అలవలపాడులో ప్రజలకు నవరత్నాల కరపత్రాలను అందిస్తున్న మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా, వేంపల్లె : వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేంపల్లె మండలంలోని అలవలపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. ముందుగా వేంపల్లె మండల ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి సమాధి వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు. అనంతరంగ్రామంలో ఇంటింటికి తిరిగి నవరత్నాల గురించి వివరించారు. ప్రజలు తమ సమస్యలను వైఎస్ అవినాష్‌రెడ్డికి ఏకరువు పెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పాలన కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో టీడీపీ చేసిన ఆరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబుకు అధికార పీఠం ఎక్కడ జారిపోతుందోనన్న భయం పట్టుకుందన్నారు. దాన్ని మరలా దక్కించుకోవడం కోసం ప్రజలను ఏ రకంగా మోసం చేయాలనే ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా ప్రజలు ఆయన మాట నేమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయ కేతనం ఎగురవేసి జగన్ సీఎం కావడం ఖాయన్నారు. త్వరలో మంచి రోజులు వస్తున్నాయని.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
నవరత్నాలతోనే సంక్షేమం సాధ్యం..
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన నవరత్నాలతోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, మండలాధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌వల్లి, మండల బూత్ కమిటీ మేనేజర్ ఆర్.శ్రీను, మండల యూత్ కన్వీనర్ రవిశంకర్ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్.వేణు, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఆదినారాయణరెడ్డి, ఎంపీటీసీలు గంగరాజు, నల్లగారి గంగిరెడ్డి, రాజ్‌కుమార్, కొత్తూరు రెడ్డయ్య, సర్పంచ్ ఆర్‌ఎల్‌వి ప్రసాద్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, పుల్లారెడ్డి, యల్లారెడ్డి, శేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి, క్రిష్ణయ్య, వెంకటయ్య, గజ్జెల రామిరెడ్డి, రామలింగారెడ్డి, మల్లు నాగసుబ్బారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment