చంద్రయాన్‌-2: కీలక దశ విజయవంతం | Chandrayaan 2 lander Vikram Rover Separate From Orbiter | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-2: కీలక దశ విజయవంతం

Published Mon, Sep 2 2019 2:22 PM | Last Updated on Mon, Sep 2 2019 10:18 PM

Chandrayaan 2 lander Vikram Rover Separate From Orbiter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. విక్రమ్‌ ల్యాండర్ ఆర్బిటర్‌ నుంచి విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నాం 1:15 గంటలకు ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయింది. ఈ దృశ్యాలనంతా ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిరంగా తిలకించారు. ఈనెల 7న చంద్రుని ఉపరితలంపైకి విక్రమ్‌ ల్యాండర్‌ చేరుకోనుంది. దీంతో చంద్రయాన్‌-2 ప్రయోగం జాబిల్లికి అత్యంత చేరువలోకి చేరుకోగలిగింది.

జూలై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 కొద్దిరోజుల పాటు భూకక్ష్యలో పరిభ్రమించి ఆగస్ట్‌20న చంద్రుడి కక్ష్యలోని ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాలుగుసార్లు దాని కక్ష్యని శాస్త్రవేత్తలు తగించారు. ఆదివారం సాయంత్రం ఐదోసారి తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయగలిగారు. దీంతో​ చంద్రయాన్‌-2 అత్యంత కీలక దశను విజయవంతంగా పూర్తిచేయగలిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement