సాక్షి,తాడేపల్లి:జీతాలు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి మంగళవారం(అక్టోబర్8) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘రూ.400 కోట్లు ఇస్తున్నట్టు జీఓ విడుదల అయింది.ఈ విషయాన్ని కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాల్లో రాసింది.
టీవీల్లో రోజంతా బ్రేకింగ్ న్యూస్ నడిచాయి.నిధులు మాత్రం హుళక్కయ్యాయి.చంద్రబాబు కుతంత్రాలు ఇలాగే ఉంటాయి.సమగ్ర శిక్షలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు.
ప్రాణాలు రక్షించే 108, 104 సిబ్బంది 6 వేల 500 మందికి జులై నుంచి నయా పైసా విదల్చలేదు.వీరే కాదు అనేక డిపార్టుమెంట్లలో వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో దసరా,దీపావళి పండుగలు వస్తున్నా చిమ్మచీకట్లు తొలగిపోలేదు.ఇదీ చంద్రబాబు మార్కు పాలన.దీనిని మార్పు అనాలంట’అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: పవన్‌కల్యాణ్‌పై కేఏ పాల్ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment