‘రాష్ట్రపతే ఎందుకు.. ప్రధాని కావొచ్చుగా?’ | Student Asked Modi For Tips To Become President | Sakshi
Sakshi News home page

టిప్స్‌ అడిగిన విద్యార్థి.. మోదీ సమాధానం

Published Sat, Sep 7 2019 3:44 PM | Last Updated on Sat, Sep 7 2019 4:05 PM

Student Asked Modi For Tips To Become President - Sakshi

బెంగళూరు:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు ఇస్రో కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రయోగాన్ని వీక్షించేందుకు మోదీతో పాటు దాదాపు 70 మంది విద్యార్థులు కూడా ఇస్రో కేంద్రానికి వెళ్లారు. ప్రయోగం విఫలమయ్యిందని తెలిసిన తర్వాత మోదీ అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న విద్యార్థులతో మోదీ కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి ‘మోదీజీ.. నాకు రాష్ట్రపతి కావాలని కోరిక. అందుకు నేను ఏం చేయాలో చెప్తారా’ అంటూ ప్రశ్నించాడు. అందుకు మోదీ ‘రాష్ట్రపతే ఎందుకు.. ప్రధాన మంత్రివి కావొచ్చు కదా’ అని ప్రశ్నించాడు. ఆ తర్వాత వైఫల్యాలు వచ్చినప్పుడు కుంగి పోకుండా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ప్రయత్నిస్తే జీవితంలో దేన్నైనా సాధించవచ్చని మోదీ తెలిపారు.

ఇస్రో ప్రతిష్టత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలం కావడంతో యావత్‌దేశం తీవ్ర నిరాశకు గురయ్యింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మోదీతో పాటు దేశ ప్రజలంతా శాస్త్రవేత్తలకు మద్దతు తెలుపుతున్నారు. మీరు సాధించిన విజయం చిన్నదేం కాదు అంటూ ఓదారుస్తున్నారు.
(చదవండి: యావత్‌ దేశం మీకు అండగా ఉంటుంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement