మహిళతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల సొంతింటి కలను నెరవేర్చుతామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గురువారం రావాలి జగన్– కావాలి జగన్ అనే నినాదంతో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నపుబట్టీల వీధిలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి పేదలను రుణగ్రస్తులను చేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం వస్తే ఎలాంటి షరతులు లేకుండా ఇళ్లు నిర్మించి ఇచ్చి తాళాలు చేతికి ఇస్తామన్నారు. సొంతింటి కల నెరవేర్చని పక్షంలో మళ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు.
అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి ఇంటిలో పేద పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారందరికి పింఛన్ వస్తుందన్నారు. పట్టణ పరిధిలోని 40 వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. 13వ వార్డు పరిధిలోని సున్నపుబట్టీ వీధి వెనుక ఉన్న డ్రైనేజి కాలువలను చూస్తే మున్సిపాలిటీ నిర్లక్ష్యం ఇట్లే తెలిసిపోతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యానికి ఇది నిలువుటెత్తు సాక్ష్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ శివకుమార్ యాదవ్, టప్పా గైబుసాహెబ్, గోనా ప్రభాకర్‌రెడ్డి, సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, టౌన్‌బ్యాంకు డైరెక్టర్ ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, చెన్నకేశవరెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు బీఎన్‌ఆర్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు ఓబయ్య యాదవ్, వెల్లాల శేఖర్, వెలవలి నాయకుడు రాజశేఖరరెడ్డి, వాసుదేవరెడ్డి, జాకీర్, బంకచిన్నాయపల్లె లక్ష్మిరెడ్డి, మల్లికార్జున, అజీం, ఎంపీటీసీ సభ్యుడు చంద్ర ఓబుళరెడ్డి, పాములేటి, తీట్ల మనోహర్, తిరుపాల్, వెంకటేశ్, జిల్లా పార్లమెంట్ కమిటీ సహాయ కార్యదర్శి షాపీర్, ఎస్‌ఎండీ ఇలియాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment