సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఈ గీతం.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతూ, సంచలనం రేపుతోంది. శనివారం సాయంత్రానికి యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్య కోటి దాటింది. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డు అంటున్నారు.