
పమిడిమర్రులో మహిళలకు నవరత్నాల కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి
పట్నంబజారు(గుంటూరు): గడపగడపలోనూ సమస్యలు.. ప్రతి గుండెలోనూ ఆవేదన... నాలుగున్నరేళ్ల పాలనలో కనీసం పట్టించుకున్న నాథుడే లేడు.. సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయి.. పింఛను కోసం, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న జన్మభూమి కమిటీల నిర్ణయమే జరుగుతోంది.. కేవలం పచ్చచొక్కా వేసుకున్న వారికి మాత్రమే అభివృద్ధి పథకాలు అందుతున్నాయంటూ ఆయా నియోజకవర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమం కొనసాగుతోంది. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట మండలంలోని పమిడిమర్రు గ్రామంలో జరిగింది.
ప్రతి ఇంటికి వెళుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ మంచి రోజులు వస్తాయనే భరోసా ఇస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ముందుకు సాగారు. నవరత్నాల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కాగానే, చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలం పాతబొమ్మువానిపాలెం నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని, పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం గాదెవారిపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఆలకిస్తూ ధైర్యం చెబుతూ మంచి జరుగుతుందనే భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment