cities
-
నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
ముంబై, ఉప నగరాల్లో మొన్నటిదాకా 34 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏకంగా 37, 38 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత పదిహేను రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను భరించలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల దెబ్బకు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో చిన్న చిన్న క్లినిక్‌లు మొదలుకుని ప్రభుత్వ, ప్రైవేటు, బీఎంసీ తదితర ప్రధాన ఆసుపత్రులకు రోగులు బారులు తీరుతున్నారు. ఎండలు ముదరడంతో విధులకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం ఇల్లు కదిలే గృహిణులు, సామాన్యులు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతీరోజు రెండు నుంచి మూడు లీటర్లకుపైగా నీరు తాగాలని, అవసరమైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కళ్లు తిరగడం, వాంతులు, కాళ్లు, చేతుల నొప్పులు, దురద , మూత్రం సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపం క్లినిక్‌లు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని జె.జె.ఆసుపత్రి ప్రొఫెసర్ డా.మధుకర్ గైక్వాడ్ సూచించారు. లేదంటే వడదెబ్బతో తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. – డా.మధుకర్ గైక్వాడ్అద్దాల మేడలూ కారణమే ముంబైలో అనేక బహుళ అంతస్తుల భవనాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బేస్మెంట్పై అదనపు భారం పడకుండా , అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో 90 శాతం భవనాలకు నీలం రంగు అద్దాలు బిగిస్తున్నారు. నగరంలో వేడిమి పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. – ఆరోగ్య నిపుణులు చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅకాల వర్షాలకు అవకాశం వేసవి ఎండలతో సతమతమవుతున్న ముంబైకర్లపై మరో పిడుగు పడనుంది. త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.– ఐఎండీచదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్! -
పని లేదు.. తిండి లేదు.. ఊరెళ్ళిపోతోంది
-
ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!
దేశమంతటా పెద్దఎత్తున జరుపుకొనే పండగల్లో ఒకటైన ‘దసరా’ను పదిరోజుల పాటు వేడుకగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఆ అమ్మను సేవించడం, ఆమె కొలువు తీరి ఉన్న ప్రాంతాలను దర్శించుకుని భక్తితో తన్మయులం కావడం సహజం. అందుకే ఈ పండుగ రోజులలో దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తజన సంద్రాలుగా మారతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి నామాల మీదుగా ఏకంగా కొన్ని నగరాలు... ఆ మాటకొస్తే మహానగరాలే వెలశాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ అది ముమ్మాటికీ నిజం. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పేర్ల మీద వెలసిన కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం..కాళీ ఘాట్ పేరు... కోల్కతామామూలుగానే కోల్‌కతా పేరు చెప్పగానే కాళీమాత నిండైన విగ్రహమే మనో ఫలకంలో మెదులుతుంది. ఇక దసరా సందర్భంగా అయితే కోల్‌కతా మహా నగరంలో అమ్మవారి మండపాలే దర్శనమిస్తుంటాయి. ఇంతకూ కోల్‌కతాకు ఆ పేరు రావడానికి కారణమేమిటో తెలుసా? కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది. కాలిక్ క్షేత్ర అంటే.. కాళికా దేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. ఎర్రటి కళ్లతో, నల్లటి రూపంతో, నాలుక బయటపెట్టి ఎంతో గంభీరంగా కనిపించే ఈ దేవి తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను దయతో కా΄ాడుతుంది. అలాగే ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ కాళీమాత కొలువైన ‘కాళీఘాట్ కాళీ దేవాలయా’నికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం.ముంబయి – ముంబాదేవిముంబాయికి దక్షిణ ముంబయిలోని బులేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఆలయంలోని ముంబాదేవి పేరు మీదుగానే ఆ పేరు వచ్చిందని ప్రతీతి. వెండి కిరీటం, బంగారు కంఠసరి, ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది అమ్మవారు. పార్వతీమాత కాళికా దేవిగా అవతారమెత్తే క్రమంలో పరమ శివుని ఆదేశం మేరకు ఇప్పుడు ముంబయిగా పిలుస్తోన్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించిందట. మత్స్యాంబ అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు ‘ముంబా దేవి’గా మారినట్లు స్థల పురాణం చెబుతోంది.శ్యామలా దేవి పేరే సిమ్లాకుసిమ్లా.. సాక్షాత్తూ ఆ కాళీ మాతే శ్యామలా దేవిగా వెలసిన నగరం కాబట్టే సిమ్లాకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గామాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది.చండీ మందిర్...చండీగఢ్చండీ అంటే పార్వతీ దేవి ఉగ్ర రూపమైన చండీ మాత అని, గఢ్ అంటే కొలువుండే చోటు అని అర్థం.. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు రావడానికి అక్కడ కొలువైన ‘చండీ మందిర్’ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. ఈ చండీ గుడి, మాతా మానసి దేవి ఆలయం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో గల శివాలిక్ కొండలు ఈ ఆలయానికి అదనపు సొబగులు.మంగళూరు... మంగళాదేవికర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన మంగళూరుకు ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఆ పేరొచ్చింది. పురాణాల ప్రకారం.. మంగళాదేవి ఆలయాన్ని పరశురాముడు నెలకొల్పినట్లు తెలుస్తుంది. నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు 9వ శతాబ్దంలో తులునాడును పరిపాలించిన అలుపారాజ వంశస్థుడు కుందవర్మన్ ఈ ఆలయాన్ని కేరళ శిల్పకళా రీతిలో కట్టించాడు. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది.పటన్ దేవి పేరుతో పట్నాపట్నాకు ఆ పేరు రావడానికి శక్తి స్వరూపిణి అయిన ‘పతన్ దేవి’ అమ్మవారు కొలువైన ఆలయమే కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం.. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానంద కారి పతనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు ‘పతనేశ్వరి’గా, ఇప్పుడు ‘పతన్ దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది.నైనాదేవి పేరుతో నైనితాల్ నగరందక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థలపురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవిని, మహిషపీత్ అని కూడా పిలుస్తారు. అలా మహిషుణ్ణి సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ‘జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు ‘‘నైనా దేవి’గా పూజలందుకుంటోందట. శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.మరికొన్ని ప్రదేశాలుత్రిపుర – త్రిపుర సుందరి మైసూరు – మహిషాసుర మర్దిని కన్యాకుమారి – కన్యాకుమారి దేవి తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర)హస్సాన్ – హసనాంబె (కర్ణాటక)అంబాలా – భవానీ అంబా దేవి (హరియాణా)– డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..) -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు ఉన్న నగరాలు (ఫొటోలు)
-
మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!
శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాంసంతో పోలిస్తే.. వెజిటేరియన్ ఫుడ్ త్వరగా జీర్ణం అవుతుంది. అదీగాక మాంసం వినియోగం పెరిగేకొద్దీ వనరుల వాడకం ఎక్కువవుతుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు వెజిటేరియన్లుగా మారిపోతున్నారు. పైగా ఈ శాకాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కూడా. మన దేశంలో దాదాపు 40 శాతం మందికి పైగా శాఖాహారులే. అయితే మన దేశంలో కొన్ని నగరాల్లో మాంసాహారం ఇష్టమైనా సరే తినడం సాధ్యం కాదు. పైగా ఈ నగరాలను భారత దేశ పూర్తి శాకాహార నగరాలుగా పిలుస్తారు. ఆ నగరాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!రిషికేశ్, ఉత్తరాఖండ్: రిషికేశ్ గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర నగరం. మనశ్శాంతి , మోక్షం కోసం చాలా మంది ప్రజలు ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన ఈ నగరానికి వస్తారు. నగరం చుట్టూ ముళ్ల చెట్లు , పచ్చని కొండలు ఉన్నాయి. దీన్ని దేవతల భూమిగా పిలుస్తారు. ఇక్కడ మాంసం పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఆధ్యాత్మిక శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ శాకాహారం మాత్రమే దొరుకుతుంది.వారణాసి, ఉత్తరప్రదేశ్: పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పురాతన నగరం వారణాసి. ఈ నగరాన్ని బనారస్ లేదా కాశీ అని కూడా అంటారు. ఇది శివుని నివాసం. ఎందుకంటే ఈ నగరాన్ని సాక్షాత్తు శివుడే నిర్మించాడని నమ్ముతారు. ఇక్కడ మీరు అన్ని రకాల రుచికరమైన,స్వచ్ఛమైన శాఖాహారం తినవచ్చు.హరిద్వార్, ఉత్తరాఖండ్: పవిత్ర గంగానది ఒడ్డున హరిద్వార్ ఒక ప్రకాశవంతమైన నగరం. ఈ నగరం భారతదేశంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా అలరారుతుంది. ఇక్కడ వేయించిన ఆహారం నుంచి సలాడ్లు , సూప్‌ల వరకు అన్ని రకాల శాకాహారాలను ఇక్కడ ప్రయత్నించవచ్చు.మదురై, తమిళనాడు: తమిళనాడు నడిబొడ్డున ఉన్న ఈ నగరాన్ని రాష్ట్రానికి గుండెకాయ అని కూడా అంటారు. ఈ నగరం పూర్తిగా శాఖాహారం. కానీ ఈ నగరం భారతదేశపు నిజమైన సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. అత్యంత రుచికరమైన, పోషక విలువలు కలిగిన శాకాహార వంటకాలు ఇక్కడ లభిస్తాయి.అయోధ్య, ఉత్తరప్రదేశ్ : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కూడా మాంసం దొరకడం లేదు. అయోధ్య పురి మొత్తం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ ఒక్క మాంసాహార రెస్టారెంట్ కూడా లేదు.పలిటానా, గుజరాత్: ఈ నగరం (గుజరాత్ భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా) కూడా పూర్తిగా శాకాహామే.. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తొలి శాకాహార నగరంగా పేరుగాంచింది. కనుక ఇది శాకాహారులకు స్వర్గధామం. ఎందుకంటే ఈ ప్రదేశంలో నివసించే చాలా మంది జైనులను కఠినమైన శాకాహారులుగా పిలుస్తారు. కాబట్టి ఈ నగరంలో శాకాహారం మాత్రమే వడ్డిస్తారు.బృందావన్, ఉత్తరప్రదేశ్: ఇది మథుర జిల్లాలోని ఒక చారిత్రక నగరం.ఇది మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశం. నగరం పవిత్రత కారణంగా, ఇక్కడ గుడ్లు , మాంసం అమ్మకాలు నిషేధం.తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి నగరం కొండపై ఉన్న తిరుమలలలో కూడా మాంసాహారం పూర్తిగా నిషేధం. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ మాంసాహారం పూర్తిగా నిషేధం.(చదవండి: 60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!) -
37 నగరాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
దేశంలోని ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. 37 నగరాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్‌లోని ఫలోడి వరుసగా రెండో రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 49.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతకు ముందురోజు ఇక్కడి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఢిల్లీలోని ఎనిమిది చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యాయి. ముంగేష్పూర్, నజఫ్‌గఢ్‌లలో వరుసగా 48.3 డిగ్రీల సెల్సియస్, 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నాల్లో 47 డిగ్రీల సెల్సియస్, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాజస్థాన్‌లోని బార్మర్‌లో 49 డిగ్రీల సెల్సియస్, బికనీర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్, జైసల్మేర్‌లో 48.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని అకోలా, యవత్మాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.2 డిగ్రీల సెల్సియస్, 46.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మే 29 వరకు వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. -
వేర్ హౌజ్‌లకు తగ్గిన డిమాండ్.. హైదరాబాద్‌లో సైతం..
న్యూఢిల్లీ: దక్షిణాదిలోని ప్రముఖ పట్టణాలు హైదరాబాద్, బెంగళూరు గోదాముల లీజింగ్ గతేడాది స్వల్పంగా తగ్గినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టిన్ తెలిపింది. వీటితోపాటు చెన్నై కలిపి చూస్తే 10.2 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) లీజింగ్ నమోదైనట్టు పేర్కొంది. 2022లో లీజింగ్ పరిమాణం 10.7 మిలియన్ ఎప్‌ఎఫ్‌టీగా ఉంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థలు, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు, ఈ–కామర్స్ సంస్థలు గతేడాది గోదాముల లీజింగ్ డిమాండ్‌లో కీలక వాటా ఆక్రమించాయి. 2022లో గోదాముల లీజింగ్‌లో ఈ మూడు దక్షిణాది పట్టణాల వాటా 34 శాతంగా ఉంటే, గతేడాది 27 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో గోదాములు, లాజిస్టిక్స్ వసతుల లీజింగ్ 21 శాతం పెరిగి 37.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 2022లో ఇది 31.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉండడం గమనించొచ్చు. పట్టణాల వారీగా.. ►హైదరాబాద్‌లో గతేడాది గోదాముల లీజింగ్ 3.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. 2022లో ఇది 3.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ►బెంగళూరులో లీజింగ్ పరిమాణం 2022లో ఉన్న 4.1 మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 2023లో 3.6 మిలియన్ ఎస్ఎఫ్టీకి తగ్గింది. ►చెన్నైలో మాత్రం 2022లో ఉన్న 2.9 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2023లో 3.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరిగింది. ►ముంబైలో 10.2 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది. 2022లో 6 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంది. ►ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 2022లో ఉన్న 7.3 మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 2023లో 8.8 మిలియన్లకు పెరిగింది. ► పుణెలో 5.2 మిలియన్ల నుంచి 7 మిలియన్ల చదరపు అడుగులకు గోదాముల లీజింగ్ వృద్ధి చెందింది. పుణెలోని చక్దాన్ ఎండీసీ వాణిజ్య కేంద్రం ఈ వృద్ధికి దోహదపడినట్టు వెస్టిన్ నివేదిక తెలిపింది. ఇది తయారీ, లాజిస్టిక్స్ పార్కులకు ప్రముఖ కేంద్రంగా ఉంది. ► కోల్‌కతాలో గోదాముల లీజింగ్ 2022లో 2.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే, 2023లో 1.6 మిలియన్ ఎస్ఎఫ్టీకి తగ్గింది. ఈ ఏడాది సవాలే.. ‘‘2024–25 కేంద్ర బడ్జెట్ వచ్చే కొన్నేళ్ల కాలానికి దిక్సూచీ కానుంది. మౌలిక వసతుల అభివృద్ధికి ఇటీవలి మధ్యంతర బడ్జెట్లో సంబంధించి చేసిన ప్రకటనలు ఈ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 2023లో పెట్టుబడులు తగ్గుముఖం పట్టినందున 2024 భారత గోదాముల రంగానికి సవాలుగా నిలవనుంది’’అని వెస్టిన్ సీఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు - వాటివైపే కొనుగోలుదారుల చూపు!
రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్లాట్ల్స్ లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే గత కొంత కాలంగా పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారతదేశంలో ఏడు ప్రధాన నగరాల్లో సగటు అపార్ట్మెంట్ సైజులు గత ఏడాది 11 శాతం పెరిగాయి. పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2022లో 1175 చదరపు అడుగులు ఉన్న అపార్ట్మెంట్ల పరిమాణం 2023 నాటికి 1300 చదరపు అడుగులకు చేరిందని అనరాక్ రీసెర్చ్ ఒక నివేదికలో వెల్లడించింది. 2020, 2021 కంటే కూడా 2023లో ఢిల్లీ NCR, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఫ్లాట్స్ పరిమాణం పెరిగినట్లు తెలిసింది. 👉ఢిల్లీ NCRలో ఫ్లాట్ పరిమాణం అత్యధిక వృద్ధిని సాధించింది. అంటే 2022లో 1375 చదరపు అడుగులు ఉన్న ప్లాట్ 2023 నాటికి 1890 చదరపు అడుగులకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నగరంలో పరిమాణం 37 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలుదారుల డిమాండ్ విలాసవంతమైన అపార్ట్మెంట్ల వైపు తిరగడం వల్ల డెవలపర్లు పెద్ద అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. 👉హైదరాబాద్‌లో 2022లో 1775 చదరపు అడుగులున్న ప్లాట్ 2023 నాటికి 2300 చదరపు అడుగులకు చేరింది. అంటే హైదరాబాద్‌లో ప్లేట్ సైజు 30 శాతం పెరిగింది. 👉బెంగళూరులో, సగటు ఫ్లాట్ పరిమాణం 2023వ సంవత్సరంలో 26% పెరిగింది. 2022లో 1,175 చదరపు అడుగుల నుంచి 2023లో 1,484 చదరపు అడుగులకు పెరిగింది. 👉పూణేలో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 980 చదరపు అడుగుల నుంచి 2023లో 11% పెరిగి 1,086 చదరపు అడుగులకు చేరుకున్నాయి. 👉చెన్నైలో ప్లాట్ పరిమాణం 2022 కంటే 5 శాతం పెరిగింది. 2022లో 1200 చదరపు అడుగులున్ ఫ్లాట్ సైజు 2023 నాటికి 1260 చదరపు అడుగులకు చేరింది. ఇదీ చదవండి: ముందుగానే హింట్ ఇచ్చిన నిర్మలమ్మ - నాలుగు అంశాలు కీలకం -
అమెజాన్ అడువుల్లో అలనాటి పురాతన నగరాలు!
అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాల పరిధిలో విస్తరించిన మహారణ్యం ఇది. కొద్ది సహస్రాబ్దాల కిందట ఇక్కడ పురాతన నాగరికతలు వర్ధిల్లేవి. ఆనాటి ప్రజలు ఇక్కడ తమ ఆవాసం కోసం కొన్ని నగరాలను నిర్మించుకున్నారు. దట్టమైన అడవిలో ఇన్నాళ్లూ మరుగునపడిన ఆ నగరాలు ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తల చొరవతో వెలుగు చూస్తున్నాయి. ఈ ఫొటోలు ఇటీవల అమెజాన్ అడవిలో బయటపడిన ఒక పురాతన నగరానికి చెందినవి. ఈక్వడార్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు డ్రోన్ ద్వారా తీసిన ఫొటోల్లో ఈ పురాతన నగరం బయటపడింది. ఆండెస్ పర్వతాలకు దిగువన ఉపానో లోయలో బయటపడిన ఈ నగరంలోని శిథిల అవశేషాలపై శాస్త్రవేత్తలు లేజర్ సెన్సరీ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధనలు జరిపారు. ఈ నగరం పరిధిలో మట్టి, రాళ్లు ఉపయోగించి నిర్మించిన దాదాపు ఆరువేల కట్టడాలను, వ్యవసాయ క్షేత్రాలను, పంట కాలువలను, ఇళ్లు ఉండే వీథుల్లో ముగురునీటి కాలువలను, నగరంలో సంచరించడానికి వీలుగా ముప్పయి మూడు అడుగుల వెడల్పున నిర్మించుకున్న విశాలమైన రహదారులను గుర్తించారు. ఇక్కడి కట్టడాల్లో నివాస గృహాలు మాత్రమే కాకుండా, ఊరంతా ఉమ్మడిగా ఉపయోగించుకునే సమావేశ మందిరాలు, పిరమిడ్లతో కూడిన శ్మశాన వాటికలు వంటి నిర్మాణాలను గుర్తించారు. చాలా కట్టడాలు నేలకు మూడు మీటర్ల లోతున మట్టిలో కప్పెట్టుకుపోవడంతో శాస్త్రవేత్తలు తవ్వకాలను జరిపి, వాటిని పరిశీలించారు. దాదాపు రెండువేల ఏళ్ల కిందట ఈ నగరంలో పదివేల మంది నుంచి ముప్పయి వేల మంది వరకు నివాసం ఉండేవారని, ఇక్కడి ప్రజలు ఏ పరిస్థితుల్లో అంతరించిపోయి ఉంటారో తెలుసుకోవడానికి మరింత లోతుగా పరిశోధనలు సాగించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
పెరిగిపోతున్న ప్రాధాన్యత.. దేశంలో 11 షాపింగ్ మాల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో కొత్తగా 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి మొత్తం విస్తీర్ణం 59.48 లక్షల చదరపు అడుగులు అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. భారతీయ మార్కెట్లోకి ప్రవేశం, విస్తరించడం కోసం రిటైలర్ల నుండి బలమైన ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తోందని వివరించింది. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ విధానాలను మార్చడం, సహాయక వ్యాపార వాతావరణం ఈ వృద్ధికి ఆజ్యం పోసిందని తెలిపింది. ‘ఏడు ప్రధాన నగరాల్లో ఈ మాల్స్ ఏర్పాటయ్యాయి. 2022తో పోలిస్తే గతేడాది కొత్తగా తోడైన రిటైల్ స్పేస్‌లో 72 శాతం వృద్ధి నమోదైంది. 2022లో హైదరాబాద్, పుణే, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కత నగరాల్లో నూతనంగా 34.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనమిది మాల్స్ ప్రారంభం అయ్యాయి’ అని నివేదిక తెలిపింది. హైదరాబాద్‌లోనే అధికం.. ‘గతేడాది అందుబాటులోకి వచ్చిన మాల్స్‌లో హైదరాబాద్ ఏకంగా మూడు మాల్స్‌ను సొంతం చేసుకుంది. పుణే, చెన్నై రెండు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్ ఒక్కొక్కటి చేజిక్కించుకున్నాయి. కోవిడ్ తదనంతరం ఈ నగరాల్లో ఇంత మొత్తంలో రిటైల్ స్పేస్ తోడవడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో ఈ జోరు కొనసాగుతుంది. 2019లో కొత్తగా సుమారు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్–ఏ, బీ–ప్లస్ మాల్స్ తెరుచుకున్నాయి. 2020–22 మధ్య ఏటా సగటున 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ స్పేస్ తోడైంది. కోవిడ్ తదనంతరం చాలా గ్రేడ్–ఏ మాల్స్ ఖాళీ లేక రిటైలర్లు నాణ్యమైన రిటైల్ స్థలం కొరతను ఎదుర్కొన్నారు’ అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వివరించింది. -
ఈ ఏడాది అక్కడికి వెళ్లేందుకు తెగ ఎగబడ్డారు,అంత స్పెషల్ ఏముందంటే..
2023 మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుంది. మరి ఈ ఏడాదిలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన టూరిస్ట్ ప్లేస్ ఏంటి? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిస్ట్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 2023లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన టూరిస్ట్ ప్రాంతమేంటి?అన్నదానిపై స్పెషల్ స్టోరీ. ప్రతి ఏడాది ప్రజలు ఎక్కువగా సందర్శించే టూరిస్ట్ ప్రాంతాలను ట్రావెల్ ఏజెన్సీలు రిలీజ్ చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కూడా లిస్ట్‌ను విడుదల చేశాయి. గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం 2023లో ఎక్కువ మంది ప్రజలు హాంకాంగ్ వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. అలా టాప్ టూరిస్ట్ ప్లేస్‌లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది బ్యాంకాక్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, 2023లో మాత్రం హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హాంకాంగ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సుమారు 29.2మిలియన్ల మంది అంటే 2 కోట్ల 92లక్షల మంది హాంకాంగ్‌ను సందర్శించారు. ఆగ్గేయ చైనాను ఆనుకొని ఉన్న ఈ నగరంలో ప్రతి ఏడాది సుమారు 5మిలియన్లకు తగ్గకుండా ప్రజలు విజిట్ చేస్తుంటారట. అంతలా ఎక్కడ ఏముందబ్బా అని పరిశీలిస్తే.. హాంకాంగ్‌లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిస్నీల్యాండ్, విక్టోరియాస్ పీక్, మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియం, ఓషియన్ పార్క్,రిపల్స్ బే,లాంటూ ఐస్‌ల్యాండ్, స్టార్ ఫెర్రీ సహా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2025 నాటికి సుమారు 44 మిలియన్లకు పైగా ప్రజలు హాంకాంగ్‌ను సందర్శిస్తారని సమాచారం. బ్యాంకాక్ హాంకాంగ్ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన ప్రదేశం బ్యాంకాక్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో బ్యాంకాక్ నగరం రెండోదిగా నిలిచింది. 2023 నాటికి 24 మిలియన్ల మంది అంటే సుమారు 2 కోట్ల 44 లక్షల మంది ప్రజలు బ్యాంకాక్‌ను సందర్శించారు. ఇక్కడి ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, వెరైటీ వంటలతో బ్యాంకాక్ పర్యాటకులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. లండన్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ జాబితాలో లండన్ మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది 19.2 మిలియన్లు(కోటి 2 లక్షల మంది) ప్రజలు లండన్‌ను సందర్శించారు. టూరిస్టులే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా 2023లో ఎక్కువగా లండన్‌ను విజిట్ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఎక్కువగా సింగపూర్,చైనా,దుబాయ్, ప్యారిస్, న్యూయార్క్ ప్రాంతాలను పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు. -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు!
చెట్లు అందించే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే పట్టణాల్లోని చెట్లు ఆ ప్రాంతానికి మరింత ప్రయోజనాన్ని కల్పిస్తాయి. అవేమిటో 12 పాయింట్లలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉష్ణోగ్రత నియంత్రణ ఒక పెద్ద వృక్షం 10 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు సమానం. అది అందిచే నీడ ఆ ప్రాంత ఉష్ణోగ్రతను 30 శాతానికి మించి తగ్గిస్తుంది. 2. శబ్ద కాలుష్యానికి చెక్ చెట్లు 50 శాతం మేరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వాహనాలు, నిర్మాణ పనులు, సైరన్లు ఇతరత్రా శబ్దాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో చెట్లు ఆ శబ్దాన్ని నిరోధించడానికి ఉపకరిస్తాయి. ఇళ్లు, కార్యాలయాలను నిశ్శబ్దంగా ఉంచడానికి వృక్షాలు దోహదపడగాయి. 3. స్వచ్ఛమైన గాలి చెట్ల నుంచి విడుదలయ్యే గాలి.. హానికరమైన కాలుష్య కారకాలను, టాక్సిన్లను భారీ మొత్తంలో తొలగిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చెట్లు మనకు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. 4. ఆక్సిజన్ అందిస్తూ.. కాలుష్యాలను తరిమికొట్టే చెట్లు మరింత ఆక్సిజన్‌ను కూడా అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉంటాయి. చెట్లు ఈ సమస్యను పరిష్కరించడానికి దోహదపడతాయి. 5. నీటి నిర్వహణ చెట్లు మనకు భవనాలకు మించిన ఆశ్రయం కల్పిస్తాయి. వర్షాలు కురిసే సమయంలో చెట్లు భారీ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి. వరదల తీవ్రతను నియంత్రిస్తాయి. వరదలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. చెట్లు కాలుష్య కారకాలను గ్రహిస్తాయని, నీటి వనరులను కాపాడుతాయనే విషయాన్ని మనం మరచిపోకూడదు. 6. మానసిక ఆరోగ్యం పరిశుభ్రమైన పట్టణ పరిసరాల కంటే ప్రకృతి మధ్యలో మెలిగే మనుషులు సంతోషంగా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. మన భావోద్వేగాలు, ప్రవర్తన, ఆలోచనలు మనం ఉంటున్న ప్రదేశాలపై ఆధారపడివుంటాయి. చెట్లు మన మనస్తత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి శాంతియుతంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం. 7. శారీరక ఆరోగ్యం చెట్లు గాలి నాణ్యతను మెరుగు పరుస్తాయి. పట్టణంలోని చెట్లతో కూడిన వాతావరణం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చెట్లు విరివిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్, నడక మొదలైనవి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. 8. గోప్యత చెట్లు గోప్యతను అందిస్తాయి. ఇంటివాతావరణాన్ని కల్పిస్తాయి. 9. ఆర్థికపరంగా.. పట్టణంలోని చెట్లు అందించే ఆర్థిక ప్రయోజనాలను లెక్కించడం కష్టం. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మతులకు చెట్లు ఉపకరిస్తాయి. చెట్లను పెంచే ఖర్చు కంటే అవి అందించే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. చెట్లు నగరాలను సంపన్నం చేస్తాయి. 10. వన్యప్రాణులకు ఆవాసం పక్షులు,క్షీరదాలు, కీటకాలతో సహా వందలాది విభిన్న జాతులకు ఆవాసంగా చెట్లు ఉపకరిస్తాయి. 11. కాంతి కాలుష్యం చెట్లు కాంతి కాలుష్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, మనల్ని, మన నగరాలను చల్లగా ఉంచుతాయి. చెట్లు ఉన్న నగరాల్లో ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 12. ఆహ్లాదాన్ని అందిస్తూ.. చెట్లు అందంగా ఉంటాయి. గ్రేస్కేల్ రోడ్లు, భవనాలు, అంతులేని ట్రాఫిక్ మధ్య చెట్లు ఉపశమనాన్ని కల్పిస్తాయనడంలో సందేహం లేదు. 12 Reasons Why Cities Need More Trees: 1. Temperature Control One large tree is equivalent to 10 air conditioning units, and the shade they provide can reduce street temperature by more than 30%. 2. Noise Reduction Trees can reduce loudness by up to 50%. In urban areas… pic.twitter.com/KRfskttfxx — The Cultural Tutor (@culturaltutor) August 28, 2023 -
చిన్న నగరాల్లోకి టెక్ విస్తరణ - కొత్త హబ్‌లుగా 26 సిటీలు
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా హైదరాబాద్, బెంగళూరు వంటి ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన దేశీ టెక్నాలజీ రంగంలో క్రమంగా వికేంద్రీకరణ జరుగుతోంది. చిన్న నగరాలకూ పరిశ్రమ విస్తరిస్తోంది. చండీగఢ్, నాగ్‌పూర్, కాన్పూర్ వంటి 26 సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11–15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉండటం కూడా ఇందుకు కారణం. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్, ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కలిసి ’భారత్‌లో వర్ధమాన టెక్నాలజీ హబ్‌లు’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ పరిశ్రమలో 54 లక్షల మంది పైచిలుకు సిబ్బంది ఉండగా .. వీరిలో అత్యధిక శాతం ఉద్యోగులు ఏడు ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, పుణె) ఉంటున్నారు. ‘టెక్నాలజీకి సంబంధించి పెద్ద నగరాలు గతంలో ఫోకస్లో ఉన్నప్పటికీ .. కరోనా మహమ్మారి అనంతరం దేశవ్యాప్తంగా చెప్పుకోతగ్గ స్థాయిలో పని వికేంద్రీకరణ జరిగింది‘ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుమీత్ సల్వాన్ తెలిపారు. ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను తగ్గించుకునే మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మరింత కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెక్నాలజీ హబ్‌లను రూపొందించుకోవాల్సిన అవసరం పెరుగుతోందని నాస్కామ్ హెడ్ (జీసీసీ, బీపీఎం విభాగం) సుకన్య రాయ్ వివరించారు. వ్యయాల తగ్గుదల.. రాబోయే రోజుల్లో చండీగఢ్, కాన్పూర్, అహ్మదాబాద్, మంగళూరు, నాగ్‌పూర్ వంటి సిటీలు కొత్త తరం టెక్నాలజీ హబ్‌లుగా ఎదగగలవని నివేదిక తెలిపింది. కార్యకలాపాల నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం, నిపుణుల లభ్యత మెరుగ్గా ఉండటం, అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) తక్కువగా ఉండటంతో పాటు మౌలిక సదుపాయాలు, విధానాలపరంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తదితర అంశాలు ఇందుకు సానుకూలంగా ఉండనున్నాయి. ఈ తరహా పలు వర్ధమాన హబ్‌లలో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, డబ్ల్యూఎన్ఎస్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నివేదిక ప్రకారం 2022 చివరి నాటికి వర్ధమాన నగరాల్లో 7,000 పైచిలుకు అంకుర సంస్థలు డీప్‌టెక్ మొదలుకుని బీపీఎం వరకు వివిధ టెక్ సేవలు అందిస్తున్నాయి. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఈ వర్ధమాన కంపెనీలు గణనీయంగా ఎదిగాయి. 2025 నాటికి ఇవి 2.2 రెట్లు వృద్ధి చెందనున్నాయి. ఇన్వెస్టర్లు కూ డా ప్రస్తుతం పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లోని అంకుర సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది అంకుర సంస్థల్లోకి వచ్చిన నిధుల్లో 13 శాతం వాటా ద్వితీయ శ్రేణి నగరాల్లోని స్టార్టప్‌లకు దక్కడం ఇందుకు నిదర్శనం. -
వర్షం ఇంక లేదు.. వరదైంది..!
చైనా వరద బీభత్సంతో అల్లాడిపోతోంది. నగరాలు నదుల్లా మారిపోయాయి. వరద ముంపుని ఎదుర్కోవడానికి చైనా కొన్నేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన స్పాంజ్ సిటీస్ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వరదల్ని ఎదుర్కోవడానికి ఇప్పటివరకు 30 నగరాలను స్పాంజ్ నగరాలుగా మార్చింది. మరి ఈ స్పాంజ్ సిటీస్ సమర్థంగా పని చేయడం లేదా ? ఈ ఏడాది చైనాలో ఎందుకీ వరద బీభత్సం? వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, వరదలు లేదంటే రికార్డు స్థాయి ఎండలు, ఉక్కబోత.. ఇప్పుడివే కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో రికార్డు స్థాయి వర్షాలతో చైనా తడిసి ముద్దవుతోంది. కేవలం జులై నెలలో కురిసిన వర్షాలకే 150 మంది మరణిస్తే, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 250 కోట్ల డాలర్ల వరకు ఆస్తి నష్టం సంభవించింది. ఈ వరదల్ని ఎదుర్కోవడం కోసమే చైనా కొన్నేళ్ల క్రితం స్పాంజ్ సిటీల నిర్మాణానికి నడుం బిగించింది. ఏమిటీ స్పాంజ్ సిటీస్ వాతావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అంచనా వేసిన చైనా 2015లో స్పాంజ్ సిటీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చైనాలో 654 నగరాల్లో 641 నగరాలకి వరద ముప్పు పొంచి ఉంది. ప్రతీ ఏడాది 180 పట్టణాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. జనాభాతో కిటకిటలాడుతూ ప్రతీ నగరం ఒక కాంక్రీట్ జంగిల్‌గా మారిపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వర్షపు నీరు నగరాన్ని ముంచేయకుండా బొట్టు బొట్టు సద్వినియోగం చేసుకోవడమే ఈ స్పాంజ్ సిటీస్ లక్ష్యం. ఏ ప్రాంతంలో కురిసిన వాన నీరు అదే ప్రాంతంలో పూర్తిగా వాడుకునేలా సహజసిద్ధమైన ఏర్పాట్లు చేయడం స్పాంజ్ సిటీస్. ఒక్క మాటలో చెప్పాలంటే వర్షపు నీటిని ఒక స్పాంజ్‌లా పీల్చుకునేలా నగరాల రూపురేఖలు మార్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ఎంతవరకు అమలైంది? చైనా ఈ ప్రాజెక్టుని అత్యంత ఘనంగా ప్రకటించింది కానీ ఆచరణలో ఇంకా వేగం పుంజుకోలేదు. 2015లో పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టి 30 నగరాలను స్పాంజ్ సిటీలుగా మార్చింది. ఒక్కో నగరం మీద వెయ్యి కోట్ల యువాన్లకు పైనే ఖర్చు పెట్టింది. గత ఏడాది మొత్తం 654 నగరాలకు గాను 64 నగరాలకు స్పాంజ్ సిటీ మార్గదర్శకాలు పాటించాలని నిబంధనలు విధించారు. 1978 నుంచి గణాంకాలను పరిశీలిస్తే చైనా పట్టణ ప్రాంత జనాభా అయిదు రెట్లు పెరిగింది. చైనా జనాభాలో 90 కోట్ల మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. ఉత్తర చైనా మినహాయించి మిగిలిన పట్టణ ప్రాంత జనాభా అంతా వరద ముప్పులో ఉంది. అందుకే స్పాంజ్ సిటీస్ నిర్మాణం వేగవంతం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్పాంజ్ సిటీస్ పై ఒక చట్టాన్ని తీసుకువస్తేనే త్వరితగతిన వీటి నిర్మాణం పూర్తి అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పాంజ్ సిటీల నిర్మాణం ఇలా! ► నగరంలో రెయిన్ గార్డ్స్ నిర్మాణం ► వర్షం నీరు రహదారులపై నిలవకుండా నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా రహదారుల నిర్మాణం ► రోడ్డుకిరువైపు పేవ్మెంట్ల మీద, ప్రతీ భవనంలోనూ వాన నీరు భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతల ఏర్పాటు ► నీరు నిల్వ చేయడానికి కొత్తగా కాలువలు, చెరువుల తవ్వకం ► వాన నీరు రిజర్వాయర్లలోకి వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం ► చిత్తడి నేలల పునరుద్ధరణ ► ప్రతీ భవనంపైనా రూఫ్ గార్డెన్స్ ఏర్పాటు ► వర్షం నీరుని శుద్ధి చేస్తూ తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడేలా ఎక్కడికక్కడ ప్లాంట్ల నిర్మాణం స్పాంజ్ సిటీలకూ పరిమితులున్నాయ్..! చైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పాంజ్ సిటీలను నిర్మించినప్పటికీ ఈ ఏడాది వరద బీభత్సాన్ని ఎదుర్కోవడం సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్జూ నగరాన్ని పూర్తి స్థాయిలో స్పాంజ్ సిటీగా మార్చేసింది. 2016 నుంచి 2021 మధ్య కేవలం ఈ ఒక్క నగరంపైనే 6 వేల కోట్ల యువాన్లు ఖర్చు పెట్టింది. అయినప్పటికీ వరదల్ని ఎదుర్కోలేక జెంగ్జూ నగరం నీట మునిగింది. దీనికీ కారణాలన్నాయి. చైనా తలపెట్టిన స్పాంజ్ సిటీలు రోజుకి 20 సెంటీ మీటర్ల వర్షం కురిస్తే తట్టుకోగలవు. అలాంటిది గత జులైలో జెంగ్జూలో ఒక గంటలో 20 సెంటీ మీటర్ల వాన కురిసింది. ఇక బీజింగ్ పరిసరాల్లో మూడు రోజుల్లో 75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతే కాకుండా ఉత్తర చైనాలో సాధారణంగా వర్షలు అంతగా కురవవు. అందుకే ఆ ప్రాంతంలో ఇంకా స్పాంజ్ సిటీల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించలేదు.. ఈ ఏడాది వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్తర చైనాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. అక్కడ స్పాంజ్ సిటీల నిర్మాణం జరగకపోవడంతో వరదలు పోటెత్తాయి. చైనా ఎన్ని చర్యలు చేపట్టి కోట్లాది యువాన్లు ఖర్చు చేసినా ప్రకృతి ముందు తలవంచక తప్పలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీసీటీవీ కెమెరాలతో మెరుగైన భద్రత
సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది. అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌కు 'అరుదైన గౌరవం'
భారతదేశ ఆధ్యాత్మికతకు అరుదైన గౌరవంగా భావించదగిన చారిత్రాత్మక గౌరవం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ రవిశంకర్‌కి లభించింది. హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు 'రవిశంకర్ దినోత్సవాన్ని' ప్రకటించడంతో అమెరికా కెనడా దేశాలలో రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన నగరాల సంఖ్య 30కి చేరింది. ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఏకైక ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ కావడం విశేషం. రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు ఒకప్పుడూ యుద్ధ విధ్వంస ప్రాంతాలుగా ఉండేవి. ఆ ప్రాంతాలల్లో గురుదేవ్ చేసిన శాంతి కృషిని ప్రశంసించిన టెక్సాస్ గవర్నర్ ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా అమెరికా, కెనడాలలోని 30నగరాలలో ఈ గౌరవం పొందిన మొట్టమొదటి, ఏకైక భారతీయ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ రవిశంకర్. జూలై 30, 2023, బెంగళూరు: భారతీయ ఆధ్యాత్మిక చరిత్రకు గర్వకారణమైన పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది, రవిశంకర్‌కు గౌరవసూచకంగా దినోత్సవాలు జరుపుకుంటున్న అమెరికా, కెనడా నగరాలు, రాష్ట్రాల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే 27 నగరాలలో ఈ దినోత్సవాలు ప్రకటించగా తాజాగా హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్; టెక్సాస్ రాష్ట్రాలు ఈ ఉత్సవాలకు తేదీలను ప్రకటించాయి. ఈ గౌరవం లభించిన మొదటి, ఏకైక ఆధ్యాత్మిక నాయకుడు రవిశంకర్ కావడం గమనార్హం. సేవాదృక్పథంతో, శాంతి, ఆనందాలను వ్యాపింపజేస్తూ వివాదాల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, భిన్న దృక్పథాల మధ్య తీవ్రమైన అంతరాలు ఏర్పడుతున్న నేటి సమాజాన్ని ఏకీకృతం చేసే దిశగా గురుదేవ్ మార్గదర్శకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకుగాను ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, "తాము నమ్మిన మార్గంపై గల అకుంఠిత విశ్వాసంతో గురుదేవ్ రవిశంకర్, వారి అనుచరగణం ప్రపంచంలోని అనేక యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో ధైర్యంగా పర్యటించి..కరుడుగట్టిన ఖైదీలతో సైతం చర్చించి, వారికి మార్గనిర్దేశం చేయగలిగారు. ఏ మాత్రమూ సరిదిద్దలేమని అనుకునే విభేదాలను సైతం పరిష్కరించగలిగారు.” అని ప్రశంసించారు. మేరీల్యాండ్‌లోని హోవార్డ్ కౌంటీ చేసిన కార్యనిర్వాహక ప్రకటనలో, "ప్రపంచ మానవతావాది, ఆధ్యాత్మిక నాయకుడు, శాంతి దూత, ప్రపంచంలో పరివర్తన తేగలిగే వ్యక్తులలో ఒకరుగా గుర్తింపు పొందిన శ్రీశ్రీ... అభిప్రాయ భేదాలతో విభిన్న ధృవాలుగా చీలిపోయి, దూరాలు పెరిగిపోయిన నేటి ప్రపంచ స్థితిలో గురుదేవ్ శ్రీశ్రీ మన సమాజాన్ని, ప్రపంచాన్ని శాంతి, ఐక్యత, ఆశావహ దృక్పథాల ద్వారా వ్యక్తిగత, సామాజిక స్థాయిలలో స్వీయ పునరుద్ధరణ ద్వారా సమైక్యం చేసేందుకు కృషి చేస్తున్నారు..." అని పేర్కొన్నారు. హోవార్డ్ కౌంటీ జూలై 22వ తేదీని శ్రీశ్రీ రవిశంకర్ డే గా ప్రకటించింది. ఆధ్యాత్మికత మరియు సేవా మార్గాల ద్వారా ప్రజల జీవితాలను మార్చడానికి ఈ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న అపారమైన సహకారాన్ని గుర్తిస్తూ టెక్సాస్, బర్మింగ్‌హామ్ వరుసగా జూలై 29, జూలై 25వ తేదీలను శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించాయి. అమెరికాలో శ్రీశ్రీ పర్యటన సందర్భంగా ఆయా నగరాలలో గురుదేవ్ కు ఘనస్వాగతం లభించింది. జాతి, కుల, స్థాయీ, లింగభేదాలకు అతీతంగా ఆయా ప్రాంతాలలో హాజరైన వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి శ్రీశ్రీ ప్రసంగించి, తమ మనసులోతులలోనికి తీసు కొనిపోయే శక్తివంతమైన ధ్యానక్రియలను వారిచే చేయించారు. ఈ సందర్భంగా గురుదేవ్ ప్రవచనాలతో కూడిన ‘నోట్స్ ఫర్ ది జర్నీ విదిన్’ (అంతరంగ ప్రయాణానికి సూచనలు) అనే పుస్తకాన్ని ఆయా నగరాలలో విడుదలచేశారు. నిజాయితీగా అన్వేషించే సాధకులకు తమ దైనందిన జీవన సమస్యల నుండి, ఆధ్యాత్మికత వరకూ ఎదురయ్యే సార్వజనీనమైన ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానాలు ఇస్తుంది. శాంతి మరియు సంఘర్షణల పరిష్కారానికి ఒక మానవతావాదిగా శ్రీశ్రీ చేసిన ప్రయత్నాలకుగాను అమెరికాలోని కౌంటీ ఆఫ్ అల్లెఘేనీ గత నెలలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌ను గౌరవించిన విషయం విదితమే. ఆ సందర్భంగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో ‘... స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యక్రమాలద్వారా వివిధ వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, నగరాలలో పెరుగుతున్న హింస, నేరాలను అరికట్టడానికి గురుదేవ్ చేస్తున్న ప్రయత్నాలు, వారు విభిన్న సంస్కృతులు, జాతుల మధ్య సంఘర్షణలను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మాత్రమే పోల్చదగ్గవి.’ అని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్ లోని ప్రఖ్యాత నేషనల్ మాల్ లో ఘనంగా జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల కోసం శ్రీశ్రీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద సమావేశాలలో ఒకటిగా పేర్కొనదగ్గ జనసమూహానికి శ్రీశ్రీ స్వయంగా మార్గదర్శనం చేస్తారు. ఉత్సవాలలోభాగంగా ప్రపంచవ్యాప్త కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. (చదవండి: కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు) -
అమెరికాలో ఆ 11 నగరాల్లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం
అమెరికాలోని 11 నగరాల్లో భాగంగా నాలుగు నగరాల్లో అత్యంత వైభవోపేతంగా జరిగిన శ్రీనివాస కల్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూఎస్ఏ లోని జూన్ 17వ తేదీన ర్యాలీ(నార్త్ కరోలినా), 18న జాక్సన్ విల్(ఫ్లోరిడా) 24న డెట్రాయిట్, 25న చికాగో నగరాల్లో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారు ఎన్ఆర్ఐ భక్తులకు దర్శనమిచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆయా నగరాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించాలని పలు తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుంచి ఏపీఎన్ఆర్టీ సొసైటీకి వచ్చిన అభ్యర్థనల మేరకు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు, ఈవో గారి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదం తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటి నుంచి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అక్కడి నిర్వాహకులు... భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నాలుగు నగరాల్లో స్వామివారి కల్యాణానికి వేదికను అలంకరించిన తీరు ఒక్కో నగరంలో ఒక్కోలాగా అందంగా అలంకరించారు. ఈ కల్యాణోత్సవాలకు తెలుగు వారే కాక, తమిళనాడు, కేరళ, కర్నాటక ఇలా ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 12 వేలకు పైగా స్వామివారి ఎన్ఆర్ఐ భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆయా ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఆయా నగరాల్లోని నిర్వాహకులు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని, ఏర్పాట్లన్నీ ఘనంగా చేసారు. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొన్న అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది. ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొన్న ప్రవాసాంధ్రుల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు అయిన శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో నార్త్ అమెరికాలోని 14 నగరాల్లో చేపట్టిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాల్లో, ఇప్పటికే తితిదే చైర్మన్ శ్రీ. వై.వి. సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణలో కెనడా లోని 03 నగరాల్లో పూర్తయ్యాయి. ఇప్పుడు యూఎస్ఏలోని 04 నగరాల్లో నిర్వహించడం జరిగింది. తితిదే అర్చకులు, వేదపండితుల ద్వారా కల్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధాన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాలు నిర్వహించారన్నారు. ఇంకా USA లోని జూలై 1వ తేదీ నుండి జూలై 23 వ తేదీ వరకు ౦7 నగరాల్లో జరిగే శ్రీవారి కల్యాణంలో టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు పాల్గొననున్నారని శ్రీ వెంకట్ పేర్కొన్నారు. యూఎస్ఏలో ర్యాలీలో జరిగిన కల్యాణోత్సవంలో ఈశ్వర్ రెడ్డి, మహిపాల్ మాలే, జాక్సన్ విల్లో, మల్లికార్జున జెర్రిపోతుల, ప్రభుత్వ సలహాదారు డా ఎన్ వాసుదేవ రెడ్డి, డెట్రాయిట్లో మహేష్ చింతలపాటి, బాలాజీ సత్యవరపు, ఎస్ నరేన్, చికాగోలో శరత్ ఎట్టపు, నరసింహ రెడ్డి, పీఎన్ఆర్టీఎస్ ప్రతినిధులు తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో తితిదే నుంచి ఏఈఓ బి వెంకటేశ్వర్లు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆయా నగరాలలోని పలువురు ప్రముఖులు భారతీయులు పాల్గొన్నారు. ఎస్వీబీసీ ఛానెల్ కల్యాణోత్సవం మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. (చదవండి: పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వైఎస్సార్సీపీ.. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ దూకుడు!) -
అత్యంత స్కైస్క్రాపర్స్ ఉన్న 10 నగరాలు
-
ప్రపంచంలోని 10 అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశాలు
-
ప్రపంచంలో నీటి అడుగున ఉన్న టాప్ 10 నగరాలు
-
భారతదేశంలోని టాప్ 10 అత్యంత నేరాలు జరిగే నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత నేరాలు జరిగే నగరాలు
-
భారతదేశంలోని టాప్ 10 అత్యంత కాలుష్య నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 కాలుష్య నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 హాంటెడ్ నగరాలు
-
టాప్ 10 ప్రపంచంలోని అత్యంత ఆకర్షించే ఇంజనీరింగ్ సైట్లు
-
మహానగరపు మార్మిక గాథ
ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చిందో, దాని మూలాల వెనుక ఉన్న కథ ఏమిటో, ఈ మహానగరం ఎన్ని ‘నగరాల’తో కూడుకుని ఉన్నదో, ఇంకా ఇలాంటి ఎన్నో సంగతులు చాలా ఆసక్తికరం. ఈ ఢిల్లీ ప్రాంతాన్ని మన పూర్వీకులు దైవ నిలయంగా భావించారు. సరిగ్గా అక్కడే స్వర్గాధిపతి ఇంద్రుడి నివాసమైన ఇంద్రప్రస్థ ఆవిర్భవించింది. ఈ ఇంద్రప్రస్థ అనంతరం, అది న్యూఢిల్లీ అయ్యేంతవరకూ ఇక్కడ అనేక నగరాలు వెలిశాయి. ఎన్ని నగరాలు అనే సంఖ్య అనిశ్చితం. కొంతమంది ఏడు నగరాలు అని చెబుతూ ఢిల్లీని ఎనిమిదవదిగా పేర్కొంటుంటారు. ఇంకొందరయితే పదిహేను నగరాలు అంటారు. అలాగే విచిత్రంగా ధ్వనించే ఢిల్లీ పేరుకు సంబంధించి కూడా అనేక వివరణలు ఉన్నాయి. దేనికదే ప్రత్యేకం. చాలా సంవత్సరాలుగా ఢిల్లీ గాథను తెలుసుకోవాలని నేను అనుకున్నాను. కానీ నిజంగా దాన్ని తెలుసుకోడానికి పెద్దగా ప్రయత్నించలేదు. మనం చరిత్ర మధ్యలో జీవిస్తున్నప్పుడు దానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యంఇవ్వం. ఘోరమైన విషయం ఏమిటంటే, నేను ఢిల్లీని కాన్ బెర్రా, ఒట్టావా లేదా వాషింగ్టన్‌తో పోల్చడం ఉచితమేనని అనుకున్నందుకు చింతిస్తున్నాను. నిస్సందేహంగా నేను అలా పోల్చిన ప్రతిసారీ, తప్పు చేస్తున్నానని నాకు తెలుసు కానీ అలా పోల్చడాన్ని అది ఆప లేదు. నా అజ్ఞానంలో ఉంటూ, నేను విలువైన అంశాన్ని ప్రతిపాది స్తున్నట్లు యోచించాను. బహుశా నేను ఒక సందర్భంలో ఘోరంగా దొరికిపోయేంతవరకూ ఇది అలాగే కొనసాగిందని చెప్పాలి. లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వస్తున్నప్పుడు నా పక్కనే కూర్చున్న ఒక అందమైన యువతి ‘‘ఢిల్లీ గురించి చెప్పండి’’ అని నన్ను అడిగింది. అది 1980ల చివరలో అనుకుంటాను. సెలవుపై ఇంటికి తిరిగొస్తున్నప్పడు అది తటస్థించింది. ఆమె చాలా ఆకర్షణీ యంగా ఉంది. నేను సంభాషణ ఏదైనా మొదలెట్టాలని అనుకు న్నాను. ‘‘ఢిల్లీ అద్భుతమైన చరిత్ర కలిగిన ఒక పురాతన నగరం అని నేను నమ్ముతున్నాను’’ అని ఆమె అన్నది. ‘‘అవును, అవును’’ అంటూ నేను ఉత్సాహంగా సమాధాన మిచ్చాను. కానీ దాని గురించి ఏమీ తెలియకపోవడంతో నేనుసంభాషణను కొనసాగించలేకపోయాను. అందుకే విషయాన్ని పక్క దోవ పట్టించడానికి ప్రయత్నించాను. ‘‘ఢిల్లీ చాలావరకు కాన్ బెర్రా, ఒట్టావా, వాషింగ్టన్ లాంటిదే’’ అన్నాను. ‘‘ఓ దేవుడా! కచ్చితంగా కాదు’’ ఆమె దెబ్బతిన్నట్టుగా అన్నది. ‘‘ఓ ఎస్’’ అని నేను రెట్టించాను. కానీ ఈ విషయంపై ఏం చెప్పాలో నాకు తోచలేదు. ‘‘వెల్, మీ మాట తప్పు కావాలని కోరుకుంటున్నా.’’ అక్కడే ఆ సంభాషణ ముగిసిపోయింది. తర్వాత ఎనిమిది గంటల పాటు ఆ విమాన ప్రయాణ కాలంలో మాట్లాడటానికి నేను వేసిన ప్రారంభ ఎత్తులన్నీ సున్నితమైన తిరస్కరణను ఎదుర్కొ న్నాయి. నా ఉద్దేశపూర్వక ప్రయత్నాలకు ఢిల్లీ గురించి నాకు జ్ఞానం లేకపోవడం అనేది గట్టి అడ్డంకిగా నిలిచింది. నేను ఎంత ఘోరమైన అభిప్రాయాలతో ఉన్నానో ఇటీవలే గుర్తించాను. ‘ద మిలీనియం బుక్ ఆన్ న్యూఢిల్లీ’ పుస్తకం రాసిన పవన్ వర్మ ఆ మధ్య ఆ ప్రతిని నాకు పంపారు. చూసీచూడగానే అది ఒక విలాస వంతమైన కాఫీ టేబుల్ అలంకృత పుస్తకంగా అనిపించింది. అలాగని అలాంటి వాటి పట్ల నాకు వ్యతిరేకత ఏమీలేదు. పేజీలు అలా తిరగేస్తూ, ఫొటోగ్రాఫులను మెచ్చుకుంటూ, నెమ్మదిగా వ్యాసాల్లోకి మునిగిపోతుండగా ఢిల్లీ గురించి అత్యంత పఠనీయ చరిత్రాంశాలను ఈ పుస్తకం కలిగి ఉన్నదని గుర్తించాను. నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందో, దాని మూలాల వెనుక ఉన్న కథ ఏమిటో, ఈ మహానగరం ఎన్ని ‘నగరాల’తో కూడుకుని ఉన్నదో, ఇంకా ఇలాంటి ఎన్నో సంగతులు ఇప్పుడు నాకు తెలుసు. దీనంతటికీ నేను ఖుశ్వంత్ సింగ్‌కు రుణపడి ఉంటాను. నా కళ్లు మొట్టమొదట పడింది ఆయన వ్యాసం మీదే. చెప్పాలంటే దాన్ని ఆబగా చదివాను – కృతజ్ఞతతో, ఆనందంతో. కొంత గర్వ ప్రదర్శన చేసుకోవడానికి అనుమతివ్వండి. ఢిల్లీ మూలం విసుగు తెప్పించే సత్యం కంటే ఎంతో చక్కగా ఉండే ఒక పౌరాణిక గాథపై ఆధారపడి ఉంది. ఒకానొకప్పుడు గంగా నది పొంగి పరవళ్లు తొక్కుతున్నప్పుడు (ఈరోజు అది అలా ప్రవహించలేనంతగా కలుషితమైపోయింది) అది శాస్త్రాలను కక్కింది. (యాదృచ్ఛికంగా ఈ ‘కక్కడం’ అనే మాట ఖుశ్వంత్ సింగ్‌దే. కానీ ఆయన దాన్నొక శ్లేషగా మాత్రమే వాడివుంటారా అని నా సందేహం.). ఆ ప్రాంతానికి గుర్తుగా అక్కడ నిగమ్‌బోధ్ అని పిలిచే ఆలయం నిర్మించారు. అవును ఒకరోజు మీరు, నేను ఇదే ఘాట్ దగ్గర బహుశా స్వర్గాభిముఖంగా బట్వాడా అవుతాం. ‘‘ఇది ఢిల్లీని దైవ నిలయంగా ఎంచుకోవడానికి మన పూర్వీకులకు తగిన హేతువు అయివుండవచ్చు’’ అని ఖుశ్వంత్ సింగ్ కొనసాగిస్తారు. ‘‘అలా ఢిల్లీ మొదటి నగరం, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి నివాసం ఇంద్రప్రస్థ ఆవిర్భవించింది.’’ నేడు పురానా ఖిలా బహుశా అదే చోట ఉంది. ఇంద్రప్రస్థ అనంతరం, అది మన ప్రియమైన న్యూఢిల్లీ అయ్యేంతవరకూ అనేక నగరాలు వెలిశాయి. ఎన్ని నగరాలు అనే సంఖ్య అనిశ్చితం. కొంతమంది ఏడు నగరాలు అని చెబుతూ ఢిల్లీని ఎనిమిద వదిగా పేర్కొంటుంటారు. ఇంకొందరయితే పదిహేను నగరాలు అంటారు. ఖుశ్వంత్ వ్యాసంలో నేను ఇట్టే పద్నాలుగు నగరాలను లెక్కించాను. అవి ఇంద్రప్రస్థ, యోగినిక్పుర, లాల్ కోట్, సిరి, కిలో ఖేరీ, చిరాగ్, జహాపనా, తుగ్లకాబాద్, ఫిరోజాబాద్, ఖిలా ఫిరోజ్ షా, ముబారకాబాద్, దీన్ పనాహ్, షాజహానాబాద్, తర్వాత ఇంకేంటి న్యూఢిల్లీ. కానీ పదిహేనవ నగరం ఏది? నాకు ఇప్పటికీ తెలియనందుకు చిరాగ్గా ఉంది. ఏదేమైనా, నాకు ఖుశ్వంత్ వ్యాసంలో మరీ ఎక్కువ నచ్చింది ఢిల్లీ ఉచ్చారణకు సంబంధించిన ఖండిక. ‘‘చదువుకున్నవాళ్లు డెహ్లీ అనీ, సాధారణ జనం దిలీ అని పిలిచే... విచిత్రంగా ధ్వనించే పేరు’’. దీనికి సంబంధించి అనేక వివరణలు ఉన్నాయి. పర్షియన్ పదమైన దెహ్లీజ్ నుంచి ఇది పుట్టుకొచ్చి ఉండవచ్చు. దెహ్లీజ్ అంటే ప్రవేశ ద్వారం అని అర్థం. ఎందుకంటే గంగామైదాన ప్రాంతానికి ఇది ఒక ప్రవేశద్వా రంగా ఉంటోంది. మరొక వివరణ ప్రకారం, డైడలస్ అనే పదం నుంచి ఢిల్లీ పేరు పుట్టి ఉండవచ్చు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు చెందిన భౌగోళిక శాస్త్రవేత్త టాలెమీ ఈ నామకరణం చేశారు. ఏదేమైనా, ఈ నగరాన్ని ఒకప్పుడు పరిపాలించిన రాజన్ ధీలూ పేరుతో దీని జాడలు దొరుకుతున్నాయని 16వ శతాబ్ది పర్షియన్ చరిత్రకారుడు ఫెరిష్తా పేర్కొన్నాడు. కొంతమంది పండితులు ఈ పేరును కుతుబ్ మినార్ సమీపంలో ఉండే సుప్రసిద్ధ ఇనుప స్తంభంతో ముడిపెడుతున్నారు. అయితే ఈ సంబంధాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నానని చెప్పలేను. ఖుశ్వంత్ సింగ్ చెప్పినట్లుగా, ‘‘ఈ స్తంభాన్ని మహా విష్ణువు ప్రతీకగా రూపొందించారు. దీన్ని తన తలపై భూమిని మోస్తున్న త్రాచుపాము (వాసుకి) పడగలోకి లోతుగా పాతడానికి ఉద్దేశించారు.’’ ఈ స్తంభం జోలికి పోయేవారికి శాపం తగులుతుందని చెబుతుంటారు. అయితే ఒక మూర్ఖపు తోమర్ రాజ్‌పుత్ రాజు దీన్ని నిజంగానే త్రాచుపాము పడగ మీదే జొప్పించినట్టుగా ప్రతిష్ఠించారో లేదో రుజువు కావాలనుకుని, దాన్ని తవ్వించాడు. స్తంభం బయటకు తీయగానే, దాని కిందిభాగం రక్తంతో తడిసివుండటం కనిపించింది. తర్వాత తోమర్ రాజు తన సింహా సనాన్ని కోల్పోయాడు. అతడి వంశం కూడా అతడితోనే అంతరించి పోయింది. ఇది అద్భుతమైన గాథ. కానీ నా వరకూ దీనికీ, ఢిల్లీ పేరుకూ ఉన్న సంబంధాన్ని గ్రహించలేకపోయాను. ఢిల్లీ ఒక నెత్తుటి నగరం అని ఇది సూచిస్తోందా? విషాదకరంగా, కొన్నిసార్లు ఢిల్లీ అలాగే ఉండింది. విషాదమేమిటంటే, ఖుశ్వంత్ సింగ్‌ను వీటిపై వివరించమని అడిగే అవకాశాన్ని నేను ఎన్నడూ పొందలేదు. ఢిల్లీకి ఆ తప్పిపోయిన 15వ పేరు గురించి కూడా అడిగే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ తర్వాత ఎప్పుడైనా ఎయిర్ ఇండియా విమానంలో ఒక అందమైన యువతి పక్కన కూర్చున్నప్పుడు, సంభాషణను నిలపడంలో నాకు తక్కువ సమస్యలు ఉంటాయి. నాకు ఆ అదృష్టం పట్టా లని కోరుకోండి మరి! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రపంచంలో జీవించడానికి అనువుగా ఉన్న టాప్ 10 నగరాలు (ఫోటోలు)
-
రాష్ట్రానికి మరో 7 ‘స్వచ్ఛ’ అవార్డులు.. కేటీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించిన స్వచ్ఛ అవార్డుల జాబితాలో తెలంగాణలోని ఏడు పట్టణాలకు చోటు దక్కింది. ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగంలో 16 అవార్డులు రాగా, ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) విభాగంలో మరో మూడు అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రదానం చేసింది. తాజాగా కాగజ్‌నగర్, జనగామ, ఆమన్‌గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట, గ్రేటర్ వరంగల్ పురపాలికలకు ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీస్ (వేగంగా ఎదుగుతున్న నగరాలు) కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దీంతో తెలంగాణ మొత్తం 26 అవార్డులను సాధించినట్లయింది. 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు నిర్వహించింది. పారిశుధ్యం, మున్సిపల్ ఘన..ద్రవ వ్యర్థాల నిర్వహణ, అవగాహనపై దేశ వ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహించారు. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, ఉమ్మి రహిత వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు.. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, ద్రవ..వ్యర్ధాల నిర్వహణ, ప్రజల అవగాహన, సిటిజెన్స్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్ తదితర అంశాలు పరిశీలించారు. అనంతరం అవార్డులు ప్రకటించారు. తక్కువ మున్సిపాలిటీలు.. ఎక్కువ అవార్డులు: కేటీఆర్ రాష్ట్రానికి మరిన్ని స్వచ్ఛ అవార్డులు దక్కడంపై పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ మార్గనిర్దేశనంలో అటు పల్లెలు, ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డులు దక్కుతున్నాయని చెప్పారు. తక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ఉన్నప్పటికీ అత్యధిక అవార్డులు దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. తెలంగాణ అద్భుత, వినూత్న కార్యక్రమాలను యావత్ దేశం ఆదర్శంగా తీసుకుంటోందని అన్నారు. ఈ అవార్డులు రావడంలో పురపాలక శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర వహించారంటూ వారిని అభినందించారు. అవార్డులు సాధించిన పురపాలికల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచి్చన పట్టణాలకు రూ.2 కోట్ల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహక నిధులను ప్రకటించారు. ఇదీ చదవండి: Hyderabad: జనవరిలో నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్ -
అపార్ట్మెంట్లతో పోలిస్తే ఓపెన్ ప్లాట్లే ముద్దు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ తెలిపింది. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13-21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2-6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. (ప్రాపర్టీలకు డిమాండ్. రూ 2 కోట్లు అయినా ఓకే!) 2018-21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. (ఉడాన్‌లో రెండో రౌండ్ కోతలు, భారీగా ఉద్యోగులపై వేటు) -
Air Quality Index: ఆసియాలోని కాలుష్య నగరాల్లో 8 భారత్‌వే
న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. చలికాలం వస్తూ ఉండడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం హరియాణాలోని గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజధాని ఢిల్లీ లేదు. ఇక గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియా మొత్తంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలవడం విశేషం. గురుగ్రామ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం ఉదయం 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లక్నో (298), ఆనందపూర్ బెగుసరాయ్ (269) భోపాల్ (266) ఖడక్‌పడ (256), దర్శన్ నగర్, చాప్రా (239) ఉన్నాయి. -
కుబేరుల అడ్డాల గురించి తెలుసా? తక్కువ పన్నుల వల్లే..
న్యూయార్క్: ప్రపంచంలో అపర కుబేరుల అడ్డా జాబితా వెల్లడైంది. ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్నర్స్ గ్రూప్’ తాజా నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. ధనవంతులకు అడ్డా అయిన మొదటి 10 నగరాల్లో 5 నగరాలు అమెరికాలోనే ఉండడం విశేషం. ► 2022లో తొలి అర్ధభాగంలో న్యూయార్క్ సిటీ 12 శాతం మిలియనీర్లను కోల్పోయింది. శాన్ఫ్రాన్సిస్కోలో మిలియనీర్లు 4 శాతం పెరిగారు. లండన్‌లో 9 శాతం తగ్గిపోయారు. ► సౌదీ అరేబియా రాజధాని రియాద్, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జాలో సంపన్నుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ► అబూ దాబీ, దుబాయ్ సిటీలు బడా బాబులను ఆకర్శిస్తున్నాయి. ధనవంతులు ఆయా నగరాల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అక్కడ తక్కువ పన్నులు, కొత్త కొత్త నివాస పథకాలు అమల్లోకి వస్తుండడమే ఉండడమే ఇందుకు కారణం. ► రష్యా ధనవంతులంతా యూఏఈకి వస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, రష్యాపై ఆంక్షలూ ఇందుకు ప్రధానకారణం. ► సంపన్నుల నగరాల జాబితాలో చైనాలోని బీజింగ్, షాంఘై సిటీలు తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. ► ఇక భారత్‌లోని ముంబై నగరం 25వ స్థానంలో నిలిచింది. ► ఈ ఏడాది సంపద తరలిపోతున్న దేశాల్లో రష్యా తర్వాత రెండో స్థానం చైనాదేనని ‘హెన్లీ అండ్ పార్ట్నర్స్ గ్రూప్’ అంచనా వేసింది. ఇదీ చదవండి: పెరగడమే కాదు.. తగ్గడమూ ప్రమాదమే! -
పెళ్లి కోసం పట్నాలకు వలసలు
సాక్షి, అమరావతి: పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు ఎవరన్నా వలస పోతున్నారంటే.. ఉద్యోగం, ఉపాధి పనుల కోసమో.. అదీ కాకుంటే పిల్లల ఉన్నత చదువుల కోసమో అని అందరూ అనుకుంటుంటారు. కానీ.. అది వాస్తవం కాదట. 2020 జూలై నుంచి 2021 జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న వలసలపై కేంద్రం నిర్వహించిన పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కేంద్రం ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలో నూటికి 47.5 శాతం మంది పెళ్లిళ్ల కారణంగానే పట్టణాలకు వలస వెళ్లినట్టు తేలింది. అంటే దాదాపు మొత్తం వలసల్లో సగం మంది వలసలకు ఇదే కారణమని స్పష్టమైంది. ఉపాధి.. ఉద్యోగాల కోసం వెళ్లేది 10.8 శాతమే ► ‘ఉపాధి హామీ పథకం–గ్రామాల్లో వలసలు’ అనే అంశంపై రెండు రోజుల క్రితం లోక్‌సభలో చర్చకు రాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే వివరాలను అధికారికంగా వెల్లడించింది. ► 2020–21 మధ్య పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు 47.5 శాతం కాగా.. వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉందని పేర్కొంది. ► ఉద్యోగ, ఉపాధి మార్గాల కోసం పట్నం వెళ్లిన వారి సంఖ్య కేవలం 10.8 శాతమే అని తెలిపింది. ► పిల్లల చదువుల నిమిత్తం పట్టణాలకు వలస వెళ్తున్న వారు 2.4 శాతం మంది ఉన్నట్టు పేర్కొంది. ► సంపాదించే కుటుంబ యజమాని స్థల మార్పిడి కారణంగా 20 శాతం మంది పట్టణాలకు చేరుకున్నారని వెల్లడించింది. ► 2020 మార్చిలో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే ఏడాది జూలై నాటికి లాక్డౌన్ నిబంధనలను చాలావరకు కేంద్రం సడలించింది. ఆ తరువాత చోటుచేసుకున్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకే కేంద్రం ఈ సర్వే చేయించింది. ► అప్పట్లో పట్నాల నుంచి పల్లెటూరు వెళ్లిన వారి సంఖ్యతో పాటు పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వారి వివరాలను కూడా ఈ సర్వే ద్వారా కేంద్రం గుర్తించింది. ► మొత్తం 122 కోట్ల దేశ జనాభాలో 0.7 శాతం మంది అంటే 85 లక్షల మంది సర్వే జరిగిన ఆ ఏడాది కాలంలో తాత్కాలికంగా వలస బాట పట్టారని తేల్చింది. పట్నం బాట పట్టడానికి కారణాలు.. వలస వెళ్లిన వారి శాతం -
ఆఫీస్ లీజింగ్ పెరిగింది
న్యూఢిల్లీ: కార్యాలయాల లీజింగ్ స్థలం పెరిగిందని రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ‘ఆరు ప్రధాన నగరాల్లో 2022 ఏప్రిల్–జూన్‌లో స్థూలంగా 1.47 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని స్థలాన్ని ఆఫీసులు లీజుకు తీసుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లకు పైమాటే. ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఆఫీస్ లీజింగ్ రెండున్నర రెట్లు అధికమై 2.75 కోట్ల చదరపు అడుగులకు చేరింది. డిసెంబర్‌కల్లా ఇది 4–4.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకోవచ్చని అంచనా. డిమాండ్ పెరగడంతో అద్దెలు సైతం దూసుకెళ్తాయి. హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్–జూన్‌లో స్థూల లీజింగ్ స్థలం 23 లక్షల చదరపు అడుగులకు చేరింది. 2021 ఏప్రిల్–జూన్‌లో ఇది 7 లక్షల చదరపు అడుగులు. జనవరి–జూన్‌లో ఇది 11 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగులకు ఎగసింది’ అని కొలియర్స్ వివరించింది. -
శతమానం భారతి: లక్ష్యం 2047 పట్టణీకరణ
ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 60 శాతం వాటా పట్టణాలదే. అభివృద్ధి చెందిన దేశాల్లో పట్టణీకరణ 16వ శతాబ్దం నుంచే ప్రారంభమవడానికి కారణం పారిశ్రామిక విప్లవమే. భారతదేశంలో పట్టణీకరణ స్వాతంత్య్రానంతరమే వేగం పుంజుకొంది. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లలో పట్టణాల్లో నివసించే వారు 37.71 కోట్లు.. అంటే 31.16 శాతం. 2030 నాటికి దేశ జనాభాలో పట్టణ ప్రజల వాటా 50 శాతానికి చేరుతుందని ’ప్రపంచ బ్యాంకు, మెకిన్సే’ నివేదికలు వెల్లడించాయి. 1951లో దేశంలో పది లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల సంఖ్య తొమ్మిది. 2011 నాటికి అది 53 కు పెరిగింది. అందులో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి. దేశంలోని పట్టణ జనాభాలో 37 శాతం మెట్రోపాలిటన్ నగరాల్లోనే నివసిస్తోంది. ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో జనాభా 40 లక్షల పైమాటే కాబట్టి, వాటిని మెగా నగరాలుగా వర్గీకరించారు. భారతదేశంలో పట్టణీకరణ విధానాలన్నీ స్వాతంత్య్రానంతరం రూపుదిద్దుకొన్నవే. 75 సంవత్సరాల పట్టణీకరణ విధానాలు, ప్రణాళికల వల్ల భారత స్థూల దేశీయోత్పత్తిలో పట్టణాల వాటా పెరిగింది. చండీగఢ్ తొలి పంచవర్ష ప్రణాళికా కాలంలో నిర్మితమైంది. పట్టణీకరణకు ఊతమిచ్చే వ్యవస్థలను, సంస్థలను వివిధ ప్రణాళికా కాలాల్లోనే ఏర్పాటు చేశారు. అమెరికా, యూరప్ దేశాల్లో ’నవీన పట్టణీకరణ’ ప్రాచుర్యం పొందుతోంది. అక్కడి పట్టణీకరణ ఒక క్రమ పద్ధతిలో సుస్థిరంగా రూపుదిద్దుకొంది. ఈ తరహా విధానాలను మన ప్రభుత్వాలు కూడా పరిశీలించాలి. -
5G: రిలయన్స్ జియో ‘5జీ’ కసరత్తు.. ఓ రేంజ్‌లోనే!
Reliance Jio About 5G Plan: దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్క్ రిలయన్స్ జియో భారీ ప్రణాళికకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వెయ్యి నగరాల్లో 5జీ నెట్వర్క్ కవరేజ్‌ను విస్తరించేందుకు ప్లానింగ్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఫైబర్ సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు ఆయా సైట్లలో పైలట్‌ను నిర్వహిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ ప్రదర్శనలో జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ వివరాల్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1,000 టాప్ సిటీలకు 5G కవరేజ్ ప్లానింగ్ పూర్తయింది. 5జీ టెక్నాలజీతో హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో అధునాతన సదుపాయాలను ఉపయోగించి జియో ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. అంతేకాదు త్రీడీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ ద్వారా 5జీ సేవల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్లు థామస్ తెలిపారు. నెట్వర్క్ ఫ్లానింగ్ కోసం అత్యాధునిక సేవల్ని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రూ.151.6 కు పెరిగింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 8.6 శాతం ఎక్కువ. ఇటీవల జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. 2021 డిసెంబర్ నాటికి భారత్ లో జియో వినియోగదారుల సంఖ్య 42.1 కోట్లకు చేరింది. 2020తో పోలిస్తే దాదాపు కోటి మంది వినియోగదారులు జియోకు పెరిగారు. స్పెక్ట్రమ్ సంబంధిత బకాయిలన్నింటినీ టెలికం శాఖకు జియో ఇటీవలే ముందస్తుగా చెల్లించింది. 2021 మార్చి వరకు వడ్డీతో కలిపి మొత్తంగా రూ.30,791కోట్ల చెల్లింపు చేసింది. 5g స్పెక్ట్రమ్ వేలం ఈ వేసవిలోపే జరిగే అవకాశం ఉండగా.. ఈ లోపు జియో కసరత్తులు పూర్తి చేసుకోవడంతో పాటు 6జీ మీద ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. -
డబ్బులు లేక, ఆగిన 1.74 లక్షల గృహాల నిర్మాణం
న్యూఢిల్లీ: నిర్మాణ రంగానికి నిధుల కొరత నెలకొన్న నేపథ్యంలో పలు భారీ హౌసింగ్ ప్రాజెక్టులు నిల్చిపోయాయి. దేశీయంగా హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో 1.74 లక్షల గృహాల నిర్మాణం ఆగిపోయింది. వీటి విలువ సుమారు రూ. 1.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014, అంతకన్నా ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టులను దీనికి పరిగణనలోకి తీసుకున్నారు. నిల్చిపోయినవే కాకుండా జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య 6,28.630గా ఉంటుందని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ. 5,05,415 కోట్లుగా వివరించింది. నిర్మాణ రంగాన్ని నిధుల కొరత సమస్య వెంటాడున్నందున.. పూర్తిగా నిల్చిపోయిన ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు చేసిన వారికి భవిష్యత్ అంచనాలు అత్యంత విపత్కరంగా ఉన్నాయని తెలిపింది. భారీ జాప్యమున్న ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులకూ పరిస్థితి ఆశావహంగా లేవని పేర్కొంది. ఢిల్లీలో అత్యధికం .. నగరాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో సుమారు రూ. 2,727 కోట్ల విలువ చేసే 4,150 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా రూ. 86,463 కోట్ల విలువ చేసే 1,13,860 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఇది మొత్తం టాప్ 7 నగరాల్లో నిల్చిపోయిన వాటిలో 66 శాతం కావడం గమనార్హం. అటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 41,730 యూనిట్లు (విలువ రూ. 42,417 కోట్లు), పుణెలో 9,900 యూనిట్లు (విలువ రూ. 5,854 కోట్లు), బెంగళూరులో 3,870 యూనిట్లు (విలువ రూ. 3,061 కోట్లు), కోల్‌కతాలో 150 ఫ్లాట్ల (విలువ రూ. 91 కోట్లు) నిర్మాణం ఆగిపోయింది. ఇక, నిల్చిపోయిన వాటితో పాటు జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో రూ. 11,810 కోట్ల విలువ చేసే 17,960 యూనిట్లు ఉన్నాయి. -
గ్రామాల్లో రక్తహీనత.. నగరాల్లో ఐరన్ లోపం.. పూర్తి పరిష్కారం?
సాక్షి, హైదరాబాద్: రక్తహీనత సమస్య గ్రామీణ ప్రాంత పిల్లలు, కౌమార వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తోందని, నగరాల్లోని పిల్లల్లో మాత్రం ఐరన్ లేమి ఎక్కువగా ఉందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో తేలింది. నగరాల్లోని పిల్లల్లో రక్త హీనత సమస్య తక్కువగానే ఉందని వెల్లడైంది. గ్రామీణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నా ఇనుము లేమి సమస్య లేదని స్పష్టమైంది. దేశంలోని పిల్లలు, కౌమార వయసున్న వారిలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు.. వ్యాధులు, పోషణ లేమితో విజయవంతం కాలేకపోతున్నాయని వెల్లడైంది. దేశంలోని మహిళలు, పిల్లలు 40–50 శాతం మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటుండగా.. పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించాల్సిన అవసరం ఈ అధ్యయనం కల్పిస్తోందని ఎన్ఐఎన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంచి ఆహారం కీలకం.. రక్తంలో ఇనుము మోతాదు చాలా తక్కువగా ఉంటే రక్తహీనత వచ్చిందని చెబుతుంటారు. ఈ లెక్కన చూస్తే దేశంలోని దాదాపు 50 శాతం మందిలో ఈ సమస్య ఉండాలి. అయితే రక్తంలోని ఇనుము మోతాదును గుర్తించేందుకు అయ్యే పరీక్షలు చాలా ఖరీదైనవి. జనాభా స్థాయిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ఈ కారణంగానే రక్తంలోని హిమోగ్లోబిన్‌ను లెక్కించడం ద్వారా ఇనుము లోపాన్ని పరోక్షంగా గుర్తించి రక్తహీనతపై అంచనాకు వస్తారు. ‘రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు సర్వేల ద్వారా తెలిస్తే.. ఇనుము సప్లిమెంట్లు, ఇనుము కలిగిన ఆహారం ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం జరుగుతుంది. కానీ తాజా అధ్యయనం ప్రకారం చూస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతున్నట్లు కన్పించట్లేదు’అని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 33 వేల మంది పిల్లలు, కౌమారులపై ఈ అధ్యయనం జరిగింది. ‘రక్తంలో హిమోగ్లోబిన్ తయారయ్యేందుకు నాణ్యమైన ఆహారం చాలా కీలకం. పండ్లు, జంతు సంబంధిత ఆహారం తక్కువగా తీసుకుంటుండటం వల్ల గ్రామీణుల్లో, పేదల్లో హిమోగ్లోబిన్ తయారీ సక్రమంగా జరగట్లేదు. ఇనుముతో పాటు అనేక ఇతర పోషకాలు హిమోగ్లోబిన్ తయారీకి అవసరమవుతాయి’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ భారతీ కులకర్ణి తెలిపారు. (చదవండి: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర) -
లాక్డౌన్ ప్రజలకే కాదు.. నగరాల్లోని కాలుష్యానికి కూడా..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ విధింపుతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. నిత్యం కాలుష్యంతో నిండిపోయే నగరాల్లో ప్రస్తుతం స్వచ్ఛ వాయువులు వీస్తున్నాయి. కొన్నినెలల విరామం తర్వాత మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలు ‘గ్రీన్‌జోన్’లోకి అడుగుపెట్టాయి. వాయు నాణ్యతలో ‘గుడ్ కేటగిరీ’లోకి చేరుకున్నాయి. లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుండడంతో అన్నిరకాల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర కార్యకలాపాలు సైతం నిలిచిపోవడంతో గత ఐదురోజుల్లోనే పర్యావరణ పరంగా ఎంతో మేలు జరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. నగరాల్లో తగ్గిన కాలుష్యం గతేడాది దాదాపు 2, 3 నెలల లాక్‌డౌన్‌తో కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. జన సంచారం సైతం లేకపోవడంతో వన్యప్రాణులు, జంతువులు, పక్షులు స్వేచ్ఛగా సంచరిస్తూ గ్రామాలు, పట్టణ శివార్లలోకి కూడా వచ్చి కనువిందు చేశాయి. అయితే లాక్డౌన్ ఎత్తేశాక రెండంటే రెండు రోజుల్లోనే అన్నిరకాల కాలుష్యం పెరిగిపోయి మళ్లీ యధాతథ స్థితికి చేరుకుంది. అప్పటి నుంచి వాయు, తదితర కాలుష్యాలు పెరుగుతూనే వచ్చాయి. తాజాగా మరోసారి లాక్డౌన్ విధించడంతో ఐదురోజుల్లోనే వాయుకాలుష్యం గణనీయంగా తగ్గి నగరాలు గుడ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏఐక్యూ)లోకి చేరుకున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘సమీర్ యాప్’ద్వారా రియల్ టైమ్‌లో దేశవ్యాప్తంగా వందకు పైగా ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత, వివిధ రకాల కాలుష్య స్థాయిలను పరిశీలించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల సూచీని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. ఎన్ని పాయింట్లు ఉంటే ఏ విధమైన ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందో కూడా తెలియజేస్తోంది. సీపీసీబీ అప్డేట్ ఇదీ.. శనివారం సాయంత్రం 7.05 నిమిషాలకు సీపీసీబీ అప్డేట్ చేసిన ఏక్యూఐ తాజా వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో వాయు నాణ్యత 29 పాయింట్లుగా రికార్డు కాగా, ఏపీ రాజధాని అమరావతిలో 20 పాయింట్లు, రాజమండ్రిలో 27, తిరుపతిలో 43, ఏలూరులో 47, విశాఖలో 53 పాయింట్లు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ మహానగరం మొత్తంగా సగటున 29 పాయింట్లుగా నమోదు కాగా, వివిధ ప్రాంతాల వారీగా చూస్తే మల్లంపేట, బాచుపల్లిల సమీపంలో 19 పాయింట్లు, పటాన్చెరు దగ్గర 25 పాయింట్లు, శేరిలింగంపల్లి, కొండాపూర్‌ల సమీపంలో 30 పాయింట్లు, నెహ్రు జూ పార్కు దగ్గర 41 పాయింట్ల ఏక్యూఐ రికార్డయ్యింది. ( చదవండి: కరోనా వ్యాక్సిన్: స్పుత్నిక్–వి భేష్.. సామర్థ్యం ఎంతంటే? ) -
అత్యంత కలుషిత నగరాల్లో 22 భారత్‌లోనే!
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల జాబితా విడుదలైంది. దీనిప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 30 నగరాలు అత్యంత కలుషితమైనవిగా గుర్తించారు. దీనిలో 22 నగరాలు భారత్‌లోనే ఉండటం గమనార్హం. కాగా, స్విస్ అనే సంస్థ వరల్డ్ ఎయిర్ క్వాలీటీ ఇండెక్స్ రిపోర్ట్ - 2020ను విడుదలచేసింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా చైనాలోని జిన్జియాంగ్ తొలి స్థానంలో నిలిచింది. కాగా, దీని తర్వాత మిగతా 9 నగరాలు మనదేశానికి చెందినవే. ఇక..రెండో స్థానంలో ఘజియాబాద్, మూడో స్థానంలో బులంద్‌షహర్ ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ పదవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కలుషిత రాజధాని నగరాలలో ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. వీటి తర్వాత బిస్రఖ్ జలాల్పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఆగ్రా మరియు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్, రాజస్థాన్‌లోని భీవారీ, జింద్ , హిసార్, ఫతేహాబాద్, బాంధ్వరి, గురుగ్రామ్, యమునా నగర్, హర్యానాలోని రోహ్తక్ మరియు ధారుహేరా, మరియు బీహార్‌లోని ముజఫర్‌పూర్ లు నిలిచాయి. అయితే కరోనా నేపథ్యంలో ఢిల్లీలో 2019 నుంచి 2020ల మధ్య వాయునాణ్యత 15 శాతంమెరుగుపడింది. ఈ రిపోర్ట్ 106 దేశాల నుంచి వచ్చిన పీయమ్ 2.5 డేటా ఆధారంగా తీసుకున్నారు. వీటిని ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహిస్తాయి. భారత్‌లో ప్రధానంగా వంటచెరకు, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, వ్యర్థాల దహనం, వాహనాల నుంచి వచ్చేపోగ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. అయితే..దీనిపై గ్రీన్ ఇండియా క్యాంపెయినర్ అవినాష చంచల్ మాట్లాడుతూ..లాక్డౌన్ కాలంలో వాయునాణ్యత స్వల్పంగా పెరిగిందని అన్నారు. కాగా, ప్రభుత్వాలు ఎలక్టిక్ వాహనాలను , సైక్లింగ్, వాకింగ్, ప్రజారవాణాను ప్రొత్సహించాలని అన్నారు. అయితే, పరిశుభ్రమైన గాలిని పీల్చడంతో, ఆరోగ్యసమస్యలు దూరమవుతాయని చంచల్ అన్నారు. ప్రజలు పర్యావరణాన్ని, కాపాడుకొంటు, కాలుష్యాన్ని తగ్గించుకొవాల్సిన అవసరం ఉందని ఐక్యూ ఎయిర్సీఈవో ఫ్రాంక్ హమ్స్ తెలిపారు. చదవండి: దారుణం: రోడ్డుపైనే.. చచ్చిపోయేంత వరకు.. -
నగరం మేల్కోవలసిన వేళ
-
పెద్ద నగరాల్లోనే పెనుముప్పు!
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉంటూ సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన నగరాలు కరోనా గుప్పిట చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఈ ఏడాది జనవరి చివరి వారంలో దేశంలో తొలి కరోనా కేసు నమోదు కాగా... ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ వైరస్ విస్తరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు ప్రధాన నగరాలు ఇంచుమించు రెడ్‌జోన్ పరిధిలోకి చేరుతున్నాయి. ప్రధాన నగరాలు కరోనా వ్యాప్తికి కారకాలుగా మారుతుండటంతో కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య, మున్సిపల్, పోలీస్ విభాగాలు కరోనాను రూపుమాపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రథమ శ్రేణి నగరాల్లోనే అత్యధికం... దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్యను విశ్లేషిస్తే దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై, చెన్నై, అహ్మదాబాద్, పుణే, హైదరాబాద్, బెంగళూర్ వంటి ప్రధాన నగరాల్లోనే 40 శాతం కేసులు పాజిటివ్‌గా తేలాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పరంగా చూస్తే ముంబై అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో.. హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు భోపాల్, ఆగ్రా, జైపూర్, సూరత్‌లోనూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో 52 శాతం పైగా కేసులు 13 నగరాల్లోనే నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కట్టడి చేసేందుకు తంటాలు... కరోనా కట్టడికి దేశంలో 170 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం హాట్స్పాట్లుగా గుర్తిం చింది. వీటితో పాటు కొన్ని ప్రధాన నగరాలను కూ డా రెడ్జోన్లుగా ప్రకటిస్తూ... బయటపడేందుకు అనురించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా కేసులు బయటపడిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి... కరోనా విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టం చేస్తున్నాయి. అయితే ప్రధాన నగరాల్లో విచ్చలవిడిగా పట్టణీకరణ జరగడం, జనసాంద్రత, జనసంచారం ఎక్కువగా ఉండటంతో వైరస్ అదుపులోకి రావడంలేదు. దీంతో భౌతిక దూరం, కంటైన్మెంట్, లాక్డౌన్ మినహా మరో మార్గం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రపంచమంతా ఇదే పరిస్థితి... కరోనా కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితినే సృషిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్, చికాగో, డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు యూరప్‌కు చెందిన లండన్, మిలాన్, రోమ్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
కాలుష్య నగరాల ప్రజలకు మరో సెగ
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న పలు నగరాల ప్రజలకు మరో షాక్ తగిలింది. కాలుష్య కాసారంలో మగ్గుతున్న వివిధ నగరాలవాసులు ఆరోగ్య బీమా పొందాలంటే ఇక మీద ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర శ్వాసకోశ వ్యాధులు తీవ్రం కానున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం 5 శాతం అదనంగా చెల్లించాలని బీమా కంపెనీలు చెప్పబోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లోని క్లెయిమ్‌ల డేటా భారీ పెరగడంతో ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ వైపుగా ఆలోచిస్తున్నాయి. అంతేకాదు కొత్తగా పాలసీ తీసుకునే వారిని మరిన్ని ఆరోగ్య పరీక్షలను కూడా అడగవచ్చని భావిస్తున్నారు. జోన్ ఆధారిత ధరలను నిర్ణయించడం బావుంటుందని మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఎండీ ఆశిష్ మెహ్రోత్రా అభిప్రాయపడగా, నివాస ప్రాంతాల ఆధారంగా పాలసీని లోడ్ చేయడం సంక్లిష్టంగా ఉంటుందని మరో ఆరోగ్య బీమా సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతోపాటు ఢిల్లీ, దాని చుట్లుపక్కల ప్రాంతాల ఆరోగ్య బీమా పాలసీల్లో అధిక స్థాయిలో మోసపూరిత క్లెయిమ్‌లు ఎక్కువగా ఉండటంతో, ధరలను నిర్ణయించడంలో ఇది కూడా కీలకమని బీమా అధికారులు తెలిపారు. కాగా దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో మరోసారి కాలుష్య పొట దట్టంగా ఆవిరించింది. బుధవారం దట్టమైన కాలుష్య పొర నగరాన్ని కమ్మేసింది. కాలుష్య స్థాయిలు ప్రమాద స్థాయికి చేరడంతో నగర మున్సిపాలిటీ విభాగం (ఎన్ఎండీసీ) చెట్లపై నీళ్లను చల్లడం లాంటి ఉపశమన చర్యలను చేపట్టింది. Delhi: New Delhi Municipal Council (NDMC) sprinkles water in the area around Feroz Shah Road to settle the dust, as a pollution control measure. pic.twitter.com/1njTooN6X0 — ANI (@ANI) November 13, 2019 -
‘పల్లె కల్లు.. పట్నం దాకా’
సాక్షి, జగిత్యాల: గ్రామాల్లో ఈత, తాటి కల్లును అమ్ముకుని, ఆయా గ్రామాల్లోని గీత కార్మికులు జీవనం సాగిస్తుంటారు. కాని ప్రస్తుతం గ్రామాల్లో ఈత, తాటి చెట్లు తగ్గుతుండటంతో, పాటుగా కొన్ని రకాల తెగుళ్లు వ్యాపించి ఉన్న చెట్లు సైతం కల్లుగీతకు పనికి రాకుండా పోతున్నాయి. దీంతో, గీత కార్మికులకు ఉపాధి దొరకక రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కల్లుగీతపైనే ఆధారపడిన గ్రామాల్లో గీత కార్మికుల సంఘాల తరుపున భూములు కొనుగోలు చేయడం లేదా ప్రభుత్వ భూములను లీజు ప్రతిపాదికన తీసుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వ సహాకారంతో వినూత్న పద్ధతిలో ఈత వనాలు పెంచేందుకు ప్రయత్నిస్తూ విజయవంతమవుతున్నారు. జిల్లాలో తొలుత నాగులపేట సంఘం జగిత్యాల జిల్లాలో తొలుత కోరుట్ల మండలంలోని నాగులపేట గీత కార్మిక సంఘం ఈత వనాల పెంపకంలో ఇతర గ్రామాల గీత కార్మికులకు ఆదర్శంగా మారారు. ఆ గ్రామంలో 70 మంది గీత కార్మికులు కల్లుగీతపైనే ఆధారపడతారు. ఈత వనాల సంఖ్య తగ్గిపోవడంతో, గ్రామంలో ఓ 20 ఎకరాల వరకు కొనుగోలు చేసి, ఈత వనాన్ని ఓ పద్ధతి ప్రకారం మూడేళ్లుగా పెంచి, నాలుగవ ఏడాది నుంచి కల్లు గీస్తూ ఉపాధి పొందుతున్నారు. మొక్కల నర్సరీ నుంచి మంచి నాణ్యమైన ఈత మొక్కలను తీసుకుని 4 5 పద్ధతిలో నాటారు. నాటే ముందు డీఏపీ వంటి ఎరువులను వాడారు. ఎప్పటికప్పుడు కింది కొమ్మలను కత్తిరించి, ప్రతీ ఏటా ఎరువులు వేస్తూ కల్లు దిగుబడిని తీస్తున్నారు. మొక్కలను పెట్టిన సమయంలో నీటి ఎద్దడికి గురికాకుండా ఓ కూలీ మనిషిని పెట్టి విజయవంతంగా ఈతవనాన్ని పోషించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఇందులో 2500 వరకు ఈత చెట్లు ఉన్నాయి. రెండో గ్రామంగా అంతర్గాం సంఘం ఆదర్శం జగిత్యాల మండలంలోని అంతర్గాం గీత కార్మికులు మాజీ జెడ్పీటీసీ జితేందర్‌రావు నేతృత్వంలో నాగులపేట ఈతవనాన్ని సందర్శించి, మూడేళ్ల క్రితం వీరు సైతం ఈత వనాన్ని పెంచారు. వీరు మరింత ముందడుగు వేసి డ్రిప్ ద్వారా సాగు నీటితో పాటు ఎరువులను కూడా అందిస్తున్నారు. దాదాపు 100 మంది సంఘ సభ్యులు, దాదాపు 5వేల మొక్కలను, 9‘‘9 పద్ధతిలో 8 ఎకరాల్లో నాటారు. ఒక్కో మొక్కకు రూ.25 చొప్పున సంగారెడ్డిలోని నర్సరీల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. దాదాపు మూడేళ్ల క్రితం ఈత మొక్కలను నాటగా, ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. మరో ఏడాదిలో కల్లు గీతకు వచ్చే అవకాశం ఉంది. పక్కకు చెరుకు కట్ట ఉండగా, ఆ కట్టకు సైతం ఈత మొక్కలను నాటారు. నాటేందుకు ముందు కోళ్ల ఎరువును వేయగా, యూరియా, పొటాష్‌ను డ్రిప్ ద్వారా నేరుగా మొక్కల మొదళ్ల దగ్గర పడేలా చేశారు. అలాగే ఈత వనంలో కలుపు మొక్కలు పెరగకుండా ట్రాక్టర్‌తో అంతర కృషి చేస్తున్నారు. పలువురు ప్రముఖుల సందర్శన అంతర్గాం గీత కార్మికులు పెంచిన ఈతవనాన్ని ఇప్పటికే అప్పటి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పరిశీలించి, ఇతర గ్రామాల్లో సైతం డ్రిప్ ద్వారా ఈత వనం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం విశేషం. అలాగే ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డితో పాటు మంత్రి హరీష్‌రావు సూచన మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని గీత కార్మికులు సైతం అంతర్గాంలోని ఈతవనాన్ని పరిశీలించి వెళ్లారు. ఈ రెండు గ్రామాల్లోని ఈత వనాలను చూసిన గీతకార్మికులు, జగిత్యాల మండలంలోని మోతె, జగిత్యాల, అంతర్గాం, అంబారిపేట గీత కార్మికులు ఈతవనాన్ని పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం గమనార్హం. పల్లె కల్లు పట్నం కోసం.. ఈత చెట్ల నుంచి వచ్చే కల్లును మార్కెటింగ్ చేసేందుకు కూడా గీతకార్మికులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇక అమ్మగా, మిగిలిపోయిన ఈత కల్లును పట్నం పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఒక్కో ఈత చెట్టుకు కనీసం 5 లీటర్ల కల్లు వస్తుంది, 5వేల ఈత చెట్లకు 25వేల లీటర్ల కల్లు వస్తుంది. ఇంత కల్లు గ్రామంలో కాని, సమీప పట్టణ ప్రాంతాల్లో కాని అమ్ముడు పోదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో అంతర్గాం కల్లు హైద్రాబాద్ పట్నానికి పంపేలా సైతం ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు చేస్తున్నారు. దీనివల్ల గీత కార్మికులకు మంచి అదాయం రావడమే కాకుండా, రుచికరమైన నాణ్యమైన ఈత కల్లు ఈత కల్లు తాగే ప్రియులకు వరంగా మారనుంది. కార్యక్రమం వల్ల ఇరువర్గాలకు సైతం లాభం చేకూరనుంది. మా ఈత వనాన్ని చూసి వెళ్లారు కొన్నేళ్లుగా మా సంఘం భూమి వృథాగా ఉండటంతో, మూడేళ్ల క్రితం ఈత వనాన్ని పెంచాం. ఈత వనాన్ని పెంచడం వల్ల మా సంఘంలోని 100 మంది సభ్యులకు ఉపాధి దొరికే అవకాశం ఏర్పడింది. మా ఈత వనాన్ని చూసి చాలామంది గౌడ కులస్తులు మా బాటలో ఈత మొక్కలను పెంచేందుకు ముందుకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. – గొడిసెల శంకర్ గౌడ్ , గౌడ సంఘం నాయకుడు, అంతర్గాం -
ఊరు వలసబాట..
సాక్షి, వేమనపల్లి: ఉన్న భూములు అటవీ వివాదంలో ఉన్నాయి.. చేద్దామంటే పనులు లేవు.. తిందామంటే తిండికి లేదు,. వారికి వేరే ఉపాధి లేక రాజారం ఊరు వలస బాట పట్టింది. అందురు పనుల కోసం పట్నం బోతే ఇంటివద్ద ఉన్నోళ్లు చీపుర్ల కోసం అడవిబాట పడుతున్నారు. అక్కడ దొరికే చీపురు పుల్లలను సేకరించి, చీçపుర్లను తయారు చేసి వాటిని విక్రయించిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. రాజారం గ్రామంలో మొ త్తం 88 కుటుంబాలున్నాయి. వీటిలో 56 కుటుంబాలు గత 15 రోజుల నుంచి మంచిర్యాలకు వలస వెళ్తూనే ఉన్నారు. ఇక ఇంటి వద్ద ఉండే ముసలివారు చీపురు పుల్లల సేకరణను ఉపాధిగా ఎంచుకున్నారు. వరి కోతలు, పత్తి తీయడం పనులు మొదలయ్యేదాక వీరికి ఈ పనే ఆధారం. తెల్లవారకముందే సద్ది మూట పట్టుకుని అడవిబాట పడుతారు. వన్యమృగాల భయాన్ని లెక్క చేయకుండా చెట్టూ పుట్టా తిరిగి చీపురు పుల్లలు సేకరిస్తున్నారు. వాటిని ఇంటికి తెచ్చి ఎండలో ఆరబెట్టి వాటిని కట్టలుగా కడుతారు. సమీప గ్రామాల్లో తిరిగి రూ.20 లకు కట్ట చొప్పన అమ్మి జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా కష్టపడి చీపురు పుల్లలు ఏరినా.. సరైన కూలీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేలని భూవివాదం.. రాజారం గిరిజనులు భూముల్లేని పేదలు కాదు. చీపురు సేకరణ, వలసలు వెళ్లటమే వీరికి ప్రధానాధారం కాదు. గోదుంపేట శివారులో ఉన్న వీరి భూములు అటవీ వివాదంతో తుడిచిపెట్టుకు పోయాయి. ఈ శివారులో 54 కుటుంబాలకు సాగు భూములున్నాయి. గత 20 ఏండ్ల క్రితమే ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఐటీడీఏ సహకారంతో బోర్లు వేసి మామిడి చెట్లు పెంచి ఉపాధి చూపింది. గత 8 సం.లుగా ఆ భూమిపై అటవీ అధికారుల బెదిరింపులు మొదలయ్యాయి. దీం తో భూములను వదిలిపెట్టడంతో వీరు ఉపాధి కోల్పొయి కూలీలుగా మారారు. గత మూడు నెలల క్రితం మా భూములు మాగ్గావాలని గిరిజనులు ఉద్యమానికి సిద్దమయ్యారు. భూముల వద్దకు వెళ్లి సాగు చేసేందుకు అరకలు కట్టారు. దీంతో అటవీ, పోలీస్ అధికారులు 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆగాలని స్వయంగా జిల్లా కలెక్టర్ సూచించడంతో గిరిజను లు శాంతించారు. పల్లెల్లో వరి కోతలు, పత్తి సేకర ణ పనులు ప్రారంభం కాకపోవడంతొ కడుపు నిండే మార్గం లేక మంచిర్యాలలోని పలు ప్రాం తాలకు ఇటుక పనికి వెళ్తున్నారు. ఇంటి వద్ద ఉన్న వారు చీపుర్లను అమ్ముకుంటు ఉపాధి పొందుతున్నారు. మేం బతుకుడెట్ల.. మాకు గోదుంపేట శివారులో భూములు ఉన్నా యి. కానీ అటవీఅధికారులు సాగు చేయకుండా బెదిరిస్తున్నారు. ఇగ మేం బతుకుడెట్ల. అందరం మంచిర్యాల ఇటుక ప నులకు పోతె ఇంటి కాడున్నోళ్లు చీపురు ఏరేందుకు పోతాండ్లు. – బుర్సమాంతయ్య రాజారం ఊళ్లో ఉపాధి లేదు.. మాకు ఊళ్ల వేరే ఉపాధి లేదు. ఇగ ఏం పనిజేసుడు. మేమంతా ఇటుక పనికి పోతె ఇంటి కావలికి ముసులోళ్లు ఉంటుర్రు. ఆళ్లకు బువ్వ ఎట్ల, ఉపాసం ఉండలేక చీపురుపుల్లలు ఏరేందుకు పోతుల్లు. వాటితో వచ్చిన పైసలతోని బియ్యం, సామాన్లు కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు. – నాయిని చంద్రు -
నగరాల్లో నరకయాతన!
సాక్షి, అమరావతి: నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ పడకేశాయి. కాంట్రాక్టు పొందిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పలుకుబడి ఉండడంతో అధికారులు వారిని ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో ఏళ్ల తరబడి సాగుతున్న ఈ పనుల కారణంగా ప్రజలు నరకం చూస్తున్నారు. మరోవైపు.. పనుల్లో ప్రగతి చూపించేందుకు నిర్మాణ సంస్థలు తేలిక పనులను ముందుగా చేపట్టి షో చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నంలో రక్షిత మంచినీటి పథకాలు, భూగర్భ మురుగునీటి పారుదల, రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం వద్ద పలుకుబడి కలిగిన కొన్ని నిర్మాణ సంస్థలు ఇతరులెవరూ ఆ టెండర్లలో పాల్గొనకుండా చేసుకున్నాయి. తమకు అనుకూలమైన మరో నిర్మాణ సంస్థను టెండరులో పాల్గొనే విధంగా చేసి, దానికంటే తక్కువ రేటుకు టెండర్లు దక్కించుకున్నాయి. స్ధానిక ప్రజాప్రతినిధుల వత్తిడి నుంచి తప్పించుకునేందుకు తేలిక పనులను చేపట్టి వాటిని సాగదీస్తున్నాయి. పెద్ద పనులను కొన్నిచోట్ల అసలు ప్రారంభించనేలేదు. రూ.3,000 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న పెద్ద సంస్థలు వాటిని చేపట్టకపోవడంతో అక్కడి ప్రజలు నిత్యం నరకాన్ని చవిచూస్తున్నారు. ఉదాహరణకు.. ► విజయవాడలో ప్రస్తుతం 83 కిలోమీటర్ల నిడివిలో మేజర్ డ్రెయిన్లు, 258 కి.మీ. నిడివిలో మీడియం, 982 కి.మీ. నిడివిలో మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటి వెడల్పు 18 అడుగుల నుంచి 12 అడుగుల వరకు మొదట్లో నిర్మించారు. పెరిగిన జనాభా, పూడిపోయిన డ్రెయిన్లను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లతో స్ట్రామ్‌వాటర్ డ్రైనేజి పనులకు టెండర్లు ఆహ్వానించింది. 440 కి.మీ. నిడివిలో డ్రెయిన్లు నిర్మించేందుకు ఓ పెద్ద సంస్థ టెండర్లు దక్కించుకుంది. రెండేళ్ల కిందట పనులు ప్రారంభమైనా ఇప్పటివరకు ఇంకా 40 కి.మీ. మేరే పనులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు పొందిన సంస్థ సబ్‌కాంట్రాక్టులకు ఇచ్చినా ఉపయోగం లేకపోయింది. వారి వద్ద డ్రెయిన్ల నిర్మాణాలకు అవసరమైన పరికరాలు లేకపోవడంతో పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ఇలా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక.. వర్షాలు పడితే ఆ ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. ► అలాగే, గుంటూరు నగరంలోని భూగర్భ డ్రైనేజి పనులు కూడా స్థానికులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. రూ.903.82 కోట్ల విలువైన ఈ పనులను మరో బడా సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రెండేళ్ల క్రితం తేలికగా జరిగే పైప్‌లైన్ పనులను ప్రారంభించింది. మొత్తం 1083 కిలోమీటర్ల నిడివిలో పైప్లైన్లు వేయాల్సి ఉంటే ఇప్పటివరకు కేవలం 200 కి.మీ.ల మేర మాత్రమే పనులు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. పైపులు వేసేందుకు తవ్విన మట్టిని రోడ్లపైనే వదిలివేయడంతో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ప్రజాప్రతినిధులు, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పనులపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వానికి అందించినా పనుల్లో వేగం పెరగలేదు. ఎస్టీపీ, ఆర్సీసీ సీవర్లైన్లు, మ్యాన్‌హోల్స్ వంటి ఇతర ముఖ్య పనుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. 126 ఎంఎల్డి సామర్ధ్యం కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించాల్సి ఉంటే ఇప్పటివరకు 10 శాతంలోపే పనులు జరిగాయి. ► నెల్లూరు నగరంలోనూ రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల పనులకు పిలిచిన టెండర్లలో అక్రమాలు జరిగినట్లు విమర్శలు వచ్చాయి. ప్రజారోగ్యశాఖ ఇంజినీర్లు రక్షిత మంచినీటి సరఫరాకు రూ.495.27 కోట్ల విలువైన పనులకు పిలిచిన టెండర్లలో నిర్మాణ సంస్థలు రింగ్ అయ్యాయని, అంచనా విలువపై 3.95 శాతం అధికంగా రేటుకు ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో ప్రజలపై రూ.19.50 కోట్ల భారం పడింది. అలాగే, రూ.519.15 కోట్ల విలువైన భూగర్భ మురుగునీటి పారుదల పనులకు జనవరిలో ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా ఇంకో ముఖ్యమైన సంస్థ 8.8 శాతం (రూ.564.84 కోట్లు) అధిక రేటుకు టెండరును దక్కించుకుంది. దీంతో ప్రభుత్వంపై రూ.45.68 కోట్ల భారం పడింది. ► ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రక్షిత మంచినీటి సరఫరాకు రూ.39 కోట్లు, మురుగు నీటిపారుదలకు రూ.72 కోట్లతో పిలిచిన పనుల్లోనూ ప్రగతి నామమాత్రంగానే ఉంది. ఇలా.. ప్రధాన నగరాల్లో జరుగుతున్న పనుల్లో నెలకొంటున్న జాప్యం కారణంగా ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం వద్ద పలుకుబడి కలిగిన ఈ సంస్థలపై చర్యలు తీసుకునేందుకు, కనీసం వాటికి వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి కూడా ఇంజినీర్లు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఒక్కసారి కూడా ఈ పనుల పురోగతిని సమీక్షించిన పాపాన పోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘వావ్’: రూ.13 వేలకే అమెరికా టికెట్
సాక్షి, న్యూఢిల్లీ: ఐస్లాండ్కు చెందిన విమానయాన సంస్థ ‘వావ్ ఎయిర్’ భారత విమాన ప్రయాణీకులకు బంపర్ ఆపర్ ఇస్తోంది. త్వరలోనే భారత్‌లో కార్యకలాపాలకు రెడీ అవుతోంది. డిసెంబర్ నుంచి ఢిల్లీ నుంచి రెక్జావిక్ (ఐస్లాండ్ రాజధాని) మీదుగా ఉత్తర అమెరికా, యూరప్‌లలోని వివిధ ప్రాంతాలకు సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించింది. రెక్జావిక్లోని కెఫ్లావిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఉత్తర అమెరికా, యూరప్‌లోని ఇతర ప్రాంతాలకు తన సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్, చికాగో, టొరొంటోలాంటి 15నగరాలకు విమాన సేవలను అందించనున్నట్టు చెప్పారు. అతి తక్కువ ధరల్లో రూ.13,499 బేసిక్ ఫేర్‌తో (పన్నులు సహా) టికెట్‌ను (వన్‌వే ప్రయాణానికి) ఆఫర్ చేస్తున్నామని వావ్ పేర్కొంది. అయితే ఈ ధరకు బ్యాగేజ్ చెకింగ్, ఫుడ్ ఖర్చులు అదనమని తెలిపింది. అలాగే ప్రీమియం టికెట్ ధర రూ.46,599 నుంచి ప్రారంభమౌతుందని వావ్ ఎయిర్ ఫౌండర్, సీఈవో స్కల్ మోజెన్సెన్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీనుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ద్వారా సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ మేరకు వారానికి ఐదు స్లాట్లు పొందేందుకు ఇప్పటికే జీఎంఆర్‌తో డీల్ కుదుర్చుకున్నట్టు చెప్పారు. ప్రతి రోజు ఇండియా, ఉత్తర అమెరికా మధ్య సుమారు 20వేల మంది ప్రయాణిస్తారనీ, ఇంత భారీ డిమాండ్ ఉన్న భారత్‌లో తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను అందిస్తున్న మొట్టమొదటి ఎయిర్‌లైన్స్ తమదేనని మోజెన్సెస్ చెప్పారు. చమురు ధరలు 100 డాలర్లు దాటిపోయినా తమకు ఎలాంటి ఆందోళనలేదని పేర్కొన్నారు. -
నాణ్యమైన జీవితానికి ఈ నగరాలు..!!
హైదరాబాద్ : ప్రపంచంలో పౌరులకు అత్యంత నాణ్యమైన జీవితాన్ని ఇస్తున్న నగరాల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నా వరుసగా తొమ్మిదో సారి తొలిస్థానంలో నిలిచింది. మెర్సర్ అనే కన్సల్టింగ్ కంపెనీ చేసిన సర్వేలో వియన్నా ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని ఇస్తున్నట్లు తేలింది. కాగా, ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగర ప్రజలు అత్యంత నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారని సర్వే పేర్కొంది. మెర్సర్ చేసే సర్వే ఆధారంగా కంపెనీలు ఏటా అంతర్జాతీయ కార్మికులకు అలవెన్సులు అందజేస్తాయి. రాజకీయ స్థిరత్వం, ఆరోగ్యం, విద్య, నేరాలు, రవాణా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని 231 నగరాలపై మెర్సర్ అధ్యాయనం చేసింది. ప్రపంచంలో నాణ్యమైన జీవితాన్ని అందిస్తున్న టాప్ 10 నగరాల్లో యూరప్ ఖండంలో ఎనిమిది ఉన్నాయి. జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో మూడేసి నగరాలు, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఒక్కో నగరం టాప్ టెన్‌లో నిలిచాయి. వియన్నా తర్వాత జ్యురిచ్(రెండో స్థానం), ఆక్లాండ్, మ్యూనిచ్లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ఉత్తర అమెరికా ఖండంలోని వాంకోవర్ ఐదో స్థానంలో నిలిచింది. 25వ స్థానంలో నిలిచిన సింగపూర్ ఆసియా ఖండంలో ప్రజలకు అత్యుత్తమ జీవితాన్ని అందిస్తోంది. 89వ స్థానంలో నిలిచిన డర్బన్ ఆఫ్రికా ఖండంలో అత్యుత్తమ జీవితాన్ని ఇస్తున్న నగరంగా నిలిచింది. -
ఫిట్నెస్ నగరాలు ఇవే..
న్యూఢిల్లీ: దేశంలో ఫిట్‌నెస్‌పై అధిక అవగాహన ఉన్న నగరాలుగా గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ నిలిచాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ నగరాల్లోని ప్రజలు రోజుకు 340 కేలరీలు ఖర్చు చేయటంతో పాటు నెలలో సగటున 10 రోజులు కసరత్తులు చేస్తున్నారని వెల్లడైంది. దేశంలోని 220 పట్టణాల్లో సుమారు 30.6 లక్షల మందికి సంబంధించిన ఆహారపు అలవాట్లు, వ్యాయామ సమాచారాన్ని మొబైల్ ఫిట్నెస్ యాప్ ‘హెల్తీఫైమ్’ సేకరించింది. ఈ జాబితాలో కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్‌లు చివరి స్థానాల్లో నిలిచాయని, ఇక్కడ పురుషుల కంటే మహిళలే ఫిట్‌నెస్‌పై అధిక శ్రద్ధ కనబర్చుతున్నారని పేర్కొంది. దేశంలో మహిళల కంటే పురుషులే ఫిట్నెట్పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని వెల్లడించింది. పురుషులు నెలలో సగటున 14 రోజులు, మహిళలు 11 రోజులు వ్యాయామం చేస్తున్నారని పేర్కొంది. -
ప్రపంచ ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి
సాక్షి, అమరావతి/తుళ్లూరు రూరల్: ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలుపుతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఇంజనీర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. శుక్రవారం విజయవాడలో రూ. 101 కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ ఐదంతస్తుల భవన సముదాయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధిలో రహదారులు, భవనాల శాఖదే కీలక పాత్ర అన్నారు. జిల్లా కలెక్టరేట్లను ఆధునీకరించి జిల్లాల్లో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండేలా భవన సముదాయాలు చేపట్టే ఆలోచన ఉందన్నారు. నూతనంగా నిర్మించే సచివాలయంలో మంత్రులు, సంబంధిత కార్యదర్శులు, విభాగాధిపతులు అంతా ఒకే చోట ఉండేలా రెండు మూడు టవర్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పీపుల్స్ హబ్ ఏర్పాటు చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, ఉమా మహేశ్వరరావు, రవీంద్ర, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేతా తదితరులు పాల్గొన్నారు. భూములకు యునిక్ ఐడీ: ప్రతి ఒక్కరికీ ఆధార్ నంబర్ కేటాయించినట్టుగా, రాష్ట్రంలోని భూములకు త్వరలో యునిక్ ఐడీ నంబరు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భూసేవ కార్యక్రమంలో భాగంగా ఈ నంబర్లు కేటాయిస్తారని చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల్లో ఐటీ, ఐవోటీ, ఇ–ప్రగతి అమలు తీరును సీఎం సమీక్షించారు. ప్రస్తుతం అందుబాటులో వున్న డిజిటలైజ్డ్ ఫీల్డ్ మ్యాప్ బుక్ (ఎఫ్ఎంబీ) వంటి సమాచారంతో భూసేవకు రూపకల్పన జరుగుతుందన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 20 సేవల్ని అనుసంధానించి భూసేవ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటికే ఎనిమిది సేవల అనుసంధానం పూర్తయిందని చెప్పారు. జగ్గయ్యపేట మండలంతో పాటు ఉయ్యూరు మునిసిపాలిటీలో భూసేవ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, వచ్చే నెలాఖరు కల్లా అది పూర్తవుతుందని తెలిపారు. డిజిటల్ తరగతుల ప్రారంభం: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులను శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులతో కలసి వర్చువల్ తరగతులను నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డిజిటల్ తరగతుల వల్ల విద్యార్థులకు పాఠాలు వేగంగా అర్థమవుతాయని తెలిపారు. ప్రతి ఇంటికీ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ ఇస్తామని, తద్వారా విద్యార్థులు పాఠశాలకు రాలేనపుడు ఇంటి వద్ద ఉండే పాఠ్యంశాలను చూడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్టీజీ సీఈఓ బాబు, విద్యాశాఖ కమిషనర్ సం«ధ్యారాణి, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన నటుడు సురేష్‌గోపి మలయాళ సినీ నటుడు సురేష్‌గోపి శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. కేరళలో జరిగే ‘జాతీయ బనానా ఫెస్టివల్’కు సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సురేష్‌గోపి మీడియాతో మాట్లాడుతూ.. 2018 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు త్రివేండ్రంలో బనానా ఫెస్టివల్ జరుగుతుందని, దీనికి చంద్రబాబును ఆహ్వానించినట్లు చెప్పారు. -
ప్రమాదంలో ఉత్తర భారత నగరాలు
సాక్షి, న్యూఢిల్లీ : శత్రుదేశాల భయంకన్నా.. వాతావరణ కాలుష్యమే భారతీయ నగరాలను భీకరంగా వణికిస్తోంది. పాకిస్తాన్ అణు దాడికన్నా గాలి కాలుష్యమే భారతీయులను దారుణంగా పొట్టన పెట్టుకునేలా ఉంది. దేశం రాజధానిలో ఆవరించిన పొగమంచు, కాలుష్యం అందరికీ తెలిసిందే. ఇదొక్క ఢిల్లీకే పరిమితం కాకుండా పలు ఉత్తర భారతీయ నగరాలపై పంజా విసురుతోంది. నగరాలు.. కాలుష్య కాసారాలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు, పట్నా, కాన్పూర్, లక్నో, మొరాదాబాద్, జైపూర్, హౌరా వంటి నగరాలపై వాయు కాలుష్యం పడగలు చాస్తోంది. గత మంగళవారం నాడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 448 సూచిస్తోంది. ఇదే ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 500 తాకింది. ఆయా నగరాల్లో గాలి నాణ్యత అత్యంత కనిష్టానికి చేరింది. గడచిన వారం రోజులుగా మొరాబాదాబద్లో గాలి నాణ్యత 450 నుంచి 500 మధ్యలోనే ఉంటోంది. భయపడాల్సిన పని లేదు మరో వారం రోజుల్లో ఢిల్లీ, మొరాదాబాద్ నగరాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. వాయు కాలుష్యాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదపు అంచుల్లో నగరాలు గంగాతీర మైదానంలో ఉన్న ఉత్తర భారత ప్రధాన నగరాలపై వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని నాసా తెలిపింది. ప్రధానంగా లక్నో, ఆగ్రా, కాన్పూర్, ముజఫర్‌పూర్, పట్నా వంటి నగరాలపై వాము కాలుష్య ప్రభావం అత్యంత తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. -
బేటీ బచావో..
పిల్లల లింగ నిష్పత్తిలో నగరాల వెనుకబాటు ► నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మెరుగు ► ప్రతి వెయ్యి మంది బాలురకు ముంబైలో 852 మంది బాలికలే.. ఢిల్లీలో అయితే 832 మందే.. ► హైదరాబాద్‌లో కాస్త మెరుగ్గా 942 మంది అమ్మాయిలు మూఢనమ్మకాలు.. అమ్మాయిలకు వ్యతిరేకంగా పాతుకుపోయిన పక్షపాత వైఖరి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ–పురుష నిష్పత్తి తక్కువని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ.. వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉందట.. గ్రామాల్లోకంటే పట్టణాల్లో పిల్లల లింగ నిష్పత్తి దయనీయంగా ఉందట. దేశంలోని ముంబై, ఢిల్లీ సహా అతిపెద్ద నగరాల్లో బాలబాలికల నిష్పత్తిలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయట. 2011లో ప్రభుత్వ గణాంకాల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ముంబై, ఢిల్లీల్లోనూ దారుణం.. 2011లో ముంబైలో 0–6 సంవత్సరాల మధ్య ప్రతి వెయ్యి మంది బాలురకు.. 852 మంది బాలికలే ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఢిల్లీలో 832 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. భాగ్యనగరంలో ప్రతి వెయ్యి మంది బాలురకు.. 942 మంది బాలికలు ఉన్నారని కన్యా.లైఫ్ అనే వెబ్సైట్ వెల్లడించింది. అమెరికాకు చెందిన హైస్కూల్ విద్యార్థి తరుణ్ అమర్నాథ్.. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం నుంచి సేకరించిన.. అలాగే బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేసి తాను రూపొందించిన కన్యా.లైఫ్ వెబ్సైట్లో పొందుపరిచారు. 2011 జనాభా లెక్కల్లో సేకరించిన సమాచారం ఆధారంగా దేశంలోని 500 నగరాల్లో ఈ అధ్యయనం జరిగింది. మహెసానాలో అత్యంత ఘోరం 2011 గణాంకాల ప్రకారం.. గుజరాత్‌లోని మహెసానాలో పిల్లల లింగ నిష్పత్తి అత్యంత దయనీయంగా ఉందని వెల్లడైంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు ఉన్న బాలికల సంఖ్య 762 మాత్రమే. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 772, మోడీనగర్‌లో 778, పశ్చిమబెంగాల్లోని ఇంగ్లిష్ బజార్లో 781 మంది బాలికలు ఉన్నారు. ఇక పశ్చిమబెంగాల్లోని బల్లీలో బాలుర కంటే బాలికల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక్కడ ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,185 మంది బాలికలు ఉన్నారు. అస్సాంలోని నాగావ్‌లో 1,043, తమిళనాడులోని తాంబరంలో 1,019 మంది బాలికలు ఉన్నారు. సమతుల్యత ప్రకృతి సిద్ధ ప్రక్రియ సాధారణంగా పిల్లల లింగ నిష్పత్తి పుట్టిన సమయంలో ప్రతి వంద మంది బాలికలకు 102–106 మంది బాలురుగా ఉంటుంది. ఇది వెయ్యి మంది బాలురుగా పరిగణనలోకి తీసుకున్నట్లయితే 943–980 మంది బాలికలుగా మారుతుందని లింగ పరమైన అంశాలపై పనిచేసే పలు సంస్థలు చెపుతున్నాయి. ప్రతి వెయ్యి మంది బాలురకు, వెయ్యి మంది బాలికలు ఉండరని, ఎందుకంటే పెరుగుతున్న సమయంలో అబ్బాయిల మరణాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, లింగ నిష్పత్తి సమతుల్యత సాధించేందుకు ఇది ప్రకృతి సహజసిద్ధ ప్రక్రియ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వివక్ష, భ్రూణహత్యల వల్లే.. సాధారణ నిష్పత్తి అయిన 943–980 కంటే బాలికల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే బాలికలపై వివక్ష.. ఆడ శిశుభ్రూణ హత్యలు.. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించడం వంటివి కొనసాగుతున్నట్లే. పిల్లల లింగ నిష్పత్తిలో వ్యత్యాసాల కారణంగా 2031 నాటికి దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు.. 936 మంది స్త్రీలే ఉంటారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇది 1951లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 946 మహిళలు ఉండేవారని పేర్కొంది. సగటు పిల్లల లింగ నిష్పత్తి ఈ 500 నగరాల్లో 902గా ఉంది. ఇదే సమయంలో గ్రామాల్లో సగటున ప్రతి వెయ్యి మంది పురుషులకు 923 మంది స్త్రీలు ఉండటం గమనార్హం. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
ప్రపంచ నగరాలు విస్తరించిన వైనం
న్యూయార్క్: ప్రపంచంలో తొట్టతొలి నగరం ఏదీ? ఎక్కడ పుట్టింది. ఆ తర్వాత నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించాయి? అన్న అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ ఆరువేల సంవత్సరాల్లోనే అంటే, క్రీస్తు పూర్వం 3,700 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 2,000 సంవత్సరం మధ్య ప్రపంచవ్యాప్తంగా నగరాలు విస్తరించాయంటూ శాస్త్రవేత్తలు సూత్రీకరించి మ్యాపింగ్ కూడా చేశారు. ప్రపంచ నగరాల విస్తరణపై తాజాగా జరిపిన అధ్యయన వివరాల ఆధారంగా ‘మ్యాక్స్ గాల్కా’ బ్లాగర్ డిజిటల్ ద్వారా వీడియో మ్యాపింగ్‌ను రూపొందించారు. ప్రాచీన మెసపటోనియా నాగరికతకు చెందిన సుమరియన్లు నివసించిన ‘ఇరిదు’, దాని పక్కనే ఉన్న ‘ఉరుక్’ నగరాలను ప్రపంచంలోనే తొలి నగరాలుగా పిలుస్తారు. ఉరుక్ తొలి నగరం అని చెప్పడానికి డాక్యుమెంట్ ఆధారాలు ఉన్నాయని, అంతకుముందే ఇరిదు నగరం ఉన్నట్లు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ అది నగరం స్థాయికి ఎదగలేదనే వాదన ఉండేది. అయితే శాస్త్రవేత్తలు తాజా అధ్యయంలో ప్రపంచ తొలి నగరంగా ఇరిదుకే ఓటేశారు. నగరం అంటే ఏమిటీ భారత్ లాంటి దేశాల్లో పట్టణాలని పిలిచే వాటిని తొలినాళ్లలో నగరాలని పిలిచేవారు. ఎల్తైన భవనాలుండడమే కాకుండా, జనాభాతోపాటు జన సాంద్రత ఎక్కువ ఉండి, పారిశుద్ధ్య సౌకర్యాలు, పాలనా వ్యవస్థలు, ప్రజలందరికి వర్తించే చట్టం అమల్లో ఉన్న పెద్ద గ్రామాలను నగరాలని పిలుస్తారు. ప్రపంచంలో బిబ్లోస్, జెరిచో, డమస్కస్, అలెప్పో, జెరూసలెం, సిడాన్, ల్యూయాంగ్, ఏథెన్స్, ఆర్గోస్, వర్సాని తొలినాళ్లలో ఏర్పడిన నగరాలు. తొలినాళ్లలో మెసపటోమియా, నైలునది పరిసర ప్రాంతాలకే నగరాలు పరిమితమయ్యాయి. ఆ తర్వాత నగరాలు క్రమంగా చైనాకు, భారత్‌కు, లాటిన్ అమెరికా ప్రాంతాలకు విస్తరిస్తూ పోయాయి. 19వ శతాబ్దానికి పట్టణీకరణ అన్నది ప్రపంచీకరణగా మారిపోయింది. -
కేజ్రీవాల్ పర్యటనను నిరసిస్తూ పోస్టర్లు
-
ఊళ్లను ముంచేసిన వర్షం
-
మట్టికాళ్ల మహా నగరాలు
ఏ నగరంలోనైనా ఆవశ్యకంగా, తగినంతగా అందుబాటులో ఉండాల్సినవన్నీ పట్టణ ప్రాంతాల లోటుపాట్ల జాబితాలోకి చేరుతాయి. రవాణా, రోడ్లు, పాద చారుల బాటలు, మార్కెట్లు ఇలా దాదాపు ప్రతిదీ సమస్యాత్మకమే. ఈ ఫిబ్రవరిలో లాతూరులో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో మన రైల్వేలు మీరజ్ నుంచి 100కు పైగా నీటి రైళ్లను నడి పాయి. తర్వాత, హఠాత్తుగా శుభవార్త వచ్చింది. వానలు కురిసి లాతూరు మంచినీటి అవసరాలను తీర్చే రెండు నీటి వనరులు పూర్తిగా నిండాయి. నీటి సంక్షోభం ‘దాదాపుగా ముగిసి పోయింది’ అని మునిసిపల్ అధికారులు ఆనందంగా చెప్పారు. నీటి ఎద్దడి ఆ నగరపు సామాజిక, ఆర్థిక జీవి తాన్ని కల్లోలపరిచింది. దీంతో తిరిగి ‘సాధారణ’ జీవితం గడపవచ్చని అంతా అశగా ఎదురు చూశారు. అయితే ఈ ‘శుభవార్త’కు మరో భయపెట్టే కోణం కూడా ఉంది. ‘‘15 రోజులకు ఒకసారి చొప్పున అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా కావడం ప్రారంభం అవు తుంది. ‘ఇది ఇంతవరకు అనుసరిస్తున్న పద్ధతి, లాతూరువాసులు దీనికి అలవాటు పడ్డారు. రెండు గంటలకుపైగా నీటిని సరఫరా చేస్తాం. ఆ నీటిని ప్రజలు ఇళ్లలోని చిన్న ట్యాంకులలోనూ, పాత్రలు, తదితరాలలో దాచుకుంటారు. ఆ నీరు 15 రోజులకు సరిపోతుంది’ అని పౌర పరిపాల నాధికారులు తెలిపారు’’ అని ఇండి యన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. రెండు వారాలకు ఒకసారా? అది సాధారణమా? తాగడానికి, కడగడానికి, ఉతకడా నికి, మరుగుదొడ్లలో వాడడానికి 15 రోజులకు సరిపడా నీటిని నిల్వచేసుకోగా ఇళ్లలో మిగిలే స్థలం ఎంతో ఊహించండి. తీవ్ర పారిశుద్ధ్య సమస్యతో లాతూరు నగరం మునిగిపోకుండా మిగిలి ఉండటమే ఆశ్చర్యం. ఈ విషయం రెండు అంశాలను ప్రతిఫలిస్తోంది. ఒకటి, పట్టణ నిర్వహణా ప్రమాణాలు అధమ స్థాయిలో ఉన్నాయి. భారతదేశం పట్టణీకరణ చెందడం వల్ల పెరు గుతున్న జనాభాకు అనుగుణంగా సేవలు పెరగడం లేదు కాబట్టి ప్రమాణాలు మరింతగా దిగజారుతు న్నాయి. రెండు, పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉంటుం దని ప్రజలు ఆశించడం లేదు. మెరుగుపరచమని అధికా రులపై ఒత్తిడి తేవడం లేదు. అధికారులు, ప్రణాళికా వేత్తల నిర్లక్ష్యం, పౌరుల నిస్సహాయత కలసి దేన్నయినా సహించడంగా మనకు కనబడుతోంది. ఆవశ్యక సేవల న్నిటినీ పూర్తిగా అందించలేకపోతున్నా మనం మన పట్ట ణాలను, నగరాలను నిర్మాణంలో ఉన్నవిగా చూస్తుం డటం విచిత్రం. ఢిల్లీకి బస్తీలున్నాయి, ముంబైకి మురికి వాడలున్నాయి, అంత కంటే చిన్న పట్టణాలకు సైతం వాటికి తగ్గ మురికి ఉంది. ఈ మురికివాడలకు బయట ఉండే అస్తవ్యస్త పరి స్థితులు సుపరిచితమైనవే... మరీ ఘోరమైన రోడ్లు, నాణ్యతాపరంగా, పరిమాణంపరంగా కూడా అధ్వాన నీటి సరఫరా, నామమాత్రపు వీధి దీపాలు, కాలువ లు, నోళ్లు తెరిచి ఉండే మ్యాన్‌హోల్స్. నగరంలో ఏం ఉంటా యని ఆశిస్తారో అవేవీ నగరాల్లో కనబడవు. పట్టణంలో లేదా చిన్న పట్టణంలోనైనా పరిస్థితి ఇదే. గ్రామాలు పట్టణాలుగా, ఆ తదుపరి నగరాలుగా వృద్ధి చెందుతాయి, మునిసిపల్ కౌన్సిల్స్ కార్పొరే షన్లుగా ఉన్నత స్థాయికి చేరుతాయి. అయినా భూగర్భ నీటి పారుదల మార్గాలు మాత్రం ఉండవు. ఉన్నా, తగు రీతిలో ఘన వ్యర్థాల నిర్వహణ ఉండదు. ఈ పట్టణ ప్రాంతాలలోనే ఢిల్లీ బస్తీలు, ముంబై మురికివాడల వంటినిర్లక్ష్యానికి గురైన అథోఃప్రపంచాలూ ఉంటాయి. అయినా మన సింధూ నాగరికత ఎంతగా అభివృద్ధి చెందిన దో చెప్పుకుంటాం. ఆ నగరాల్లో ఎప్పుడూ పారే నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇంకుడు గుంతలు ఉండేవని మరచిపోతాం. పట్టణవాసులు ఈ అల్పస్థాయి ప్రమాణాలను ఎందుకు అంగీకరిస్తున్నారు, ఏళ్ల తరబడి ఈ సమస్యలు సలుపుతుండటాన్ని, మరింతగా దిగజారిపోతుండ టాన్ని ఎందుకు అనుమతిస్తున్నట్టు? నీరు పునరుత్పాద కమైనదే అయినా ఆ నీటి వనరును కనుగొని, సక్ర మంగా సంరక్షించి, సమర్థవంతమైన ఉపయోగకం కోసం తగు రీతిలో వాడుకోవాల్సి ఉన్నది, నిజమే. అయితే, ఎప్పుడో ఒకసారి ఆ వనరుకు కొరత ఏర్పడు తుంది లేదా వినాశకరమైనంత ఎక్కువగా వచ్చిపడు తుంది. కానీ కాలువలు, పారిశుద్ధ్యం మాత్రం ప్రకృతిపై ఆధారపడినవి కావు. మన పట్టణ ప్రాంతాల లోటుపాట్ల జాబితాలోకి దాదాపుగా ఏ నగరంలోనైనా ఆవశ్యకంగా, తగినంతగా అందుబాటులో ఉండాల్సినవి అన్నీ చేరు తాయి. రవాణా, రోడ్లు, పాదచారుల బాటలు, మార్కెట్లు ఇలా ప్రతిదీ సమస్యాత్మకమే. ఈ మౌలిక సదుపాయాలు కొరవడినా ‘స్మార్ట్ నగరాలు’ అని మాట్లాడటం హాస్యాస్పదం. అయినా ఈ మట్టి కాళ్లతోనే మన తలలను నక్షత్రాల మధ్య నిలపగల మని విశ్వ సిస్తాం. రెండు వారాలకు ఒకసారి నీటి సరఫరా ‘సాధా రణం’ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ( వ్యాసకర్త: మహేశ్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు) ఈ మెయిల్ mvijapurkar@gmail.com -
మానసిక రుగ్మతలు అందుకేనట!
వాషింగ్టన్: నగర జీవనానికి అలవాటుపడిన మనిషి ప్రకృతిని ఆస్వాదించడం దాదాపు మరచాడనే చెప్పాలి. అయితే ప్రకృతిలోని పచ్చదనం, తాజా గాలి దొరక్కపోవటంతో నగరవాసులు తీవ్రమైన మానసిక వ్యాధుల బారిన పడుతున్నాడని తాజా అధ్యయనంలో తేలింది. సహజ వాతావరణానికి దూరమౌతున్న కొద్దీ.. మానసిక వ్యాదులు పెరుగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను 'జర్నల్ సైన్స్'లో ప్రచురించారు. మానసికపరమైన రుగ్మతలు, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే నగరవాసికి సహజ వాతావరణం కావాల్సిందేనని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ పీటర్ ఖాన్ తెలిపారు. ముఖ్యంగా పట్టణాల్లో విస్తరించిన పరిశ్రమలు ప్రజలకు సహజ వాతావరణాన్ని దూరం చేస్తున్నాయని తెలిపారు. మానసిక రుగ్మతల నుంచి దూరంగా ఉండాలంటే పట్టణవాసులు తమ రోజువారి జీవితంలో కాస్తయినా సహజ వాతావరణంలోకి వెళ్లాల్సిందే అని పరిశోధకులు తెలిపారు. -
2025 నాటికి సూపర్ రిచ్ సిటీలు ఇవే
ప్రపంచంలోనే రిచ్చెస్ట్ సిటీ ఏది? టోక్యో, ఆ తర్వాత న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, సియోల్, లండన్, పారిస్.. ప్లీస్ హోల్డాన్! మరో పదేళ్లలో ఈ జాబితా తలకిందులు కానుంది. మోస్ట్ ఎమర్జింగ్ సిటీలుగా అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న కొన్ని నగరాలు న్యూయార్క్, లండన్, టోక్యోలను అధిగమించి 2025 నాటికి సూపర్ రిచ్ సిటీలుగా అవతరించనున్నాయి. పలు అధ్యయనాలు అనంతరం ప్రఖ్యాత మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ మెకిన్సే అండ్ కంపెనీ ఫ్యూచర్ రిచ్ సిటీల జాబితాను రూపొందించింది. ఆ జాబితాలోని ఏడు నగరాల ఫొటోలు, వివరాలు మీకోసం.. (ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) . దోహా- ఖతార్: ఇప్పటికే సంపన్న నగరంగా ఉన్న దోహా అద్భుతమైన జీడీపీ వృద్ధి రేటుతో 2025నాటికి రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా అవతరిస్తుంది. 2. బెర్గన్- నార్వే: ఎనర్జీ ఇండస్ట్రీ, షిప్పింగ్, మెరైన్ పరిశోధనల్లో తనదైన ముద్రతో నార్వే ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న బెర్గన్ మరో పదేళ్లలో సూపర్ రిచ్ సిటీ అవుతుంది. 3. ట్రొన్హెయిమ్- నార్వే: మొబైల్ టెక్నాలజీకి పుట్టినిల్లయిన ట్రొన్హెయిమ్.. నార్వేలోని మరో ముఖ్యనగరం. స్టార్ట్ అప్ ల హబ్ గా 2025లోగా ఇది ధనిక నగరంగా అవతరించనుంది. 4. హ్వాసియోంగ్- దక్షిణ కొరియా: శాంసంగ్, ఎల్ జీ, హ్యుందాయ్ కపెనీల జన్మస్థానమైన ఈ నగరం మరికొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలో ధనిక నగరం కానుంది. 5. అసాన్- దక్షిణ కొరియా: సమీప భవిష్యత్ లో గ్లోబల్ షిప్పింగ్ హబ్ గా అవతరించనున్న అసాన్ కూడా రిచ్చెస్ట్ సిటీ రేస్ లో దూసుకుపోతోంది. 6. రైన్ రుహ్ర్- జర్మనీ: యూరప్ లోని అతిపెద్ద నగరాల్లో మూడో స్థానం(ఫస్ట్ లండన్, సెకెండ్ పారిస్) లో ఉన్న జర్మన్ మెగాసిటీ రైన్ రూహ్ర్ ధనిక నగరంగా అవతరించడం ఎంతోదూరంలోలేదు. 7. మకావు- చైనా: అతితక్కువ కాలంలో బీభత్సంగా అభివృద్ధి చెందిన చైనా నగరం మకావు.. గతేడాది ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసినా 2025 నాటికి రిచ్చెస్ట్ సిటీ అవుతుందని అంచనా. -
వాహనాలు లేని నగరాలు..
వెనిస్.. ఇటలీకి చెందిన వెనిస్ నగరం పర్యాటకంగా చాలా ప్రసిద్ధి చెందింది. 117 చిన్నచిన్న దీవుల సముదాయంగా ఈ నగరం ఏర్పడింది. చుట్టూ నీళ్లే ఉంటాయి కాబట్టి ఇక్కడ సంప్రదాయ వాహనాలకు చోటులేదు. దీవులన్నీ ఒకదానికొకటి చిన్నచిన్న కాలువల ద్వారా కలిపి ఉంటాయి. ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లాలంటే పడవలే మార్గం. లేదా కాలువలపై నిర్మించిన బ్రిడ్జిల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ప్రజా రవాణా వాహనాలుగా వాటర్ బస్‌లనే వినియోగిస్తారు. కార్లు, బైక్‌లు వంటి వ్యక్తిగత వాహనలు వినియోగించే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ప్రతి ఇంటికో పడవ ఉంటుంది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఎక్కువ నగరాలు కార్ ఫ్రీ సిటీస్గానే ఉండేవి. బస్సు, ట్రక్కులవంటి వాహనాలూ తక్కువ సంఖ్యలోనే కనిపించేవి. ప్రస్తుతం నగరాల్లోని వీధులన్నీ కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలతో నిండిపోయాయి. కానీ ఇలాంటి కాలంలో కూడా ఈ తరహా సంప్రదాయ వాహనాలు లేని నగరాలున్నాయి. కాలుష్యకారక వాహనాల వినియోగం లేని అలాంటి నగరాల గురించి తెలుసుకుందాం.. మ్యాకినాక్ ఐలాండ్.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మిచిగాన్కు సమీపంలో ఉన్న చిన్న దీవి మ్యాకినాక్. పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించే ఈ దీవిలో 492 మంది మాత్రమే నివసిస్తారు. అయితే వేసవిలో మాత్రం వేల మంది పర్యాటకులు ఈ దీవిని సందర్శిస్తారు. 1898లోనే ఈ నగరంలో యంత్రాల ఆధారంగా నడిచే వాహనాల్ని నిషేధించారు. కాలుష్యపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పటినుంచి నేటివరకు ఆ దీవిలో ఎలాంటి కాలుష్యకారక వాహనాల్ని వినియోగించడం లేదు. దీవిలో ప్రయాణానికి సైకిళ్లు, గుర్రపు బండ్లు మాత్రమే వాడుతున్నారు. సందర్శకులెవరైనా దీవిలో ప్రయాణించాలంటే సైకిళ్లను అద్దెకు తీసుకోవాల్సిందే. హైడ్రా, గ్రీస్.. ప్రసిద్ధ గ్రీక్ ఐలాండ్స్‌లో హైడ్రా ఒకటి. ఈ దీవిలో చిన్నచిన్న పట్టణాలు చాలా ఉన్నాయి. పర్వతాల మధ్య పెద్దపెద్ద రాళ్లపై ఇక్కడి హైడ్రాపోర్ట్ అనే నగరం పలు పర్యాటక ప్రదేశాలతో కూడి ఉంది. మూడు వేలలోపే జనాభా కలిగిన ఈ దీవిలో సంప్రదాయ వాహనాలు పూర్తిగా నిషేధం. చెత్తను తీసుకెళ్లేందుకు మాత్రమే కొన్ని ట్రక్కులను వినియోగిస్తుంటారు. అంతకుమించి ఎలాంటి కార్లు, బైక్‌లు, ఇతర కాలుష్యకారక వాహనాలు కనిపించవు. గాడిదలు, గుర్రాలు, సైకిళ్లను మాత్రమే రవాణాకి ఉపయోగిస్తారు. వీటితోపాటు వాటర్ ట్యాక్సీలను ప్రజా రవాణా వాహనాలుగా వినియోగిస్తున్నారు. లా క్యుంబ్రెసిటా.. అర్జెంటినాలోని చిన్న పట్టణం లా క్యుంబ్రెసిటా. 350 మంది జనాభా కలిగిన ఈ చిన్న పట్టణం పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం 15వ శతాబ్దంలోని జర్మన్ పట్టణాలను పోలి ఉంటుందని పర్యాటకులు భావిస్తారు. 1996లో లా క్యుంబ్రెసిటాను పాదచారుల పట్టణంగా ప్రకటించారు. అంటే ఎలాంటి వాహనాల్ని పట్టణం లోపలికి అనుమతించరు. ఎవరైనా నగరాన్ని సందర్శించాలనుకుంటే తమ వాహనాల్ని పట్టణ ముఖద్వారం దగ్గరే నిలిపివేయాలి. కాలి నడకన మాత్రమే నగరాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఫెస్ అల్ బాలి.. మొరాకోలోని మూడో పెద్ద నగరం ఫెస్ అల్ బాలి (ఫెస్). ఈ నగరంలో కూడా ఎలాంటి కార్లను అనుమతించరు. ప్రపంచంలో అతిపెద్ద కార్ ఫ్రీ నగరంగా ఫెస్ అల్ బాలికి గుర్తింపు ఉంది. ఇక్కడ దాదాపు 1,56,000కు పైగా జనాభా నివసిస్తున్నారు. ఇంత మంది ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాలను వినియోగించే అవకాశం లేదు. నగరంలోని వీధులన్నీ చాలా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల కాలి నడకన మాత్రమే మరో చోటికి వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రమే బైక్‌లను వినియోగించుకునే అవకాశం ఉంది. ఫైర్ ఐలాండ్.. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌కు సమీపంలో ఉన్న మరో దీవి ఫైర్ ఐలాండ్. 300 మాత్రమే జనాభా ఉన్న దీవిలోకి వేసవిలో వేల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ దీవి పొడవు 50 కిలోమీటర్లు ఉన్నప్పటికీ చాలా ఇరుకుగా 400 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. వెడల్పు తక్కువగా ఉండడంతో ఈ దీవిలో కూడా సంప్రదాయ యంత్ర ఆధారిత వాహనాల్ని అనుమతించరు. కొన్ని అత్యవసర వాహనాలు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లే వాహనాలు మాత్రమే పరిమితంగా తిరుగుతుంటాయి. అందరూ కాలినడకన లేదా సైకిళ్లను వినియోగించి మాత్రమే ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. -
ముంబై 12వ స్థానం, 20వ స్థానంలో ఢిల్లి
-
పట్నంలో పండగ సందడి
-
నగరంలో 'మిస్ ట్విన్ సిటీస్' పోటీలు
-
మృత్యురేఖలవుతున్న పట్టాలు
గత పదేళ్లకాలంలో ముంబై రైళ్లలోంచి 25,722 మంది ప్రయాణికులు కింద పడిపోగా వారిలో 6,989 మంది చనిపోయారు. 18,733 మంది బతికి బయటపడ్డారు. కాగా, ట్రాక్‌లకు అడ్డంగా ప్రయాణిస్తూ మరో 22,289 మంది తమ జీవితాలు కోల్పోయారు. ముంబైకి సంబంధించిన పలు విషయాలు సాధార ణంగా భారీ సంఖ్యలతో కూడి ఉంటాయి. నగర జనాభా 1.24 కోట్లు. దాదాపు సగం జనాభా మురికివాడల్లో ఉంటూ దుర్భర పరిస్థితుల్లో జీవిస్తుంటుంది. నగరపాలక సంస్థకు చెందిన రవాణా శాఖ దాదాపు 4 వేల బస్సులను నడుపుతుంటుంది. దాని ప్రతిష్టాత్మకమైన స్థానిక రైళ్లు ప్రతిరోజూ 70 లక్షలమంది ప్రయాణికులను తీసుకుపోతుంటాయి. వీటిలో దాదాపు 2,913 రైళ్లు తమ తమ ట్రాక్‌లపై రోజుకు 20 గంటలపాటు సాగిపోతుంటాయి. నగరం లోపలినుంచే కాకుండా శివార్ల నుంచి ప్రయాణించి వచ్చే వారిని కూడా రెండు గంటలపాటు అటూ ఇటూ రవాణా చేస్తున్న రైల్వేలను ఈ అంశమే నగర ఆర్థిక కార్యాచరణలో కీలకంగా చేస్తోంది. ప్రయాణం మాత్రం అమానుషమైన పరిస్థితుల్లో సాగుతుంటుంది. పరిమితికి మించిన జనం రైళ్లలో ఏ స్థాయిలో కిక్కిరిసి ఉంటారంటే, రైల్వేలు దానికి కొత్త వ్యక్తీకరణను కూడా కనుగొనవలసి వచ్చింది. ఈ పరిస్థితిని ‘రద్దీవేళల్లో కిక్కిరిసిన జనం సూపర్ రాపిడి’ అంటూ రైల్వేలు పిలుస్తున్నాయి. కోచ్‌లలోకి ప్రవేశించే చోట, లోపలకి దూరడమో లేదా పడిపోవడమో తప్పదనిపించే స్థితిలో, కిందినుంచి రైల్లోకి ఎవరో ఒకరు తోసుకుని ప్రవేశించి మిమ్మల్ని అడ్డుకోకముందే మీరు రైల్లోంచి దిగాల్సి ఉంటుంది. రైలులోపల జనం పరస్పరం ఎంత దగ్గరగా కరుచుకుని ఉంటారంటే అది రోజువారీగా జరిగే నిర్బంధ ఉపద్రవాన్ని, పీడనను తలపిస్తుంది. రైల్లో సీటు దక్కించుకోవడం అంటే అది వరమే మరి. సీటు అంచులో కూర్చోవడానికి మీకు అవకాశం ఇస్తే మీ సహ ప్రయాణీకులకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. రైలు లోపల మీరు పొందగలిగేది అదే. కాని అది ఇతరుల దయ మాత్రమే. సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ముంబై లోకల్ రైళ్లు నడుస్తుంటాయి. కాలానుగుణంగా వాటి పొడవు కూడా పెరుగుతూ వస్తోంది. మొదట్లో ఇవి 9 కోచ్‌లతో ఉండగా తరవాత వీటి సంఖ్య 12 కోచ్‌లకు పెరిగింది. ఇంకా ఎక్కువమందికి అవకాశం కల్పించడం కోసం కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం కోచ్‌ల సంఖ్య 15కు పెరిగింది. కానీ నేటికీ ప్రయాణికులకు ఉపశమనం లేదు. రైలు ప్రయాణం ఇప్పటికీ అభద్రతతోనే సాగుతోంది. కిక్కిరిసి ఉండటం చేత ప్రయాణికులు రైళ్ల నుంచి పడిపోతుంటారు. అంటే కొంతమంది తలుపు అంచుల వద్ద కడ్డీని పట్టుకుని మునిగాళ్లపై వేలాడుతూ ప్రయాణిస్తుంటారని దీనర్థం. గత పదేళ్లకాలంలో ముంబై రైళ్లలోంచి 25,722 మంది ప్రయాణికులు కింద పడిపోగా వారిలో 6,989 మంది చనిపోయారు. 18,733 మంది బతికి బయటపడ్డారు. కాగా, ట్రాక్‌లకు అడ్డంగా ప్రయాణిస్తూ మరో 22,289 మంది తమ జీవితాలు కోల్పోయారు. ఇక్కడ కేవలం రైల్వేనే నిందించడానికి లేదు. పాదచారులకోసం నిర్మించిన వంతెనలు చాలినంతగా లేవు. వీటిని సైతం రైల్వేలనే అంటిపెట్టుకుని ఉండే హ్యాకర్లు అడ్డుకుంటుంటారు. నిస్సందేహంగా అవసరం లేని సమయంలో పట్టాలు దాటేవారు తప్పు దారి పట్టినవారే అయి ఉంటారు. కొంతమంది తప్పుదారి పట్టిన కుర్రాళ్లు తమ సాహస ప్రవృత్తిని చాటుకునేందుకోసం రైలు తలుపుల వద్ద ఉన్న కడ్డీని పట్టుకుని వేలాడుతూ ఒకకాలిని ప్లాట్‌ఫాం మీద మోపి ప్రదర్శన చేస్తుంటారు. అయితే మృతుల జాబితాలో వీరి సంఖ్య పెద్దగా లేదు కాబట్టి రైలు ప్రమాద మృతుల సంఖ్య పెరగటానికి సంబంధించి ఇలాంటివారిపై నింద మోపలేము. పని స్థలానికి వెళ్లడానికి లేదా ఇళ్లకు వెళ్లడానికి ఆత్రుతగా ఉండే ప్రయాణికులు రైలు కదులుతున్నప్పుడు కూడా ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తర్వాతి రైలు కూడా తక్కువ రద్దీతో వస్తుందనడానికి లేదు. కాబట్టి రైల్వేలు తగిన నిర్వహణ వనరుల్లేక సతమతమవుతూ, ఆదివారం మరమ్మతుల కోసం కొన్ని సర్వీసులను మూసివేస్తున్నప్పటికీ, మెట్రోపాలిటన్ ప్రాంత జీవనరేఖగా పిలుస్తున్న స్థానిక రైళ్లలో భద్రత అనేది అత్యంత ఆవశ్యకమైనదిగా మారింది. కొత్తగా రూపొందించిన రైలుపెట్టెలు ఉండవలసిన దానికంటే ఎత్తుగా ఉండటంతో రైలు ఫ్లోర్‌కి, ప్లాట్‌ఫాంలకు మధ్య ఖాళీలు ఉంటూ కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్పుడు కీలకమైన వివరణలు ఎలా పక్కకు పోతున్నా యన్న దాన్ని ఇంకా స్పష్టం చేయడం లేదు. ఇలా రైలు ఫ్లోర్‌కి, ప్లాట్‌ఫాంకు మధ్య ఖాళీలవల్ల ప్రయాణికులు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు జారిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు అడపాదడపా కాకుండా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరగవు, వాటిని మనుషులే చేస్తారు అనే వాదనకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. అలాగే ఫుట్‌బోర్డు మీద నిలిచి ప్రయాణించేవారు కదులుతున్న రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు లేదా తీవ్రంగా గాయపడుతున్నారు. కానీ పశ్చిమ లేదా మధ్య రైల్వే ఇలాంటి వాటిని తమ తప్పిదంగా అంగీకరిస్తున్నట్లు లేదు. రైల్వే తన నిర్వహణా తీరును మెరుగుపర్చుకో వాలని ముంబై హైకోర్టు పదే పదే సూచిస్తోంది. తాజాగా ఒక ఘటనపై కోర్టు వ్యాఖ్యానిస్తూ, రైల్వే వ్యవస్థలో ఒక్క ప్రాణ నష్టం జరిగినా అది ఆమోదనీయ గణాంకం కాదని తేల్చి చెప్పింది. ఫ్లాట్‌ఫాంల ఎత్తును పెంచాలని, రైల్వే కారణంగా గాయపడిన వారికి రైల్వే స్టేషన్లలో వైద్య సౌకర్యం అందించాలని, రవాణా ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తీసుకె ళ్లడానికి అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ముంబై కోర్టే తరచుగా రైల్వే శాఖకు చెపాల్సివస్తోంది. మొత్తంమీద చూస్తే, రైలు ప్రయాణికులకు రైల్వేలే ప్రయోజనం చేకూర్చాలని న్యాయస్థానాలు చెప్పాల్సి రావడమే ఒక విషాద గాథ. - మహేశ్ విజాపూర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
నీటి ఎద్దడి భారత్.. జల సమృద్ధ ఇండియా..
సందర్భం భారత్ పట్టణీకరణకు గురవుతోంది. కానీ కొత్తగా ఏర్పడుతున్న నగరాలతో కాదు. ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణతో, పెరుగుతున్న జనసాంద్రతతో దేశంలో పట్టణీకరణ వ్యాప్తి చెందుతోంది. ఇది నగరాల నిర్వహణపై లోతైన ప్రశ్నలను సంధిస్తోంది. నిర్వహణ అంటే పౌర స్వయం పాలన అనేది అన్ని నగరాలకూ సమాన ప్రయోజనాలను అందివ్వడం అని అర్థం. స్వయం పాలన అంటేనే ప్రజాస్వామ్యం. ఈ కోణం లోంచి చూస్తే, మన నగరాలు ఒక సెక్షన్ పౌరుల జీవి తాలను మాత్రమే మెరుగుపరుస్తున్న స్థితిలో గ్రామాలు తమ వాటా ప్రయోజనాలను పొందకుండా మనం వాటిని కొల్లగొడుతున్నామా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకు, మానవ మనుగడకు అతి ప్రధాన మైన వనరులలో తాగునీరు ఒకటి. మన నగరాలు మరింత వ్యవస్థీకృత పద్ధతిలో నీటిని పొందుతున్నారను కుందాం. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు వాటా పొందుతున్నట్లు చెప్పలేం. నగరాలలో నీటి సరఫరాలో వ్యత్యాసాలు ఉంటున్నాయి. తలసరి నీటి లభ్యత అనేది అత్యంత సగటు స్థితిలోనే అందుబాటులో ఉంటోందే తప్ప వాస్తవార్థంలో కాదు. నీటి తొట్టెల్లో స్నానం చేయగలిగిన వ్యక్తి మాత్రమే తలసరి పరిమాణం కంటే ఎక్కువ నీటిని పొందగలుగు తున్నట్లు లెక్క. కానీ పక్కనే పూరిగుడెసెల్లో ఉన్న వారుమాత్రం ఆ రోజుకు అవసరమైన తాగునీటికి సైతం ఎక్కడెక్కడికో పరుగులు తీయవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. గణాంకాలు ఈ వివరాలను దాచిపెడు తుంటాయి. కానీ, ప్రత్యేకించి మహారాష్ట్ర వంటి ఒక పెద్ద రాష్ట్రానికి సంబంధించి నీటి సరఫరాలో స్థూల వ్యత్యా సాలను వివరించడానికి సాధారణంగా మనం గణాంకా లమీదే ఆధారపడాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని నగరాలు అక్కడి గ్రామాల కంటే 400 రెట్లు అధికంగా నీటిని పొందుతున్నాయని గణాంకాలు నివేదిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా పట్టణీకరణకు గురయిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటున్నప్పటికీ మహారాష్ట్రలో గ్రామీణ-పట్టణ నిష్పత్తులు మాత్రం ఆ స్థాయి పరిమా ణంలో లేవు. నేటికీ మహారాష్ట్రలో 45 శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. పట్టణాల నీటి అవసరాల కోసం రిజర్వాయర్లు, సరస్సుల్లో నిల్వ చేసి ఉంచుతుంటారు కాని గ్రామీణ ప్రాంతాలకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఏవీ లేవు. అంటే గ్రామాలు నేటికీ బావులు, గొట్టపుబావుల్లోని నీటిని మాత్రమే వాడుకుంటుంటారన్నది ఒక అంచనాపై ఆధారపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇదెలా ఉం టుందంటే రేషన్ షాపుల్లో నాసిరకం ధాన్యాలు మాత్రమే ఉంటున్నందున పేదలు వాటితోటే తమ కడుపు నింపు కుంటున్నారని చెబుతున్నట్లుగా ఉంటుంది. నా దృష్టిలో అలాంటి నీటివనరులపై ఆధారప డటం అంటే భరోసా ఉన్న రక్షిత నీటి సదుపాయం అని అర్థం కాదు. ఇది ఒక విధంగా తీవ్రమైన విధానపరమైన ఉపేక్షనే సూచిస్తుంది. అడుగంటుతున్న భూగర్భ జల వనరులను విచ్చలవిడిగా తోడేయకుండా క్రమబద్ధీకరిం చడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ కూడా ఉంది. మరోవైపున ప్రజలు దానికి కట్టుబడాల్సి ఉంటుం దని భావిద్దాం. లభ్యమవుతున్న నీటి వనరులన్నింటినీ ఒక సెక్షన్ ప్రజలకే అందజేస్తూ, జనాభాలోని అతి పెద్ద విభాగం అవసరాలను తోసిపుచ్చడం ద్వారా ఇలాంటి వైరుధ్యాలను ఒక రాష్ట్రం ఎలా ఆమోదిస్తుందన్న విష యాన్ని ఇది వివరించడం లేదు. విషాదకరమైన విషయం ఏమిటంటే,నీటి ఎద్దడితో ఎండిపోయిన గ్రామాలనుంచి ముంబై వైపుగా భారీ నీటి గొట్టాలు సాగిపోతుంటాయి. గ్రామీణులు ఈ అన్యా యంపై అభ్యంతరం చెప్ప వచ్చు. కాని పట్టణ డిమాండ్ శక్తి ముందు వీరు మౌనం పాటిస్తుంటారు. ఇది మండ టానికి సిద్ధంగా ఉంటున్న వత్తుల పెట్టెలా మారవచ్చు. గ్రామీణ ప్రాంతం మొత్తంగా నీటికోసం అంగలా ర్చుతుండగా, ముంబై మెట్రో ప్రాంతం, పుణేతో కూడిన ఒక పరిమిత ప్రాంతం అత్యధికంగా నీటి సరఫరా పొందుతున్న స్థితిని పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం స్థాయి ఏమిటో అర్థమవుతుంది. చివరకు ముంబై మెట్రోపాలి టన్ ప్రాంతం పరిధిలో కూడా తాగు నీరు తెచ్చుకోవడా నికి స్థానికులు దివా నుంచి కాల్వా ప్రాంతానికి లోకల్ రైలులో ప్రయాణిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూస్తే 400 రెట్లు అధికంగా సరఫరా అవుతున్న నీటిలో సగంపైగా నీటిని ముంబై, పుణే మెట్రోపాలిటిన్ ప్రాంతాలు మాత్రమే తాగిపడేస్తున్నాయి. హైదరాబాద్‌లో చాలావరకు శివారు ప్రాంతాల్లో నీటి ట్యాంకులతో తాగునీటిని సరఫరా చేస్తుంటారు. కరువు కాలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా వచ్చే నీటి ట్యాంకు కోసం ప్రజలు కళ్లలో వత్తులు వేసి మరీ చూస్తుంటారు. తమ వంతు తీసుకున్న తర్వాత బకెట్ నీళ్లు ఎప్పుడు దొరుకు తాయో అక్కడ ఎవరికీ అంతుపట్టని స్థితి. అయితే ప్రభుత్వాలు రక్షిత మంచి నీటిని గ్రామీణ ప్రాంతాలకు అందించే ప్రయత్నాలు చేయలేదని దీనర్థం కాదు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ పేల వంగా ఉంటున్నందున వీటి ప్రయోజనం నెరవేరటం లేదు. ఇలాంటి సందర్భాల్లో గ్రామీణులు ఎప్పుడొ స్తుందో తెలీని నీటి ట్యాంకుల కోసం ఎదురు చూస్తూ ఉండటం తప్పనిసరి అవుతోంది. నీటి సరఫరాలోని వ్యత్యాసాలకు సంబంధించి మహారాష్ట్రలో గణాంకాలు సుస్పష్టంగా వెల్లడిస్తున్న ట్లుగా దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య కాస్త తేడా ఉండవచ్చు. ఈ సందర్భంగా శరద్‌జోషి వివరణను మళ్లీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇండియా ఉంటున్నట్లే అక్కడ భారత్ కూడా ఉంటోంది. వీటిలో ఏది మరొక దానితో సమవర్తన కలిగి ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు మరి. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
పట్టణాలు కటకటా!
* తాగునీటి కోసం అల్లాడుతున్న పురజనులు * నిండు వర్షాకాలంలోనూ గుక్కెడు నీటికి కరువు * చాలా చోట్ల మూడు నాలుగు రోజులకోసారి నీటి సరఫరా * 68 పట్టణాల్లోనూ ఇదే గోస 17 పట్టణాల్లో ఆందోళనకర స్థితి * రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం * అడుగంటిన జలాశయాలు.. ఎండిపోయిన నదులు, వాగులు * పాతాళానికి చేరిన భూగర్భ జలాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్నవాసుల గొంతెండిపోతోంది... దాహం దాహం అంటూ పురజనులు అల్లాడిపోతున్నారు.. నిండు వర్షాకాలంలోనూ గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.. గత వేసవిలోనే అడుగంటిన జలాశయాలు, వర్షాకాలం ప్రారంభమై నెల గడిచిపోయినా జాడలేని వానలే ఈ దుస్థితికి కారణం. రాష్ట్రంలో తాగునీటికి తీవ్ర కరువు ముంచుకొస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల గడిచిపోయినా వర్షాల ఊసేలేదు. జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నిల్వలూ దాదాపు అడుగంటిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలే కాదు కృష్ణా, గోదావరి నదులూ ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరులోగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడనుంది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ సహా 68 పురపాలక సంస్థలు ఉండగా... 17 పట్టణాలు ఇప్పటికే నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వీటిల్లో నాలుగైదు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన నగర, పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఇంతియాజ్ అహ్మద్ కొద్దిరోజులుగా సమస్యాత్మక పట్టణాల్లో పర్యటిస్తూ, పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించిందని... ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.16 కోట్లను కేటాయించిందని ఆయన తెలిపారు. డెడ్ స్టోరేజీలో జలాశయాలు.. రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న జూరాల, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, కడెం, సింగూరు, దిగువ మానేరు, పానగల్ ఉదయ సముద్రం, ఎల్లంపల్లి తదితర జలాశయాల్లో నీటి నిల్వలు ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. మరో నెల, నెలన్నర వరకై సరఫరా చేసేందుకు ఈ నిల్వలు సరిపోతాయో లేదోనని అధికారులే పేర్కొంటున్నారు. అప్పటికి వర్షాలు కురవకపోతే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టణాలకు కష్టమే! రాష్ట్రంలోని 17 పట్టణాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న జల వనరులు ఈ నెలాఖరులోగా పూర్తిగా అడుగంటనున్నాయని పబ్లిక్ హెల్త్ విభాగం అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఆదిలాబాద్, బెల్లంపల్లి, భూపాలపల్లి, హుస్నాబాద్, జగిత్యాల, జనగాం, కొల్లాపూ ర్, కోరుట్ల, కొత్తగూడెం, మధిర, మంచి ర్యాల, మణుగూరు, మెదక్, నర్సంపేట, పా ల్వంచ, వేములవాడ, ఇల్లెందు పట్టణాలకు తా గునీటి అవసరాలు తీర్చుతున్న జల వనరులు 30 రోజుల్లోగా వట్టిపోతాయని పేర్కొంది. ‘బోరు’మంటున్న భూగర్భం రాష్ట్రంలోని 16 చిన్న పట్టణాలకు భూ ఉపరితల నీటి సరఫరా వ్యవస్థ లేదు. భూగర్భ జలాలపై ఆధారపడే ఈ పట్టణాల్లో తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం భూగర్భ జలాలూ అడుగంటిపోవడంతో ఈ పట్టణ ప్రాంతాల్లో 272 నీటి సరఫరా బోర్లు ఎండిపోయాయి. దీంతో కొద్దికొద్దిగా నీరు వస్తున్న బోర్ల నుంచి నాలుగైదు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. -
పట్టణాలకే ఉల్లి..
⇒గ్రామాలను విస్మరించిన ప్రభుత్వం ⇒రైతుబజార్లలో కుటుంబానికి 3 కిలోలే ⇒సరిపోవంటూ వినియోగదారుల ఆందోళన ⇒జిల్లాలో ప్రోత్సాహం లేకపోవడంతో కనుమరుగైన ఉల్లిసాగు నెల్లూరు: రాష్ట్రప్రభుత్వం సబ్సిడీపై అందించే ఉల్లిపాయలను కేవలం పట్టణాలకే పరిమితం చేసింది. అది కూడా నెల్లూరు, కావలి, గూడూరు పట్టణాల్లో అరకొరగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల వారికి సబ్సిడీ ఉల్లిని పూర్తిగా దూరం చేయగా, పట్టణాల్లోనూ కొందరికే అందుతున్నాయి. కేవలం రైతుబజార్లలో మాత్రమే విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఉల్లిపాయలు పట్టణవాసులకూ అందని ద్రాక్షగా ఊరిస్తున్నాయి. రేషన్ కార్డు, ఆధార్ కార్డులను తెచ్చుకున్నవారికే ఉల్లిపాయలను సబ్సిడీపై అందజేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న వారందరికీ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, రైతుబజార్లలోని సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆధార్ కావాలని మెలిక పెడుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కుటుంబానికి 3 కిలోలు మాత్రమే ఇస్తున్నారు. హోల్ సేల్ మార్కెట్లో మేలు రకం ఉల్లిగడ్డలు 10 కిలోలు రూ.400 పలుకుతుండగా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.45 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు. ప్రోత్సాహం కరువు ఉల్లిసాగుకు ప్రోత్సాహం కరువైంది. ఏటా విస్తీర్ణం తగ్గుతోంది. ఉల్లి ధరలు పెరుగుతున్నా ఉద్యానశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014-15 ఖరీఫ్‌లో 200 ఎకరాలు సాగు చేయగా, గత రబీలోనూ, ప్రస్తుత ఖరీఫ్‌లోనూ ఒక్క ఎకరం కూడా రైతులు సాగు చేయలేదంటే, ఉల్లిసాగుకు గడ్డు పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఉద్యాన పంటల అభివద్ధి కోసం రైతులకు విత్తనాలపై 50 శాతం రాయితీపై ఇవ్వటానికి 2013-14లో రూ.20లక్షలు కేటాయించారు. అప్పట్లో వీటిని ఆశాఖ పరిధిలో ఉన్న మిర్చిపంటకు మినహా ఏ పంటకైనా ఇవ్వచ్చని ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. సక్రమంగా పంపిణీ చేస్తున్నాం.. పెరిగిన ధరలు దృష్టిలో ఉంచుకొని రైతుబజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలు రూ.20కే అందిస్తున్నాం. నెల్లూరు, గూడూరు, కావలి రైతుబజార్లలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఒక్కో కుటుంబానికి 3 కిలోలు మాత్రమే. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు రైతు బజార్లలో విక్రయింస్తాం. -పి.అనితాకుమారి, ఏడీఎం, నెల్లూరు. -
జంటనగరాల్లో పెరిగిన ఫైర్ స్టేషన్లు
-
పట్నందే పండుగ
పండుగకు పల్లెలే ఆలవాలం అంటారు! కానీ.. పట్నాలూ ఆ సోయగానికి నిలయమే! సంక్రాంతి వేళ అపార్ట్మెంట్ల ఇరుకు కారిడార్లు ముత్యాల ముగ్గులకు లోగిళ్లవుతాయి. కాలనీ కూడళ్లు భోగిమంటల్లో చలి కాచుకుంటాయి. డూడూ బసవన్నల గజ్జెల సవ్వడి వీధుల్లో మోగుతుంది. నీలాకాశంలో పతంగులు పండుగ సంబురాన్ని అంబ రాన్ని తాకిస్తాయి. అన్నిటికీ మించి పొలిమేరే హద్దుగా పల్లెల్లో తెలుగు పండుగలు సాగితే, హైదరాబాద్‌లో కులమతాలు, భిన్నరాష్ట్రవాసుల ఆవాసాలకూ వెళ్లి ఆనందాలు పంచుకుంటాయి. అలా సంస్కృతిని సంపన్నం చేసే నైజం భాగ్యనగరి సొంతం. ..:: శరాది ఫాదర్ ఆఫ్ ఫెస్టివల్.. పల్లెల్లో కనిపించే ఆవుపేడ అలుకు పూతలు, సుద్దపిండి ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలు, మామిడాకు తోరణాల ద్వారాలు.. మాకూ ఉన్నాయంటున్నారు నిజాంపేటలోని వర్టెక్స్ లేక్‌వ్యూ కాలనీలో ఉంటున్న కన్నెగంటి అనసూయ. ప్రవృత్తి రీత్యా రచయిత్రి అయిన ఆమె తమ కాలనీలోని పండుగ వేడుకలను వర్ణిస్తూ ‘ఒడిశా, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలాంటి అనేక రాష్ట్రాల వాసులతో మా కాలనీ మినీ ఇండియాను తలపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వానికి రూపంలా ఉంటుంద’ని వివరిస్తారామె. ‘సంక్రాంతే కాదు ఏ పండుగకైనా తెలుగు వంటకాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలనూ మా కాలనీవాసులకు పంచుతున్నాం’ అంటారామె. ‘భోగిమంటల్లో మాతోపాటు మా మినీభారత్ అంతా చలికాచుకుంటుంది. ఓనంలో మేమూ పాలుపంచుకుంటాం. కర్వాచౌత్ రోజు జల్లెడలో నెలరాజును దర్శించుకుంటాం. పూరన్‌పోలీ కడుపార ఆరగిస్తాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరింట్లో ఏం పండుగైనా కాలనీ అంతా సంబురమే. పండుగలకు పల్లెలకు వెళ్లలేకపోయామనే బాధేలేదు. అక్కడికన్నా ఆడంబరంగా ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. ఒకరకంగా ఈ పండుగలు కేవలం ఆచార వ్యవహారంగానే కాక మా అందరి మధ్య అనుబంధాలను పెంచుకునే వేదికగా ఉంటున్నాయి. ఒకరి సంస్కృతి సంప్రదాయాలను ఒకరు గౌరవించుకునే సంస్కారాన్ని ఇస్తున్నాయి. పండుగ పరమార్థం కూడా ఇదే కదా! పల్లె.. పండుగకు పుట్టిల్లయితే పట్నం దాన్నిపెంచి పోషిస్తున్న తండ్రిలాంటిది’ అన్నారు కన్నెగంటి అనసూయ. బొమ్మల కొలువులు.. పట్నంలో సంక్రాంతి సంబురాన్ని గురించి మరో ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అత్తలూరి విజయలక్ష్మీ మాట్లాడుతూ ‘మా తల్లిదండ్రులు 1950ల్లోనే గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఊళ్లో మాకెవరూ లేరు. పండుగలు పబ్బాలు అన్నీ ఇక్కడే. నేను పల్లెటూరి వాతావరణం ఎప్పుడూ మిస్సవ్వలేదు. సంక్రాంతి రోజు పల్లెవాకిట కనిపించే ముగ్గులు, అందులో గొబ్బెమ్మలు, ఇంట్లో బొమ్మల కొలువులు ఏదీ మిస్సవ్వలేదు. మా అమ్మ తన మూలాలను మరిచిపోకుండా ప్రతి సంక్రాంతికి బొమ్మల కొలువు కొలువుదీర్చేది. రామాయణం, భారత, భాగవతాల్లోని అంశాలను కాన్సెప్ట్‌గా తీసుకుని ఒక్కో ఏడాది ఒక్కోతీరు బొమ్మలకొలువు పెట్టేది. మిగిలిన ఆచారాలన్నీ పాటించినా ఈ బొమ్మల కొలువు విషయంలో నేను ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయాను. కానీ మూడో తరమైన నా కూతురుకి (రాజేశ్వరి, ఆర్టిస్ట్) మాత్రం ఈ విషయంలో అశ్రద్ధ చేయలేదు. తను అమెరికాలో ఉంటోంది. తనకీ పదేళ్ల కూతురు (సన్నిధి). నాకు మా అమ్మ నేర్పిన విషయాలను తనకు నేర్పాను. ఇప్పుడు తను నా మనవరాలికి నేర్పుతోంది. తనూ మా అమ్మలాగే ఏడాదికో కాన్సెప్ట్‌తో శ్రద్ధగా బొమ్మలను కొలువుదీరుస్తోంది. పైగా అక్కడ ఏదీ రెడీమేడ్‌గా దొరకదు. రా మెటీరియల్ తెచ్చుకుని తల్లీకూతుళ్లిద్దరూ స్వయంగా బొమ్మలు చేస్తారు. చక్కగా డెకొరేట్ చేస్తారు. మన తెలుగు పండుగలు పల్లెలనే కాదు పట్నాల పరిమితులూ దాటి ఖండాంతరాలు చేరుకున్నాయి. అక్కడా శోభిల్లుతున్నాయి. అందుకే పండుగకి పల్లె, పట్నం కాదు ఆ సంప్రదాయాన్ని, ఆ సంస్కృతిని కాపాడుకోవాలనుకునే శ్రద్ధ ముఖ్యం, అవసరం కూడా!’ అని చెప్పారు. ఎక్కడైనా సత్యం గ్రహించాలి... నిజానికి మన పండుగలన్నీ శాస్త్రీయ దృక్పథంతో ఉన్నవే. ప్రతి పండుగను జరపుకోవడం వెనక ఒక సహేతుక కారణం కనపడుతుంది అంటారు ప్రముఖ కవయిత్రి, సంఘసేవకురాలు లక్కరాజు నిర్మల. ‘మారుతున్న ప్రతి సీజన్లో మనకు పండుగలుంటాయి. మారిన ఆ వాతావరణాన్ని ఆకళింపు చేసుకోవడం, దానికి తగ్గట్టు మన ఆహార అలవాట్లను మార్చుకోవడం, దినచర్యలనూ సరిదిద్దుకోవడంలాంటివి ఈ పండుగలతో చెప్పించారు మన పెద్దలు. వీటితోపాటు సమాజంలోని అన్ని వర్గాలు కలిసే ఏర్పాటు ఇందులో ఉంటుంది. మన పండుగల్లో సైన్స్ ఉంది, ఆరోగ్య సూత్రాలున్నాయి, సామాజిక శ్రేయస్సూ ఉంది. మనుషులంతా ఒకటే అన్న భావనా ఉంది. అందుకే పండుగకు పల్లె, నగరం అన్న భేదం లేదు. ఎక్కడ జరుపుకొన్నా అది చెప్పే సత్యాన్ని గ్రహించగలగాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి’ అని వివరించారామె. -
ఖరీఫ్ కాటేసింది.. రబీ వెక్కిరించింది
-
ఖరీఫ్ కాటేసింది.. రబీ వెక్కిరించింది
తెలంగాణ పల్లెల్లో కరువు ఛాయలు తీవ్ర వర్షాభావంతో కుదేలైన వ్యవసాయం అడుగంటిన ప్రాజెక్టులు, పడిపోయిన భూగర్భ జలాలు దిక్కుతోచని స్థితిలో రైతులు, కూలీలు కరువు ప్రభావంతో పెరుగుతున్న వలసలు పనులు లేక ఖాళీ అవుతున్న ఊళ్లు నగరాలు, పట్టణాలకు తరలివెళుతున్న కుటుంబాలు సాక్షి నెట్వర్క్/హైదరాబాద్: తెలంగాణ పల్లెలు కరువు కోరల్లో చిక్కాయి. తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం వెక్కిరించింది. ఆదాయమార్గం లేక రైతన్నలకు దిగులే మిగిలింది. ఉపాధి కరువై కూలీల్లో కలవరం మొదలైంది. గత్యంతరం లేక పేద కుటుంబాలు వలసబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర వర్షాలతో ఖరీఫ్ ఆదుకోలేదు. నీళ్లు లేక రబీలో పంటలే వేయలేదు. దీంతో ఉపాధి కోసం వలసలు జోరందుకున్నాయి. ఈ సమయానికి రబీ పనులతో కళకళలాడాల్సిన పల్లెలు కళావిహీనమయ్యాయి. కాలం కలసిరాక చిన్నకారు రైతులు, పొలం పనులు దొరక్క వ్యవసాయ కూలీలు ఉన్న ఊళ్లను విడిచిపెడుతున్నారు. ఉన్నచోట ఉపాధి లభించక తల్లడిల్లే దయనీయస్థితిలో పట్టణాలకు బయలుదేరుతున్నారు. ఈ ఏడాది తగ్గిపోయిన సాగు విస్తీర్ణమే అసలు దుస్థితిని కళ్లకు కట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో 13.09 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంటే.. ఇప్పటివరకు కేవలం 5.16 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. దాదాపు 120 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు అలుముకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంటే రాష్ర్టంలో నాలుగో వంతు పల్లెలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. సాధారణ వర్షపాతంకన్నా ఈ ఏడాది 33 శాతం తక్కువగా వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే ఖరీఫ్‌లో అకాల వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టం రైతుల కొంప ముంచింది. మరోవైపు నిరుటితో పోల్చితే జల వనరులన్నీ బాగా ఇంకిపోయాయి. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నీటిమట్టం ఆందోళనకరస్థాయికి పడిపోయింది. భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. గత రబీ సీజన్ ఆరంభంలో 7 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలం ఈ రబీ సీజన్ ఆరంభానికి 9.70 మీటర్లకు పడిపోయింది. బోర్లు, బావుల నుంచి నీటిని తోడే భగీరథ యత్నాలకే రైతులు అప్పుల పాలవుతున్నారు. దీంతో అన్నదాతలకు సేద్యం భారంగా మారింది. ఈ దుర్భర పరిస్థితులు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీయగా.. ఈ ప్రభావంతో పరోక్షంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. వ్యవసాయ కూలీలకు గడ్డుకాలం చిన్న సన్నకారు రైతులు ఉపాధి వెతుక్కునే పనిలో పడటంతో కూలీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది కూలీలు వలస వెళ్లినట్లు అంచనా. గత ఏడాది ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా 6.18 లక్షల ఇళ్లకు తాళాలున్నట్లు లెక్క తేలింది. అప్పటికీ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు ఎంతో ప్రయాస పడి ఈ సర్వేలో పాలుపంచుకునేందుకు స్వస్థలాలకు తిరిగొచ్చాయి. అయినా లక్షలాది ఇళ్లకు తాళాలే దర్శనమిచ్చాయి. ఈ లెక్కన వసల వెళ్లిన కుటుంబాల సంఖ్య భారీగానే ఉంటుందని అర్థమవుతోంది. కాగా, తాజాగా నెలకొన్న పరిస్థితులతో రెండు నెలలుగా పనులు దొరక్క పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పాలమూరు జిల్లా నుంచే ఏటా పది లక్షల మంది కూలీలు వలసపోతున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానాతో పాటు హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా వారే కనిపిస్తారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి గల్ఫ్ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ర్టం నుంచి దాదాపు 15 లక్షల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అంచనా. వీరిలో అప్పుల పాలైన రైతులే ఎక్కువ మంది ఉన్నారు. ఇక గుజరాత్లో దాదాపు మూడు లక్షల మంది తెలంగాణ వారున్నారని ఇటీవలే ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ బృందం గుర్తించింది. రైతులతో పాటు చేనేత, గీత కార్మికులు ఉపాధి కరువై గుజరాత్, ముంబాయిలో బతికేందుకు బయల్దేరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా మంది పొరుగున ఉన్న మహారాష్ట్రకు వలస వెళుతున్నారు. ఇప్పటికే సిర్పూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు ఖాళీ అయ్యాయి. మరోవైపు వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి పనులు అరకొరగానే సాగుతున్నాయి. గత నెల రోజుల్లో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉపాధి పనులు కావాలని కోరుతున్న కూలీల సంఖ్య రెట్టింపైంది. కానీ ఉపాధి హామీ పనులను విస్తరించేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీంతో పేదలకు వలస మార్గమే శరణ్యమవుతోంది. కరువు మండలాలు 120 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక అందింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 120 వరకు కరువు మండలాలున్నాయి. అయితే పంట కోత ప్రయోగాల (సీసీఈ) రిపోర్టు రావాల్సిన అవసరం ఉందని... అప్పుడే పూర్తిస్థాయి నివేదిక వచ్చినట్లు అవుతుందని వ్యవసాయ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. సీసీఈ రిపోర్టు వస్తే మరో 80 మండలాలు కరువు జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాటితో కలిపి రాష్ట్రంలో 200 కరువు మండలాలు అవుతాయి. సీసీఈ రిపోర్టు వచ్చాకే కరువు మండలాలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సీసీఈ నివేదిక రావడానికి ఈ నెలాఖరు వరకు పట్టనున్నట్లు సమాచారం. అయితే కరువు మండలాల ఎంపికలో జాగు ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణ వస్తున్నాయి. యంత్రాంగం నిర్లిప్తత ఫలితంగా కరువుపై కేంద్రానికి నివేదిక పంపడం ఆలస్యం అవుతుందని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర బృందం పర్యటన మరింత ఆలస్యం అవుతుంది. ఫలితంగా రైతుకు అందాల్సిన పరిహారం సరైన సమయంలో అందని పరిస్థితి దాపురించనుంది. అప్పులు తీర్చేందుకు వెళ్లాడు మాకు రెండెకరాల భూమి ఉంది. పొలం సాగు చేద్దామని రూ. 30 వేలు పెట్టి బోరు వేశాం. చుక్కనీరు కూడా రాలేదు. ఉన్న భూమి బీడుగా మారుద్దని మరో చోట బోరు వేశాం. రూ. 40 వేలు ఖర్చయినా నీళ్లు పడలేదు. వ్యవసాయం చేసి అప్పులు తీర్చే మార్గం కనిపించక మరో రూ. లక్ష అప్పు చేసి మా ఆయన దేవరాజు సౌదీకి వెళ్లాడు. నేను కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. - గద్ద పద్మ, కొలనూర్, కోనరావుపేట మండలం, కరీంనగర్ వరంగల్‌లో తండాలు ఖాళీ ఉపాధి లభించే పరిస్థితి లేక వరంగల్ జిల్లాలోని పలు తండాల్లోని కుటుంబాలు వలసబాట పట్టాయి. కురవి మండల కేంద్రం శివారులోని కీమ్యా తండాలో 20 కుటుంబాలు వలస వెళ్లాయి. వారిలో చాలా మంది హైదరాబాద్‌కు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అలాగే మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామంలో 10 కుటుంబాలు, కస్నా తండాలో 30 కుటుంబాలు, గుండ్రాళ్ళగడ్డ తండాలో 10 కుటుంబాలు పట్టణాలకు తరలాయి. పనిలేక వలసపోతుండ్రు మా తండాలో పని కరువై గిరిజనులంతా వలస పోతుండ్రు. నేను, నా భార్య, మనుమరాలు ముగ్గురమే ఇక్కడ ఉన్నాం. నా ఇద్దరు కొడుకులు, కోడళ్లు కూడా నిజామాబాద్ జిల్లాలోని ఫ్యాక్టరీలో పనికి వెళ్లారు. అందరూ మళ్లీ ఉగాదికి తిరిగొస్తరు. తండాలోని 50 ఇళ్లలో ప్రస్తుతం పది మంది వృద్ధులం మాత్రమే ఉన్నాం. వ్యవసాయభూమి ఉన్నా నీళ్లు లేవు. మా తండాకు రోడ్డు మార్గం లేదు. నీటి కోసం రెండు కిలోమీటర్ల దూరం పోతున్నాం. - హఠ్యానాయక్, మల్పరేగడి తండా, అబ్బెంద, నారాయణఖేడ్ మండలం, మెదక్ -
ఒప్పందాల వేదిక..‘మెట్రోపొలిస్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన ‘11వ మెట్రోపొలిస్ సదస్సు 2014’ నగరాల మధ్య ఒప్పందాలకు వేదికగా నిలిచింది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన సదస్సు శుక్రవారం ముగిసింది. సదస్సు అర్థవంతమైన చర్చలకు.. ఆయా దేశాల్లోని నగరాల సమస్యలపై అవగాహన, పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఉపయోగపడిందని పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు. ఆయా అంశాల్లో కలసి పనిచేసేందుకు భాగస్వామ్య ఒప్పందాలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నాలుగు నగరాలతో చర్చలు జరిపింది. జీ2జీ(గవర్నమెంట్ టు గవర్నమెంట్) నెట్వర్క్ చర్చల్లో భాగంగా బార్సిలోనా(స్పెయిన్), జోహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా), మసాద్(ఇరాన్), సావోపొలో(బ్రెజిల్) లతో హైదరాబాద్ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా నగరాల నుంచి వచ్చిన అధికారులు/మేయర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మెరుగైన రహదారులు, వరదల నివారణ, చారిత్రక కట్టడాలు, హైదరాబాద్ పాతబస్తీ పునరుద్ధరణ అంశాలపై బార్సిలోనా, మసాద్, జోహన్నెస్బర్గ్లతో, సరసమైన ధరలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సావోపొలోతో చర్చలు జరిగాయి. మరో రెండు, మూడు చర్చల అనంతరం ఆయా నగరాలతో పూర్తిస్థాయి ఒప్పందం కుదర్చుకోనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. మెరుగైన సదుపాయాల కోసం.. మెరుగైన పార్కింగ్ సమస్యలు, వరదల నివారణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక వనరుల పెంపు వంటి విధానాలున్న నగరాలతో ఇతర దేశాల నగరాలు ఒప్పందానికి ఆసక్తి కనబర్చాయి. బార్సిలోనా నగరంలో వరదల నివారణకు, వేసవిలో నీటి ఎద్దడి పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం బాగుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అక్కడ భూగర్భంలో ఎక్కువ పరిమాణంలో నీటిని నిల్వ చేయగల ట్యాంకులు నిర్మించారు. వర్షం నీరంతా వాటిల్లో నిలువ ఉంటుంది. వేసవిలో నీటిఎద్దడి సమయాల్లో సదరు ట్యాంకుల్లోని నీటిని వినియోగిస్తారు. వర్షాలొచ్చేప్పుడు ఎక్కువ నీరు చేరకుండా ఎప్పటికప్పుడు తగిన మొత్తంలో నీటిని వినియోగిస్తారు. తద్వారా రెండు కాలాల్లోనూ ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని మన హైదరాబాద్‌లో అమలు చేసేందుకు అవకాశం ఉందని, జలగం వెంగళరావు పార్కు, కేసీపీ సమీపంలో ఇలాంటివి ఏర్పాటు చేయవచ్చని కమిషనర్ చెప్పారు. ఒంటరిగా ఉంటున్న వయోవృద్ధులు ఆపత్కాలంలో వినియోగించేందుకు రూపొందించిన ఉపకరణం కూడా బాగుందన్నారు. గుండీ మాదిరిగా ఉండే ఉపకరణాన్ని టచ్ చేస్తే చాలు.. ఆప్తులకు అలారం వినిపిస్తుందని, త్వరితంగా వారు చేరుకునేందుకు వీలుంటుందన్నారు. వచ్చే సదస్సు అర్జెంటీనాలో.. మూడేళ్లకోమారు జరుగనున్న మెట్రోపొలిస్ తదుపరి సదస్సును 2017లో అర్జెంటీనాలోని బ్యూనోస్‌ఎయిర్స్ నగరంలో జరిపేందుకు సదస్సు తీర్మానించింది. -
స్వరాజ్యం: మూడూళ్ల ముచ్చట!
అభివృద్ధి అంటే అందరికీ నగరాలు, పట్టణాలే గుర్తొస్తాయి. కానీ 70 శాతానికి పైగా గ్రామాలతో నిండిన భారత దేశంలో పట్టణాల్ని, నగరాల్ని కాస్త అభివృద్ధి చేసేసి.. దేశం ప్రగతి పథంలో నడుస్తోందని చెప్పేస్తే ఎలా? గాంధీజీ అన్నట్లు గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.. అవి ప్రగతి బాటలో నడిస్తేనే.. దేశం అభివృద్ధి చెందినట్లు! ఐతే ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని చూస్తూ కూర్చుంటే లాభం లేదు! మనం ముందడుగు వేస్తే అభివృద్ధి దానంతటదే నడుచుకుంటూ వస్తుంది. స్వయం కృషితో ప్రగతి పథంలో నడుస్తున్న ఈ మూడు గ్రామాలే అందుకు ఉదాహరణ. కట్టెవాడి... మహారాష్ట్రలోని బారామతికి 9 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ గ్రామం. ఒకప్పుడు ఇది సమస్యల నిలయం. గ్రామంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత.. గుంతలు పడిన రోడ్లు.. కలుషిత నీరు.. ఇలా అన్నీ అసౌకర్యాలే. సామాజిక కార్యకర్త సునేత్ర వాహిని ప్రయత్నం ఆ గ్రామాన్ని సమూలంగా మార్చేసింది. సునేత్ర కొందరు ఔత్సాహికులతో కలిసి గ్రామాన్ని శుభ్రం చేయడానికి పూనుకోవడంతో ఊరి ప్రజల్లో చైతన్యం వచ్చింది. వాళ్లు కూడా తమ వంత పాత్ర పోషించి ప్రగతి పథాన నడిపేందుకు నడుం బిగించారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఇంటింటికీ మంచి నీటి సౌకర్యముంది. గ్రామంలోని 700 ఇళ్లకూ మరుగుదొడ్లు ఉన్నాయి. ఇవి కాక 22 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. రోడ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా మారాయి. ఎక్కడా చెత్త కనిపించదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఊరిలో చదువుకోని చిన్నారి ఒక్కరూ లేరు. గ్రామంలో వందల సంఖ్యలో చెట్లు నాటి పెంచుతున్నారు. పంచాయతీ నిధులతో పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. కట్టెవాడిలో ప్లాస్టిక్ వాడరు. సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా సివిల్ లా సూట్ ఏర్పాటు చేసుకుని ఇక్కడే సమస్యలు పరిష్కరించుకుంటారు. పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లెక్కరు. ఈ గ్రామాన్ని మహారాష్ట్రలో తొలి పర్యావరణ గ్రామంగా గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక పురస్కారంతో గౌరవించింది. మాలీనాంగ్... దేశ సరిహద్దుల్లో, ఈశాన్య రా్రష్టం మేఘాలయలోని ఓ చిన్న పల్లెటూరు. 2004 వరకు ఈ గ్రామానికి రోడ్డు లేదు. పాఠశాల కూడా లేదు. చెప్పాలంటే గ్రామంలో ఏ సౌకర్యమూ లేదు. ఐతే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఆ ఊరి సొంతం. ఆ గ్రామంలోని ఓ కొండపైకి ఎక్కి చూస్తే బంగ్లాదేశ్ కనిపిస్తుంది. చుట్టూ అడవి, ఊరి నిండా వెదురు చెట్లు ఎంతో శోభనిస్తాయి. ఈ ప్రత్యేకతలతో తమ గ్రామాన్ని తామే అభివృద్ధి చేసుకోవచ్చని ఆలస్యంగా గ్రహించిన గ్రామస్థులు రంగంలోకి దిగారు. వాళ్లే రోడ్డు వేసుకున్నారు. గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నారు. వారి కృషిని గుర్తించి ప్రభుత్వం కూడా కొంత సహకారమందించింది. ఇప్పుడు మాలీనాంగ్ ఓ పర్యాటక ప్రదేశంగా మారింది. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే రూ.50 టికెట్ తీసుకుని వెళ్లాలిప్పుడు. 8వ తరగతి వరకు స్కూలు నిర్మించుకున్న గ్రామస్థులు.. తమ ఇళ్లను కూడా అందంగా తీర్చిదిద్దుకున్నారు. విశేషమేంటంటే.. మాలీనాంగ్ ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పురస్కారం అందుకుంది. పుంసరి... 24 గంటలూ ప్రతి ఇంటికీ ఉచితంగా వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుకునే సౌకర్యం, సీసీ టీవీ కెమెరాలు, వాటర్ ప్రూఫ్ పబ్లిక్ స్పీకర్లు.. రెండు పాఠశాలలు, మినరల్ వాటర్, ఇంకా ఎన్నెన్నో సౌకర్యాలు.. ఇవన్నీ చూస్తే ఏదో ఒక కంపెనీ కాలనీలాగా, ఉద్యోగుల క్వార్టర్స్లాగా అనిపిస్తుంది కదా... కానీ పొరబాటు. ఇవి గుజరాత్‌లోని పుంసరి గ్రామంలో ఉన్న సౌకర్యాలు. గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ సౌకర్యాలు ప్రభుత్వం సమకూర్చినవి కావు. కొన్నేళ్ల క్రితం ఆ ఊరి భూములు కొన్ని ఫ్లాట్లు వేసి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుకు విరాళాలు కూడా కలిపి గ్రామస్థులు సమకూర్చుకున్న సౌకర్యాలు. ప్రభుత్వం నడిపే ఆర్టీసీ బస్సుల్ని నమ్ముకోకుండా.. సొంతంగా బస్సును కూడా ఏర్పాటు చేసుకున్నారు. రోడ్లు వేసుకున్నారు. కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు రూపాయలిస్తే 20 లీటర్ల మినరల్ వాటర్ దొరుకుతుంది. గ్రామస్థులంతా సోలార్ పవర్ బల్పులు వాడుతూ విద్యుత్ పొదుపు చేస్తున్నారు. అవసరమైనపుడు ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని పుంసరిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దారు పంచాయతీ సభ్యులు. 2012లో పుంసరి దేశంలోనే అత్యుత్తమ పంచాయతీగా రాష్ట్రపతి పురస్కారం గెలుచుకుంది. -
శ్రీబాగ్ ఒప్పందాన్ని ఆమోదించాలి
సీమ హక్కులను నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటే బాస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల స్పష్టీకరణ మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ఊపందుకున్న వేళ రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం సీమ నేత లు స్వరం పెంచుతున్నారు. రాయలసీమను సౌభాగ్య సీమగా మార్చగల ‘శ్రీబాగ్ ఒప్పందం’ అమలు కోసం భారతీయ అంబేద్కర్ సేన (బాస్) కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా శనివారం పట్టణంలోని బేబి వెల్కమ్ హోమ్‌లో పార్టీలకు అతీతంగా, ప్రజాసంఘా లు, వివిధ రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘రాయలసీమ సమస్యలు-పరిష్కార మార్గాలు’ అన్న అంశంపై బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివప్రసా ద్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగిం ది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ చినబాబు, టీడీపీ మాజీ ఎమెల్యే దొమ్మలపాటి రమేష్, వల్లిగట్ల రెడ్డెప్ప, సీపీఐ నాయకులు కృష్ణప్ప, సమాజ్‌వాదీ పార్టీకి చెంది న తుర్ల ఆనంద్యాదవ్తో పాటు పలు స్వ చ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, కుల సం ఘాల నాయకులు పాల్గొని సీమ సమస్యలను వివరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్(జీవోఎం)బిల్లులో శ్రీబాగ్ ఒప్పందంపై చర్చించక పోవడాన్ని పలువురు నేతలు తీవ్రం గా ఖండించారు. ఇప్పటికైనా సీమ హక్కులపై స్పందించి లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించి, శ్రీబాగ్ అమలును ఆమోదించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేకుంటే సీమ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా తిరుగుబాటు తప్పదని నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో బాస్ జిల్లా అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు జింకా వెంకటాచలపతి, పోర్డు లలితమ్మ, కృషి సుధాకర్, డీఎస్ఎస్ నాయకుడు చిన్నప్ప, బీసీ నాయకులు పులిశ్రీనివాసులు, డీవీ.రమణ, రాయల్‌బాబు, కొమరం భీమ్ అధ్యక్షులు దివాకర్, బాస్ నాయకులు శ్రీచందు, కేవీ.రమణ, నాషీ, మను, లారా, లక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మండలిలో చర్చిస్తాం ఏళ్ల తరబడి రాయలసీమ కరువు కోరల్లో విలవిల్లాడుతోం ది. ఇక్కడి ప్రజల నీటి కష్టాలు వర్ణనాతీతం. వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక రంగం, అభివృద్ధి సూచిల్లో తెలంగాణ కంటే సీమ వెనుకబడింది. శ్రీబాగ్ ఒప్పంద అమలు ద్వారా సీమ కష్టాలు తీరుతాయి. దీనిపై శాసనమండలిలో చర్చిస్తా. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీ పొలిట్‌బ్యూరోలో మాట్లాడుతా. - ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి (వైఎస్సార్సీపీ) మ్యానిఫెస్టోలో పెట్టేవిధంగా ఒత్తిడి తెద్దాం శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తామని రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ మ్యానిఫెస్టోలో పెట్టే విధంగా సీమ నేతలు ఒత్తిడి తేవాలి. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఈ ప్రమాదం నుంచి సీమను కాపాడుకోవాలంటే శ్రీబాగ్ ఒప్పందం అమలు జరగాల్సిందే. - దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే(టీడీపీ) నదీ జలాలు సీమకే కేటాయించాలి కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల నీటిపై శ్రీబాగ్ ఒప్పందం ద్వారా సంపూర్ణ హక్కులు లభించినా, దాన్ని కాలరాసి కోస్తాంధ్ర, తెలంగాణాలకు నదీజలాలను తరలించుకుపోతున్నారు. 40 అడుగుల్లో భూగర్భ జలాలున్న కోస్తాంధ్రకు నదీజలాలు ఇస్తున్నారు. వెయ్యి అడుగుల బోర్లు వేసినా నీళ్లు పడని సీమకు నదీ జలాలు ఇవ్వకుండా ఎడారిగా మార్చారు. సీమాంధ్ర నేతలు శ్రీబాగ్ ఒప్పందం అమలుకు కృషి చేయాలి. - జింకా చలపతి వైఎస్సార్సీపీ సీమను సింగ్‌పూర్‌లా మార్చుకుందాం 30 ఏళ్లలో సింగపూర్ ఎంతో అభివృద్ధి సాధించి అమెరికా వంటి దేశాలతో పోటీపడుతోంది. సీమలో అపారమైన ఖనిజ, అటవీ సంపద ఉన్నాయి. నదీజలాలు, విద్యుత్ మిగులు ఉంది. కష్టజీవులున్నారు. ఈ వనరులన్నీ వినియోగంలోకి తెస్తే రాయలసీమ రానున్న 20 ఏళ్లలో సింగపూర్ ను మించిపోతుంది. శ్రీబాగ్ ఒప్పందం అమలుకు రాజకీ య పార్టీలు ఉద్యమించాలి. - పీటీఎం. శివప్రసాద్, బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు