జాబిల్లి సిత్రాలు | Chandrayaan-2 captures images of moon by Terrain Mapping Camera-2 | Sakshi
Sakshi News home page

జాబిల్లి సిత్రాలు

Published Tue, Aug 27 2019 3:45 AM | Last Updated on Tue, Aug 27 2019 3:45 AM

Chandrayaan-2 captures images of moon by Terrain Mapping Camera-2 - Sakshi

సూళ్లూరుపేట: చంద్రయాన్‌– 2 మిషన్‌లో భాగంగా ఆర్బిటర్‌కు అమర్చిన టెరియన్‌ మ్యాపింగ్‌ కెమెరా (టీఎంసీ– 2) మరోమారు చంద్రుడిని ఫొటోలు తీసింది. సోమవారం వాటిని ఇస్రో విడుదల చేసింది. ఈ నెల 23న బెంగళూరు సమీపంలోని బైలాలు భూ నియంత్రణ కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. చంద్రుడికి దగ్గరగా 109 కిలోమీటర్లు, దూరంగా 4,375 కిలోమీటర్లు దీర్ఘ చతురస్త్రాకారంలో పరిభ్రమిస్తూ ఉత్తర వైపు ధ్రువంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ చిత్రాలను తీసింది.

చంద్రయాన్‌ –2 మిషన్‌లో ల్యాండర్‌ను అమర్చిన ఉపకరణాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ నెల 28న ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్‌ 7న ల్యాండర్‌లో అమర్చిన రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై దించేందుకు సర్వసన్నద్ధంగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement