన చంద్రుడికి సంబంధించిన చిత్రవిచిత్రాల్లో ఇవి కొన్ని మాత్రమే. తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే అప్పటి విక్రమార్కుడు చెట్టెక్కి శవాన్ని దించినట్టుగా మన ఈ పరిశోధనా విక్రముడు... చంద్రుడి ఎత్తులు విక్రమార్కుడిలా ఎక్కుతూనే ఉంటాడు. తెలియని చిక్కు ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉంటాడు.– యాసీన్ -
దేశం గర్వించే ఆ క్షణం
చందమామ రావే.. జాబిల్లి రావే.. అని అమ్మలు పిల్లల కోసం ఎంత పిలిచినా రాలేదు.. అందుకే మన శాస్త్రవేత్తలే చందమామ వద్దకు వెళ్లేందుకు మార్గం కనిపెట్టారు.. జాబిల్లి జాడలు వెతుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. జూలై 22న శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి ఎగిరి జాబిల్లి కక్ష్యలోకి చేరడంతో చం ద్రయాన్–2 యాత్ర ప్రారంభమైంది. 48 రోజులకు ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై శనివారం తెల్లవారుజామున 1.30– 2.30 గంటల మధ్యలో చంద్రుడిపై కాలుమోపనుంది. ఈ యాత్ర ద్వారా చంద్రగ్రహంపై ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. మొదటి ప్రయత్నంలోనేజాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలిదేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోనుంది. దటీజ్ ఇండియా! గ్రహరాశులనధిగమించి.. ఘనతారల పథము నుంచి.. గగనాంతర రోదసిలో.. గంధర్వగోళ గతులు దాటేందుకు.. రంగం సిద్ధమవుతోంది! భారతీయులుగా మనమంతా గర్వించే రోజు రానే వచ్చింది.. కచ్చితంగా చెప్పాలంటే ఇంక కొన్ని గంటలే.. చంద్రయాన్–2 ఆర్బిటర్ నుంచి వేరుపడ్డ విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి దక్షిణ ధృవంపై వాలడమే ఆలస్యం.. అంతరిక్ష యవనికపై భారత త్రివర్ణ పతాకం గర్వంగా నిలవనుంది! 48 రోజుల నిరీక్షణకు తెరపడే శుభసమయం ఇంకో 24 గంటల్లోనే రానుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 1.30– 2.30 గంటల (శుక్రవారం అర్ధరాత్రి దాటాక) మధ్యలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ –2 ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధృవ ప్రాంతంపై దిగనుంది. బాలారిష్టాలను దాటుకుని జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్–2 ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. ఆ తర్వాత జాబిల్లి కక్ష్యలోకి చేరింది. మూడు లక్షలకుపైగా కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వారం రోజుల కింద జాబిల్లి సమీపానికి చేరిన ఈ అంతరిక్ష నౌక దశల వారీగా మన సహజ ఉపగ్రహానికి దగ్గరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగానికి చివరి ఘట్టమైన సాఫ్ట్‌ల్యాండింగ్ శనివారం తెల్లవారుజామున జరగనుంది. ఎందుకింత ప్రాముఖ్యం? చంద్రయాన్ –2 విజయవంతమైతే ఇస్రో బోలెడు రికార్డులు సృష్టించనుంది. మొదటి ప్రయత్నంలోనే జాబిల్లి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోతుంది. జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపిన నాలుగో దేశంగానూ రికార్డుల్లోకి ఎక్కుతుంది. కాగా, ఆర్బిటర్ నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా జాబిల్లిపై దిగడం ఈ ప్రయోగంలో అత్యంత కీలక ఘట్టం. ఇతర గ్రహాలపై సాఫ్ట్ల్యాండింగ్కు ప్రయత్నించడం ఇస్రోకు ఇదే తొలిసారి. అనేక క్లిష్ట పరిస్థితుల్లో విక్రమ్ దిగాల్సి ఉంటుంది. భూమితో పోలిస్తే జాబిల్లిపై గురుత్వ శక్తి మూడొంతులే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జాబిల్లి గురుత్వశక్తి ప్రభావానికి గురైన వెంటనే వేగంగా జారిపడిపోవడం మొదలవుతుంది. గాలి కూడా ఉండదు కాబట్టి.. పతనాన్ని నిరోధించే అవకాశం ఉండదు. గాలి లేకుండా ప్యారాచూట్స్ పనిచేయవు. ఇన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ మోటార్ల సాయంతోనే వేగాన్ని నియంత్రించుకుంటూ గంటకు 3.6 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వేగంతో దిగాల్సి ఉంటుంది. రోవర్ వేరుపడటంతో ప్రయోగం పూర్తి.. జాబిల్లిపై విక్రమ్ సాఫ్ట్ల్యాండింగైన తర్వాత కొన్ని గంటలకు అందులోనే నిక్షిప్తమై ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తుంది. జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ ఈ చిట్టి రోబో ప్రయోగాలు చేస్తుంది. ఈ రోవర్లో రెండు పరికరాలు ఉంటాయి. ల్యాండైన ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ.. అక్కడి మట్టిని పరిశీలిస్తుంది. ఏయే మూలకాలు ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తుంది. దక్షిణ ధృవం వద్ద సూర్యరశ్మి ఉండే 14 రోజుల పాటు ఈ రోవర్ పనిచేసేలా డిజైన్ చేశారు. దక్షిణ ధృవం ప్రత్యేకత? అమెరికా, రష్యాతో పాటు చైనా కూడా ఇప్పటికే చందమామపై అనేక ప్రయోగాలు చేపట్టింది. అయితే చంద్రగ్రహ మధ్యరేఖకు కొంచెం అటు ఇటు మాత్రమే ప్రయోగాలు చేశాయి. సూర్యరశ్మి బాగా ఉంటుంది కాబట్టి పరికరాలకు అవసరమైన విద్యుత్తు తయారు చేసుకోవడం సులువు కాబట్టి.. అందరూ ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ.. ఇస్రో ల్యాండర్ దిగనున్న దక్షిణ ధృవ ప్రాంతం మాత్రం వీటన్నింటికంటే భిన్నమైంది. 50 ఏళ్ల జాబిల్లి యాత్రలో ఇప్పటివరకు ఎవరూ కాలు పెట్టని, పరిశీలనలు జరపని ప్రాంతాల్లో ఇది ఒకటి. భూమి నుంచి విడిపోయేటప్పటి శిలాజాలు ఈ ప్రాంతంలో చెక్కు చెదరకుండా ఉండే అవకాశముంది. చంద్రయాన్ –1 ద్వారా జాబిల్లిపై నీరు ఉన్న విషయం స్పష్టమైంది. చంద్రయాన్–2 ద్వారా ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. ఆ చివరి గంట.. విక్రమ్ సాఫ్ట్ ల్యాండర్‌లోని కెమెరాలు ప్రతి సెకనుకు తాను దిగాల్సిన ప్రాంతం తాలూకు ఫొటోలు తీస్తూ మనకు పంపుతుంటాయి. వాటి నుంచి అనువైన ప్రాంతాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంపిక చేస్తారు. ఆ ఎంపికకు అనుగుణంగా విక్రమ్‌లోని కంప్యూటర్లు ఎత్తు, వేగం, దూరం వంటి వాటిని లెక్కించుకుని దిగుతుంది. భూమ్మీది నుంచే విక్రమ్‌లోని ఐదు రాకెట్ ఇంజన్లను నియంత్రిస్తుండటం ఇంకో క్లిష్టమైన పరిస్థితి. ముందుగా దాని వేగం తగ్గించడం.. ఆ తర్వాత ఉపరితలానికి కొంచెం ఎత్తులో స్థిరంగా ఉండేలా చేయడం.. దిగాల్సిన ప్రాంతానికి చేరేలా దిశ మార్చడం వంటివన్నీ చాలా కీలకం. ఇలా రియల్ టైమ్‌లో అంతరిక్ష నౌక ల్యాండింగ్ ఏ దేశమూ ఇప్పటివరకూ చేపట్టలేదు. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. విక్రమ్‌లోని కెమెరాలు, దూరాన్ని కొలిచే లేజర్ పరికరాలు, కంప్యూటర్లు, భూమ్మీది శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో, సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆర్బిటర్ చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. ఇది సొంతంగా దాదాపున వెయ్యి వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతూ ఏడాది పాటు పనిచేస్తుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. విక్రమ్ చంద్రయాన్–2 ద్వారా జాబిల్లిపైకి దిగే ల్యాండర్ పేరు ‘విక్రమ్’. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ స్మారకార్థం ల్యాండర్‌కు ఈ పేరు పెట్టారు. ఇది దాదాపు 1,471 కిలోల బరువుంటుంది. ఇది 14 రోజుల పాటు పనిచేస్తుంది. రోవర్ సాఫ్ట్‌ల్యాండ్ అవ్వడంలో కీలక పాత్ర దీనిదే. ప్రజ్ఞాన్ ఆరు చక్రాలుండే రోవర్ పేరు ప్రజ్ఞాన్. 27 కిలోల బరువుంటుంది. చంద్రుడి ఉపరితలంపై అడుగిడిన దగ్గరి నుంచి సౌర శక్తి సాయంతో 500 మీటర్ల మేర ప్రయాణించగలదు. ఇది ఎక్స్‌రే కిరణాలను ప్రసారం చేస్తూ చంద్రుడి ఉపరితలంపై ఏయే మూలకాలు ఎక్కువగా ఉన్నాయో చెబుతుంటుంది. చంద్రయాన్ ప్రస్థానం ఇలా.. జూలై 22 : శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి జూలై 24 : భూమి చుట్టూ తిరిగే కక్ష్య దూరం పెంపు. అతిదగ్గరగా 230 బై 45,163 కిలోమీటర్లతో కక్ష్య జూలై 26 : మరోమారు కక్ష్య దూరం పెంపు. ఈ సారి అతిదగ్గరగా 251 బై 54,829 కిలోమీటర్లతో కక్ష్య జూలై 29 : మూడోసారి కక్ష్య దూరం పెంపు. చోదక వ్యవస్థలను సుమారు 989 సెకన్లు వాడుకుంటూ భూమికి అతిదగ్గరగా 276 బై 71,792 కిలోమీటర్లతో కక్ష్య. ఆగస్టు 2 : నాలుగో కక్ష్య పెంపు ప్రయోగం విజయవంతం. భూమికి 277 బై 89,472 కిలోమీటర్ల దూరంగా కొత్త కక్ష్య మార్గం. ఆగస్టు 6 : చివరి కక్ష్య పెంపు పూర్తి. చోదక వ్యవస్థలను ఉపయోగించుకుని భూమికి దగ్గరగా 276 బై 1,42,975 కి.మీ. కక్ష్య. ఆగస్టు 20 : జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్–2ను మళ్లించిన శాస్త్రవేత్తలు. జాబిల్లికి 114 కి.మీ. దగ్గరగా.. 18,072 కిలోమీటర్లు దూరంగా కక్ష్య మార్గం. ఆగస్టు 21 : జాబిల్లి చుట్టూ తిరుగుతున్న కక్ష్య దూరం తగ్గింపు. అతిదగ్గరి దూరం 118 బై 4412 కిలోమీటర్లకు తగ్గింపు. ఆగస్టు 28 : మూడో కక్ష్య కుదింపు ప్రక్రియ విజయవంతం. తాజా కక్ష్య మార్గం అతి దగ్గరగా 179 బై 1412 కి.మీలు. ఆగస్టు 30 : నాలుగో కక్ష్య కుదింపు ప్రక్రియ. చోదక వ్యవస్థలను 1155 సెకన్ల సేపు వాడుకుని కక్ష్య మార్గాన్ని 124 బై 164 కిలోమీటర్లకు కుదించారు. సెప్టెంబర్ 2 : ఆర్బిటర్ నుంచి విజయవంతంగా వేరుపడిన ల్యాండర్ విక్రమ్. జాబిల్లి చుట్టూ 119 బై 127 కిలోమీటర్ల కక్ష్యలో విక్రమ్ భ్రమణం సెప్టెంబర్ 3 : ఆర్బిటర్ కక్ష్య సవరణ ప్రక్రియ మొదలు. 4 సెకన్ల పాటు ఇంజిన్లను వాడుకోవడం ద్వారా విక్రమ్ కక్ష్యను 104 బై 128 కిలోమీటర్లుగా మార్పు. సెప్టెంబర్ 4 : విక్రమ్‌ను జాబిల్లికి మరింత చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నం సక్సెస్. తాజాగా విక్రమ్ కక్ష్య 35 బై 101 కిలోమీటర్లు. -
చంద్రయాన్–2: మూడో ఘట్టం విజయవంతం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంలో మూడో ఘట్టాన్ని కూడా శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. చంద్రయాన్–2 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్‌ను జాబిలమ్మకు మరింత దగ్గరగా చేర్చేందుకు బుధవారం తెల్లవారుజాము 3.42 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు. దీనికోసం ల్యాండర్లో నింపిన ఇంధనాన్ని తొమ్మిది సెకన్లపాటు మండించారు. బెంగళూరు సమీపంలోని బైలాలు మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ ప్రక్రియను నిర్వహించారు. ప్రస్తుతం ల్యాండర్ చంద్రుడికి దగ్గరగా 35 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 101 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ వృత్తాకారంలో పరిభ్రమిస్తోంది. ఈ నెల ఏడోతేదీ అర్ధరాత్రి 1.30 గంటల నుంచి రెండున్నర గంటల్లోపు ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై మృదువుగా దించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ల్యాండర్ తలుపులు తెరుచుకుని రోవర్(ప్రగ్యాన్) చంద్రుడి మీదకు దిగి 14 రోజులపాటు తిరిగి వివిధ పరిశోధనలు చేసి సమాచారాన్ని సేకరించి భూ నియంత్రిత కేంద్రానికి పంపిస్తుంది. మరోవైపు.. ల్యాండర్‌ను వదిలిపెట్టిన ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో చంద్రుడికి దగ్గరగా 96 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 125 కిలోమీటర్లు ఎత్తులో వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ల్యాండర్ కదలికలను తెలియజేసే పనిలో నిమగ్నమై ఉంది. -
చంద్రయాన్-2: కీలక దశ విజయవంతం
సాక్షి, న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నాం 1:15 గంటలకు ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది. ఈ దృశ్యాలనంతా ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిరంగా తిలకించారు. ఈనెల 7న చంద్రుని ఉపరితలంపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకోనుంది. దీంతో చంద్రయాన్-2 ప్రయోగం జాబిల్లికి అత్యంత చేరువలోకి చేరుకోగలిగింది. జూలై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 కొద్దిరోజుల పాటు భూకక్ష్యలో పరిభ్రమించి ఆగస్ట్20న చంద్రుడి కక్ష్యలోని ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాలుగుసార్లు దాని కక్ష్యని శాస్త్రవేత్తలు తగించారు. ఆదివారం సాయంత్రం ఐదోసారి తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయగలిగారు. దీంతో చంద్రయాన్-2 అత్యంత కీలక దశను విజయవంతంగా పూర్తిచేయగలిగింది. -
చంద్రునికి మరింత చేరువగా
బెంగళూరు : చంద్రయాన్ 2 ప్రయోగంలో మరో కీలకఘట్టం చోటుచేసుకుంది. మూడో లూనార్ బౌండ్ కక్ష్యలోకి చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని బుధవారం ఉదయం విజయవంతంగా చేర్చినట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రునికి 200 కి.మి దగ్గరగా..1500 కి.మి దూరంగా ఉన్న కక్ష్యలోకి చంద్రయాన్ 2ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 30న కక్ష్య దూరాన్ని మరింత తగ్గించనున్నారు. సెప్టెంబర్ 1 నాటికి చంద్రునికి అతి దగ్గరగా ఉపగ్రహాన్ని తీసుకెళ్తారు. సెప్టెంబర్ 2న ఉపగ్రహం నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడనుంది. ఇది సెప్టెంబర్ 7న చంద్రుని ఉపరితలంపై దిగనుంది. చంద్రయాన్ 2 తీసిన భూమి ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. జులై 22న నెల్లూరులోని సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చంద్రయాన్ 2ను విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. ఇది చదవండి : చంద్రయాన్–2కు చంద్రుడి కక్ష్య దూరం తగ్గింపు -
జాబిల్లి సిత్రాలు
సూళ్లూరుపేట: చంద్రయాన్– 2 మిషన్‌లో భాగంగా ఆర్బిటర్‌కు అమర్చిన టెరియన్ మ్యాపింగ్ కెమెరా (టీఎంసీ– 2) మరోమారు చంద్రుడిని ఫొటోలు తీసింది. సోమవారం వాటిని ఇస్రో విడుదల చేసింది. ఈ నెల 23న బెంగళూరు సమీపంలోని బైలాలు భూ నియంత్రణ కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. చంద్రుడికి దగ్గరగా 109 కిలోమీటర్లు, దూరంగా 4,375 కిలోమీటర్లు దీర్ఘ చతురస్త్రాకారంలో పరిభ్రమిస్తూ ఉత్తర వైపు ధ్రువంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ చిత్రాలను తీసింది. చంద్రయాన్ –2 మిషన్‌లో ల్యాండర్‌ను అమర్చిన ఉపకరణాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ నెల 28న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 7న ల్యాండర్లో అమర్చిన రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై దించేందుకు సర్వసన్నద్ధంగా ఎదురుచూస్తున్నారు. -
‘ఆ ఆర్టికల్’ గురించి పాలకులకు తెలుసా ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు?’ అన్న ప్రశ్నకు ‘ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఇసాక్ న్యూటన్’ అని ఎవరైనా టక్కున సమాధానం చెప్పారంటే మన కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన దృష్టిలో న్యూటన్ కన్నా ముందే మన పురాణాల్లో గురుత్వాకర్షణ సిద్ధాంత ప్రస్తావన ఉంది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్’ శనివారం ఏర్పాటు చేసిన ‘జ్ఞానోత్సవ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇలా మాట్లాడడం ఆయనకు కొత్త కాదు. ‘మన రాశి ఫలాల శాస్త్రం ముందు సైన్స్ ఎప్పుడూ పిగ్మీ’నే అని చెప్పడమే కాకుండా మన పూర్వికులు ఎప్పుడో అణు పరీక్షలు నిర్వహించారంటూ గత లోక్‌సభ వేదిక సాక్షిగా వాదించారు. అందుకేనేమో ఆయనకు ఈసారి కేంద్ర మంత్రిగా పదోన్నది వచ్చింది. అలా అని ఆయన్ని ఒక్కరినే తప్పుపట్టడం భావ్యం కాదు. చాలా మంది బీజేపీ నాయకులకు ఇలా మాట్లాడే అలవాటుంది. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి దినేశ్ శర్మ గతేడాది ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘టెస్ట్ ట్యూబ్ బేబీస్’ గురించి ప్రాచీన భారతీయులకు ముందే తెలుసునని, సీత పుట్టుకే అందుకు ఉదాహరణని చెప్పారు. టెలివిజన్ ప్రసారాల గురించి, విమానాల గురించి కూడా వారికి తెలుసని తెలిపారు. బీజేపీకి చెందిన మరో పార్లమెంట్ సభ్యుడు సత్యపాల్ సింగ్ ‘మానవ పరిణామక్రమం సిద్ధాంతం’ను అంగీకరించేందుకు అసలు సిద్ధంగా లేరు. ప్రాచీన రుషుల శిష్యులే నేటి మానవ జాతని పదే పదే చెబుతూ వస్తున్నారు. అంతెందుకు సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే, ప్రాచీన భారతీయులకు జన్యుశాస్త్రం గురించి అంతా తెలుసునని, ప్లాస్టిక్ సర్జరీ కూడా అప్పటికే ఉందని, అందుకు వినాయకుడికి ఏనుగు తలను అతికించడమే సాక్ష్యమని చెప్పారు. అసలు ఆత్మసాక్షిగా ఈ విషయాలను నమ్మి మాట్లాడుతారా? అవసరం కోసం మాట్లాడుతారా? అన్నది వారికే తెలియాలి. అసలు ఇంత అసంబద్ధంగా మాట్లాడే వారిని జనం ఎలా భరిస్తారబ్బా? అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. జనంలో అక్షరాస్యత పెరగకపోవడం, ముఖ్యంగా శాస్త్రవిజ్ఞాన దృక్పథం లేక అజ్ఞానంలో బతుకుతుండటం వల్ల భరిస్తుండవచ్చు. కానీ భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ‘ఆర్టికల్ 51ఏ’ ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు శాస్త్రవిజ్ఞాన దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అందుకు పాలకులు కృషి చేయాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. ఆ తర్వాత 2010లో కేంద్రం తీసుకొచ్చిన ‘విద్యా ప్రాథమిక హక్కు’ చట్టంలో ప్రతి విద్యార్థికి శాస్త్ర విజ్ఞాన దక్పథం ఉండాలన్న విషయాన్ని పొందుపర్చారు. దేశంలో అనాదిగా వస్తోన్న ‘బహిర్భూమి’ అనాచారం వల్ల ఏటా లక్షలాది మంది ప్రజలు అంటురోగాలకు గురై మరణిస్తున్నారని, దేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలంటూ ప్రభుత్వ విధాన నిర్ణేతలు చెప్పడం కూడా శాస్త్రవిజ్ఞాన దృక్పథమే. ఆ దిక్కుగా మరుగు దొడ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందీ, ఇస్తున్నది కూడా మన ప్రధాని నరేంద్ర మోదీనే. దేశంలో విద్యాభివద్ధి కోసం కొత్త విద్యా విధానాన్ని రూపొందించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖదే. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న పోఖ్రియాల్ కొత్త విద్యా విధానాన్ని ఎలా రూపొందిస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నే. అసలు కొత్త విద్యా విధానం రూపకల్పన కసరత్తులో భాగంగా నిర్వహించిన ‘జ్ఞానోత్సవ్’లోనే గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడారు. చంద్రుడి ఉపరితలాన్ని స్పర్శించి ప్రయోగాలు నిర్వహించేందుకు ‘చంద్రయాన్–2’ను పంపించిన భారత్‌లో ఇలాంటి పాలకులు ఉండడం ఆశ్చర్యమే. రాజ్యాంగానికి బద్ధులై ఉంటామని ప్రమాణ స్వీకారం చేసినందున పోఖ్రియాల్ సహా పాలకులంతా ‘ఆర్టికల్ 51 ఏ’ను గౌరవించాల్సిందే. -
చంద్రయాన్–2కు చంద్రుడి కక్ష్య దూరం తగ్గింపు
సూళ్లూరుపేట: చంద్రయాన్–2కు మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటలకు చంద్రుడి కక్ష్య (లూనార్ ఆర్బిట్)లో రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు. బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు విజయవంతంగా ఈ ప్రక్రియను నిర్వహించారు. చంద్రయాన్–2 మిషన్‌ను మంగళవారం చంద్రుడి కక్ష్యలో చంద్రుడికి దగ్గరగా 114 కి.మీ., దూరంగా 18,072 కి.మీ. ఎత్తులో మొదటి విడత ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటలకు 1228 సెకన్లపాటు ఆర్బిటర్‌లో నింపిన ఇంధనాన్ని మండించి చంద్రుడి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. లూనార్ ఆర్బిట్ మొదటి విడతలో చంద్రుడికి దగ్గరగా ఉన్న 114 కి.మీ. దూరాన్ని 118 కి.మీ.కు స్వల్పంగా పెంచారు. చంద్రుడికి దూరంగా 18,072 కి.మీ. దూరాన్ని భారీగా తగ్గిస్తూ 4,412 కి.మీ. ఎత్తులోకి తీసుకొచ్చే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. చంద్రయాన్–2 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతే, లూనార్ ఆర్బిట్‌లో ప్రవేశించాక కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ రావడం ఈ ప్రయోగంలో విశేషం. మిషన్ చంద్రుడికి దగ్గరగా 30 కి.మీ., దూరంగా 100 కి.మీ. చేరుకోవడం కోసం దూరాన్ని తగ్గించేందుకు మరో రెండుసార్లు ఆపరేషన్ చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28న ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్యలో చంద్రుడి కక్ష్య దూరాన్ని మూడోసారి తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకు ఇటు భూమధ్యంతర కక్ష్యలో, అటు చంద్రుడి కక్ష్య (లూనార్ ఆర్బిట్)లో చంద్రయాన్–2 మిషన్‌లోని అన్ని వ్యవస్థలు ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
వడివడిగా మామ చుట్టూ..
అంతరిక్ష చరిత్రలో భారత్.. తన కోసం మరికొన్ని పుటలను లిఖించుకుంది. చంద్రయాన్–2 ప్రయోగంలో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ‘బాహుబలి’ప్రవేశించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం చేపట్టిన ఆపరేషన్ విజయం సాధించింది. లిక్విడ్ ఇంజిన్‌ను మండించడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. అర్ధగంట పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఇప్పటిదాకా జరిగింది ఇదీ.. ► ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్–2ను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. ► ఆగస్టు 14న చంద్రుడి కక్ష్యగతి మార్గంలోకి మళ్లించారు. ► ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జరగబోయేది ఇదీ.. ► సెప్టెంబర్ 7న ఉదయం 1.55 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ (1,471 కేజీల బరువు) చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుంది. ► ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడిపోయి, చంద్రుడిపై అన్వేషణ ప్రారంభిస్తుంది. ► చంద్రయాన్ ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ.. అక్కడి విశేషాలను భూమిపైకి పంపుతూ ఉంటుంది. వడివడిగా.. చంద్రుడి దిశగా.. సాక్షి, బెంగళూరు/సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానసపుత్రిక చంద్రయాన్–2 అంతరిక్ష నౌక చంద్రుడి ఒడిని చేరేందుకు వడివడిగా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా ఈ ప్రయోగంలో అత్యంత కీలక ఘట్టం మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకు లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్–2 నౌక కీలకమైన చంద్రుడి కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. మంగళవారం ఉదయం 9.02 గంటల ప్రాంతంలో ఆర్బిటర్‌లోని ద్రవ ఇంజిన్‌ను 1,738 సెకన్లపాటు మండించి లూనార్ ఆర్బిట్‌లో అంటే చంద్రుడికి దగ్గరగా 114 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 18,072 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ చతురస్రాకారంలో ప్రవేశపెట్టి భారత ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారు. బెంగళూరు సమీపంలో బైలాలులోని భూనియంత్రిత కేంద్రం (మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్) నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. తదుపరి ప్రక్రియలకు సన్నాహాలు.. ఇక ప్రయోగంలో తదుపరి 18,072 కిలోమీటర్ల దూరాన్ని 4 విడతలుగా తగ్గించుకుంటూ వచ్చి చంద్రుడికి చతురస్రాకారంలో 100 కిలోమీటర్లుకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. తర్వాత 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ వచ్చి సెప్టెంబర్ 2వ తేదీన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ (విక్రమ్)ను విడిచిపెట్టే ప్రక్రియను చేపట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ఇక ప్రయోగంలో చివరిగా సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల్లోపు ల్యాండర్ నుంచి రోవర్ (ప్రజ్ఞాన్) బయటకు వచ్చి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి తన పరిశోధనలను ప్రారంభిస్తుంది. దశల వారీగా పరిశీలిస్తే.. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జూలై 22వ తేదీన చంద్రయాన్–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లు ఎత్తులో భూమధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా గత నెల 24వ తేదీ తొలి విడత, 26వ తేదీన రెండోసారి, 29వ తేదీన మూడోసారి, ఈ నెల 2వ తేదీన నాలుగోసారి, 6వ తేదీన ఐదోసారి ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని మండించి భూమికి దగ్గరగా 276 కిలోమీటర్లు, భూమికి దూరంగా 1,42,975 కిలోమీటర్లను విజయవంతంగా పెంపుదల చేశారు. ఈ నెల 14వ తేదీన ఆరోసారి లూనార్ ఆర్బిట్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్ నౌకను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు మొత్తం 6 సార్లు కక్ష్య దూరం పెంచే ఆపరేషన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఎలాంటి సాంకేతికపరమైన లోపం లేకుండా విజయవంతంగా నిర్వహించారు. ఆ అర్ధగంట.. అత్యంత ఉత్కంఠ.. చంద్రయాన్–2 మిషన్‌ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు మా శాస్త్రవేత్తలు ద్రవ ఇంథనాన్ని మండిస్తున్న సమయంలో నా గుండె కాసేపు ఆగినంత పనైంది. సుమారు ఈ ప్రక్రియ చేపడుతున్న అర్ధగంట సమయం అత్యంత ఉత్కంఠను ఎదుర్కొన్నా’అని మీడియా సమావేశంలో ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ల్యాండర్ చంద్రుడిపై దిగే సెప్టెంబర్ 7వ తేదీన ఇంతకంటే అత్యంత ఉత్కంఠ క్షణాలు ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభినందనలు.. చంద్రయాన్–2 వ్యోమనౌకను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయాణంలో మరో మైలురాయిని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ముగించారని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. -
అరగంట సేపు ఊపిరి బిగపట్టిన పరిస్థితి...
బెంగళూర్ : చంద్రయాన్-2ను మంగళవారం ఉదయం విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టామని ఇస్రో చీఫ్ కే. శివన్ వెల్లడించారు. జాబిల్లి కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టేందుకు చంద్రయాన్ 2లో లిక్విడ్ ఇంజన్‌ను సిబ్బంది మండించే క్రమంలో అరగంట సేపు ఊపిరి బిగపట్టిన పరిస్థితి నెలకొందని తాము అనుభవించిన టెన్షన్‌ను ఆయన వివరించారు. చంద్రయాన్ 2 సెప్టెంబర్ 7న చంద్రుడి వద్దకు చేరడం ఉత్కంఠభరిత సన్నివేశమని శివన్ పేర్కొన్నారు. ఇస్రో చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగంగా చంద్రయాన్ 2 వినుతికెక్కిన క్రమంలో సెప్టెంబర్ 7న మూన్ మిషన్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక మంగళవారం ఉదయం చంద్రయాన్ 2 చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంఈ ప్రయోగ ప్రక్రియలో అత్యంత కీలక దశగా ఇస్రో చీఫ్ కే. శివన్ అభివర్ణించారు. దాదాపు 30 రోజుల ప్రయాణం అనంతరం చంద్రుడి చెంతకు చేరనున్న భారత రెండో స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం ఉదయం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇక సెప్టెంబరు 7న తెల్లవారుజామున అత్యంత చారిత్రాత్మక ఘట్టం ప్రారంభమవుతుందని, 1.40గంటలకు ల్యాండర్లో ప్రొపల్షన్ ప్రారంభమై 1.55గంటలకు ల్యాండ్ అవుతుందని చెప్పారు. 3.10గంటలకు సోలార్ ప్యానెళ్లు తెరచుకుని మరోగంటలో అంటే 4 గంటల ప్రాంతంలో రోవర్ జాబిల్లి ఉపరితలానికి చేరకుని ఆపరేషన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. ఆపై జాబిల్లి గుట్టమట్లను ఆవిష్కరించడంతో పాటు అక్కడి వాతావరణంపై పరిశోధన చేపడుతుందని వివరించారు. -
మరో మైలురాయిని దాటిన చంద్రయాన్-2: శివన్
సాక్షి, బెంగళూరు: అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి చేరిందని ఇస్రో ఛైర్మన్ శివన్ ధృవీకరించారు. దీంతో చంద్రయాన్-2 ప్రధాన మైలురాయిని దాటిందని తెలిపారు. మంగళవారం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అంచనాలను అందుకుంటూ సరిగ్గా 9:20 గంటలకు కక్ష్యలోకి చేరింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివన్ మాటట్లాడుతూ.. అత్యంత కీలక ఘట్టాన్ని సమర్థవంతంగా పూర్తి చేశామని స్పష్టం చేశారు. చంద్రుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోతుందని, 3న ఆర్బిటర్ పనితీరును పరిశీలిస్తామని శివన్ వివరించారు. వచ్చే నెల 7న ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగనుందని తెలిపారు. (చదవండి: చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్–2) బెంగళూరు సమీపంలో గల బైలాలులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెన్నాల సాయంతో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి ఉపగ్రహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయమని ఇస్రో చైర్మన్ కె.శివన్ అన్నారు. గత నెల 22న చంద్రయాన్–2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. -
చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్–2
సాక్షి, బెంగళూరు: యావత్తు దేశం ఆతృతగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయాణం సాఫీగా సాగుతోంది. ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగంలో మరో కీలకఘట్టం విజయవంతంగా ముగిసింది. లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్–2 ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మంగళవారం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అంచనాలను అందుకుంటూ సరిగ్గా 9:20 గంటలకు కక్ష్యలోకి చేరింది. ప్రయోగించిన 29 రోజుల తర్వాత చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి చేరింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉపగ్రహం నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. బెంగళూరు సమీపంలో గల బైలాలులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెన్నాల సాయంతో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి ఉపగ్రహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయమని ఇస్రో చైర్మన్ కె.శివన్ అన్నారు. గత నెల 22న చంద్రయాన్–2ను ప్రయోగించారు. -
నేడే కక్ష్యలోకి చంద్రయాన్–2
సూళ్లూరుపేట/బెంగళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగంలో మరో కీలకఘట్టానికి మంగళవారం వేదిక కానుంది. ప్రస్తుతం లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్–2 ఉపగ్రహం నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. నేటి ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మండించి చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన ఉపగ్రహం నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుందని తెలిపింది. బెంగళూరు సమీపంలో గల బైలాలులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెన్నాల సాయంతో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి ఉపగ్రహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయమని ఇస్రో చైర్మన్ కె.శివన్ అన్నారు. చంద్రయాన్–2 చంద్రుడి కక్ష్యలోకి చేరుకోనున్న నేపథ్యంలో అధికారులు బెంగళూరులోని అంతరిక్ష కేంద్రం ప్రధాన కార్యాలయంలో మంగళవారం జాతీయ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత నెల 22న చంద్రయాన్–2ను ప్రయోగించారు. -
ప్రధానితో కలిసి చంద్రయాన్-2 చూసొద్దామా..!
ఇస్రో నుంచి ఉపగ్రహాలను పంపించడం సాధారణంగా మాధ్యమాల్లో చూస్తుంటాం. ఇటీవల మన దేశం చంద్రయాన్–2ను పంపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అలాంటిది ఇస్రో కార్యాలయంలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి చంద్రయాన్–2 మిషన్ చంద్రుడిపై దిగడం ప్రత్యక్షంగా చూసే అవకాశం కొంత మంది విద్యార్థులకు దక్కనుంది. ఇందుకు గాను 8 నుంచి 10 వతరగతి చదివే విద్యార్థులు ఇస్రో నిర్వహించే ఆన్లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపితే సరిపోతుంది.ఈ నెల 20వ తేదీ వరకే గడువు ఉంది. సాక్షి, తిరుపతి : భారత సాంకేతిక ఎదుగుదలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇస్రో మై గౌ’ పేరుతో ఆన్లైన్ ప్రతిభా పాటవ పోటీలను నిర్వహిస్తోంది. దీనికి ఎనిమిది నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. ఈ నెల 10 నుంచి ఆన్లైన్ క్విజ్ ద్వారా పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రతిభ చూపి, ఎంపికైన విద్యార్థులు చంద్రయాన్–2 చంద్రుడిపై దిగే క్రమాన్ని స్వయంగా వీక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులు మిగతా రాష్ట్రాల విజేతలతో పాటు ప్రధాని మోదీతో కలిసి చంద్రయాన్–2 మిషన్ చంద్రుడిపై దిగే అపురూ పన్నివేశాన్ని వీక్షించవచ్చు. పోటీ ముగిశాక విజేతల వివరాలు వెల్లడిస్తారు. తగు ఆధారాలు, ద్రువపత్రాలతో ఇస్రోను సంప్రదిస్తే విజేతలకు ఆహ్వానం పంపిస్తారు. పోటీ ఇలా.. కంప్యూటర్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంటర్నెట్ను అనుసంధానం చేసుకుని IrsomYgov వెబ్సైట్లోకి వెళ్లగానే.. అక్కడ వివరాలు వస్తాయి. వీటిలో మొదటి కాలమ్గా వివరాలు, నియమ నిబంధనలు ఉంటాయి. రెండో కాలమ్గా లాగిన్ టు ప్లేక్విజ్ వస్తుంది. దీనిపై క్లిక్ చేసి, కావాల్సిన వివరాలు నమోదు చేస్తే ఆన్లైన్లోనే ప్రశ్నలు ప్రారంభమవుతాయి. పది నిమిషాల వ్యవధిలో 20ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఒక్కసారి పోటీ ప్రారంభమయ్యాక మధ్యలో ఆపకూడదు. స్క్రీన్‌పై కనిపించిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వాలి. తెలియకపోతే తప్పుకుని తరువాత వచ్చే ప్రశ్న తెలుసుకునే వెసులుబాటు ఉంది. విద్యార్థికి పెద్ద వారు సహకరించవచ్చు. కానీ ఏకంగా వారే సమాధానాలు ఇవ్వకుండా నైతికత పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 11.59గంటల వరకు ఆన్లైన్లో క్విజ్ పోటీల్లో పాల్గొనవచ్చు. ఎంపిక ఎలాగంటే.. వేగం, కచ్చితత్వంతో పాటు స్పందించే మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతిభావంతులను గుర్తిస్తారు. విజేతల సంఖ్య ఎక్కువగా ఉంటే అతి తక్కువ వ్యవధిలో సరైన సమాధానాలు నమోదు చేసిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒకరికి సర్టిఫికెట్‌ను అందిస్తారు. సువర్ణావకాశం సద్వినియోగం చేసుకోవాలి చంద్రయాన్–2ను ప్రత్యక్షంగా సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్రమోదీతో కలసి చూసే సువర్ణావకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. 8వతరగతి నుంచి 10వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఇటువంటి ఆన్లైన్ పోటీల్లో పాల్గొంటే విద్యార్థులకు మేధోశక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఈ అవకాశాన్ని కల్పించే విధంగా సహాయ సహకారాలు అందించాలి. ఆర్.మణికంఠన్, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ -
ఇక నేరుగా చంద్రుడి వైపు
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదిక నుంచి ఇస్రో గత నెల 22న నింగికెగసిన చంద్రయాన్–2 మిషన్ బుధవారం వేకువ జామున 2.21 గంటలకు భూ మధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి వైపునకు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతోంది. బుధవారం 2.21 గంటలకు 1203 సెకెండ్ల పాటు చంద్రయాన్–2 మిషన్‌లో అంతర్భాగమైన ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని (లూనార్ ఆర్బిట్ ట్రాజెక్టరీ) ద్వారా మండించి ఆరోసారి కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ చంద్రుడి వైపునకు మళ్లించే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. బెంగళూరు సమీపంలో బైలాలులో వున్న భూనియంత్రిత కేంద్ర (మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్) నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ ఆధ్వర్యంలో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను ఆరోసారి విజయవంతంగా నిర్వహించారు. ఆగస్టు 20 నాటికి ఆర్బిటర్ ల్యాండర్, రోవర్‌ను మోసుకుని చంద్రుడి కక్ష్యలోకి వెళుతుంది. సెప్టెంబర్ 2వ తేదీన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే ప్రక్రియ చేపడతారు. సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవం వైపు మృదువైన ల్యాండింగ్ చేయనున్నారు. -
చంద్రయాన్–2 ల్యాండింగ్‌ను చూసే అవకాశం
సాక్షి, మెదక్: చంద్రయాన్–2 ల్యాండింగ్‌ను ప్రధానమంత్రితో కలిసి చూసే అవకాశం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఇస్రో బెంగళూర్ వాళ్లు ఆన్లైన్ క్విజ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. mygov.in వెబ్సైట్లో 10 నుంచి 20వరకు ఆన్లైన్లో నిర్వహించే క్విజ్‌లో ఆసక్తి కలిగిన విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు. ఇందులో 20 ప్రశ్నలకు 10 నిమిషాల వ్యవధిలో సమాధానాలు తెలపాలని సూచించారు. ఎక్కువ ప్రశ్నలకు సమాధానం తెలిపిన ఇద్దరు విద్యార్థులను ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరితో కలిసి ప్రధానమంత్రి ఇస్రో బెంగళూరు కేంద్రం నుంచి చంద్రయాన్–2 ల్యాండింగ్‌ను వీక్షించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని రాష్ట్రం తరఫున మన జిల్లాకు దక్కే విధంగా ఎక్కువ మంది క్విజ్‌లో పాల్గొనాలని తెలిపారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయు లు ప్రోత్సహించాలని కోరారు. -
ఫొటోలు పంపిన చంద్రయాన్–2
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్–2 తొలిసారి అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలను పంపింది. ప్రస్తుతం చంద్రయాన్–2 భూమికి–చంద్రుడికి మధ్యలోని భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమిస్తోంది. శనివారం సాయంత్రం 5.28 గంటలకు భూమిని ఉత్తరం ధృవం వైపు నుంచి తీసిన ఐదు ఫొటోలను ఆదివారం ఇస్రో తన సొంత వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేసింది. చంద్రయాన్–2 కక్ష్య దూరాన్ని ప్రస్తుతం భూమికి దగ్గరగా 277 కిలోమీటర్లకు, దూరంగా 89,472 కిలోమీటర్ల ఎత్తుకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమికి 5,000 కిలోమీటర్ల దగ్గరగా వచ్చిన సమయంలో 10 నిమిషాల వ్యవధిలో ఐదు ఫొటోలను తీసి బెంగళూరు సమీపంలోని బైలాలు భూ నియంత్రిత కేంద్రానికి పంపింది. చంద్రయాన్–2లో ఉన్న ల్యాండర్ (విక్రమ్)లో ఎల్–14 కెమెరా ఈ చిత్రాలను తీసింది. చంద్రుడి ఉపరితలం మీద దిగే 15 నిమిషాలు విజయవంతమైతే చంద్రయాన్–2 యాత్ర సజావుగా సాగినట్టేనని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫొటోలు ఎప్పుడెప్పుడంటే.. భూమికి ఉత్తర ధృవం నుంచి 5 వేల కిలోమీటర్ల ఎత్తులో ఒక ఛాయా చిత్రం, 5.29 గంటలకు 4,700 కిలోమీటర్ల్ల ఎత్తులోకి వచ్చాక మరో ఛాయాచిత్రాన్ని తీసింది. ఆ తరువాత 5.31 గంటలకు 4,100 కిలోమీటర్ల్ల ఎత్తు నుంచి, 17.34 గంటలకు 3,200 కిలో మీటర్ల ఎత్తు నుంచి, 17.37 గంటలకు 2,450 కిలోమీటర్ల ఎత్తు నుంచి మరో మూడు ఛాయా చిత్రాలను తీసి పంపింది. -
నీలిరంగులో మెరిసిపోతున్న భూమి
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ -2 మిషన్ ప్రయోగించిన విషయం తెలిసిందే. శుక్ర వారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట ర్లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. చంద్రయాన్–2 మిషన్ రోదసీలో ఆరోగ్యకరంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్ర వేత్తలు అధికారికంగా వెల్లడించారు. తాజాగా శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఈ నెల14న చివరిగా చంద్రయాన్–2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈరోజు విడుదల చేసింది. నీలిరంగులో భూమి మెరిసిపోతుంది. -
చంద్రయాన్–2 కక్ష్య దూరం పెంపు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్ కేంద్రం నుంచి గత నెల 22న ప్రయోగించిన చంద్రయాన్–2 మిషన్‌కు సంబంధించి శుక్ర వారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట ర్లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. చంద్రయాన్–2 మిషన్ రోదసీలో ఆరోగ్యకరంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్ర వేత్తలు అధికారికంగా వెల్లడించారు. బెంగళూరు సమీపంలో బైలాలులో ఉన్న భూ నియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్–2 మిషన్‌లోని ఆర్బిటర్‌లో నింపిన ఇంధన సాయంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను నాలుగోసారి కూడా విజయవంతంగా నిర్వహించారు. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా చంద్రయాన్–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్ల ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా గత నెల 24న మొదటి విడతలో భూమికి దగ్గరగా ఉన్న 170 కిలోమీటర్ల ఎత్తును 230 కిలోమీటర్లకు, 26న రెండోసారి భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లుగా ఉన్న కక్ష్య దూరాన్ని 54,829 కిలోమీటర్లకు, 29న చేపట్టిన ఆపరేషన్‌లో మూడోసారి భూమికి దగ్గర్లో ఉన్న 230 కిలోమీటర్ల దూరాన్ని 270 కిలోమీటర్లకు, దూరంగా ఉన్న 54,829 కిలోమీటర్ల దూరాన్ని 71,792 కిలోమీటర్లకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పెంచిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. తర్వాత 14న చివరిగా చంద్రయాన్–2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
చంద్రయాన్–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్–2 మిషన్‌కు శుక్రవారం మధ్యాహ్నం 1.08 రెండో విడత కక్ష్యదూరాన్ని విజయవంతంగా పెంపుదల చేశారు. బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న భూనియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్–2 మిషన్‌లో భాగంగా ఉన్న ఆర్బిటర్‌లో నింపిన ఇంధనం సాయంతో కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా చంద్రయాన్–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లు ఎత్తులో భూమధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా ఈ నెల 24వ తేదీన మొదటి విడత పెంపుదలలో భూమికి దగ్గరగా ఉన్న 170 కిలోమీటర్ల ఎత్తును 230 కిలోమీటర్ల వరకు దూరం పెంచారు. శుక్రవారం రెండోసారి ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని 883 సెకెన్లపాటు మండించి భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లుగా ఉన్న కక్ష్య దూరాన్ని ఒక్కసారిగా 54,829 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 దాకా మూడోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు. ఈ సారి భూమికి దగ్గరగా ఉన్న 230 కిలోమీటర్లు దూరాన్ని 268 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 54,829 కిలోమీటర్ల దూరాన్ని 71,558 కిలోమీటర్ల దూరానికి పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. -
జాబిల్లిపై మరింత నీరు!
చందమామపై నీటి ఉనికి, విస్తృతిని గుర్తించేందుకు చంద్రయాన్ –2 మూడ్రోజుల క్రితమే నింగికి ఎగిసిన విషయం మనకు తెలిసిందే. ఈలోపుగానే కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు మన సహజ ఉపగ్రహంపై ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే నీరు ఉన్నట్లు ప్రకటించేశారు. నేచర్ జియోసైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. మంచుతో కూడిన బుధ గ్రహానికి, జాబిల్లిలో నిత్యం నీడలో ఉండే ప్రాంతానికి మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. దీనర్థం బుధుడి మాదిరిగానే ఈ ప్రాంతంలోనూ ఉపరితల జలం ఉండే అవకాశం ఉందన్నమాట. బుధ గ్రహపు ధ్రువ ప్రాంతాల్లోనూ భూమి నీడ పడే కొన్ని ప్రాంతాలు ఉన్నాయని.. 2009లో ఈ ప్రాంతంలోకి ప్రయోగించిన శోధక నౌక నీరు, మంచు ఆవిరి ఉన్నట్లు నిర్ధారించిందని ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. నీడలో ఉన్న భారీ గుంతల్లో (క్రేటర్స్) మీటర్ల మందంలో మంచు ఉన్నట్లు... నీడ కారణంగా ఆ నీరు సూర్యరశ్మికి ఆవిరైపోకుండా ఉన్నట్లు తెలుస్తోంది. జాబిల్లిపై కూడా అచ్చం బుధ గ్రహ పరిస్థితులను పోలినవి ఉండవచ్చునన్న అంచనాతో తాము పరిశోధనలు మొదలుపెట్టామని జాహ్నవి వెంకటరామన్ తెలిపారు. ఉష్ణగ్రతలు, నీడల్లో ఉండే క్రేటర్స్ వివరాలన్నింటినీ పరిశీలిస్తే మునుపు వేసిన అంచనాల కంటే ఎక్కువ మొత్తంలో చందమామపై నీరు ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు. -
చంద్రయాన్-2 విజయం వెనుక ఆ ఇద్దరు..
న్యూఢిల్లీ: దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. ఇది భారతదేశ చరిత్రలో మరొక గర్వించదగిన క్షణం. చంద్రయాన్ -2 ప్రయోగం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగింది. ఉపగ్రహం దాదాపుగా 3 లక్షల కి.మీ.కు పైగా ప్రయానించి చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరనుంది. చంద్రయాన్-2 చంద్రుని కక్ష్య చేరేందుకు 45 రోజుల సమయం పట్టనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం ఉపగ్రహం నుంచి లాండర్ వేరుపడనుంది. ఇస్రో వ్యవస్థాపక శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ పేరును లాండర్‌కు పెట్టారు. ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఉన్న ఇద్దరు మహిళలను దేశం మొత్తం ప్రశంసిస్తోంది. భారతదేశ చరిత్రలో మొదటిసారి, ఇస్రో యాత్రకు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారు. చంద్రయాన్-2 ప్రయోగానికి ముత్తయ్య వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్ కాగా, రితు కరిధల్ చంద్రయాన్ -2 మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రయోగం విజయవంతం కావడంలో మహిళల పాత్ర కూడా కీలకం. దాదాపు 30శాతం మంది మహిళలు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. భారతదేశపు అంతరిక్ష మిషన్ చరిత్రలో మొదటిసారి మహిళా శాస్త్రవేత్తల నేతృత్వంలో ప్రయోగం జరిగింది. ఈ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తలను యావత్ దేశం అభినందిస్తోంది. -
వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్
సాక్షి, శ్రీహరికోట : అంతరిక్ష చరిత్రలోనే భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్ కే.శివన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2 ప్రయోగానంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందన్నారు. అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశ విజయవంతంగా ముగిసిందని, నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశించిందని తెలిపారు. చంద్రుడిపై భారత్ చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఇదని అభివర్ణించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని చెప్పారు. ఇస్రో టీమ్ అహర్నిశలు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మూడు ఉపగ్రహాలను ఒకే రోవర్ ద్వారా ప్రయోగించినట్లు తెలిపారు. ఊహించనదానికంటే చంద్రయాన్-2 తొలిదశ ఎక్కు విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. అభినందనల వెల్లువ.. చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి.. భారత్ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఇస్రోశాస్త్ర వేత్తలను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్వీటర్ వేదికగా శాస్త్రవేత్తలను కొనియాడారు. ‘ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంతో దేశం మొత్తం గర్వించేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇస్రో ఇలానే మరిన్ని కొత్త విషయాల కోసం ప్రయోగాలు చేపడుతూ విజయవంతం కావాలి.’ అని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చరిత్రలోనే ఇదో అద్భుత ఘట్టమని, మన శాస్త్రవేత్తల శక్తిని,130 కోట్ల భారతీయుల అంకిత భావాన్ని చంద్రయాన్ ప్రయోగం ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కొనియాడిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను తెలంగాణ గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ‘చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు అభినందనలు. కోట్ల కలలను చంద్రునిపైకి తీసుకెళ్లడం చారిత్రాత్మక సందర్భం. మన శాస్త్రవేత్తలు, ఇస్రో భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019 చదవండి: జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్–2 -
‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ
సాక్షి, హైదరాబాద్ : భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది. 3.8 టన్నుల బరువున్న చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్-3ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.15వ తేదీ వేకువజామున ప్రయోగించాలనుకున్న చంద్రయాన్–2ను చివరి గంటలో రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు. -
చంద్రయాన్–2 ప్రయోగం రేపే
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. 15వ తేదీ వేకువజామున ప్రయోగించాలనుకున్న చంద్రయాన్–2ను చివరి గంటలో రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ప్రయోగం పనులపై అన్ని సెంటర్ల డైరెక్టర్లతో ఎంఆర్ఆర్ సమావేశాన్ని నిర్వహించారు. షార్ శాస్త్రవేత్తలు కల్పనా అతిథి గృహంలో ఈ సమావేశానికి హాజరై సలహాలు, సూచనలను తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఒకసారి లాంగ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ ఆధ్వర్యంలో మరోమారు సమావేశమయ్యాక సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే.. ఆదివారం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ షార్కు విచ్చేసిన తర్వాత ల్యాబ్ మీటింగ్ జరుగుతుందని షార్ అధికార వర్గాలు అంటున్నాయి. మొత్తానికి 3,850 కిలోల బరువు కలిగిన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. -
నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో
ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రయోగం. ప్రపంచ దేశాలన్నీ సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ వైపే చూశాయి. ఈ ప్రయోగాన్ని వీక్షించేం దుకు దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ కూడా వచ్చారు. ఆదివారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దేశమంతా మేల్కొని ప్రయోగాన్ని చూస్తోంది. ఇంకొన్ని నిమిషాల్లో చంద్రయాన్–2 నింగికి పయనమయ్యేది.. కానీ క్రయోజనిక్ దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. అందరితో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు సైతం నిరాశ చెందారు. ఇక ప్రయోగానికి రెండు నెలల సమయం పడుతుందనుకున్నారు. శాస్త్రవేత్తలు వెంటనే తేరుకున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే సమస్యను సరిచేశారు. రెట్టించిన ఉత్సాహంతో ఈ నెల 22వ తేదీన సగర్వంగా చంద్రయాన్–2ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగాల్లో ఇస్రోది తిరుగులేని ఆధిపత్యం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో జీఎస్ఎల్వీ రాకెట్లను సైతం విజయవంతంగా నింగికి పంపుతోంది. ఇందులో క్రయోజనిక్ దశ కీలకమైంది. తొలినాళ్లలో రష్యా నుంచి తెచ్చిన క్రయోజనిక్ ఇంజిన్ల సహకారంతో జీఎస్ఎల్వీని ప్రయోగించేది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజిన్లు తయారు చేసే విషయంలో ఇస్రో ముందడుగు వేసింది. ఇప్పటివరకూ 13 జీఎస్ఎల్వీలు ప్రయోగించగా అందులో 7 స్వదేశీ ఇంజిన్లు ఉండడం గమనార్హం. ఇందులో ఒకటి మాత్రమే విఫలమైంది. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ల సిరీస్‌లో మూడు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 2010 ఏప్రిల్ 5వ తేదీన తొలిసారిగా స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం విఫలమైంది. అందులో జరిగిన లోపాలపై 2010 నుంచి 2013 దాకా అధ్యయనం చేసింది. లోపాలను సరిదిద్ది అదే సంవత్సరం ఆగస్టు 19న జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగానికి సిద్ధమైంది. ఆ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభించి మరో గంటలో ప్రయోగం ఉందనగా రెండోదశలో లీకేజీని గుర్తించి ప్రయోగాన్ని ఆపేసింది. అది మేజర్ సాంకేతిక లోపం కావడంతో రాకెట్‌లోని ఇంధనాన్ని అంతా వెనక్కి తీయడమే కాకుండా రాకెట్‌ను పూర్తిగా విప్పేసి రెండో దశలో లీకేజీ వచ్చిన చోటును గుర్తించి నాలుగు నెలల్లో అంటే 2014 జనవరి నెలలో ప్రయోగాన్ని చేసి విజయవంతంగా గగనంలోకి పంపింది. ఆ తరువాత చేసిన జీఎస్ఎల్వీ ప్రయోగాలన్నీ విజయవంతం కావడం విశేషం. ప్రయోగానికి సిద్ధం తాజాగా చంద్రయాన్–2 మిషన్‌ను తీసుకెళ్లే జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్లో మూడో దశలోని క్రయోజనిక్ దశలో పోగో గ్యాస్బాటిల్స్ నుంచి ట్యాంక్‌కు వెళ్లే పైపులు బయటవైపు లీకేజీని గుర్తించి 56.24 నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ సాంకేతిక లోపాన్ని అధిగమించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. కేవలం నాలుగు రోజుల్లోపే అంతా సరిచేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. అయితే ముందుగా సెప్టెంబర్ నెల వరకు పడుతుందని, ఈ ఏడాది ఆఖరు దాకా సమయం తీసుకుంటుందని అనుకున్నారు. శాస్త్రవేత్తలు దీనిని సవాలుగా తీసుకుని తక్కువ సమయంలో మరమ్మతులు చేశారు. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్–2 ప్రయోగాన్ని ఈ నెల 22న సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. -
జూలై చివరి నాటికి చంద్రయాన్ 2
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని ఇస్రో బృందం తెలిపింది. జూలై చివరి నాటికి చంద్రయాన్ 2ను గగనతలానికి పంపనున్నట్లు పేర్కొంది. చంద్రయాన్ 2ను చంద్రుడిపైకి ప్రయోగించడానికి జూలై మొదటివారంలో నిర్ణయించుకున్నప్పటికీ అది జూలై 15కు వాయిదా పడింది. ఆ తర్వాత సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని నిలిపివేశారు. అప్పటికప్పుడు సమస్య పరిష్కరించడం సాధ్యం కానందున చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా గతంలో చంద్రునిపై పరిశోధనలకుగానూ చంద్రయాన్1ను పరీక్షించారు. ఇది చంద్రుని చుట్టూ 3,400 సార్లు తిరగగా 312 రోజలపాటు అంటే 2009 ఆగస్టు 29 వరకు విజయవంతంగా పని చేసింది. చంద్రయాన్ 1ను పరీక్షించిన 11 సంవత్సరాలకు చంద్రుడిపై ప్రయోగానికి ఇస్రో మళ్లీ సిద్ధమైంది. చంద్రుని దక్షిణ ధృవాన్ని అన్వేషించడానికి ఈ ప్రయోగం చేపడుతున్నారు. చంద్రయాన్ 2లో బాహుబలిగా పిలుచుకునే జీఎస్ఎల్వీ ఎంకే-3 రాకెట్‌ను వాడుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.978 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రయాన్ 2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి దాదాపు 54 రోజులు పడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై వ్యోమనౌకను ప్రవేశపెట్టిన 4వ దేశంగా భారత్ ఘనత సాధించనుంది. ఈ విషయంలో అమెరికా, రష్యా, చైనా ముందు స్థానాల్లో ఉన్నాయి. -
శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతి
సూళ్లురుపేట : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఆయన వీక్షించనున్నారు. సోమవారం వేకువ జామున 2.51 గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతికి ఇస్రో చైర్మన్ శివన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఘన స్వాగతం పలికారు. శ్రీహరికోటలోని రెండో వాహక అనుసంధాన భవనాన్ని రాష్ట్రపతి పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేతలు ఇస్రో ప్రయోగాల తీరు తెన్నులను రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా శ్రీహరికోట పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, కోవింద్ షార్ కేంద్రాన్ని సందర్శించిన నాలుగో రాష్ట్రపతి కావడం విశేషం. అంతకుముందు రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిని, ఈఓ సింఘాల్‌ను రాష్ట్రపతి అభినందించారు. అనంతరం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, చిత్తూరు కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తాలు వీడ్కోలు పలికారు. -
చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?
చందమామ చుట్టూ ఎన్నో కథలు, కల్పనలు... చందమామ చుట్టూ ఎన్నెన్నో పాటలు, ఆటలు... చంద్రుని మీద కనిపించే మచ్చ కుందేలులా కనిపిస్తుంది. నిజానికి అక్కడ కుందేలేమైనా ఉందా? అక్కడ లేకుంటే భూమ్మీద నుంచి కుందేలును పంపితే– ఆ కుందేలు అక్కడ సంతోషంగా ఉంటుందా? చంద్రుని గురించి మనకు కొంత తెలుసు. చాలా తెలీదు. చంద్రుడి మీద మానవుడు అడుగుమోపి ఐదు దశాబ్దాలు గడిచాయి. అయినా, చంద్రుడి గురించి తెలుసుకోవలసిన సంగతులు కొండంత. నేడు చంద్రయాన్–2 ప్రయోగం సందర్భంగా... అందిన చందమామను మరోసారి అందుకోవడానికి సిద్ధపడుతున్నారు మన శాస్త్రవేత్తలు. చందమామ మీద అందీ అందని రహస్యాలను అందిపుచ్చుకోవడానికి నేడు ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెడుతున్నారు. ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని మైలస్వామి అన్నాదురై నేతృత్వంలో ఇదివరకు విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలోనే ‘చంద్రయాన్–2’ ప్రయోగం జరుగుతోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో ఈ ప్రయోగం మరో మైలురాయిగా నిలిచిపోతుంది. రష్యా అంతరిక్ష సంస్థ (రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ–రాస్‌కాస్మోస్) సహకారంలో ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు మరోసారి చంద్రుడి మీద పరిశోధనలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ‘చంద్రయాన్–2’ మిషన్‌లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియోసెంట్రిక్ లాంచ్ వెహికల్–మార్క్3 (జీఎస్ఎల్వీ–మార్క్3 ) వాహనం ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను నేడు చంద్రుని దిశగా అంతరిక్షంలోనికి పంపనున్నారు. ఇందులో మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు తయారు చేసిన లూనార్ ఆర్బిటర్, రోవర్లతో పాటు రష్యా అంతరిక్ష సంస్థ తయారు చేసిన ల్యాండర్‌ను ప్రయోగించనున్నారు. ఇందులో చక్రాలు కలిగిన రోవర్ యంత్రం సౌరశక్తితో పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంపై సంచరించి, అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి, వాటి రసాయనిక విశ్లేషణ జరిపి, ఆ సమాచారాన్ని ‘చంద్రయాన్–2’ ఆర్బిటర్ ద్వారా భూమిపైనున్న ‘ఇస్రో’ పరిశోధన కేంద్రానికి చేరవేస్తుంది. ‘చంద్రయాన్–2’ ప్రయోగం కోసం దాదాపు పుష్కరకాలం నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రయోగంలో కలసి పాల్గొనాలని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు, రష్యా అంతరిక్ష సంస్థ (రాస్‌కాస్మోస్) 2007 నవంబరు 12న ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందానికి 2008 సెప్టెంబర్ 18న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కేబినెట్ బృందం ఆమోదం తెలిపింది. ‘ఇస్రో’, రాస్కాస్మోస్ల ఒప్పందం ప్రకారం రోవర్, ఆర్బిటర్ల తయారీ బాధ్యతను ‘ఇస్రో’ తీసుకోగా, ‘రాస్‌కాస్మోస్’ ల్యాండర్ తయారీ బాధ్యతలను చేపట్టింది. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్ చంద్రునికి 200 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ‘రాస్‌కాస్మోస్’ తయారు చేసిన ల్యాండర్.. ‘ఇస్రో’ తయారు చేసిన రోవర్‌ను చంద్రుని ఉపరితలంపైకి దిగవిడుస్తుంది. వీటిని అంతరిక్షంలోకి చేరవేసే జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనం ఆకృతిని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2009 ఆగస్టులోనే సిద్ధం చేశారు. దీని బరువు 2650 కిలోలు. ల్యాండర్, రోవర్ల బరువు దాదాపు 1250 కిలోలు. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్‌లో ఐదు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిలో మూడు కొత్తగా రూపొందించినవైతే, మిగిలిన రెండూ చంద్రయాన్–1లో ప్రయోగించిన పాత ఉపగ్రహాలే. అయితే, మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు వీటిని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేశారు. అన్నీ స్వదేశీ పరికరాలే... చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనాన్ని భారతీయ కాలమానం ప్రకారం జూలై 14న వేకువ జామున 2.51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులోని ల్యాండర్ ద్వారా రోవర్ యంత్రం చంద్రుని ఉపరితలం మీదకు సెప్టెంబర్ 6న చేరుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్బిటర్ ద్వారా ఐదు, ల్యాండర్ ద్వారా నాలుగు, రోవర్ ద్వారా రెండు సాంకేతిక పరికరాలను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపుతున్నారు. చంద్రయాన్–2లో భాగంగా, అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, యూరోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్ఏ) కూడా కొన్ని సాంకేతిక పరికరాలను పంపాలని భావించినా, బరువు పరిమితుల కారణంగా విదేశీ పరికరాలనేవీ ఈ ప్రయోగంలో పంపరాదని ‘ఇస్రో’ బృందం నిర్ణయించింది. చంద్రయాన్–1 తరహాలోనే చంద్రుని ఉపరితలంపై విశేషాలను మరింత లోతుగా తెలుసుకునే ఉద్దేశంతో ‘ఇస్రో’ ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా అంతరిక్షంలోకి పంపుతున్న సాంకేతిక పరికరాల ద్వారా చంద్రుని ఉపరితలాన్ని రోవర్ ద్వారా జల్లెడపట్టి, ఉపరితలంపై మట్టిలోని రసాయనాల విశేషాలను, ఒకవేళ చంద్రునిపై నీటి అణువుల జాడ ఏమైనా ఉందేమో తెలుసుకోవాలని భావిస్తోంది. రోవర్‌కు అమర్చిన టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా–2 (టీఎంసీ–2), మినియేచర్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (మినీ–సార్) పరికరాలు చంద్రయాన్–1లో ఉపయోగించిన పరికరాల కంటే మరింత మెరుగైనవి. వీటిలో టీఎంసీ–2 చంద్రుని ఉపరితలానికి చెందిన త్రీడీ మ్యాప్‌లను ఆర్బిటర్‌లోని పరికరాల ద్వారా భూమిపైకి పంపుతుంది. అలాగే, మినీ–సార్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పేరుకుపోయి ఉన్న మంచులోని నీటి కణాలను, అక్కడి మట్టిని, మట్టి మందాన్ని విశ్లేషించి, ఆ సమాచారాన్ని భూమిపైకి పంపుతుంది. చంద్రుని చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణంలోని అత్యంత ఎగువ పొర అయిన ‘అయానోస్ఫియర్’లోని ఎలక్ట్రాన్ల సాంద్రతను ‘డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్’ (డీఎఫ్‌ఆర్‌ఎస్) పరికరం విశ్లేషిస్తుంది. ఐఆర్ స్పెక్ట్రోమీటర్ పరికరం చంద్రునిపై నీటి అణువుల జాడను, ఖనిజాలను గుర్తించి, ఆ సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. ఆర్బిటర్‌కు అమర్చిన హైరిజల్యూషన్ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ల్యాండర్ చంద్రుని ఉపరితలంపైన నిర్దేశిత ప్రదేశానికి సురక్షితంగా చేరుకోగానే త్రీడీ ఫొటోలు తీసి, వాటిని భూమిపైకి పంపిస్తుంది. చంద్రయాన్–2లోని ‘సోలార్ ఎక్స్‌రే మానిటర్’ చంద్రుని వాతావరణానికి ఎగువన ఆవరించి ఉన్న ‘కరోనా’ ప్రాంతంలో సూర్యకిరణాల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ కొలవడానికి ఉపయోగపడుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో సంచరించనున్న రోవర్ తెలుసుకునే సమాచారాన్ని ఆర్బిటర్ ఎప్పటికప్పుడు భూమిపైకి చేరవేస్తూ ఉంటుంది. ఇది చంద్రుని కక్ష్యలో ఏడాది పాటు పరిభ్రమిస్తుంది. చందమామ అందిన రోజు చంద్రుని చుట్టూ ఎన్నో పురాణాలు ఉన్నాయి. అభూత కల్పనలు ఉన్నాయి. అందరాని చందమామను అందుకోవాలనే తపన మానవుల్లో చాలా ఏళ్లుగానే ఉండేది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ ఈ తపన మరింత ఎక్కువైంది. మానవుడికి సంకల్పబలం ఉండాలే గాని, అసాధ్యమైనదేదీ లేదని నిరూపిస్తూ అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 16న భూమిపై నుంచి చంద్రునిపైకి ప్రయాణించాడు. చందమామ మానవుడి చేతికందిన అద్భుతమైన రోజు అది. అపోలో–11 వ్యోమనౌకలో బయలుదేరిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై అడుగు మోపిన తొట్టతొలి మానవుడిగా చరిత్ర సృష్టించాడు. చంద్రుడి ధూళిని సేకరించి భూమిపైకి విజయవంతంగా తిరిగివచ్చాడు. అయితే, అంతకు పదేళ్ల ముందే, 1959లో రష్యా చంద్రునిపైకి లూనా–2 వ్యోమనౌకను విజయవంతంగా పంపింది. చంద్రుడిపైకి మానవులు పంపిన వస్తువు ఒకటి చేరుకోవడం చరిత్రలో అదే మొదటిసారి. చంద్రునిపైకి వ్యోమనౌకలను పంపడానికి రష్యా అంతకు ముందు మూడుసార్లు చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. రష్యన్ శాస్త్రవేత్తలు 1958 సెప్టెంబర్ 23, అక్టోబర్ 12, డిసెంబర్ 4లలో పంపిన వ్యోమనౌకలేవీ చంద్రునిపైకి చేరుకోలేకపోయాయి. వరుస వైఫల్యాల తర్వాత ‘లూనా’ ప్రయోగాలకు రష్యా నడుం బిగించింది. ఇందులో భాగంగా 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ చంద్రునికి 5,965 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని తప్పింది. తిరిగి లోపాలను దిద్దుకుని అదే ఏడాది సెప్టెంబర్ 13న పంపిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రునిపైకి చేరుకోగలిగింది. అయితే, చంద్రునిపైకి మనిషిని తొలిసారిగా పంపిన ఘనత మాత్రం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) దక్కించుకోగలిగింది. ‘నాసా’ ఆధ్వర్యంలో జరిపిన ప్రయోగంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 20న చంద్రునిపై తొలి అడుగు మోపి, అక్కడి నుంచి ‘చంద్రుని మీద మనిషి మోపిన తొలి అడుగు మానవాళికే ముందడుగు’ అంటూ సందేశం పంపాడు. చంద్రునిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మోపిన తొలి అడుగు ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే చాలా దేశాలు చంద్రుడిని చేరుకోవడానికి, చంద్రుడి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాటి నుంచి నేటి వరకు వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు చంద్రుడి వద్దకు ఉపగ్రహాలు, వ్యోమనౌకలు పంపుతూ కీలకమైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చందమామ ఏనాటికైనా మానవులకు ఆవాసం కాకపోతుందా అనే ఆశతో చేస్తున్న ప్రయోగాల్లో ఇప్పటికే అనేక విజయాలు సాధించాయి. చంద్రునిపై పంటలు పండించడం ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసుకోవడానికి చైనా ఇటీవల ఒక ప్రయత్నం చేసింది. చంద్రునిపై పత్తి విత్తనాలను మొలకెత్తించింది. చంద్రుని ఉపరితలంపై రాత్రివేళ అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మొలకెత్తిన విత్తనం జీవాన్ని పుంజుకోకుండానే అంతరించిపోయింది. ‘చంద్రయాన్–1’ సాధించిందేమిటంటే..? చంద్రునిపై పరిశోధనల కోసం ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇదివరకు చేపట్టిన చంద్రయాన్–1 గణనీయమైన ఫలితాలనే సాధించింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2008 అక్టోబర్ 22న ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని చేపట్టారు. అందులో భాగంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ–సీ 11) ద్వారా పంపిన ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3,400 సార్లు పరిభ్రమించి, కీలకమైన సమాచారాన్ని చేరవేసింది. దీని నుంచి 2009 ఆగస్టు 29న కమ్యూనికేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ (ఓహెచ్), నీరు (హెచ్2ఓ) అణువుల ఉనికిని తొలిసారిగా గుర్తించగలగడం ‘చంద్రయాన్–1’ సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు. ‘చంద్రయాన్–1’ చంద్రుని ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, క్యాల్షియం వంటి మూలకాల ఉనికిని కూడా గుర్తించింది. ‘చంద్రయాన్–1’లో భాగంగా చంద్రునిపైకి చేరుకున్న టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా (టీఎంసీ) ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత స్పష్టతతో కూడిన త్రీడీ చిత్రాలను భూమిపైకి చేరవేయగలిగింది. దీని ద్వారా చంద్రుని ఉపరితలంపై లావా ట్యూబుల ఉనికిని గుర్తించడం సాధ్యమైంది. ఇలాంటి లావా ట్యూబులు భవిష్యత్తులో చంద్రుడు మానవుల ఆవాసంగా ఉపయోపడే అవకాశాలపై గల ఆశలకు ఊపిరిపోస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. చంద్రునిపై ఆసక్తి ఏనాటిదంటే? గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో చంద్రునిపై మనుషుల్లో ఆసక్తి ఆధునిక పరిశోధనలు మొదలు కావడానికి వేల సంవత్సరాల ముందు నుంచే ఉండేది. నాగరికతలు మొదలు కాక ముందు నుంచే భూమ్మీద నివసించే మనుషులు సూర్యచంద్రులను గమనిస్తూనే ఉన్నారు. నాగరికతలు మొదలైన తొలినాళ్లలో సూర్యచంద్రులను దేవతలుగా ఆరాధించడం మొదలైంది. శాస్త్రీయంగా సూర్యచంద్రుల స్వరూప స్వభావాలను తెలుసుకోవాలనే ఆసక్తి క్రీస్తుపూర్వమే మొదలైంది. సూర్యచంద్రులు రెండూ అంతరిక్షంలోని భారీ రాతిగోళాలని క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్ తొలిసారిగా ప్రకటించాడు. శాస్త్రీయమైన దృష్టితో తన పరిశీలనకు తోచిన సంగతి చెప్పిన పాపానికి నాటి గ్రీకు పాలకులు మత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడనే ఆరోపణతో ఆయనను ఖైదులో పెట్టారు. నిండు పున్నమినాడు భూమ్మీద మనుషులకు చంద్రుడు పూర్ణ కాంతులతో దర్శనమిస్తాడు. ఎంత పూర్ణకాంతులతో ధగధగలాడుతున్నా చంద్రుడిపై అక్కడక్కడా మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలను సైతం నాటి మనుషులు నిశితంగా పరిశీలించారు. చంద్రుడిపై కుందేలు ఆకారంలోని నీడను చూసి అనేక అభూత కల్పనలను ఊహించుకున్నారు. చంద్రుడిపై భారీస్థాయి ఎత్తు పల్లాలు ఉన్నందు వల్లనే చంద్రుడి ఉపరితలంలోని కొన్ని ప్రదేశాలకు సూర్యకాంతి చేరుకోలేకపోతోందని, అందుకే మనకు అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తున్నాయని మొట్టమొదటిసారిగా క్రీస్తుశకం రెండో శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త ప్లూటార్క్ తన ‘ఆన్ ది ఫేస్ ఇన్ ది మూన్స్ ఆర్బ్’ గ్రంథం ద్వారా తెలిపాడు. చంద్రుడిపై పడి పరావర్తనం చెందిన సూర్యకాంతి కారణంగానే చంద్రుడు మనకు వెన్నెల వెలుగులతో కనిపిస్తున్నాడని క్రీస్తుశకం ఐదో శతాబ్దికి చెందిన మన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట తొలిసారిగా ప్రకటించాడు. కొంతకాలానికి మనుషులు ఖగోళ విశేషాలను మరింత నిశితంగా తెలుసుకోవడానికి దుర్భిణుల వంటి సాధనాలను రూపొందించుకున్నారు. గ్రహాలు, నక్షత్రాల తీరుతెన్నులను తెలుసుకునే ఉద్దేశంతో వేధశాలలను ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో బాగ్దాద్‌లో ఏర్పాటు చేసిన వేధశాల నుంచి పర్షియన్ ఖగోళ శాస్త్రవేత్త హబాష్ అల్ హసీబ్ అల్ మర్వాజీ చంద్రుని వ్యాసం 3,037 కిలోమీటర్లు ఉంటుందని, భూమికి చంద్రునికి మధ్యనున్న దూరం 3,46,345 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశాడు. ఆయన అంచనాలు అధునాతన పరిశోధనల్లో నిగ్గుతేలిన అంచనాలకు దాదాపు దగ్గరగా ఉండటం విశేషం. పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో శక్తిమంతమైన టెలిస్కోప్‌ను రూపొందించి, దాని ద్వారా చంద్రుడు, నక్షత్రాలు, గ్రహచలనాలను ఏళ్ల తరబడి పరిశీలించి, అనేక విషయాలను వెల్లడించాడు. అంతరిక్షంలో భారతీయుడు సోవియట్ రష్యా 1984 ఏప్రిల్ 2న ప్రయోగించిన సోయజ్ టీ–11 రాకెట్ ద్వారా భారత పైలట్ రాకేశ్ శర్మ చంద్రమండలానికి చేరువగా అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లాడు. అంతరిక్షంలో అడుగు మోపిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన రాకేశ్ శర్మ అంతరిక్షంలో దాదాపు ఎనిమిది రోజులు గడిపాడు. తిరిగి భూమిపైకి చేరుకున్న తర్వాత రష్యన్ బృందంతో కలసి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు, ఇందిరాగాంధీ ఆయనను ‘అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎలా కనిపించింది?’ అని అడిగారు. ఆమె ప్రశ్నకు రాకేశ్ శర్మ ‘సారే జహా సే అచ్ఛా’ (ప్రపంచంలోనే అత్యుత్తమంగా) కనిపించిందని బదులిచ్చాడు. ప్రచ్ఛన్న యుద్ధంతో అందిన చందమామ అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒకరకంగా చంద్రునిపై ఆధునిక పరిశోధనల పురోగతికి దోహదపడింది. ఇరవయ్యో శతాబ్దిలో నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రెండు దేశాలూ అంతరిక్షంపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. చంద్రునిపై ప్రత్యేకించి దృష్టి సారించాయి. ఎలాగైనా చంద్రునిపైకి చేరుకోవాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలను రంగంలోకి దించి, భారీ స్థాయి పరిశోధనలకు నడుం బిగించాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న హోరాహోరీ పోటీలో కొన్ని విఫలయత్నాల తర్వాత 1959లో లూనా–2 ప్రయోగం ద్వారా రష్యా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత లూనా–3 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేసింది. చంద్రుని ఉపరితలం ఫొటోలను తీసి ప్రపంచానికి చూపింది. రష్యాను మించిన స్థాయిలో ఏకంగా మనిషినే చంద్రునిపైకి పంపాలని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ తలచాడు. జాతీయ సత్వర అవసరాల సభలో ఆయన ఈ అంశాన్ని ముందుకు తెచ్చాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు భారీగా నిధులు మంజూరు చేశాడు. ఫలితంగా రష్యా చేపట్టిన లూనా–2 ప్రయోగానికి పదేళ్ల తర్వాత 1969లో అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుమోపగలిగాడు. వేగం పుంచుకున్న ‘ఇస్రో’ చంద్రునిపై పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్లతో పోల్చుకుంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఇస్రో ఆధ్వర్యంలో చంద్రునిపై చేపట్టిన తొలి ప్రయోగం 2008 నాటి ‘చంద్రయాన్–1’. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘చంద్రయాన్–2’ కోసం అప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. చంద్రునిపై ‘ఇస్రో’ ప్రయోగాలు ‘చంద్రయాన్–1’ నుంచి వేగం పుంజుకున్నాయి. ‘చంద్రయాన్–2’ పూర్తయిన తర్వాత 2024లో ‘చంద్రయాన్–3’ ప్రయోగం చేపట్టడానికి ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించారు. -
చంద్రయాన్–2లో మన శాస్త్రవేత్త
సాక్షి, హైదరాబాద్: భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రయోగం చంద్రయాన్-2. భారతదేశంలో పాటు యావత్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ ప్రయోగంలో ఎంతో మంది శాస్ర్తవేత్తలు పాలుపంచుకుంటున్నారు. అయితే వీరిలో తెలంగాణకు చెందిన అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త, సిద్దిపేట జిల్లా వాసి వీరబత్తిని సురేందర్‌కు కూడా ఉన్నారు. దేశ శాస్త్ర సాంకేతిక అంతరిక్ష వైజ్ఞానిక రంగానికి తలమానికంగా నిలిచే చంద్రయాన్-2లో పాలుపంచుకుంటున్న సురేందర్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. తాజాగా మాజీమంత్రి., సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన్ను అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘దేశానికి గర్వకారణంగా నిలిచే ఈ ప్రయోగంలో మీరు భాగస్వాములు కావడం మా అందరికీ గర్వకారణం. భారతదేశ అంతరిక్ష ప్రయోగ రంగానికి యావత్ వైజ్ఞాన ప్రపంచానికి మీరు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ.. తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చంద్రుని మీద నీటిజాడలను చంద్రయాన్-1 ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో.. నేడు మరింత సమాచారం కోసమే చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యేకంగా ప్రగ్యాన్ అనే రోవర్‌ను 14 రోజుల పాటు చంద్రుని మీద 500 మీటర్ల వరకు సంచరించలా చేస్తారు. అది మనకు చంద్రుని గురించిన కీలక సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపైకి రోవర్‌ను పంపి సమాచారాన్ని సేకరించిన నాలుగో దేశంగా భారత్‌కు గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు రోవర్లను పంపాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్న విషయం తెలిసిందే. -
చంద్రయాన్-2 ప్రయోగం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు
-
15వ తేదీ వేకువ జామున చంద్రయాన్–2 ప్రయోగం
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 15వ తేదీ వేకువ జామున నిర్వహించనున్న జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం రాకెట్‌లోని ఇంధనం నింపే ట్యాంకులకు ప్రీ ఫిల్ ప్రెజరైజేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ నెల 7వ తేదీన రాకెట్ ప్రయోగవేదిక మీదకు వచ్చిన తరువాత దశల వారీగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. శనివారం ఉదయాన్నే షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో జరుగనున్న ఎంఆర్ఆర్ సమావేశంలో ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించాక లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో మారు లాంచ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగానికి సుమారుగా 20 గంటల ముందు అంటే 14వ తేదీ ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 15వ తేదీ వేకువజామున 2.51 గంటలకు 3,800 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్‌ను మోసుకుని నింగికి దూసుకెళ్లేందుకు జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ సిద్ధంగా ఉంది. -
చకచకా ‘చంద్రయాన్–2’ ఏర్పాట్లు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్–2 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఇప్పటికే షార్‌లో రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో మూడు దశల జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ పనులను పూర్తిచేశారు. శనివారం పేజ్–3 లెవెల్–1 తనిఖీలను నిర్వహించారు. అదేవిధంగా శాటిలైట్ బిల్డింగ్‌లో ఆర్బిటర్ మిషన్ మీద ల్యాండర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. చంద్రయాన్–2 మిషన్‌ను రాకెట్ శిఖర భాగంలో అమర్చేందుకు హీట్‌షీల్డ్ క్లోజ్ చేసి, ఆ భాగాన్ని శాటిలైట్ బిల్డింగ్ నుంచి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌కు ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయాన తరలించి రాకెట్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో రాకెట్ అనుసంధానం పనులన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత రాకెట్లో అన్ని తనిఖీలు నిర్వహించి ఊంబ్లికల్ టవర్ మీదకు తరలించే ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రయోగానికి గడువు మరో 15 రోజులే ఉండడంతో సెలవు దినాలను కూడా చూడకుండా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం నుంచి నూతన డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ పర్యవేక్షణలో అనుసంధానం పనులు జరుగుతాయి. జూలై 15న చంద్రయాన్–2 భూకక్ష్య నుంచి బయలుదేరి 3.50 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి సెప్టెంబర్ 6న చంద్రుడిపైకి చేరుతుంది. అదేరోజున ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి చేరుకుని ల్యాండర్‌ను చంద్రుడిపై దించుతుంది. చంద్రుడిపై ల్యాండర్ దిగాక అందులో అమర్చిన రోవర్ బయటకొచ్చి పరిశోధనలు చేస్తుంది. ఈ లోపు ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారానే చంద్రయాన్–2.. 640 టన్నులు బరువు కలిగిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ 3.8 టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని అంతరిక్షం వైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్–2 ఉపగ్రహంలో 2.3 టన్నుల బరువు కలిగిన ఆర్బిటర్, 1.4 టన్నులు బరువు కలిగిన ల్యాండర్ (విక్రమ్), 27 కిలోలు బరువు కలిగిన రోవర్ (ప్రజ్ఞాన్) అనే ఇండియన్ పేలోడ్స్‌తోపాటు అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన అనేక పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. వీటితోపాటు ఆర్బిటర్‌లో 8 పేలోడ్స్, ల్యాండర్, రోవర్లో మూడేసి పేలోడ్స్‌ను పంపుతున్నారు. ఆర్బిటర్‌లో పంపే పేలోడ్స్ ఇవి.. - టెరియన్ మ్యాపింగ్ కెమెరా–2 (టీఎంసీ–2) - చంద్రయాన్–2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (సీఎల్ఏఎస్ఎస్) - సోలార్ ఎక్స్‌రే మానిటర్ (ఎక్స్ఎస్ఎం) - ఆర్బిటర్ హైరిజుల్యూషన్ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) - ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) - డ్యూయెల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ రాడార్ (ఎస్ఏఆర్) - చంద్రయాన్–2 అట్మాస్ఫియరిక్ కాంపోజిషనల్ ఎక్స్‌ప్లోరల్ 2 (సీహెచ్ఏసీఈ) - డ్యూయెల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్ (డీఎఫ్‌ఆర్‌ఎస్) ఎక్స్పరిమెంట్ ల్యాండర్ (విక్రమ్)లో పేలోడ్స్ ఇవి.. - రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ ఐనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ (ఆర్ఎఎంబీఏ) - చంద్రయాన్–2 సర్ఫేస్ థెర్మో–ఫిజికల్ ఎక్స్పరిమెంట్ (సీహెచ్ఏఎస్టీఈ) - ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీయాస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ) - రోవర్ (ప్రజ్ఞాన్)లో పేలోడ్స్ ఇవి.. - అల్ఫా ఫర్టికల్స్ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్ (ఏఎప్ఎక్స్ఎస్) - లేజర్ ఇన్డ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎన్ఐబీఎస్) - లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే (ఎల్ఆర్ఏ) -
జాబిల్లిపై చంద్రయాన్–2 ఇలా..
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జూలై 15వ తేదీన చంద్రయాన్– 2 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఇప్పటికే షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రెండు దశల రాకెట్ అనుసం«ధానం పనులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్– 2 చంద్రుడి మీద ఏ విధంగా దిగుతుందనే దానిపై ఇస్రో నాలుగు ఛాయా చిత్రాలను గురువారం విడుదల చేసింది. చంద్రుడిపై ఆర్బిటర్ ద్వారా మోసుకెళ్లిన ల్యాండర్, రోవర్లు చంద్రునికి 30 కిలో మీటర్ల ఎత్తులో నుంచి దిగుతున్న నాలుగు దశల ఊహా చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. -
జూలై 15న చంద్రయాన్2
బొమ్మనహళ్లి(బెంగళూరు)/సూళ్లూరుపేట: చంద్రుడిపైకి రెండో మిషన్‌లో భాగంగా చంద్రయాన్–2ని జూలై 15న ప్రయోగిస్తామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. సెప్టెంబర్ 6 లేదా 7వ తేదీల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ దిగుతుందని బుధవారం ఆయన వెల్లడించారు. భారత అంతరిక్ష ప్రయోగాలలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ సాయంతో ఈ మిషన్‌ను ప్రారంభిస్తామని, ఈ ప్రయోగం ద్వారా మీటరు పొడవైన 25 కేజీల బరువున్న రోవర్, ఆర్బిటర్, లాండర్లను చంద్రుడిపైకి పంపనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–2 మొత్తం బరువు 3.8 టన్నులని, ఇస్రో ప్రయోగిస్తున్న లాండర్, రోవర్ దిగే దక్షిణ ధ్రువ ప్రదేశానికి ఇంతవరకు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు చేరలేదని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకోసం ఇస్రో వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్‌ను వాడుతున్నారు. ఆర్బిటర్ ప్రొపెలైజేషన్ విధానంలో ఈ మూడు పరికరాలు చంద్రుడి కక్ష్యలోకి చేరతాయి. అక్కడ ఆర్బిటర్ నుంచి లాండర్ విడిపోయి చంద్రుడివైపు దూసుకెళుతుంది. ఆర్బిటర్ నుంచి లాండర్ విడిపోవడం ఈ ప్రాజెక్టులో కీలక ఘట్టంగా భావిస్తున్నారు. విడిపోయిన అనంతరం ఆర్బిటర్ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతుంది. మరోపక్క లాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో దిగుతుంది. లాండర్ క్షేమంగా లక్ష్యాన్ని చేరుకున్నాక దానిలోంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది. ఈ రోవర్ ప్రయోగాలు చేయడానికి అవసరమైన పరికరాలను కూడా లాండర్ పైభాగంలో అమర్చారు. రోవర్ సాయంతో చంద్రుడి ఉపరితలం, ఖనిజాలు వంటి వాటిని అన్వేషిస్తారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూ.1,000 కోట్లుకాగా, చంద్రయాన్ –2 కోసం రూ. 603 కోట్లు ఖర్చుకానుంది. ఇందులో జీఎస్ఎల్వీ ఎంకే–3 కోసం రూ.375 కోట్లు వెచ్చించనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ నుంచి ఇది ఇస్రోకు సంకేతాలను పంపుతుందని శివన్ వెల్లడించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతున్న శివన్ -
జూలై 15న చంద్రయాన్ -2 ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్ మిషన్.. చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. 2019 జూలై 15న ప్రయోగం చేపడతామని ఇస్రో చైర్మన్ డా. కె.శివన్ ప్రకటించారు. ఈ ప్రయోగానికి రూ. 1000 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. జూలై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. దీని ద్వారా చంద్రగ్రహంపైకి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ల్యాండర్‌కు విక్రమ్ అని, రోవర్‌కు ప్రగ్యాన్ అని నామకరణం చేశారు. చంద్రయాన్-2 వ్యవస్థ మొత్తం బరువు 3,447 కేజీలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే ఏకంగా 1,179 కేజీలు ఉంటుందని చెప్పారు. ఓసారి ఉపగ్రహాన్ని ప్రయోగించాక, ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. 2019 సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతం కోసం దశాబ్దాలుగా భారత శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. ఈ ప్రయోగం తర్వాత లభించే సమాచారం ఆధారంగా ఇస్రో తదుపరి తన వ్యూహాలను అమలు చేయనుంది. -
చంద్రుని దక్షిణ ధ్రువంపైకి రోవర్
సాక్షి ప్రతినిధి, చెన్నై/శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్–2 ప్రాజెక్టును ఈ ఏడాది జూలై 9వ తేదీ నుంచి 16వ తేదీల మధ్యలో ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ఇస్రో ల్యాండర్, రోవర్లను పంపనుంది. ‘ఇప్పటి వరకు ఎవరూ కూడా చీకటిగా ఉండే ఈ ప్రాంతంలోకి రోవర్‌ను దించలేదు. చంద్రుని ఈక్వేటర్‌కు సమీపంలోకి ఇది వెళ్తుంది’ అని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ప్రయోగించే ఉపగ్రహంలో ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ఉంటాయి. ఇవి సెప్టెంబర్ నాటికి అక్కడికి చేరుకుంటాయని ఆయన వివరించారు. వీటి ద్వారా తాము సేకరించే సమాచారంపై ప్రపంచ నలుమూలలా ఉన్న శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రయోగాలన్నిటినీ పూర్తి చేసి 2022లోగా చంద్రునిపైకి మానవుడిని పంపుతామని ఇస్రో చైర్మన్ తెలిపారు. దీంతోపాటు వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య–ఎల్1 సూర్యుని కక్ష్యలోకి ప్రయోగిస్తామని తెలిపారు. ఈ ప్రయోగం వల్ల సూర్యుని గురించి ఇంతవరకు తెలియని అనేక విషయాలను తెలుసుకుంటామని చెప్పారు. ఇతర గ్రహాలపైనా పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో సమాయత్తం అవుతోందని తెలిపారు. -
చంద్రయాన్ 2 ద్వారా లేజర్ పరికరాలు
వాషింగ్టన్: భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్ 2’మిషన్ ద్వారా లేజర్ పరికరాలు పంపాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్ణయించింది. వచ్చే నెలలో ఈ మిషన్‌ను లాంచ్ చేయనున్నారు. చంద్రయాన్2 ద్వారా భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితత్వంతో కొలిచే లేజర్ పరికరాలను పంపనున్నట్లు నాసా తెలిపింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఇటీవల జరిగిన లూనార్ అండ్ ప్లానిటరీ సైన్స్ కాన్ఫెరెన్స్‌లో ఈ మేరకు వెల్లడించారు. ఏప్రిల్ 11న నాసాకు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్లను చంద్రయాన్ 2 ద్వారా పంపనున్నట్లు తెలిపింది. ఇలాంటి ఐదు పరికరాలు ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉన్నా.. వాటిలో కొన్ని లోపాలు తలెత్తాయని ఇటలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ లేబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త సైమన్ డెల్ యాగ్నెల్లో వెల్లడించారు. చంద్రుడిపై మెరుగైన పరిశోధనలకు ఈ రిఫ్లెక్టర్లు తోడ్పడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
గగన్‌యాన్’తో చైనా సరసన
న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల్లో చైనాతో పోటీ పడుతున్నప్పటికీ గగన్‌యాన్ విజయవంతమైతే అంతరిక్ష పరిశోధనల్లో పొరుగుదేశంతో భారత్ సమాన స్థాయి పొందుతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ కె.శివన్ శుక్రవారం వెల్లడించారు. చైనా ప్రయోగించిన చాంగ్–4 చంద్రుడి ఆవలివైపు ఈ నెలలో దిగి పరిశోధనలు ప్రారంభించిందని, భారత్‌కూడా చంద్రయాన్–2 ద్వారా చంద్రుడి ఆవలివైపు పరిశోధనలకు పూనుకుందని ఆయన తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రస్తుతానికి భారత్ చైనాతో పోటీ పడుతున్నప్పటికీ, 2022 తరువాత భారత్ కూడా చైనాకు దీటుగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో ఈ రెండు దేశాలు కీలకమైనవి, భారత్ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా తన పొరుగుదేశాలకు సాంకేతికతను కానుకగా ఇచ్చిందని, అదే సమయంలో చైనా కూడా పాకిస్తాన్, శ్రీలంకలకు తన సాంకేతికతను అందజేస్తోందని ఆయన వివరించారు. 2017లో భారత్ ప్రయోగించిన ఉపగ్రహ సేవల ద్వారా నేపాల్‌లో చాలాచోట్ల ప్రజలు తొలిసారి టీవీ కార్యక్రమాలు వీక్షించగలిగారని ఆయన అన్నారు. భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్, జీపీఎస్ వ్యవస్థపై అడిగిన ప్రశ్నకు ‘సైనిక దళాలు ఇప్పటికే సొంత నావిగేషన్, జీపీఎస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయని’శివన్ సమాధానమిచ్చారు. ‘గగన్‌యాన్’లో పైలెట్లకే అవకాశం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రాజెక్టులో భాగమైన గగన్‌యాన్‌లో వ్యోమగాములుగా పైలెట్లు ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని ఇస్రో వెల్లడించింది. మానవ సహిత అంతరిక్ష యాత్రకోసం వ్యోమగాముల ఎంపికలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఈ పరిశోధనలో రక్షణ పరిశోధన శాఖ పాత్ర కీలకమని మరో శాస్త్రవేత్త అన్నారు. మానవరహిత గగన్‌యాన్ మిషన్‌ను 2020 డిసెంబర్ నాటికి, మానవ సహితంగా 2021 డిసెంబర్‌కి పూర్తి చేయడమే తమ లక్ష్యమని శివన్ తెలిపారు. -
2021 డిసెంబర్లో ‘గగన్‌యాన్’!
సాక్షి, బెంగళూరు: దేశ అంతరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలవనున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’ ప్రాజెక్టును డిసెంబర్ 2021లోగా చేపట్టే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ వెల్లడించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా పంపే ముగ్గురు వ్యోమగాముల్లో భారతీయులే ఉండే అవకాశం ఉందని, వీరిలో ఒక మహిళా వ్యోమగామిని కూడా పంపనున్నట్లు తెలిపారు. వీరిలోనే భారత వాయుసేనకు చెందిన వ్యక్తి కూడా ఉండనున్నట్లు చెప్పారు. శుక్రవారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో మీడియాతో శివన్ మాట్లాడారు. 2021లో చేపట్టే మానవసహిత అంతరిక్ష ప్రయోగాని కంటే ముందే డిసెంబర్ 2020–జూలై 2021 మధ్య మానవ రహిత మిషన్లను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. మానవసహిత అంతరిక్ష ప్రయోగం కోసం ఇస్రోకు రూ.9,023 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం లభించినట్లు చెప్పారు. గగన్‌యాన్‌కు సంబంధించి వ్యోమగాములకు భారత్‌లోనే శిక్షణ ఇస్తామని చెప్పారు. ముఖ్య శిక్షణ రష్యా లేదా ఇతర దేశాల్లో ఇప్పించాలని యోచిస్తున్నారు. ఏప్రిల్‌లో చంద్రయాన్–2 ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగాన్ని ఏప్రిల్ నెలలో చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నట్లు శివన్ శుక్రవారం తెలిపారు. ముందుగా చంద్రుడిపైకి చంద్రయాన్–2ను ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 16 తేదీల మధ్యలో పంపుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలు పరీక్షలు పూర్తికాకపోవడం వల్ల ప్రయోగ తేదీని వాయిదా వేసినట్లు తెలిపారు. 10 ఏళ్ల కిందట చేపట్టిన చంద్రయాన్–1కు ఆధునిక రూపమైన చంద్రయాన్–2ను రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టారు. చంద్రయాన్–2 రోవర్ ద్వారా చంద్రుడిపై వాతావరణాన్ని పరీక్షిస్తామని శివన్ తెలిపారు. చంద్రయాన్–2 నౌక చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగేలా తొలిసారి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరో 3 నెలల్లో ఇస్రో టీవీని తీసుకొస్తామని తెలిపారు. ఇస్రో టీవీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం తదితర అంశాలను ప్రసారం చేస్తామని చెప్పారు. 2020 జనవరిలో అంతర గ్రహ గగనయానానికి సంబంధించిన ఆదిత్య ఎల్–1 ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జీశ్యాట్–20 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తామని చెప్పారు. -
మిషన్ హీలియం–3
సూళ్లూరుపేట: అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో బృహత్తర మిషన్‌కు సిద్ధమైంది. చంద్రుడిపై అన్వేషణకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే ఇప్పటి వరకు చేసిన పరిశోధనలన్నీ చంద్రుడి మధ్యరేఖపై మాత్రమే జరిగాయి. చంద్రగోళంలోని దక్షిణ భాగంలోకి ఇంత వరకూ ఏ దేశం వెళ్లిన దాఖలా లేదు. జాబిల్లి దక్షిణ భాగంలో లక్షలాది కోట్ల విలువైన హీలియం–3 అనే ఇంధన వనరుపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో చేపట్టబోయే చంద్రయాన్–2 ప్రయోగాన్ని వినియోగించుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఇస్రో చంద్రుడి దక్షిణ భాగంలో ఒక రోవర్‌ను దించనుంది. ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపై నమూనాలను సేకరించి హీలియం–3, నీటి జాడను అన్వేషిస్తుంది. భూమిపై పరిమితంగా లభ్యమయ్యే హీలియం–3 ఐసోటోప్ చంద్రుడిపై పుష్కలంగా ఉందని ఇటీవల పలు పరిశోధనల్లో వెల్లడైంది. చంద్రయాన్–1 ద్వారా చంద్రుడిపై నీటి పరమాణువులున్న విషయాన్ని కనుగొన్న ఇస్రో..ఇప్పుడు చంద్రయాన్–2తో మరో అద్భుత విజయాన్ని అందుకోవాలనే ఆలోచనలో ఉంది. మూడు ప్రయోగాలతో సమానం.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్–2 ప్రయోగం చేపట్టాలని ఇస్రో ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించుకుంది. జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్10) ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మూడు పరికరాలను ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందించడం విశేషం. ఆర్బిటర్‌ను చంద్రుడి మధ్య కక్ష్యలో, ల్యాండర్, రోవర్‌ను దక్షిణ ధ్రువానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో దించుతారు. ఆరు చక్రాలతో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే రోవర్ హీలియం–3పై ప్రయోగాలు చేసి, ఆ సమాచారాన్ని అక్కడికక్కడే విశ్లేషిస్తుంది. కనీసం 14 రోజుల పాటు 400 మీటర్లు వ్యాసార్థం పరిధిలో పరిభ్రమిస్తూ సమాచారాన్ని సేకరిస్తుంది. రోవర్ నుంచి సమాచారం ఆర్బిటర్ ద్వారా మాస్టర్ కంట్రోల్ సెంటర్(భూకేంద్రం)కు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్క మిషన్ మూడు ప్రయోగాలకు సమానమని ఇస్రో పరిశోధకులు చెబుతున్నారు. -
ముగ్గురితో ‘గగన్‌యాన్’
న్యూఢిల్లీ: భారత్ చేపట్టబోయే తొలి మానవసహిత అంతరిక్ష యాత్రలో ముగ్గురు వ్యోమగాములను నింగిలోకి పంపిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. వారు 5–7 రోజుల పాటు అంతరిక్షయానం చేసిన తరువాత భూమి మీద తిరిగి అడుగుపెడతారని తెలిపారు. భారతీయుడిని అంతరిక్షంలోకి మోసుకెళ్లే ‘గగన్‌యాన్’ మిషన్‌ను 2022 నాటికి చేపడతామని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. గగన్‌యాన్ సన్నద్ధత, ప్రయోగానికి సంబంధించిన ఇతర వివరాలను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌తో కలసి ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారం మీడియాకు వివరించారు. 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి సుమారు 6 నెలల ముందే ఈ మిషన్ చేపడతామని తెలిపారు. లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించిన 16 నిమిషాల్లోనే రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుతుందని వెల్లడించారు. అంతరిక్ష యాత్ర ముగించుకుని భూమికి తిరుగుపయనమైన వ్యోమగాములు గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో లేదా బంగాళాఖాతంలో లేదా నేరుగా నేల మీదనైనా దిగుతారని చెప్పారు. వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్ భూ ఉపరితలానికి 120 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు 36 నిమిషాల్లోనే నేలకు చేరుకుంటుం దన్నారు. ఇది సఫలమైతే మానవ సహిత వాహకనౌకలను అంతరిక్షంలోకి పంపిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నాలుగో దేశంగా నిలుస్తుంది. మోసుకెళ్లేది జీఎస్ఎల్వీ మార్క్–3 గగన్‌యాన్‌కు జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌకను సిద్ధం చేస్తున్నట్లు శివన్ తెలిపారు. భూమి నుంచి సుమారు 300–400 కి.మీ. ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ఈ వాహకనౌకను చేరుస్తామని చెప్పారు. ఈ ప్రయోగానికి మొత్తం వ్యయం రూ.10 వేల కోట్ల కన్నా తక్కువే అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ మిషన్‌లో సుమారు 7 టన్నుల బరువైన క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్‌లు ఉంటాయని, అందులో క్రూ మాడ్యూల్ పరిమాణం 3.7్ఠ7 మీటర్లు అని చెప్పారు. వ్యోమగాములు అంతరిక్షంలో ‘మైక్రో గ్రావిటీ’పై ప్రయో గాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వారిని ఇస్రో, వైమానిక దళం సంయుక్తంగా ఎంపికచేసి, రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ నుంచి ఇస్రో సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఆయన 1984లో రష్యా ప్రయోగించిన సోయుజ్ టి–11 వాహకనౌకలో అంతరిక్షంలోకి ప్రయాణించారు. జనవరిలో చంద్రయాన్–2 చంద్రయాన్–2 ప్రయోగాన్ని వచ్చే జనవరిలో చేపడతామని శివన్ చెప్పారు. ఈ ప్రాజెక్టును సమీక్షించిన నిపుణులు.. రోవర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం, తిరిగి భూమి మీదికి తీసుకురావడంపై కొన్ని సూచనలు చేశారన్నారు. ఇస్రో చేసిన ప్రయోగాల్లో చంద్రయాన్–2 అత్యంత క్లిష్టమైందని, దీన్ని విజయవంతం చేయడానికే నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇలా చేసిన మార్పుల వల్ల మిషన్ బరువు పెరిగిందని తెలిపారు. -
జనవరి 3న చంద్రయాన్– 2
సాక్షి బెంగళూరు: వచ్చే ఏడాది జనవరి 3న చంద్రయాన్–2 మిషన్ చేపడతామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగానికి రూ. 800 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలను ఆదివారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్లు కస్తూరి రంగన్, కిరణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. అనంతరం శివన్ మీడియాతో మాట్లాడుతూ 3,890 కేజీల బరువైన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ ద్వారా చంద్రుని మీదికి పంపిస్తామని తెలిపారు. ఈ మిషన్‌కు విక్రమ్ సారాభాయ్ మిషన్ అని నామకరణం చేస్తామని వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో 50 ఉపగ్రహాలు ప్రయోగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఒక్క 2019లోనే 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఎక్కువ ప్రయోగాలు జరిపిన ఏడాది ఇదే కాబోతోందని అన్నారు. ఈ ఏడాది కూడా తమకు తీరికలేని షెడ్యూల్ ఉందని, ఇకపై నెలకు కనీసం రెండు ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో బ్రిటన్‌కు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాల్ని నింగిలోకి పంపనున్నట్లు చెప్పారు. ఇస్రో చిన్నస్థాయి వాహకనౌకలను కూడా తయారుచేస్తోందని తెలిపారు. అవసరమైనప్పుడు ఇలాంటి వాటిని కేవలం ముగ్గురు నుంచి ఆరుగురు మనుషుల సాయంతో, మూడు రోజుల్లోనే రూపొందించొచ్చని వెల్లడించారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఇస్రో టీవీ చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు శివన్ చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యులకు చేరవేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో తమ చానల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. -
2018లో చంద్రయాన్-2
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్ మిషన్.. చంద్రయాన్-2పై కేంద్ర అంతరిక్షం, అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. చంద్రయాన్-2 ప్రయోగం వచ్చే ఏడాది మార్చిలో ఉంటుందని ఆయన ప్రకటించారు. జీఎస్ఎల్వీ ఎంకే-2రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రాయోగాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచే ప్రయోగం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
చంద్రయాన్-2 సిద్ధమౌతోంది
-
చంద్రయాన్-2 సిద్ధమౌతోంది: కిరణ్‌కుమార్
న్యూఢిల్లీ: చంద్రయాన్-2 మిషన్‌ను 2018 ప్రథమార్ధంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. వెల్స్ విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన చంద్రునిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దింపేందుకు అవసరమయ్యే సాంకేతికతపై ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఇస్రో ప్రత్యేక ఇంజిన్‌ను తయారుచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఓ కృత్రిమ కార్టర్‌తో ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహేంద్రగిరి, తిరెనెల్వేలి, చల్లకెరెల్లో గల ఇస్రో స్ధావరాల్లో గ్రౌండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఉపగ్రహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వీనస్ మిషన్‌పై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ప్రాజెక్టుపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెప్పారు. కాగా, చంద్రయాన్ 2లో ఒక ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్ ఉంటాయి. చంద్రయాన్-1కి ఇది ఆధునిక వెర్షన్. జీఎస్ఎల్వీ మార్క్ 2 ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించాలనే ఇస్రో చూస్తోంది. -
2018లో చంద్రయాన్-2
సాక్షి, హన్మకొండ: చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని 2017-18లో చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం వరంగల్ నిట్‌లో జరిగిన 13వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపై తొలిసారిగా రోవర్ దించుతామన్నారు. అంగారక గ్రహంపైకి ప్రయోగించిన మంగళ్యాన్ ప్రయోగం ద్వారా ఆ గ్రహానికి సంబంధించిన వాతావరణ వివరాలను తెలిపే ఛాయాచిత్రాలు ఇస్రోకు చేరాయని చెప్పారు. దీంతో అంగారక గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాలు, లోయలు వంటి వివరాలతో పాటు అక్కడి ఉపరితలంపై ఉన్న వాతావరణ సమాచారం తెలిసిందన్నారు. కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడంలో కీలకమైన క్రయోజనిక్ ఇంజన్‌తో అంతరిక్ష రంగంలో భారతదేశ స్థాయి పెరిగిందన్నారు. వివిధ దేశాలు తమ ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రోను సంప్రదిస్తున్నాయని చెప్పారు. దీని ద్వారా భారీగా ఆదాయం సమకూరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన సంపూర్ణ (ఎండ్ టూ ఎండ్) పరిజ్ఞానం సాధించిన ఆరు దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. ఇస్రో చేపడుతున్న ప్రయోగాలు ఖగోళశాస్త్ర వివరాలు సేకరించడంతో పాటు దేశప్రగతికి తోడ్పడుతున్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. శాటిలైట్ నావిగేషన్ ప్రోగ్రామ్ కింద ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్యుమెంటేడ్ నావిగేషన్)ను చేపట్టినట్లు వెల్లడించారు. దీని వల్ల విమానం, విమానాశ్రయాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చేరుతుందన్నారు. దీని ఫలితంగా సమర్థంగా విమానాలు నడిపించవచ్చన్నారు. అంతరిక్ష ప్రయోగాల ఫలితాలు సామాన్యులకు చేరుతున్నాయనడానికి టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్లు పెద్ద ఉదాహరణగా పేర్కొన్నారు. తెలంగాణలోని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ టెలీ ఎడ్యుకేషన్ హబ్‌గా నిలిచిందన్నారు. అమెరికా, చైనా తర్వాత అతి పెద్ద విద్యావ్యవస్థ భారత్‌లో ఉందని, నలంద, తక్షశిల వంటి ప్రాచీన గురుకుల విద్యాలయాల తరహాలో వరంగల్ నిట్ ద్వారా అత్యుత్తమమైన విద్యార్థులు తయారవుతున్నారని వెల్లడించారు. ఇస్రోలో ఉన్నత స్థానంలో ఉన్న శాస్త్రవేత్తల్లో ఇక్కడి పూర్వ విద్యార్థులు ఎక్కువమంది ఉన్నారని తెలిపా రు. భవిష్యత్తులో బయో, ఇన్ఫర్మేషన్, న్యూక్లియర్, స్పేస్ టెక్నాలజీలతో పాటు సేవరంగాలకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. దేశప్రగతికి, సామాన్యుల జీవిత ప్రమాణాలు పెంచే దిశగా సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త ఆవిష్కణ లు చేపట్టాలని విద్యార్థులకు సూచించారు. నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని నిట్ల కంటే అత్యధికంగా అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి(యూజీ)లోఎనిమిది, పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) స్థాయిలో 31 కోర్సులు వరంగల్ నిట్ అందిస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో యూజీ స్థాయిలో 7, పీజీ స్థాయిలో 10 కోర్సులకు ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ సంస్థ గుర్తింపు లభించిందన్నారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 1,596 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వీరిలో 64 మంది డాక్టరేట్ పట్టాలను పొందారు.