
ఎమ్మెల్యే రచమల్లు శివప్రసాద్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర ప్రజల డేటా చోరీ విషయంలో సీఎం చంద్రబాబు, కొడుకు లోకేష్‌లను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, లోకేష్‌లను ఎన్నికల్లో పోటి చేయకుండా అదేవిధంగా, తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వారు ఈ దారుణానకి పాల్పడుతున్నారని ఆరోపించారు. డేటా చోరీ స్కాంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తమై ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి తమ ఆధార్ కార్డులను మార్చుకోవాలని పిలుపు ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment