సాక్షి, తాడేపల్లి: యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారని అంటే.. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా? అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు ఎలా చదువుకోవాలి?. పిల్లల చదువులతో ప్రభుత్వానికి పనిలేదా? అని మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘బాబు వస్తేనే జాబు వస్తుందన అప్పట్లో ప్రచారం చేసి, చివరికి ఆయన కొడుక్కి మాత్రమే పదవులు ఇచ్చుకున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిలువునా మోసం చేశారు. ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనని చెప్పుకున్నారు. మరి ప్రత్యేకహీదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ఎందుకు అనలేదు?. చంద్రబాబు చేసిన ధర్మపోరాటాల దీక్షలు ఏం అయ్యాయి?. టీటీడీ డబ్బులతో ఢిల్లీలో సభలు పెట్టి ఏం సాధించారు?. పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బీజేపీతో కలిశారో కూడా చెప్పాలి.
...అసలు బ్యాంకు లోన్ అనే పదం చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది?. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం మోసానికి గురవ్వని వర్గం లేదు. 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?. నిలువునా రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా?. సీఎం జగన్ కేంద్రంతో పొత్తు లేకపోయినా ఏపీకి ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కనపడటం లేదా?. సీఎం జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు కనపడటం లేదా?’ అని మార్గాని భరత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment