సాక్షి,ఢిల్లీః రాజమండ్రిలో దళిత నాయకుడు పులి సాగర్‌ను పోలీసులు బట్టలు ఊడదీసి సెల్‌లో పెట్టారని మాజీ ఎంపీ మార్గానిభరత్ మండిపడ్డారు. ఈ విషయమై సోమవారం(డిసెంబర్9) తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఢిల్లీలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. ‘పులిసాగర్‌కు వేధింపుల విషయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి జాతీయ ఎస్సీ,ఎస్‌టీ కమిటీ, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. తగు చర్యలు తీసుకుంటామని జాతీయ ఎస్.సీ కమిషన్ హామీ ఇచ్చింది.
అమానుషంగా పులి సాగర్‌ను పోలీస్ స్టేషన్ సెల్‌లో పెట్టి వేధించారు.ఒక మహిళా కానిస్టేబుల్ సమక్షంలో సెల్‌లో పులిసాగర్‌ను వేధించారు. వర్షాలు,వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందని అడిగినందుకు పోలీసులు ఇంతటి అమానుషానికి పాల్పడ్డారు’అని మార్గాని భరత్ ఫైరయ్యారు.
బూతులు తిట్టి వేధించారు: బాధితుడు పులిసాగర్
* రాజమండ్రిలో ఇన్స్పెక్టర్ బాజీలాల్ రమ్మంటే పోలీసు స్టేషన్‌కు వెళ్ళాను.
* సోషల్ మీడియాలో నేను చేసిన పోస్ట్ ను ప్రశ్నిస్తూ బూతులు తిట్టి, నన్ను వేధించారు.
* వరదలు వచ్చిన ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో వెంటనే వరద నీటిని తొలగించామని ఎమ్.ఎల్.ఏ ఆదిరెడ్డి శ్రీనివాస్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
* ఎమ్.ఎల్. ఏ పోస్ట్‌ను వ్యతిరేకిస్తూ వాస్తవ పరిస్థితిని చిత్రీకరించి తిరిగి పోస్ట్ చేసినందుకు పోలీసులు నన్ను కొట్టి సెల్‌లో పెట్టారు.
* బూతులు తిట్టి, బట్టలు ఊడదీసి నన్ను సెల్‌లో వేశారు.
* రాత్రి 9 గంటలకు సెల్‌లో నుంచి బయటకు తీసుకువచ్చి, నాతో బలవంతంగా సంతకం పెట్టించుకుని, హెచ్చరించి విడిచిపెట్టారు.
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో సైకోగా మారి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని పోలీసులు రాసిన కాగితంపై నాతో బెదిరించి, బలవంతంగా సంతకం చేయుంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment