
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా:విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని అని మాజీఎంపీ,వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు.ఈ విషయమై భరత్ మంగళవారం(అక్టోబర్8) మీడియాతో మాట్లాడారు.
‘విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైంది.మీరు ఖర్చు చేసిందెంత?ఎమ్మెల్యేలు అడ్డుగోలుగా దోచుకోలేదా..పులిహోరకు రూ. 23 కోట్లు ఖర్చు చేయడం దారుణం. అగ్గిపెట్టెలు,కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు చూపటం హాస్యాస్పదం.
రూ.500 కోట్లు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏం చేశారు.కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయి.చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు రూ. 618 కోట్లు అయితే చంద్రబాబు వరదల్లో చూపిన ఖర్చు రూ. 500 కోట్లని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిల్వచేసిన 87లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఏమైంది.
రాజమండ్రిలో 28 మద్యం దుకాణాల్లో ఆరింటిని తమకు వదిలేయాలని స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే చెప్పడం దారుణం.రాజమండ్రిలో కంబాల పార్కుకు ఎంట్రన్స్ టికెట్ రూ.50 తొలగిస్తామని గతంలో హామీ ఇచ్చారు ఇప్పటివరకు ఎందుకు తొలగించలేదు.ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎందుకు నిర్వహించలేకపోయారు.పార్కులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు’అని భరత్ నిలదీశారు.

ఇదీ చదవండి: జీతాలు నిల్లు..పబ్లిసిటీ ఫుల్లు: విజయసాయిరెడ్డి సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment