Ravali Jagan Kavali Jagan
-
Lok sabha elections 2024: స్లోగన్ పేలింది
సినిమాల్లో ‘పంచ్’ పడితే కలెక్షన్ల సునామీ! అదే పొలిటికల్ ‘పంచ్’ పేలితే? గెలుపు గ్యారంటీ! రాజకీయ పార్టీలు అదిరిపోయే నినాదాలతో జనాల్లోకి వెళ్తున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా ఉండే ఈ స్లో‘గన్స్’ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. విపరీతంగా వైరలై ప్రజల మనసులతో పాటు ఓటు బ్యాంకులనూ కొల్లగొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ‘రావాలి జగన్, కావాలి జగన్’ ఎలా ఊపేసిందో తెలిసిందే. భారత ఎన్నికల చరిత్ర తిరగేస్తే లాల్ బహదూర్ శాస్త్రి మొదలుకుని ఇందిరాగాందీ, వాజ్‌పేయి, మోదీ, కేజ్రీవాల్ దాకా ప్రతి ఒక్కరి జమానాలోనూ ఆయా పార్టీల విజయాలకు దన్నుగా నిలిచి, రాజకీయాలను మలుపు తిప్పిన నినాదాలెన్నో... జై జవాన్, జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. 1964లో నెహ్రూ మరణంతో ప్రధాని పదవి చేపట్టిన శాస్త్రికి యుద్ధం స్వాగతం పలికింది. 1965 భారత్–పాక్ వార్‌లో పోరాడుతున్న సైనికుల్లో జోష్ నింపేందుకు, మరోపక్క దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశంలో తిండిగింజల ఉత్ప త్తిని పెంచేలా రైతుల్లో స్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ఈ నినాదమిచ్చారు. హరిత విప్లవానికి కూడా ఇది దన్నుగా నిలిచింది. తాషె్కంట్‌లో శాస్త్రి మరణానంతరం 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర సారథ్యంలో కాంగ్రెస్‌కు మళ్లీ విజయం సాధించిపెట్టిందీ ఇదే నినాదం! గరీబీ హటావో 1971లో ప్రతిపక్షాలు, సొంత పార్టీ చీలిక వర్గం ఏకమై ఎన్నికల పోరుకు దిగినా కూడా ఒంటిచేత్తో కాంగ్రెస్(ఆర్)ను గెలిపించుకున్నారు ఇందిరా గాం«దీ. పేదరికాన్ని నిర్మూలిద్దామంటూ ఆ ఎన్నికల సందర్భంగా ఆమె ఇచ్చిన ఈ స్లోగన్ జనాల్లోకి బలంగా వెళ్లింది. ఇందిర హటావో, దేశ్ బచావో ఎమర్జెన్సీలో అష్టకష్టాలు పడ్డ ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమై ఇచ్చిన సమైక్య నినాదం. ఇందిరను తొలగించి దేశాన్ని కాపాడాలన్న పిలుపు ఓటర్లను ఆలోచింపజేసింది. దాంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఇందిరతోపాటు ఆమె తనయుడు సంజీవ్ గాంధీ కూడా ఓటమి చవిచూశారు. దాంతో కాంగ్రెస్ మళ్లీ చీలింది. కాంగ్రెస్(ఐ) సారథిగా 1978 ఉప ఎన్నికలో కర్నాటకలోని చిక్మగుళూరు లోక్‌సభ స్థానం నుంచి ఇందిర ఘన విజయం సాధించారు. ఆ సందర్భంగా ‘ఏక్ షేర్నీ, సౌ లంగూర్; చిక్‌మగళూరు భాయ్ చిక్‌మగళూరు’ (ఇటు ఒక్క ఆడపులి, అటు వంద కోతులు) స్లోగన్ మారుమోగింది. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, ఇందిరా తేరా నామ్ రహేగా 1984లో ఇందిర హత్యానంతరం రాజీవ్ ప్రధాని అయ్యారు. వెంటనే లోక్‌సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. కాంగ్రెస్(ఐ)కి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. ‘సూర్యచంద్రులు ఉన్నంతదాకా ఇందిర పేరు నిలిచి ఉంటుంది’ అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాజీవ్ ఏకంగా 413 సీట్లతో క్లీన్ స్వీప్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ 1996 సార్వత్రిక ఎన్నికల్లో ‘బారీ బారీ సబ్ కీ బారీ, అబ్ కీ బారీ అటల్ బిహారీ’ (అందరి వంతూ అయింది, ఈసారి అటల్ బిహారీ వంతు) అంటూ బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి మచ్చలేని వాజ్‌పేయి ఇమేజ్ తోడై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది. తొలిసారి 16 రోజుల్లో పడిపోయిన వాజ్‌పేయి ప్రభుత్వం రెండోసారి 13 నెలలకే పరిమితమైంది. దేశాన్ని వృద్ధి బాటన నడిపేందుకు వైజ్ఞానిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలంటూ 1998లో పిలుపునిచ్చిన ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ నినాదం 1999లో బీజేపీకి విజయాన్ని అందించింది. మూడోసారి ఎన్డీఏ సర్కారును విజయవంతంగా నడిపారు వాజ్‌పేయి. కొంప ముంచిన ‘ఇండియా షైనింగ్’ దేశంలో సెల్ ఫోన్లను ప్రవేశపెట్టడం నుంచి ‘స్వర్ణ చతుర్భుజి’ హైవేల ప్రాజెక్టు తదితరాలతో ప్రగతికి పెద్దపీట వేసిన వాజ్‌పేయి సర్కారు 2004 ఎన్నికల్లో అతి విశ్వాసంతో బొక్క బోర్లా పడింది. ధరాభారం తదితరాలతో తాము సతమతమవుతుంటే ‘ఇండియా షైనింగ్ (భారత్ వెలిగిపోతోంది)’ నినాదంతో ఊరూవాడా ఊదరగొట్టడం జనానికి అస్సలు నచ్చలేదు. దాంతో బీజేపీ కొంప మునిగింది. వాజ్‌పేయి సర్కారు ఇంటిబాట పట్టింది. కాంగ్రెస్ కా హాత్, ఆమ్ ఆద్మీ కే సాత్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు 2004లో పూర్వ వైభవం తీసుకొచ్చిన స్లోగన్. వాజ్‌పేయి సర్కారు పేదలను విస్మరించిందని, తాము సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటామని చెప్పిన తీరు జనాలకు కనెక్టయింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు గద్దెనెక్కింది. సోనియాగాంధీ విదేశీయత వివాదంతో మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు కొనసాగారు. అచ్చే బీతే 5 సాల్, లగే రహో కేజ్రీవాల్ నయా రాజకీయ సంచలనంగా దూసుకొచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను 2020లో ఢిల్లీ పీఠంపై మరోసారి బంపర్ మెజారిటీతో కూర్చోబెట్టిన స్లోగన్. ‘ఐదేళ్లు బాగా గడిచాయి. సాగిపో కేజ్రీవాల్’ అన్న ప్రచారం ఓటర్లను ఆకర్షించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70 సీట్లకు ఏకంగా 67 దక్కించుకున్న కేజ్రీవాల్ 2020లోనూ 62 సీట్లతో ప్రత్యర్థులపై ‘చీపురు’ తిరగేశారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న కమలనాథులకు 2014లో మళ్లీ అధికారం కట్టబెట్టిన స్లోగన్. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యరి్థగా ప్రకటించి, ‘ఈసారి మోదీ ప్రభుత్వం’ నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇది కార్యకర్తల్లో జోష్ నింపడమే గాక దేశవ్యాప్తంగా మార్మోగి బీజేపీని గెలిపించింది. తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ నినాదంతో ఇండో–అమెరికన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. అలాగే ‘అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులొస్తాయ్)’, ‘చాయ్ పే చర్చ’, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ వంటి నినాదాలూ ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం)’, ‘మోదీ హై తో ముమ్కిన్ హై (మోదీతో సాధ్యం)’ నినాదాలు వైరలయ్యాయి. ఈసారి కమలనాథులు ‘తీస్రీ బార్ మోదీ సర్కార్’ (మూడోసారీ మోదీ సర్కారు), ‘అబ్ కీ బార్ 400 పార్’ (ఈసారి 400 పై చిలుకు)’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో పేలిన మరికొన్ని నినాదాలు... ► జన్‌సంఘ్ కో వోట్ దో, బీడీ పీనా చోడ్ దో; బీడీ మే తంబాకు హై, కాంగ్రెస్‌వాలా డాకూ హై (1967లో భారతీయ జనసంఘ్ నినాదం) ► ప్రోగ్రెస్ త్రూ కాంగ్రెస్ (కాంగ్రెస్‌తోనే అభివృద్ధి. 1960ల్లో నినాదమిది. అయితే, ‘ప్రోగ్రెసా, కాంగ్రెసా’ అంటూ శివసేన ఇచ్చిన కౌంటర్ అప్పట్లో బాగా పేలింది) ► వోట్ ఫర్ కాఫ్ అండ్ కౌ; ఫర్గెట్ అదర్స్ నౌ (ఆవుదూడ గుర్తుకు ఓటేయండి, మిగతా పార్టీలను మర్చిపోండి అంటూ ఇందిరా కాంగ్రెస్ ఇచ్చిన నినాదం. కానీ ఆ గుర్తు ఇందిర, సంజయ్‌లకు ప్రతీక అంటూ వ్యంగ్యా్రస్తాలు పేలాయి) ► జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ, తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం బిహార్‌లో లాలూ ఉంటారు) ► జాత్ పర్ నా పాత్ పర్, మొహర్ లగేగీ హాత్ పర్ (కులమతాలకు అతీతంగా హస్తం గుర్తుకు ఓటేద్దామంటూ 1996 ఎన్నికల్లో పీవీ ఇచ్చిన నినాదం) ► సోనియా నహీ, యే ఆంధీ హై; దూస్రీ ఇందిరాగాంధీ హై (సోనియా కాదు, తుఫాను; మరో ఇందిర అంటూ 2009లో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
జగన్ కోసం జనం మొక్కులు!
-
దుమ్ము రేపుతున్న ‘రావాలి జగన్–కావాలి జగన్’
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ విడుదల చేసిన ‘రావాలి జగన్–కావాలి జగన్’ అనే ప్రచార గీతం సామాజిక మాధ్యమాల్లో దుమ్ము రేపుతోంది. ఈ పాటకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మార్చి 11న విడుదలైన ఈ పాటను నెల రోజుల్లోనే 2.21 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచార గీతాన్ని ఇంతమంది చూడటం ఇదే ప్రథమం. ‘ఐ–ప్యాక్’ బృందం రూపొందించిన ఈ పాట విడుదలైన 20 రోజులకే వ్యూస్ సంఖ్య కోటి దాటింది. ఒక్క ఏపీ ప్రజలే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న జగన్ అభిమానులు సైతం ఈ పాట పట్ల ఆకర్షితులవుతున్నారు. యువతీయువకులు ఈ పాటను తమ మొబైల్ ఫోన్లకు రింగ్ టోన్లుగా పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఏ నోట చూసినా ఇదే పాట వినిపిస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ ప్రచార గీతం ఈ స్థాయిలో ఆదరణ పొందడం రాష్టంలో రాగల మార్పులకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ జాతీయ స్థాయిలో విడుదల చేసిన ప్రచార గీతాన్ని ఇంకా పాతిక లక్షల మంది కూడా చూడలేదు. -
దుమ్మురేపుతున్న ‘రావాలి జగన్ కావాలి జగన్’
సాక్షి, హైదరాబాద్ : ఓ నాయకుడిపై రూపొందించిన పాట యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగించడం దేశ రాజకీయాల్లోనే ప్రప్రథమం. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి జనం గుండెల్లో నిలిచిన జననేత వైఎస్ జగన్ మీద రాసిన ఈ పాట.. ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ ప్రజల గుండెల్లో పాతుకుపోయిన ఈ పాట ఇప్పటివరకు యూట్యూబ్‌లో రెండు కోట్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది . ఈ ప్రచార గీతం విడుదలైన రోజు నుంచి సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ మున్ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా యూట్యూబ్‌లో రావాలి జగన్ కావాలి జగన్ పాట 2కోట్ల వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ లిఖించబోయే కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది ఈ పాట. ఈ పాటను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. తెలుగు ప్రజలు ఎక్కడ వున్నా వారి మదిని కదిలిస్తోంది. -
దుమ్ములేపుతున్న ‘రావాలి జగన్.. కావాలి జగన్’
సాక్షి, హైదరాబాద్: స్టార్ హీరోల టీజర్స్, సినిమా ట్రైలర్స్ యూట్యూబ్‌ను షేక్ చేయడం ఈరోజుల్లో కామన్. కానీ వాటికి అతీతంగా ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన పొలిటికల్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం రేపడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి రేర్ రికార్డ్‌ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన మారుమోగుతోంది. వైఎస్ జగన్ అభిమానులకు ఈ పాట తారకమంత్రంగా మారింది. అందుకే ఆ జోష్ యూట్యూబ్ వ్యూస్‌లో స్పష్టంగా కనిపిస్తోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఈ గీతం.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతూ, సంచలనం రేపుతోంది. ఆదివారం నాటికి యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్య కోటిన్నరకు దాటి సరికొత్త చరిత్రను లిఖించింది. మార్చి 8న విడుదలైన ఈ పాట దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డుగా చర్రిలొకెక్కింది. ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు సైతం ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. గతంలో నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబు మోసపూరిత పాలన గురించి పాటను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జగన్ ఎందుకు రావాలో ఈ పాటలో వివరించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ వీడియోకు వస్తున్న అశేష స్పందన.. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ఘన విజయానికి సంకేతమని పరిశీలకులు చెబుతున్నారు. వైఎస్ జగన్‌కు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందన్నది ఈ వీడియో సృష్టించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా యువత ఎక్కువగా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వైఎస్ జగన్ సాంగ్
-
రికార్డు సృష్టిస్తున్న‘రావాలి జగన్ కావాలి జగన్’
అత్యధిక కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నాయకుడెవరు? ఎవరి ప్రచార సభలకు భారీగా జనం పోటెత్తుతున్నారు? యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన ప్రచార వీడియో ఎవరివి? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిది.. ప్రచార ఆర్భాటం లేదు.. రాజకీయ నాటకీయత లేదు.. ఉన్నదంతా జనమే స్వచ్ఛందంగా తమ నాయకుడికి స్వాగతం పలకడం. ఆ నాయకుడు జనమే సర్వస్వం అనుకుంటూ ముందుకు సాగడం. అందుకే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వీడియో గీతం రాష్ట్ర ప్రజానీకం మనసులను ఆవిష్కరించింది. అందుకే అంతటి ప్రజాదరణ పొందింది. ప్రజాదరణకు కొలబద్ధలైన అన్ని రికార్డులను తిరగరాస్తూ చరిత్ర సృష్టిస్తున్న నవతరం నాయకుడు ఎవరంటే వినిపించే ఒకే ఒక్క పేరు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తిరుగులేని ప్రజాదరణతో జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారారు. ఇప్పటికే.. రాజకీయ యవనికపై విప్లవం తీసుకువచ్చిన ఆయన సామాజిక మాధ్యమాల్లోనూ జాతీయ స్థాయి రికార్డులు సృష్టిస్తూ అగ్రభాగంలో నిలుస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్న ఎన్నికల ప్రచార వీడియో ‘రావాలి జగన్.. కావాలి జగన్’. వైఎస్సార్సీపీ రూపొందించిన ఈ వీడియో ఏకంగా కోటి వీక్షణలతో సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు, జగన్ వైపు అబ్బురంగా చూస్తోంది. ఒక పార్టీ ప్రచార గీతం.. అందులోనూ ఓ ప్రాంతీయ పార్టీ ప్రచార గీతం.. జాతీయ పార్టీల ప్రచార గీతాలను వెనక్కినెట్టి మరీ రికార్డు స్థాయి వ్యూవర్స్‌ను ఆకర్షించడమే దీనంతటికీ కారణం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బీజేపీ రూపొందించిన ప్రచార గీతం ‘సబ్ కో స్వాగత్ తయ్యార్ హై’ వీడియో 47 లక్షల వ్యూస్‌తో ఇంతవరకు అగ్రస్థానంలో కొనసాగింది. ఆ రికార్డులను బద్దలు కొడుతూ ‘రావాలి జగన్.. కావాలి జగన్’ వీడియోకు ఏకంగా కోటి వ్యూస్ వచ్చాయి. ఇంతగా ఆదరణ పొందిన ఆ పాటలో ఏముందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏముంది.. రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుంది. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న బాధలున్నాయి. పేదల గుండె మంట ఉంది. తమను ఆదుకోవడానికి జగన్ రావాలి... తమకు జగనే కావాలి అనే జనాభిప్రాయం ఉంది. రాష్ట్ర ప్రజల ఆర్తిని, ఆకాంక్షలను అక్షరీకరిస్తూ ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ దీనిని రచించారు. యావత్ ప్రజల మనోభీష్టానికి పాట రూపమిచ్చారు. ఇక ‘ఫిదా’ సినిమాతో జానపద బాణీలతో అలరించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ మరోసారి జనం మనసులను తడిమే, గుండెను తాకే స్వరాలను సమకూర్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రముఖ గాయకుడు మనో.. మనసు లోతుల నుంచి ఉద్విగ్నభరితంగా ఆలపించారు. ఇలా ప్రజా హృదయ స్పందనను ఆవిష్కరిస్తూ రచించి స్వరాలు సమకూర్చిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ గీతాన్ని అందుకు తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్ర దృశ్యాలతో మేళవించి చక్కని వీడియో గీతంగా విడుదల చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రతిబింబిస్తూ.. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలను వివరిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండే జగన్‌లోని మానవీయ కోణాన్ని స్పృశిస్తూ వీడియో గీతం వాస్తవానికి అద్దం పడుతోంది. వైఎస్సార్ సీపీ ఘన విజయానికి సంకేతం ఈ వీడియోకు వస్తున్న అశేష స్పందన.. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ఘన విజయానికి సంకేతమని పరిశీలకులు చెబుతున్నారు. వైఎస్ జగన్‌కు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందన్నది ఈ వీడియో సృష్టించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా యువత ఎక్కువగా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. దీన్నిబట్టి రాష్ట్ర యువతలో వైఎస్ జగన్‌పై వెల్లువెత్తుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనంగా భావించాలి. కొత్త తరం తమ భవిష్యత్ తీర్చిదిద్దే నాయకుడిగా వైఎస్ జగన్‌ను గుర్తించింది. అందులోనూ రాష్ట్రంలో 2014 తర్వాత కొత్తగా నమోదైన ఓటర్లు దాదాపు 30 లక్షల మంది ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక వీడియో గీతంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థి, ఉద్యోగులు, సామాన్యులు.. ఇలా అన్నివర్గాల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇచ్చారు. -
‘రావాలి జగన్ కావాలి జగన్’ పాటకు కోటి వ్యూస్
-
‘రావాలి జగన్ కావాలి జగన్’కు జన‘కోటి’ ఆదరణ!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఈ గీతం.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతూ, సంచలనం రేపుతోంది. శనివారం సాయంత్రానికి యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్య కోటి దాటింది. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డు అంటున్నారు. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు సైతం ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు. విడుదలైన అనతికాలంలో ఈ పాట విపరీతంగా జనసామాన్యంలోకి కూడా వచ్చేసింది. లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువతీయువకుల నోళ్లల్లో ఈ పాట నానుతూ ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఇంటర్నెట్లో చూసేవారి సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. గురువారం రాత్రికి 70 లక్షలు దాటిన ఈ పాట.. శనివారం సాయంత్రానికి కోటికిపైగా వ్యూస్ సొంతం చేసుకొని.. ఇప్పటికీ దూసుకుపోతోంది. ఒక్క ఏపీలోనే కాక.. పొరుగు రాష్ట్రాల్లోని జగన్ అభిమానులను సైతం ఈ ప్రచార గీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ ప్రాంతీయ పార్టీ ప్రచారగీతం ఇంతగా ఆదరణ పొందడం రాష్ట్రంలో రాగల పెనుమార్పులకు సంకేతం కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
రావాలి జగన్ కావాలి జగన్ ఆల్ టైం రికార్డ్!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ విడుదల చేసిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇంటర్నెట్లో ఆ పాటను విన్న వారి, చూసిన వారి సంఖ్య ఇప్పటివరకు 70 లక్షలు దాటింది. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డుగా చెబుతున్నారు. ఈ పాట విడుదలైన అనతి కాలంలో విపరీతంగా జనసామాన్యంలోకి కూడా వచ్చేసింది. లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువతీయువకుల నోళ్లల్లో ఈ పాట నానుతూ ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఇంటర్నెట్లో చూసేవారి సంఖ్య లక్షల్లో పెరుగుతోందంటే ఈ పాట ప్రజల్లో ఎంత ఆదరణ పొందిందో స్పష్టమవుతోంది. ఈ పాట ఒక్క ఏపీలోనే కాక.. పొరుగు రాష్ట్రాల్లోని జగన్ అభిమానులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతగా అందరినీ ఆకట్టుకున్న ఈ గీతాన్ని ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించారు. ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు. ఓ ప్రాంతీయ పార్టీ ప్రచారగీతం ఇంతగా ఆదరణ పొందడం రాష్ట్రంలో రాగల పెనుమార్పులకు సంకేతం కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో జాతీయ పార్టీల పాటలు మొదటి స్థానంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పాట ఉంటే.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో జాతీయ పార్టీల గీతాలు ఉన్నాయి. అలాగే, 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విడుదల చేసిన ‘సబ్కో స్వాగత్ హై తయ్యార్..’ అంటూ విడుదల చేసిన హిందీ ప్రచారగీతం ఇప్పటివరకూ అత్యధిక వీక్షకులను ఆకట్టుకుంది. ఈ గీతాన్ని అప్పట్లో 47 లక్షల మంది తిలకించారు. తాజాగా, బీజేపీ ప్రచార గీతం ‘మైభీ చౌకీదార్ హూ..’ అనే గీతాన్ని 9,44,000 మంది ఇంటర్నెట్లో తిలకించారు. మరోవైపు.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పాటను లక్షలాది యువతీయువకులు తమ మొబైల్ రింగ్ టోన్లుగా అమర్చుకోవడం చూస్తే దీనికి ఎంతగా ఆకర్షితులవుతున్నారనేది అంచనా వేయవచ్చు. ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేశాయి. -
జగన్ కోసం 72 ఏళ్ల వృద్ధుడు..
సాక్షి, రాజుపాలెం (సత్తెనపల్లి): రావాలి జగన్...కావాలి జగన్ అంటూ గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు 850 కి.మీ పాదయాత్రను పూర్తి చేశారు. కొమ్మా సుబ్బారావు నాయుడు మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి పాదయాత్రగా బయలుదేరారు. జగన్ సీఎం కావాలని ఆయన ఆరు నెలల క్రితం శ్రీశైలం దేవస్థానానికి, మూడు నెలల క్రితం తిరుపతికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 850 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మళ్లీ నాలుగోసారి ఈనెల 26వ తేదీన కారంపూడి అంకమ్మతల్లి దేవాలయానికి పాదయాత్రగా వెళ్లనున్నట్టు సుబ్బారావు తెలిపారు. వైఎస్ జగన్ సీఎం కావాలని, అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగానూ గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తాను పాదయాత్ర చేసేందుకు సహకరిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు రాయపాటి పురుషోత్తం, వేపూరి శ్రీనివాసరావు, కొమెరపూడి కళ్లెం వెంకటరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఫ్యాన్ గుర్తుకు ఓటేయండన్నా..
సాక్షి, కడప కార్పొరేషన్: ఫ్యాన్ గుర్తుకు ఓటేయండన్నా...ఒక్క సారి వైఎస్ జగన్‌కు అవకాశం ఇద్దాం అన్నా.. అంటూ కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా ప్రచారం నిర్వహించారు. ఆదివారం ‘రావాలి జగన్, కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యేకు, ఎంపికీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అంజద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు మోసగించబడ్డారని గుర్తు చేశారు. జగన్ సీఎం అయితే పింఛన్లు రూ.3వేలకు పెంచుతారని, ఆటో డ్రైవర్లకు, బార్బర్ షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10వేలు ఉచితంగా ఇస్తారన్నారు. వీధి వ్యాపారస్తులకు ప్రతి ఏటా పావలా వడ్డీకే రూ.10వేలు రుణం ఇవ్వడం జరగుతుందన్నారు. చిన్నపిల్లలను బడికి పంపితే ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలు జమ చేస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేస్తారన్నారు. మన జిల్లావాసి, మన సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి సీఎం అయితే మన జిల్లాకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, 32వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ అన్సర్ అలీ, నాయకులు రెడ్డి ప్రసాద్, దాసరి శివప్రసాద్, మున్నా, షఫీ, గౌస్, మురళీ, గోపాలక్రిష్ణ, టీపీ వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యం: మల్లాది
-
తాడిపత్రిలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
తోటపల్లి నీరు తీసుకొస్తాం: బొత్స
సాక్షి, మెరకముడిదాం: మండలానికి తోటపల్లి కాలువ ద్వారా నీటిని తీసుకొస్తామని వైఎస్సార్సీసీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. మండలంలోని ఉత్తరావల్లిలో మంగళవారం నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాల ని కోరారు. మహానేత వైఎస్సార్ అందించిన పాలన త్వరలోనే రానున్నదని చెప్పారు. చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు గెలిపించారని, ఇప్పుడు మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మెరకముడిదాం మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చుదిద్దుతానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు.. -
రాష్ట్రవ్యాప్తంగా రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
టీడీపీది అరాచక పాలన
ఒంగోలు సిటీ: టీడీపీ అరాచక పాలన చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక ఆరో డివిజన్లో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నవరత్నాలపై ఇంటింటికీ ప్రచారం చేశారు. డివిజన్ అధ్యక్షుడు జమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. బాలినేని మాట్లాడుతూ అయిదేళ్లు టీడీపీ అరాచక పాలన చేసిందని వివరించారు. ప్రతి ఇంట్లో చంద్రబాబు అరాచక పాలన గురించి చర్చించాలన్నారు. ఈ ఎన్నికల్లో గతంలో చేసిన తప్పునే మళ్లీ చేయకుండా బాబు దుర్మార్గాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల అమలుపై చర్చించాలని అన్నారు. బీసీలను ఎలా దగా చేశారో ప్రతి కుటుంబం ఆలోచించాలని తెలిపారు. మన ఆధార్ డేటాతో సహా వ్యక్తిగత సమాచారాన్ని తమ తాబేదారు కంపెనీలకు అమ్ము కోవడానికి చంద్రబాబు ఎవరని ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. వైఎస్సార్ సీపీకి ఎన్నికల్లో మద్దతు పలకాలని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఒక అవకాశం ఇవ్వమన్నారు. రాష్టంతోపాటు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. నేడు మన పిల్లల్ని చదివించుకోవడానికి ఎందుకు అప్పుల పాలవుతున్నామో ప్రతి ఇంటా చర్చ జరగాలని అన్నారు. రోగం వస్తే ఆస్తులను తెగనమ్ముకోవాల్సిన దుస్థితిపై లోతుగా చర్చించి ఓటు వేయాలన్నారు. పొదుపు మహిళల రుణాలను మాఫీ చేయలేదని వివరించారు. పసుపు–కుంకుమ పేరుతో మూడు వేలు ఇచ్చి సరిపెట్టారన్నారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. ప్రతి పొదుపు మహిళ ఆలోచించాలని కోరారు. నేడు పింఛన్ రూ.2 వేలు ఇస్తున్నారంటే జగన్ వల్లే కదా అని గుర్తించాలన్నారు. జగన్ సీఎం అయితే పింఛన్ రూ.3 వేలు ఇస్తారని అన్నారు. బీసీలకు ప్రత్యేకించి జగన్ డిక్లరేషన్ ఇచ్చారన్నారు. నామినేటెడ్ పదవుల్లో యాభైశా తం బీసీలకే నని అన్నారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఓటర్లు చెక్ చేసుకోండి ఓటర్లు మీ ఓటు ఉందో లేదో జాబితాలో చూసుకోండన్నారు. 1950 ఎన్నికల సంఘం టోల్‌ప్రీ ద్వారా వివరాలను తెలుసుకోండని అన్నారు. ఓటు లేని వారు ఉంటే ఈ నాలుగు రోజుల్లో ఈసీఐ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటరుగా నమోదు కావాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గుర్రం వెంకయ్య, వెలనాటి మాధవ. యనమల నాగరాజు, కొఠారి రామచంద్రరావు, ఎందేటి రంగారావు, ఎందేటి వెంకట్రావు, పటాపంజుల శ్రీను, కటారి సంజీవ్, పందరబోయిన పున్నారావు, సాయి,పూరిమిట్ల హర్నాద్, పులుగు అక్కిరెడ్డి, ఆంజనేయులు, కుప్పం ప్రసాద్, బట్టు శ్రీను, కావటి రవి, జలీల్, మహిళా నాయకులు మల్లమ్మ, కృష్ణవేణి, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి
-
మంచి నాయకుల కోసం ఓ డాక్టర్ సైకిల్ సవారీ..!
సాక్షి, సత్తెనపల్లి: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిస్వార్థమైన సేవలు అందించే పాలకులను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు సైకిల్ యాత్ర చేయాలని ఓ డాక్టర్ నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల క్రితం పాలకులు కల్పించిన భ్రమలతో ప్రజలు ఓట్లు వేస్తే ఐదేళ్ల పాటు హామీలు అమలు చేయకుండా ప్రజలకు చుక్కలు చూపించారన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ సవారీ చేసేందుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్ యేరువ నరసింహరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ సైకిల్ సవారీ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల వద్ద ముగియనుంది. 74 నియోజకవర్గాలను కలుపుతూ యాత్ర సాగేలా రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రాధాన్యతను వివరిస్తూ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలనే యోచనతో ఎన్నికల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకు రాబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు జగన్ సమక్షంలో యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. -
చంద్రబాబు, లోకేష్ జైలుకు పోవడం ఖాయం : పెద్దిరెడ్డి
-
తూర్పు గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
పశ్చిమ గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంతపురం జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది
సాక్షి, దొనకొండ: రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతే అధికంగా తాండవిస్తోందని వైఎస్సార్సీపీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త మద్దిశెట్టి వేణుగోపాల్ విమర్శించారు. మండలంలోని సంగాపురం, వీరేపల్లి గ్రామాల్లో పార్టీ మండల కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గొంగటి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మంగళవారం రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో ఆయనకు ఆడపడుచులు అడుగడుగునా పూలమాలలతో స్వాగతం పలుకుతూ విజయ తిలకం దిద్దారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగా నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి ఎక్కువైందని, టీడీపీ పాలకులు అభివృద్ధి మరిచి గొప్పలు చెప్పుకునేందుకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలను కలుపుకునిపోతామని స్పష్టం చేశారు. తాగునీరు కరువైంది : మహిళల ఆవేదన తమ గ్రామానికి తాగునీరు కరువైందని, గుక్కెడు నీరు అందక అల్లాడుతున్నామని సంగాపురం మహిళలు మద్దిశెట్టి ముందు గగ్గోలు పెట్టారు. స్పందించిన మద్దిశెట్టి.. నీటి సమస్య పరిష్కరించేందుకు ట్యాంకర్‌తో నీటి సరఫరా చేయిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే, సమస్యను శాశ్వితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో భూ సమస్య ఎక్కువగా ఉంది... సంగాపురం గ్రామంలో భూ సమస్య ఎక్కువ ఉందని, టీడీపీ ప్రభుత్వంలో తమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోస్లారు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే గ్రామంలో భూ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని మద్దిశెట్టి హామీ ఇచ్చారు. 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరిక... వీరేపల్లి గ్రామంలో టీడీపీ నుంచి 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. మద్దిశెట్టి వేణుగోపాల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తమకు అన్యాయం జరగడంతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వల్లపునేని వీరయ్యచౌదరి, ఎంపీటీసీ సభ్యులు షేక్ గఫార్, విప్పర్ల సుబ్బయ్య, మాజీ సర్పంచులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పాతకోట కోటిరెడ్డి, దేవేండ్ల వెంకట సుబ్బయ్య, మాచనూరి బాబు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చీరాల ఇశ్రాయేలు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జొన్నకూటి సుబ్బారెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి నూనె వెంకటరెడ్డి, వి.కోటేశ్వరరావు, భద్రయ్య, చిన్న వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బత్తుల వెంకట సుబ్బయ్య, జిల్లా పబ్లిసిటీ ప్రధాన కార్యదర్శి పత్తికొండ వెంకటసుబ్బయ్య, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుండాల నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి కొంగలేటి మోషె, వెన్నపూస చెంచిరెడ్డి, గుడిపాటి నాసరయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ యూనుస్, తమ్మనేని యోగిరెడ్డి, ప్రచార విభాగం మండల అధ్యక్షుడు గొంగటి పోలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కడప జిల్లాలో రావాలి జగన్ కావలి జగన్ కార్యక్రమం
-
రావాలి జగన్ కావాలి జగన్
-
రావాలి జగన్ కావాలి జగన్
-
‘రావాలి జగన్... కావాలి జగన్’ సాంగ్ విడుదల
-
‘రావాలి జగన్... కావాలి జగన్’ ఆడియో సాంగ్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్... కావాలి జగన్’ ఆడియో సాంగ్‌ను ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి విడుదల చేశారు. సోమవారం పార్టీ కేంద్రకార్యలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బొత్ససత్యనారయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, సూర్య నారాయణ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సామన్య ప్రజలకు, రేపటి తరానికి ఈ పాట మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. గతంలో నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబు మోసపూరిత పాలన గురించి ప్రచారం చేశామని, ఇప్పుడు వైఎస్ జగన్ ఎందుకు రావాలో ఈ పాటలో వివరించామని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఏఏ కార్యక్రమాలు చేపడతామో.. ఈ పాట ద్వారా వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నవరత్నాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ పాటలో ఉన్నాయని, శవరాజకీయాలు చేసే పార్టీ తమది కాదన్నారు. హరికృష్ణ పార్థివ దేహం పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు తమ పార్టీ అధినేతపై చేస్తున్న ఆరోపణలన్ని నిరాధారమైనవన్నారు. ( ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పాట డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) జగన్ ప్రచార పాట కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుందని ఈ సందర్భంగా ఆనం అభిప్రాయపడ్డారు. నవరత్నాల ఫలితాలు, అధికారపార్టీ వైఫల్యాలు.. ప్రజలకు చేరువచేయాలనే ఈ పాటను విడుదల చేశామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేయబోతుందో.. ఇలాగే పాటల రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తామని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇబ్బందులకు గురయ్యాయన్నారు. చంద్రబాబు సామాజిక వర్గం తప్ప రాష్ట్రంలో ఏ వర్గం బాగుపడలేదన్నారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు టీడీపీ అవినీతిలో కూరుకపోయిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ విధి విధానాలతో ముందుకు పోతుందని బొత్స స్పష్టం చేశారు. (చదవండి: ‘వక్రీకరించినా.. నరకాసురుడు ఎప్పటికి విలనే’) -
టీడీపీని భూస్థాపితం చేద్దాం
ఒంగోలు సిటీ: అన్యాయాలకు, అరాచకాలకు, అవినీతికి తెలుగుదేశం పాలన నిలయమైందని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలనను భూస్థాపితం చేద్దామని పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలు 14వ డివిజన్లోరావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమంలో నవరత్నాలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ చంద్రబాబు ఓట్ల కొనుగోలు రాజకీయాలను చేస్తున్నారని విమర్శించారు. దండిగా డబ్బును వదిలి అడ్డదారుల్లో ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆదమరిస్తే మళ్లీ ఐదేళ్లు చంద్రబాబు అరాచకాలు, అవినీతి, అన్యాయాలు, మోసాలను భరించాల్సి వస్తుందని వివరించారు. ఓటర్లు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు శాశ్వత విశ్రాంతి ఇద్దాం.. మోసాలకు చిరునామా అయిన చంద్రబాబును ఈ ఎన్నికల ద్వారా శాశ్వత విశ్రాంతి ఇవ్వాలని బాలినేని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని పూర్తిగా అమలు చేయలేదన్నారు. గత ఎన్నికల్లో 600 హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టారని, ఎన్నికలయ్యాక డిజిటల్ అభివృద్ధి చూపిస్తూ ప్రజల్ని మోసగించారని అన్నారు. ఎక్కడా అభివృద్ధి ఛాయలు లేవన్నారు. అంతా ఆర్భాటపు ప్రచారంతో, జనం డబ్బు దుబారాతో నాలుగున్నర ఏళ్ల కాలాన్ని గడిపారని విమర్శించారు. యథారాజా తథాప్రజ అన్నట్లుగా చంద్రబాబు అరాయించుకోని అవినీతిని ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు అందిపుచ్చుకున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. ఓటుతో నిజాయితీని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు తెలిసిన రాజకీయాలు ఓట్లను కొనుగోలు చేయడమే అన్నారు. మానవత్వంలేని ఇలాంటి టీడీపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వసనీయ రాజకీయాలకు జీవం పోయాలన్నారు. ఎన్నికల్లో తాయిలను ఇచ్చి ఓట్లను దోచుకోవాలని జనం డబ్బుతో పథకాలను ప్రకటిస్తున్నారని అన్నారు. ఇందులో ఏ ఒక్కదానిని పూర్తిగా ఇచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. వైఎస్సార్ సీపీలోనే బీసీలకు ప్రాధాన్యం.. ఎన్నికల్లో ఓటర్లను పక్కదారి పట్టిస్తున్నారని ఈ కుట్రను గుర్తించాలని బాలినేని చెప్పారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ఎవరు నిజంగా అభివృద్ధి కాముకులో తెలుసుకొని ఓట్లు వేయాలన్నారు. నాలుగున్నర ఏళ్ల పాటు అమరావతి అంటూ ప్రజల్ని భ్రమల్లో ఉంచారన్నారు. తాబేదార్లకు చౌకగా భూములను కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టారన్నారు. సంక్షేమ పథకాలంటూ ఊదరగొడ్తున్నారన్నారు. ప్రజల్ని రకరకాలుగా మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమేందుకు ప్రజలు కదలాలని అన్నారు. టీడీపీ కులాలను రెచ్చగొడ్తుందన్నారు. ఎన్నికల్లో ప్రయోనం పొందాలని కుట్రలను పన్నుతుందని అన్నారు. వైఎస్సార్సీపీ ఒక్కటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వనుందని అన్నారు. బీసీ డిక్లరేషన్ ద్వారా వెనుకబడిన వర్గాలకు ఆర్ధికంగా చేయూతనివ్వడానికి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి చేస్తున్న కృషిని ప్రస్తావించారు. రాజకీయాలంటే ఈసడించుకొనేట్లు చేసిన టీడీపీని నామరూపాల్లేకుండా చేసి విశ్వసనీయతను బతికించాలని కోరారు. ఒంగోలు నగరంలో జరిగిన అభివృద్ధిలో ఎవరి పాత్ర ఏమిటనేది ఆలోచించి ఓటెయ్యాలని అన్నారు. డివిజన్లోని గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. 14వ డివిజన్ అధ్యక్షుడు చావలి శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, డివిజన్ నాయకులు ఎండీ ఇమ్రాన్, శ్రీకాంత్, ఉంగరాల శ్రీను, టి.వెంకటేష్, గోళ్ల బలికుమార్, కొంపల్లి విష్ణు, వరదా నాని, టి.సుధ, వాసు, నిర్మల, పీడీసీసీబీ మాజీ ఛైర్మన్ ఈదర మోహన్‌బాబు, నాయకులు వై.వెంకటేశ్వరరావు, కేవీ రమణారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, కటారి శ«ంకర్, గంటా రామానాయుడు, అంజిరెడ్డి, సునీల్, మహిళా నాయకులు గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, పోకల అనురాధ, పల్లా అనురాధ, బి.రమణమ్మ, బడుగు ఇందిర, కావూరి సుశీల పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీపై టీడీపీ రాళ్ల దాడి
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ రాళ్ల దాడి
ముప్పాళ్ల (సత్తెనపల్లి) : గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..గ్రామంలోని మండపాల సెంటర్ నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. దీంతో వారంతా పరుగులు తీశారు. ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. దాడితో వైఎస్సార్సీపీ కార్యకర్తలు జాన్‌బాషా, సుభాని, హుస్సేన్‌లకు గాయాలయ్యాయి. వీరిలో జాన్‌బాషా తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావటంతో అక్కడే ఉన్న నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీకృష్ణదేవరాయలు బాధితులకు చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు. దీంతో గాయపడ్డ ముగ్గురినీ సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, టీడీపీకి చెందిన రాయుడు హనుమంతరావు ఈ దాడికి సూత్రధారిగా తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటుచేశారు. -
అవకాశం ఇస్తే.. రాజన్న రాజ్యం
వైఎస్ఆర్ జిల్లా , పులివెందుల(సింహాద్రిపురం) : ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం అందిస్తామని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామంలో శుక్రవారం వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి ఎన్ శివప్రకాష్‌రెడ్డితో కలిసి రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, వేయించి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కలిగే లబ్ధిని వారు వివరించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు జగన్ చట్టబద్ధత కల్పిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుబడిన కులాలకు 50 శాతం పదవులు వస్తాయని అవినాష్‌రెడ్డి తెలిపారు. బీసీల్లోని 139 కులాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లికి ఏటా రూ.15వేలు తల్లి ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సంచార జాతులకు ఉచితంగా ఇళ్లు, ఉపాధి, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 అదనంగా ఇస్తామన్నారు. అలాగే ప్రతి నిరుపేద, నిరుద్యోగికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఇళ్లులేని వారికి ఇల్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక్కసారి వైఎస్ జగన్‌కు అవకాశం ఇస్తే.. ప్రతి ఒక్కరి గుండెలో ఆయన చిరస్థాయిగా నిలిచేలా పరిపాలన అందిస్తారని అవినాష్‌రెడ్డి ప్రజలకు వివరించారు. -
రావాలి జగన్ కావాలి జగన్
-
రావాలి జగన్ కావాలి జగన్
-
కర్నూలు జిల్లాలో రవాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపుదాం
నంద్యాల: టీడీపీ హయాంలో అవినీతికి పెచ్చుమీరిందని, దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపేరోజు ఎప్పుడెప్పుడు వస్తుందానని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల నాయకులు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. శుక్రావారం పట్టణంలోని నూనెపల్లెలో రావాలి జగన్.. కావాలి జగన్.. కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ముఖ్యమంత్రి అయితే చేపట్టే నవరత్నాల సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల మంజూరులో పేదవారికి న్యాయం జరగడం లేదన్నారు. ఎవరు లంచం ఇస్తే వారికి మాత్రమే పనులు జరుగుతుండటంతో పేదలు మరింత నిరుపేదలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా గృహాల మంజూరు, వృద్ధాప్య పింఛన్లు, కార్పొరేషన్ రుణాలు ఇలా ప్రతి పథకానికి టీడీపీ నాయకులు డబ్బు వసూలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా రైతులకు అన్యాయం టీడీపీ హయాంలో రైతాంగం కన్నీరు పెడుతోందని శిల్పా రవి అన్నారు. కర్నూలు జిల్లా కరువు కాటకాలతో అల్లాడుతుంటే ఈ ప్రాంత ప్రజలను ఎండగట్టి అనంతపురం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు పంపారని విమర్శించారు. ఇటీవల చంద్రబాబు జలసిరి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతుల కన్నీరు కనపడలేదా అని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా మద్దతు ధర లేదని, దీని వలన రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మంచిరోజులు రావాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలన మళ్లీ రావాలని, అది ఒక్క జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అమృతరాజు, వైఎస్సార్సీపీ నాయకులు సోమ గోని శ్రీనివాసగౌడు, తోట రామకృష్ణ, రమణగౌడ్, తోట రాజగోపాల్, ఓబులేసు గౌడ్, తోట మద్దిలేటి, కుమారగౌడ్, పోలూరు శీను పాల్గొన్నారు. -
కృష్ణ జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
గుంటూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కర్నూలు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
విశాఖలో రావాలి జగన్ కావలి జగన్ కార్యక్రమం
-
మైదుకూరులో రావాలి జగన్ కావలి జగన్ కార్యక్రమం
-
తూర్పుగోదావరి జిల్లాలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం
-
లోకేష్ సభలో ‘రావాలి జగన్ కావాలి జగన్’
సాక్షి, తిరుపతి : సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు తిరుపతి పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన సభలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే స్లోగన్స్ ఉన్న కుర్చీలను చూసి చిన్నబాబు అవాక్కయ్యారు. శనివారం రేణిగుంట సమీపంలోని వికృత మాల వద్ద ఎన్టీఆర్ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లోకేష్ పాల్గొన్న సభలో చాలా కుర్చీలపై జగన్ స్టిక్కర్లున్నాయి. వీటిని చూసిన లోకేష్‌కు దిమ్మతిరిగింది. ఇది గమనించిన మీడియా ఫొటోలు, వీడియోలు తీయడంతో తేరుకున్న నిర్వాహకులు వాటిని సభ నుంచి తొలగించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తుండగా.. చిన్నబాబుపై కుళ్లు జోకులు పేలుతున్నాయి. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసారు. స్వార్ధ ప్రయోజనాల కోసం ప్యాకేజీకి ఒప్పుకుని ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. టీడీపీ ఇప్పడు హడావిడిగా ఎన్నికల ముందు చేసే గారడీలను రాష్ట్రం నమ్మే పరిస్థితిలో లేదు. లోకేష్ సభలో కూడా వైయస్ఆర్ సీపీ స్టిక్కర్లు ఉన్నాయి. దీని పై ఏమంటారు? @JaiTDP @ncbn pic.twitter.com/wHAAxr9asI — YSR Congress Party (@YSRCParty) 10 February 2019 -
రావాలి జగన్ కావాలి జగన్
-
నరసాపురంలో రావాలి జగన్ కావాలి జగన్
-
గుంటూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కడప జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
తూర్పు గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
తెనాలిలో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమం
-
రావాలి జగన్ కావాలి జగన్
-
విశాఖలో రవాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
తూర్పుగోదావరి జిల్లాలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం
-
రావాలి జగన్ కావాలి జగన్
-
గెలుపే లక్ష్యం
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పార్టీ పార్లమెంటరీ జిల్లాల అ«ధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, నాయకుల పని తీరుపై నియోజకవర్గాల వారీగా గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయడం లక్ష్యంగా, గ్రామస్థాయి నుంచి బూత్ కమిటీ సభ్యులు, పార్టీ అనుకూల సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ మండలాధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, ముఖ్యనేతలు ఏకతాటిపైకి రావాలని సూచిం చారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రధానంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించాలని సూచించారని నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలను టీడీపీ మభ్యపెట్టే అవకాశం ఉన్నందున కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండి సమర్థవంతగా తిప్పికొట్టాలని సూచించారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యం కావాలి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పార్టీ నాయకులకు బొత్స సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. మొదటి దశలో తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యారు. నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి సమష్టిగా పార్టీ పటిష్టతకోసం కృషి చేయాలని కోరారు. జిల్లాలో నియోజ కవర్గాల వారీగా నాయకులతో సమీక్ష జరగనున్నట్లు పార్టీ నేతలకు వివరించారు. ఈ సమీక్షలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోశయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, స్థానిక నేతలతో బొత్స సమీక్షించారు. ఓటర్ల జాబితాలపై దృష్టి... పట్టణాలు, గ్రామాల్లో ఓటర్ల జాబితాలను పరిశీలించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లు ఉన్నాయో, లేవో, చూసుకోవాలని నేతలకు సూచించారు. దొంగ ఓట్ల పై దృష్టి సారించాలని, వాటిని తొలగించేలా చూడాలని పేర్కొన్నారని సమాచారం. ఓటర్ల జాబితాకు సంబంధించి మార్పులు, చేర్పులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటూ కీలకమేనని నాయకులకు వివరించినట్లు సమాచారం. -
నంద్యాలలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమం
-
కర్నూలు జిల్లాలో రావాలి జగన్..కావాలి జగన్
-
శ్రీశైలంలో రావాలి జగన్..కావాలి జగన్
-
తూర్పు గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంతపురం జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
గన్నవరంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
పశ్చిమ గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కర్నూలు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంతపురం జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కడప జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
చిత్తూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
రావాలి జగన్-కావాలి జగన్ చేపట్టిన భీమవరం మాజీ ఎమ్మెల్యే
-
టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. 46వ డివిజన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రభాకర్ చౌదరి అనుచరులు, టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయిన కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు జారుకున్నారు. శారదనగర్‌లో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను కూడా ప్రభాకర్ చౌదరి వర్గీయులు చించివేశారు. దీనిపై మైనార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ చౌదరి అభద్రతా భావంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీకి రోజురోజుకూ ప్రజా ఆదరణ పెరుగుతుందని తెలిపారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. టీడీపీ నేతల అవినీతిపై జనం ఆగ్రహంగా ఉన్నారని.. బహిరంగ చర్చకు రాకుండా ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప పారిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. -
రాజధాని సమస్యలు పరిష్కారం కావాలంటే..
అమరావతి: తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కిలారు రోశయ్య, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవితో పాటు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిలారు రోశయ్య మాట్లాడుతూ..వచ్చే 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిపించాలని ప్రజలను కోరారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. రాజధానిలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఉండవల్లి శ్రీదేవిని గెలిపించుకోవాలన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడని ఆరోపించారు. రైతులు దగ్గర నుంచి మూడు పంటలు పండే భూమిని లాక్కున్నారని ధ్వజమెత్తారు. రాజన్నరాజ్యం జగన్‌తోనే సాధ్యం: లేళ్ల రాష్ట్రంలో రాజన్న రాజ్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.అధికారంలోకి రాగానే నవరత్నాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి దోచుకోవడం దాచుకోవటం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాజన్న పేరుతో ఉచిత వైద్యం: శ్రీదేవి ప్రజలకు సేవ చేయడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, రాజధానిలో అనేక సమస్యలు ఉన్నాయని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పారు. రాజన్న వైద్యం పేరుతో రాజధానిలో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. మందులు కూడా పంపిణీ చేయాలనుకుంటున్నామని తెలిపారు. వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైఎస్సార్సీపీ నవ రత్నాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని వ్యాక్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని అభ్యర్థించారు. -
టీడీపీ పాలనలో అప్రజాస్వామ్యం
నిమ్మనపల్లె : జన్మభూమి కమిటీలతో ప్రభుత్వం దొడ్డిదారిన టీడీపీ నాయకులకు అధికారం అప్పగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని రాజంపేట మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. శనివారం నిమ్మనపల్లె మండలం బండ్లపై గ్రామ పంచాయతీలో నిర్వహించిన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా వైఎస్సార్సీపీ నియోజకవర్గాల్లో అభివృద్ధిని కుంటుపరిచారని విమర్శించారు. గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల అవినీతి పెచ్చుమీరిందని తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అనుచరులకు మంజూరు చేసుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. -
అవినీతి పాలనకు చరమగీతం పాడాలి
సాక్షి, అంబాపురం (విజయవాడ రూరల్): గన్నవరంలో నాలుగున్నరేళ్ళుగా కొనసాగుతున్న అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. అంబాపురం గ్రామంలో సోమవారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకానికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి వాటిని వివరించారు. అనంతరం వైఎస్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో చెరువుల్లో మట్టి, ఇసుక అక్రమ విక్రయాలతో అవినీతి పాలన జరుగుతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆ దుష్ట పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీతివంతమైన పాలన ప్రజలకు అందజేస్తుందని భరోసా ఇచ్చారు. సంపాదించుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని స్పష్టం చేశారు. కాగా, గ్రామానికి వచ్చిన వెంకట్రావుకు ఘన స్వాగతం పలికారు. మహిళలు ఆయన రాక కోసం ఎదురుచూశారు. ఈ సందర్భంగా 25 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి వెంకట్రావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కన్వీనర్ నల్లమోతు చంద్రశేఖర్, కోకన్వీనర్ జోగా ప్రవీణ్, పార్టీ మండల కన్వీనర్ ఓంకార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు యర్కారెడ్డి నాగిరెడ్డి, కోటగిరి వరప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ బీసీ అధ్యాయన కమిటీ సభ్యుడు, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు బొమ్మిన శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బడుగు శ్రీనివాసరావు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కైలే జోజి, ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి తగరం కిరణ్, మాజీ ఎంపీపీ తోడేటి రూబేన్, మొగిలిచర్ల జోజిబాబు, గోపి, ఎన్.శ్రీను, మాదల నాని, బొంతు శ్రీనివాసరెడ్డి, అవుతు శివారెడ్డి, గొడ్డళ్ళ ఏడుకొండలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. -
పట్టువదలని విక్రమార్కులు
సాక్షి కడప: ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చు..అలాంటిది మంత్రి ఆది ఇలాకా కావడం.. కంచుకోటలాంటి గొరిగెనూరులో వైఎస్సార్ సీపీ పాగా వేస్తుందంటే జీర్ణించుకోలేకపోయిన వారు ఎలాగైనా అడ్డుకునేందుకు వ్యూహ రచన చేశారు. పోలీసుల ద్వారా గృహ నిర్బంధం చేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఎట్టేకేలకు మార్గం సుగమమైంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నా పోలీసులు అడ్డుకున్న వైనంపై కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్సుధీర్రెడ్డిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామానికి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. గతంలో పెద్దదండ్లూరు విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. బుధవారమే మాజీ ఎంపీతోపాటు సుధీర్‌రెడ్డి, ఇతర నేతలు వెళ్లాల్సి ఉండగా, పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకునే విషయంలో గ్రామానికి వెళ్లాల్సిందేనని నేతలు పట్టుబట్టినా పోలీసులు ముందుకు కదలనివ్వలేదు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడం, పోలీసుల తీరుపై మండిపడిన ధర్మాసనం 144 సెక్షన్‌ను అతిక్రమించకుండా పర్యటించవచ్చని ఆదేశించడంతో శుక్రవారం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు ఎట్టకేలకు గ్రామంలో పర్యటించారు. మంత్రి ‘ఆది’ కోటకు బీటలు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఇలాకాలో అధిక ప్రాధాన్యత ఉన్న ఏడు గ్రామాల్లో గొరిగెనూరు ఒకటి. ఇక్కడ వైఎస్సార్ సీపీ నేతలు అడుగు పెట్టడాన్ని జీర్ణించుకోలేక ఇప్పటికే రకరకాల ఆటంకాలు సృష్టించినా ఎట్టకేలకు మాజీ ఎంపీ, సమన్వయకర్తలు గ్రామంలో పర్యటించారు. ఆది కోటలో వలసల తొలి అడుగుతో కంచుకోట బీటలు వారిందని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలోనూ పెద్దదండ్లూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరుసటిరోజు నూతన జంటలను ఆశీర్వదించడానికి వెళుతున్న సందర్భంలోనూ మంత్రి వర్గం నానారభస సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గిరిగెనూరు ఒక్కటే కాదు..మిగిలిన అన్ని గ్రామాల్లోనూ వైఎస్సార్ సీపీ పంజా విసురుతుందని, అన్ని గ్రామాల్లోనూ జెండా ఎగుర వేస్తామని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తేల్చి చెప్పారు. వైఎస్సార్ సీపీలో చేరిన 42 కుటుంబాలు మంత్రి ఆదికి బాగా పట్టున్న గ్రామమైన గొరిగెనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డిల సమక్షంలో గ్రామానికి చెందిన సుమారు 42 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. గ్రామానికి చెందిన గోంగటి భాస్కర్‌రెడ్డి, ఆయన సొదరుడు గోంగటి రమణారెడ్డి, ఓబులేసు, నీలకంఠా, కల్కి సుధాకర్, లక్ష్మీ నరసింహ్ములు, చిన్న వెంకటరమణ, చిన్న ఓబులేసు, క్రిష్ణయ్య, కోడూరు లక్షుమయ్య, నడిపి ఓబులేసు, మూలింటి పెద్దనరసింహులు, మూలింటి అమ్మన్న, మేకల ఓబులేసు, మూలింటి ఆదినారాయణ, సాకే చంద్ర ఓబులేసు, రవీంద్రబాబు, తలారి నరేష్, కల్కి కలికయ్య పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన దళిత వర్గాలు తమ ఇళ్ల వద్దకు రావాలని వైఎస్సార్ సీపీ నేతలను ఆహ్వానించాయి. దీంతో వారి మాట మన్నించి ఇరువురు నేతలు వెళ్లి పలుకరించి వచ్చారు. అయితే సాయంత్రానికే మంత్రి వర్గం అణగారిన వర్గాలను నయానో భయానో పార్టీలో చేరలేదని చెప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే వాహనం–ముగ్గురు నేతలు జమ్మలమడుగు పరిధిలోని గొరిగెనూరు గ్రామానికి బుధవారమే వెళ్లాల్సి ఉండగా, పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేయడంతో వైఎస్సార్ సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ప్రజాస్వామ్యంలో ఒక గ్రామానికి వెళ్లేందుకు ఆటంకం కలిగించడం సమంజసం కాదని సీరియస్ అయింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అతిక్రమించకుండా వెళ్లాలని కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కేవలం ఒకే ఒక వాహనంలో మాజీ ఎంపీ, సమన్వయకర్త, రాష్ట్ర కార్యదర్శి మాత్రమే గ్రామంలో పర్యటించారు. అడుగడుగునా నిఘా గొరిగెనూరు గ్రామంలో వైఎస్సార్ సీపీ నేతలు పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టారు. 144 సెక్షన్ ఎక్కడఅతిక్రమించినా కేసులు పెట్టాలన్న ఆలోచన ఏమో తెలియదు గానీ ఒక డ్రోన్ కెమెరాతోపాటు ప్రత్యేకంగా మరికొన్ని వీడియో కెమెరాలతో వారి పర్యటనను రికార్డు చేశారు. ఎక్కడికక్కడ జమ్మలమడుగు పరిధిలోని పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పరిశీలించారు. అయితే ముగ్గురు నేతలు హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ తన పర్యటనలో ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా పర్యటనను ముగించుకుని వచ్చారు. -
జగనన్నను ఆశీర్వదించండి
నల్లమాడ: వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని వైఎస్సార్సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రజలను కోరారు. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగిరేలా చూడాలన్నారు. మండల కేంద్రం నల్లమాడలోని 148,149వ బూత్‌ల్లోని పాత మసీదు వీధి, మేదర కొట్టాలు, అక్కమ్మగారి వీధి, బెస్త బజార్, పోలీస్‌స్టేషన్ వెనుక వీధి తదితర ప్రాంతాల్లో గురువారం సమన్వయకర్త ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ నల్లమాడ, రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాలు నిర్వహించారు. సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల కరపత్రాలు అందజేసి పథకాల గురించి వివరించారు. జగనన్న సీఎం కాగానే రైతులకు ప్రతిఏటా మే నెలలోనే రూ.12,500 పెట్టుబడి సాయం అందించడమే గాక ఉచితంగా బోర్లు వేయిస్తారన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్, లేదా రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీచేసి సున్నా వడ్డీకే అక్కచెల్లెమ్మలకు రుణాలు మంజూరు చేస్తామని, డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని మహిళలకు సూచించారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో యేడాదికి రూ.15 వేలు జమచేస్తామని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తామన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని తెలిపారు. సమస్యల ఏకరువు.. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి ప్రజలు పలు సమస్యలను ఏకరువు పెట్టారు. తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కమ్మగారి వీధికి చెందిన మహిళలు డేరంగుల గంగులమ్మ, హాజీనా వాపోయారు. సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తక్షణమే స్పందించి తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ రాబర్ట్విల్సన్కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వేలిముద్రలు పడలేదంటూ పింఛన్ తొలగించారని వృద్ధురాలు నారాయణమ్మ కన్నీరుమున్నీరైంది. డ్వాక్రా రుణం మాఫీ కాలేదని, పింఛన్, పక్కాగృహాలు, సబ్సీడీ రుణాలు, డ్రైనేజీ తదితర సమస్యలను ఏకరువు పెట్టారు. మరో ఐదు నెలలు ఓపిక పట్టాలని, జగనన్న సీఎం కాగానే అందరి సమస్యలు తీరతాయని శ్రీధర్‌రెడ్డి హామీ ఇచ్చారు. మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌హెచ్ బాషా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొరకల రమణ, జిల్లా కార్యవర్గ సభ్యురాలు మోదీనమ్మ, మాజీ సర్పంచ్‌లు టీడీ కేశవరెడ్డి, రంగలాల్‌నాయక్, మంజునాథరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.రమణానాయక్, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు కుళ్లాయినాయక్, మండల అధ్యక్షుడు డి.రమణానాయక్, హిందూపురం పార్లమెంట్ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, నాయకులు జయరామిరెడ్డి, దుద్దుకుంట వెంకటరెడ్డి, ఆర్పీ రెడ్డి, జి.కేశవరెడ్డి, కె.వేణుగోపాల్, షబ్బీర్, సలీం, గోవిందరెడ్డి, పెద్దరెడ్డెప్ప, శివశంకర్‌రెడ్డి, శివారెడ్డి, చంద్రహాసరెడ్డి, యూత్ నాయకులు సతీష్‌యాదవ్, ప్రతాప్‌నాయక్, శంకర్‌రెడ్డి, పాల నరసింహులు, తిరుపాల్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, ప్రకాష్, కె.గంగాధర, జింకల ఆదినారాయణ, నారాయణస్వామి, బత్తల వెంకటనారాయణ, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో రావాలి జగన్ కావాలి జగన్
-
జగన్ ప్రభుత్వంలో సొంత ఇంటి కల నెరవేరుస్తాం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల సొంతింటి కలను నెరవేర్చుతామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గురువారం రావాలి జగన్– కావాలి జగన్ అనే నినాదంతో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నపుబట్టీల వీధిలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి పేదలను రుణగ్రస్తులను చేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం వస్తే ఎలాంటి షరతులు లేకుండా ఇళ్లు నిర్మించి ఇచ్చి తాళాలు చేతికి ఇస్తామన్నారు. సొంతింటి కల నెరవేర్చని పక్షంలో మళ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి ఇంటిలో పేద పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారందరికి పింఛన్ వస్తుందన్నారు. పట్టణ పరిధిలోని 40 వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. 13వ వార్డు పరిధిలోని సున్నపుబట్టీ వీధి వెనుక ఉన్న డ్రైనేజి కాలువలను చూస్తే మున్సిపాలిటీ నిర్లక్ష్యం ఇట్లే తెలిసిపోతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యానికి ఇది నిలువుటెత్తు సాక్ష్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ శివకుమార్ యాదవ్, టప్పా గైబుసాహెబ్, గోనా ప్రభాకర్‌రెడ్డి, సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, టౌన్‌బ్యాంకు డైరెక్టర్ ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, చెన్నకేశవరెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు బీఎన్ఆర్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు ఓబయ్య యాదవ్, వెల్లాల శేఖర్, వెలవలి నాయకుడు రాజశేఖరరెడ్డి, వాసుదేవరెడ్డి, జాకీర్, బంకచిన్నాయపల్లె లక్ష్మిరెడ్డి, మల్లికార్జున, అజీం, ఎంపీటీసీ సభ్యుడు చంద్ర ఓబుళరెడ్డి, పాములేటి, తీట్ల మనోహర్, తిరుపాల్, వెంకటేశ్, జిల్లా పార్లమెంట్ కమిటీ సహాయ కార్యదర్శి షాపీర్, ఎస్ఎండీ ఇలియాస్ పాల్గొన్నారు. -
ఉల్లికల్లు వాసులను ఆదుకుంటాం
అనంతపురం, శింగనమల: చాగల్లు రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో నిర్వాసితులైన ఉల్లికల్లు వాసులను అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఉల్లికల్లు గ్రామంలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓ మాదిరిగా నీరు వచ్చిన సమయంలోనే గ్రామంలోకి నీరు వస్తే, రిజర్వాయర్‌కు పూర్తి స్థాయిలో నీరు వస్తే పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఉల్లికల్లు వాసులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నియోజకవర్గంలోని ఉల్లికల్లు గ్రామంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని బుధవారం వారు ప్రారంభించి, మాట్లాడారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రవేశపెట్టనున్న పలు పథకాలపై ప్రజలను చైతన్యపరిచారు. జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతోనే పేదల అభ్యు న్నతి సాధ్యమవుతుందనిఅన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పథకం, పేదలకు పక్కా గృహాలు, అమ్మఒడి, రైతు భరోసా తదిత ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు శ్రీరామిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, పరంధామరెడ్డి, కోనారెడ్డి, రాజు, వెంకట నారాయణ, మహిళ నేతలు బండి లలిత కళ్యాణి, చెన్నమ్మ, శకుంతలమ్మ పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
తూర్పు గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కడప జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
చిత్తూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కృష్ణ జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
నంద్యాలలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
దేశం కాదు...క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చంద్రబాబే!
సాక్షి,అమరావతి బ్యూరో: దేశంలో క్లిష్ట పరిస్థితులున్నాయని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మోదీపై యుద్ధం చేస్తున్నానని చంద్రబాబు డైలాగులు చెబుతున్నారని, వాస్తవానికి చంద్రబాబే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం ఆధ్వర్యంలో వేళాంగిణి నగర్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఉమ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2014లో బీజేపీ, పవన్ మద్దతు ఉన్నా, కేవలం 1.9 శాతం ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందన్నారు. ఇటీవల రెండు జాతీయ సర్వేలు సైతం టీడీపీ కంటే అదనంగా 10 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వస్తాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు అందరి వద్దకు వెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 336 కరువు మండలాలున్నాయని ప్రభుత్వం ప్రకటించిందని, రాష్ట్రంలో ఇంత దారిద్య్ర పరిస్థితులు నెలకొని, జనం వలసలు పోతున్నా చంద్రబాబు మాత్రం రాష్ట్రం సుభిక్షంగా ఉందని గొప్పలు చెబుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌పై హత్యాయత్నం విషయంలో దోషులను శిక్షించాలనే విషయాన్ని మరిచి, దుర్మార్గానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ సీనియర్ నాయకుడు విజయచందర్ మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యే కోరిక తీర్చమని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, దానిని నెరవేర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. మడమ తిప్పని నేతను మంచి మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వడ్డెర ప్రతినిధిగా ఊహించని అవకాశం... పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీటు అడగకపోయినా అత్యంత వెనుబడిన బీసీ వర్గానికి చెందిన తనను గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారన్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది ఉన్న వడ్డెర కులానికి ప్రతినిధిగా ఊహించని విధంగా అవకాశం కల్పించడంపై తన ఆనందానికి అవధులు లేవన్నారు. రాష్ట్రంలో రెడ్డి, క్రిస్టియన్, ముస్లింలను గుర్తించి వారి ఓట్లు తీసేస్తున్నారని విమర్శించారు. పశ్చిమ నియోజక వర్గంలోనే 42 వేల ఓట్లు తీసేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మట్టి, ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్ సీఎం కావడం చారిత్రక అవసరమని చెప్పారు. అందుకోసం త్యాగాలు తప్పవన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మొహమ్మద్ ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు అంబటి రాంబాబు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు మంచి చేయాలన్న తపన –రావి వెంకట రమణ, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పేదలకు మంచిచేయాలన్న తపనతో వైఎస్ జగన్ ఎంతటి అవరోధాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాభిమానం ముందు టిడిపి నేతలు నిలబడలేరు. -
పాణ్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అభిమాన రక్ష
ప్రజాబాంధవుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తితో హత్యాయత్నం.. భుజంపై నెత్తుటి మడుగు.. గురువారం టీవీలలో ఈ దృశ్యాలు చూసిన మరుక్షణం నుంచి రాష్ట్రంలోని ప్రతి గుండే కన్నీటి గాయంతో విలవిలలాడుతోంది. కాళ్లకు చక్రాలు కట్టుకుని వేల అడుగుల సంకల్పంతో సాగిపోతున్న బాటసారిపై అంతులేని కుట్రలకు నిలువెల్లా కంపించిపోతోంది. ఎందరో అభాగ్యుల ఆవేదనలను ఆలకించిన సంక్షేమ సారథి.. అమ్మా అంటూ కూలబడితే అంతులేని వేదనతో అల్లాడిపోతోంది. కుట్రల కత్తి చేసిన నెత్తుటి గాయం సలుపుతున్నా.. ఆ బాధను పంటి బిగువున భరిస్తూ ‘నేను క్షేమం.. అధైర్యపడొద్దు’ అంటూ ప్రజానీకాన్ని ఓదార్చిన ఆత్మ బంధువును తమ గుండె గుడిలో ఆరాధిస్తోంది. మడమ తిప్పని యోధుడి అడుగులకై ప్రతి పల్లే ఎదురు చూస్తోంది. అన్నా.. పాలకులకు జాడ తెలియని మా వాడల్లోకి.. నేనున్నానంటూ పాదయాత్రికుడివై వచ్చి ఆప్యాయంగా పలకరించావే.. ఇప్పుడు నీ ఆరోగ్యానికి మేము రక్షగా ఉంటామంటూ సంఘీభావ సంతకం చేస్తోంది. తమ ప్రేమాభిమానాలను వత్తిగా మార్చి నిండు దీవెనలను హారతి చేసి.. భగవంతుడా .. జనహృదయ నేతకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి మళ్లీ జనంలోకి పంపమంటూ రెండు చేతులూ జోడించి వేడుకుంటోంది. పట్నంబజారు(గుంటూరు): విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గురువారం జరిగిన హత్యాయత్నంలో గాయపడిన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జరిపారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల పట్టణంలో ఎమ్మెల్యే కోన రఘుపతి ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కర్లపాలెంలోని పెద్దింటమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వై.ఎస్.జగన్ ఆరోగ్యం కుదుటపడాలని వేడుకున్నారు. మాచర్ల పట్టణం శ్రీశైలం రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు 101 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో మైనార్టీ విభాగం గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు షేక్ జిలానీ ఆధ్వర్యంలో దువా (ప్రార్థన) చేపట్టగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.నసీర్ అహ్మద్, సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ పాల్గొన్నారు. అలాగే అరండల్‌పేటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరి నర్సిరెడ్డి అమరావతి రోడ్డులోని ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజలు జరుపగా, పార్లమెంటరీ అధ్యక్షుడు పానుగంటి చైతన్య నగరంపాలెంలోని మస్తానయ్య దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీ, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి విజయమాధవి ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్లోని వెస్ట్ ప్యారీస్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అనుబంధ విభాగాల ఆధ్యక్షులు, పార్టీ నేతలు అత్తోట జోసఫ్, మెట్టువెంకటప్పారెడ్డి, బండారు సాయిబాబు, ఆళ్ల పూర్ణచంద్రరావుతోపాటు ముఖ్య నేతలు కృష్ణనగర్‌లోని క్రిస్ట్బాప్తిస్టు చర్చిలో వై.ఎస్.జగన్ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో పట్టణ కన్వీనర్ బుర్రముక్క వేణుగోపాలసోమిరెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు జరిపి చర్చి, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. దుగ్గిరాల మండలంలోని జెండా చెట్టు సెంటర్లో ఉన్న మసీదులో మండల నేతల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను చర్చిలో స్థానిక ఎస్సీ విభాగం నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలంలోని శివాలయంలో యువజన విభాగం మండల కన్వీనర్ పెండ్యాల సురేష్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపగా, వెనిగండ్లలో గ్రామ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి పట్టణంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పోలేరమ్మ తల్లి ఆలయంలో అంబటి మురళి పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని నకరికల్లు, ముప్పాళ్ల, రాజుపాలెం, మండలాల్లో సర్వమత ప్రార్థనలు జరిపారు. సత్తెమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో కాట్టా సాంబయ్య, సయ్యద్ మాబు, షేక్ నాగూర్‌మీరాన్, సాంబశివరావు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో లూథరన్ చర్చిలో స్థానిక నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అలాగే ఫిరంగిపురంలో మండల కన్వీనర్ షేక్ గఫూర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. వేమూరు నియోజకవర్గంలోని వేమూరులోని వినాయకుని ఆలయం, కొల్లూరులోని భోగేశ్వరస్వామి ఆలయం, భట్టిప్రోలులోని పల్లెకోన లూథరన్ చర్చి, శివాలయం, అమర్తలూరులోని బాప్తిస్టు చర్చి, మోపర్రు, ఇంటూరులో లూథరన్ చర్చిలు, చుండూరు మండలంలో ఆంజనేయస్వామి దేవస్థానం, చర్చిలు, మసీదుల్లో ఆయా మండల స్థానిక నేతలు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. -
దగా చేసిన సర్కార్‌కు బుద్ధి చెప్పండి
తూర్పుగోదావరి, కాకినాడ: యువతకు నిరుద్యోగ భృతి... రైతులకు, మహిళలకు రుణమాఫీ... విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్... సహా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని టీడీపీ సర్కార్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్ సీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. రావాలిజగన్–కావాలిజగన్లో భాగంగా బుధవారం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన నవరత్న పథకాలను వివరించడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. నమ్మించి దగా చేసిన సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలంటే విజ్ఞప్తి చేశారు. జననేత జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. రామచంద్రపురంలో... రామచంద్రపురం మండలం వెలంపాలెంలో కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని జననేత జగన్ నాయకత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ సిటీలో... కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో 20వ డివిజన్ మహాలక్ష్మినగర్ ప్రాంతంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవరత్న పథకాలు వివరించారు. రాజానగరంలో... రాజానగరం లాలాచెరువు హౌసింగ్ బోర్డుకాలనీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. ఇంటింటికి ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికి మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని, జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముమ్మిడివరంలో... ముమ్మిడివరం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో తాళ్ళరేవు మండలం గోవలంకలో పార్టీనాయకులు, కార్యకర్తలు పర్యటించి రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పి.గన్నవరంలో... పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు పి.గన్నవరం మండలం మొండెపులంక, మండలకేంద్రమైన అయినవిల్లిలో రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించి పార్టీ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. రాజోలులో... రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు శివకోడులో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను వంచించి పాలన సాగిస్తోన్న చంద్రబాబు సర్కార్‌ను రానున్న ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్తిపాడులో... రౌతులపూడి మండలం బంగారయ్యపేటలో ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్‌లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. జగ్గంపేటలో... గోకవరం మండలం వీరలంకపల్లిలో జగ్గంపేట కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, వైఎస్సార్కాంగ్రెస్పార్టీ విధానాలను ప్రజలకు వివరించారు. -
వైఎస్ స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం
కాకినాడ: వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలోని స్వర్ణయుగం రావాలంటే ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ఆదివారం ఐదు నియోజకవర్గాలలో రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఆయా నియోజకవర్గ కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి నవరత్న పథకాల గురించి వివరించారు. ప్రత్తిపాడులో: ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలోని ఐదు గిరిజన గ్రామాల్లో రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. గిరిజనుల సమస్యలను పూర్ణచంద్రప్రసాద్ అడిగి తెలుసుకొన్నారు. పి.గన్నవరంలో: నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం తొండవరం, పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామాల్లో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. రాజానగరంలో : కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి ఆ«ధ్వర్యంలో రాజానగరం మండలం సూర్యారావుపేటలో రావాలి జగన్–కావాలి జగన్‌లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వచ్చే ఎన్నికల్లో జగన్ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పాల్గొన్నారు. రంపచోడవరంలో: గంగవరం మండలం పిడతమామిడిలో కో ఆర్డినేటర్ నాగులాపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి పార్టీ విధానాలు ప్రచారం చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌లో : రాజమహేంద్రవరం రూరల్ 26వ డివిజన్లో ఆదివారం కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్న పథకాలను ప్రచారం చేస్తూ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
నెల్లూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంత జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
ప్రతి ఇంటికీ మేలు జరగాలి..అందుకే రావాలి జగన్
విజయవాడ సిటీ: జిల్లావ్యాప్తంగా రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం కొనసాగుతుంది. పార్టీనేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలను వివరిస్తున్నారు. పార్టీ శ్రేణులు ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గురించి విçస్తృత ప్ర చారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి మంచి చేయాలి. ప్రతి రైతన్నకు తోడుగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా తాము నిలబడతామని, «చంద్రబాబు చేసే కుయుక్తులకు లొంగబోమని ప్రజ లు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు తమ జీవితాల్లో వెలుగు నింపుతుందనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం జిల్లాలో జరిగిన రావాలి జగన్...కావాలి జగన్ కార్యక్రమం విశేషాలు... పెనమలూరు నియోజక వర్గంలో కంకిపాడు మండలం గొల్గగూడెంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ జిల్లా అ«ధ్యక్షుడు కొలుసు పార్థసారథి నేతృత్వంంలో జరిగింది. ఇంటింటికి వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), బీసీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్కాశ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతి నిధి బండి నాంచారయ్య, కిలారు శ్రీనివాసరావు, పార్టీ మండల అ«ధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, నాయకులు పాల్గొన్నారు. కైకలూరు నియోజవర్గంలో కైకలూరు మండలం, గోపవరం గ్రామంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం జరి గింది. రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నోబుల్, పార్టీ మండల అధ్యక్షుడు ముం గర నరసింహరావు, ఎంపీటీసీ సభ్యురాలు అడుసుమిల్లి రమాదేవి, నాయకులు పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పులిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని పాతకోటలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు నేతృత్వంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ఆయన ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతిని«ధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, మండల మహిళా కన్వీనర్ బీసాబత్తిన విజయలక్ష్మి, చింతలపూడి బాలు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మల్లాది విష్ణు నేతృత్వంలో స్థానిక 5వ డివిజన్ మాచవరం దాసాంజనేయస్వామివారి దేవాలయం వద్ద రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ఇంటింటికి తిరిగి ప్రజ లకు వివరించారు. కార్యక్రమంలో డివిజన్ కో– ఆర్డినేటర్ కోలా నాగాంజనేయులు, కాళిదాసు, బాడిత అప్పారావు, పసుపులేటి కోటేశ్వరరావు, సీహెచ్ అంతయ్య, డివిజన్ మైనార్టీ అధ్యక్షులు ఎండీ రఫీ, సెక్రటరీ మౌలాలీ, రాజేష్, బొల్లిగర్ల శంకర్‌యాదవ్, రుద్దండి సురేష్, బంకా భాస్కర్, సురేష్ బాబు, మానం వెంకటేశ్వరరావు, ఎండీ అఫ్రోజ్, కంభం కొండలరావు పాల్గొన్నారు. మచిలీపట్నం నియోజవకవర్గంలో నవీన్ మిట్టల్ కాలనీలో పార్టీ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య ’(నాని) నేతృత్వంలో రావాలి జగ న్ – కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. ఇం టింటికి తిరిగి నవరత్నాలను ప్రజలకు వివరిం చారు. పార్టీ నేతలు సిలార్ దాదా, మేకా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు
కాకినాడ : నవరత్న పథకాలు పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని రావాలి జగన్–కావాలి జగన్‌లో పార్టీనేతలు ప్రజలకు వివరించారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమాల్లో ఆయా నియోజక వర్గ కో ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరం సిటీలో : రాజమహేంద్రవరం సిటీ 42వ డివిజన్ శ్రీరామ్‌నగర్‌లో కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. ముమ్మిడివరంలో: ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చినబాపనపల్లిలో కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్ కుమార్ రావాలి జగన్–కావాలి జగన్‌లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. పి.గన్నవరంలో: పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ముక్కామలలో కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమంలో నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. రాజోలులో: రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు రావాలి జగన్– కావాలి జగన్‌లో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రామచంద్రపురంలో: రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం సుందరపల్లిలో కో–ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రావాలి జగన్–కావాలి జగన్‌లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వారికి భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్‌లో: రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని 28వ డివిజన్లో కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. రంపచోడవరంలో: అడ్డతీగల మండలం బొట్లంకలో రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ నాగులాపల్లి ధనలక్ష్మి రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) పాల్గొన్నారు. జగ్గంపేటలో: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం వేగాయమ్మపేటలో కో–ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. ప్రత్తిపాడులో: నియోజకవర్గ కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్ ఆధ్వర్యంలో రావాలి జగన్– కావాలి జగన్‌లో భాగంగా ప్రత్తిపాడులో పర్యటించి తెలుగు దేశం ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. -
నవరత్నాలు వరం
పశ్చిమగోదావరి, కొవ్వూరు/చాగల్లు: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవశకానికి నాంది పలుకుతాయని, ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రూ.లక్ష నుంచి రూ.5లక్షల మేరకు లబ్ధి చేకూరనుందని ఆ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చాగల్లు మండలం నెలటూరులోని నిమ్మగడ్డ చినరాములు కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. పార్టీ బూత్ కమిటీ సభ్యులంతా ప్రజలతో మమేకమై నవరత్నాల పథకాల ద్వారా చేకూరే లబ్ధిని వివరించాలని సూచించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. టీడీపీ పాలన పైశాచికత్వానికి కొవ్వూరు నియోజకవర్గమే ఉదాహరణ అన్నారు. ఇక్కడ ఇసుక, మద్యం, మట్టితో టీడీపీ నేతలు ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు చేస్తున్న దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆయన సూచించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లోఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నందున రానున్న ఐదారు నెలలపాటు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లు పార్టీ విజయం కోసం కష్టించి పనిచేయాలని కోరారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీకి తూట్లు పొడవడమే కాకుండా మాఫీ చేసేదే లేదంటూ స్వయంగా చట్టసభలో మంత్రి ప్రకటన చేయడం బాధాకరమని పేర్కొన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని స్పష్టం చేశారు. సమష్టిగా పనిచేస్తేనే విజయం సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బూత్‌స్థాయిలో కమిటీలు పటిష్టంగా లేకపోవడం వల్లే ఓటమిపాలు కావాల్సి వచ్చిందని, ఆ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి బూత్ కమిటీలు కీలక పాత్ర పోషించాలని కోరారు. తటస్థులను పార్టీలో చేర్చుకోవడంతోపాటు సమష్టిగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. టీడీపీ మోసాలను ప్రజలకు వివరించండి రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త రోజుకు గంట చొప్పున కేటాయించాలని సూచించారు. టీడీపీ పాలనలో ఎలా మోసపోయామో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీలపై ఉందన్నారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికీ నెలకు రూ.8వేలకు పైగా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఓటర్ల సవరణపై దృష్టి సారించండి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ బూత్ కమిటీల కో–ఆర్డినేటర్ బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో దొంగ ఓట్ల తొలగింపు, అర్హుల ఓట్ల నమోదుపై బూత్ కమిటీలు శ్రద్ధ వహించాలని కోరారు. ప్రతి బూత్లోనూ తొలగించిన పేర్ల జాబితాలను పంపుతామని, వాటిని సరి చూసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా అత్యధిక శాతం ఓట్లు పోలయ్యేలా చూడాలని, ప్రతి ఓటూ విలువైనదిగా భావించాలని సూచించారు. బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ బూత్‌స్థాయిలో ఎవరెవరు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో తెలుసుకోవడంతోపాటు తటస్థులు ఎవరనే అంశాలపై బూత్ కమిటీలకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. తద్వారా తటస్థుల ఓట్లను పార్టీకి అనుకూలంగా మలుచుకునే యత్నం చేయాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కరిబండి గనిరాజు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీల కో–ఆర్డినేటర్ యండపల్లి రమేష్, పార్టీ మండల అధ్యక్షులు కోఠారు అశోక్‌బాబా, కుంటముక్కల కేశవనారాయణ, గురుజు బాల మురళీకృష్ణ, పట్టణ అ«ధ్యక్షుడు రుత్తల భాస్కరరావు తదితరులు మాట్లాడారు. పార్టీ సంయుక్త కార్యదర్శి పోతుల రామతిరు పతి రెడ్డి, ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, లకంసాని సూర్యప్రకాశరావు, బొర్రా కృష్ణ, కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, గండ్రోతు సురేంద్రకుమార్, కాకర్ల నారాయుడు తదితరులతోపాటు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
కడప జిల్లా రాజంపేటలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కందూకురులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
పశ్చిమ గోదావరి జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అనంత జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
రైల్వే కోడూరులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
శ్రీకాకుళం జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
మైదుకూరులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
ఆళ్లగడ్డలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
గంపలగూడెం మండలంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
సానుభూతి కోసం బాబు పాకులాట
సాక్షి కడప : రాష్ట్రంలో ఎలాంటి చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు సానుభూతి కోసం పాకులాడుతున్నారని..పాపులాటరీ తగ్గడంతో ఎలాగోలా ప్రజల మద్దతు కోసం పడరానిపాట్లు పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం ఓబులవారిపల్లె మండలంలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎర్రగుంట్లలో సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడారు. ఇటీవల బాబ్లీ కేసు నోటీసు వచ్చిన నేపథ్యంలో బాబు నానా హంగామా చేశారని, ఇదంతా కేవలం సానుభూతికోసమని ఎద్దేవా చేశారు. తాజాగా ఐటీ దాడులంటూ...మోదీ చేయించారంటూ ప్రచారం చేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు తీరు సిగ్గుచేటన్నారు. ఎప్పుడు చూసినా అబద్ధాలతోనే పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌కు అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని వారు విమర్శించారు. నేతలకు ఘన స్వాగతం జిల్లాలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం ఊపందుకుంది. ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. చంద్రబాబు పాలనలో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలు పరిష్కారం కావడం లేదని నేతలకు చెబుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలంలోని బీసీ రాచపల్లె, బీసీ కాలనీ, గద్దెలరేవుపల్లె గ్రామాల్లో రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు ఘన స్వాగతం లభించింది. వీరు ఇంటింటికి వెళ్లారు. నవరత్నాల గురించి వివరించారు. ప్రొద్దుటూరులోని 37వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నిచోట్లా ఆయనకు ఘనస్వాగతం లభించింది. జంగంపేట, హనుమాన్నగర్లలో ఎమ్మెల్యే పర్యటించారు. రాజంపేట నియోజకవర్గంలోని సిద్దవటం మండలం ఎగువపేట గ్రామంలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఇంటింటికి వెళ్లారు. ఆయనకు మహిళలు హారతులు పట్టారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఇంటింటికి తిరుగుతూ నవరత్నాలను వివరించారు. ఆయనకు టపాసులు కాలుస్తూ పూల వర్షం మధ్య సుదీర్‌రెడ్డి ముందుకు సాగారు. -
నవరత్నాల అమలుతో స్వర్ణాంధ్రప్రదేశ్
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అమలు చేస్తే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఆ పార్టీ శ్రేణులు రావాలి జగన్... కావాలి జగన్ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం కూడా కార్యక్రమం నిర్వహించాయి. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో పాటు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు నవరత్నాల్లోని ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో నర్సాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు నియోజకవర్గం సత్రంపాడు, వీరవాసరం మండలం మెంటేపూడి, ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం, తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట, ఆచంట నియోజకవర్గం వల్లూరులో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు నవరత్నాల గురించి ప్రచారం చేశారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం బొమ్మిక గ్రామం, పార్వతీపురం, బొబ్బిలి పట్టణాల్లో జామి మండలం గొడికొమ్ములో సమన్వయకర్తల ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను సీఎంను చేయాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. గుంటూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. ఎమ్మెల్యేలు ఆర్కే రోజా(నగరి) డాక్టర్ సునీల్‌కుమార్ (పూతలపట్టు), డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి(మదనపల్లె) చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు(చిత్తూరు) కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 5 నియోజకవర్గాల్లో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గాల్లో ఇంటింటీకీ వెళ్లి నవరత్నాలపై అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించి నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ వీవర్స్ కాలనీ, శెట్టిగుంటరోడ్డు ప్రాంతాలలో సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్ మండలంలోని కాకుపల్లిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సూళ్లూరుపేట మండలం అనంతసాయి గ్రామంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఎస్.నర్సాపురంలో, గాజువాక అయ్యన్నపాలెంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజవర్గాల్లో పార్టీ నేతలు ర్యాలీగా వెళుతూ వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని ప్రజలకు భరోసానిచ్చారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, రాయచోటి పరిధిలో ఎమ్మెల్యేలు రాచమల్లు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. రాజంపేట పరిధిలోని సుండుపల్లెలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కార్యక్రమాన్ని చేపట్టారు. -
వైఎస్ స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ చేపట్టిన ‘రావాలి జగన్...కావాలి జగన్’ కార్యక్రమంలో సోమవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సీఎం అయితే ప్రతి ఇంటికీ కలిగే ప్రయోజనాలను వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గడప గడపకూ తిరుగుతూ వైఎస్ స్వర్ణయుగం రావాలంటే జగన్‌తోనే సాధ్యమంటూ ప్రజలకు తెలియజెప్పారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి నవరత్నాలను ప్రచారం చేశారు. వైఎస్సార్ జిల్లాలో రాజంపేట పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి సుండుపల్లి మండలంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. మైదుకూరు నియోజకవర్గంలోఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో 20 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి నవరత్నాలను ప్రజలకు వివరించారు. రాయచోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పులివెందుల నియోజకవర్గంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నవరత్నాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అప్పకొండయ్యపల్లెలో 30 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించారు. నెల్లూరురూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి రూరల్ మండలంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నవరత్నాల గురించి వివరించారు. ప్రకాశం జిల్లాలో ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రచారం చేశారు. కృష్ణా జిల్లాలో పార్టీ నేతలు గడపగడపకు పాదయాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా ప్రతి గడపకు వెళ్లి నవరత్నాలను వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోనూ కార్యక్రమాలు జరిగాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సమన్వయకర్త వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ పాల్గొన్నారు. ఉనికి కోసమే బీజేపీపై విమర్శలు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు తన చేతగానితనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని నేడు రాష్ట్రంలో బలహీనంగా ఉన్న ఆ పార్టీతో యుద్ధం చేస్తున్నానంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సిగ్గుమాలిన చర్య అని ఆయన విమర్శించారు. నెల్లూరు జిల్లా కోవూరులో సోమవారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రకు సంఘీభావంగా భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాతో కలిసి సజ్జల మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకో కొత్త డ్రామాకు తెరతీయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. గతంలో 2014లో మోదీతో పొత్తు పెట్టుకుని, పవన్‌కల్యాణ్‌తో ప్రచారం చేయించి 600కు పైగా చంద్రబాబు హామీలిచ్చారన్నారు. నాలుగేళ్లకు పైగా బీజేపీతో కలిసి ఉండి, నేడు మోదీకి వ్యతిరేకత ఉందని గమనించిన చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పోరాటంతో రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలపై ప్రజలు మండిపడుతున్న తరుణంలో చంద్రబాబు తన ఉనికి కోసం కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు. బీజేపీతో వైఎస్సార్సీపీ పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబు మాట్లాడడం ఆయన అవివేకమన్నారు. వైఎస్సార్సీపీ ఏనాడూ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోలేదని స్పష్టం చేశారు. బీజేపీతో రెండుసార్లు పొత్తుపెట్టుకున్న బాబు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టూ నిర్మించలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. యువతకు బాబు దగా: రోజా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘యువనేస్తం’ పేరుతో నిరుద్యోగులను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, నాయకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నవరత్నాలతోనే గడపగడపకూ లబ్ధి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆ పార్టీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు ఆదివారం ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లాలో జరిగిన ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాత బొబ్బిలిలో నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి చిన అప్పలనాయుడు గడపగడపకూ వెళ్లి నవర్నతాల ప్రయోజనాలను వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నవరత్నాల కరపత్రాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో నియోజకవర్గాల సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, పైడి వెంకటరమణమూర్తి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలను అబద్ధపు హామీలతో నట్టేట ముంచారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, పేర్ని నాని, మల్లాది విష్ణు తదితరులు పాదయాత్రగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌ను సీఎంని చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గొల్లపాలెంలో సమన్వయకర్త కత్తెర హెనిక్రిస్టినా, కత్తెర సురేష్ ప్రతి ఇంటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలు పంచిపెట్టారు. త్వరలోనే మంచి రోజులొస్తాయని భరోసా కల్పించారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొండాయపాలెంలో సమన్వయకర్త గరటయ్య, కందుకూరులో మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నేతలు మేరిగ మురళీధర్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టే పథకాలను ప్రజలకు తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో నేతలు, కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి టీడీపీ ప్రభుత్వ అవినీతిని వివరించారు. వైఎస్సార్ జిల్లాలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నేత ఆకేపాటి అమర్నాథ్రెడ్డి చంద్రబాబు దుర్మార్గపు పాలనపై మండిపడ్డారు. సమస్యలు తీరాలంటే జగన్ సీఎం కావాల్సిన అవసరముందని వివరించారు. కర్నూలు జిల్లా కల్లూరులోని 20, 21 వార్డుల్లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనగర్‌లో 100 రజక కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ తదితరులు ఇంటింటికీ వెళ్లి నవరత్నాల వల్ల చేకూరే లబ్ధిని తెలియజేశారు. -
అసమర్థ పాలకులకు బుద్ధి చెబుదాం
సాక్షి ప్రతినిధి,ఒంగోలు:ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు అధిగమించిన సందర్భంగా జిల్లాలో ఆపార్టీ శ్రేణులు గురువారం కూడా సంఘీభావ యాత్రలు నిర్వహించాయి. ఒంగోలు రూరల్ మండల పరిధిలోని చేజెర్ల, పానకాలపాలెం, కరవది గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. మండుటెండలోనూ ఉత్సాహంగా పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో బాలినేని వెంట నడిచారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు సంఘీభావ యాత్రలు చేసి, సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించారు. నవరత్నాలు పథకాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను నేతలు ప్రజలకు వివరించారు. పొదిలి మండలం ముసి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తుళ్లూరు వరకు మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆద్వర్యంలో జగన్ యాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని అయ్యం బొట్లపల్లి నుంచి యర్రగొండపాలెం వరకు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించారు. రాచర్ల నుంచి గిద్దలూరు వరకు గిద్దలూరు సమన్వయకర్త ఐవీరెడ్డి, మద్దిపాడు మండలం కొస్టాలు నుంచి మద్దిపాడు వరకూ సంతనూతలపాడు సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్‌బాబు, కొరిశపాడు మండలం పమిడిపాడు నుంచి కనగాలవారిపాలెం వరకు అద్దంకి సమన్వయకర్త గరటయ్య ఆద్వర్యంలో జగన్ యాత్రకు మద్దతుగా సంఘీభావయాత్రలు నిర్వహించారు. కనిగిరి చెక్‌పోస్టు నుంచి వైఎస్సార్ విగ్రహం వరకూ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ పాదయాత్ర నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. చీరాల మండల దేశాయిపేట నుంచి వేటపాలెం వరకు పార్టీ చీరాల సమన్వయకర్త యడం బాలాజీ, ఇంకొల్లులో పర్చూరు సమన్వయకర్త రావి రామనాధం బాబుల ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించారు. అనంతరం ఆయా చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఇంకొల్లు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి పాల్గొన్నారు. -
సంఘీభావం.. జన ప్రభంజనం
విజయవాడసిటీ: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన సంఘీభావ పాదయాత్రలు శుక్రవారం హోరెత్తాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ‘సంక్షేమ పాలనంటే అంటే ఎలా ఉంటుందో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చూసిన నేపధ్యంలో గత నాలుగేళ్లుగా అలాంటి వ్యవస్థ్థ, పరిస్థితులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు మళ్లీ ఆ రాజన్న పాలన రావాలి అని మనసారా కోరుకుంటున్నారు. అందుకే జననేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అశేష ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, ఆయనకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర్వహించిన పాదయాత్రలకు ప్రజలు హారతులు పట్టారు. పేదోళ్లకు పింఛను ఇవ్వాలన్నా... పక్కా ఇళ్లు పొందాలన్నా....జన్మభూమి కమిటీల మెప్పు పొందాలి. లేకుంటే లంచాలు ఇవ్వాలి. ఇదేమి విపరీతం అంటూ అంటూ తమ గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను ప్రజలు మనసువిప్పి చెప్పుకున్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు తమ బతుకుల్లో సంతోషం నింపుతుందని, అందుకు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ♦ పెనమలూరు నియోజకవర్గంలో మచిలీపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత కొలుసు పార్థసారథి ఆ«ధ్వర్యంలో తాడిగడప నుంచి పోరింకి, పెనమలూరు వరకు 8 కి.మీ వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం పెనమలూరు సెంటర్లో భారీ బహిరంగ సభ జరిగింది. పాదయాత్రలో పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, యువవజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాకర్ల వెంకటరత్నం, ఉయ్యూరు ఎంపీపీ తుమ్మూరు గంగారత్నం, నాయకులు కీలారు శ్రీనివాసరావు, కొఠారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ♦ పెడన నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో కౌన్సిలర్లు కటకం ప్రసాద్, మెట్ల గోపిప్రసాద్, గరికిముక్క చంద్రబాబు, నాయకులు ఆయూబ్‌ఖాన్, తలుపుల కృష్ణ, గోరిపర్తి రవికుమార్, సంగా మధు, జక్కా అర్జున భాస్కర్, తాతాజీ, మలిశెట్టి రాజబాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ♦ నూజివీడు పట్టణంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకాప్రతాప్ అప్పారావు నేతృత్వంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పాదయాత్రలో ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల సత్యనారాయణ, ముసునూరు మండలం అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ బసవా భాస్కరావు తదితరులు పాల్గొన్నారు. ♦ తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. అయ్యప్ప ఆలయం నుంచి రాజుపేట వరకు పాదయాత్ర చేశారు. అనంతరం తిరువూరు పట్టణంలోని చీరాల సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. పాదయాత్రలో పార్టీ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, నాయకులు శ్రీనివాసరావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ♦ పామర్రు నియోజకవర్గంలో మొవ్వమండలం నిడుమోలు గ్రామం నుంచి కూచిపూడి వరకు పార్టీ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్ నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కూడిపూడిలో బహిరంగ సభ నిర్వహించారు. ♦ గన్నవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకకర్త యార్లగడ్డ వెంకట్రావ్ నేతృత్వంలో గన్నవరంలో పాదయాత్ర నిర్వహించారు. నాయకులు కాసరనేని గోపాలరావు, ఎండీ గౌసాని, తుల్లిమిల్లి ఝాన్సీలక్ష్మీ, మద్దినేని వెంకటేశ్వరరావు, నీలం ప్రవీణ్‌కుమార్, యార్కరెడ్డి నాగిరెడ్డి, నక్కా గాంధీ వందలాది మంది కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ♦ అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో ఘంటసాల నుంచి శ్రీకాకుళం వరకు సంఘీభావ పా దయాత్ర సాగింది. పాదయాత్రలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహరావు, ఘంటశాల మండల కన్వీనర్ వేమూరి వెంకట్రావ్‌తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ♦ నందిగామ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు నేతృత్వంలో నందిగామ మండలం రాఘవాపురం గ్రామం నుంచి కమ్మవారి పాలెం, పల్లగిరి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నందిగామలో బహిరంగ సభ జరిగింది. ♦ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ సమన్వయర్త యలమంచిలి రవి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. పటమట రైతుబజార్ ఎదురుగాఉన్న ప్రాంగణంలో జరిగిన ఈ సభలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్ది, వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెహబూబ్ షేక్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ♦ కైకలూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈనెల 25న ప్రారంభమైన సంఘీభావ పాదయాత్ర కలి దిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల మీదుగా గురువారం కైకలూరు గాంధీబొమ్మ సెంటర్‌కు చేరుకుంది. 27 గ్రామాల్లో 52 కి.మీలు దూరం సాగింది. పార్టీ నాయకులు బొడ్డు నోబుల్, పోసిన పాపారావుగౌడ్, చేబోయిన వీర్రాజు, భిక్షాలు, జహీర్, లింకన్ తదితరులు పాల్గొన్నారు. ♦ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సంఘీభావ పాదయాత్ర పార్టీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్ గురువారం సాయంత్రం ముగిసింది. అనంతరం పంజా సెంటర్లో బహిరంగ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసీఫ్, నగరపాలక సంస్థ పార్టీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల, కార్పొరేటర్లు బుల్లా విజయకుమార్, బి.సం«ధ్యారాణి తదితరులు హాజరయ్యారు. ♦ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పార్టీ సమన్వకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా సంఘీభావ బహిరంగ సభ అజిత్ సింగ్‌నగర్‌లోని పైపులురోడ్డులో బహిరంగ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు బి.జానారెడ్డి, తిట్ల రామలింగమూర్తి, శర్వాణి మూర్తి, ఎండీ రుహుల్లా, మోదుగుల గణేష్, వెన్నం రత్నారావు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క అబద్ధం చెప్పిఉంటే జగన్ సీఎం అయ్యేవారు
నెల్లూరు, ఆత్మకూరు : రైతులకు రుణమాఫీ పూర్తిగా చేస్తామనే ఒకే ఒక్క అబద్ధపు హామీ ఇచ్చి ఉంటే 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్రెడ్డి సీఎం అయి ఉండేవారని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్లు దాటిన సందర్భంగా సంఘీభావంగా చేజర్ల మండలం కోటితీర్థం నుంచి చేజర్ల వరకు బుధవారం ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అడుగడుగునా పార్టీ శ్రేణులు నీరాజనాలు పలుకగా, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం చేజర్ల బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రుణాలను మాఫీ చేయకుండా రైతులు, పొదుపు మహిళలను అప్పుల పాలు చేశారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని మరెన్నో హామీలు అమలు చేశారని గుర్తుచేశారు. 47 లక్షల మంది పేదలకు సొంతింటి కలను సాకారం చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రిలాగే మాట తప్పక– మడమ తిప్పక ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రీయింబర్స్‌మెంటుతో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సొంత ఇంటి అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే మరే నాయకుడు చేయని విధంగా అన్ని నియోజకవర్గాల్లో పాద యాత్ర సాగిస్తూ ఇప్పటికే 3000 కిమీ మైలు రాయి అ«ధిగమించటం ఓ రికార్డన్నారు. 2019 ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు సైనికుల్లా పని చేసి పార్టీ అధికారంలోకి వచ్చేలా జగనన్నను ముఖ్య మంత్రిని చే సేందుకు సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దేశంలో మరే నాయకుడు చేయని విధంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగిస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఆశీర్వదించాలనికోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలు డబ్బుతో గెలవవచ్చని ప్రజాధనాన్ని దోచుకుంటూ ఓట్లను కొనేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సూరా భాస్కర్‌రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, అల్లారెడ్డి ఆనందరెడ్డి, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, కొండా వెంకటేశ్వర్లు, గుండాల మధు, కన్వీనర్లు రఘునాథరెడ్డి, జీ శ్రీనివాసులునాయుడు, బోయళ్ల పద్మజారెడ్డి, జెడ్పీటీసీలు కుడారి హజరత్తమ్మ, పెయ్యల సంపూర్ణమ్మ, దేవసహాయం, ఎంపీపీలు కామాక్షమ్మ, కమతం శోభ, వైస్‌ఎంపీపీ తోట కృష్ణయ్య పూనూరు భారతీరెడ్డి, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పల్లె సీమల్లో సిరులు కురవాలి
‘పల్లె సీమల్లో ప్రతి ఇంటా సిరులు కురవాలి.. ప్రతి ఒక్కరికీ నవరత్నాలు చేరువ కావాలి.. భావితరం భవిత బాగుండాలని కాంక్షించే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీకి మద్ధతు పలకాలి.. టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా గ్రామాభివృద్ధిని విస్మరించింది. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించింది. అందుకే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకుందాం. రాజన్న రాజ్యం తిరిగి తెచ్చుకుందాం. అందుకోసం మీరంతా చేయి చేయి కలిపి సంఘీభావం ప్రకటించాలి’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు నిచ్చారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించిన సందర్భంగా జిల్లాలో ఆ పార్టీ నేతలు సంఘీభావ యాత్రలు కొనసాగించారు. పల్లె ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. బుధవారం ఒంగోలు రూరల్ మండల పరిధిలో పర్యటించిన బాలినేని నవరత్నాలపై ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. సాక్షి ప్రతినిధి,ఒంగోలు: ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జిల్లాలో పార్టీ నేతలు బుధవారం సంఘీభావ యాత్రలు నిర్వహించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ♦ ఒంగోలు రూరల్ మండలంలోని బొద్దులూరివారిపాలెం, ఉలుచి, చేజర్ల వరకు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం జగన్ పాదయాత్రకు మద్దతుగా సంఘీభావయాత్ర జరిగింది. మహిళలను, వృద్ధులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితర నాయకులు బాలినేని వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. ♦ మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలం మునగపాడు నుంచి వెలిగండ్ల వరకు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆద్వర్యంలో జగన్ యాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించారు. నవరత్నాలుపై ప్రచారం చేపట్టారు. ♦ యర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం నుంచి యర్రగొండుపాలెం ఆయ్యంబొట్ల పల్లె వరకు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ జగన్ పాదయాత్ర నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ♦ గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని కంభం మండలంలోని ఎర్రపాలెం నుంచి రాచెర్ల వరకు సమన్వయకర్త ఐవీరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ♦ కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్ పురం మండల కేంద్రం నుంచి కొయిలంపాడు వరకు సమన్వయకర్త బుర్రా మధుసూధన్‌యాదవ్ జగన్ పాదయాత్రకు సంఘీభావంగా కార్యకర్తలతో కలిసి నడిచారు. ♦ పర్చూరు నియోజకవర్గంలో సమన్వయకర్త రావి రామనాథంబాబు ఆధ్వరంలో కారంచేడు మండలంలోని దగ్గుపాడు నుంచి ఇంకొల్లు వరకు జగన్ యాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించారు. ♦ చీరాల నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండల పరిధి కొత్తపాలెం నుంచి దేశాయిపేట వరకు పార్టీ సమన్వయకర్త యడం బాలాజీ జగన్‌కు మద్దతుగా సంఘీభావ పాదయాత్రను నిర్వహించారు. ♦ సంతనూతలపాడు నియోజకవర్గంలో సమన్వయకర్త టీజేఆర్ సుధాకరబాబు ఆధ్వరంలో మద్దిపాడు మండలం నేలటూరు నుంచి వెల్లంపల్లి సంటర్ వరకు జగన్ యాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించారు. ♦ అద్దంకి మండలం కవలకూరు నుంచి ధర్మవరం గ్రామం వరకు సమన్వయకర్త బాచిన చెంచు గరటయ్య ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర జరిగింది. ♦ కందుకూరు పట్టణంలో బృందావన్ కాలనీలో మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. -
నీ వెంటే.. మేమంతా!
పట్నంబజారు(గుంటూరు): జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీవంగా నాయకులు తలపెట్టి పాదయాత్రల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నీ వెంటే.. మేమంతా అంటూ జననేత జగన్‌కు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల పరిధిలో పాదయాత్ర చేపట్టారు. పెదవడ్లపూడి గ్రామంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన 3వేల కిలోమీటర్ల మైలురాయి అభినందన కేక్‌ను కట్ చేశారు. బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోన రఘుపతి పట్టణం నుంచి కర్లపాలెం వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 1వ వార్డు, భరంపేట నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్దుర్తి మండలం కండ్లకుంట వద్ద పాదయాత్ర ప్రారంభించి గొట్టిపాళ్ల, గంగలకుంట మీదుగా సిరిగిరిపాడు వరకు 15 కిలో మీటర్ల వరకు పాదయాత్ర చేపట్టారు. ఆయన వెంట పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నడిచారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా శారదా కాలనీ వద్ద రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు. వసంతరాయపురం, డొంకరోడ్డు, కొత్తపేట మీదుగా నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల మీదుగా ఆనందపేటకు చేరుకుంది. మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్అంబేద్కర్, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేమూరు నియోజకవర్గంలో ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అమర్తలూరు మండలం కూచిపూడి నుంచి మూల్పూరు వరకు, వేమూరు మండలం పాలమర్రు నుంచి జంపని వరకు పాదయాత్ర చేపట్టారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రావి వెంకటరమణ పెదకాకాని మండలం వెనిగండ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి కొప్పురావూరు, కాకాని ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించగా, సమన్వయకర్త కిలారి రోశయ్య హాజరయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు దమ్మాలపాడు నుంచి పాదయాత్ర ప్రారంభించి సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల మీదుగా భృగుబండ వరకు పాదయాత్ర చేశారు. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం డోగిపర్రు నుంచి యలవర్తిపాడు వరకు నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పాదయాత్ర చేపట్టారు. చిలకలూరిపేట సమన్వయకర్త విడదల రజిని పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నుంచి గాంధీపేట, సుబ్బయ్యతోట, వడ్డెరగూడెంల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలో చినకొండయ్య పాలెం నుంచి సత్యనారాయణపురం వరకు సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు వెంట కార్యకర్తలు ఉత్సాహం అడుగులేశారు. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం పుట్లగూడెం వద్ద సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడి పాదయాత్ర ప్రారంభమై చల్లగరిక, బంగారు తండాలో జరిగింది. తెనాలి నియోజకవర్గం రూరల్ పరిధిలోని పెదరావూరు నుంచి జగ్గడిగుంటపాలెం వరకు సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నిర్వహించిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌కు నీరాజనం పడుతున్న ప్రజలు
నెల్లూరు(మినీబైపాస్): ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని 49వ డివిజన్ పరిధిలోని పొర్లుకట్ట ప్రాంతంలో డివిజన్ ఇన్చార్జి వందవాసి రంగా ఆధ్వర్యంలో నిర్వహించిన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ కోరుకుంటుండటం సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రాజన్న రాజ్యాన్ని తిరిగి జగన్మోహన్రెడ్డి ద్వారా చూస్తామన్నారు. చోద్యం చూస్తోన్న మంత్రి నారాయణ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఎక్కడి చెత్త అక్కడే ఉందని, కాలువలు నిండిపోయి రోడ్లపై మురుగునీరు వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మంత్రి నారాయణ చోద్యం చూస్తున్నారని ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు. ఒక రోజంతా మంత్రి నారాయణ స్వయంగా నగరంలో రోడ్డుమీద తిరిగితే ప్రజలు పడుతున్న బాధలు ఎలా ఉంటాయే తెలుస్తుందన్నారు. జీఓ 279 తమకొద్దని పారిశుద్ధ్య కార్మికులు పోరాటం చేస్తుంటే, జీఓ 279 అంటే కార్మికులకు తెలియదని మంత్రి హేళన చేయడం తగదన్నారు. ఇప్పటికైనా జీఓ 279 రద్దుచేసి, కార్మికులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నాయకులు వందవాసి రంగా, కుంచాల శ్రీనివాసులు, విద్యాసాగర్, మల్లెబోయిన ప్రభాకర్, ప్రవీణ్, శీను, వెంకటేష్, శివపురం సురేష్, హంజాహుస్సేనీ, ఎస్ఆర్.ఇంతియాజ్, ఎస్కె.మున్నా. ఎం.జయకృష్ణారెడ్డి, జావీద్ పాల్గొన్నారు. -
కందుకూరులో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం
-
మాఫీ పేరుతో మాయ చేసిన బాబు
సాక్షి కడప : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు పంట, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని.. హామీ ఇచ్చి మాయ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. సోమవారంప్రొద్దుటూరు, కడపలో ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, బద్వేలు సమన్వయకర్త డాక్టర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఏదో ఒక రకంగా చంద్రబాబు మోసం చేశారని వారు దుయ్యబట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల పథకాలతోనే ప్రజలకు నవశకం ప్రారంభమవుతుందని వారు తెలియజేశారు. ప్రొద్దుటూరు రామేశ్వరంలోని మట్టిమసీదువీధి, శాంతికుమారివీధి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల కరపత్రాలను అందజేస్తూ.. చంద్రబాబు మోసాలను తెలియజేస్తూ కదిలారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తయిన సందర్బంగా ఎమ్మెల్యే రాచమల్లు కేక్ కట్ చేసి సంబ రాలు చేసుకున్నారు. కడప నగరం3 డివిజన్లోని రామాంజనేయపురం వరదకాలనీ, ఆచారి కాల నీ, యానాది కాలనీల్లో ‘రావాలి జగన్– కావాలి జగన్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజద్‌బాష, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు తదితరులు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ నేతృత్వం లో రాజన్న రాజ్యం వస్తుందని తెలియజేశారు. రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆ«ధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణమంతా అన్ని ప్రాంతాల్లోనూ కలియ తిరిగారు. బద్వేలులో సమన్వయకర్త డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి గుంతపల్లి రోడ్డు వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ముగిసింది. రాయచోటిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. -
నవరత్నాలతో నవోదయం
పట్నంబజారు(గుంటూరు): గడపగడపలోనూ సమస్యలు.. ప్రతి గుండెలోనూ ఆవేదన... నాలుగున్నరేళ్ల పాలనలో కనీసం పట్టించుకున్న నాథుడే లేడు.. సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయి.. పింఛను కోసం, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న జన్మభూమి కమిటీల నిర్ణయమే జరుగుతోంది.. కేవలం పచ్చచొక్కా వేసుకున్న వారికి మాత్రమే అభివృద్ధి పథకాలు అందుతున్నాయంటూ ఆయా నియోజకవర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం కొనసాగుతోంది. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట మండలంలోని పమిడిమర్రు గ్రామంలో జరిగింది. ప్రతి ఇంటికి వెళుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ మంచి రోజులు వస్తాయనే భరోసా ఇస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ముందుకు సాగారు. నవరత్నాల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కాగానే, చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలం పాతబొమ్మువానిపాలెం నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని, పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం గాదెవారిపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఆలకిస్తూ ధైర్యం చెబుతూ మంచి జరుగుతుందనే భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. -
దుబాయ్‌లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నెల్లూరు, కోవూరు: టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్సార్సీపీ విజయానికి బూత్ కమిటీ కన్వీనర్లు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. కోవూరు పంచాయతీలోని 140 నుంచి 145 వరకు పోలింగ్ బూత్‌ల పరిధిలో శుక్రవారం నిర్వహించిన రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమానికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి హాజరయ్యారు. తొలుత కొత్తూరు కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలపై పోలింగ్‌బూత్ పరిధిలోని ఇంటింటికీ తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించాలన్నారు. అనంతరం పోలింగ్‌బూత్‌ల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. 24న జొన్నవాడలో ప్రత్యేక పూజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 24న మూడు వేల కిలోమీటర్లకు చేరుకుంటుందని ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి చేపట్టిన యాత్ర దిగ్విజయంగా పూర్తికావాలని 24న ఉదయం జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మూడు వేల కొబ్బరికాయలను కొట్టే కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. -
ఇంటింటికీ నవరత్నాలు
ప్రకాశం, ఒంగోలు: రాజన్న బిడ్డను ఆశీర్వదిస్తే వృద్ధులకు నెలకు రెండు వేలు పింఛను ఇస్తాడు. పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని నిషేధించి అక్క,చెల్లెమ్మలకు అండగా ఉంటాడు.. పిల్లలను ప్రభుత్వ బడికి పంపి చదివించే తల్లిదండ్రులకు ఆర్థిక చేయూతనిస్తాడు. కార్పొరేట్ వైద్యంతో ఆర్థిక భరోసానిస్తాడు.. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలను ఇంటింటికీ తిరుగుతూఒక్కొక్కటిగా ప్రజలకు వివరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమం జిల్లాలో ఐదో రోజు శుక్రవారం మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో సాగింది. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. వైఎస్సార్ సీపీపై ప్రజల్లో ఉన్న అభిమానం.. అధికార పార్టీతోపై ఉన్న వ్యతిరేకత స్పష్టం అవుతోంది. రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం శుక్రవారం జిల్లాలోని ముమ్మరంగా జరిగింది. ఒంగోలులో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి 24వ డివిజన్లోని వడ్డెపాలెం, మంగలిపాలెంలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా డివిజన్లోని పార్వతమ్మ అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి కొమరోలు మండలంలోని మొక్కుపల్లె, బెడిసెపల్లె గ్రామాలలో ప్రచారం ముమ్మరం చేశారు. కందుకూరులో మాజీమంత్రి మానుగుంట మహీధరరెడ్డి కందుకూరు పట్టణంలోని 2వ వార్డులోని జనార్దన్‌కాలనీలో నవరత్నాల పథకాల గురించి వివరించి కరపత్రాలు పంచారు. నవరత్నాలు పథకం ద్వారా ప్రయోజనాలను వివరించారు. పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి రామనాథంబాబు మార్టూరు మండలంలోని అంబేడ్కర్ కాలనీలో పర్యటించారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్‌బాబు మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలో మండల, గ్రామస్థాయి నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు.. చీరాల మండలం ఈపూరుపాలెం ఈసుబ్‌నగర్‌లో చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూధన్‌యాదవ్ కనిగిరి మండలంలోని దిరిశవంచ గ్రామంలో బూత్ కమిటీ కన్వీనర్లతో ఆయన రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బాచిన చెంచుగరటయ్య కొరిశపాడు మండలం మేదరమెట్లలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్షించారు. -
త్వరలో మంచి రోజులు
వైఎస్ఆర్ జిల్లా, వేంపల్లె : వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేంపల్లె మండలంలోని అలవలపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. ముందుగా వేంపల్లె మండల ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి సమాధి వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు. అనంతరంగ్రామంలో ఇంటింటికి తిరిగి నవరత్నాల గురించి వివరించారు. ప్రజలు తమ సమస్యలను వైఎస్ అవినాష్‌రెడ్డికి ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పాలన కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో టీడీపీ చేసిన ఆరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబుకు అధికార పీఠం ఎక్కడ జారిపోతుందోనన్న భయం పట్టుకుందన్నారు. దాన్ని మరలా దక్కించుకోవడం కోసం ప్రజలను ఏ రకంగా మోసం చేయాలనే ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా ప్రజలు ఆయన మాట నేమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయ కేతనం ఎగురవేసి జగన్ సీఎం కావడం ఖాయన్నారు. త్వరలో మంచి రోజులు వస్తున్నాయని.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. నవరత్నాలతోనే సంక్షేమం సాధ్యం.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన నవరత్నాలతోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, మండలాధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌వల్లి, మండల బూత్ కమిటీ మేనేజర్ ఆర్.శ్రీను, మండల యూత్ కన్వీనర్ రవిశంకర్ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్.వేణు, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఆదినారాయణరెడ్డి, ఎంపీటీసీలు గంగరాజు, నల్లగారి గంగిరెడ్డి, రాజ్‌కుమార్, కొత్తూరు రెడ్డయ్య, సర్పంచ్ ఆర్ఎల్వి ప్రసాద్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, పుల్లారెడ్డి, యల్లారెడ్డి, శేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి, క్రిష్ణయ్య, వెంకటయ్య, గజ్జెల రామిరెడ్డి, రామలింగారెడ్డి, మల్లు నాగసుబ్బారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
నవరత్నాలతో సంక్షేమ రాజ్యం
చిత్తూరు, సాక్షి: నవరత్నాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతుందని వైఎస్సార్సీపీ నాయకులు తెలి పారు. శుక్రవారం జిల్లాలో సత్యవేడు, పుంగనూ రు, చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, గంగాధరనెల్లూరు, కుప్పం, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్ర మం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నాయకులు ప్రతిరోజూ గ్రామాల్లోని ప్రజలతో మమేకం అవుతున్నారు. వైఎస్సార్సీపీ అధికా రంలోకి వస్తే ప్రవేశపెట్టనున్న పథకాల గురించి వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటుకు రూ.5 వేలు ఇచ్చే అవకాశముందని, దీనికి ఆశపడితే లక్షల రూపాయల పథకాలు చేజారే అవకాశం ఉందని ప్రజలకు తెలియజెబుతున్నారు. ♦ పుంగనూరు మండలం ఏడూరులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హాజరయ్యారు. ♦ గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగ రాజపురం మండలం పిళ్లారికుప్పంలో ఎమ్మెల్యే నారాయణస్వామి పాల్గొన్నారు. ♦ మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి నిమ్మనపల్లిలో ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు. ♦ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో నవరత్నాల గురిం చి సమన్వయకర్త చంద్రమౌళి తెలిపారు. ♦ శ్రీకాళహస్తి రూరల్ బొక్కసంపాళెం, కొత్తపల్లి మిట్ట గ్రామాల్లో సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ♦ చిత్తూరు మురకంబట్టులో శుక్రవారం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. సమన్వయకర్త జంగాలపల్లి ఇంటింటికీ తిరుగుతూ నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ♦ పెద్దపంజాణి మండలం అమ్మరాజుపల్లి, చామనేరు పంచాయతీల్లో ‘రావాలి జగన్ కార్యక్రమం జరిగింది. సమన్వయకర్త వెంకటేగౌడ ఆధ్వర్యం వహించారు. ♦ బుచ్చినాయుడుకండ్రిగ మండలం పెద్దపాలేడు, అనంతాపురం గ్రామాల్లో ‘కావాలి జగన్’ కార్యక్రమం జరిగింది. సమన్వయకర్త ఆదిమూలం పాల్గొన్నారు. ♦ తిరుపతి కొర్లగుంటలో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో యువనాయకుడు భూమన అభినయ్ పాల్గొన్నారు. జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ రాజ్యం అని చెప్పారు. నవరత్నాలపై ఇంటింటా ప్రచారం చేశారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా రావాలి జగన్ కావాలి జగన్
-
నవరత్నాలతోనే అన్ని వర్గాల అభివృద్ధి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్– కావాలి జగన్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుని నవరత్న పథకాల గురించి వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో పలు గ్రామాల్లో పార్టీ నేతలు పర్యటించి నవరత్న పథకాలు అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చుతాయని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. విజయనగరం జిల్లాలో ఇంటింటికీ నవరత్నాలు పేరిట కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షంలోనూ పార్టీ నేతలు ప్రజలను కలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రామాల్లో పార్టీ నేతలు పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చాక పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అందరం కలసి జగన్‌ను సీఎంను చేద్దామని, రాజన్న రాజ్యం తెచ్చుకుందామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి నవరత్నాల గురించి వివరించాయి. కృష్ణా జిల్లాలో ఐదో రోజూ విజయవంతంగా కొనసాగింది. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. గుంటూరు జిల్లాలో నేతలు ఇంటింటికీ తిరిగి నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలు నవరత్నాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో పార్టీ నేతలతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే పేదలకు మంచి జరుగుతుందని పార్టీ నేతలు ప్రజలకు వివరించారు. అనంతపురం జిల్లాలో పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి వైఎస్ జగన్‌ను సీఎంను చేయాలని కోరారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలంలోని ముదినేపల్లి, దళితవాడలో బీసీ వర్గానికి చెందిన 20 కుటుంబాలు, మైనార్టీ కుటుంబాలు 10 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ నేతలు నవరత్నాల గురించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. -
నవరత్నాలతో ప్రగతికి నాంది
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: ప్రజాసంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రగతికి నాంది అని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కోవూరు తూర్పు అరుంధతీయవాడలో గురువారం రావాలి జగన్...కావాలి జగన్ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించాడన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతలను వదిలి జన్మభూమి కమిటీలను పెట్టి ప్రభుత్వ పథకాలను çటీడీపీ నేతలు, కార్యకర్తలకే పరిమితమయ్యేలా చేస్తున్నాడన్నారు. నిన్నటివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి పనిచేసి నేడు వైఎస్సార్సీపీ నేతలు మోదీతో ఉన్నారని మోసకారి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. రాష్ట్ర రాజధానిలో ఒక్క శాశ్వత భవనం లేకపోయినా చంద్రబాబు గ్రాఫిక్స్‌ను చూపుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. మభ్యపెట్టడంలో చంద్రబాబు మొనగాడన్నారు. అందుకే ప్రజాస్వామ్య మనుగడకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలన్నారు. అందరూ సమష్టిగా కష్టపడి జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు నాటకాలను, భూటకపు హామీలను, ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడాన్ని వివరించాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నదే లక్ష్యమని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పోలింగ్‌బూత్‌ల పరిధిలో ప్రతి ఒక్కరికీ చేరాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్‌రెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, మావులూరు శ్రీనివాసులురెడ్డి, గొల్లపల్లి విజయ్‌కుమార్, సూరా శ్రీనివాసులురెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య పాల్గొన్నారు. -
నవరత్నాలతో ప్రతి ఇంటికి ప్రయోజనం
సాక్షి కడప : వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజునుంచి నవరత్న పథకాల అమలుతో ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూరనుందని..వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. గురువారం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, అంజద్‌బాషా, పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడు వైఎస్ జగన్ మాత్రమేనని వారు తేల్చి చెప్పారు. 2019లో అధికారంలోకి రావడం తథ్యమన్నారు. జిల్లాలోని అన్నిచోట్లా రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం ఊపందుకుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.రైల్వేకోడూరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఓబులవారిపల్లెలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఇంటింటికి తిరిగారు. ప్రతి ఒక్కరికి నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను అందజేస్తూ ముందుకు కదిలారు. వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కడపలోని 50వ డివిజన్లో రూకవారిపల్లె, పాలెంపల్లెలలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబులు ఇంటింటికి తిరుగుతూ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. చంద్రబాబు మోసాలను వివరిస్తూ ముందుకు సాగారు.మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం ఇడమడకలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది. ఇంటింటికి తిరుగుతూ అబద్ధాల చంద్రబాబును నమ్మవద్దని పిలుపునిచ్చారు. రాయచోటి పరిధిలోని గొర్లముదివీడు గ్రామ పరిధిలోని అరవవాండ్లపల్లె, బాలిరెడ్డిగారిపల్లె తదితర కుగ్రామాల్లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పర్యటించారు. బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడులో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్యలకు ఘన స్వాగతం లభించింది. ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల గురించి వివరించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం కర్మలవారిపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి రావాలి–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. -
నవరత్నాలతో ప్రతి ఇంటికీ లబ్ధి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నవరత్నాల పథకాలతో ప్రతి ఇంటికీ రూ.లక్షల్లో లబ్ధి చేకూరుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి రోజు రెండు పోలింగ్ బూత్‌ల్లో వైఎస్సార్సీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతున్నారు. టీడీపీ అవినీతి, అక్రమాలపై ప్రజలను చైతన్య పరచడంతోపాటు.. ఆరు నెలలు ఓపిక పడితే రాజన్న రాజ్యం జగనన్న ద్వారా సిద్ధిస్తుందని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే.. నవరత్నాలతో కలిగే లక్షల రూపాయల లబ్ధికి దూరమయ్యే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న విజ్ఞప్తికి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం గురువారం..జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. బండిఆత్మకూరు మండలం సోమయాజులపల్లెలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొని ఇంటింటా తిరిగి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలోని కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు పుల్లారెడ్డి పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం శాతనకోటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో బ్రహ్మానందారెడ్డి, శివారెడ్డి ఆధ్వర్యంలో గుత్తపాటి వెంకటరెడ్డి, మురళీ, శ్రీనివాసుల ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. కోవెలకుంట్ల మండలం రేవనూరులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండలం తాపినేనిపల్లెలో గంగుల బిజేంద్రారెడ్డి(నాని), కల్లూరు అర్బన్‌లోని 34వ వార్డులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాలలోని గాంధీ చౌక్ ఏరియాలో శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మిగనూరులోని ఎస్సీ కాలనీలో ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి..‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమాల్లో పాల్గొని నవరత్న పథకాలపై ఇంటింటా ప్రచారం చేశారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాలహర్వి మండలంలోని పచ్చర్లపల్లి, బాపురం, అమృతపురం, సిద్ధాపురం, మల్లూరు గ్రామాల్లో ఇంటింటా తిరిగి నవరత్నాల పథకాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం తుమ్మిగనూరులో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తనయుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మండల నాయకులు మురళీరెడ్డి, ఇల్లూరి ఆదినారాయణరెడ్డి, బూత్ కమిటీ కన్వీనర్ బెట్టన గౌడ్ పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర మండలం మదనంతపురంలో ఇన్చార్జి కంగాటి శ్రీదేవి, మండల నాయకులు మురళీధర్‌రెడ్డి, మల్లికార్జున యాదవ్, రాజశేఖరరావు పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలకు నవరత్నాలపై అవగాహన కల్పించారు. -
ఇంటింటా ‘రావాలి జగన్ – కావాలి జగన్’
పట్నంబజారు(గుంటూరు): అడుగులో అడుగయ్యారు... అన్నింటా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.. కష్టాలు తెలుసుకుని పరిష్కారం కోసం పాటుపడతామని హామీ ఇస్తున్నారు.. నవరత్నాలతో ప్రతి ఇంటా వెలుగులు నిండుతాయని చాటి చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ప్రతి ఇంటి తలుపు తడుతూ, వారి సమస్యలు ఆలకిస్తూ మంచి రోజులు వస్తాయనే భరోసా కల్పిస్తున్నారు. మంగళగిరి పట్టణంలో 3వ వార్డులో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ‘రావాలి జగన్ – కావాలి జగన్’ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు జన్మించిన చిన్నారికి, ఒక వృద్ధురాలికి అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని 34వ డివిజన్ బీసీ కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరత్నాల గురించి వివరించారు. గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి కృష్ణనగర్ ప్రాంతంలో కార్యక్రమాన్ని చేపట్టారు. అపార్టుమెంట్లు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున చుండూరు మండలం చినగాజులవర్రులో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించి గ్రామస్తుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సత్తెనపల్లి పట్టణంలో 30వ వార్డు అంబేద్కర్ నగర్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కార్యక్రమాన్ని చేపట్టారు. నవరత్నాల కరపత్రాలు పంపిణీ చేస్తూ వాటి ఆవశ్యకత వివరించారు. తెనాలి నియోజకవర్గంలో రూరల్ పరిధిలో సోమసుందరంపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం చేపట్టారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం వైకుంఠపురం ఎస్సీ కాలనీలో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు కార్యక్రమాన్ని చేపట్టారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల మండల పరిధిలోని అడవిపల్లిపాలెంలో ఎమ్మెల్యే కోన రఘుపతి తనయుడు కోన నిఖిల్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలం పెద్దవరం గ్రామంలో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త మోపిదేవి వెంకటరమణ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. -
ఉత్సాహంగా ‘రావాలి జగన్..కావాలి జగన్’
అనంతపురం: వైఎస్సార్ సీపీ ప్రారంభించిన ‘రావాలి జగన్..కావాలి జగన్’ కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. నేతలు ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అమలు చేసే నవరత్నాల్లాంటి పథకాల గురించి తెలియజేస్తున్నారు. గురువారం అనంతపురం నగరం భవానీనగర్, రాణీనగర్, ఫెర్రర్‌కాలనీల్లో కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య ఇంటింటికీ వెళ్లి నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఇళ్ల ముందే మురుగునీరు నిల్వ ఉంటూ రోగాలబారిన పడుతున్నామని మహిళలు షాహీదా, లక్ష్మీ, మాలతి, పార్వతమ్మ, లత వాపోయారు. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంకాలమ్మ గుడి అర్చకుడు లక్ష్మీనారాయణ ఆచారి తాను ఇంటి కోసం పడుతున్న ఇబ్బందులను అనంత వెంకటరామిరెడ్డి ఎదుట వాపోయాడు. రోడ్డు ప్రమాదంలో చేయి విరిగిందని ఆరోగ్యశ్రీ వర్తించలేదని, సీఎం సహాయ నిధి కింద కూడా ఆర్థికసాయం అందలేదని ఆటోడ్రైవర్ మహమ్మద్ అలీ గగ్గోలు పెట్టాడు. చంద్రబాబు పాలనలో వైఫల్యాలను వివరించి, మరోసారి ఆయన మోసాల వలలో పడొద్దని చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు నాయకులు వివరించారు. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామంలో ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. గ్రామంలో రోడ్లు లేవని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు సుంకమ్మ, లక్ష్మీదేవి, నెట్టికంటమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్నా వితంతు పింఛను మంజూరు చేయలేదంటూ లలితమ్మ అనే మహిళ వాపోయింది. ధర్మవరం పట్టణం 5వ వార్డు శివానగర్‌లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పర్యటించారు. కాలనీలో కాలువలు శుభ్రం చేయడం లేదని దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. గుంతకల్లు నియోజకవర్గం పామిడి మునిసిపాలిటీ 7వ వార్డు, గుత్తి మండలం యంగన్నపల్లి, బేతాపల్లిలో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ సమస్వయకర్త వై. వెంకటరామిరెడ్డి, పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను అందజేశారు. కదిరి మున్సిపాలిటీ నాగిరెడ్డిపల్లి, పేరిపల్లి క్వార్టర్స్‌లో సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి పర్యటించారు. మురుగుకాలువలు ఎక్కడికక్కడ నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నా... పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు. స్పందించిన సిద్ధారెడ్డి... సొంత నిధులతో శుభ్రం చేయించి మురుగునీటి కోసం గుంత తవ్విస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి, వంకతండా గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పర్యటించారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పే వారికే పథకాలు అమలు చేస్తున్నారని సుశీలమ్మ అనే మహిళ వాపోయింది. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని మరో మహిళ వాణీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జగన్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి అందరికీ మంచి జరుగుతుందని ఉషాశ్రీ చరణ్ ప్రజలకు భరోసా ఇచ్చారు. -
నవరత్నాలతో రాజన్న రాజ్యం
చిత్తూరు, సాక్షి: నవరత్నాలతో రాజన్న రాజ్యం వస్తుందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాలో తిరుపతి, పుంగనూరు, పలమనేరు, కుప్పం, చిత్తూరు, శ్రీకాళహాస్తి, సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. నాయకులు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రతి తలుపునూ తట్టి నవరత్నాలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ⇔ తిరుపతి 10వ వార్డులోని కొర్లగుంటలో వైఎ స్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి పర్యటించారు. నవరత్నాలను ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్ పాలనలో మళ్లీ రాజన్న పాలనను పొందవచ్చన్నారు. ⇔ నవరత్నాలతో పేదరికం దూరమవుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు నియోజకవర్గం వల్లిగట్ల, కామిరెడ్డిగారిపల్లి, కందూరు, తమ్మినాయునిపల్లి పంచాయతీల్లో జరిగిన రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు విన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయని చెప్పారు. ⇔ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మె ల్యే నారాయణస్వామి పాల్గొన్నారు. ఎస్సార్‌పురం మండలం ముదికుప్పం పంచాయతీలో గడపగడపకూ తిరుగుతూ నవరత్నాలను ప్రజ లకు వివరించారు. ఫీజు రీయిం బర్స్మెంట్, అమ్మ ఒడి పథకాలతో పేద పిల్ల లు పెద్ద చదువులు చదువుకునే అవకాశం ఉందన్నారు. ⇔ కుప్పం నియోజకవర్గం కంగుందిలో నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల సమస్యలు విన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయింస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా నీటితో కుప్పాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ⇔ శ్రీకాళహాస్తిలో గురువారం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ నవరత్నాలను వివరించారు. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు రాజన్న రాజ్యంలో మేలు జరిగిందన్నారు. రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ బాలశౌరి వైఎస్సార్సీపీలో చేరారు. ⇔ చిత్తూరులోని మురకంబట్టులో జంగాలపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. మురకంబట్టులో ప్రతి ఇంటికీ నవరత్నాల్లోని పథకాల వివరాలు ముద్రించిన కరపత్రాలను పంచారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ⇔ సత్యవేడు బుచ్చినాయుడు కండ్రిగ కాటూరులో గురువారం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. ఆదిమూలం పాల్గొన్నారు. ప్రజా సమస్యలు విన్నారు. ⇔ పలమనేరు నియోజకవర్గ ఇంచార్జి వెంకటే గౌడ పెద్దపంజాణిలో నిర్వహించారు. ప్రజా సమస్యలు విన్నారు. పరిష్కరించేందకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాలను వివరించారు. -
నవరత్నాలతో నవోదయం
సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ: ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ప్రజలతో మమేకమై, పార్టీ విధానాల గురించి వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల పక్షాన్నే నిలుస్తుందని, తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎనిమిదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని, జగన్ ద్వారానే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతున్న వైఎస్సార్ సీపీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వస్తే తమ పార్టీ ఏం చేస్తుందో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. జగన్ ప్రకటించిన నవరత్న పథకాల గురించి వివరించారు. అన్ని వర్గాలకూ మేలు జరిగేలా నవరత్న పథకాలను రూపొందించారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల గ్రామంలో వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యాన, అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గూడాలలో కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ ఆధ్వర్యాన, ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్‌కుమార్ ఆధ్వర్యాన ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ 47వ డివిజన్ క్వారీ ప్రాంతంలో కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఈ కార్యక్రమం నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గం పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం నర్సాపురపుపేటలో కో ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం కాండ్రకోటలో కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీలో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెంలో కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. -
ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా
-
బాబు పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం
వెంకటాచలం: చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ‘రావాలి జగన్, కావాలి జగన్’ కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో మొదట వెంకటాచలం మండలం గొలగమూడి నుంచి సోమవారం ప్రారంభించారు. గొలగమూడిలోని వెంకయ్యస్వామి ఆలయంలో పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబుపాలనలో వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, మరోసారి బాబు మోసాల వలలో పడవద్దని ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తామన్నారు. బాబు నాలుగన్నరేళ్ల పాలనలో ఎంచేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి తప్ప అభివృద్ధి ఛాయలు ఎక్కడా కన్పించడంలేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి, ఆయన కుమారుడు కలిసి పంచభూతాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వచ్చి ఓట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరూ వాళ్లను నమ్మొద్దన్నారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా మొక్కువోని ధైర్యంతో ముందుకు సాగుతున్న జగన్మోహన్రెడ్డికి మద్దతు పలకాలని ప్రజలను కోరారు. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల కార్యక్రమంతో ప్రతీ కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉందనే విషయాన్ని ప్రతిఓక్కరూ గుర్తించుకోవాలన్నారు. తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు మాట్లాడుతూ చంద్రబాబులాంటి మోసపూరిత సీఎం మరొకరు లేరన్నారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా.. లేదనే విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. ఎన్నికల ముందు బాబు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను తెలియజేసేందుకు మూడోసారి ప్రజల్లోకి వస్తున్నామని చెప్పారు. పేదలకు న్యాయం చేసేవారైతే నాలుగన్నరేళ్ల పాలన ముగిసిన తరువాత అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కోడూరు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, పార్టీ మండల కన్వీనర్ కె.చెంచుకృష్ణయ్య, ఎంపీటీసీ కోసూరు పద్మాగౌడ్ పాల్గొన్నారు. -
జన జాగృతి
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ లక్ష్యాలను వివరిస్తూ.. నవరత్నాల ప్రయోజనాలను జనానికి వివరించేందుకు ’రావాలి జగన్.. కావాలి జగన్’ నినాదంతో ముందుకు సాగుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సోమవారం పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య నేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతు న్నారు. చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. గడప గడపకు వెళ్లి జనాన్ని జాగృతం చేస్తున్న ఈ కార్యక్రమానికి తొలిరోజు విశేష స్పందన లభించింది. సాక్షి ప్రతినిధి,ఒంగోలు: జిల్లాలో సోమవారం రావాలి జగన్–కావాలి జగన్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ సమన్వయకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించారు. ఈ పథకాలతో వివిధ వర్గాల ప్రజలకు జరిగే మేలును తెలియజెప్పారు. తొలిరోజు సమన్వయకర్తలతో పాటు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ♦ మార్కాపురం నియోజకవర్గం మొద్దులపల్లి, పెదయాచవరంలలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరపత్రాలు పంచి, ప్రచారం నిర్వహించారు. ♦ యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలం చాట్లమడలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ♦ కందుకూరు వాసవీనగర్‌లో మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి కరపత్రాలు పంపిణీ చేసి నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. ♦ చీరాల రూరల్ మండలం ఈపురుపాలెం సీతారామమ్మపేటలో సమన్వయకర్త యడం బాలాజీ ఆధ్వర్యంలో గడప గడపకూ వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ♦ గిద్దలూరు నియోజకవర్గపరిధిలోని సంజీవరాయనిపేటలో సమన్వయకర్త ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. ♦ సంతనూతలపాడు శివాలయంలో పార్టీæ సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్‌బాబు పూజలు నిర్వహించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం చలపాలెం, రుద్రవరం, లక్షీపురం, కొనగానివారిపాలెంలలో ప్రచారం నిర్వహించారు. ♦ పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం కొనికి పంచాయతీ కట్టావారిపాలెంలో పార్టీ సమన్వయకర్త రావి రామనాథంబాబు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేసి పార్టీ కార్యక్రమాలు వివరించారు. ♦ అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం గుంటుపల్లిలో పార్టీ సమన్వయకర్త బాచిన చెంచు గరటయ్య పార్టీ ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ♦ కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని శంఖవరంలో పార్టీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నవరత్నాలు ప్రకాశించేలా
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు: రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ సోమవారం జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ప్రతి చోటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజ లు నీరాజనాలు పలికారు. ఏలూరులో నియోజకవర్గ కన్వీనర్, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ నేతృత్వంలో కొమడవోలు గ్రామంలో పాదయా త్ర చేపట్టి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. జగన్ పాదయాత్రతో అధికార పార్టీ నేతల ఆగడాలు, అక్రమాలను ఎదిరించే నాయకుడు ఒకడున్నాడనే ధైర్యం ప్రజల్లో లిగిందని ఆళ్ల నాని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామస్థాయి నాయకుడి నుంచి జిల్లా, పార్లమెంటరీ స్థాయి నాయకుడు వరకూ ప్రతి ఒక్కరూ పాదయాత్ర చేపట్టి ప్రజల వద్దకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆగడాలకు బలైపోతున్న బాధితులకు అండగా ఉంటామన్నారు. టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలను ప్రజా మద్దతుతో ఎండగట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలవరం నియోజకవర్గంలోని పోలవరం మండలంలో మారుమూల గ్రామమైన పైడాకులమామిడిలో రావాలి జగన్.. కావాలి జగన్ నినా దంతో సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యం లో గడపగడపకూ నవరత్నాల ప్రచార కార్యక్రమం జరిగింది. బాలరాజు గ్రామంలోని ఇంటిం టా తిరిగి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు నవరత్నాల పథకాలను వివరించారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో జరిగింది. గ్రామంలో తొలుత బూత్ కమిటీ కన్వీనర్లతో మాట్లాడిన కొట్టు అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ కార్యక్రమాల అమలులో వైఎస్ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని ప్రజలను కోరారు. ప్రతి కుటుం బానికి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చేలా జగన్ నాయకత్వంలో రూపొందించిన నవరత్నాల పథకం ద్వారా అన్నివర్గాలకూ మేలు జరుగుతుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు నేతృత్వంలో యలమంచిలి మండలంలోని గుంపర్రు గ్రామంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. రెండో రోజు వర్షంలోనూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని నాగబాబు వెంట ఇంటింటా తిరుగుతూ నవరత్నాల పథకాల గురించి వివరించారు. ఉంగుటూరు నియోజకవర్గ కేంద్రమైన ఉం గుటూరులో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమానికి నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు శ్రీకారం చుట్టారు. స్థానిక పంచాయతీ కమ్యూనిటీ హాలులో జరిగిన బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో 22, 23 బూత్ కేంద్రాల పరిధిలో ఆయన ఇంటింటికీ వెళ్లి నవరత్నాలు గురించి వివరించారు. వర్షం కురుస్తున్నా ఏ మాత్రం లెక్కజేయకుండా వాసు బాబు ముందుకు సాగారు. చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ ఎలీజా నేతృత్వంలో చింతలపూడి మండలం చింతంపల్లి, మేడిశెట్టివారిపాలెం గ్రామాల్లో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాలను సమన్వయకర్త ఎలీజా ప్రజ లకు వివరించారు. గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు నేతృత్వంలో గోపాలపురం మండలం గోపవరంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సర్వమత ప్రార్థనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి పెదవేగి మండలం రా ట్నాలకుంటలో రావాలి జగన్ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. రాట్నాలమ్మవారికి, సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో ఇంటింటా తిరిగి వైఎస్సార్ సీపీ నవరత్నాల పథకాలు, టీడీపీ అవినీతి, అక్రమాలను వివరిం చారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. -
రావాలి జగన్.. కావాలి జగన్
విజయవాడ సిటీ : ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు నాయుడు మోసపూరిత ప్రభుత్వంతో విసిగివేసారిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో పీడవిరగడ చేసుకుందామని ఉవ్విళ్లురుతున్నారు. రాజన్న రాజ్యం మళ్లీ కావాలి.. అది జగనన్నతోనే సాధ్యమనే దృఢ విశ్వాసం, ఆకాంక్ష ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రతి గడపకూ వెళ్లి ప్రజలను జాగృతం చేస్తున్నారు. సోమవారం ప్రారంభమైన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమ విశేషాలు. మచిలీపట్నంలో ఉదయం 6:30 గంటలకే సిరివేళ్లపాలెం నుంచి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గడపకూ వెళ్లి వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను వివరించారు. మహిళలు, పెద్దలు, యువత నుంచి విశేష స్పందన లభించింది. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్‌లో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైలవరం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త, పార్టీ సీనియర్ నేత కొలుసు పార్ధసారథి పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని దక్షిణ చిరువోలులంకలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరిగి పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను వివరించారు. ఈ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహరావు, మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పామర్రు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలోని బుద్దవరం శివారు రాజీవ్‌నగర్ కాలనీలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావ్ నేతృత్వంలో ఇంటింటికీ తిరిగి నవరత్నాలను ప్రచారం చేశారు. పార్టీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌసాని, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోటగిరి వరప్రసాదరావు, కాసరనేని గోపాలరావు, వై.నాగిరెడ్డి, నక్కాగాంధీ, కోడెబోయిన బాబీ, తులిమిల్లి ఝాన్సీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గంలోని కలదిండి మండలం పెదలంక గ్రామంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచి, నవరత్నాలు వల్ల జరిగే లాభాలను వివరించారు. పార్టీ నేతలు పాపారావు గౌడ్, వాసిపల్లి యోనా, అబ్రహాంలింకన్, ఐనాల బ్రహ్మాజీ, నీలపాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నందిగామ నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో నందిగామ మండలం అడివిరావులపాడు గ్రామంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో జరిగింది. తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆధ్వర్యంలో ఎ–కొండూరు మండలం పాత కొండూరులో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకొని, వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నరెడ్ల వీరారెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఆంజనేయులు, భూక్యా ఘనియా, ఎంపీటీసీ చంద్రమోహన్, జూపల్లి రాజేష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోసమన్వయకర్త యలమంచిలి రవి ఆధ్వర్యంలో24వ డివిజన్ గంగానమ్మగుడి వద్ద నుంచి రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. పార్టీ శ్రేణులతో కలసి ఆయన ప్రతి ఇంటిని సందర్శించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చందన సురేష్, ఎస్సీ సెల్ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తోకల శ్యామ్‌కుమార్, యువజన విభాగం కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, చిత్రం లోకేష్, జయరాజు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 27వ డివిజన్ హరిజనవాడలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ ఆధ్వర్యంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల ద్వారా జరిగే లబ్ధిని ప్రజలకు వివరించడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయరెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం ముసునూరు మండలం, వేల్పుచర్లలో జరిగింది. కార్యక్రమంలో ఎంపీటీసీ కాండూరి శ్రీరామచంద్ర, పార్టీ ముసునూరు మండల అధ్యక్షుడు మూల్పురి నాగమల్లేశ్వరరావు, యువజన విభాగం మండల అధ్యక్షుడు తులిమెల్లి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
నవరత్నాలతోనే సంక్షేమం సాధ్యం
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం విజయవంతంగా సాగింది. 13 జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు పాదయాత్రగా ఇంటింటికీ తిరుగుతూ నవరత్న పథకాల గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఈ పథకాలతో జరిగే మేలు గురించి ప్రజలకు తెలియజెప్పారు. వైఎస్ జగన్ అధికారంలో వస్తే రాజన్న రాజ్యం తెస్తారని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తారని నేతలు ప్రజలకు కూలంకషంగా వివరించారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ జీవితాల బాగుకోసం వైఎస్ జగన్‌ను సీఎం చేసుకుంటామని ఏకకంఠంతో నినదించారు. సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సమన్వయకర్తలు, కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగి నవరత్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. నవరత్న పథకాల గురించి, వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే జరిగే మేళ్ల గురించి నేతలు ప్రజలకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో ‘రావాలి జగన్– కావాలి జగన్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదల అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు నవశకానికి నాంది అవుతాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటూ పాదయాత్రలు జరిగాయి. సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసినా తడుస్తూనే పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నిచోట్లా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కదంతొక్కిన పార్టీ నేతలు, కార్యకర్తలు గుంటూరు జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలు కదంతొక్కారు. సత్తెనపల్లిలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గురజాలలో బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గడప గడపకు తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచారు. తొలిరోజు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమానికి ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలు స్పందిస్తూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్‌ని గెలిపించుకుని సీఎం చేస్తామన్నారు. వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్‌పై రాష్ట్ర ప్రజలు నమ్మకం చూపుతున్నారని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు అన్నారు. కర్నూలు జిల్లాలో పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించి నవరత్నాల గురించి ప్రజలకు తెలియజెప్పారు. అనంతపురం జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొని నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించారు.