విక్రమ్‌ కనిపించిందా!? | Brad Pitt As Astronaut Did You Spot Indian Moon Lander | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎస్‌లోని ఆస్ట్రోనాట్‌తో సంభాషించిన బ్రాడ్‌ పిట్‌

Published Tue, Sep 17 2019 2:58 PM | Last Updated on Tue, Sep 17 2019 3:13 PM

Brad Pitt As Astronaut Did You Spot Indian Moon Lander - Sakshi

వాషింగ్టన్‌: హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌పిట్‌ సోమవారం అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో సందడి చేశారు. పిట్‌ నటించిన యాడ్‌ ఆస్టా చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా నాసాలో సందడి చేశారు పిట్‌. ఈ సందర్భంగా ఇంటర్నెషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)లో ఉన్న ఆస్ట్రోనాట్‌ నిక్‌ హెగ్యూకు వీడియో కాల్‌ చేసి సంభాషించారు పిట్‌. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన వీరి సంభాషణలో పలు ఆసక్తికర అంశాల గురించి చర్చించారు. దానిలో భాగంగా బ్రాడ్‌ పిట్‌ ‘భారత్‌ చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఉద్దేశించిన విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని కనిపెట్టారా’ అని నిక్‌ని అడిగాడు. అందుకు అతడు దురదృష్టవశాత్తు ఇంకా లేదు అని బదులిచ్చాడు. ఆ తర్వాత బ్రాడ్‌ పిట్‌, స్పేస్‌ స్టేషన్‌లో సైంటిస్ట్‌ జీవితం, వారి మీద గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.
 

దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ వీడియో సంభాషణను నాసా టీవీలో ప్రసారం చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఆఖరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణ కోసం ప్రస్తుతం ఇస్రో, నాసాతో కలిసి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement