
న్యూఢిల్లీ: దేశంలో ఫిట్‌నెస్‌పై అధిక అవగాహన ఉన్న నగరాలుగా గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ నిలిచాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ నగరాల్లోని ప్రజలు రోజుకు 340 కేలరీలు ఖర్చు చేయటంతో పాటు నెలలో సగటున 10 రోజులు కసరత్తులు చేస్తున్నారని వెల్లడైంది.
దేశంలోని 220 పట్టణాల్లో సుమారు 30.6 లక్షల మందికి సంబంధించిన ఆహారపు అలవాట్లు, వ్యాయామ సమాచారాన్ని మొబైల్ ఫిట్‌నెస్ యాప్ ‘హెల్తీఫైమ్’ సేకరించింది. ఈ జాబితాలో కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్‌లు చివరి స్థానాల్లో నిలిచాయని, ఇక్కడ పురుషుల కంటే మహిళలే ఫిట్‌నెస్‌పై అధిక శ్రద్ధ కనబర్చుతున్నారని పేర్కొంది. దేశంలో మహిళల కంటే పురుషులే ఫిట్‌నెట్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని వెల్లడించింది. పురుషులు నెలలో సగటున 14 రోజులు, మహిళలు 11 రోజులు వ్యాయామం చేస్తున్నారని పేర్కొంది.