
జగన్ సీఎం కావాలని విజయవాడ కనకదుర్గమ్మ గుడికి పాదయాత్రగా బయలుదేరిన కొమ్మా సుబ్బారావు
వైఎస్ జగన్ సీఎం కావాలని ఇప్పటి వరకు మొత్తం 850 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
సాక్షి, రాజుపాలెం (సత్తెనపల్లి): రావాలి జగన్...కావాలి జగన్ అంటూ గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు 850 కి.మీ పాదయాత్రను పూర్తి చేశారు. కొమ్మా సుబ్బారావు నాయుడు మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి పాదయాత్రగా బయలుదేరారు. జగన్ సీఎం కావాలని ఆయన ఆరు నెలల క్రితం శ్రీశైలం దేవస్థానానికి, మూడు నెలల క్రితం తిరుపతికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.
ఇప్పటి వరకు మొత్తం 850 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మళ్లీ నాలుగోసారి ఈనెల 26వ తేదీన కారంపూడి అంకమ్మతల్లి దేవాలయానికి పాదయాత్రగా వెళ్లనున్నట్టు సుబ్బారావు తెలిపారు. వైఎస్ జగన్ సీఎం కావాలని, అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగానూ గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తాను పాదయాత్ర చేసేందుకు సహకరిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు రాయపాటి పురుషోత్తం, వేపూరి శ్రీనివాసరావు, కొమెరపూడి కళ్లెం వెంకటరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.