nasa centre
-
విక్రమ్ కనిపించిందా!?
వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ సోమవారం అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో సందడి చేశారు. పిట్ నటించిన యాడ్ ఆస్టా చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాసాలో సందడి చేశారు పిట్. ఈ సందర్భంగా ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో ఉన్న ఆస్ట్రోనాట్ నిక్ హెగ్యూకు వీడియో కాల్ చేసి సంభాషించారు పిట్. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన వీరి సంభాషణలో పలు ఆసక్తికర అంశాల గురించి చర్చించారు. దానిలో భాగంగా బ్రాడ్ పిట్ ‘భారత్ చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఉద్దేశించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనిపెట్టారా’ అని నిక్ని అడిగాడు. అందుకు అతడు దురదృష్టవశాత్తు ఇంకా లేదు అని బదులిచ్చాడు. ఆ తర్వాత బ్రాడ్ పిట్, స్పేస్ స్టేషన్లో సైంటిస్ట్ జీవితం, వారి మీద గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. LIVE NOW: There's an incoming call … from space! 👨🚀 @AstroHague is talking to #AdAstra actor Brad Pitt about what it’s like to live and work aboard the @Space_Station. Watch: https://t.co/yQzjEx1tr8 — NASA (@NASA) September 16, 2019 దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ వీడియో సంభాషణను నాసా టీవీలో ప్రసారం చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరణ కోసం ప్రస్తుతం ఇస్రో, నాసాతో కలిసి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
‘మిషన్ శక్తి’పై మెత్తబడ్డ అమెరికా
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు భారత్ చేపట్టిన ప్రయోగం ‘మిషన్ శక్తి’తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. అంతరిక్ష రంగంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు ఇరు దేశాలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చింది. మిషన్ శక్తి తరువాత అంతరిక్షంలో 400 శకలాలు మిగిలిపోయాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి రాబర్ట్ పాలడినో బుధవారం మాట్లాడుతూ అంతరిక్షంలో ఉపగ్రహ శకలాలు మిగిలిపోవడం ఆందోళనకరమే అయినా, ఈ సమస్యను పరిష్కరించేలా పరీక్షను నిర్వహించామని భారత్ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. భారత్‌తో అమెరికాకు పటిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రెండు దేశాలు కలసిపనిచేయాలని అభిప్రాయపడ్డారు. -
భూమి నుంచి ఒక గెలాక్సీ ఊహా చిత్రం
హైదరాబాద్: గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘నెక్సస్ ఫర్ ఎక్సోప్లానెట్ సిస్టమ్ సైన్స్ (నెక్స్ఎస్ఎస్)’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. మూడు నాసా కేంద్రాలు, పది యూనివర్సిటీలు, రెండు పరిశోధక సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నారని నాసా వెల్లడించింది.