
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ
సాక్షి, మెరకముడిదాం: మండలానికి తోటపల్లి కాలువ ద్వారా నీటిని తీసుకొస్తామని వైఎస్సార్‌సీసీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. మండలంలోని ఉత్తరావల్లిలో మంగళవారం నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాల ని కోరారు. మహానేత వైఎస్సార్ అందించిన పాలన త్వరలోనే రానున్నదని చెప్పారు. చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు గెలిపించారని, ఇప్పుడు మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మెరకముడిదాం మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చుదిద్దుతానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.