
సాక్షి, హైదరాబాద్ : ఓ నాయకుడిపై రూపొందించిన పాట యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగించడం దేశ రాజకీయాల్లోనే ప్రప్రథమం. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి జనం గుండెల్లో నిలిచిన జననేత వైఎస్ జగన్ మీద రాసిన ఈ పాట.. ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ ప్రజల గుండెల్లో పాతుకుపోయిన ఈ పాట ఇప్పటివరకు యూట్యూబ్‌లో రెండు కోట్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది .
ఈ ప్రచార గీతం విడుదలైన రోజు నుంచి సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ మున్ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా యూట్యూబ్‌లో రావాలి జగన్ కావాలి జగన్ పాట 2కోట్ల వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ లిఖించబోయే కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది ఈ పాట. ఈ పాటను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. తెలుగు ప్రజలు ఎక్కడ వున్నా వారి మదిని కదిలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment