సాక్షి, బెంగళూరు: చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ చేసిన ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ గుర్తించిన ల్యాండర్ నుంచి సిగ్నల్స్ రాబట్టేందుకు కృషిచేస్తున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొంది. జాబిలిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరగకపోయినా, విక్రమ్ ఆకృతి చెక్కు చెదరకుండా ఉందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. హార్డ్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో అది ఒక పక్కకు ఒరిగిందని తెలిపింది. హార్డ్ ల్యాండ్ అయినప్పటికీ ల్యాండర్ విచ్ఛిన్నం కాలేదు. కాని, ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌కి సిగ్నల్స్ మాత్రం రావడంలేదు. ఇక, ఇస్రో చైర్మన్ కే శివన్‌కు ఎలాంటి ట్విటర్ అకౌంట్లు లేవని, ఆయన పేరు మీద సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న అకౌంట్లన్నీ ఫేకేనని ఇస్రో ట్విటర్‌లో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment