‘బీసీ డిక్లరేషన్.. చంద్రబాబు మరో కొత్త డ్రామా’ | YSRCP MP Margani Bharat Fires On Chandrababu Naidu Over BC Seat Share Issue, Details Inside - Sakshi
Sakshi News home page

‘బీసీ డిక్లరేషన్.. చంద్రబాబు మరో కొత్త డ్రామా’

Published Wed, Mar 6 2024 11:30 AM | Last Updated on Wed, Mar 6 2024 1:19 PM

Ysrcp Mp Margani Bharat Fires On Chandrababu - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని ధ్వజమెత్తారు.

బీసీలకు వైఎస్సార్‌సీపీ చేసిన న్యాయం మీరు ఎప్పటికీ ఇవ్వలేరు. బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబు అనర్హుడు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూసే వ్యక్తి చంద్రబాబు. ఇదే చంద్రబాబు.. ఒకటి కాదు రెండు కాదు 14 ఏళ్లు రాష్ట్రాలు పాలించాడు అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా? ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడు. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. చంద్రబాబుతో బీసీలకు సంబంధించి పలు డిబేట్లకు రెడీగా ఉన్నానంటూ మార్గని భరత్‌ సవాల్‌ విసిరారు.

‘‘బీసీలకు సీఎం జగన్ 75 వేల కోట్లు ఇచ్చారు. నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడింది. అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. బీసీల డీఎన్ఏ టీడీపీ అని చెప్పే చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు కనీసం నువ్వు ఆ సాహసం చేసావా? చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేము ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా.. మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు’’ అంటూ మార్గాని భరత్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: వాళ్లని అవినీతికి వాడుకుని వదిలేసిన బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement