వైఎస్సార్‌సీపీపై టీడీపీ రాళ్ల దాడి | TDP Stones Attack On YSRCP activists | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీపై టీడీపీ రాళ్ల దాడి

Published Mon, Feb 25 2019 7:10 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..గ్రామంలోని మండపాల సెంటర్‌ నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. దీంతో వారంతా పరుగులు తీశారు. ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. దాడితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జాన్‌బాషా, సుభాని, హుస్సేన్‌లకు గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement