నవరత్నాలతో సంక్షేమ రాజ్యం | Ravali Jagan Kavali Jagan In Chittoor | Sakshi
Sakshi News home page

నవరత్నాలతో సంక్షేమ రాజ్యం

Sep 22 2018 10:07 AM | Updated on Sep 22 2018 10:07 AM

Ravali Jagan Kavali Jagan In Chittoor - Sakshi

చిత్తూరు మురకంబట్టులో నవరత్నాల గురించి వివరిస్తున్న జంగాలపల్లి శ్రీనివాసులు

చిత్తూరు, సాక్షి: నవరత్నాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతుందని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలి పారు. శుక్రవారం జిల్లాలో సత్యవేడు, పుంగనూ రు, చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, గంగాధరనెల్లూరు, కుప్పం, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్ర మం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నాయకులు ప్రతిరోజూ గ్రామాల్లోని ప్రజలతో మమేకం అవుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికా రంలోకి వస్తే ప్రవేశపెట్టనున్న పథకాల గురించి వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటుకు రూ.5 వేలు ఇచ్చే అవకాశముందని, దీనికి ఆశపడితే లక్షల రూపాయల పథకాలు చేజారే అవకాశం ఉందని ప్రజలకు తెలియజెబుతున్నారు.

పుంగనూరు మండలం ఏడూరులో రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హాజరయ్యారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగ రాజపురం మండలం పిళ్లారికుప్పంలో ఎమ్మెల్యే నారాయణస్వామి పాల్గొన్నారు.
మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి నిమ్మనపల్లిలో ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో నవరత్నాల గురిం చి సమన్వయకర్త చంద్రమౌళి తెలిపారు.
శ్రీకాళహస్తి రూరల్‌ బొక్కసంపాళెం, కొత్తపల్లి మిట్ట గ్రామాల్లో సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
చిత్తూరు మురకంబట్టులో శుక్రవారం రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. సమన్వయకర్త జంగాలపల్లి ఇంటింటికీ తిరుగుతూ నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు.
పెద్దపంజాణి మండలం అమ్మరాజుపల్లి, చామనేరు పంచాయతీల్లో ‘రావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. సమన్వయకర్త వెంకటేగౌడ ఆధ్వర్యం వహించారు.
బుచ్చినాయుడుకండ్రిగ మండలం పెద్దపాలేడు, అనంతాపురం గ్రామాల్లో ‘కావాలి జగన్‌’ కార్యక్రమం జరిగింది. సమన్వయకర్త ఆదిమూలం పాల్గొన్నారు.
తిరుపతి కొర్లగుంటలో జరిగిన రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమంలో యువనాయకుడు భూమన అభినయ్‌ పాల్గొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమ రాజ్యం అని చెప్పారు. నవరత్నాలపై ఇంటింటా ప్రచారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement