
గోవలంకలో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్న పొన్నాడ వెంకట సతీష్‌కుమార్
తూర్పుగోదావరి, కాకినాడ: యువతకు నిరుద్యోగ భృతి... రైతులకు, మహిళలకు రుణమాఫీ... విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్... సహా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని టీడీపీ సర్కార్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్ సీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. రావాలిజగన్–కావాలిజగన్‌లో భాగంగా బుధవారం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన నవరత్న పథకాలను వివరించడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. నమ్మించి దగా చేసిన సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలంటే విజ్ఞప్తి చేశారు. జననేత జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
రామచంద్రపురంలో... రామచంద్రపురం మండలం వెలంపాలెంలో కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని జననేత జగన్ నాయకత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాకినాడ సిటీలో... కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో 20వ డివిజన్ మహాలక్ష్మినగర్ ప్రాంతంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవరత్న పథకాలు వివరించారు.
రాజానగరంలో... రాజానగరం లాలాచెరువు హౌసింగ్ బోర్డుకాలనీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. ఇంటింటికి ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికి మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని, జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముమ్మిడివరంలో... ముమ్మిడివరం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో తాళ్ళరేవు మండలం గోవలంకలో పార్టీనాయకులు, కార్యకర్తలు పర్యటించి రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
పి.గన్నవరంలో... పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు పి.గన్నవరం మండలం మొండెపులంక, మండలకేంద్రమైన అయినవిల్లిలో రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించి పార్టీ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.
రాజోలులో... రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు శివకోడులో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను వంచించి పాలన సాగిస్తోన్న చంద్రబాబు సర్కార్‌ను రానున్న ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రత్తిపాడులో... రౌతులపూడి మండలం బంగారయ్యపేటలో ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్‌లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
జగ్గంపేటలో... గోకవరం మండలం వీరలంకపల్లిలో జగ్గంపేట కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ విధానాలను ప్రజలకు వివరించారు.