సాక్షి, బెంగుళూరు : చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా చందమామకు చేరువగా వెళ్లి జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ లొకేషన్‌ను ఇస్రో గుర్తించింది. త్వరలో ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ థర్మల్ ఇమేజ్‌ను ఆర్బిటర్ క్లిక్ చేసినట్టు పేర్కొన్నారు. అయితే, ల్యాండర్ నుంచి ఇప్పటికీ సిగ్నల్స్ అందడం లేదు. సంబంధాల పునరుద్ధరణ కోసం శాస్త్రవేత్తల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
వివరాలు.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైన సంగతి తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఏడాది జూలై 22న జీఎస్‌ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా నింగికి ఎగసిన చంద్రయాన్ –2 సుమారు ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన తరువాత ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి జాబిలివైపు ప్రయాణం ప్రారంభించింది. ఆగస్టు 20న జాబిల్లి కక్ష్యలోకి చేరిన తరువాత దశలవారీగా తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సెప్టెంబరు రెండవ తేదీ చంద్రయాన్ –2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడింది.
(చదవండి : రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్)
(చదవండి : రాయని డైరీ.. డాక్టర్ కె. శివన్ (ఇస్రో చైర్మన్))
Comments
Please login to add a commentAdd a comment