MP Margani Bharat Serious Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌కు అసలు దేశభక్తి ఉందా?: ఎంపీ భరత్‌ ఫైర్‌

Published Thu, May 11 2023 6:43 PM | Last Updated on Thu, May 11 2023 6:59 PM

MP Margani Bharat Serious Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

సాక్షి, రాజమండ్రి: టీడీపీ నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఫైరయ్యారు వైఎ‍స్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌. చంద్రబాబు చేసే రాజకీయాలు ఔట్‌ డేటెడ్‌ పాలిటిక్స్‌ అంటూ ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌కు అసలు దేశభక్తి ఉందా? అని ప్రశ్నించారు. 

కాగా, ఎంపీ భరత్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంకా పాత చిప్‌ మాత్రమే ఉంది. చంద్రబాబువి ఔట్‌ డేటెడ్‌ రాజకీయాలు. బాబు హయాంలో 300 కరువు మండలాలు ప్రకటిస్తే ఒక్క​ మండలంలో కూడా ఆయన పర్యటించలేదు. రైతులను ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు చేయలేదు. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ఫొటోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌కు అసలు దేశభక్తి ఉందా? అని ప్రశ్నించారు. ఫొటోలో భగత్‌సింగ్‌ పేరును పవన్‌ బూట్ల కింద పెట్టడమేంటి?. 

వ్యవసాయంపై పవన్‌కు ఎంత అవగాహన ఉందో బయటపడింది. అసలు పవన్‌కు ఆర్బీకే అంటే తెలుసా?. ఎంత ధాన్యం కొనుగోలు చేసారో కనీస అవగాహన ఉందా?. గణాంకాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?. ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరిస్తుంది. పవన్‌ది పూర్తిగా అవగాహనా రాహిత్యం. కోనసీమలో రైతుల కోసం రాత్రి పర్యటిస్తే ఉపయోగం ఉందా?. మాట్లాడితే హేతుబద్దంగా ఉండాలి. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. సొంత మీడియా ఉంది కదా అని టీడీపీ నేతలు అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదు. 

ఇది కూడా చదవండి: ‘భారత్‌ కోరుకునేది పాకిస్తాన్‌లో శాంతి, సుస్థిరత’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement