Ravali Jagan Kavali Jagan Video Song | YS Jagan Latest Songs | ‘రావాలి జగన్... కావాలి జగన్’ ఆడియో సాంగ్‌ రిలీజ్‌ - Sakshi
Sakshi News home page

‘రావాలి జగన్... కావాలి జగన్’ ఆడియో సాంగ్‌ రిలీజ్‌

Published Mon, Feb 25 2019 1:52 PM | Last Updated on Mon, Feb 25 2019 2:45 PM

Vijaya Sai Reddy Releases Ravali Jagan Kavali Jagan Audio Song - Sakshi

సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్... కావాలి జగన్’ ఆడియో సాంగ్‌ను ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి విడుదల చేశారు. సోమవారం పార్టీ కేంద్రకార్యలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బొత్ససత్యనారయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, సూర్య నారాయణ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సామన్య ప్రజలకు, రేపటి తరానికి ఈ పాట మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. గతంలో నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబు మోసపూరిత పాలన గురించి ప్రచారం చేశామని, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ఎందుకు రావాలో ఈ పాటలో వివరించామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ఏఏ కార్యక్రమాలు చేపడతామో.. ఈ పాట ద్వారా వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నవరత్నాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ పాటలో ఉన్నాయని, శవరాజకీయాలు చేసే పార్టీ తమది కాదన్నారు. హరికృష్ణ పార్థివ దేహం పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు తమ పార్టీ అధినేతపై చేస్తున్న ఆరోపణలన్ని నిరాధారమైనవన్నారు. ( ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ పాట డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

జగన్‌ ప్రచార పాట కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుందని ఈ సందర్భంగా ఆనం అభిప్రాయపడ్డారు. నవరత్నాల ఫలితాలు, అధికారపార్టీ వైఫల్యాలు.. ప్రజలకు చేరువచేయాలనే ఈ పాటను విడుదల చేశామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేయబోతుందో.. ఇలాగే పాటల రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తామని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇబ్బందులకు గురయ్యాయన్నారు. చంద్రబాబు సామాజిక వర్గం తప్ప రాష్ట్రంలో ఏ వర్గం బాగుపడలేదన్నారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు టీడీపీ అవినీతిలో కూరుకపోయిందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ విధి విధానాలతో ముందుకు పోతుందని బొత్స స్పష్టం చేశారు.  (చదవండి: ‘వక్రీకరించినా.. నరకాసురుడు ఎప్పటికి విలనే’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement