
నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తున్న మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి
నిమ్మనపల్లె : జన్మభూమి కమిటీలతో ప్రభుత్వం దొడ్డిదారిన టీడీపీ నాయకులకు అధికారం అప్పగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని రాజంపేట మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. శనివారం నిమ్మనపల్లె మండలం బండ్లపై గ్రామ పంచాయతీలో నిర్వహించిన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల్లో అభివృద్ధిని కుంటుపరిచారని విమర్శించారు. గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల అవినీతి పెచ్చుమీరిందని తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అనుచరులకు మంజూరు చేసుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు.