
నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తున్న ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
సాక్షి కడప : రాష్ట్రంలో ఎలాంటి చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు సానుభూతి కోసం పాకులాడుతున్నారని..పాపులాటరీ తగ్గడంతో ఎలాగోలా ప్రజల మద్దతు కోసం పడరానిపాట్లు పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం ఓబులవారిపల్లె మండలంలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎర్రగుంట్లలో సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడారు. ఇటీవల బాబ్లీ కేసు నోటీసు వచ్చిన నేపథ్యంలో బాబు నానా హంగామా చేశారని, ఇదంతా కేవలం సానుభూతికోసమని ఎద్దేవా చేశారు. తాజాగా ఐటీ దాడులంటూ...మోదీ చేయించారంటూ ప్రచారం చేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు తీరు సిగ్గుచేటన్నారు. ఎప్పుడు చూసినా అబద్ధాలతోనే పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌కు అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని వారు విమర్శించారు.
నేతలకు ఘన స్వాగతం
జిల్లాలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం ఊపందుకుంది. ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. చంద్రబాబు పాలనలో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలు పరిష్కారం కావడం లేదని నేతలకు చెబుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలంలోని బీసీ రాచపల్లె, బీసీ కాలనీ, గద్దెలరేవుపల్లె గ్రామాల్లో రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు ఘన స్వాగతం లభించింది. వీరు ఇంటింటికి వెళ్లారు. నవరత్నాల గురించి వివరించారు. ప్రొద్దుటూరులోని 37వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నిచోట్లా ఆయనకు ఘనస్వాగతం లభించింది. జంగంపేట, హనుమాన్‌నగర్‌లలో ఎమ్మెల్యే పర్యటించారు. రాజంపేట నియోజకవర్గంలోని సిద్దవటం మండలం ఎగువపేట గ్రామంలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఇంటింటికి వెళ్లారు. ఆయనకు మహిళలు హారతులు పట్టారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఇంటింటికి తిరుగుతూ నవరత్నాలను వివరించారు. ఆయనకు టపాసులు కాలుస్తూ పూల వర్షం మధ్య సుదీర్‌రెడ్డి ముందుకు సాగారు.