
సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులు రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం, వారిని సురక్షితంగా ఏపీ ప్రభుత్వం స్వస్థలాలకు తరలిస్తోంది.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ భరత్.. విద్యార్థులకు స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. విద్యార్థులను స్వస్థలాలకు తరలిస్తున్నాం. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. విద్యార్థుల తరలింపుపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం అని తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘విద్యార్థుల తరలింపు సీఎం జగన్ కృషి వల్లే సాధ్యమైంది’
Comments
Please login to add a commentAdd a comment