Margani Bharat Ram
-
నాగాంజలి మృతి బాధాకరం: మార్గాని భరత్
-
‘మిస్టర్ పవన్.. దీపక్ తాట ఎందుకు తీయలేదు?’
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ..‘నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్‌లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదు.పవన్.. కేవలం మాటలేనా?ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు. నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్?. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా పవన్. మీ మాటలు చేతలకు పనిచేయవా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే.. వారిని కనీసం పరామర్శించారా?. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలైనా ఇచ్చారా?.ఆడబిడ్డలకు రక్షణ కరువు..ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా?. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా?. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు. ఆడ పిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరితెగించి రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరందిశ యాప్ కాపీనే శక్తి..గతంలో వైఎస్ జగన్ దిశా యాప్ తెచ్చారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశా చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారు?. దిశ యాప్‌పై ఇప్పటి హోం మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైపోయిందో హోమ్ మంత్రి సమాధానం చెప్పాలి. శక్తి టీమ్‌లు ఎక్కడికి పోయాయి?. శక్తి యాప్ సరిగా పనిచేసుంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?. అనిత మాటలు చేతల్లో కనిపించవా?. నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పటికైనా మంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నాం.బాధితురాలికి న్యాయం జరగాలి..నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ స్పందిస్తూ..‘నాగాంజలి మరణం బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలి. నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరం. -
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. రాజమహేంద్రవరం బొల్లినేని ఆస్పత్రిలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థిని కుటుంబాన్ని కళ్యాణి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మంగళవారం పరామర్శించారు. అనంతరం నిందితుడి దీపక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీకి వినతిపత్రమిచ్చారు. ఆస్పత్రి వద్ద కళ్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక యువతిని దారుణంగా హింసించి, ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బొల్లినేని ఆస్పత్రిలోనే బాధితురాలికి చికిత్స చేయించడం దారుణమన్నారు. ఫార్మసీ విద్య చివరి సంవత్సరం పూర్తి చేసుకుని, ఉద్యోగంలో స్థిరపడాల్సిన సమయంలో విద్యార్థిని ఆస్పత్రిలో ఇలా అచేతనంగా పడి ఉండటం బాధాకరమన్నారు. సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరంలోనూ ఆమె బాధ కనిపిస్తోందన్నారు. ఇంత దారుణానికి ఆస్పత్రి ఏజీఎం దీపక్ కారకుడయ్యాడన్నారు. అతడిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇదే ఆస్పత్రిలో బాధితురాలు ఇంజెక్షన్ చేసుకుందని, ఇప్పటివరకూ ఆమె తల్లిదండ్రులకు సీసీ టీవీ ఫుటేజీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఆ ఇంజెక్షన్ ప్రమాదకరమని, ఎవరికి వారు చేసుకోలేరని చాలామంది అంటున్నారన్నారు. అలాంటప్పుడు వేరే వ్యక్తులు చేశారా? అసలు ఏం జరిగిందో సీసీ టీవీ ఫుటేజీలోనే ఉంటుందని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై సిట్ వేసి, దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి 10 రోజులైందని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోం మంత్రి అనిత ఏం స్పందించారని నిలదీశారు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానని ప్రగల్భాలు పలికిన పవన్.. దీపక్ తాట తీయాలి కదా అన్నారు. టీడీపీ సానుభూతిపరుడైతే దండించరా? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది? వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. బాధితురాలికి సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని నిలదీశారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, ఆమె తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది ఆత్మహత్యాయత్నమా లేక హత్యా అనే అనుమానం కలుగుతోందన్నారు. దీపక్ చాలామంది ఆడపిల్లలను వేధించినట్లు తెలుస్తోందని, అటువంటి వ్యక్తికి ఎందుకు ప్రభుత్వం, పోలీసులు కొమ్ము కాస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. విద్యార్థినిని దారుణంగా హింసించిన దీపక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీపక్ మామ టీడీపీలో క్రియాశీలక వ్యక్తి అన్నారు. దీపక్‌పై గతంలో కేసులున్నాయంటున్నారని, అధికార టీడీపీకి చెందిన వ్యక్తి కావడం వలన వెనకేసుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రాజమండ్రి ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయించాలి : వరుదు కళ్యాణి
తూర్పుగోదావరి జిల్లా,సాక్షి: మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా? అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ప్రశ్నించారు. రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ భరత్ రామ్‌లు పరామర్శించారు. బొల్లినేని ఆసుపత్రి ఘటనపై సిట్ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరుదు కళ్యాణి: మాట్లాడుతూ.. ఘటన జరిగి పది రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనను పట్టించుకోరా. యువతిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం దారుణం. జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు. సీసీటీవీ ఫుటేజ్‌ను ఇప్పటిదాకా ఎందుకు తల్లిదండ్రులకు చూపించలేదు. ఈ ఘటనపై సిట్ వేసి దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు.ఆరే శ్యామల అధికార ప్రతినిధి:బాధిత కుటుంబ తల్లడిల్లిపోతుంది. సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది. మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోమన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. అంజలికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి.మాజీ ఎంపీ మార్గాని భరత్: బాధితురాల్ని దారుణంగా హింసించిన దీపక్‌ను శిక్షించాలి. నిందితుడు అధికార తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు కావడంతోనే ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఘట్టంపై సమగ్ర విచారణ జరగాలి. బాధిత యువతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదు.. ఎవరు చేశారన్న విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేయాలి. ప్రభుత్వాధికారులు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు. గతంలో దీపక్ ఎవరెవరిని హింసించాడన్న అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాలి. ఈ ఘటనలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి బాధితురాలి తల్లిదండ్రులు :మా బిడ్డను ఆరోగ్యంగా మాతో పంపాలి. లేదంటే అదే ఇంజక్షన్ మాకు ఇవ్వండి. మాకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం’అని హెచ్చరించారు. -
ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాడతాం
రాజమహేంద్రవరం సిటీ: ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఆమె కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ స్పష్టం చేశారు. శనివారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచి్చనట్టు కనిపిస్తోందన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు ఫార్మసీ విద్యార్థిని తన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించిందని, నిందితుడిగా పేర్కొంటున్న కిమ్స్ ఏజీఎం దీపక్ ట్రాక్ రికార్డు కూడా చెడుగానే ఉందన్నారు. పోలీసులు చెప్పిన దానికి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీకి మధ్య తేడాలుండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. తాను మళ్లీ పుట్టాలనుకోవడం లేదంటూ బాధితురాలు సూసైడ్ నోట్లో రాసిందంటే, ఆమె మానసికంగా ఎంతగా నలిగిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు.సూసైడ్ నోట్‌ను తారుమారు చేసేందుకు దీపక్ ప్రయత్నించాడని ఆరోపించారు. సూసైడ్ నోట్ దొరికిన తర్వాతే దీపక్ పరారయ్యాడని, ఆస్పత్రిలో సీసీ ఫుటేజీ పూర్తిగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కిమ్స్ ఏజీఎం దీపక్ టీడీపీకి చెందిన వ్యక్తి అని, అతడి మామ నగరంలో ఆ పార్టీలో క్రియాశీలక నాయకుడని, అధికార పార్టీకి చెందిన వారు కనుక ఈ అంశాన్ని తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోందని భరత్‌రామ్ పేర్కొన్నారు. పోలీసుల విచారణలో దీపక్ ఏం చెప్పాడో బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. బాధిత విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ..తన కుమార్తెను వికాస్ ఫార్మసీ కాలేజీలో చదివిస్తున్నామని, ఈ నెల 23న తమ బిడ్డ పడిపోయిందని ఫోన్ చేశారని చెప్పారు. 2 రోజుల తర్వాత కానీ ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలియలేదన్నారు. తమకు న్యాయం జరగాలని కన్నీటిపర్యంతమై వేడుకున్నారు. పాస్టర్ ప్రవీణ్‌కుమార్ పగడాల మృతి వెనుక కారణాలేమిటో బయటకు రావాలన్నారు. ఈ కేసు విషయమై మంత్రి లోకేశ్ బాధ్యతారహితంగా ట్వీట్ చేయటం దారుణమని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో భూకబ్జాలు, ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతికి భరత్‌రామ్ వినతిపత్రమిచ్చారు.ఆమె పాలిట అభినవ కీచకుడు» ఫార్మసీ విద్యార్థినిని కిరాతకంగా వేధించిన కిమ్స్ ఏజీఎం దీపక్! » ఓ లెక్చరర్, కొందరు డ్యూటీ డాక్టర్ల నుంచి స్టాఫ్ నర్సులూ అతడి బాధితులే » టీడీపీతో అనుబంధం ఉండటంతో అతడు ఆడింది ఆట.. పాడిందే పాట » ఒక్కొక్కటిగా వెలుగులోకి దీపక్ లైంగిక వేధింపులు సాక్షి, టాస్క్ ఫోర్స్: రాజమహేంద్రవరంలో కిమ్స్ బొల్లినేని ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రోజులు గడుస్తున్నకొద్దీ దీపక్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యువతులను లైంగిక వేధింపులకు గురి చేయడం అతడికి సర్వసాధారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీతో అనుబంధం ఉండటం, దీపక్ మామ టీడీపీ నేత కావడంతో అతడు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిపోతోందని చెబుతున్నారు. ప్రేమ పేరిట వలపు వల విసురుతూ లైంగిక వాంఛలు తీర్చుకున్న అనంతరం యువతులను వదిలించుకునేందుకు వేధింపులకు గురి చేయడం అతడికి పరిపాటేనని బలంగా వినిపిస్తోంది. దీపక్ రాజమహేంద్రవరంలోని హోమియో కళాశాలలో చదివాడు. ఆ సమయంలో లెక్చరర్‌ను వేధించినట్టు తెలిసింది. దీంతో అతడిని కళాశాల నుంచి డీబార్ చేసినట్టు తెలుస్తోంది. కాగా.. 2019లో అతడు కిమ్స్ ఆస్పత్రిలో చేరాడు.ఆ తరువాత ఆస్పత్రిలో వివిధ హోదాల్లో పనిచేసే ముగ్గురు సిబ్బందిని వేధించినట్టు తెలిసింది. వీళ్లే కాకుండా అతడి వేధింపులు తట్టుకోలేక డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు.. ఇలా వివిధ హోదాల్లో పనిచేసే సిబ్బంది పదుల సంఖ్యలో ఆస్పత్రి వదిలి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఇతడి వేధింపులపై ఫిర్యాదు చేస్తే తమ పరువుపోతుందనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రాలేదు. గతంలో ఇద్దరు సిబ్బందిని బ్లాక్మెయిల్ చేసిన వ్యవహారంలో ఆస్పత్రి యాజమాన్యం మందలించినా అతడి వ్యవహార శైలిలో మార్పులేదు. టీడీపీతో అనుబంధం ఉండటంతో.. ప్రేమ పేరిట మాయమాటలు చెబుతూ.. లైంగిక వాంఛలు తీరాక సదరు యువతులు, మహిళలను వదిలించుకోవడం అతడి నైజమని, ఈ విషయంలో అతడు ఎంతకైనా తెగిస్తాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థినిపై సైతం వేధింపులకు ఒడిగట్టడంతో వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆమె మెదడు దెబ్బతినే ఇంజెక్షన్ చేసుకున్నట్టు తెలిసింది. అతగాడి వేధింపులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వెలుగు చూశాయి. ఏజీఎం దీపక్ తనను కొట్టి, గాయపరిచిన ఫొటోలను బాధిత విద్యార్థిని ఎప్పటికప్పుడు సెల్ఫోన్లో తీసుకుని భద్రపరుచుకున్నట్టు సమాచారం. తన శరీరంపై గాయాలైన భాగాలను ఆమె ఫొటోలు తీసింది. వాటిని పరిశీలిస్తే అతగాడి క్రూరత్వం ఎలాంటిదో తెలుస్తోంది. అతని కర్కశత్వాన్ని చూసి ఆస్పత్రి సిబ్బంది సైతం అవాక్కవుతున్నారు. ఘటన జరిగిన రోజు సీసీ ఫుటేజీని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసును నీరుగార్చేందుకు ఆధారాలు లభించకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫార్మసీ విద్యార్థిని హెల్త్ బులెటిన్ విడుదలకంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య స్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు కిమ్స్–బొల్లినేని ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని అధికారుల కమిటీ తెలిపింది. విద్యార్థిని హెల్త్ బులెటిన్‌ను ఈ కమిటీ శనివారం రాజమహేంద్రవరంలో విడుదల చేసింది. ఆమె తక్షణ చికిత్సకు న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా విభాగాల వైద్యులు నిరంతర పరిశీలన కొనసాగిస్తున్నారని తెలిపింది. ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని పేర్కొంది. డీఎంహెచ్‌వో, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి, ఎన్టీఆర్ వైద్యసేవ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ బులెటిన్ విడుదల చేశారు. విషమంగానే బాధితురాలి ఆరోగ్యంకాగా.. అంతకుముందు కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నాయి. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ విద్యాదీపక్, డాక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. బాధిత విద్యార్థినికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. బీపీ ఇంకా తగ్గిపోవడంతో చికిత్సలో మరో రెండు ఇంజెక్షన్లు చేర్చామని తెలిపారు. గుండె, లివర్, కిడ్నీ పనితీరు బాగున్నాయని చెప్పారు. బాధితురాలు తీసుకున్న ఇంజెక్షన్ ప్రభావంతో ఆమె బ్రెయిన్ కోమాలోకి వెళ్లిందన్నారు. సీటీ స్కాన్ చేశామని, అందులో బ్రెయిన్ వాపు ఇంకా పెరుగుతోందని చెప్పారు. దీనిని నియంత్రించేందుకు చికిత్స అందిస్తున్నామన్నారు. బ్రెయిన్ ఎక్కువగా పాడయిపోవడంతో ఆమెలో ఎటువంటి మార్పూ రాలేదని తెలిపారు. -
రాజమండ్రి ఫార్మసిస్ట్ ఘటన.. సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి: మార్గాని
సాక్షి, తూర్పుగోదావరి: ఆత్మహత్యా యత్నం చేసిన ఫార్మసిస్ట్కి న్యాయం జరిగేదాకా పోరాడుతామని, ఆమె కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైనా వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫార్మసిస్ట్ కేసులో నిందితుడు దీపక్ టీడీపీ క్రియాశీల కార్యకర్త అని, ఆయన మామ రాజమహేంద్రవరం టీడీపీలో ముఖ్య నేత అని మాజీ ఎంపీ గుర్తు చేశారు. దీపక్ పని చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ కోరారు.మార్గాని భరత్ ఇంకా ఏం మాట్లాడారంటే..:బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో ఏజీఎంగా పని చేస్తున్న దీపక్ అనే వ్యక్తి కారణంగానే తాను ఆత్మహత్యా యత్నం చేస్తున్నట్లు ఫార్మసిస్ట్ సుదీర్ఘ లేఖలో రాసుకొచ్చారు. ఆమెను దీపక్ శారీరకంగా, మానసికంగా హింసించాడు. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. అంజలి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలి. లేకపోతే అవన్నీ బయట పెడతాం. దీపక్ వ్యక్తిత్వం మంచిది కాదని అందరూ చెబుతున్నారు. గత మూడు నాలుగు రోజులుగా బాధితురాలి తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధ వర్ణణాతీతం. ప్రభుత్వం మీద నమ్మకం లేక న్యాయం చేయమని వారు నన్ను ఆశ్రయించారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించి ఉంటే వారు నా దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంటుంది?పక్కదారి పట్టించే ప్రయత్నం:ఆస్పత్రి యాజమాన్యం కూడా మొదటిరోజు ఈ ఘటనను పక్కదారి పట్టించేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. ఫార్మసిస్ట్ సహచర విద్యార్థులు రోడ్డుమీదకొచ్చి ధర్నా చేస్తే కానీ ప్రభుత్వం, ఆస్పత్రి యాజమాన్యం దిగి రాలేదు. మూడు రోజుల తర్వాత కానీ ఆమె ఆత్మహత్యకు యత్నించిన ఇంజెక్షన్ గురించి ఆస్పత్రి యాజమాన్యం నోరు విప్పలేదు. ఫార్మసిస్ట్ సూసైడ్ నోట్ దొరకనంత వరకు ఈ కేసును నీరు గార్చడానికి దీపక్ చేయని ప్రయత్నం లేదు. మా నాయకుడికి ఈ విషయం తెలియజేయడంతో ఫార్మసిస్ట్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా అండగా ఉండాలని ఆదేశించారు. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుంది. నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త:నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త అని తెలిసింది. ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా రాజమండ్రిలో టీడీపీ నాయకుడని సమాచారం. కాబట్టే ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 10 నెలల్లో మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. కానీ ఎక్కడా నిందితులకు శిక్ష పడిన దాఖలాలు లేవు.సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి:సీసీ టీవీ ఫుటేజ్‌ను ఆస్పత్రి యాజమాన్యం వెంటనే బయట పెట్టాలి. రూమ్ నెం.801లో ఆమే స్వయంగా ఇంజక్షన్ చేసుకుందా? లేక ఎవరైనా బలవంతంగా ఎక్కించారా అనేది నిర్ధారణ కావాలి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు దీపక్ నుంచి సేకరించిన వివరాలు ఫార్మసిస్ట్ తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఈనెల 23న దీపక్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే మాత్రం 24వ తేదీ కనిపిస్తోంది. అలాగే ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారా? లేదా? అన్నది కూడా పోలీసులు చెప్పాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివరాలు వెల్లడించాలి:పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయి ఐదు రోజులు గడిచినా ఆయనది హత్యా? లేక రోడ్డు ప్రమాదమా? అనేది ఇంతవరకు పోలీసులు నిర్ధారించలేకపోవడం దారుణం. ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నారా లోకేష్ ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే హత్యా? యాక్సిడెంటా? అనేది నిర్ధారణ కాకుండానే ప్రమాదవశాత్తు చనిపోయారని ఆయన ఎలా ప్రకటిస్తారు?. అందుకే పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి వివరాలు చెప్పాలని మార్గాని భరత్ కోరారు.కాగా, ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ..సరైన సమాచారం ఇవ్వలేదు:మా పాప వికాస్ కాలేజీలో చదువుతూ బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తోంది. మా పాప కళ్లు తిరిగిపడిపోయిందని ఈనెల 23న సా. 4 గం.కు ఆస్పత్రి నుంచి మాకు ఫొనొచ్చింది. మేము అక్కడికి వెళ్లేసరికి రాత్రి 8 గం. అయింది. అప్పటికే ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారు. మేం వెళ్లాక ఐసీయూకు మార్చారు. వైద్యం చేస్తున్నామని చెబుతున్నారే కానీ దేనికి అనేది చెప్పలేదు. స్లో పాయిజన్ అయి ఉంటుందని మర్నాడు ఒక డాక్టర్ చెప్పారు. మా పాపకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. ఈ పరిస్థితి మరే ఇతర అమ్మాయికి రాకూడదు. మా పాప ఆస్పత్రికి ఎలా వచ్చిందో అలాగే తిరిగి ఇంటికి రావాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.ఆస్పత్రికి కనీసం బాధ్యత ఉండదా?:డ్యూటీలో ఉన్న అమ్మాయి పడిపోతే ఆస్పత్రికి బాధ్యత తీసుకోదా? అందుకే ఈ ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం పాత్ర కూడా ఉందనే అనుమానం వస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు మాతో మాట్లాడలేదు. మాజీ ఎంపీ భరత్ జోక్యం చేసుకున్నాకే వారిలో మార్పు కనిపిస్తోందని ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు వెల్లడించారు. -
రాజమండ్రి వేదికగా మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి?
-
పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘటనపై మార్గని భారత్,హర్ష కుమార్ రియాక్షన్
-
అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు.మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..:ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు?:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్త మౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో ఆదాయం కింద రూ.2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో రూ. 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు.మాటలకు చేతలకు పొంతన లేదు:అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉందని చెప్పి, అంతకు ముందు పాలించిన ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పులపాలైంది. సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తన మంత్రి పదవి కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను, సీఎం చంద్రబాబును పొగిడే దుస్థితికి దిగజారిపోయారు.పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు:పెయిడ్ ఆర్టిస్టును అడ్డం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్‌ను వేధించి ఏపీ నుంచి తరిమేస్తే ఆయన కంపెనీ జేఎస్‌డబ్ల్యూ మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటోళ్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేశాడని తప్పుడు ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దావోస్‌లో లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటే.. రాష్ట్ర యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామన్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఉద్యోగాలివ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 20 లక్షల మంది నిరుద్యోగ యువతను నిలువునా మోసగించాడు.పథకాలన్నీ నిర్వీర్యం:ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ట్రస్టు మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌కి మార్చేసి పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారు. గతేడాది బడ్జెట్లో సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటయించి అమలు చేయడంపైనా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తామని మాట తప్పారు. అందుకే చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనని, ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని మార్గాని భరత్ గుర్తు చేశారు. -
అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పింది
-
బాబుకు మార్గాని భరత్ కౌంటర్
-
నాలుగు సార్లు సీఎంగా చేశావ్.. ఆరుగురు చనిపోతే ఆటలుగా ఉందా?
-
చంద్రబాబు సీఎంగా ఉంటే అంతే.. టీటీడీ బోర్డు రద్దుకు మార్గాని భరత్ డిమాండ్
తూర్పు గోదావరి, సాక్షి: తిరుపతి తొక్కసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాకాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుపతి ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దారుణం..అత్యంత బాధాకరమైన విషయం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస వసతులు కూడా అందించకుండా అలా ఎందుకు బంధించినట్లు?. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు?. ఇక్కడ టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. టీటీడీ దేవస్థానమో(TTD Board) లేదంటే రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదు.చంద్రబాబు(Chandrababu)కు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు . క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా?. అదే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.తిరుపతి(Tirupati) మరణాలకు బాధ్యత ఎవరిది?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ బాధ్యత టీటీడీకి వదిలేశారు. అయితే క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణం. అసలు 1,20,000 టోకెన్లు జారీ చేయాలని భావిస్తే ఆన్లైన్లో ఎందుకు చేయలేదు. చిన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదు ఇది మొత్తం వ్యవహారానికి టిటిడి బోర్డు బాధ్యత తీసుకొని పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వం బోర్డును రద్దు చేయాలి. ఇది హిట్లర్ నియంత పాలన కాదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. తిరుపతి ఘటనను చీకటి రోజుగా కింద భావించాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి అని మార్గాని భరత్ అన్నారు. -
తిరుమల ఘటనపై మార్గాని భరత్ సీరియస్ రియాక్షన్
-
చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు మార్గాని భరత్
-
ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్(YS Jagan) పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని.. గణాంకాలతో సహా వైఎస్సార్సీపీ(YSRCP) రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్(Margani Bharat) వివరించారు. బుధవారం ఆయన ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకే ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీతో శంకుస్థాపనలు చేయిస్తోందన్నారు.ఈ ప్రభుత్వంలో ఆరున్నర నెలల్లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని.. ప్రధాని పర్యటనతో సీఎం చంద్రబాబు షో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారని మార్గాని భరత్ దుయ్యబట్టారు. అంతకు ముందు చంద్రబాబు పాలన కన్నా, గత ప్రభుత్వంలో జగన్ పాలనలోనే పారిశ్రామిక రంగం గణనీయంగా పురోగతి సాధించినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. మరోవైపు కమీషన్ల కోసం టీడీపీ నాయకుల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు హడలెత్తిపోతున్నారని మార్గాని భరత్ చెప్పారు.‘‘రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్టుల శంకుస్ధాపనల కోసం రావడం మంచి పరిణామం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ ఆయన ఆ దిశలో ఏం సాధించలేదు. ఈ రోజు ప్రధాని శంకుస్ధాపనలు చేయబోయే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వే జోన్, బల్క్ డ్రగ్ పార్కు.. ఇవన్నీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు. అయితే సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టు వీటిని ఈరోజు తామే సాధించి తెచ్చినట్టు చంద్రబాబు కలరింగ్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ..నిజంగా వారికి దమ్ము, ధైర్యం ఉంటే, రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించడంతో పాటు, కర్నాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్‌కు ఇస్తున్నట్లు రూ.15వేల కోట్ల కేటాయింపు జరిగేలా చూడాలి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుపై వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగింది. బల్క్ డ్రగ్ పార్క్‌ను 17 రాష్ట్రాలతో పోటీపడి, నాడు మన రాష్ట్రం సాధించింది. దక్షిణాదిలో మరే రాష్ట్రానికి అప్పుడు అది సాధ్యపడలేదు...పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారంటూ, టీడీపీ పిచ్చి విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు ఎక్కువగా ఎవరి హయాంలో నమోదైంది అన్నది చూస్తే, పారిశ్రామికవేత్తలు అసలు ఎవరిని చూసి భయపడుతున్నారో అందరికీ తెలుస్తుంది. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి పారిశ్రామిక వృద్ధి రేటు 11.92 శాతంగా ఉంటే, 2024లో జగన్ దిగిపోయే నాటికి ఆ వృద్ధి రేటు 12.61 శాతంగా నమోదైంది. ఇంకా చంద్రబాబు హయాంలో రాష్ట్ర రుణంలో 19.54 శాతం పెరుగుదల కనిపిస్తే, అది జగన్ హయాంలో 15 శాతం మాత్రమే.ఇదీ చదవండి: జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా: వైఎస్ జగన్ ..అలాగే తలసరి ఆదాయం (పీసీఐ) 2018–19 నాటికి రూ.1.54 లక్షలు కాగా, 2023–24 నాటికి అది రూ.2.19 లక్షలకు పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తుల విలువలో చంద్రబాబు హయాంలో దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, జగన్‌గారి పాలనలో 2022–23 నాటికే 8వ స్థానానికి ఎగబాకింది. దేశ జీడీపీలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్ర జీడీపీ వాటా 4.47 శాతం కాగా, జగన్ హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది...నిజానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను దారుణంగా వేధిస్తున్నారు. వారిని బెదిరిస్తున్నారంటూ.. రాజమండ్రిలోని ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు నిర్వాహకులను రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి ఆదిరెడ్డి అప్పారావు బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో వినిపించారు. ఆ పేపర్ మిల్లు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ చౌదరి తాత గారు చిట్టూరి ప్రభాకర్ చౌదురి గతంలో రాజమండ్రి ఎమ్మెల్యేగా పని చేశారు. ..వేల కోట్ల టర్నోవర్ ఉన్న పేపర్ మిల్లు మూతపడితే అందులో పని చేసే వేలాది కార్మికుల జీవితాలు రోడ్డున పడిపోవా? అలా టీడీపీ నేతలు డబ్బుల కోసం బెదిరిస్తుంటే, వారు కంపెనీలు ఎలా నడుపుతారు?. నిజానికి పేపర్ మిల్లు లాకౌట్ సమయంలో ప్రభుత్వం కలుగజేసుకుని, అది కొనసాగించేలా చూడటమో లేదా కార్మికులను ఆదుకోవాలన్న కనీస ప్రయత్నం కూడా చేయలేదు’’ అని మార్గాని భరత్ ఆక్షేపించారు.కార్మికుల వేతన ఒప్పందంలో టీడీపీ పాత్ర లేదుతాము అధికారంలో ఉన్నప్పుడు 2019 జనవరిలో వేతన ఒప్పందం చేశామని టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ అది అవాస్తమని పేపర్ మిల్లు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ చౌదరి అన్నారు. ‘‘పేపర్ మిల్లు కార్మిక సంఘం తరఫున వేతన ఒప్పందం చేసింది నేను. తమ హయాంలో ఒప్పందం జరిగింది కాబట్టే అది తామే చేశామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. వేతన ఒప్పందంలో ఏ ఎమ్మెల్యే, లేదా మంత్రి సంతకం కూడా లేదు. టీడీపీ నాయకుల పాత్ర లేదని చెప్పడానికి ఈ ఒప్పందమే సాక్ష్యం’‘‘నాటి ఎంపీ మార్గాని భరత్ నేతృత్వంలో కార్మికులకు రూ.6 వేలు చెల్లించేలా పేపర్ మిల్లు యాజమాన్యాన్ని ఒప్పిస్తే.. తండ్రీ కొడుకులు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్.. గత ఎన్నికల్లో లబ్ధి కోసం రూ.10 వేలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఎన్నికల్లో గెల్చిన తర్వాత నెల రోజుల్లో రూ.10 వేలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పేపర్ మిల్లు కార్మికులు నమ్మి ఓటేస్తే పట్టించుకోకుండా నట్టేట ముంచారు.’’ అని ప్రవీణ్ చౌదరి చెప్పారు. -
గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఘటన.. పవన్ కళ్యాణ్ కు మార్గాని భరత్ కౌంటర్
-
ఎల్లో మీడియాలో బిల్డప్ తప్ప... మంచి చేసింది ఏమీ లేదు
-
బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా? : భరత్
-
మేం డెవలప్ మెంట్ అంటే ఇప్పు డొన్నోళ్లు కలెక్షన్స్ అంటున్నారు
-
కూటమి ఎమ్మెల్యే.. అక్రమ డబ్బు లెక్కలకు మిషన్లు కొన్నారట: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే, ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు.రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి చూపించింది. రాజమండ్రిలో దళిత యువకుడుపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. జనవరి మూడో వారంలో కమిషన్ ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు.సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన బీసీ మంత్రులు మూడుసార్లు క్షమాపణ చెప్పాల్సి రావడం దారుణం. సామాజిక కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులు హాజరుకావడం పరిపాటి. బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా?. కమ్మ గ్లోబల్ సమిట్‌లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు?. బీసీల పట్ల కూటమి ప్రభుత్వం అణుగదొక్కే వైఖరి అవలంబిస్తోంది.కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దందాల లిస్ట్ లెక్కలేనంత ఉంది. కోటిలింగాల ఘాట్ నుండి ఫోర్త్ బ్రిడ్జి వరకు ఉన్న 15 ర్యాంపుల్లో డ్రెడ్జింగ్ చేసి 800 లారీలు ప్రతిరోజు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మామూలు వసూలు అవుతోంది. లారీకి రూ.8500 తీసుకుంటున్నారు. స్థానిక ఈవీఎం ఎమ్మెల్యేకు రోజుకు ఈ ర్యాంపుల ద్వారా 24 లక్షలు రూపాయలు ఆదాయం వస్తోంది. ఆనంద నగర్ క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బుల కూడా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో భూకబ్జాలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఎమ్మెల్యే వెనకాలే తిరిగే వ్యక్తులు అనేక చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారు.ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక స్థానిక ఎమ్మెల్యే మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే అతిపెద్ద స్లాటర్ హౌస్ ఉంది. రోజుకు రెండు మూడు వందల గోవులు అక్కడ హతమైపోతున్నాయి. వాటి నిర్వాహకుడు రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే. దమ్ముంటే ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేసి పేపర్ బ్యాలెట్‌తో పోటీకి రండి. నేను సవాల్ విసురుతున్నాను. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద కూడా ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి అని కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్ అరెస్ట్ పై మార్గాని భరత్ రియాక్షన్
-
పోలీసుల వేధింపులపై ఫిర్యాదు చేశాం: మార్గాని భరత్
సాక్షి,ఢిల్లీః రాజమండ్రిలో దళిత నాయకుడు పులి సాగర్‌ను పోలీసులు బట్టలు ఊడదీసి సెల్లో పెట్టారని మాజీ ఎంపీ మార్గానిభరత్ మండిపడ్డారు. ఈ విషయమై సోమవారం(డిసెంబర్9) తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఢిల్లీలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. ‘పులిసాగర్కు వేధింపుల విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిటీ, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. తగు చర్యలు తీసుకుంటామని జాతీయ ఎస్.సీ కమిషన్ హామీ ఇచ్చింది.అమానుషంగా పులి సాగర్‌ను పోలీస్ స్టేషన్ సెల్లో పెట్టి వేధించారు.ఒక మహిళా కానిస్టేబుల్ సమక్షంలో సెల్లో పులిసాగర్‌ను వేధించారు. వర్షాలు,వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందని అడిగినందుకు పోలీసులు ఇంతటి అమానుషానికి పాల్పడ్డారు’అని మార్గాని భరత్ ఫైరయ్యారు.బూతులు తిట్టి వేధించారు: బాధితుడు పులిసాగర్ * రాజమండ్రిలో ఇన్స్పెక్టర్ బాజీలాల్ రమ్మంటే పోలీసు స్టేషన్‌కు వెళ్ళాను.* సోషల్ మీడియాలో నేను చేసిన పోస్ట్ ను ప్రశ్నిస్తూ బూతులు తిట్టి, నన్ను వేధించారు.* వరదలు వచ్చిన ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో వెంటనే వరద నీటిని తొలగించామని ఎమ్.ఎల్.ఏ ఆదిరెడ్డి శ్రీనివాస్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చేశారు.* ఎమ్.ఎల్. ఏ పోస్ట్‌ను వ్యతిరేకిస్తూ వాస్తవ పరిస్థితిని చిత్రీకరించి తిరిగి పోస్ట్ చేసినందుకు పోలీసులు నన్ను కొట్టి సెల్లో పెట్టారు.* బూతులు తిట్టి, బట్టలు ఊడదీసి నన్ను సెల్లో వేశారు.* రాత్రి 9 గంటలకు సెల్లో నుంచి బయటకు తీసుకువచ్చి, నాతో బలవంతంగా సంతకం పెట్టించుకుని, హెచ్చరించి విడిచిపెట్టారు.* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో సైకోగా మారి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని పోలీసులు రాసిన కాగితంపై నాతో బెదిరించి, బలవంతంగా సంతకం చేయుంచుకున్నారు. -
దళితులంటే బాబుకు చులకన
-
పులి సాగర్‌పై దాడి ఘటన.. పీఎస్‌లో మార్గాని భరత్ ఫిర్యాదు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రికి చెందిన దళిత యువకుడు పులి సాగర్‌పై జరిగిన దాడి ఘటనపై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో బంధించి సీఐ దాష్టీకంపై ఆయన మండిపడ్డారు. దళితులపై కూటమి సర్కార్ వేధింపుల పట్ల భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పులి సాగర్‌కు జరిగిన అన్యాయంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని భరత్ తెలిపారు.కాగా, రాజమండ్రి పోలీసుల చేతిలో దారుణంగా హింసించబడ్డ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బాధితుడు పులి సాగర్‌కు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను ఆదేశించారాయన.రెండురోజుల క్రితం పులిసాగర్‌ను కొందరు వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో.. రాజమహేంద్రవరం పోలీసులు తనతో ఎంత అవమానవీయంగా వ్యవహరించారో జగన్‌కు సాగర్ వివరించాడు. అయితే సాగర్‌కు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. -
సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది
-
‘కూటమి సర్కార్ లిమిట్స్ దాటిపోయింది.. మనం ఏపీలోనే ఉన్నామా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లో చిత్ర హింసలు పెడుతోంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? లేదా? అని ప్రశ్నించారు.అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి హింసించారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా?. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే హింసించారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. బాజీలాల్ అనే సీఐ దళిత యువకుడిని దారుణంగా కొట్టారు. దుస్తులు ఊడతీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోపెట్టారు. పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.అక్రమ కేసులపై బాధితుడు పులి సాగర్ మాట్లాడుతూ.. వర్షానికి కాలనీలో నీళ్లు నిలిచిపోతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాను. అనంతరం, పోలీసులు స్టేషన్‌కు పిలిచి పచ్చి బూతులు తిట్టారు. చంపేస్తామని బెదిరించి పోలీసు స్టేషన్లో బట్టలూడదీశారు. పీక కోసి రైలుపట్టాలపై పడేస్తానని ప్రకాష్‌నగర్ సీఐ బెదిరించారు. గోదావరిలో పడేస్తామని సీఐ దూషించారు. కానిస్టేబుల్‌తో దుస్తులు ఊడతీయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దుస్తుల్లేకుండా లాకప్‌లో కూర్చోపెట్టారు. మహిళా పోలీసుల ఎదుట నా పరువు తీశారు. విద్యావంతుడినైనా నన్ను ఇంత చిత్రహింసలకు గురి చేయటం ఎందుకు?. నాకు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. దళితులు అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావమే. చంద్రబాబు దళిత వ్యతిరేకి. సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్పేంటి?. సాగర్‌ను బండబూతులు తిట్టి, బట్టలు విప్పిన సీఐపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది?. కూటమి పాలనలో కులం పేరుతో దూషణలు, దళిత వ్యతిరేక భావనలు ఉన్నాయి. కూటమి సర్కార్ పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. బాధితుడు సాగర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతామని చెప్పారు. రైలు కింద అతని తలకాయ పెడతానని బెదిరించారు. తాడు కట్టి గోదావరిలో వేస్తామనటం ఏంటి?. సీఐ బాజీలాల్ని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయంపై స్పందించాలి. పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తాం. దళిత అధికారులపై కూడా కక్ష కట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న తప్పులను ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతారా?. దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. దళిత అధికారులు, దళిత మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దళితులకు బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. పులి సాగర్ విషయంలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం అని హామీ ఇచ్చారు. -
మరి అయ్యన్న, అచ్చెన్నాయుడుపై ఎన్ని కేసులు పెట్టారు.. మార్గాని భరత్ కౌంటర్
-
సంపద సృష్టించడమంటే ఇదేనా?
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇది చాలదన్నట్లు జీఎస్టీపై కొత్తగా ఒక శాతం అదనపు సర్‌చార్జి పెంచడానికి రంగం సిద్ధంచేయడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకోడానికి అనుమతివ్వాలని నిస్సిగ్గుగా కోరడం దారుణమని ఆక్షేపించారు. సంపద సృష్టించడమంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు.. సంపద సృష్టించి వీటిని అమలుచేస్తామని చెప్పారని.. కానీ, ఇలా ట్యాక్స్‌లు పెంచుకుంటూ పోవడమే సంపద సృష్టించడమవుతుందా అని భరత్ ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రూ.11వేల కోట్ల భారం..ఇక విజయవాడ వరదలు వచ్చాయని రాష్ట్ర ప్రజలంతా ఒక శాతం ట్యాక్స్ కట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని మార్గాని మండిపడ్డారు. నిజానికి.. వరదల పేరు చెప్పి కొన్ని రూ.వందల కోట్ల విరాళాలు వసూలుచేశారని, ఆ డబ్బు ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసునన్నారు. ఇప్పుడు మరోసారి ట్యాక్స్ పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఇక వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ఉరితాళ్లు వేయవద్దని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి ప్రజలపై రూ.11 వేల కోట్ల భారాలు రుద్దేందుకు రంగం సిద్ధంచేస్తున్నారని చెప్పారు. అలాగే, నవంబరు 15 నుంచి యూనిట్‌కు రూ.1.58 పెంచేందుకు సిద్ధం చేశారని ఆయనన్నారు. ఉచిత ఇసుక ఎక్కడాలేదని.. టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని భరత్‌రామ్ ఆరోపించారు. -
Bharath: సంపద సృష్టించడం అంటే ఐదు నెలల్లో 57 వేల కోట్లు అప్పు చేయడమా...?
-
పన్నులు పెంచడమే సంపద సృష్టించడమా?: మార్గాని భరత్
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా:ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి,రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సంపద సృష్టించడం అంటే ట్యాక్స్‌లు పెంచేయడమా అని ప్రశ్నించారు. శనివారం(నవంబర్ 16) రాజమండ్రిలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు.‘రాజుల కాలంలో ప్రజలను దోచుకుని ఖజానాలు నింపుకునేవారు ..అది ఇదేనా?విజయవాడ వరదల్లో డబ్బు ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు.. ఉరితాళ్ళు అని ఈనాడులో రాశారు.ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయ్ అని ఇదే అంశంపై ఈనాడులో కథనం వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తారు.ఐదు నెలల్లో రూ.57వేల కోట అప్పులు చంద్రబాబు చేశారు.ఐదు నెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో టీడీపీ చెప్పిన అబద్ధాలు స్పష్టమయ్యాయి. గతంలో వైఎస్జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రూ. 6 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చారు. స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి రూ.11వేల కోట్లు ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 15 నుంచి యూనిట్ రూపాయి 58 పైసలు పెంచేందుకు బాదుడు సిద్ధం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్చగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక పాలసీపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించేది. ఈనాడులో నిస్సిగ్గుగా వైఎస్జగన్ కుటుంబ సభ్యులపై వార్తలు రాయడం దారుణం. మనుషుల క్యారెక్టర్‌ను అసాసినేట్ చేసే విధంగా ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు’అని మార్గాని భరత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం -
ఇంటూరి రవి కిరణ్ అరెస్ట్ పై మార్గాని భరత్ ఫైర్..
-
కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోంది
-
దాడి వీడియోలున్నా పోలీసుల నుంచి స్పందన లేదు: మార్గాని భరత్
తూర్పుగోదావరి, సాక్షి: తూర్పుగోదావరి జిల్లా సీతంపేట మూలగొయ్యి గ్రామనికి చెందిన యువకుడుపై దాడి జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. దాడికి సంబంధించిన ప్రత్యక్ష వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. అయినా పోలీసుల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారాయన. సోమవారం మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు.‘‘మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనలో ఉన్నట్టుంది. కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల గళాన్ని వినిపిస్తాం. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాపై దాడులు చేయటం.. ప్రజాస్వామ్యానికి విఘాతం. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి.. ఏ కోర్టులో హాజరు పరుస్తున్నారో కూడా తెలియటం లేదు’’ అని అన్నారు. -
పోలవరం ఎత్తు తగ్గించడంపై మార్గాని భరత్ స్ట్రాంగ్ రియాక్షన్
-
అంత తొందరెందుకు బాబు.. మోరంపూడి ఫ్లైఓవర్ పనులపై భరత్ కామెంట్స్
-
ప్రభుత్వ ఖజానాకు TDP నేతలు గండి కొడుతున్నారు
-
వరద సాయం డబ్బు ఏమైంది: మార్గాని భరత్
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా:విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని అని మాజీఎంపీ,వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు.ఈ విషయమై భరత్ మంగళవారం(అక్టోబర్8) మీడియాతో మాట్లాడారు.‘విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైంది.మీరు ఖర్చు చేసిందెంత?ఎమ్మెల్యేలు అడ్డుగోలుగా దోచుకోలేదా..పులిహోరకు రూ. 23 కోట్లు ఖర్చు చేయడం దారుణం. అగ్గిపెట్టెలు,కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు చూపటం హాస్యాస్పదం.రూ.500 కోట్లు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏం చేశారు.కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయి.చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు రూ. 618 కోట్లు అయితే చంద్రబాబు వరదల్లో చూపిన ఖర్చు రూ. 500 కోట్లని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిల్వచేసిన 87లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఏమైంది.రాజమండ్రిలో 28 మద్యం దుకాణాల్లో ఆరింటిని తమకు వదిలేయాలని స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే చెప్పడం దారుణం.రాజమండ్రిలో కంబాల పార్కుకు ఎంట్రన్స్ టికెట్ రూ.50 తొలగిస్తామని గతంలో హామీ ఇచ్చారు ఇప్పటివరకు ఎందుకు తొలగించలేదు.ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎందుకు నిర్వహించలేకపోయారు.పార్కులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు’అని భరత్ నిలదీశారు.ఇదీ చదవండి: జీతాలు నిల్లు..పబ్లిసిటీ ఫుల్లు: విజయసాయిరెడ్డి సెటైర్లు -
ఆ పని దేశద్రోహులు చేస్తారు.. మార్గాని భరత్ హాట్ కామెంట్స్
-
చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. వైఎస్ జగన్ ఏయే అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. చివరకు సత్యమే గెలుస్తుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది. హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పోలవరానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిటీ పూర్తి వివరాలు పీపీఏ, సీడబ్ల్యూసీకి నివేదిక అందించింది. నూతన డయాఫ్రం వాల్ నిర్మించాలి. డయాఫ్రం వాల్ చిన్నాభిన్నం అయిపోవడానికి చంద్రబాబు కారణం కాదా?. నదిని డైవర్ట్ చేయడానికి మొదట అప్రోచ్ ఛానల్ కట్టాలి స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి. 2016 డిసెంబర్లో డయాఫ్రం వాల్ ప్రారంభించారు. 2018 నాటికి కాఫర్ డ్యామ్ పూర్తయింది. ఈసీఆర్ఎఫ్ కింద ఉన్న ఫౌండేషన్ అయిన డయాఫ్రం వాల్‌కు రక్షణ లేకపోవడంతో దెబ్బతింది. ఏ రకమైన రక్షణ లేకపోవడం వల్ల కాఫర్ డ్యాం నిర్మాణం దెబ్బ తిందని కమిటీ తేల్చింది. దీనంతటికీ కారణం చంద్రబాబు కాదా?. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు కనిపించకపోతే, యథావిధిగా ఈసీఆర్ఎఫ్ పూర్తి చేసేస్తే భవిష్యత్తులో ఎటువంటి అనర్థం జరిగేది. కాఫర్ డ్యాంలు కట్టకుండా డయాఫ్రం వాల్ ఎందుకు కట్టారు?. కాంక్రీట్ పనులు పూర్తి చేస్తే కమిషన్ డబ్బులు వస్తాయని ఆశించి చంద్రబాబు ముందు ఈ పనులు చేపట్టారు. కాపర్ డ్యామ్ కింద 40 మీటర్ల మేర జెట్ గ్రౌటింగ్ జరగాలి. చంద్రబాబును పోలవరం ద్రోహి అని పిలవాలి. పోలవరానికి చేటు చేసిన వ్యక్తిని తెలుగు ప్రజల ద్రోహి అని ఎందుకు అనకూడదు?. రాష్ట్రానికి ఇంత అనర్ధం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. పోలవరానికి సంబంధించి చంద్రబాబు చేయని తప్పంటూ లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: తిరుపతి లడ్డూ వివాదం: దర్యాప్తు నిలిపివేసిన సిట్ -
బురదజల్లడమే బాబు పని
సాక్షి, అమరావతి: మతకల్లోలాలు సృష్టించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవాలని టీడీపీ భారీ కుట్ర చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌కి అనుమతి లేదంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా! అని ప్రశ్నించారు. కల్తీ లడ్డూ ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాన్ని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ అంశం తెరపైకి తెచ్చారని భరత్ మండిపడ్డారు.చంద్రబాబు హిందుత్వాన్ని, తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నారో, ఏ రకంగా కుటిల రాజకీయాలు చేస్తున్నారో వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. చంద్రబాబు చేసిన అపచారం కారణంగా రాష్ట్ర ప్రజలకు నష్టం కాకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు చెప్పారు. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించిన చంద్రబాబు ఆధారాలు చూపించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీటీడీ ఈవో శ్యామలరావు, సీఎం చంద్రబాబు పరస్పర భిన్నమైన స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల్ని అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. మీడియాతో చంద్రబాబు చెప్పిన మాటల్లో డొల్లతనం కనపడిందన్నారు. నెయ్యిని వాడారని చెబుతున్న చంద్రబాబు.. ఎక్కడ వాడారన్నది మాత్రం అప్రస్తుతం అంటున్నారని, ఆ వాడిన నెయ్యిలో కల్తీ ఉందా అంటే.. ఆ తర్వాత వచ్చిన నెయ్యిలో ఉంది అంటున్నారని భరత్ చెప్పారు. చంద్రబాబు ఎలా హిందుత్వవాదో బీజేపీ చెప్పాలిబూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకి హిందుత్వం పట్ల, హిందూ సంస్కృతి పట్ల అసలు నమ్మకం ఉందా.. అంటూ భరత్ ప్రశ్నించారు. హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే బీజేపీకి ఇవన్నీ కనపడవా అని నిలదీశారు. తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయించిన చంద్రబాబు హిందుత్వవాది ఎలా అవుతారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూ నాణ్యత పరీక్షల విషయంలో పదే పదే అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకి దశాబ్దాలుగా టీటీడీలో మూడు లేయర్ల టెస్టులు జరుగుతున్న విషయం కూడా తెలియకపోవడం బాధాకరమని అన్నారు. గతంలో ఏనాడూ నాణ్యత పరీక్ష కోసం బయటకు పంపలేదని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం చెప్పారన్నారు. టీటీడీ వారు 2022లో బెంగళూరులోని ఐసీఏఆర్‌కి పరీక్షల కోసం పంపిన విషయం తెలుసుకోవాలన్నారు. -
ప్రజల మనసుల్లో విషం నింపేందుకు బాబు కుట్ర: మార్గాని భరత్
సాక్షి,తాడేపల్లి:తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను వైఎస్జగన్ బట్టబయలు చేశారని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు.శనివారం(సెప్టెంబర్28) తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు.‘వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారు.ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు చేశారు.జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసింది.జులై నెలలో వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారు.ఎన్డీడీబీకి పంపించిన శాంపుల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది.నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారు.జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారు.చంద్రబాబు రెండు నెలలు ఆగి అబద్ధాలు చెప్పారు.చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.నాలుగు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని ఈవో చెబుతున్నారు.2014-19 మధ్య 14సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు.2019-24 మధ్య 18సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు.చంద్రబాబుకు హిందుత్వం పట్ల హిందువుల పట్ల అసలు గౌరవం ఉందా.బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేశాడు.అదేనా హిందుత్వమంటే.వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు కూల్చివేయించేశారు.చంద్రబాబు రాజకీయాలను బీజేపీ నేతలు గమనించాలి.సీఎం హోదాలో వైఎస్జగన్ ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారు.పాదయాత్ర పూర్తయ్యాక కాలినడకన వెళ్లి తిరుమల దర్శనంచేసుకున్నారు.డిక్లరేషన్‌పై అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు.నెయ్యి నాణ్యత పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారా..తెలియక మాట్లాడుతున్నారా.ఎన్డీబీబీ నుంచి వచ్చిన నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు విడుదల చేశారు.ఎన్డీబీబీనుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు.వైఎస్జగన్మోహన్రెడ్డి పర్యటనకు పర్మిషన్ లేదని మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే సిట్ అధికారులు అమలు చేస్తారు.ప్రజల మనసులో చంద్రబాబు విషం నింపాలని ప్రయత్నం చేస్తున్నారు.ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తారో పవన్ కు తెలుసా.చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నారా.బీజేపీ వాళ్లు ముందు చంద్రబాబుని ప్రశ్నించాలి’అని భరత్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: నెయ్యి కల్తీపై థర్డ్‌పార్టీ విచారణ చేయించండి: బొత్స -
చంద్రబాబుకు సూపర్ సిక్స్ ప్రశ్నలు..
-
టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలు: మార్గాని భరత్
సాక్షి, రాజమండ్రి: రాజకీయాల కోసం చంద్రబాబు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలయ్యాయని తెలిపారు. సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్ నోటీసుల్లో మరోలా ఉందని పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం రాజమంత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలైలో రిపోర్టు వస్తే రెండు నెలల వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కేసులు ఎందుకు నమోదు చేయలేదని, అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘జులై 23న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నట్లు నివేదిక వచ్చిందన్న ఈవో.. సీఎంకు ఇచ్చన నివేదికలో మాత్రం జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చని ఎన్డీడీబీ అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. ఎన్డీడీబీ నుంచి రిపోర్టు తెప్పించిన తర్వాత సెకండ్ ఒపినియన్ ఎందుకు తీసుకోలేదు? ఎవరిని మీరు తప్పు దోవ పట్టిస్తున్నారు? ’ అని మండిపడ్డారు.చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
వీడియోల లీక్ గురించి వదిలేసి కిలాడీ లేడీ గురించి మాట్లాడతావా..
-
గుడ్లవల్లేరు ఘటన గురించి పట్టించుకోరా: భరత్
-
‘ఫైళ్ల దహనం పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త నాటకం’
తాడేపల్లి: ఫైళ్ల దహనం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. కూటమి రెండున్నర నెలల పాలనలోనే రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని.. హత్యలు, హత్యాయత్నాలు, దౌర్జన్యాలు, అల్లర్లు సర్వసాధారణం అయ్యాయని, వాటన్నింటినీ తమ పార్టీ ఢిల్లీ వేదికగా బట్టబయలు చేసిందని ఆయన వెల్లడించారు. దీంతో దిక్కు తోచని స్థితిలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఫైళ్ల దహనం పేరుతో రోజుకో ప్రహసనం చేస్తోందని ఆక్షేపించారు. వారిప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, నిజంగా అక్రమాలు జరిగి ఉంటే బయట పెట్టాలని మాజీ ఎంపీ సవాల్ చేశారు.మంత్రి నారా లోకేష్ ప్రకటించినట్లు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, మరోవైపు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా, ఇటీవల సీఎం చంద్రబాబు.. ఫైల్స్ దహనం నిందలు మొదలు పెట్టారని చెప్పారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. అలాగే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే, దాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆపాదించేందుకు ఎన్నో కుట్రలు చేశారని మార్గాని భరత్ చెప్పారు.ఆ ఘటన జరిగిన వెంటనే డీజీపీని, సీఐడీ చీఫ్‌ను హుటాహుటిన హెలికాప్టర్లో మదనపల్లెకి పంపి, ఆ ప్రమాదంపై ఏకంగా 10 దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయడమే కాకుండా, పలు జిల్లాల నుంచి డాక్ స్క్వాడ్లు, ఫోరెన్సిక్ బృందాలను రప్పించారని గుర్తు చేశారు. ఆ అగ్ని ప్రమాదం నిజంగా కుట్ర అయితే, ఇప్పటి వరకు సీఎం ఆ వివరాలు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు తప్పిదాలను అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా తేల్చిన నేపథ్యంలో, దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్తగా ధవళేశ్వరంలోని ఆఫీస్‌లో ఫైల్స్ దగ్ధం చేశారంటూ నానా హంగామా చేసి, నలుగురు అధికారులను సస్పెండ్ చేశారని ఆక్షేపించారు.విజయవాడ–అవనిగడ్డ కరకట్ట మీద ఏపీపీసీబీ, ఎండీసీ ముఖ్య ఫైళ్లను దగ్ధం చేశారని నిందిస్తూ, తమపై విపరీతంగా దుష్ప్రచారం చేశారని గుర్తు చేసిన, మార్గాని భరత్, ఆ ఘటనకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏం చెప్పారన్నది చూపారు. ఎన్నికల మందు విచ్చలవిడిగా ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో తెలియక, సీఎం చంద్రబాబు మొదలు మంత్రులంతా ఒకే పాట పాడుతున్నారని.. రాష్ట ఖజానా ఖాళీ అని, రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని అంటూ, గత మా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మాజీ ఎంపీ ఆక్షేపించారు. నిజానికి 2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కంటే గత వైఎస్సార్సీపీ హయాంలోనే రాష్ట్ర అప్పులు తక్కువని చెప్పారు.ఎప్పుడూ ప్రచార ఆర్భాటాన్ని కొనసాగించే చంద్రబాబు, ఈరోజు (సోమవారం) కూడా శ్రీసిటీలో అదే డ్రామా చేస్తున్నారని మాజీ ఎంపీ దుయ్యబట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గుర్తించాలని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా చేస్తున్న అసత్య ప్రచారాలు, హంగామా, ఆర్భాటాలను నమ్మొద్దని మార్గాని భరత్ విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు తప్పుడు వార్తలు పక్కా ఆధారాలతో బట్టబయలు
-
మెడికల్ కాలేజీలను నాశనం చేస్తున్న బాబు.. టీడీపీ సర్కార్ పై మార్గాని భరత్ ఫైర్
-
అతి తెలివితేటలు వద్దు.. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం
-
అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి: భరత్
-
ఇటువంటి మోసగాళ్లని ప్రజలు ఎలా నమ్మారు..!
-
‘చంద్రబాబు కన్నా డ్రామా చేసేవారే నయం’
సాక్షి, రాజమండ్రి: వరద బాధితులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘వరద బాధితులకు ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయటం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫొటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో పరిహారం, రేషన్, అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నీటి మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి. లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. .. వాలంటీర్లకు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇస్తానని చెప్పి వ్యవస్థనే నిర్మూలించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసేత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీలు ఎత్తెస్తాడేమో అనిపిస్తుంది. తల్లికి వందనం పథకానికి మంగళంపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కన్నా డ్రామాలాడే వాడే నయం. ప్రజలను దారుణంగా వంచిస్తున్నారు. సంపద సృష్టిస్తామన్నారు.. ఇప్పటివరకు ఏమి సృష్టించలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా ఎక్కడుంది. సహాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. .. ఇసుక కొండలు ఏమైపోయాయి. ఇసుక గుట్టలను స్థానిక ఎమ్మెల్యేలు మింగేశారు. నాలుగు రోజుల్లోనే బకాసురుల్ల మింగేశారు. స్థానిక ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే రూ. 10 కోట్లఇసుక మింగేశారు. ఉచిత ఇసుక ఎవరికిచ్చారు? రాజమండ్రి వ్యాప్తంగా సెటిల్మెంట్ బ్యాచ్‌లే నడిపిస్తున్నాయి. పేకాట క్లబ్ నడుపుకుంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాళ్లే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలి? జిల్లా పోలీసు అధికారులను పేకాట డబ్బులు నడుపుకుంటామని ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. ఇదెక్కడి ప్రభుత్వం. గతంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇసుక వల్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతి వ్యాపారి వద్దకు వెళ్లి కమిషన్ కట్టమని ఒత్తిడి తీసుకొస్తున్నారు’అని భరత్ అన్నారు. -
చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రధాని ముందు ఉంచుతాం..!
-
త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కృష్ణా: దేశ రాజధానిలో ఢిల్లీలో వైఎస్సార్సీపీ చేసిన ధర్నా విజయవంతమైంది. పలు జాతీయ పార్టీలు వైఎస్సార్సీపీకి సంఘీభావం తెలిపాయి. ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతోందా? అని పార్టీల నాయకులు ప్రశ్నించారు. ఇవాళ (గురువారం) ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వారికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భారత్ మీడియాతో మాట్లాడారు.‘‘ ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫొటోలు ప్రదర్శించి నిరసన తెలియజేసాం. ..ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తోపాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తాం’ అని అన్నారు.‘టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఇన్ని అరాచకాలు జరిగాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వైఎస్ జగన్ సారధ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయింది’ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. -
లోకేష్ రెడ్ బుక్ దాడులు..
-
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని.. ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. వినుకొండలో ఒక యువకుడిని హత్య చేసిన దుర్మార్గపు ప్రభుత్వమిది అంటూ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ మైనారిటీ యువకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అసలు విశాఖలో జైలుకెళ్లిన ప్రేమోన్మాది బయటికి వచ్చి బాధితురాలు తల్లిపై దాడి చేశాడు. జరుగుతున్న సంఘటనలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారా?. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు’’ అంటూ మార్గాని భరత్ నిలదీశారు.గడిచిన 40 రోజుల్లో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఎందుకు శ్వేత పత్రం రిలీజ్ చేయటం లేదు. జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వెంటనే స్పందించాలి. రాష్ట్రంలో హత్య రాజకీయాలు పెరిగిపోతున్నాయి. హింసా రాజకీయాల ప్రేరేపించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి’’ అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన దృష్ట్యా నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయలేకపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కూడా చంద్రబాబు.. హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరగాల్సిన న్యాయాన్ని ఎందుకు అడగలేకపోతున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ డిమాండ్ కాదా... ఎందుకు చంద్రబాబు డిమాండ్ చేయలేకపోతున్నారు. ఏపీకి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపండి.. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉంది’’ అని మార్గాని భరత్ పేర్కొన్నారు. -
రేవంత్ రెడ్డి, బాబు మీటింగ్ పై మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు
-
"దమ్ముంటే రా.." ఆదిరెడ్డి వాసుకి ఛాలెంజ్
-
కోవర్టు రాజకీయం ఆపండి.. టీడీపీ ఎమ్మెల్యేకు మార్గాని భరత్ సవాల్
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. తన ప్రచార వాహనం దగ్ధం కేసులో కుట్రలు చేసి నిందితుడిని కోవర్టుగా మారుస్తున్నారని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మార్గాని భరత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఈ కేసులో నిందితుడిని మా వద్దకు పంపి కోవర్టు ఆపరేషన్ చేశారు. నిందితుడు వైఎస్సార్సీపీ అని పోలీసులు ఎలా ఆపాదిస్తారు?. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. నిందితుడి బంధువులంతా టీడీపీకి చెందినవారే. ఈ ఘటనపై మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రమాణానికి సిద్దమా?.ప్రచార వాహనం దగ్ధంపై సమగ్ర విచారణ జరగాలి. సదరు వ్యక్తి మూడు గంటలు అక్కడే మద్యం తాగాడా?. ఎలా ఒక్కడే పెట్రోల్ తీసుకొచ్చి వాహనానికి నిప్పంటిస్తాడు. అతడికి మాపై అభిమానం ఉంటే మా ఆస్తిని ఎందుకు ధ్వంసం చేస్తారు. మోరంపూడి శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులు పూర్తిగా పరువు కోల్పోయారు. అందుకే నాపై ఈ ఘటనతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రిలో ఇప్పటివరకు ఇంతటి దుర్మార్గమైన పనులు ఎక్కడ జరగలేదు. -
నేనొక్కొన్నే వస్తా.. మార్గాని భరత్ ఓపెన్ ఛాలెంజ్
-
పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: పోలవరం ప్రాజెక్ట్‌లో జాప్యం జరగడానికి చంద్రబాబే కారణమన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అలాగే, పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ఇదే సమయంలో పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీపడండి.. గూండాగిరిలో టీడీపీతో పోటీ పడలేమని చురకలంటించారు.కాగా, మార్గాని భరత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ హయాంలో ఏం జరిగిందో.. వైఎస్సార్సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దాం రండి. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రానికే విడిచిపెట్టి ఉంటే ఈపాటికి పూర్తి అయ్యేది. గతంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం విషయంలో ఇష్టారీతిన పనులు చేసింది. ఒక క్రమ పద్దతిలో పనులు చేయకపోవడం వల్లే భారీ వరద వచ్చినప్పుడు డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతింది.స్పిల్ వే, స్పిల్ ఛానల్, హైడ్రాలిక్ గేట్స్, లోవర్, అప్పర్ డ్యామ్‌లు వైఎస్సార్సీపీ హయాంలోనే పూర్తి అయ్యాయి. కాపర్ డ్యామ్ జీవితకాలం మూడేళ్లు మాత్రమే.. ఇప్పుడు నూతన డయాఫ్రం వాల్ నిర్మిస్తారో లేదో స్పష్టంగా చెప్పాలి. జగనన్న అధికారంలోకి వచ్చాక పోలవరం సవరించిన అంచనాలు 55,000 కోట్ల రూపాయలకు ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఎకరం భూమి వెయ్యి రూపాయలు నామమాత్రపు లీజుకు తీసుకున్న మాట వాస్తవం కాదా?. మీ పార్టీ కార్యాలయాలు ఎప్పుడైనా కూలగొట్టే ప్రయత్నం చేశామా?. పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్‌లో భూమి తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్‌కు మార్చి వేశారు ఇది నిజం కాదా?. సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ-9 ప్రసారాలు నిలిపి వేయించి మీడియాపై జులుం చూపిస్తున్నారు. రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే శంకుస్థాపన చేశాం. పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అప్పటి శిలాఫలకాలు ధ్వంసం చేసి రెండోసారి శంకుస్థాపన చేయటం ఎంతవరకు సమంజసం?.పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీ పడండి. గుండాగిరిలో మీతో మేము పోటీ పడలేము. నా కార్యాలయం వద్ద ఉన్న వాహనం కాల్చివేతపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాజమండ్రి నగరాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు రెండోసారి శంకుస్థాపన చేయటం దారుణం. మా పార్టీ నేతల ఇళ్లపై దొమ్మీలకు పాల్పడుతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తన కారు దాడి ఎలా జరిగిందో లైవ్ లో చూపించిన భరత్
-
KSR Live Show: మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం
-
ప్రచార రథం కాల్చేయడంపై మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు
-
టీడీపీ నేతలపై మార్గాన్ని భారత్ ఫైర్
-
‘ఇది అధికార పార్టీ పనే’.. రాజమండ్రిలో అలజడిపై భరత్‌రామ్
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ నేత,మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి దహనం చేశారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్‌లోని ఆయన కార్యాలయం వద్ద ఈ వాహనాన్ని ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుం డగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మాజీ ఎంపీ భరత్ రామ్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆయనతో పాటు ప్రకాశం నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కడలి సత్యనారాయణ, బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో ఇటు వంటి విషసంస్కృతి గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తున్నారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి, నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని చెప్పారు. ఇటీవల మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం,ఇళ్ల పైకి దాడులు చేయడం, కోటిలింగాలపేటలో వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడిపై దాడి చేయడం వంటి దారుణాలకు ఒడిగట్టారనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు దర్యాప్తు చేయాలని, నిందితులపై, ఈ ఘటనకు ఉసిగొల్పిన వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. -
మార్గాని భరత్ ప్రచార రథానికి నిప్పు పెట్టిన పచ్చ మూకలు
-
చంద్రబాబుకు మార్గని భరత్ స్ట్రాంగ్ కౌంటర్
-
వైఎస్సార్సీపీ భవనం కూల్చివేతపై.. మార్గాని భరత్
-
ఎన్నికల ఫలితాలపై మార్గాని భరత్ షాకింగ్ రియాక్షన్..
-
మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారు
-
రాజమండ్రిలో పచ్చమూకల రచ్చ.. టీడీపీపై మార్గాని భరత్ రామ్ ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని ఆ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలాకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారని ధ్వజమెత్తారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతోమంది నాయకులు ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. రాజమండ్రిలో మోరంపూడి శిలా ఫలాకాన్ని టీడీపీ నేతలు కూల్చేసినా ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడటం దారుణం. శిలాఫలకం కూల్చేసి క్రమశిక్షణకు మారుపేరని చెప్పటం ఎంతవరకు కరెక్ట్. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు.. రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూకలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు. దానిని మాత్రమే ప్రతిఘటించాం’’ అని మార్గాని పేర్కొన్నారు.‘‘అమరావతిలో కూల్చేసిన ప్రజావేదిక ఎన్జీటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. ఉండ్రాజవరం, జొన్నాడ కైకలూరు, తేతలి నాలుగు ఫ్లై ఓవర్లు మంజూరు చేసిన జీవో కాపీలు కూడా చూపించాం. నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు 2020లోనే మంజూరు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చాలా బాధ్యత ఉంది. తమకు ఇంకా మంచి చేస్తారని ప్రజలు భావించి వారికి విజయాన్ని కట్టబెట్టారు. ఇచ్చిన హామీలు ఎంతమేర నిలబెట్టుకుంటారో చూద్దాం’’ అని మార్గాని భరత్ అన్నారు. -
టీడీపీ దాడులపై మార్గని భరత్ కామెంట్స్
-
టీడీపీ మేనిఫెస్టోపై భరత్ సెటైర్లు..
-
రాజమండ్రి సెంట్రల్ జైలు నీకోసం వెయిటింగ్: ఎంపీ భరత్
-
భారీ ర్యాలీతో మార్గాన్ని భరత్ నామినేషన్
-
సీఎం జగన్ ను ప్రజలు సొంత కొడుకులా ఆదరిస్తున్నారు
-
రాజమండ్రిలో సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే
-
సీఎం జగన్ దాడిపై మార్గాని భరత్ స్ట్రాంగ్ రియాక్షన్
-
చంద్రబాబు మాస్టర్ ప్లాన్...పురందేశ్వరి ఓటమి ఖాయం
-
వంగా గీత పై ఓడిపోతా అని భయం పట్టుకుంది పవన్ కి..!
-
లిస్టులో నా పేరు చూడగానే.. మార్గాని ఫస్ట్ రియాక్షన్
-
చంద్రబాబు మాస్టర్ ప్లాన్..పిఠాపురంలో పవన్ ఓటమి పక్కా..
-
ఒకే రోజు 25,000 ఇళ్ల పట్టాలు..
-
ప్రధాని మోదీని వ్యక్తిగతంగా విమర్శించింది చంద్రబాబే
-
‘2014లో పొత్తులతో గెలిచిన బాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?’
సాక్షి, తాడేపల్లి: యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారని అంటే.. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా? అని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు ఎలా చదువుకోవాలి?. పిల్లల చదువులతో ప్రభుత్వానికి పనిలేదా? అని మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘బాబు వస్తేనే జాబు వస్తుందన అప్పట్లో ప్రచారం చేసి, చివరికి ఆయన కొడుక్కి మాత్రమే పదవులు ఇచ్చుకున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిలువునా మోసం చేశారు. ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనని చెప్పుకున్నారు. మరి ప్రత్యేకహీదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ఎందుకు అనలేదు?. చంద్రబాబు చేసిన ధర్మపోరాటాల దీక్షలు ఏం అయ్యాయి?. టీటీడీ డబ్బులతో ఢిల్లీలో సభలు పెట్టి ఏం సాధించారు?. పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బీజేపీతో కలిశారో కూడా చెప్పాలి. ...అసలు బ్యాంకు లోన్ అనే పదం చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది?. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం మోసానికి గురవ్వని వర్గం లేదు. 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?. నిలువునా రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా?. సీఎం జగన్ కేంద్రంతో పొత్తు లేకపోయినా ఏపీకి ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కనపడటం లేదా?. సీఎం జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు కనపడటం లేదా?’ అని మార్గాని భరత్ అన్నారు. -
చంద్రబాబు బీసీ ద్రోహి
-
ఇప్పటివరకు బీసీలకు బాబు ఏం చేసాడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా..?
-
‘బీసీ డిక్లరేషన్.. చంద్రబాబు మరో కొత్త డ్రామా’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని ధ్వజమెత్తారు. బీసీలకు వైఎస్సార్సీపీ చేసిన న్యాయం మీరు ఎప్పటికీ ఇవ్వలేరు. బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబు అనర్హుడు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూసే వ్యక్తి చంద్రబాబు. ఇదే చంద్రబాబు.. ఒకటి కాదు రెండు కాదు 14 ఏళ్లు రాష్ట్రాలు పాలించాడు అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా? ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడు. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. చంద్రబాబుతో బీసీలకు సంబంధించి పలు డిబేట్లకు రెడీగా ఉన్నానంటూ మార్గని భరత్ సవాల్ విసిరారు. ‘‘బీసీలకు సీఎం జగన్ 75 వేల కోట్లు ఇచ్చారు. నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడింది. అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. బీసీల డీఎన్ఏ టీడీపీ అని చెప్పే చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు కనీసం నువ్వు ఆ సాహసం చేసావా? చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేము ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా.. మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఇదీ చదవండి: వాళ్లని అవినీతికి వాడుకుని వదిలేసిన బాబు -
టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్
-
యాత్ర 2 ఒక అద్భుతమైన ఘట్టం
-
మీ అబ్బాయిని పంపించండి ... చంద్రబాబుకు మార్గాన్ని భరత్ ఛాలెంజ్
-
నీకు దమ్ముంటే లోకేష్‌ను నాపై పోటీకి దింపు
రాజమహేంద్రవరం రూరల్: స్కీవవముల పేరుతో భారీ స్కాములు చేసి అడ్డంగా దొరికిపోయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబుకు తనను విమర్శించే అర్హత లేదని ఎంపీ, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ మార్గాని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. కాతేరు సభలో చంద్రబాబు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించగలరా అని సవాల్ విసరారు. సోమవారం రాత్రి ఎంపీ భరత్‌రామ్ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. తాను నీతిగా, నిజాయితీగా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, చంద్రబాబు, టీడీపీ నాయకుల్లా రాజకీయాలను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడానికి కాదని అన్నారు. రాజమహేంద్రవరంలో మీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వడ్డీ వ్యాపారాలు, చీట్ల వ్యాపారాలు చేసి అడ్డంగా దొరికి, సెంట్రల్ జైలులో ఉండి వచ్చారని అన్నారు. ‘ఆవ భూముల్లో నాకు రూ.150 కోట్లు ఎవరిచ్చారు? దానిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని చాలెంజ్ విసిరారు. ‘వైఎస్సార్ ఆసరా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని 80 లక్షల మంది మహిళలకు రూ.25 వేల కోట్లు ఇచ్చారు, నువ్వు ఇవ్వగలవా?’ అని ప్రశ్నించారు. దమ్ముంటే తనపై చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను పోటీకి దింపాలని సవాల్ విసిరారు. మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు అంటున్నారని, ఆ స్కీమ్ జన్మభూమి కమిటీలకు, టీడీపీ కార్యకర్తలకు తప్పిస్తే రాష్ట్రంలోని అర్హులైన వారికి కాదనే సంగతి అందరికీ తెలుసునని అన్నారు. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్సైడర్ ట్రేడింగ్, పోలవరం ప్రాజెక్టు నిధుల స్వాహా.. ఇలా ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబుకు తనను విమర్శించే అర్హత లేదని అన్నారు. రాజమహేంద్రవరాన్ని రెండున్నరేళ్లలో ఎలా అభివృద్ధి చేశానో చూడాలని హితవు పలికారు. -
పవన్, షర్మిలకు ఎంపీ భరత్ స్ట్రాంగ్ కౌంటర్
-
లోకేష్ భవిష్యత్తుకు గ్యారెంటీ కోసమే చంద్రబాబు కుట్ర: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: సెంట్రల్ జైల్ నుంచి షూరిటీపై. బయటకొచ్చిన చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్. బుధవారం ఆయన మీడియా మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన మేనిఫెస్టో అమలుకు లక్ష కోట్ల రూపాయలు అవసరం.. సంపద ఎలా సృష్టిస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కొడుకు భవిష్యత్తుకు గ్యారెంటీ కోసమే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మార్గాని భరత్ ధ్వజమెత్తారు. 2014లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన ఎంపీ.. మేనిఫెస్టోను టీడీపీ వెబ్ సైట్ నుంచి తొలగించారంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబే అవినీతి తిమింగలం అని మరోసారి నిగ్గు తేలింది. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్న షర్మిళ మరోసారి ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్ర విభజనలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయింపుల్లో కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మార్గాని భరత్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: దళితులకిచ్చే గౌరవం ఇదేనా బాబూ? -
గుర్తింపులేని పార్టీకి మళ్ళీ గ్లాస్ సింబల్ ఎలా ఇస్తారు
-
రాజమహేంద్రవరం ప్రజలకు ఎంపీ మార్గాన్ని భారత్ తీపి కబురు..
-
పవన్ కళ్యాణ్, లోకేష్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలుసా..
-
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: ఎంపీ భరత్
-
‘మీకు 2 ఎకరాల నుంచి లక్షల కోట్లు ఎలా వచ్చాయ్’
సాక్షి, ఏలూరు: తమ సొమ్ము దోచుకున్నాడు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు నీతిమంతుడు, ఎవరి సొమ్ము తినలేదని దుర్గమ్మదగ్గర భువనేశ్వరి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు మంత్రి కారుమూరి అసలు 2 ఎకరాల నుంచి లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చాయ్ అని ప్రశ్నించారు. సైకిల్ ఎక్కి సవారికి అద్దె కొడుకును తెచ్చుకున్నారు మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని లాగేసుకున్న చంద్రబాబు సైకిల్ ఎక్కాడని, ఇప్పుడు దానిపై సవారీకి అద్దె కొడుకును తెచ్చుకున్నాడని ఎంపీ కోటగరి శ్రీధర్ మండిపడ్డారు. ఏపీలో పేదల ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ వైఎస్సార్సీపీనని, రాష్ట్రంలో పేదవారు, బలహీన వర్గాల వారు ఉండకూడదంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలన్నారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా లోకేష్ పైకి లేవడు చంద్రబాబుకు సొంత కొడుకు పని చేయడం లేదని ఎద్దేవా చేశారు ఎంపీ భరత్. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్న ఎంపీ భరత్.. లోకేష్‌ను ఎన్ని జాకీలు పెట్టి లేపినా పైకి లేవడన్నారు. పవన్.. నేడు, రేపు మాట్లాడే మాటలకు పొంతన ఉండదన్నారు ఎంపీ భరత్. బాబు పింఛన్ రూ. 5 వేలు ఇస్తానంటాడు.. అది ఇచ్చేది వారి కార్యకర్తలకేనని విమర్శించారు. ఏపీలో మరో 30 ఏళ్లు వైఎస్‌జగనే సీఎం అని స్పష్టం చేశారు భరత్. వై నాట్ 175 నినాదం సీఎం జగన్ ఆత్మవిశ్వాసానికి నిదర్శమన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి దేశంలో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయన్నారు మంత్రి విశ్వరూప్. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఏపీలాగే పింఛన్ పెంచుకుంటూ పోతామనే విషయమే ఇందుకు నిదర్శనమన్నారు. 6 నెల్లలోనే లక్షా 40 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌దన్నారు మంత్రి విశ్వరూప్. పేదలకు పింఛన్ పెంచలేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. -
కర్మ సిద్ధాంతం... పుష్కరాల్లో 27 మందిని పొట్టన పెట్టుకున్నాడు.. అదే చోట జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు
-
ఇస్రో సేవలు అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇస్రో అద్భుతమైన సేవలందిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్‌రామ్ కొనియాడారు. అంతరిక్ష రంగంలో మహిళల ప్రమేయం పెరిగేలా ప్రోత్సహించాల ని కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో గురువారం చంద్రయాన్–3 విజయంపై జరిగిన చర్చలో ఎంపీలు ఇరువురూ మాట్లాడారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప పరిశోధనలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరగటం తెలుగువారికి గర్వకారణమన్నారు. చంద్రయాన్ ప్రయోగంలో భాగస్వాములైన మెజారిటీ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి రావ డం గొప్ప విషయమని చెప్పారు. యూనివర్సిటీలకు రాష్ట్రీయ య ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా)కింద గత నాలుగైదు సంవత్సరాలుగా ఏటా రూ.8,120 కోట్ల నిధులు కేటాయిస్తున్నా వినియోగం 60 శాతం కూడా ఉండటంలేదని వివరించారు. వర్సిటీలు ఈ నిధులు వాడుకునేలా వెసులుబాటు కల్పించాల్సి ఉందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మెరుగుపరచాల్సిఉందని సూచించారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడా రు. దేశమంతా చంద్రయాన్–3 విజయాన్ని కొనియాడుతుంటే టీడీపీ మాత్రం మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతోందని ఎద్దే వా చేశారు. రూ.3,300 కోట్ల కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారన్నారు. చంద్రబాబు చేసిన ఇతర కుంభకోణాలు సైతం త్వరలో బయటపడతాయన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండయినప్పుడు తన ఆరేళ్ల కుమార్తె ‘నాన్నా చంద్రుడి మీద అడుగుపెట్టాం’ అంటూ ఎంతో సంబరపడిందని, ‘మనం ఎప్పుడు చంద్రుడి మీద కు వెళ్తాం అమ్మా?’ అని తన తల్లిని అడగడం తనని ఎంతో సంతోషానికి గురిచేసిందన్నారు. చంద్రయాన్–3 విజయంపై ఇస్రో బృందం, ప్రధాని నరేంద్రమోదీకి భరత్ కృతజ్ఞతలు తెలిపారు. -
బాబు రాష్ట్రం పరువు తీశారు
సాక్షి న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీల పేరుతో అవినీతికి పాల్పడి చంద్రబాబు రాష్ట్ర పరువు తీశారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. సాంకేతిక అంశాల ఆధారంగా బాబు తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. ఢిల్లీలో ఆదివారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు కేసులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని సమావేశంలో కోరామని.. జనగణనలో కులగణన చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీలన్నీ అమలుచేయాలని కూడా డిమాండ్ చేశామని, ప్రత్యేక హోదా, పోలవరం నిధుల్ని ఇవ్వాలని కోరామని భరత్ చెప్పారు. టీడీపీకి వైఎస్సార్సీపీ ఎంపీల చెక్ ఇక చంద్రబాబు అరెస్టుపై సానుభూతి పొందేందుకు అఖిలపక్ష సమావేశాన్ని వేదికగా మార్చుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ తిప్పికొట్టారు. చంద్రబాబు ఒక క్రిమినల్ అని, అవినీతికి పాల్పడ్డారని.. కుట్రకు ప్రధాన సూత్రధారి, లబి్ధదారు ఆయనేనని వారు తెలిపారు. అందుకే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా ఇతర కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల నేతల సమక్షంలోనే విజయసాయిరెడ్డి కుంభకోణం గురించి వివరించారు. ఈ సమయంలో.. జి–20 సమావేశాల సమయంలో చంద్రబాబును అరెస్టుచేయడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని టీడీపీ నేతలు అంటుండగా.. ఆ సమావేశాలు జరుగుతున్నాయని 420లను వదిలేయాలా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. -
చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకుల కామెంట్స్
-
రాజమండ్రి జైలులో అత్యంత భద్రత ఉంది
-
‘టీడీపీ బంద్ అన్నారు.. హెరిటేజ్ కూడా మూసివేయలేదు’
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. కానీ, బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీంతో, టీడీపీ బంద్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందిస్తూ సెటైరికల్ పంచ్ వేశారు. కనీసం, చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూయలేదని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ కూడా మూయలేదు.. కాగా, మంత్రి కారుమూరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ బంద్ గురించి కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలు ఎవరి పనులు వారు చేసుకున్నారు. అచ్చెన్నాయుడు ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సంస్థ హెరిటేజ్ కూడా మూయలేదు. ఎవరూ కనీస సానుభూతి కూడా చూపించలేదు. చంద్రబాబు అవినీతిపరుడు కాదు అని నారా లోకేశ్ కూడా చెప్పలేడు. ఎన్టీఆర్ కుటుంబం కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎందకు చెప్పలేరు. అలాంటి అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు. స్టేలు తెచ్చుకోవడమే బాబు, లోకేశ్‌కు తెలుసు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చాకే అనేక సంక్షేమ పథకాలతో పేదలకు మేలు చేస్తున్నారు. సీఎం జగన్ హయాంలో ఏపీలో పేదరికం బాగా తగ్గింది. చంద్రబాబు అవినీతిపరుడని ప్రధాని మోదీ సైతం చెప్పారు. దాచుకో, దోచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన సాగింది. చంద్రబాబు, నారా లోకేశ్‌ల అవినీతి మీద కేసులు వేస్తే వారు స్టేలు తెచ్చుకున్నారు. వీటిని విచారణకు సహకరించి.. వారు ప్రజల వద్దకు రావాలని సూచించారు. స్కిల్ స్కాం జరిగినట్టు ఎల్లో బ్యాచ్ ఒప్పుకుంటోంది! మరోవైపు.. చంద్రబాబు స్కిల్ స్కాంపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కూడా స్పందించారు. రాజమండ్రితో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో అవినీతి జరగలేదని టీడీపీ నాయకులు ఎందుకు చెప్పడం లేదు. స్కిల్ కుంభకోణంలో లేమనే చెబుతున్నారు కానీ.. స్కాం జరిగిందని టీడీపీ నేతలు చెప్పుకోవడం లేదు. పోలవరం, అమరావతి స్కామ్‌లు.. ఏపీలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అత్యంత సెక్యూరిటీ ఉంది. చంద్రబాబుకు వీవీఐపీ కంటే అత్యంత సెక్యూరిటీ కల్పించామని జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే నివేదిక ఇచ్చారు. చంద్రబాబుకు హౌస్ కస్టడీ దేనికి. ఇవన్నీ జైలు నుంచి బయటకు వచ్చేందుకే చేసే ప్రయత్నాలు మాత్రమే. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించడం సరికాదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జీఎస్టీ ఇచ్చిన నోటీసు వల్ల బయటపడింది. స్కిల్ స్కామ్ మాత్రమే కాదు.. పోలవరం, అమరావతి భూముల స్కాములు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చంద్రబాబుకు కావాల్సిన ప్రతీ సౌకర్యాన్ని కల్పించింది. పవన్ చీకటి ఒప్పందం.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌కు చీకటి ఒప్పందం ఉంది. అది ప్యాకేజీ ఒప్పందం. టీడీపీ నేతలు ఏపీలో బంద్ పేరు చెప్పి షాపులను మూసివేయాలని బ్రతిమాలుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ కరెక్ట్ కావడం వల్లనే ప్రజలు అంగీకరించారు. బంద్‌ను తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
పెద్దమనిషి ముసుగులో ఉన్న గజ దొంగ చంద్రబాబు..
-
చంద్రబాబు స్కాం స్టార్: ఎంపీ మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: స్కాం స్టార్‌గా చంద్రబాబు మారిపోయారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగాల పేరుతో యువతని దగా చేశారని, వారి పేరుతో రూ.372 కోట్లు దోచేశారని ఆయన మండిపడ్డారు. సీమెన్స్‌తో ఒప్పందం అని చెప్పి, అనేక షెల్ కంపెనీల పేర్లతో డబ్బును మళ్లించారు. సత్యహరిశ్చంద్రుని తర్వాత నేనే అని చెప్పుకునే చంద్రబాబు భారీ స్కాంలకు పాల్పడ్డారు. అవినీతికి పాల్పడితే రోడ్డుపై ఉరి తీయమన్న చంద్రబాబు.. ఇప్పుడు ఏం మాట్లాడతారు?. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతని కూడా మోసం చేశారు. ఇలాంటి మోసాలు చేసే వ్యక్తి సింహాసనం మీద ఎలా కూర్చుంటారు?’’ అని ఎంపీ మార్గాని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. పోలవరాన్ని ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ మీద కాంట్రాక్టు ఇచ్చారు. ఫలితంగా వందల కోట్లు ముడుపుల రూపంలో దోచుకున్నారు. స్కిల్ కేసులో ఇప్పటికే షెల్ కంపెనీల ఓనర్లంతా చంద్రబాబుకే డబ్బు చెల్లించినట్టు చెప్పారు. ఇక చంద్రబాబుకు నూకలు చెల్లాయి. విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి భారీగా స్కాంలు చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో స్కాం చేశారు. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితులు పారిపోయారు. ఇంటర్ పోల్ సహాయంతో వారిని కూడా అరెస్టు చేస్తాం. రాత్రికి రాత్రే చంద్రబాబు పరార్ కావాలని చూశారు. సీఐడీ వాళ్లు చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేశారు’’ అని మార్గాని భరత్ పేర్కొన్నారు. చదవండి: ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బాబుగారి ప్లాన్! ‘‘స్కిల్ స్కాంలో వచ్చిన ముడుపుల్లో పవవ్కి కూడా వాటాలు అందే ఉంటాయి. అందుకే చంద్రబాబు మీద తెగ ప్రేమ చూపుతున్నారు. అమరావతి కేసులు, ఫైబర్ నెట్ కేసులో కూడా విచారణ త్వరగా చేయాలి. స్కాంలు చేసిన వారిని చూస్తూ ఊరుకోవాలా?. చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీ వారు బలవంతంగా షాపులు మూయిస్తున్నారు. షాపు ఓనర్లను చెంపమీద కొడుతూ షాపులు మూయించటం సోషల్ మీడియాలో చూశాం. ఇలాంటి రౌడీయిజం చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. లోకేష్ పాత్ర ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారు. చట్టానికి ఎవరూ అతీతం కాదు’’ అని ఎంపీ మార్గాని భరత్ తేల్చి చెప్పారు. -
నైపుణ్యం పేరుతో యువతను చంద్రబాబు దగా చేశారు: ఎంపీ భరత్
-
‘రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’
సాక్షి, అమరావతి: డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి మాటలు ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. సనాతన ధర్మంపై విమర్శలు చేయడం ధర్మంకాదని హితవు పలికారు. కాగా, మంత్రి కొట్టు సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేశ్‌ను అరెస్ట్ చేస్తేనే ఏపీలో శాంతి భద్రతలు నెలకొంటాయి. చంద్రబాబు అవినీతి అనకొండ. చంద్రబాబు అవినీతి రూ.118కోట్లు మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉంది. చంద్రబాబు అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ జోక్యం చేసుకోవాలి. అమరావతి ముసుగులో చంద్రబాబు రూ.వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు. ఐటీ నోటీసులతో కేవలం ఆవగింజ అంత బయటపడింది. ఇంకా సింగపూర్ ఈశ్వరన్‌తో కలిసి పనిచేసిన అవినీతి దందా బయటపడుతుంది. చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయం. లోకేశ్ ఘనకార్యంతో పడిపోయిన టీడీపీ గ్రాఫ్.. రెండు వేల మంది గూండాలతో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ మరింత దిగజారిపోయింది అని సెటైర్లు వేశారు. తండ్రి బ్రోకర్.. కొడుక జోకర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఇప్పుడు తేలిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ ఉద్యమాలు చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు పొలిటికల్ స్కామ్ స్టార్.. మరోవైపు.. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎపం మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబు పొలిటికల్ స్కామ్ స్టార్. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. రాజధాని అంటున్న అమరావతిలో 3వేలు ఖర్చు అయ్యే నిర్మాణాలకు 15వేలు ఎలా ఖర్చు పెట్టారో చంద్రబాబు చెప్పాలి. కోట్ల రూపాయలను టన్ను ఐరన్‌తో కోడ్ లాంగ్వేజ్‌లో చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి. ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి 18స్టేలు తీసుకుని చంద్రబాబు తిరుగుతున్నాడు. చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలి. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్ -
నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ఎంపీ మార్గాని భరత్ కామెంట్స్
-
నోటీసులపై నోరు విప్పు
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. విజనరీగా చెప్పుకునే ఆయన పొలిటికల్ స్కామ్‌స్టర్ అని ధ్వజమెత్తారు. కమీషన్లుగా దండుకున్న రూ.118.98 కోట్లపై నోరు మెదపకుండా నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమార్జనలో ఇది చిన్న భాగం మాత్రమేనని, క్షుణ్నంగా విచారిస్తే భారీ కుంభకోణాలు బహిర్గతం కావడం ఖాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కుంభకోణాలను అప్పట్లోనే తెహల్కా బయటపెట్టింది. అక్రమార్జనపై 17 కేసుల్లో చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నారు. ఢిల్లీలో రూ.700–రూ.800 కోట్లతో అత్యద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని కేంద్రం నిర్మిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.500 – రూ.600 కోట్లతో సచివాలయ భవనాన్ని నిర్మించింది. ఏసీ, ఇంటీరియర్స్ సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేల నుంచి రూ.మూడు వేలు వ్యయం అవుతుంది. చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ.13 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు పెట్టి రేకుల షెడ్డు లాంటి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి చదరపు అడుగుకు రూ.పది వేలకుపైగా ముడుపులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరాయి. పోలవరంలో వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను చంద్రబాబు చేపట్టారు. దీంతో 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలు ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడ్డాయి. వాటిని యధాస్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత నష్టానికి కారకుడు చంద్రబాబే. ఈ పాపానికి చంద్రబాబు పాల్పడకుంటే పోలవరం ఈ పాటికి ఎప్పుడో పూర్తయ్యేది. చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్టంలో 2014–19 మధ్య పేదరికం 11.66 శాతం ఉండగా, సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల 6 శాతానికి తగ్గింది. -
‘చంద్రబాబు కొడుకు, బ్రహ్మణి భర్త తప్ప లోకేశ్ అర్హత ఏంటి’
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముద్దపప్పు లోకేశ్.. బ్రహ్మణి భర్తగా, బాలకృష్ణ అల్లుడిగా, చంద్రబాబు కొడుకుగా తప్ప తన కంటూ ఏవిధమైన ప్రత్యేక అర్హత లేని వ్యక్తి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎంపీ భరత్ సోమవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ‘ట్రాక్టర్లు కొనుగోలు చేయడం వల్ల సంవత్సరానికి కోటి రూపాయలు అద్దె రూపంలో ప్రైవేటు వాహనదారులకు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ఇదే క్రమంలో నారా లోకేశ్‌పై పొలిటికల్ సెటైర్లు వేశారు. ఎలాంటి అర్హతలు లేని వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడటం విడ్డూరం. అర్ధరాత్రి పాదయాత్ర చేసే వ్యక్తి లోకేశ్.. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని నారా లోకేశ్.. సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. లోకేశ్.. అర్ధరాత్రి పాదయాత్ర చేసే వ్యక్తి. ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకుడు పగటిపూట పాదయాత్ర చేస్తారు. లోకేశ్ తెల్లవారుజామున పాదయాత్ర చేయడం హాస్యాస్పదం అంటూ కామెంట్స్ చేశారు. ఆ డబ్బంతా ఏమైందో ఆలోచించండి.. మరోవైపు.. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఆంధ్ర రాష్ట్రం చదువుల్లో 15వ స్థానంలో ఉండేది. నేడు ఆంధ్ర రాష్ట్రం విద్యా వ్యవస్థలో 3వ స్థానంలోకి తీసుకొచ్చారు సీఎం జగన్. పప్పు లోకేష్ పాదయాత్రలో యువకుల్ని గొడవలు పడండి, కేసులు పెట్టించుకోండి అంటున్నాడు. మీ పిల్లలు గొప్పగా ఉన్నత స్థితిలో ఉండాలని సీఎం జగన్ కోరుకొంటున్నారు. ముఖ్యమంత్రి పారదర్శక పాలన గురించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ తెలుసుకుని వెళ్తున్నారు. ఇన్ని పథకాల ద్వారా సీఎం జగన్ మీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు కదా.. మరి గతంలో ఈ డబ్బంతా ఏమైపోయిందో ఆలోచించండి’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ఏబీఎన్ రాధాకృష్ణను కమ్మేసిన చంద్ర మాయ -
చంద్రబాబు ఒక పెద్ద కాపీ క్యాట్: ఎంపీ మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ఒక పెద్ద కాపీ క్యాట్.. వైఎస్సార్సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాపీ చేయడమే బాబు పని అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదన్నారు. ‘‘పబ్లిసిటీ కోసమే చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం. రైతులను ఏరోజైనా చంద్రబాబు పట్టించుకున్నారా?’’ అని మార్గాని భరత్ దుయ్యబట్టారు. చంద్రబాబు చేసేది పబ్లిసిటీ స్టంట్: మంత్రి వేణు చంద్రబాబు చేసేది పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని మంత్రి మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రైతులను మభ్య పెట్టేందుకే చంద్రబాబు రచ్చబండ. రైతులకు చేసిన మేలు ఏమైనా ఉందా?’’ అంటూ మంత్రి వేణు మండిపడ్డారు. చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్ -
‘కానిస్టేబుల్ కొడుకువే కదా.. పోలీసులు గాయపడితే ఎందుకు మాట్లాడలేదు పవన్’
సాక్షి, తాడేపల్లి: పుంగనూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. బందిపోటు ముఠా మాదిరిగా చంద్రబాబు వ్యవహరించారని ఫైరయ్యారు. ఎన్నికల్లో ఏం చెప్పాల్లో తెలియక ఇలా అలజడులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కారుమూరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించారు. ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని రప్పించి వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం చంద్రబాబు ఎందుకు వెళ్లలేదు?. బ్లాక్ క్యాట్ కమాండోలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఏం చెప్పాలో తెలియకే ఇలా అలజడులు సృష్టిస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం గూండాలను అక్కడికి రప్పించారు. పెద్దిరెడ్డి హీరో.. వైఎస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్క హీరో. కుప్పంలో చంద్రబాబునే కుప్పకూల్చి కింద కూర్చోబెట్టారు. స్థానిక సంస్థల్లో అన్ని స్థానాల్లో ఓడించారనే ఈర్ష్యతోనే పెద్దిరెడ్డిపై చంద్రబాబు కుట్ర పన్నారు. చంద్రబాబు వ్యవహారంపై విచారణ జరపాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని ఓర్వలేకనే చంద్రబాబు గొడవలు సృష్టించి లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నారు. పవన్ ఎందుకు స్పందించలేదు? తాను కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకునే పవన్ కల్యాణ్.. నిన్న అంతమంది పోలీసులు గాయపడితే ఎందుకు మాట్లాడలేదు?. దత్త తండ్రి గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నావ్?. పిల్లల్ని రెచ్చగొట్టి గొడవలు చేయినే వారి భవిష్యత్ ఏంటి?. వారి కుటుంబాల గురించి ఆలోచించరా?. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవులు ఇస్తామని లోకేశ్ అంటున్నారు. యువత భవిష్యత్‌ను నాశనం చేయాలనుకుంటున్నారా?. జడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉండి జనాన్ని రెచ్చగొట్టడమేంటి?. నిన్నటి రోజు బ్లాక్ డే. ఏం సాధించారని గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇస్తారు?. గవర్నర్‌కు అన్ని వాస్తవాలు తెలుసు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లపై విచారణ జరపాలి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధశ్వేరి వాస్తవాలను మభ్యపెట్టి మాట్లాడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబువి పాతతరం పాలిటిక్స్: ఎంపీ భరత్ పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడులు చేయించడం అమానుషమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు తగిన గుణాపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎంపీ భరత్ శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ శ్రేణులు ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడులు చేసినట్టు కనిపిస్తోంది. అనుమతి ఉంటే వారిని పోలీసులు ఎక్కడా ఆపరు. యువతను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు భావించారు. చంద్రబాబువి పాతతరం రాజకీయాలు. ఆయన చిప్ అప్డేట్ కావాలి. తనను తాను రాజ్యాంగేతర శక్తిగా చంద్రబాబు భావిస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు భాష బాగాలేదు సాక్షి, ఢిల్లీ: పుంగనూరు ఘటనలో బాధ్యులను శిక్షించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. కాగా, శ్రీనివాస రావు శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భాష బాగాలేదు. పుంగనూరు దాడి ఘటనలో బాధ్యులను శిక్షించాలి. బీజేపీ తరఫున జనసేన ఏజెంట్‌గా పనిచేస్తోంది. బీజేపీ, టీడీపీ కలిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. పోలవరంపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: ‘పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటే..’ -
ఇదంతా రామోజీ కథలో భాగమే: ఎంపీ భరత్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ మార్గాని భరత్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్, రామోజీరావు కలిసి ఒక కృత్రిమ ఉద్యమం నడుపుతున్నారు. రైతులు, మహిళలకు వ్యతిరేకంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఈ కుట్రకు రామోజీ కథ రచిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎంపీ భరత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దత్తపుత్రుడు పవన్ మాట్లాడే మాటలు ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తున్నాయి?. పేదలంతా ముక్కున వేలేసుకుని చూస్తున్నారు. వాలంటీర్లు.. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారు. అలాంటి వాలంటీర్లపై పవన్ అక్కసు కక్కుతున్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ఎంత అరాచకం చేశాయో గుర్తు లేదా?. పచ్చ కండువా వేసుకున్న వారికే అప్పట్లో పనులు చేశారు. కానీ, వాలంటీర్లు అందరికీ న్యాయం చేస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పని చేశారు. ఇప్పుడు వాలంటీర్లు ఎక్కడైనా లంచాలు తీసుకుంటున్నారా?. ఇదో కృత్రిమ ఉద్యమం.. నిఘా వర్గాలు పవన్‌కు ఏ సమాచారమైనా ఎందుకు ఇస్తాయి?. చంద్రబాబు, పవన్, రామోజీ కలిసి ఒక కృత్రిమ ఉద్యమం నడుపుతున్నారు. రైతులు, మహిళలకు వ్యతిరేకంగా పవన్ వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికీ అందుతుంటే పవన్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ కుట్రకు కథ రామోజీరావు రచిస్తున్నారు. చంద్రబాబు దర్శకత్వం వహిస్తుంటే పవన్ నటిస్తున్నారు. దోచుకోవాలనే వారి ప్లాన్ కుదరటం లేదని వారు బాధ పడుతున్నారు. వాలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే ఉన్నారు. పవన్ గురించి రేణూ దేశాయ్ ఏమన్నారో గుర్తులేదా.. వాలంటీర్ల ద్వారా ప్రజలంతా బాగుపడుతుంటే దుష్ట చతుష్టయానికి కడుపు మండుతోంది. వాలంటీర్లు ఉంటే చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేడని వారికి అర్థమైంది. అందుకే వారిపై పథకం ప్రకారం విషం చిమ్ముతున్నారు. 2014లో చంద్రబాబు హామీలకు తాను అండగా ఉంటానని చెప్పి అప్పుడు పవన్ ఎందుకు నోరు మెదపలేదు?. రేణూదేశాయ్ స్వయంగా పవన్ గురించి ఏం మాట్లాడారో అందరికీ గుర్తుంది. ఒకరిని పెళ్ళి చేసుకుని, ఇంకొకరితో సహజీవనం చేస్తే ఎలా ఉంటుందో రేణూదేశాయే చెప్పారు. కడుపుశోకం ఎలా ఉంటుందో తెలుసా అని ఆమెనే అన్నారు. వాలంటీర్లపై రెండు రోజుల్లో పవన్ మాట మార్చారు. రాజధానిలో ఇల్లు ఇస్తామంటే అడ్డుకుంటుంటే పవన్ ఎందుకు మాట్లాడరు?. వాలంటీర్లను మద్యం సీసాలతో పోల్చుతారా?. అంత అహంకారం ఏంటి పవన్?. పవన్ దత్తతండ్రి చంద్రబాబు ఇచ్చిన హామీలకు బడ్జెట్ వేస్తే దేశ బడ్జెట్ కూడా సరిపోదు. మరి చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు -
ఎంపీ భరత్‌కు ఇండో అరబ్ ఎక్సలెన్స్ అవార్డ్
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సా ర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజ మహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌కు ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సోమవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జీ–20 ఇండియా ప్రెసిడెన్సీ సెలబ్రేషన్స్‌లో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదుగా ఎంపీ భరత్‌కు ఈ అవార్డ్‌ను అందజేశారు. యువతా హరితా, గోగ్రీన్ చాలెంజ్ పేరుతో ఎంపీ భరత్‌రామ్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డ్‌ను ప్రదానం చేసినట్లు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రావడంపై ఎంపీ భరత్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ అవార్డును రాజమహేంద్రవరం విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలకు అంకితమిస్తున్నానని తెలిపారు. ఇది కూడా చదవండి: నేడు ‘జగనన్న ఆణిముత్యాలు’కు సత్కారం -
ఎంపీ భరత్ చొరవతో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు
-
ఒడిశా రైలు ప్రమాదంపై ఎంపీ మార్గని భరత్ దిగ్భ్రాంతి
-
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి శత జయంతి ఉత్సవాలా?: ఎంపీ మార్గాని
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు తీరుతో ఏపీ నష్టపోయిందని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీని వెనక్కి తీసుకెళ్లేలా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి సీఎం జగన్ రూ.10,461 కోట్ల నిధులు తీసుకొచ్చారన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి శతజయంతి ఉత్సవాలా? అంటూ చంద్రబాబుపై ఎంపీ ధ్వజమెత్తారు. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ రాష్ట్రానికి నిధులు తెచ్చింది టీడీపీకి కనబడలేదా?. రాష్ట్రానికి రెవెన్యూ డెఫిషిట్ కింద రూ.10,461 కోట్లు సాధించాం. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని చంద్రబాబు, ఇప్పుడు తన కొడుకును ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను గతంలో కించపర్చిన ఈనాడు.. ఇప్పుడు యుగ పురుషుడు అని కీర్తిస్తోంది’’ అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు, లోకేష్‌కు కొడాలి నాని సవాల్ -
టీడీపీ నేతలు కావాలనే రోడ్లు ధ్వంసం చేస్తున్నారు
-
ఏ మొహం పెట్టుకుని రాజమండ్రిలో మహానాడు పెట్టారు: ఎంపీ భరత్
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సీరియస్ అయ్యారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం. పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు తీసే వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. వెన్నుపోటు పొడవటం ఎందుకు?.. శత జయంతి ఉత్సవాలు జరపడమెందుకు అని ప్రశ్నించారు. కాగా, ఎంపీ భరత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. ఆయన నిర్వాకంతోనే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. పబ్లిసిటీ కోసం చంద్రబాబు 29 మంది ప్రాణాలు తీశారు. కనీసం మృతుల కుటుంబాలను కూడా చంద్రబాబు పరామర్శించలేదు. ఏ మొహం పెట్టుకుని రాజమండ్రిలో మహానాడు పెట్టారు. రాజమండ్రిని నాశనం చేశారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారు. దండి మార్చ్ విగ్రహాల చుట్టూ టీడీపీ జెండాలు కట్టారు. ఎంతకు తెగిస్తే ఇవన్నీ చేస్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘అచ్చెన్నాయుడు పైల్స్.. వాళ్ల మాయరోగాలు గుర్తున్నాయా?’ -
పవన్ కల్యాణ్‌కు అసలు దేశభక్తి ఉందా?: ఎంపీ భరత్ ఫైర్
సాక్షి, రాజమండ్రి: టీడీపీ నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఫైరయ్యారు వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబు చేసే రాజకీయాలు ఔట్ డేటెడ్ పాలిటిక్స్ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌కు అసలు దేశభక్తి ఉందా? అని ప్రశ్నించారు. కాగా, ఎంపీ భరత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంకా పాత చిప్ మాత్రమే ఉంది. చంద్రబాబువి ఔట్ డేటెడ్ రాజకీయాలు. బాబు హయాంలో 300 కరువు మండలాలు ప్రకటిస్తే ఒక్క మండలంలో కూడా ఆయన పర్యటించలేదు. రైతులను ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు చేయలేదు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ ఫొటోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు అసలు దేశభక్తి ఉందా? అని ప్రశ్నించారు. ఫొటోలో భగత్‌సింగ్ పేరును పవన్ బూట్ల కింద పెట్టడమేంటి?. వ్యవసాయంపై పవన్‌కు ఎంత అవగాహన ఉందో బయటపడింది. అసలు పవన్‌కు ఆర్బీకే అంటే తెలుసా?. ఎంత ధాన్యం కొనుగోలు చేసారో కనీస అవగాహన ఉందా?. గణాంకాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?. ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరిస్తుంది. పవన్‌ది పూర్తిగా అవగాహనా రాహిత్యం. కోనసీమలో రైతుల కోసం రాత్రి పర్యటిస్తే ఉపయోగం ఉందా?. మాట్లాడితే హేతుబద్దంగా ఉండాలి. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. సొంత మీడియా ఉంది కదా అని టీడీపీ నేతలు అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఇది కూడా చదవండి: ‘భారత్ కోరుకునేది పాకిస్తాన్లో శాంతి, సుస్థిరత’ -
మణిపూర్ నుండి సురక్షితంగా స్వస్థలాలకు తరలిస్తోన్న ఏపీ ప్రభుత్వం
-
విద్యార్థులను స్వస్థలాలకు తరలిస్తున్నాం: ఎంపీ భరత్
సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులు రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం, వారిని సురక్షితంగా ఏపీ ప్రభుత్వం స్వస్థలాలకు తరలిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ భరత్.. విద్యార్థులకు స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. విద్యార్థులను స్వస్థలాలకు తరలిస్తున్నాం. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. విద్యార్థుల తరలింపుపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘విద్యార్థుల తరలింపు సీఎం జగన్ కృషి వల్లే సాధ్యమైంది’ -
‘చంద్రబాబు.. బషీర్‌బాగ్ ఘటనను ప్రజలు మర్చిపోలేదు’
సాక్షి, రాజమండ్రి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానంటున్న చంద్రబాబు.. అదే విషయాన్ని మహానాడు బహిరంగ సభలో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్టాడిన ఎంపీ మార్గాని భరత్.. తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు చేపట్టిన పర్యటన దండగ అని విమర్శించారు. ‘బషీర్ బాగ్ ఘటన ప్రజలు మర్చిపోలేదు చంద్రబాబు. 58 లక్షల మందికి రైతులకు రైతు భరోసా ప్రతి సంవత్సరం సీఎం అందిస్తున్నారు. పంట నష్టం కూడా ప్రభుత్వం అందిస్తుంది . ఓటుకు నోటు లో దొరికి ఎపి కి పారిపోయిన వచ్చిన వ్యక్తి చంద్రబాబు. పుష్కరాల సమయంలో 29మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పటికీ వారిని పరామర్శించలేదు. ఆర్ధిక నేరాలు చేసే వారికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నాడు. బ్లూ మీడియా అని చంద్రబాబు మాట్లడటం కరెక్ట్ కాదు. మీడియా ను బానిస బ్రతుకులు బ్రటుకుతున్నరా అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. అని నిలదీశారు ఎంపీ మార్గాని భరత్. -
చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ దారుణాలే
-
మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): నగరంలోని తిలక్ రోడ్డు షిరిడీ సాయి మార్గ్ జంక్షన్లో నిర్మాణ దశలో ఉన్న డ్రెయినేజీలో గత వారం రోజుల కిందట దురదృష్టవశాత్తు కాలు జారి పడి మృతిచెందిన ఏరుకొండ నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు కుటుంబానికి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ గురువారం అందజేశారు. అలాగే డ్రెయినేజీ కాంట్రాక్టర్ తరపున మరో రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సహాయ సహకారాలను బహిర్గతం చేయకూడదని, కానీ ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంతమంది శవ రాజకీయాలు చేయడం వల్ల చెప్పక తప్పడం లేదన్నారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స జరిగిన సంఘటన దురదృష్టకరం.. మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.. తప్పిస్తే ఇటువంటి విషాదకర సంఘటనలను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం మంచిది కాదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జరిగిన ఈ సంఘటనను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని.. ఆయన చాలా బాధపడ్డారన్నారు. మృతుని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, బొమ్మన జయ్ కుమార్, కొత్త బలమురళి, కంతారం పాటిల్,సీరపు నగేష్ చంద్రరెడ్డి, దుంగ సురేష్, తదితరులు ఉన్నారు. చదవండి: హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
జగజ్జనని చిట్స్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు
-
చిట్స్ స్కాంలో ఆదిరెడ్డి అరెస్ట్: ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు స్కాంలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జగజ్జనని చిట్స్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ భరత్ మంగళవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆదిరెడ్డి విషయంలో కక్ష సాధింపు అని కొందరు అంటున్నారు. ఆదిరెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా?. జగజ్జననని చిట్‌ఫండ్స్ పేరుతూ ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడింది. ఆదిరెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూపించారు. చిట్ ఫండ్స్ చట్టం సెక్షన్-5 ప్రకారం అరెస్టులు జరిగాయి. 20వేలకు నుంచి క్యాష్ రిసీట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ, కోట్ల రూపాయల లావాదేవీలు జగజ్జననిలో జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదు. అక్రమాలు చేసే సంస్థలను ప్రభుత్వం ఎట్టి పరిస్థిత్తుల్లో ఉపేక్షించదు. జగజ్జనని కూడా మార్గదర్శిలాంటిదే. జగజ్జనని బాధితులు ఎంతోమంది ఉన్నారు. మేము వ్యక్తిగత దూషణ చేయడం లేదు. ప్రభుత్వంపై అనవసరంగా చేసిన ఆరోపణల గురించే మాట్లాడుతున్నాం. కేవలం రాజకీయ నేపథ్యం ఉండటం వలన ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడింది అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ? -
రాజమండ్రిలో నేడు ప్రారంభంకానున్న హ్యాపీ స్ట్రీట్
-
ఢిల్లీలో పవన్ పనులు హాస్యాస్పదం: ఎంపీ భరత్
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్పీసీ ఎంపీ మార్గాని భరత్ రామ్ సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ చేసే పనులన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరిలో విశ్వసనీయత అనేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ భరత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అజెండాను పవన్ మోసుకుని ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్లాడా? లేక వాళ్లే పిలిచారా అన్న విషయం తెలియాలి. ఢిల్లీ పెద్దలు పవన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొదు అంటూ హితవు పలికారు. పవన్ ఢిల్లీలో చేసే పనులన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. మిత్రధర్మం పాటించని మిమ్మల్ని ఢిల్లీ పెద్దలు ఎందుకు గౌరవిస్తారు. చంద్రబాబు, పవన్ ఇద్దరిలో విశ్వసనీయత అనేది లేదు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్‌ను మిత్రపక్షంగా గెలిపించే ప్రయత్నం కూడా జనసేన చేయకపోవడం విచిత్రంగా ఉంది. గతంలో పవన్.. పాచిపోయిన లడ్డులు అని చెప్పి బీజేపీ పెద్దలతో మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్లాడో చెప్పాలి. పవన్ రెండు కనిపిస్తే.. మళ్లీ మూడు రోజులు కనిపించడు. చంద్రబాబుపై ప్రజలకు ఏ మాత్రం నమ్మకం లేదు. రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ నమ్మకం, తమ భవిష్యత్తు అని అనుకుంటున్నారు. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లబోతున్నాము. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. డీబీటీ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే. చంద్రబాబు హయాంలో ఏ రకమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు కూడా అమలు జరగలేదు. 2024లో కూడా సీఎం జగనే ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్ర ముఖచిత్రం కూడా మారుతుంది’ అని అన్నారు. -
రఘురామపై ఎంపీ భరత్ ఆ్రగహం
రాజమహేంద్రవరం సిటీ: దమ్ముంటే రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ సవాల్ విసిరారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు బతిమలాడితే జగనన్న నరసాపురం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. తీరా నెగ్గాక అటు టీడీపీతోఇటు బీజేపీతో శిఖండిలా మంతనాలు చేస్తున్నారంటూ విమర్శించారు. తమంది పేటీఎం బ్యాచ్‌ను రాజమహేంద్రవరంలో పెట్టుకుని లేనిపోని ప్రచారం చేయిస్తున్నారన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన.. ఏ పార్టీ నుంచి రఘురామ పోటీ చేసినా లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో తాను గెలిచి చూపిస్తానన్నారు. ఆవ భూములకు సంబంధించి ఆరోపణలు మానుకోవాలన్నారు. ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు ఆధారమున్నా నిరూపించాలన్నారు. బ్యాంకుల నుంచి బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు ఎగ్గొట్టడం తనకు చేతకాదన్నారు. తాను సొంత డబ్బుతోనే రాజకీయాలు చేస్తానని భరత్‌రామ్ పేర్కొన్నారు. -
‘అశోక విలాపం’ ఇప్పుడెందుకు.. ఇన్నాళ్లకు నిద్రలేచి నిందలు వేస్తారా?
సాక్షి,రాజమండ్రి(తూర్పు గోదావరి): 'మీరు అధికారంలో ఉన్నారు.. కేంద్ర మంత్రిగా పనిచేశారు.. అప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు.. ఇన్నాళ్ళ తరువాత నిద్రలేచి నిందలు వేస్తారా అశోక్ గజపతి రాజు గారూ..' అంటూ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ఎంపీల పనితీరు బాగోలేదని అశోక గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను ఎంపీ భరత్ దృష్టికి పలువురు విలేకరులు తీసుకువచ్చారు. ఈ అంశంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక గజపతి రాజు కేంద్ర మంత్రి కదా.. కేబినెట్లో ప్రత్యేక హోదా ఇవ్వం.. స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం అన్నప్పుడు ఈ మంత్రి గారు నిద్రపోయారా’ అని ప్రశ్నించారు. ఆ ముంపు మండలాలు ఇస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్న చంద్రబాబు ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణం, సంతకం చేస్తానంటే అప్పుడే వచ్చేది కదా' అన్నారు. టీడీపీ చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆనాడే ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీఏ నుండి బయటకు వస్తే.. రాష్ట్రానికి ఈ ఖర్మ ఉండేది కాదన్నారు. మేము అప్పటి టీడీపీ ఎంపీల్లా సన్నాయి నొక్కులు నొక్కడం లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని మొహమాటం లేకుండా నిలదీస్తూనే ఉన్నామన్నారు. ఉత్తర కుమారా..లోకేష్ నీకతేంది? ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తర కుమారా.. లోకేష్ అసలు నీ కతేందీ.. ధరలు పెరిగాయని ఈ గందర గోళం ఏమిటని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అసలు నీ భాష ఏంటో, నీ బాధ ఏంటో మాకు సరే.. నీ కూడా తిరిగే వారికే అర్థం కాదన్నారు. యువగళమా అది గందరగోళమో అర్థం కావడం లేదన్నారు. నీ కుటుంబ సభ్యులకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు అయినా బూతులు రాకుండా చూసుకో.. మొన్నా మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హల్చల్ అవుతుంటే చూస్తే.. ఏందిరా బాబూ.. ఆ అక్షరాలు దిద్దించడం.. అసలు ఫస్ట్ నువ్వు అక్షరాలు నేర్చుకో అంటూ హితబోధ చేశారు. కాపురం చూస్తే తెలంగాణాలో.. రాజకీయ డ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోనా, మీలాంటి వారి చేతిలో ఎలా ఈ రాష్ట్రాన్ని పెడతారని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో ప్రజలు చాలా విజ్ఞులని, గతంలో చేసిన మీ పాలన చూశాక మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తారని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. నేనెప్పుడూ..సూపర్ స్టార్ నే ఎంపీ రఘురామ రాజు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్ స్పందించారు. నేను ఏక చిత్ర నటుడినైనా.. హీరోనే.. చేయాలనుకుంటే ఎన్ని సినిమాలోనైనా హీరోగా నటిస్తా, ప్రజలను మెప్పిస్తా.. సూపర్ స్టార్ అనిపించుకుంటా అన్నారు. నీకూ ఒక కామెడీ క్యారెక్టర్ ఇప్పిస్తా..గోచీ పెట్టుకుంటావు కదా అంటూ ఎద్దేవా చేశారు. అరటి ఆకు స్టోరీ.. పార్లమెంటరీలో అందరూ నవ్వుకున్నారు.. నోరు అదుపులో పెట్టుకో రఘూ అంటూ ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధిని స్వాగతించండి.. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రూ.13లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చాయని, ఇవి చూసి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. రాయలవారి కొలువులో అష్ట దిగ్గజాల మాదిరిగా దేశ విదేశాల నుండి ఎందరో పారిశ్రామిక దిగ్గజాలు వస్తే..అభినందించడం పోయి దీనికి కూడా వారి సహజసిద్ధమైన విమర్శలు చేయడం ప్రతిపక్షాల నైజాం బయటపడిందన్నారు. ఆరోగ్యకరమైన విమర్శలు ప్రగతికి దోహదపడతాయి కానీ..ఇలా ప్రతీ దానికీ విమర్శిస్తే ప్రజల్లో నవ్వులపాలవుతారని ఎంపీ భరత్ అన్నారు. చదవండి: నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం -
‘స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సూత్రధారి లోకేష్’
ఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సూత్రధారి నారా లోకేష్ అని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. సిమెంట్స్ కంపెనీతో డమ్మీ ఒప్పందం చేసుకుని రూ. 300 కోట్లు ప్రజాధనం మింగేశారని ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. సెల్ కంపెనీల ద్వారా ఈ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని పేర్కొన్నారు. సీఎం జగన్ ముందు లోకేష్ ఒక బచ్చా అని మార్గాని భరత్ ధ్వజమెత్తారు. అందుకే ఏపీలో అంబానీ, అదానీ పెట్టుబడులు పారిశ్రామిక ప్రపంచం సీఎం జగన్‌పై పూర్తి విశ్వాసంతో ఉందని, అందుకే ఏపీలో అంబానీ, అదానీ పెట్టుబడులు పెడుతున్నారని ఎంపీ భరత్ తెలిపారు. రూ. 13 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు జరగడం ఇదే ప్రథమం అని భరత్ స్పష్టం చేశారు. పోలవరం కాఫర్ డ్యాం లేకుండా డయాఫ్రమ్ వాల్ కడితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తోందని ప్రశ్నంచిన ఎంపీ భరత్.. పెద్ద పొరపాటు చేసిన చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ ఎస్డీసీ)లో కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. సీమెన్స్ కంపెనీతో ప్రాజెక్టు పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కేసులో అప్పట్లో ఏపీ ఎస్ఎస్డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జాకు సీఐడీ సోమవారం నోటీసులు జారీ చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్ పేరిట టీడీపీ ప్రభుత్వ పెద్దలు నిధులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయిస్తే సీమెన్స్ కంపెనీ 90శాతం నిధులు వెచ్చించి రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారని ఒప్పందం చేసుకున్నారు. కానీ సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించేశారు. వాటిలో రూ.245 కోట్లను డిజైన్ టెక్, స్కిల్లర్ అనే షెల్ కంపెనీల ద్వారా సింగపూర్‌కు మళ్లించి, వాటిని మళ్లీ టీడీపీ పెద్దల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో ఐటీశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశే ఏపీ ఎస్ఎస్డీసీ వ్యవహారాలు చూడటం గమనార్హం. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్ దిక్సూచి: ఎంపీ మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ తెలిపారు. చంద్రబాబు హయాంలో వెనుకబడిన వర్గాలకు 30 శాతం మాత్రమే అవకాశం ఇచ్చారని, అయితే పదవుల్లో బలహీనవర్గాలకు 68 శాతం అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, ఆయనది పెత్తందారీ వ్యవస్థ విధానమని ధ్వజమెత్తారు. బలహీనవర్గాలు ఎప్పుడూ వెనుకే ఉండాలనే కాన్సెప్ట్‌తో చంద్రబాబు వ్యవహరించేవాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్ దిక్సూచని, ఆయన గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదని మండిపడ్డారు. చదవండి: కేడీ పోలీస్.. గుట్టుగా వ్యభిచారం! మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే అలా..! -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు: ఎంపీ మార్గాని భరత్
-
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణం: మార్గాని
-
యువకుడిని కాపాడిన ఎంపీ మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో దూకబోయిన యువకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ చాకచక్యంగా కాపాడారు. రాజమండ్రి రోడ్డుకం రైల్వే వంతెనపై మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన అయ్యప్ప ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి జడ్చర్లలోని అరబిందో ఫార్మసీలో మూడేళ్లు పనిచేశాడు. మంగళవారం బైక్‌పై రోడ్డు కం రైలు వంతెనపైకి వచ్చాడు. మోటారు సైకిల్‌ను పక్కనపెట్టి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో గోపాలపురంలో ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన ఎంపీ భరత్‌రామ్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, కారులోంచి బయటకు దూకి, ఆ యువకుడిని పట్టుకుని రోడ్డు మీదుకు లాగారు. ఎంపీ అనుచరులు కూడా గట్టిగా పట్టుకున్నారు. ఎంపీ వెంటనే రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ గణేష్‌కు ఫోన్‌చేసి విషయం తెలిపారు. ఆ యువకుడిని ఆటోలో రెండోపట్టణ పోలీసుస్టేషకు తీసుకువెళ్లారు. యువకుడిని కాపాడిన ఎంపీ భరత్‌రామ్‌ను పలువురు అభినందించారు. -
బర్త్‌డే కేక్‌లా రాష్ట్ర విభజన
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసం బర్త్‌డే కేక్‌లా రాష్ట్రాన్ని విభజించారని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు విమర్శించారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా తొమ్మిదో బడ్జెట్లోనూ రాష్ట్రంపై సవతి ప్రేమే చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో బడ్జెట్ పద్దులపై వైఎస్సార్సీపీ తరఫున చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడారు. సంఖ్యా పరంగా ఏపీ నుంచి 25 మంది ఎంపీలు మాత్రమే ఉన్నా ప్రత్యేకహోదా విషయంలో గట్టిగా గళం వినిపిస్తామని తేల్చిచెప్పారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. పార్లమెంటు వేదికగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీలో తగిన సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భరతుడు మాదిరిగా ప్రధాని మోదీ ఏపీని భుజాలకు ఎత్తుకోవాలని పేర్కొన్నారు. ఆ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ జోక్యం చేసుకొని మీరు భరతుడే కదా అని చమత్కరించారు. తొమ్మిదేళ్లు అయినా రైల్వే జోన్ కూడా ఏం పూర్తికాలేదని భరత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా రూ.55 వేల కోట్లను ఆమోదించడం లేదని అన్నారు. విశాఖ, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వండి ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేలా విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటివి తయారు కావాలని ఎంపీ భరత్ పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హోదా ప్రకటించినా దాని ఊసే లేదు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విభజన అనంతరం ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించారని కానీ ప్రస్తుతం ఆ ఊసే లేదన్నారు. 1950ల్లో తగిన సాంకేతికత లేకున్నా నాగార్జునసాగర్ కట్టారని.. ఆ ప్రాజెక్టుకు పట్టిన సమయం కన్నా పోలవరం ప్రాజెక్టుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,800 కోట్లు విద్యుత్ బకాయిల సమస్యను పరిష్కరించాలన్నారు. ఏపీలో వైద్య కళాశాలలకు కేంద్రం సహకారం అందించాలని విన్నవించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే యోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
హోదా ప్రస్తావనేదీ?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లవుతున్నా, ఈ బడ్జెట్లోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించినంత వరకు నిరాశ ఎదురైందన్నారు. బుధవారం పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజన హామీలను ప్రస్తావించారని గుర్తుచేశారు. ‘‘పోలవరం నిధుల ఊసూ లేదు.ప్రత్యేక హోదా ప్రస్తావనా లేదు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించే నిధుల్లోనూ ప్రగతి లేదు. రైల్వే కారిడార్, స్టీల్ ప్లాంట్‌కు చేస్తామన్న సాయాన్నీ ప్రస్తావించలేదు. వీటన్నిటిపైనా కేంద్రాన్ని నిలదీస్తాం. బడ్జెట్‌పై జరిగే చర్చలో కూడా లేవనెత్తుతాం. నర్సింగ్ కాలేజీలు, ఏకలవ్య పాఠశాలలు తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గరిష్ట ప్రయోజనం రాబట్టడానికి ప్రయత్నిస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు కేంద్రానికి స్వయంగా విజ్ఞప్తులు చేసినప్పటికీ పోలవరం నిధుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం బాధాకరం. ఉచిత బియ్యం, పీఎంఏవై ఇళ్ల కేటాయింపులు పెంచడం వల్ల రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంది’ అని మిథున్‌రెడ్డి తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఏ రంగానికి ఎంత బడ్జెట్ సమకూరుస్తుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఎంపీ మోపిదేవి వెంకట రమణ చెప్పారు. ప్రత్యేక హోదా సాధన అనేది వైఎస్సార్సీపీ ప్రధాన అజెండా అని, దీని కోసం చివరి వరకు పోరాడతామని అన్నారు. స్వార్థపూరిత విధానాలతో ఆనాడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కేంద్రం సహకారం పొందే విషయంలో నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ, ఎగుమతికి ఫ్రీ ట్రేడింగ్ విషయంలో కేంద్రం ఇంకా చొరవ చూపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వికాసానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారని, మార్చిలో విశాఖలో జరిగే ఈ భారీ సదస్సుకి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నామని చెప్పారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని ఎంపీ మార్గాని భరత్‌రామ్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్టంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే కేంద్రం మూడింటికే నిధులిస్తామని చెప్పిందన్నారు. అన్ని కాలేజీలకు నిధులివ్వాలని కోరుతున్నామన్నారు. రైల్వే పరంగా విశాఖపట్నం–విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి ఉందన్నారు. కొవ్వూరు–భద్రాచలం లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, ఈ లైను వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు 70 కి.మీ దూరం తగ్గి ప్రయాణికులకు భారం తగ్గుతుందన్నారు. విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు, బెంగళూరు – హైదరాబాద్ కారిడార్లకు నిధులిస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఇండియ¯న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ను హైదరాబాద్‌కు ఇచ్చారని, రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. రామాయపట్నం పోర్టుకు కూడా నిధులివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు యూటర్న్ తీసుకోకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. మచిలీపట్నంలో వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజూరు చేయడం సంతోషకరమని ఎంపీ బాలశౌరి చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డెప్ప, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, నందిగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్గాని భరత్ నివాసంలో భోగి వేడుకలు
-
'చంద్రబాబుకు పదవి పిచ్చి, ప్యాకేజీ స్టార్‌కు డబ్బు పిచ్చి'
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రాన్ని నిలువునా దోచుకోవడమే చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడి ఎజెండా అని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కోసం జనసేనను చంద్రబాబు వద్ద పవన్ తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబుకు పదవి పిచ్చి, ప్యాకేజీ స్టార్‌కు డబ్బు పిచ్చి అని ఎద్దేవా చేశారు. పేదలవైపు జగనన్న ఉంటే.. అధర్మం వైపు చంద్రబాబు అండ్ కో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అండ్‌కోకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారు అని ఎంపీ మార్గాని భరత్ హెచ్చరించారు. చదవండి: (జీవో నెం.1ను రాజకీయ కోణంలో చూడొద్దు: మంత్రులు) -
పవన్ పరామర్శించాల్సింది.. చనిపోయిన కుటుంబాలనా..? చంద్రబాబు నా ..?
-
పవన్.. చంద్రబాబును పరామర్శించడం ఏంటి?: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు పవన్ కలయికపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సెటైర్లు వేశారు. వీరి కలయిక దేనిని సూచిస్తుందో ప్రజలకు బాగా తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబును పవన్ పరామర్శించడం చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు ఎంపీ భరత్ మాట్లాడుతూ.. 'పవన్ బీజేపీతో పొత్తు ఉందంటూనే చంద్రబాబును కలుస్తారు. ప్యాకేజీల గురించి మాట్లాడుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. నిర్మొహమాటంగా బయటికి చెప్పొచ్చు. చంద్రబాబు సభల్లో 11మంది చనిపోయారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నాడు. బాధిత కుటుంబాలను పరామర్శించడం మానేసి చంద్రబాబును, పవన్ పరామర్శించడానికి వచ్చారంటే వీరిద్దరి మధ్య ఉన్న అనైతిక కలయిక బయటపడుతుంది. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. చదవండి: (Pawan-Chandrababu Meet: రెచ్చిపోయిన చంద్రబాబు) -
జీవోపై టీడీపీ నేతల అసత్య ప్రచారం : ఎంపీ మార్గాని భరత్
-
పచ్చ పత్రికల దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: ‘దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయండి’ అన్నట్టుగా ఉంది పచ్చ నేతలు, ఎల్లో మీడియా తీరు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీకి చెందిన అర్జి పార్వతి (65) కుక్క కాటు ఇంజక్షన్ రెండో డోస్ వేయించుకునేందుకు మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తిరిగి ఇంటికి బయలు దేరుతుండగా రంగంపేట నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఏపీ29 జెడ్–355 నంబరు గల ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయపడింది. ఆర్టీసీ ఔట్సోర్సింగ్ డ్రైవర్ నూలు హరీష్ స్థానికుల సాయంతో తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే వలంటీర్.. 70 ఏళ్ల వృద్ధురాలిని బలవంతంగా సీఎం సభకు తీసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. సీఎం సభలో అపశ్రుతి.. అని పచ్చ మీడియా తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప తదితరులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్లి ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేశారు. ఇంతలో వైద్య సేవలతో తేరుకున్న పార్వతి.. జరిగిన విషయాన్ని ఔట్ పోస్టు పోలీసులకు వెల్లడించింది. దీంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు. టీడీపీ నేతలకు బుద్ధిరాదు: ఎంపీ భరత్ ప్రజలు ఎంతగా బుద్ధి చెప్పినా, టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. చంద్రబాబు సభల్లో ప్రమాదాలు జరుగుతున్నట్టే సీఎం సభల్లో కూడా జరగాలనే దుర్బుద్ధిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. నగరంలో ఎక్కడో రోడ్డు ప్రమాదం జరిగితే దానిని సీఎం సభతో ముడిపెడుతున్నారంటే టీడీపీ చిల్లర, శవ రాజకీయం స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
ఆనాడు ఢిల్లీ కోటలు బీటలు వారేలా గర్జించిన సింహం సీఎం జగన్..!
-
8 మంది ప్రాణాలు పోతే దత్తపుత్రుడు ఎక్కడున్నాడు..?