Kaleshwaram
-
‘హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటం కాదు.. అది చేసిన కేసీఆర్ పుణ్యం’
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని.. హైదరాబాద్‌లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం.. చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీష్‌రావు మాట్లాడుతూ..‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది. గత ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో భూసేకరణ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. ఇవ్వాళ ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి. రంగనాయక సాగర్ లో, కొండపోచమ్మ, మిడ్ మానేరు లో నీళ్ళు ఉన్నాయి. కక్షపూరితంగానే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరం భూ సేకరణ చేయడం లేదు.కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి సిస్టం అంత రెడీ చేశారు. పంపు హౌస్‌లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. కేవలం భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది ఉంది. కానీ, ఈ సంవత్సరం కాలంలో ఒక్క ఎకరా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణ చేయలేదు. చేయకపోవడం వల్ల చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న సందర్భం ఉన్నది.కొండెంగులకుంట, బిక్కబండ రైతులు అందరూ వస్తే.. స్వంత డబ్బులతో మిషన్లు పెట్టి.. స్వంత డబ్బులు పెట్టీ, భూ సేకరణలో నష్ట పోతున్న వారికి డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వి నీళ్లు అందిస్తున్నాం. ప్రభుత్వం పనిచేయట్లేదు. ప్రేమతో పని చేయాలి కానీ కక్షతో పని చేస్తున్నది. నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడాను. పిల్ల కాలువలు తవ్వితే రైతులకు ఆయకట్టు పెరుగుతుంది. కనీసం 15, 20 కోట్లు భూసేకరణకు విడుదల చేయండి అని కోరాను.చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువ కు నీటిని విడుదల చేసిన మాజీ మంత్రి @BRSHarish గారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..- కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది.- గత ఏడాదిన్నర… pic.twitter.com/o9z1QQTWWm— Office of Harish Rao (@HarishRaoOffice) April 6, 2025అసెంబ్లీలో కూడా కట్ మోషన్ ఇచ్చి నిరసన తెలపడం జరిగింది. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని. కోకాకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం నీళ్లు ఉండబట్టి వచ్చింది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుంగిన ఒకటో రెండో పిల్లర్లను మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్న. కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలోని పెద్దవాగు, సుంకిశాల, SLBC సొరంగం, వట్టెం ప్రాజెక్టులు కూలిపోయాయి. కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు. కాళేశ్వరం ద్వారా సిద్ధిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. ఇది కేసీఆర్ చేసిన పుణ్యం. హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు. సిద్ధిపేట ఒక్కటే కాదు ఎన్నో నియోజకవర్గాలకు నీళ్ళు అందుతున్నాయి. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కాళేశ్వరంలో మొదలుకానున్న మహాశివరాత్రి ఉత్సవాలు
-
కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరోసారి పొడిగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీల్లో అవకతవకలపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ఏప్రిల్ 30 వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 23న హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచారణ కొనసాగించనున్నారు. ఈ దఫా మిగిలిన విచారణతో పాటు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. కాగా తదుపరి జరగనున్న విచారణలోఅధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లలతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్ద నాయకులను కూడా పిలిచే అవకాశముందని తెలుస్తోంది. -
వరంగల్ : కాళేశ్వరంలో అంగరంగవైభవంగా మహాకుంభాభిషేకం (ఫొటోలు)
-
సీతారామచంద్ర స్వామికి కాసుల పంట
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారికి కాసుల పంట పండింది. ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం దేవాదాయ శాఖ, దేవస్థాన అధికారుల సమక్షాన చిత్రకూట మండపంలో లెక్కించారు. ఈ సందర్భంగా 36 రోజులకు రూ.1,13,23,178 ఆదాయం నమోదైంది. ఇవికాక 0.109 గ్రాముల బంగారం (Gold), 0.895 గ్రాముల వెండితో పాటు యూఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా, యూఏఈ దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో రమాదేవి తెలిపారు. జనవరిలో స్వామి వారి అధ్యయనోత్సవాలు, ఉత్తర ద్వారదర్శనం, తెప్పోత్సవం, సంక్రాంతి (Sankranti) సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కూడా ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పూర్వగిరిలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచియాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. శ్రీస్వామి వారు ఊరేగే వాహన సేవలను, ఆలయంలో యాగశాలను సైతం సిద్ధం చేశారు. ఈనెల 7వ తేదీ (శుక్రవారం) నుంచి.. ఈ నెల 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఏడు రోజులు మొక్కు పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ముగిశాయి.కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నా యి. ఈ మేరకు దేవస్థానంలో దేవాదా యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయం, గోపురాల పైకి ఎక్కి కలశాలకు సంప్రోక్షణ జరిపేందుకు పరంజాలతో మెట్ల మార్గం నిర్మించారు. ప్రధాన ఆలయంతోపాటు గోపురాలకు తుని తపోవనం పీఠా ధిపతి సచ్చిదానందసరస్వతితో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మూడు రోజు లు భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నదానం నిర్వహిస్తారని ఈవో మహేశ్ తెలిపారు. చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి -
కాళేశ్వరం కమిషన్ ముందుకు.. ఆ మూడు సంస్థల ప్రతినిధులు
-
ఇవాల్టీ నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం
-
మాజీ CS సోమేశ్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ సీరియస్
-
కాళేశ్వరం విచారణకు స్మితా సబర్వాల్.. హాజరుకానున్న మాజీ సీఎస్
-
సుందిళ్ల బ్యారేజీ ఇంజినీర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
సాక్షి ,హైదరాబాద్ : సుందిళ్ల బ్యారేజీల నిర్మాణల కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగం(సీడీవో) ఇంజినీర్లపై కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణాలపై అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా ఇంజినీర్లు సమాధానాలు చెప్పడంపై మండిపడింది. నిర్మాణాలపై తప్పుడు సమాధానాలు చెబితే క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజి సహా కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్షేత్రస్థాయి ఇంజినీర్లతో జరిపిన రెండు రోజుల పాటు జరిపిన బహిరంగ విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ తొలిరోజైన సోమవారం మేడిగడ్డ, రెండో రోజైన మంగళవారం సుందిళ్ళ బ్యారేజి నిర్మాణాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగాని(సీడీవో)కి చెందిన ఏఈఈ,డీఈ,ఈఈ,డీసీఈ’ 16మంది ఇంజినీర్లను కమిషన్ సుందిళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగింది. కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలకు ఇంజినీర్లు తప్పుడు సమాధానాలు చెప్పిటన్లు తెలుస్తోంది. అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా సమాధానాలు మార్చి చెప్పడంపై కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుందిళ్ళ బ్యారేజి బ్లాక్ 2ఏను డిజైన్ లేకుండానే నిర్మాణం చేశామని ఇంజినీర్లు కమిషన్‌కు వెల్లడించారు. దీంతో డిజైన్ లేకుండానే బ్లాక్ ఎలా నిర్మించారు? ఎలా సాధ్యమైంది? అని కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నకు.. ఒకటో బ్లాక్,మూడు బ్లాక్‌ల మధ్య 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని ఒకసారి..రెండు,మూడు బ్లాక్‌ల మధ్య నిర్మాణం చేశామని బదులిచ్చారు. మధ్యలో రెండో బ్లాక్ తర్వాతే 2ఏ బ్లాక్ కట్టామని కమిషన్‌కు ఓ ఇంజినీర్ వివరించారు. 2ఏ బ్లాక్‌కు డిజైన్ లేకపోవడంతో రెండో డిజైన్ ఆధారంగా 2ఏ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పటి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే డిజైన్ లేకపోయినా 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని కమిషన్‌కు వివరించారు.ఇలా ఇంజినీర్లు చెప్పిన తప్పుడు సమాధానాలపై అవసరమైతే క్రిమినల్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని కమిషన్ హెచ్చరించింది. 16 మంది ఇంజినీర్ల నుండి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుంది. ఆ రికార్డ్లను స్వాధీనం చేసుకున్న అనంతరం కమిషన్ తన విచారణను ముగించింది.తొలిరోజు మేడిగడ్డ నిర్మాణాలపై ప్రశ్నల వర్షంతొలిరోజు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో పియర్స్ కుంగుబాటుకు కారణాలతో పాటు ఇతర నిర్మాణలపై కమిషన్ ఇంజినీర్లకు పలు ప్రశ్నలు సంధించింది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ముందే సిద్ధం చేసుకుని వచ్చిన సమాధానాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణలకు సంబంధించిన ఇంజినీర్లు సమర్పించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్.. వారితో సంతకాలు చేయించుకుని విచారణను నిలిపివేసిందిఇవాళ (మంగళవారం) సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపై ఇంజినీర్లను కమిషన్ బహిరంగంగా విచారించింది. విచారణలో ఇంజినీర్లు చెప్పిన సమాధానాలకు కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి..నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా. ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా.. కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది.ఇది తెలంగాణ రైతుల ఘనత.. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం.. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం.. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు’ అంటూ సీఎం రేవంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
టెస్టులయ్యాకే తుది నివేదిక!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు వరద తగ్గిపోయాక జియోఫిజికల్, జియోటెక్నికల్, ఎలక్టోర్రెసిస్టివిటీ టోమోగ్రఫీ, సాయిల్ (భూసార) పరీక్షలను నిర్వహించి నివేదిక సమర్పించాలని, ఆ తర్వాతే ఈ మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన శాశ్వత చర్యలను సిఫారసు చేస్తూ తుది నివేదిక అందిస్తామని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పష్టం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం ఈ నెల 11న ఢిల్లీలో ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌తో సమావేశమైంది.బరాజ్‌ల పునరుద్ధరణకు శాశ్వత చర్యలను సాధ్యమైనంత త్వరగా అందించాలని కోరింది. అయితే మధ్యంతర నివేదికలో తాము సిఫారసు చేసిన అన్ని పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహించి నివేదికలు అందిస్తేనే తుది నివేదిక ఇవ్వగలమని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం మూడు బరాజ్‌లకు నిరంతరం వరద కొనసాగుతుండడంతో పరీక్షలు ముందుకు సాగడం లేదు. దీంతో నవంబర్‌లో వరదలు తగ్గుముఖం పట్టాక పరీక్షలు పునరుద్ధరించాలని నీటిపారుదల శాఖ యోచిస్తోంది. అయితే మేడిగడ్డ బరాజ్‌కు ప్రాణహిత నది నుంచి ఫిబ్రవరి వరకు వరద కొనసాగనుంది. దీంతో అక్కడ పరీక్షలు పూర్తి చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.రబీకి సాగునీటిపై నీలినీడలు ప్రస్తుత రబీలో లోయర్, మిడ్, అప్పర్ మానేరుతో పాటు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల కింద 20 లక్షల ఎకరాల వరి సాగు జరగనుంది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేసి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తేనే ఈ మేరకు ఆయకట్టుకు సాగునీరుతో పాటు వేసవిలో తాగునీటి సరఫరాకు వీలు కలగనుంది. దీంతో కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్‌కి దిగువన గోదావరిపై జియోట్యూబ్‌లతో మట్టికట్ట కట్టి నిల్వ చేసిన నీళ్లను అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు ఎత్తిపోసి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది.కానీ బరాజ్‌లలో నీళ్లు నిల్వ చేసేందుకు ఎన్డీఎస్ఏ అనుమతి ఇవ్వడం లేదు. తాము తుది నివేదిక ఇచ్చేవరకు ఆగాలని స్పష్టం చేస్తుండడంతో రబీలో శ్రీరాంసాగర్, లోయర్, మిడ్, అప్పర్ మానేరు, కడెం ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై సందిగ్ధత నెలకొంది. కాగా నవంబర్‌లో బరాజ్‌లకి పరీక్షలన్నీ పూర్తి చేసి నివేదిక సమరి్పస్తే, డిసెంబర్లో ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. షీట్‌పైల్స్‌తో బరాజ్‌లకు రక్షణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ర్యాఫ్ట్ (పునాది)కి రక్షణగా దాని కింద భూగర్భంలో వేసిన సికెంట్ పైల్స్ విఫలం కావడంతోనే బరాజ్‌లు విఫలమైనట్టు నీటిపారుదల శాఖలోని నిపుణులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. దీంతో సికెంట్ పైల్స్‌కు ప్రత్యామ్నాయంగా బరాజ్‌ల పునాదికి రెండు వైపులా భూగర్భంలో 8–9 మీటర్ల వరకు షీట్‌పైల్స్‌తో కటాఫ్ వాల్ నిర్మిస్తే బరాజ్‌లలోని లోపాలను సరిదిద్దినట్టు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.ఆ తర్వాత అన్నారం, సుందిళ్లలో నీళ్లను నిల్వ చేసినా సీపేజీ సమస్యలు రావని అంటున్నారు. అయితే బరాజ్‌ల పునరుద్ధరణ చర్యలను సిఫారసు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏకు అప్పగించిన నేపథ్యంలో ఆ సంస్థ సిఫారసులు చేసేవరకు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్ కుంగిన నేపథ్యంలో బరాజ్ పునరుద్ధరణ సాధ్యమేనా? కుంగిపోయిన భాగాన్ని తొలగించి మళ్లీ 7వ బ్లాక్‌ను పునరి్నర్మించాలా? బరాజ్ పునరుద్ధరణ సాధ్యంకాని పక్షంలో ఇతర ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటి? అనే అంశంపై ఎన్డీఎస్ఏ తన తుది నివేదికలో తేల్చి చెప్పే అవకాశాలున్నాయి. -
బరాజ్‌ల వైఫల్యంలో 20 మంది ఇంజనీర్లు!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి 20 మంది ఇంజనీర్లు బాధ్యులని జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ ప్రాథమికంగా తేలి్చనట్టు సమాచారం. ఈ బరాజ్‌లపై విచారణ జరిపిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో 10 మంది దాకా ఇంజనీర్లు బాధ్యులని తేలి్చంది. ఈ మేరకు విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను కాళేశ్వరం కమిషన్‌కు అందించింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అలసత్వం బరాజ్‌ల వైఫల్యానికి కారణాలని ఎన్ఫోర్స్మెంట్ తన నివేదికలో పేర్కొంది.పూర్తి నివేదిక అందించడానికి మరికొంతకాలం గడువు కావాలని విజిలెన్స్ నివేదించగా.. పత్రాలన్నీ ఇస్తే తామే వైఫల్యానికి కారణాలను తేల్చుకుంటామని కమిషన్ స్పష్టం చేయడంతో నెలాఖరుకల్లా నివేదిక అందించడానికి విజిలెన్స్ అంగీకరించింది. ఇక విచారణను తప్పుదోవ పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలతోపాటు, క్రిమినల్ కేసుల నమోదుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిషన్ యోచిస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన కేసులో ఉన్న ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదని ప్రభుత్వానికి లేఖ రాయాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. చాలామంది అధికారులు అఫిడవిట్ రూపంలో దాఖలు చేసిన సమాచారంలో ఈ విషయాన్ని కమిషన్ గుర్తించింది. విచారణను తప్పుదోవ పట్టించడానికి వీరు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినట్టు తేలింది.ఇక కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో ముడిపడిన అన్నీ డాక్యుమెంట్లు అందించాలని నీటిపారుదలశాఖను మరోమారు కమిషన్ ఆదేశించింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్, ఎం–బుక్ (మెజర్మెంట్ బుక్)లు కూడా కమిషన్‌కు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండురోజులుగా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈ రెండు బుక్‌లకు సంబంధించిన ప్రస్తావన పలు సందర్భాల్లో వచ్చింది. దీంతో క్రాస్ ఎగ్జామినేషన్‌లో పేర్కొన్న వివరాలు సరైనవా? కావా? అనేది నిర్ధారణ కావాలంటే కీలకమైన రెండు బుక్‌లను తెప్పించుకోవడమే మేలని కమిషన్ నిర్ణయించింది. కాళేశ్వరంపై ఇదివరకే కాగ్ నివేదిక ఇచి్చన నేపథ్యంలో ఆ అధికారిని పిలిపించి, సమాచారం సేకరించాలని కమిషన్ నిర్ణయించింది.40 మంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని.. విచారణలో భాగంగా మంగళవారం నుంచి శనివారం దాకా 40 మంది దాకా ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కమిషన్ నిర్ణయించింది.తాజా జాబితాలో మాజీ ఈఎన్సీతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.ఇంజనీర్లను పూర్తిగా ప్రశ్నించిన తర్వాత ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లకు కమిషన్ కబురు పంపనుంది. ఆ పిదప కీలక ప్రజాప్రతినిధులకు కూడా సమన్లు పంపించనుంది. ఇప్పటికే విచారణలో స్పష్టత వచి్చంది.లాయర్ లేకుండానే క్రాస్ ఎగ్జామినేషన్ లాయర్ లేకుండానే ఒంటరిగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది. వాస్తవానికి శుక్ర, శనివారాల్లో మొత్తం 18 మందిని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒకవేళ కమిషన్ లాయర్‌ను సమకూర్చుకుంటే..ప్రతివాదులు కూడా లాయర్లనుతెచ్చుకుంటున్నారని, దీనివల్ల రోజుకు ఒక్కరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేమనే అభిప్రాయానికి కమిషన్ వచి్చంది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో లాయర్లను అనుమతించడమంటే... విచారణ ప్రక్రియను మరింత జఠిలం, వాయిదా వేయడమే అవుతుందనే అభిప్రాయంలో కమిషన్ ఉంది. అయితే కమిషన్‌కు న్యాయవాదిని సమకూర్చడానికి ప్రభుత్వం ఇదివరకే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. -
హరీష్ హార్డ్ వర్కర్.. మాకు సలహాలు ఇవొచ్చు: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మల్లన్న సాగర్‌కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం వాటరా? లేక ఎల్లంపల్లి నీళ్లా? అనేది హరీష్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఇరిగేషన్ మాజీ మంత్రిగా హరీష్.. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చు అంటూ కామెంట్స్ చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే హరీష్ రావు హార్డ్ వర్కర్, ఆయనకు కష్టపడేతత్వం ఉంది. అబద్దాలతో ప్రజలను మేనేజ్ చేస్తామంటే కుదరదు. రాజకీయం చేయడం మా ప్రాధాన్యత కాదు. రైతులకు నీళ్లు ఇవ్వడమే మాకు ముఖ్యం. హరీష్ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. మలన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు ఎక్కడివి?. ప్రభుత్వం తరఫున హరీష్ రావును అడుగుతున్నాను. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కాళేశ్వరం నీళ్లా? ఎల్లంపల్లి వాటరా?.బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేసేందుకు హరీష్ ప్రయత్నం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రిగా ప్రభుత్వానికి ఆయన సలహాలు ఇవ్వొచ్చు. సూచనలు కూడా చేయవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పూర్తి అయ్యింది. ఎల్లంపల్లి ప్రారంభోత్సవానికి వస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అంటే.. హెలికాప్టర్ పేల్చేస్తానని చెప్పాను. ఇంజనీర్ కాని ఇంజనీర్ కేసీఆర్ నిర్వాకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిరాకుండా పోయింది. కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ధ్వంసానికి కుట్ర జరిగిందని ఆనాటి అధికారులు చెప్పారు. కేసీఆర్ పాలనలోనే కాళేశ్వరం కుంగిపోయి నిష్ప్రయోజనంగా మారింది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం? -
kaleshwaram commission: ‘తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం.. కమిషన్ ముందుకు తెలంగాణ రీసెర్చ్ అధికారులు హాజరయ్యారు. అయితే, కాళేశ్వరం కమిషన్ ముందు రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి వింత సమాధానాలు చెప్పారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ ఆమె చెప్పిన సమాధానాలకు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ షాక్ అయ్యారు. శ్రీదేవి పని చేసిన పిరియడ్‌లో ఏమి గుర్తుకు ఉందో చెప్పాలని కమిషన్ ఛైర్మన్ అడ్డగా.. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ శ్రీదేవి సమాధానాలు చెప్పింది.2017 నుంచి 2020 వరకు కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణం సమయంలో పనిచేసిన శ్రీదేవి.. మోడల్ స్టడీస్ ఎప్పుడు చేశారు? ఫ్లడస్ ఎప్పుడు వచ్చాయి అనే ప్రశ్నలకు తనకు గుర్తుకు లేదంటూ దాటవేసేందుకు యత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్‌గా ఆమె పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.కాగా, మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అంటూ రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు కమిషన్‌కు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణాలు మొదలైనట్లు కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు ఒప్పుకున్నారు. మేడిగడ్డతో పాటు ఇతర డ్యామేజ్ జరగడానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడం వల్లేనని కమిషన్‌కు ఇంజనీర్లు తెలిపారు.ఇదీ చదవండి: ‘ఓటుకు నోటు కేసుపై రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దు’వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కమిషన్ ముందు చెప్పిన రీసెర్చ్ ఇంజనీర్లు.. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్‌లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజీలు డామేజ్ అవ్వడానికి మోడల్ స్టడీస్‌కి సంబంధం లేదని రీసెర్చ్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు బ్యారేజీలలో నీళ్లు నిలువ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని కాళేశ్వరం కమిషన్.. రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది.అన్నారం గ్యారేజీ నిర్మాణం చేసే లొకేషన్ మారినట్లు రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా?. మూడు బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేయాలని ఎవరి ఆదేశాలు ఉంటాయని కమిషన్ ప్రశ్నించగానిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని కమిషన్ ముందు చెప్పిన ఇంజనీర్లు. లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మూడు బ్యారేజీలలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక వైపు నిర్మాణం జరుగుతుండగానే... మరొకవైపు రీసెర్చ్ కొనసాగుతుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. -
TG: కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పొడిగింపు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రెండు నెలలపాటు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31వ తేదీ వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా శనివారం(ఆగస్టు31) జీవో జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై ఉమ్మడి ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో ముఖ్య అధికారులుగా పనిచేసిన వారిని విచారించింది. తాజాగా గడువు పొడిగించడంతో విచారణ పూర్తయిన తర్వాతే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుంది. -
కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు విచారణ
-
డెడ్ స్టోరేజీతో బోసిపోతున్న మానేర్ రిజర్వాయర్
-
కాళేశ్వరానికి బీఆర్ఎస్ నేతలు
-
మీ ఏడుపే మా ఎదుగుదల.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఎంత చాలా ప్రాధాన్యత ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. గోదావరి జలాలను రైతులకు అందించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తాజాగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. మా కరువులకు కన్నీళ్ల కుశాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకుఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం!తలాపున గోదారి గలగల పారుతున్నతనువంతా ఎడారై ఎండిన శాపానికివిమోచనం కాళేశ్వరం!సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం..!దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం!శిథిల శివాలయంగా పాడుబడిపోయినశ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవమిచ్చినపుణ్య వరం కాళేశ్వరం!నీళ్లు రాక..ఒట్టిపోయిన నిజాంసాగర్ కునిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం!మండుటెండల్లో చెరువులను మత్తళ్లుదూకించిన మహత్యం కాళేశ్వరం!మా తపనకు..ఆలోచనకు ..అన్వేషణకుజలదౌత్యానికి... నిదర్శనం కాళేశ్వరం..!కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదని తెలియని మీ అజ్ఞానం!ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజంసరిదిద్దుకోగలం...!రాజకీయ కుళ్ళు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం..!మీ ఏడుపే మా ఎదుగుదల..!#KaleshwaramProject అని కామెంట్స్ చేశారు. మా కరువులకు కన్నీళ్ల కుశాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకుఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం!తలాపున గోదారి గలగల పారుతున్నతనువంతా ఎడారై ఎండిన శాపానికివిమోచనం కాళేశ్వరం!సముద్ర…— KTR (@KTRBRS) July 2, 2024 -
కీచక ఎస్సై పాపం పండింది
-
లైంగిక ఆరోపణలు.. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ డిస్మిస్
సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్‌పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్ఐను డిస్మిస్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ను సర్వీస్ నుంచి ప్రభుత్వం తొలగించింది. భవానీ సేన్ వేధింపులపై మహిళా కానిస్టేబుల్.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ భవానీ సేన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి రెండు సార్లు లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. కాగా, ఇతని వ్యవహారశైలిపై ‘సాక్షి’కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్ రివాల్వర్‌ను అడ్డుపెట్టుకుని రాసలీలలు చేయడంలో తనకు తనే సాటి. గతంలో పనిచేసిన మంచిర్యాల జిల్లాలో ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి సస్పెండ్ అయిన ఘన చరిత్ర ఆయనది. తన దగ్గర పనిచేసే మహిళా సిబ్బందిని డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఇబ్బందికి గురిచేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘నేను అందంగా లేనా... నన్ను వద్దంటావా...? కారణం చెప్పవా.. అనే మాటలు ఆయన దగ్గర పనిచేసే మహిళా సిబ్బంది, ఫిర్యాదుదారులు ఒక్కసారైనా ఎదుర్కోవాల్సిందే. అవసరం లేకున్నా రాత్రి వరకు మహిళా సిబ్బందిని స్టేషన్లో ఉంచుకుని హింసపెట్టడం తన దినచర్యలో భాగంఆయన నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని.. నాకేం కాదు. ఇది చెప్పుకుంటూ పై అధికారులను మొదలుకొని కింది సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతగాని బెదిరింపులు భరించలేక ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్సై, ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ బదిలీ చేసుకుని వెళ్లినట్లు సమాచారం. చోటామోటా నాయకులు స్టేషన్‌కు వస్తే చాలు... అందరికి వినిపించేలా ‘బాబన్న బాగుండా.. నాకు ఇంతకుముందే ఫోన్ చేసిండు’ అంటూ తనకు తానే డప్పు కొట్టుకోవడం కనిపిస్తుంటుంది.ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో పోలీస్ అధికారులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న రాసలీలల ఘనుడి విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో... తన కామవాంఛలను పనిచేసిన ప్రతీచోట మహిళా సిబ్బందిపై తీర్చుకుంటూ పోతున్నాడు. ఇలాంటి ఖాకీచకులపై పోలీస్‌శాఖ చర్యలు తీసుకోకుంటే మహిళలు ఆ శాఖకు రావాలంటేనే భయపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి పెడితే ఇలాంటి ఘనుల బాగోతం వెలుగు చూసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో వేగం పెంచిన కమిషన్
-
కాళేశ్వరం పరిశీలించిన శాస్త్రవేత్తలు
-
కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇటీ వల సమర్పించిన మధ్యంతర నివేదికలో సిఫారసు చేసిన అత్యవసర మరమ్మతులు, తదుపరి పరీక్షలను ఏకకాలంలో చేపట్టాలని అధికారులను ఆదే శించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. వర్షాలు ప్రారంభం కాకముందే వీలైనవన్నీ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనుల పురోగతిపై రోజువారీగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి నివేదిక సమర్పించాలని ఆ శాఖను కోరింది. కమిటీ సిఫారసు చేసిన మేరకు సీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో బ్యారేజీల్లోని లోపాలపై తదుపరి పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) జరిపించాలని సూచించింది. జియో టెక్నికల్, జియోఫిజికల్ పరీక్షల నిర్వహణ కోసం ఒక్కో సంస్థకు ఒక్కో బ్యారేజీ బాధ్యతలను అప్పగించనుంది. మరమ్మతులు, పరీక్షలు ఏకకాలంలో నిర్వహించాలని ఆదేశించింది. మేడిగడ్డలో ఆ గేట్లు ముందే ఎత్తేయండిమేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ఏడో నంబర్ బ్లాక్‌లోని గేట్లన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పియర్లు కుంగిపోవడంతో 20, 21వ నంబర్ గేట్లను ఎత్తడం సాధ్యం కాదని, వాటి విడిభాగాలను విడదీసి తొలగిస్తామని ఇంజనీర్లు వివరించారు. ఆ ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు!బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సొంత బాధ్యతతో నిర్వహించడానికి నిర్మాణ సంస్థలు ముందు వస్తే సరి.. లేకుంటే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాకపోయినా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు ధ్రువీకరిస్తూ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్, మరో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌పై సస్పెన్షన్ వేటు వేసేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై కూడా..ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ సమర్పించిన మధ్యంతర నివేదికల ఆధారంగా బ్యారేజీల నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీకి మరమ్మతుల నిర్వహణకు ఇంకా ముందుకు రాని నిర్మాణ సంస్థను రప్పించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నారం, సుందిళ్ల నుంచి సాగునీరుమేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో దానికి ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీళ్లను ఎత్తిపోసి వచ్చే వానాకాలంలో రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. -
కాళేశ్వరంపై న్యాయ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన బీఆర్కేఆర్ భవన్లో తనకు కేటాయించిన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.నీటిపారుదల శాఖపై ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నిర్వహించిన దర్యాప్తు నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలతో పాటు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లను జస్టిస్ చంద్రఘోష్ కు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు అందజేసినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలపై న్యాయ విచారణ కోసం ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే. కాగా, 26 లేదా 27 తేదీల్లో బ్యారేజీల సందర్శనకు ఆయన వెళ్లే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. నేడు అధికారులతో మళ్లీ భేటీ గురువారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వం ఆయనకు అందజేయనున్నట్టు తెలిసింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లకు నోటీసుల జారీపై గురువారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
రాష్ట్రంలో NDSA ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ పర్యటన
-
TS: ‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగించారు. అంతా ఊహించినట్లుగానే ఆరు గ్యారెంటీల అమలుతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో గవర్నర్ తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే తమ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందన్నారు. మిగిలిన వాటిని 100 రోజుల్లో అమలులోకి తీసుకువస్తామ్ని చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్‌లో మిగిలిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని గవర్నర్ తెలిపారు. ‘తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా దర్భార్‌లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇది మా ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలుగుతోంది’ అని గవర్నర్ అన్నారు. ‘యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు. ఇది నిజమైన ప్రజా పాలన. నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగిస్తాం. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు’అని గవర్నర్ అన్నారు. ‘లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. డ్రగ్స్ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు. 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు. మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని గవర్నర్ తెలిపారు. ఇదీచదవండి..యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ -
కాళేశ్వరం చూపించి ఓట్లడుగు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/గజ్వేల్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల కట్టిన కాళేశ్వరం కూలిపోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలింది. కేసీఆర్.. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి ఓట్లడుగు.. నేను శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ చూపించి ఓట్లడుగుతా. నీకు చేతనైతే రా..’అంటూ సవాల్ విసిరారు. ‘నేను ఏకలింగాన్ని, బుక్కెడు బువ్వోన్ని’అంటూ గజ్వేల్‌కు వచ్చిన కేసీఆర్, ఇప్పుడు ఎట్లుండో ప్రజలకు తె లుసునని అన్నారు. బక్కోడ్ని అని చెప్పుకునే కేసీఆర్ రూ.లక్ష కోట్లు దిగమింగడంతో పాటు, 10 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని, వందల ఎకరాలున్న ఫామ్‌హౌస్ చుట్టూ కాళేశ్వరం కాల్వలు నిర్మించుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.లక్ష కోట్ల అవినీతి సొమ్ము కక్కిస్తామని అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూ రల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిద్దిపేట జిల్లా గజ్వే ల్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సభల్లో ఆయన ప్రసంగించారు. అందుకే కామారెడ్డికి కేసీఆర్ ‘కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ అంటున్నారు. నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్‌కు చెబుతున్నా.. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా తగ్గకుండా 80 సీట్లు వస్తాయి. కేసీఆర్ ఓటమి భయంతో ఆగమవుతున్నారు. గజ్వేల్‌లో ఓడిపోతాననే భయంతోనే కామారెడ్డిలో పోటీ చేయడానికి వచ్చారు. కానీ కామారెడ్డిలోనూ ముఖ్యమంత్రికి అసలైన వేట తప్పదు. కన్యాకుమారి వెళ్లినా.. శంకరగిరి మాన్యాలకు వెళ్లినా పట్టుకొని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు..’అని రేవంత్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి వస్తే అండగా ఉంటాం ‘బక్కటోన్ని అని చెప్పుకునే కేసీఆర్ తింటే బకాసురుడు, పడుకుంటే కుంభకర్ణుడు. ప్రజాధనాన్ని లూటీ చేసి, భూములను కాజేశారు. నేను గజ్వేల్ వస్తున్నానని తెలిసి కొడంగల్‌కు పోయిన కేసీఆర్.. రేవంత్ నోరు తెరిస్తే కంపుకొడుతది అనడం విడ్డూరంగా ఉంది. మనమిద్దరం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయించుకుంటే ఎవరి నోరు కంపు కొడుతుందో తెలుస్తుంది. నేను సుక్క ముట్టెటోన్ని కాదు.. నీకు సుక్క లేంది నడవదు.. ఇలాంటి మతిలేని మాటలు మాట్లాడొద్దు. కాంగ్రెస్ వస్తే మల్లన్నసాగర్ నిర్వాసితులకు అండగా ఉంటాం. పోడు భూములకు పట్టాలు ఇస్తాం. తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులిచ్చి సీసీరోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు చేపడతాం. గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు రుణమాఫీ చేస్తాం. నన్ను అసెంబ్లీకి పంపి ఇందిరమ్మ రాజ్యం వచ్చేలా చేయాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. భూములు గుంజుకునే దోపిడీ దొరల రాజ్యాన్ని ప్రజలు సాగనంపాలి..’అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ మాదిరిగా సంక్షేమం ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దళితులు, గిరిజనులకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. అదే మాదిరిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తాం’అని రేవంత్ హామీ ఇచ్చారు. -
ఆలిండియా ముద్దపప్పు.. తెలంగాణ పప్పు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పప్పు రేవంత్‌రెడ్డి, ఆల్ ఇండియా ముద్దపప్పు రాహుల్ గాంధీ దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్లు మాట్లాడుతున్నారు. ఇద్దరు బిత్తిరోళ్లు ఎగేసుకుని పోయి కాళేళ్వరం ప్రాజెక్టును చూసి వచ్చి మహా ఇంజనీర్లలా బ్రిడ్జి కూలిపోతుందని తప్పు డు ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఉండే ఎక్స్పాన్షన్ జాయింట్ల ఫొటోలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అనడం రాహుల్, రేవంత్‌ల అవగాహనారాహిత్యానికి నిదర్శనం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మానకొండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి గడ్డం నాగరాజు గురువారం తన అనుచరులతో కలసి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఏఐసీసీ అంటే అల్ ఇండియా చెత్తాచెదారం, టీపీసీసీ అంటే తెలంగాణ పెరట్లో చెత్తా చెదారంలా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు, బ్లాక్ మెయిలర్, నోటుకు ఓటు దొంగ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్లో పశువుల్లా అమ్ముతున్న రేవంత్‌ను పక్క న పెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ అయిన రేవంత్‌రెడ్డి.. రాహుల్ గాందీని కూడా కోఠిలో చారాణాకో, ఆఠాణాకో అమ్మేస్తాడు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశానికి శనీశ్వరం కాంగ్రెస్ పార్టీ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి వరమైతే కాంగ్రెస్ పార్టీ దేశానికి శనీశ్వరం. బీఆర్ఎస్ది కుటుంబ పాలనంటూ మాట్లాడుతున్న రాహుల్ తన కుటుంబ నేపథ్యం ఏమిటో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టులోని చిన్న లోపాలను పెద్దవిగా చూపి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు జీవనదుల నడుమ ఉన్న తెలంగాణను దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ కరువు కోరల్లోకి నెట్టింది. కాంగ్రెస్ పుణ్యాన తెలంగాణలో నేల నెర్రెలు వారింది. విప్లవ ఉద్యమాల నెత్తురుతో ఎర్రవారింది. రాహుల్ గాం«దీకి తెలంగాణ చరిత్ర తెలియదు. తెలుసుకొనే సోయి, పరిజ్ఞానం కూడా లేదు. 60 ఏళ్ల పాలనలో తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం జరగలేదు. కాంగ్రెస్ పాలన సక్రమంగా జరిగి ఉంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎందుకు ఉద్యమించారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చి దాడి చేస్తే ఊరుకోం.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరి సాగులో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. ప్రాజెక్టు ఫెయిలైతే 3.50 కోట్ల టన్నుల ధాన్యం ఎలా పండింది? కాళేశ్వరం గురించి ఆయన పక్కన ఉన్న సన్నాసులు చెప్పేది కాకుండా రాహుల్ అసలు విషయాలు తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? కుంభకోణా ల కుంభమేళా కాంగ్రెస్ పార్టీ నీతి, నిజాయతీ గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఇది ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నడుమ జరుగుతున్న ఎన్నిక. మోదీ విధానాలు జుమ్లా లేదా హమ్లా. ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణపై దాడి చేస్తే సహించేది లేదు’అని కేటీఆర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, దరువు ఎల్లన్న, సిద్దం వేణు తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం: పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించింది. అయితే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎంతో కీలకమైంది. కాగా, మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వివరాల ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో, అప్రమత్తమైన నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు ఎల్అండ్టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని పరిశీలించిన ఈఈ తిరుపతిరావు మాట్లాడుతూ.. చీకటిగా ఉండటంతో ఏం జరిగిందనేది స్పష్టత లేదని తెలిపారు. 10.17 టీఎంసీల జలాలు 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో సంఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల జలాలు ఉన్నాయి. రాత్రి సమయంలో వంతెన కుంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తరువాత వాటిని 46కు పెంచి దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేరకు జలాశయాన్ని ఖాళీ చేసి వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది పరిశీలించనున్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీకి ‘ఎన్నికల గిరాకీ’ -
300 కిలోమీటర్ల దిగువ ప్రాంతం నుంచి ఎగువకు నీరు
-
చంద్రబాబు హయాంలో నీళ్లకోసం భిక్షమెత్తుకోవాల్సి వచ్చేది
బాల్కొండ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పాలనలో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రం శివారులో వరద కాలువ జీరో పాయింట్ వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నీటిని శ్రీరాంసాగర్‌లోకి విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడుతూ, నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నిజామాబాద్ జిల్లాకు నీటి విడుదల చేపట్టాలంటే చంద్రబాబు ఇంటి వద్ద భిక్ష మెత్తుకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ నాయకత్వంలో సాగు నీటి కష్టాలు తీరాయన్నారు. పునరుజ్జీవన పథకంతో ఆయకట్టు కింద అదనంగా 50 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోందన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లను శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి తరలించడం అపూర్వ ఘట్టమ న్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో భూములను కోల్పోయిన రైతులకు, పునరావాస గ్రామాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లు అంది ప్రతిఫలం దక్కుతోందన్నారు. రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, రేఖా నాయక్, విఠల్‌రెడ్డి, మహిళా సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం నీళ్లు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎదురెక్కాయి. శుక్రవారం శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మూడవ పంపు వద్ద బటన్ నొక్కి మోటార్లను ప్రారంభించారు. నాలుగు మోటార్ల ద్వారా నీరు ఎస్సారెస్పీలోకి ఉరకలేసింది. అనంతరం కాళేశ్వరం నీళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాజెక్ట్ నీటితో కాళేశ్వరం నీళ్లు కలుస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. -
హవ్వా...కేసీఆర్ పేరునే మార్చేసిన కవిత..పెద్ద స్కెచ్చే..
-
కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాళేశ్వరం జలాలకు ఇచ్చిన లక్ష జన హారతి.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో చోటు దక్కించుకుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలం ఈటూరు నుంచి పెన్‌పహాడ్ మండలం చీదెళ్ల చెరువు వరకు 68 కిలో మీటర్ల పొడవున, 126 గ్రామాల పరిధిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ డీబీఎం–71 కాలువ ద్వారా ప్రవహించే గోదావరి జలాలకు లక్ష హారతి కార్యక్రమం నిర్వహించారు. చివ్వెంల మండలం కాలువ వద్ద నిర్వహించిన సంబరాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన ఐడబ్ల్యూఎస్ఆర్ చీఫ్ డాక్టర్ బి.నరేందర్‌గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్ గంగాధర్. మెడల్, మెమెంటో, ప్రశంసాపత్రాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డికి అందజేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు చివ్వెంల వద్ద, జాజిరెడ్డిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కు మెమెంటోలు అందజేశారు. లక్ష అనుకుంటే అంతకు మించి జనం మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరు మండలాలకు చెందిన 126 గ్రామాల్లో వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధుల బృందం పర్యటించింది. కాళేశ్వరం జలాలకు లక్ష మందితో జన హారతి అనుకున్నప్పటికి కార్యక్రమంలో 1,16,142 మంది పాల్గొన్నట్లు బృందం నిర్ధారించింది. ఇందులో 65,042 మంది మహిళలు, 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు వెల్లడించింది. 107 వీడియో కెమెరాలు, 8 డ్రోన్లతో చిత్రీకరణ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్‌కు చెందిన మూడు బృందాల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు 107 వీడియో కెమెరాలు, 8 డ్రోన్లను వినియోగించారు. 62 కళా బృందాలు, 126 చోట్ల డప్పు మేళాలు, 54 బతుకమ్మ బృందాలు ఇందులో పాల్గొన్నాయి. కాలువ పొడవునా లక్ష మందికీ భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సన్మానించారు. కేసీఆర్‌తోనే సాధ్యమైంది: మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో పర్యటించినప్పుడు.. ఈ ప్రాంతానికి నీరు అందాలి అంటే గోదావరి జలాలే శరణ్యం అని భావించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. కేసీఆర్ కృషితోనే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు నీళ్లు పారుతున్నాయన్నారు. అందుకు సీఎంకి కృతజ్ఞత చెప్పుకునేందుకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీటిపారుదల దినోత్సవం రోజున ఈ ప్రాంత రైతాంగం కాళేశ్వరం జలానికి లక్ష జన హారతి నిర్వహించామన్నారు. -
తెలంగాణ ‘జల విజయం’పై ప్రపంచానికి పాఠాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరగనున్న ప్రపంచ పర్యావరణ, జల వనరుల సదస్సు (వరల్డ్ ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్)లో.. జలాల విషయంలో తెలంగాణ సాధించిన విజయాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించనున్నారు. అమెరికాలోని నెవడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఎఎస్‌సీఈ) ఈ సదస్సును నిర్వహిస్తోంది. అందులో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం, ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకాల ఫలితాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఆహా్వనం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ మంగళవారమే అమెరికాకు వెళ్లారు. మొత్తంగా సుమారు పది రోజుల పర్యటన తర్వాత ఈ నెల 25న కేటీఆర్ తిరిగి రాష్ట్రానికి వస్తారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో ప్రణాళికలు.. ఇప్పుడు విజయాలు మంత్రి కేటీఆర్ 2017లోనే అమెరికాలోని సాక్రమెంటో వేదికగా జరిగిన ఎఎస్‌సీఈ సదస్సులో పాల్గొని సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, మిషన్ భగీరథ తదితరాలను వివరించారు. 2022లో తెలంగాణలో పర్యటించిన ఎఎస్‌సీఈ బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఆ ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి రంగంలో గేమ్ చేంజర్‌గా అభివరి్ణంచింది. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వల్ప సమయంలో పూర్తి చేయడాన్ని ప్రశంసిస్తూ.. జల విజయాన్ని వివరించేందుకు అమెరికా రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. అమెరికా నలుమూలల నుంచి సివిల్ ఇంజనీర్లు పాల్గొనే ఈ సదస్సులో కేటీఆర్ ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ సాధించిన సామాజిక, ఆర్థిక ప్రగతిని వివరిస్తారు. ఇక అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో వివిధ రంగాల కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరిస్తారు. ఈ సందర్భంగా పలు అమెరికన్ దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇది కూడా చదవండి: రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ -
రాత్రి వేళల్లోనే మోటార్లు రన్!
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో గత నెలలోనే ట్రయల్ రన్లు పూర్తి చేసిన ఇంజనీరింగ్ అధికారులు బుధవారం అర్ధరాత్రి రెండు మోటార్లతో ఎత్తిపోతలను పునఃప్రారంభించారు. గురువారం రెండో రోజు రాత్రి 9 గంటల నుంచి రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లక్ష్మీపంపుహౌస్లో 1, 2, 3 వరుస క్రమంలోని మోటార్లతో 6,600 క్యూసెక్కులు, పెద్దపల్లి జిల్లాలోని సరస్వతీ పంపుహౌస్‌లో 2 మోటార్లతో 6 వేల క్యూసెక్కులు, పార్వతీ బ్యారేజీలో రెండు మోటార్లతో 5,800 క్యూసెక్కులు తరలిస్తున్నట్లు ఈఎన్సీ తెలిపారు. కాగా, రాత్రే మోటార్లు నడిపిస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుందని.. డిమాండ్ కూడా తక్కువగా ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రోజూ రాత్రి పూటనే మోటార్లు నడిపించడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందించినట్లు ఈఎన్సీ తెలిపారు. ప్రస్తుతం గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 9 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో 16.17 టీఎంసీల సామర్థ్యానికి 13.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతీ బ్యారేజీలో 10.87 టీఎంసీ సామర్థ్యానికి 9.20 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోయడానికి రాత్రిపూట అనుకూలంగా ఉండడంతో రాత్రి 9 గంటల నుంచి 10 మధ్య అరగంటకు ఒక్క మోటార్‌ను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. వారి వెంట ఈఈ తిరుపతిరావు, డీఈఈ సూర్యప్రకాశ్, ఏఈఈలు భరత్, వంశీరెడ్డి, రాజేంద్రప్రసాద్‌లు ఉన్నారు. -
కాళేశ్వరంలో 2 కొత్త కంట్రోల్ రూమ్స్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లు ఇటీవల గోదావరి వరదల్లో నీటమునిగిన నేపథ్యంలో వీటికి శాశ్వ త పరిష్కారం చూపే అంశంపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టిసారించింది. భవిష్యత్తులో గోదావరికి భారీ వరదలొస్తే మళ్లీ ఈ పంప్‌హౌజ్‌లు నీటమునిగే చాన్స్ ఉండడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా వీటికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్‌ను ఎత్తైన ప్రాంతంలో కొత్తగా నిర్మించాలని నిర్ణయించింది. కనీసం 6 మీటర్లు ఎత్తు పెంచి... అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల లోపలే వీటికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ నిర్మించారు. పంప్‌హౌజ్‌ల సర్వీస్బే ఎత్తు తక్కువగా ఉండడంతో వరదల్లో పంప్‌హౌజ్‌లలోని మోటార్లతో పాటు కంట్రోల్ రూమ్స్ నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. అన్నారం పంప్‌హౌజ్‌ను 128 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 129.2 మీటర్ల వరకు వరద వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కంట్రోల్‌రూమ్‌ను 134 మీటర్ల ఎత్తులో నిర్మించాలని భావిస్తున్నారు. మేడిగడ్డ పంప్‌హౌజ్‌ను 108 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 108.2 మీటర్ల వరకు వరద వచ్చింది. దీంతో మేడిగడ్డ పంప్‌హౌజ్ కంట్రోల్‌రూమ్‌ను 112 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. ఇటీవలి గరిష్ట వరదమట్టంతో పోల్చితే కనీసం 6 మీటర్ల ఎత్తులో వీటి నిర్మాణం జరగనుంది. రెండు అంతస్తులతో కంట్రోల్ రూమ్స్‌ను నిర్మించనున్నట్టు అధికారవర్గా లు తెలిపాయి. భారీ పరిమాణం ఉండే కంట్రోల్ ప్యానెల్స్, స్టార్టర్ ప్యానెల్స్, ఆగ్జిలరీ బోర్డ్స్ వంటి అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు కంట్రోల్ రూమ్స్‌లో ఉంటాయి. వరదల్లో నీట మునిగితే మళ్లీ పనికి రావు. వరదల్లో మునిగిన ప్రతిసారి రూ.వందల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పదు. ఈ నేపథ్యంలో ఎత్తైన సురక్షిత ప్రాంతంలో కంట్రోల్ రూమ్స్ నిర్మిస్తేనే భవిష్యత్తులో వచ్చే వరదలతో నష్టాన్ని నివారించడం సాధ్యం కానుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల పునరుద్ధరణ పను లు పూర్తైన తర్వాత కొత్త కంట్రోల్ రూమ్స్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వేసవిలో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. మోటార్లను ఆరబెట్టి వాడుకోవాల్సిందే భవిష్యత్తు వరదల నుంచి అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి నీటిపారుదల శాఖ వచ్చినట్టు తెలిసింది. పంప్‌హౌజ్‌లు నీట మునిగిన ప్రతిసారీ అందులోని మోటార్లను ఆరబెట్టి మళ్లీ కొంత కాలానికి వాడుకోవాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. పంప్‌హౌజ్‌లకు వరద రక్షణ గోడలు/కరకట్టలు నిర్మించడం అందులో పనిచేసే ఇంజనీర్లు, సిబ్బందికి సురక్షితం కాదన్న చర్చ జరుగుతోంది. -
కాళేశ్వరానికి ‘అదనపు’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు టీఎంసీ ఎత్తిపోసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాళేశ్వరం అదనపు టీఎంసీ డీపీఆర్‌కు అనుమతుల జారీ ప్రక్రియ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ఇటీవల లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లో స్టేటస్ కో కొనసాగించాలని కేంద్ర న్యాయ శాఖ సూచించినట్లు గోదావరి బోర్డుకు జలశక్తి శాఖ తెలియజేసింది. దీంతో కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను ప్రస్తుతానికి గోదావరి బోర్డు పక్కనబెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదనపు టీఎంసీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అనుమతుల ప్రక్రియకు సైతం బ్రేక్ పడినట్టు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ. 85 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అదనపు టీఎంసీ సహా ఇతర పనుల పూర్తికి మరో రూ. 30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డు నో గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అన్ని రకాల అనుమతులతో చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ తర్వాత అదనపు టీఎంసీ తరలింపు పనులను మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే మొదలుపెట్టింది. అయితే ఈ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిన కేంద్ర జలశక్తి శాఖ... 6 నెలల్లోగా అనుమతి పొందాలని 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఆదేశించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... అదనపు టీఎంసీ తరలింపు కోసం చేపడుతున్న పనులు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని... అందువల్ల అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా నుంచి దీన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సవరించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. కేంద్ర జలసంఘానికి ఇప్పటికే సవరించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించగా హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు లభించాయి. అనంతరం సవరించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు సాంకేతిక అనుమతుల కోసం పంపింది. బోర్డు ఈ డీపీఆర్‌ను పరిశీలించి సంతృప్తి చెందితే కేంద్ర జలశక్తి శాఖలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం కోసం సిఫారసు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియను తాజాగా గోదావరి బోర్డు పక్కన బెట్టింది. మరికొంత కాలం తప్పని జాప్యం... పరిహారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొందరు ప్రాజెక్టు భూనిర్వాసితులు... రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే అదనపు టీఎంసీ పనులు చేపడుతోందని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై స్టేటస్ కో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ తుది తీర్పునకు లోబడి చర్యలు ఉండాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
‘కాంగ్రెస్, బీజేపీ నేతలను చెరువులో ముంచాలి’
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట జిల్లా రాజగోపాల్‌పేట చెరువులో ముంచాలని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీ, గాంధీభవన్‌లో కూర్చుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తుందంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం రాజగోపాల్‌పేట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇవాల చేపలను వదిలాం. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులో నీళ్లు గుంజుకుపో యేవి. బోర్లు వేసి, మోటార్లు పెట్టి, ట్రాన్స్ ఫార్మర్ పెట్టి చెరువులు నింపేవారం’ అని నాటి రోజులను గుర్తు చేశారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా.. సీఎం కేసీఆర్ దయతో చెరువులు నిండుగా ఉన్నాయన్నారు. దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. ‘ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక, బోర్లు ఎండిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయి సీన్ రివర్స్ అయిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఇదంతా కనపడటం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్! -
సిద్దిపేట వస్తే వాస్తవాలు చూపిస్తా..
గజ్వేల్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు పారలేదని తొండి మాటలు మాట్లాడే బీజేపీ నేతలు గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే వాస్తవాలు చూపిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, మర్కుక్, గజ్వేల్, కొండపాక మండలాల్లో రూ.33.95 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మలతో కలసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తమ ఉనికిని కోల్పోతామన్న భయంతోనే బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరువునేల పరవశించేలా చేశామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో 99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, ఆ తర్వాత 2 కోట్ల 59 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం ఎదురు చూపులు ఉండేవని, వ్యవసాయ రంగం జవసత్వాలను కోల్పోయిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ స్వచ్ఛ మైన నల్లా నీటిని అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. వ్యవసాయ రంగంలో తీసు కుంటున్న నిర్ణయాల వల్ల ఉత్పాదకత పెరిగిందన్నారు. పామాయిల్ తోటలసాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఈసారి బడ్జెట్లో వీటికి రూ.వెయ్యి కోట్లను కేటాయించినట్లు చెప్పారు. రైతులు పామాయిల్ తోటల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. -
‘మీకు పెన్ ఉంటే, మాకు గన్ ఉంది’.. జర్నలిస్టుపై పోలీస్ దురుసు ప్రవర్తన
సాక్షి, వరంగల్: మీకు పెన్ ఉంటే మాకు గన్ ఉంది.. ఈయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. పోలీసులంటే ఏమనుకుంటున్నాడో తెలియాలి.. అంటూ ఓ సీఐ కాళేశ్వరం వద్ద పుష్కరాల విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుపై దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ఆయన తీరును నిరసిస్తూ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సదరు వివాదాస్పద అధికారిని పుష్కరాల విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలానికి చెందిన ఓ టీవీ చానల్ రిపోర్టర్ పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల పూజలను వీడియో తీశాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై మొగిలి సదరు జర్నలిస్టును అడ్డుకొని వీడియో తీయొద్దంటూ ఆలయం ఎదుట ఉన్న సీఐ జానీ నర్సింహులు వద్దకు తీసుకొచ్చాడు. ఆలయంలో వీడియో తీయడానికి అనుమతి లేదంటూనే జర్నలిస్టు చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను సీఐ బలవంతంగా లాక్కున్నాడు. తాను స్థానిక రిపోర్టర్నని మొర పెట్టుకున్నప్పటికీ పోలీసులంటే ఏమనుకుంటున్నావు.. మీ దగ్గర పెన్ ఉంటే.. మా దగ్గర గన్ ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పలువురు జర్నలిస్టులు గొడవను ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా సీఐ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పోలీస్ ఔట్‌పోస్ట్‌లో ఉన్న కాటారం డీఎస్పీ బోనాల కిషన్ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను వివరించి నిరసన తెలిపారు. ఈ విషయాన్ని డీఎస్పీ ఫోన్ ద్వారా ఎస్పీ జె.సురేందర్‌రెడ్డికి తెలియజేశాడు. ఈ క్రమంలోనే వివాదానికి తెరలేపిన సీఐ జానీ నర్సింహులు అక్కడికి చేరుకొని ఇగో అన్న.. నా ఫిర్యాదు.. జరిగిందంతా ఇందులో రాసిన.. వాళ్ల మీద ఎఫ్ఐఆర్ చెయ్ అన్నాడు. ఇందుకు డీఎస్పీ బదులిస్తూ విషయాన్ని ఎస్పీకి తెలియజేశాను.. కొద్దిసేపట్లో సార్ నిర్ణయం తీసుకుంటారు.. మీరు ఏదైనా చెప్పాలనుంకుంటే ఎస్పీ సంప్రదించండి అని వెల్లడించాడు. చదవండి: మూడేళ్ల కిందట మాటలు బంద్.. మూగవాడికి మాటలొచ్చాయ్! అయినప్పటికీ వినకుండా సీఐ కొద్దిసేపు డీఎస్పీతో వాగ్వాదానికి దిగి ఫిర్యాదు అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ సంఘటనపై ఆరా తీసిన ఎస్పీ సురేందర్‌రెడ్డి పుష్కర విధుల నుంచి సీఐ జానీ నర్సింహులు, ఎస్సై మొగిలిని తొలగించినట్లు అనధికారిక సమాచారం. ఇదిలా ఉండగా సీఐ జానీ నర్సింహులు తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవా లని టీయూడబ్ల్యూజే(హెచ్143) రాష్ట్ర నాయకుడు తడక రాజ్నారాయణగౌడ్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాయకులు సామంతుల శ్యాం, క్యాతం సతీష్‌కుమార్ డిమాండ్ చేశారు. చదవండి: రంజాన్ మాసంలో.. ఇది తప్పనిసరి! ఫుల్ డిమాండ్ -
మళ్లీ పులి కలకలం.. ట్రాకింగ్ కెమెరాల్లో దృశ్యాలు
కాళేశ్వరం: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా తూమునూర్–అరుడ ఫారెస్ట్ బీట్‌లో పెద్దపులి జాడ కన్పించింది. అంతేకాదు అడవిలో మేతకు వెళ్లిన ఎద్దుపై దాడి చేసి చంపేసింది. తూమునూర్ ఉప సర్పంచ్ వేముల కిరణ్, సిరొంచ అటవీ అధికారుల సమాచారం ప్రకారం.. తూమునూర్ గ్రామానికి చెందిన ఒక ఎద్దు ఈ నెల 12న అడవిలో మేతకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఉప సర్పంచ్‌తో పాటు మరికొందరు స్థానికులు 13న అడవిలోకి వెళ్లి గాలించగా ఎద్దు కళేబరం కన్పించింది. చుట్టుపక్కల పులి పాదముద్రలు కన్పించడంతో ఎద్దుపై పులి దాడి చేసిందని భావించారు. దీంతో వారు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిరొంచ రేంజర్ కటుకు శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి అడవిలోకి వెళ్లి మూడుచోట్ల ట్రాకింగ్ కెమెరాలు అమర్చారు. కాగా అదేరోజు రాత్రి 9.30 గంటలకు ఎద్దు వద్దకు వచ్చిన పెద్దపులి కొంత మాంసాన్ని తినడం ఆ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతోందని, ప్రజలు అడవుల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తూమునూర్ నుంచి తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కుదురుపల్లి, ఎడపల్లి, బీరసాగర్, కాళేశ్వరం ప్రాంతాలకు 8–12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండగా మధ్యలో గోదావరి అడ్డుగా ఉంది. పులి ఈ ప్రాంతాల వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎస్–8 పనేనా? గతేడాది అక్టోబర్ చివరి వారంలో ఎస్–8గా పేరు పెట్టిన పెద్దపులి సుమారు నెలన్నరపాటు నాలుగు జిల్లాల్లో తిరిగింది. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో సంచరించి అక్కడక్కడా బీభత్సం సృష్టించింది. చివరకు కాటారం మండలం వీరాపూర్‌లో రెండు రోజులపాటు గడిపి డిసెంబర్ 13న మహదేవపూర్ మండలం అన్నారం మీదుగా కుంట్లం వద్ద గోదావరి దాటి మంచిర్యాల, కొమురంభీం జిల్లాలకు వెళ్లింది. కాగా అదే పులి ఇక్కడికి వచ్చి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. పులి తిరుగుతున్న సమాచారంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
3టీఎంసీల తరలింపుపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుమతులున్నా.. ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజులు తరలించేందుకు వీలుగా పనులు చేశారు. అయితే రోజుకు 3 టీఎంసీల చొప్పున 270 టీఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోంది. దీనిపై వాదనల అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. -
Photo Feature: అటు కిటకిట.. ఇటు వ్యతిరేకత
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. 25 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంపుహౌస్‌ల నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న చమురు ధరలపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
కాళేశ్వరంలో పడవ ప్రయాణం
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అధునాతమైన బోటు అందుబాటులోకి రానుంది. ఈ బోట్‌ను రూ.2 కోట్ల వ్యయంతో సిద్ధం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మహదేవపూర్ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ నుంచి కాలేశ్వరం వరకు 22 కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ నిల్వ ఉంటోంది. దీంతో ఇక్కడ గోదావరి సముద్రాన్ని తలపిస్తోంది. ఆ నీటి ఉధృతిలో అతిపెద్ద బోటు ఏర్పాటు చేస్తే టూరిస్టులను ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో అందుబాటులోకి.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి కాళేశ్వరంలోని గోదావరి తీరంవద్దే 300 మంది కూలీలతో బోటును తయారు చేయించనున్నారు. ఇందుకోసం ఏపీ నుంచి కార్మికులను రప్పించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు సమాచారం. అధునాతన పరిజ్ఞానంతో సిద్ధం చేయించనున్న ఈ బోట్లో ఏసీ, నాన్ ఏసీ గదులు ఉంటాయని తెలిసింది. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉండడంతో పర్యాటక శాఖ ఆ వైపుగా దృష్టి సారించింది. బోట్ సిదమయ్యాక కాళేశ్వరం నుంచి లక్ష్మీ బ్యారేజ్ వరకు ప్రయాణం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాదారం. మూడు నెలల్లో బోట్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టూరిజం శాఖ ఉద్యోగులు తెలిపారు. చిన్నచిన్న వేడుకలతో పాటు విందులు చేసుకునేలా 200 మంది ప్రాణం చేసేందుకు వీలుగా బోట్ ఉంటుంది. బోటు కాళేశ్వరంలో తిరగడం ఆరంభిస్తే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. -
మంత్రి ‘కొప్పుల’కు మేయర్ శస్త్రచికిత్స
సాక్షి, కరీనంగర్/గోదావరిఖని: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్ మంగళవారం శస్త్రచికిత్స చేశారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈశ్వర్ కడుపు ఎడమవైపు పైభాగంలో కణతి ఏర్పడింది. శస్త్రచికిత్స చేసి దానిని తొలగించాలని వైద్యులు ఇదివరకే సూచించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో ఈశ్వర్ పాల్గొని తిరిగి వస్తుండగా కడుపులో నొప్పి ఎక్కువైంది. మార్గమధ్యంలో గోదావరిఖని మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్‌ను ఆశ్రయించగా విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేస్తున్నంత సేపు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆపరేషన్ చేసిన అరగంట తర్వాత ఆసుపత్రి నుంచి మంత్రి డిశ్చార్జి అయ్యారు. అనంతరం అధికారిక కార్యక్రమాల్లో ఆయన యథావిధిగా పాల్గొన్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
మడి ‘తడి’ ఆరదు
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఫిబ్రవరి లేక మార్చి నుంచి ఆరంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ సహా మిగతా రిజర్వాయర్లలో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. ఇప్పుడిప్పుడే కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్న దృష్ట్యా యాసంగి పంటల చివరి దశకు కాళేశ్వరం ద్వారా నీరందించేలా ప్రణాళిక వేసింది. ఈ సీజన్లో గరిష్టంగా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఇప్పటిదాకా ఎత్తింది 12 టీఎంసీలే... రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీగా వర్షాలు కురవడంతో కాళేశ్వరం ద్వారా పెద్దగా ఎత్తిపోత అవసరం రాలేదు. మేడిగడ్డ మొదలు మిడ్‌మానేరు వరకు మొత్తంగా 12 టీఎంసీల మేర మాత్రమే నీటిని ఎత్తిపోశారు. యాసంగి సీజన్‌కు సంబంధించి కాళేశ్వరం పరిధిలో కొత్తగా 72 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు, ఎస్సారెస్పీ, ఎఫ్ఎఫ్సీ (వరదకాలువ) కింద ఉన్న పూర్తి ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ నుంచి లోయర్‌మానేరు డ్యామ్ వరకు ఉన్న 4.62 లక్షల ఎకరాలు, ఎల్ఎండీ దిగువన 5.10 లక్షల ఎకరాలకు, దీంతోపాటే ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న 3.50 లక్షల ఎకరాలకు కలిపి 13 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. దీనికై మొత్తంగా 110 టీఎంసీలు అవసరమని లెక్కించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 87 టీఎంసీ, లోయర్ మానేరులో 21, మిడ్‌మానేరులో 25 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. వీటితో పాటే ఎగువన మేడిగడ్డలో 15 టీఎంసీ, అన్నారంలో 7, సుందిళ్లలో 8 టీఎంసీ మేర నీటి లభ్యత ఉంది. ఎస్సారెస్పీ కింద సాగు అవసరాలకు రిజర్వాయర్లలో డెడ్‌స్టోరేజీ, తాగునీటి అవసరాలకు నీటిని పక్కనపెట్టి, 70 టీఎంసీల మేర నీటిని సాగుకు వినియోగించే అవకాశం ఉంది. మరో 40 టీఎంసీలు మాత్రం కాళేశ్వరం ద్వారా ఎత్తిపోయాల్సి ఉంటుంది. కాల్వలకు నీటి విడుదల ఇప్పుడే మొదలు కాగా, మార్చి వరకు ప్రతి నెలా కనీసంగా 40 టీఎంసీల అవసరాలుంటాయి. ఈ లెక్కన ప్రస్తుత లభ్యత జలాలు ఫిబ్రవరి చివరి తడుల వరకు సరిపోనున్నాయి. అనంతరం కాళేశ్వరం ద్వారా నీటిని తోడి అవసరాలకు తగ్గట్లుగా రిజర్వాయర్లకు తరలిస్తామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. మూడు బ్యారేజీల్లో ఉన్న నీటిని దిగువ రిజర్వాయర్లకు తరలిస్తూనే, గోదావరి నదిలో లభ్యతగా ఉండే నీటిని రోజుకు కనీసంగా 6 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని తోడేలా ప్రణాళికలు వేసుకున్నారు. మొత్తంగా చివరి తడులకు నీటికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే... జూన్, జులై అవసరాలకు నీటి లభ్యత ఉంచేలా ఎత్తిపోతలు ఉంటాయని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఖరారు కాని సీఎం పర్యటన.. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 5న మేడిగడ్డ ప్రాంతంలో పర్యటిస్తారని ప్రచారం జరిగినా అధికారులు ధృవీకరించడం లేదు. ఈ నెల 8న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు కూతురు వివాహానికి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని, అదే రోజున కాళేశ్వరం పరిధిలో పర్యటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
కాళేశ్వర మహాక్షేత్రం: త్రివేణీ సంగమం
కార్తీకమాసంలో ప్రతిరోజూ పర్వదినమే. అయితే ఈ మాసం నెలరోజులు చేసే పూజలన్నింటి కంటే కార్తీక పౌర్ణమి నాటి పూజకు ఫలితం అధికంమంటారు. అగ్నితత్త్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుని విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. చంద్రుని కొలవడంలో మానసిక చైతన్యం, కుటుంబ శ్రేయస్సు, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతాన సౌభాగ్యం కలిగి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ మాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు పలు శైవ క్షేత్రాలను దర్శించుకుంటారు. కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం కాళేశ్వరో మహాదేవో భుక్తిం ముక్తిం ప్రదాస్యతి!! అంటూ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పిలుచుకునే దేవుడు పరమ శివుడు. బోళా శంకరుడిగా, ఆదియోగిగా పూజలందు కుంటున్న ఈ స్వామి కాళేశ్వర ముక్తీశ్వర నామధేయంతో కొలువుదీరిన అపురూప ధామం కాళేశ్వరం. కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలో గోదావరి, ప్రాణహిత నదులు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశంలో స్వయంభువుగా వెలసిన స్వామి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి సోయగాల మధ్య అలరారుతున్న అతి పురాతనమైన ఈ ఆలయం ఒకప్పుడు అరణ్యంలో ఉండటం వల్ల రవాణా సౌకర్యం ఉండేదికాదు. అయితే 1976–82 సంవత్సరాల మధ్య కాలం లో ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరగడంతో రవాణా వసతి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయం నాలుగు వైపుల నాలుగు నంది మూర్తులు దర్శనమిస్తాయి. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడ గర్భాలయంలో ఒకే పానమట్టం మీద రెండు లింగాలు ఉండటమే కాక ముక్తీశ్వర స్వామికి రెండు నాసికా రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలలో అభిషేక జలం ఎంత పోసినప్పటికీ ఒక్కచుక్క కూడా బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి, సరస్వతీ నది రూపంలో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుందని ఆలయ చరిత్ర చెబుతోంది. గర్భాలయంలో ఉన్న రెండు లింగాలలో ఒకటి కాళేశ్వర లింగం కాగా, రెండవది ముక్తీశ్వర లింగంగా చెబుతారు. కాళేశ్వర లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్టించాడు. మహాశివుడు యమధర్మరాజుకిచ్చిన వరం కారణంగా, ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా కాళేశ్వరలింగాన్ని దర్శించి అనంతరం ముక్తీశ్వర లింగాన్ని దర్శించాలన్న నియమం ఉంది. ఈ ఆలయం ఏటా మహాశివ రాత్రి ఉత్సవాలతో సహా పండుగలు, పర్వదినాలు, కార్తీక మాసాలలో భక్తులతో పోటెత్తుతుంది. ఆయా రోజుల్లో స్వామి వార్లకు మహాన్యాసక రుద్రాభిషేకాలు, అర్చనాది అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ పార్వతీమాత శుభానంద దేవిగా కొలుపులందుకుంటోంది. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క మహాసరస్వతి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు ప్రౌఢసరస్వతిగా నీరాజనాలందుకుంటోంది.ఆలయంలో మరో పక్క ప్రధాన ద్వారానికి ముందు భాగంలో సూర్య దేవాలయం ఉంది. ఇంకోపక్క విజయ గణపతి కొలువుదీరాడు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామి వారి ఆలయానికి ముందు భాగంలో కోనేరు ఒకటి ఉంది. ఈ కోనేరులో స్నానమాచరించిన వారికి కాశీలోని మణికర్ణికా ఘాట్‌లో స్నానమాడిన ఫలితం దక్కుతుందంటారు. ప్రధానాలయ ఆవరణలో యమకోణం ఉంది. ఈ ప్రాంగణంలోనే యముడు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ యమకోణ ప్రవేశం చేసే వారికి యమ బాధలుండవని, ముక్తికలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్ల ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఆది ముక్తీశ్వర స్వామి ఆలయం ఉంది. ఆది ముక్తీశ్వర స్వామి దర్శనం సర్వపాపహరణం. కాశీలో మరణిస్తే కైలాసప్రాప్రి కలుగుతుందని చెబుతారు. కాని ఈ క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శిస్తేనే కైలాస ప్రాప్తి కలుగుతుందన్నది స్థలపురాణం. ఎలా చేరుకోవాలి? కరీంనగర్‌కు 130 కి.మీ దూరంలోను, మంథనికి 65 కి. మీ. దూరంలోను, వరంగల్లుకు 110 కి.మీ దూరంలోనూ ఉన్న ఈ దివ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. – దాసరి దుర్గాప్రసాద్, పర్యాటక రంగ నిపుణులు -
ఉప్పొంగిన ప్రాణహిత, గోదావరి
కాళేశ్వరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత వరద కలుస్తోంది. ఎగువన అన్నారం (సరస్వతీ) బ్యారేజీ గేట్లు ఎత్తడంతో దిగువకు వచ్చే గోదావరి జలాలు కూడా కాళేశ్వరం వద్ద కలుస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల వరద పుష్కర ఘాట్లను తాకుతూ 8.3 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీకి వరద తాకిడి పెరుగుతోంది. దీంతో శుక్రవారం బ్యారేజీలో ని 85 గేట్లకు గాను 57 గేట్లు ఎత్తి వరదను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువన గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 2,91,200 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లు ఎత్తడంతో దిగువకు 2.42,500 క్యూసెక్కుల నీరు తరలుతోందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అలాగే.. అన్నారంలోని సరస్వతీ బ్యారేజీలోకి స్థానిక వాగుల ద్వారా భారీగా నీరు వచ్చి చేరుతోంది. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలను నిలిపివేశారు. బ్యారేజీలో మొత్తం 66 గేట్లకు గాను 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా 9.20 టీఎంసీలతో నిండుకుండలా మారింది. ఈ బ్యారేజీకి సుమారు 30కి పైగా వాగుల ద్వారా ఇన్‌ఫ్లో 36,480 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లు ఎత్తడంతో 29,700 క్యూసెక్కుల వరద దిగువ కాళేశ్వరం వైపునకు వెళ్తోంది. సాయంత్రంగా ఐదు గేట్లను మూసివేశారు. భద్రాచలం వద్ద పోటెత్తిన గోదారమ్మ కాగా, భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం 40.3 అడుగులకు చేరింది. గంట గంటకూ పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 10 గంటలకు 7.13 మీటర్ల నీటి మట్టం నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటలకు 7.26 మీటర్లు, సాయంత్రం 4 గంటలకు 7.34 మీటర్లు, సాయంత్రం 5 గంటలకు 7.40 మీటర్లకు చేరింది. ఇలా గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలసి ఏటీడీఏ పీఓ హనుమంత్, ఏఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించి సహాయక చర్యలపై చర్చించారు. అలాగే, వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ఏటూరునాగారం తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పనిచేసే ఈ కంట్రోల్ రూంను 80080 60434 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ప్రాజెక్టులతో నీటి విప్లవం తెచ్చాం : హరీష్ రావు
సాక్షి, మెదక్ : మంత్రి హరీష్ రావు, ఎమ్యెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో పర్యటించారు. ఈ సందర్భంగా సి.సి రోడ్డు, డంప్ యార్డ్, గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామం ప్రారంభోత్స కార్యక్రమాలను నిర్వహించారు. ధర్మారం గ్రామ చెరువులో 1 లక్ష 76వేల చేపపిల్లలను వదిలారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1596 చెరువులలో ఐదు కోట్ల చేపపిల్లలను ఉచితంగా అందజేస్తున్నాం అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా గ్రామాల్లో వేసవిలోనూ చెరువులు నిండిపోతున్నాయి. గతంలో చెరువులు నిండితేనే చేప పిల్లల పెంపకం జరిగేది కానీ నేడు ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపుతాం. ఇప్పటికే మెదక్ జిల్లాలో 400 చెరువులు నీటితో నిండాయి. మత్స్యకారులకు ప్రమాద బీమా సౌకర్యం ఆరు లక్షల రూపాయలకు పెంచాం. గతంలో ఇతర రాష్ట్రాల నుండి చేపలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది కానీ కానీ నేడు ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసే విధంగా మత్స్యకారులను అభివృద్ధి చేస్తున్నాం అని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. -
నది మధ్యలో నరకయాతన
సాక్షి, కాళేశ్వరం: గోదావరి దాటుతున్న ఓ యువకుడు వరదలో చిక్కుకున్నాడు. ఏడు గంటల పాటు నది మధ్యలోనే ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలోని కుంట్లం–3 ఇసుక క్వారీ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొల్లూరు ఇసుక క్వారీలో పనిచేసే జీవన్‌లాల్ సింగ్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలోని క్వారీ వద్దకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కుంట్లం–3 క్వారీ నుంచి కొల్లూరుకు కాలినడకన గోదావరి మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో మధ్యలో చిక్కుకున్నాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వరదలో చిక్కుకున్న జీవన్‌లాల్.. అరుపులు, కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. చివరికి మధ్యాహ్నం అతని అరుపులు విన్న క్వారీ సిబ్బంది 100కు డయల్ చేశారు. కానిస్టేబుళ్లు సంజీవ్, మధుకర్ అక్కడికి చేరుకుని ఓ నాటు పడవలో ఇద్దరు గజ ఈతగాళ్లతో వెళ్లి జీవన్‌లాల్ సింగ్‌ను తీసుకువచ్చారు. (ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకోవాలి) -
కాళేశ్వరం విస్తరణపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై వేముల్గాట్ భూనిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ విచారించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భారీ విస్తరణ పనులు చేపట్టారని పిటిషనర్లు ధర్మాసనానికి నివేదించారు. కాళేశ్వరం ద్వారా రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా పనులు జరపరాదని ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖ లైన పిటిషన్ ఢిల్లీ బెంచ్‌లో పెండింగ్‌లో ఉన్న విషయంపై చెన్నై బెంచ్ ఆరాతీసింది. ఒకే ప్రాజెక్టుపై 2 బెంచ్‌ల్లో విచా రణ సాధ్యమేనా అని చెన్నై బెంచ్ న్యాయ విభాగం సభ్యుడు జస్టిస్ రామకృష్ణన్ ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో పెండింగ్ కేసుకు, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని, తెలంగాణ చెన్నై బెంచ్ పరిధి లో ఉన్నందువల్ల సౌత్ జోన్ బెంచ్‌లో కేసు వేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ నివేదించారు. కేసును చెన్నై బెంచ్ విచారిం చినా, ఢిల్లీ ప్రధాన బెంచ్‌కు బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని విన్నవించారు. ఢిల్లీ బెంచ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కేసు పెండింగ్‌లో ఉన్నందు వల్ల చెన్నైలో విచారణ సరికాదని తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై దాఖలైన పిటిషన్ చెన్నై బెంచ్ విచారించవచ్చా లేదా అనేదానిపై ఆదేశాలివ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్‌ను కోరుతూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. -
ఆ జిల్లాలకు అన్యాయం చేస్తే సహించం
కరీంనగర్: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు నీటి కేటాయింపుల్లో అన్యాయం చేస్తే సహించేది లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లో మూడు పంటలకు నీరు ఇచ్చిన తర్వాతే మిగతా జిల్లాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం నీటిని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు కేటాయించడం లేదని.. గోదావరి నీటిని పరివాహక ప్రాంతాలకు ఇవ్వకుండా కొండపోచమ్మకు తరలిస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ నిర్మూలనకు కేంద్రం రూ. 230కోట్లు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. రెండోసారి లాక్‌డౌన్‌ను కఠినతరం చేయడం వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. నీటి వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సోమారపు సత్యనారాయణ ప్రభుత్వానికి సూచించారు. -
శుభ ముహూర్తానికి అడ్డువచ్చిన ‘కరోనా’
ఈ వేసవి ముగిసేలోపు గోదావరి జలాల గలగల సవ్వడి జిల్లాలో వినిపించనుంది. సిద్దిపేటను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సిద్దిపేటకు వచ్చే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గోదావరి జలాలు జిల్లా సరిహద్దుకు చేరాయి. ఇక రంగనాయకసాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్, ఆ తర్వాత కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, అక్కడి నుంచి జిల్లాలోని చెరువుల్లోకి గోదావరి జలాలు పరుగులు పెట్టే గడియ రానే వచ్చింది. కరోనా ప్రభావంతో కాస్త ఆలస్యమైనా మిషన్ కాకతీయ ద్వారా అందంగా ముస్తాబైన చెరువుల్లో తర్వరలో జలకల సంతరించుకోనుంది. సాక్షి, సిద్దిపేట :జిల్లా అంతా మెట్ట ప్రాంతం. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు ఎత్తిపోసే పని దాదాపుగా పూర్తి కావచ్చింది. కాళేశ్వరం నుండి దశలవారిగా మిడ్‌మానేరుకు చేరాయి. అక్కడి నుండి సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఉన్న అనంతగిరి సాగర్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేశారు. మొత్తం 3.5టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ నింపేందుకు నాలుగు పంపులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రిజర్వాయర్ కావునా కొద్దికొద్దిగా పంపులు వదులుతూ.. నీటిని నింపుతున్నారు. దీంతో ఇప్పటికి 0.8 టీఎంసీ నీళ్లు చేరాయి. దీంతో అనంతగిరి సాగర్ నుండి రంగనాయకసాగర్‌కు పంపింగ్ చేసే ప్రదేశం వద్దకు గోదారమ్మ వచ్చి ఆగింది.. శుభ ముహూర్తానికి అడ్డువచ్చిన కరోనా జిల్లా సరిహద్దులో ఉన్న అనంతగిరి సాగర్ వరకు వచ్చిన గోదావరి జలాలు జిల్లాకు ఎత్తిపోసేందుకు సర్వం సిద్దమైంది. అయితే కరోనా మహర్మారితో నీళ్లపండుగ ఆగిపోయింది. 3 టీఎంసీల సామర్థ్యంతో 1.10లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేలా రంగనాయకసాగర్, 15టీఎంసీల సామర్థ్యంలో 2.85లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా కొండపొచమ్మ సాగర్, అదేవిధంగా 50టీఎంసీల సామర్థ్యంలో 1.25లక్షల ఎకరాలకు నీరు అందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టులు నిర్మించారు. అయితే ఇందులో మల్లన్న సాగర్ మినహా మిగిలిన మూడు రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. అనంతగిరి వరకు నీళ్లు వచ్చాయి. ఈ నీటిని ముందుగా రంగనాయకసాగర్‌కు పంప్ చేస్తారు. అక్కడి నుండి టన్నెల్, గ్రావిటీ కెనాల్ ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్దకు నీటికి తీసుకెళ్తారు. అయితే మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాకపోయినా.. తుక్కాపూర్ వరకు వచ్చిన నీటిని 18 కిలో మీటర్ల పొడవునా కాలువ తవ్వి కొండపొచమ్మ సాగర్ కాల్వకు అనుసంధానం చేశారు... ఇలా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో పనిలేకుండా గోదావరి జలాలు కిందికి తరలించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో ఆలస్యం సిద్దిపేట జిల్లా సరిహద్దు అనంతగిరి రిజర్వాయర్ వరకు గోదావరి జలాలు వచ్చాయి.. అక్కడి నుండి రంగనాయకసాగర్‌లోకి పంపింగ్ చేసేందుకు సర్వం సిద్దం చేశాం. మంచి ముహూర్తం పెట్టుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించుకొని పండుగ వాతావరణం మధ్య గోదారమ్మకు స్వాగతం పలుకుదాం అనుకున్నాం.. ఇంతలోనే కరోనా వైరస్ వచ్చి అంతా తారుమారు చేసింది. ఏది ఏమైనా.. ఈ వేసవిలో జిల్లాలోని చెరువులను గోదావరి జలాలతో నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.. వారి ఆదేశాల మేరకు వేసవిలో చెరువులు నింపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాం. – హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఆ గడియ కోసమేఎదురు చూపు.. కరువు ప్రాంతం సిద్దిపేటను కోనసీమను తలపించేలా చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు ప్రతీరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పట్టువదలకుండా రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేశారు. గోదావరి జలాలు జిల్లాలో పారే గడియ కోసమే జిల్లా ప్రజలు వేయికళ్లతో వెదురు చూస్తున్నారు..– రాధాకృష్ణ శర్మ,టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి -
కాళేశ్వరం వద్ద పటిష్ట భద్రత
కాళేశ్వరం: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మావోయిస్టుల యాక్షన్ టీంలు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో మావోల కదలికలపైన నాలుగు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీల పైనుంచి మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు గల మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. గోదావరి ప్రవాహం తగ్గుతుండటంతో అటువైపున పోలీసులు దృష్టి పెట్టారు. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఓఎస్డీ శోభన్‌కుమార్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐలు నర్సయ్య, హతిరాం, కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ట్ గార్డ్స్, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
అనంతగిరికి ఆఖరి ఘడియలు
సిరిసిల్ల: అనంతగిరి గ్రామం జలసమాధి కాబోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరికి ఆఖరి ఘడియలు సమీపించాయి. ఊరు ఖాళీ చేసేదిలేదని నిర్వాసితులు భీష్మించుకుని కూర్చున్నా.. ఎలాగైనా ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఎస్సీ కాలనీని ముందుగా ఖాళీ చేయించనున్నారు. నిర్వాసితులకు ‘అనంత’కష్టాలు: అనంతగిరిలో 837 కుటుంబాలు ఉన్నాయి. ప్రాజెక్టు ప్యాకేజీలను 735 కుటుంబాలకు అందించారు. మిగతా కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. నిబంధనల మేరకు వీరికి 102 ఇళ్లను అధికారులు అనంతగిరి శివారుల్లో నిర్మించి ఉంచారు. కానీ, ఇప్పుడే నీరు వస్తుందని ఊహించని నిర్వాసితులు.. పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టుకోలేదు. ఇం కా ఎక్కడ ఉండాలో తేల్చుకోలేదు. ఈ క్రమంలో నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారు. ఇవీ సమస్యలు: అనంతగిరిలో 2017 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను కుటుంబాలుగా గుర్తించారు. ఆ జాబితా 1,135కు చేరింది. తంగళ్లపల్లి శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచమ్మ ఆలయం సమీపంలో 70 ఎకరాల్లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. కానీ మౌలిక వసతులు లేవు. ఇప్పటికే 737 కుటుంబాలకు రూ.7.50 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ చెల్లించారు. 250 గజాల స్థలంతో కూడిన ఇంటి స్థలం ఇచ్చారు. నిర్వాసితులతో కలెక్టర్ కృష్ణభాస్కర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం చర్చించారు. తొలుత మంగళవారం 115 దళిత కుటుంబాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. మంగళ వారం ఊరు ఖాళీ చేయగానే, బుధవారం మధ్య మానేరు నుంచి నీళ్లు అనంతగిరిలోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ సమీక్ష మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్ వరకు చేర్చేందుకు అనంతగిరి వద్ద ఎదురవుతున్న ప్రతిబంధకాలపై సీఎంకేసీఆర్ సమీక్షిస్తున్నట్లు సమాచారం. అనంతగిరికి గోదావరి నీళ్లు చేరితే.. మల్లన్నసాగర్ వరకు నీళ్లు వస్తాయని సీఎం అన్నట్లు తెలిసింది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డి తో సీఎం మాట్లాడినట్లు సమాచారం. దీంతో అనంతగిరి నింపేందుకు పనులు సాగుతున్నాయి. -
సాగునీటి శాఖకు కొత్త రూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి శాఖ పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ మార్పుచేర్పులతో కూడిన ప్రక్రియ ముగింపు దశకు రాగా దీనికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం దక్కనుంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి కావస్తుండటం.. కాల్వలు, పంపులు, పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో విప్లవాత్మక చర్యలు అత్యంత కీలకం కానున్నాయి. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేనున్నారు. ఈఎన్సీలు, సీఈల వారీగా ఏయే ప్రాజెక్టులు ఉంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉంటుందన్న దానిపై కసరత్తు పూర్తయింది. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్‌హౌస్‌ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించనున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల పనులు చూసేందుకు బేసిన్ల వారీ ఇద్దరు సీఈలు ఉండే అవకాశం ఉంది. ప్రక్షాళన ఇలా... - కరీంగనర్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో 3 బ్యారేజీలు, పంప్‌హౌస్‌లతో పాటు ఎల్లంపల్లి బ్యారేజీతో పాటు దానికింద మిడ్‌మానేరు వరకు నీటిని ఎత్తిపోసే ప్యాకేజీలన్నీ రానున్నాయి. ఈ బ్యారేజీల పరిధిలో కొత్తగా చేపట్టే ఎత్తిపోతలు దీని పరిధిలోనే ఉండనున్నాయి. ఈఎన్సీ కింద మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు ఉండనుంది. - శ్రీరాంసాగర్ సీఈ పరిధిలో లోయర్‌మానేరు వరకు మాత్రమే ఆయకట్టును పరిమితం చేయనున్నారు. దీంతోపాటుగా కడెం, సదర్‌మఠ్, ఆదిలాబాద్‌లోని కాళేశ్వరం ఆయకట్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ఉండనున్నాయి. మొత్తంగా 7.42లక్షల ఆయకట్టు ఉంటుంది. - కరీంనగర్‌లోని మరో ఈఎన్సీ పరిధిలో లోయర్‌మానేరు నుంచి దిగువన సూర్యాపేట వరకు ఉన్న ఆయకట్టును కొత్తగా చేర్చారు. దీంతో పాటే ఎల్లంపల్లి దిగువ ఆయకట్టు, మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్, దానికింద ఆయకట్టును తెచ్చారు. మధ్యతరహా ప్రాజెక్టులు ఈఎన్సీ కిందే ఉండనున్నాయి. మొత్తంగా 13లక్షల ఎకరాల ఆయకట్టు ఈఎన్సీ పరిధిలో ఉండనుంది. - నిజామాబాద్ సీఈ పరిధిలోకి కాళేశ్వరంపై ఆధారపడ్డ నిజాంసాగర్ ఆయకట్టు, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. సీఈ కింద 6.82 లక్షల ఆయకట్టు ఉంటుంది. - వరంగల్ సీఈ పరిధిలో దేవాదుల, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండగా కొత్తగా సమ్మక్క బ్యారేజీని చేర్చారు. ఆయకట్టు 6.07 లక్షల ఎకరాలు. - ఆదిలాబాద్ సీఈ పరిధిలో ప్రాణహిత, చనాకా–కోరటా, పెనుగంగ, కుప్టి, కొమరంభీంతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు. మహబూబ్‌నగర్ సీఈ పరిధిలో జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు, గట్టు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఉండ నుండగా, ఆయకట్టు 11.95 లక్షల ఎకరాలు. - పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ఒక్క సీఈ పరిధిలో ఉండనుంది. ఆయకట్టు 12.30 లక్షల ఎకరాలు. - నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు పాలేరు వరకు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు, డిండి, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఆయకట్టు 10.97 లక్షల ఎకరాలు. - ఖమ్మం సీఈ పరిధిలో సీతారామ, సీతమ్మసాగర్, పాలేరు దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాస, మధ్యతరహా పథకాలు ఉంటాయి. ఆయకట్టు 7.16 లక్షల ఎకరాలు. - హైదరాబాద్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో మిడ్‌మానేరు నుంచి గంధమల వరకు ఉన్న ప్యాకేజీలతో పాటు, కొత్తగా సింగూరు, ఘణపూర్, మధ్యతరహా ప్రాజెక్టులను చేర్చారు. ఆయకట్టు 11.54 లక్షలు. -
రాజన్నకు కేసీఆర్ కుటుంబం ప్రత్యేక పూజలు
-
రాజన్నను దర్శించుకున్న కేసీఆర్ కుటుంబం
సాక్షి, వేములవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌కు తీర్థ ప్రసాదాలు అందచేశారు. మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి మూడు గంటలకు హైదరాబాద్ బయల్దేరతారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్ ఉన్నారు. గోదావరికి జల హారతి అంతకు ముందు ఆయన సిరిసిల్ల బ్రిడ్జ్ దగ్గర కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదికి కేసీఆర్ జలహారతి ఇచ్చారు. అలాగే మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌ను ఆయన పరిశీలించారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి అధికారికంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే పార్టీ నాయకులు మాత్రం సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. -
‘కాళేశ్వరం’ ఇంజనీర్లకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి కావడంలో కీలకపాత్ర పోషించిన ఐదుగురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బీవీ రమణారెడ్డిని ఎస్ఈగా ప్రమోట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సర్కిల్–1 ఎస్ఈగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చిం ది. ఇప్పటివరకు అక్కడ ఎస్ఈగా కొనసాగుతు న్న సుధాకర్‌రెడ్డిని కరీంనగర్ సర్కిల్ ఎస్ఈగా బదిలీ చేసింది. లింక్–2లో డీఈఈగా పనిచేసిన నూనె శ్రీధర్‌కు ఈఈగా, ప్రాజెక్ట్ డివిజన్–2లో డీఈఈగా పనిచేస్తున్న ఎ.యాదగిరికి ఈఈగా ప్రమోషన్ ఇచ్చింది. వారు పనిచేస్తున్న చోటే ఈఈలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లింక్–1లో ఏఈఈలుగా పనిచేస్తున్న ఎం.రాజు, పి.రవిచంద్రకు డీఈఈలుగా పదోన్నతి కల్పించారు. తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌కు 10(హెచ్) పరిధి నుంచి వీరికి మినహాయింపునిచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రమోట్ అయిన ఇంజనీర్లు ఇన్‌చార్జీలుగానే ప్రస్తుతం ఇచ్చిన పోస్టుల్లో కొనసాగుతారని, పాత క్యాడర్లోని పేస్కేల్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. వారికి పదోన్నతులు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఇన్చార్జి ఏర్పాట్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల తుదితీర్పునకు లోబడి ఉంటాయని, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ ప్రమోషన్ స్థానాల నుంచి ఇంజనీర్లను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ప్రమోషన్ పొంది ఇన్‌చార్జీలుగా కొనసాగుతూ ఎవరైనా రిటైర్డ్ అయినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఈ పదోన్నతులను పరిగణనలోకి తీసుకోబోమని, వీటిపై సంబంధిత ఉద్యోగులకు ఎలాంటి అధికారం ఉండబోదని స్పష్టంచేశారు. -
త్వరలో కాళేశ్వరం పర్యవేక్షణకు సీఎం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మిడ్‌మానేరు నుంచి దిగువ కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించే పనుల పర్యవేక్షణ నిమిత్తం సీఎం కేసీఆర్ త్వరలోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించే అవకాశముంది. పర్యటనలో భాగంగా ప్యాకేజీ–10 మోటార్లను ప్రారంభించడంతోపాటు మిడ్‌మానేరు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ చేస్తారని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గురువారం సీఎం నీటి పారుదల ఈఎన్సీలతో చర్చించినట్లుగా తెలిసింది. -
కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం
సాక్షి, తుంగతుర్తి : గోదావరి జలాల కోసం 50 ఏళ్లుగా పోరాడాం.. వేయి కళ్లతో ఎదురుచూశాం.. కానీ చుక్కనీరు రాలేదు. కాళేశ్వరం జలాల పుణ్యమాని ప్రస్తుతం జిల్లా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో సీనియర్ జర్నలిస్టు, రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన పిట్టవాలిన చెట్టు పుస్తకాన్ని ఆదివారం తుంగతుర్తి, దుబ్బాక ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, సోలిపేట రామలింగారెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీచైర్‌పర్సన్ గుజ్జ దీపికయుగేందర్రావులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ సభలో వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో మొదటి ఫలాలు సూర్యాపేట జిల్లాకే దక్కాయన్నారు. జిల్లా పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మొట్టమొదట జిల్లాకు విడుదల చేయించారని గుర్తుచేశారు. రెండు నెలల నుంచి కాళేశ్వరం జలాలు నిరంతరాయంగా జిల్లాకు వస్తున్నాయన్నారు. దీంతో జిల్లాలోని చెరువులు, కుంట లు నిండి, నీటితో కళకళలాడుతున్నాయన్నారు. కేసీఆర్ సీఎం కాకపోతే కాళేశ్వరం జలాలు వచ్చేవి కావు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మరో వెయ్యి జన్మలెత్తినా కాళేశ్వరం జలాలు వచ్చేవి కావన్నారు. హుజూర్నగర్ ఎన్నికలు అయ్యాక సీఎం కేసీఆర్ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెల్పడానికి వెళ్తున్న సందర్భంగా సూర్యాపేట ప్రాంతంలో ఆగి గోదావరి జలాలను చూసినప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం మాటల్లో చెప్పలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన కళ్లల్లో చూసిన ఆనందం మళ్లీ కాళేశ్వరం జలాలు చూశాక వచ్చిందన్నారు. సమైక్యాంధ్రలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా ఉండడం వల్ల 69 డీబీఎం పరిధిలో మరికొన్ని చెరువులకు నీరుపోవడం లేదని ఆ పరిస్థితిని ప్రస్తుతం చక్కదిద్దనున్నట్లు చెప్పారు. దివంగత నేతలు భీంరెడ్డి నర్సింహారెడ్డి, వర్ధెల్లి బుచ్చిరాములు బతికి ఉంటే గోదావరి జలాలను చూసి ఎంతో ఆనందపడేవారని గుర్తుచేశారు. తాము చేసిన పోరాటాల ఫలితంగానే నేడు గోదావరి జలాల వస్తున్నాయని వారి ఆత్మలు ప్రస్తుతం శాంతిస్తాయని చెప్పారు. చెరువులు నిండితేనే ఊర్లు పచ్చగా ఉండి రైతులు సంతోషంగా ఉంటారని అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో 60 ఏళ్లుగా జరగని అభివృద్ధిని కేవలం 5ఏళ్లలో సాధించానని గుర్తుచేశారు. కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపడానికి తన శాయశక్తులా కృషి చేశానని తెలిపారు. గతంలో నియోజవర్గంలో హత్యలతో రక్తం పారిందని, కానీ ప్రస్తుతం వాటికి స్వస్తిపలికి గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా చెరువులున్నది తుంగతుర్తి నియోజకవర్గమేనని తెలిపారు. గోదావరి జలాలతో చెరువులు కుంటలు నింపడంతో తన జీవితం ధన్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోజ, జేసీ సంజీవరెడ్డి, జెడ్పీవైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, జిల్లా చైర్మన్ ఎస్ఏ రజాక్, ఎంపీపీ గుండగాని కవితరాములుగౌడ్, వర్ధెల్లి శ్రీహరి, క్రిష్ణ, వజ్జ వీరయ్యయాదవ్, ఎన్.అయోధ్య, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం, సర్పంచ్ నకిరేకంటి విజయ్, బుద్ద సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు అబ్దుల్లా, గుడిపాటి సైదులు, వెంకటనారాయణ, సీతయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధెల్లికి పలువురి అభినందన సీనియర్ జర్నలిస్టు, పిట్టవాలిన చెట్టు పుస్తక రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, రామలింగారెడ్డితో పాటు పలువురు అభినందించారు. గతంలో చెంచులపై మరణం అంచున, ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణపై పిట్ట వాలిన చెట్టు అనే పుస్తకాలను రాయడం అభినందనీయమన్నారు. సామాజిక సృహ ఉన్న జర్నలిస్టు అని కొనియాడారు. తన నిధుల నుంచి ఈ పుస్తకానికి అయ్యే ఖర్చుకు సాయం అందిస్తానని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ప్రకటించారు. చరిత్రను గుర్తుచేయడం కోసమే ఇలాంటి పుస్తకాలను రాస్తున్నారని చెప్పారు. మంచి రచయితగా మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రచయిత వెంకటేశ్వర్లు కోరిక మేరకు ఆయన స్వగ్రామం కొత్తగూడెంకు కావాలి్సన నిధులు మంజూరు చేసి అన్నిరంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రులకు ఘన స్వాగతం రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలకు ఆదివారం ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో తుంగతుర్తి నుంచి కొత్తగూడెం వరకు భారీ బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అలాగే కొత్తగూడెం గ్రామస్తులు బతుకమ్మలు, కోలాటాల బృందంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వెన్నెల నాగరాజు కళాబృందం ఆధ్వర్యంలో వివిధ రకాల కళాప్రదర్శనలు ఇచ్చారు. అలాగే గోరెటి వెంకన్న పాడిన పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి. కాగా యాదవసంఘం ఆధ్వర్యంలో మంత్రులకు గొర్రెపిల్లలను, గొంగడిని బహూకరించారు. -
‘కాళేశ్వరా’నికి చౌకగా కరెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 1,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3 లోపు తక్కువ ధరతో విక్రయించేందుకు జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం గోవాలో ఎన్టీపీసీ నిర్వహించిన దక్షిణాది ప్రాంత వినియోగదారుల సమావేశానికి ప్రభాకర్‌రావు హాజరై ఆ సంస్థ సీఎండీ గురుదీప్ సింగ్‌తో చర్చలు జరిపా రు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం వచ్చే ఏడాది విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా చేయాలని ఈ సమావేశంలో గురుదీప్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన యూనిట్‌కు రూ.3 లోపే ధరతో 1,500 మెగావాట్ల సౌర విద్యు త్ విక్రయించేందుకు అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపుతుండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదనను తగ్గించేందుకు బ్యాకింగ్ డౌన్ చేయాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితులతో సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ల మధ్య పెద్దగా బేధం లేకుండా పోయిందని ఈ సమావేశంలో సీఎండీ అభిప్రాయపడ్డారన్నారు. -
‘కాళేశ్వరం’ ఇంజనీర్లకు ప్రమోషన్
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఐదుగురు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్లు కుటుంబాలకు దూరంగా ఉండి రాత్రింబవళ్లు శ్రమించి లక్ష్యానికి అనుగుణంగా కృషి చేసినందుకు ప్రభుత్వం స్పెషల్ ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లింకు–1లోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణారెడ్డికి ఎస్ఈగా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రాజుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా, అన్నారం సరస్వతీ బ్యారేజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.యాదగిరికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవిచంద్రకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదోన్నతి ఇవ్వనున్నారు. అలాగే లింకు–2 పరిధిలోని నంది, గాయత్రి పంపుహౌస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌కు ఎస్ఈగా ప్రమోషన్ రానుంది. వీరందరికి ఒక నెల జీతం లేదా ఒక ఇంక్రిమెంట్‌ను ఇవ్వనున్నారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తవద్దు
సాక్షి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను తాకిన కాళేశ్వరం జలాలను ప్రాజెక్టులోకి వదలాలనే నిర్ణయాన్ని నీటి పారుదలశాఖ ప్రస్తుతానికి కొద్ది రోజులు వాయిదా వేసుకుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనుల్లో భాగంగా మొదటి, రెండు పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తికాగా, ఇటీవలే వెట్‌రన్ నిర్వహించిన విషయం విదితమే. దీంతో జలాలు ప్రాజెక్టు చెంతకు చేరగా, మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే వరదకాలువ గేట్లు మాత్రం ఎత్తలేదు. దీంతో కాలువలోనే నీళ్లు ఉండిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ మహారాష్ట్ర నుంచి వరద జలాల రాక కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మూడో పంప్‌హౌస్ పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి మంగళవారం పది వేల క్యూసెక్కులు వచ్చి చేరగా, బుధవారం రెండున్నర వేలు వచ్చింది. ఇలా ఏటా సెప్టెంబర్ నెలాఖరు వరకు వరద రాక కొనసాగుతుంది. ప్రస్తుతానికి ప్రాజెక్టులో 31.849 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు నీటిమట్టం 1,071.40 అడుగులు ఉంది. వరద గేట్లు 1,070 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి మట్టంలో వరద గేట్లు ఎత్తితే ప్రాజెక్టులోని నీళ్లు వరద కాలువలోకి వచ్చి.. తిరిగి ప్రాజెక్టులోకి వెళతాయి. ఈ నేపథ్యంలో వరద గేట్లు ఎత్తాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మూడో పంప్‌హౌస్ జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్ర సమీపంలోని వరద కాలువ 0.1.కి.మీ వద్ద నిర్మిస్తున్న మూడో పంప్‌హౌస్ నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పనులు పూర్తవడానికి మరో రెండు, మూడు నెలలు పట్టే అవకాశాలున్నాయి. పనులు పూర్తయితే వరద కాలువ గేట్లు మూసివేసి నీటిని ప్రాజెక్టులోకి పంప్ చేయవచ్చు. కానీ ఈ పనులు పూర్తికాకపోవడంతో ప్రస్తుతానికి నీటిని ప్రాజెక్టులోకి పంపు చేయడానికి వీలుపడటం లేదు. నిండుకుండలా వరద కాలువ.. ప్రస్తుతం వరద కాలువ నిండు కుండలా మారుతోంది. కాళేశ్వరం జలాలు కాలువలోకి రావడంతో కాలువకు ఇరువైపులా భూగర్భ జలాలు మరింత వృద్ది చెందనున్నాయి. చుట్టుపక్కల వట్టి పోయిన బోర్లు రీచార్జ్ అవుతాయి. -
ఓట్ల కోసం ఈ పని చేయట్లేదు : మంత్రి
సాక్షి, నిజామాబాద్ : ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని ఓట్లకోసం చేపట్టలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు, రైతుల రుణం తీర్చుకోవడానికి, పదవిలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక గుర్తుండే పని చేయాలనే తలంపుతో చేశామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేతల మాటలు వింటుంటే జాలేస్తుందన్నారు. కాళేశ్వరం జలాలు ఎలా వస్తాయనే ప్రతిపక్షాల హేళనలన్నీ భరించిన కేసీఆర్ ఇప్పుడు అపర భగీరథుడయ్యాడని ప్రశంసించారు. మరోవైపు తెలంగాణ దేశానికే ఆదర్శమని కొత్త గవర్నర్ చెప్పడం హర్షదాయకమని తెలిపారు. -
శాంతించిన గోదారమ్మ
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది వరద ప్రవాహం కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద నాలుగు రోజుల కిందట 10.70 మీటర్ల ఎత్తు ఉంటే.. ప్రస్తుతం 5.44 మీటర్లకు చేరింది. ప్రస్తుతం లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి ఇన్ ఫ్లో 75వేల క్యూసెక్కులు వస్తుండగా.. 14 గేట్లు ఎత్తారు. 75వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తోంది. బ్యారేజీలో ప్రస్తుత నిల్వ 5.812 టీఎంసీలు. సరస్వతీ(అన్నారం) బ్యారేజీకి ఇన్‌ఫ్లో 2300 క్యూ సెక్కులు ఉండగా.. 66 గేట్లు మూశారు. ప్రస్తుతం బ్యారేజీలో 7.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరదలు తగ్గితేనే మోటార్లు రన్! కన్నెపల్లి పంపుహౌస్‌లో నెల రోజులుగా మోటార్లు నడవడం లేదు. తెలంగాణ, మహారాష్ట్రల్లో వర్షాలు పూర్తిగా తగ్గితేనే మోటార్లు మళ్లీ నడవనున్నాయని అధికారులు తెలిపారు. గత నెలలో ఆరు మోటార్లకు వెట్‌రన్ నిర్వహించగా సుమారు 1,560 గంటలు మోటార్లు నడవగా.. 15 టీఎంసీల నీరు ఎగువకు తరలించిన విషయం తెలిసిందే. వర్షాలు లేకుంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి మోటార్లు నడిచే వీలున్నట్లు సమాచారం. -
పాలమూరు ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రధాన అడ్డంకులను దాటుతూనే, సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచేలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనుల పూర్తికి వీలుగా ఈ రుణాలు తీసుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి పాలమూరు–రంగారెడ్డి పనులను రూ.32,500 కోట్లతో చేపట్టగా ఇందులో ఇప్పటివరకు 20 శాతం పనులే పూర్తయ్యాయి. నిధుల కొరత కారణంగా ఏడాదిగా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇది వరదజలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనులకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవాలని సర్కారు గతంలో నిర్ణయించింది. ఈ పనులకు రూ.17 వేల కోట్లు అవసరం ఉండగా రూ.10 వేల కోట్లు రుణాలిచ్చేందుకు పీఎఫ్సీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రుణం తీసుకునేలా ఉత్తర్వులు వెలువడగా, త్వరలోనే దీనికి సంబంధించి పీఎఫ్‌సీతో ఒప్పందాలు జరగనున్నాయి. రూ.41,500 కోట్లకు కాళేశ్వరం రుణాలు! దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టుల కోసం ‘తెలంగాణ రాష్ట్ర వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్(టీఎస్‌డబ్ల్యూఐసీ)’పేరుతో ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,638 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ కార్పొరేషన్‌కు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం రూ.17 వేల కోట్ల మేర రుణం ఇచ్చింది. వీటిల్లో ఎక్కువగా సీతారామ, దేవాదుల పనులకే నిధులు వెచ్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ– 12 పనుల పూర్తికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) నుంచి రూ.1,500 కోట్లు రుణం తీసుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఇప్పటివరకు వివిధ రుణ సంస్థల నుంచి రూ.40 వేల కోట్లకుపైగా సేకరించగా, అందులోంచే ప్రాజెక్టు నిర్మాణపనులకు రూ.32 వేలకోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుత కాళేశ్వరం రుణాలు రూ.41,500 కోట్లకు చేరనున్నాయి. -
హైదరాబాద్‌కు కాళేశ్వరం జలాలు
-
గ్రావిటీ కాల్వ రెడీ!
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటిని తరలించే అతి ముఖ్యమైన గ్రావిటీ కాల్వ నిర్మాణం పూర్తయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అడవి మార్గంలో 13.341 కిలోమీటర్ల దూరం రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన గ్రావిటీ కాల్వ ద్వారా ఈ ఖరీఫ్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఈ గ్రావిటీ కాల్వ నిర్మాణాన్ని 30 స్ట్రక్చర్లతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అతి తక్కువ సమయంలో పూర్తి చేశారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని 37లక్షల ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరు సరఫరా కానుంది. భవిష్యత్‌లో 3 టీఎంసీల సాగునీరు తరలించేలా కాల్వ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్‌లో 7 మోటార్ల బిగింపు పూర్తి కాగా మరో 2 నిర్మాణ దశలో, మరో రెండు పురోగతిలో ఉన్నాయి. అనతి కాలంలోనే పనులు పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 2016, మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయగా.. అనతి కాలంలోనే పనులన్నీ పూర్తి చేసి నీటిని తరలించడానికి సిద్ధం చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత జలాలను వినియోగించి రాష్ట్రంలోని 37 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయగా అటవీ, పర్యావరణ శాఖ అనుమతులకు సంబంధించి అడ్డంకులు త్వరగా తొలగిపోవడంతో గ్రావిటీ కెనాల్ (కాల్వ) పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరికి అడ్డుకట్ట వేసి నిలిపిన నీటిని అప్రోచ్ కెనాల్ ద్వారా కన్నెపల్లి పంప్‌హౌస్‌లో అమర్చిన 11 మోటార్ల సాయంతో రివర్స్ పంపింగ్ ద్వారా తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పంప్‌హౌస్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరం పైపులైన్ పూర్తయింది. ఈనెల 4న సీఎం కేసీఆర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా జూలై నుంచి నీటిని తరలించడానికి సమన్వయంతో పనిచేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు మార్గనిర్దేశం చేశారు. దీంతో పనుల్లో వేగం మరింత పెరిగింది. పర్యాటక అభివృద్ధికి అడుగులు ఈ గ్రావిటీ కాల్వ పొడవునా అందమైన రిసార్ట్సు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్ నుంచి వచ్చి పరిశీలించి ప్రణాళికలు తయారు చేసింది. త్వరలో బోటింగ్ పాయింట్స్ కూడా పెట్టనున్న ట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా పర్యాటకులకు ఆ హ్లాదాన్ని అందించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాల్వ నిర్మాణం ఇలా.. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం వరకు 13.341 కిలోమీటర్ల వరకు అడవిలో కాల్వ 150–250 మీటర్ల వెడల్పు.. అడుగు భాగంలో 76 మీటర్లతో నిర్మాణం చేపట్టారు. రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తే కాల్వలో 5.5 మీటర్ల నీరు ప్రవహిస్తుంది. అదే 3 టీఎంసీలు తరలిస్తే 7.5 మీటర్ల నీరు వెళ్లేలా కాల్వ లైనింగ్ పూర్తి చేశారు. అధునాతన పద్ధతులతో 30 స్ట్రక్చర్లు గ్రావిటీ కాల్వలో 30 స్ట్రక్చర్లు నిర్మాణం చేపట్టారు. ప్రత్యేకమైన ఏడు పద్ధతులతో దీనిని నిర్మించారు. ఇందులో డీఎల్ఆర్ వంతెనలు 4, అండర్ టన్నెల్ వంతెనలు 8, ఎకో వంతెనలు 5, సూపర్స్పాసేజ్ వంతెనలు 5, ఇన్లెట్ వంతెనలు 6, పైపులైన్ వంతెన 1, డ్రాప్స్ వంతెన ఒకటి నిర్మించారు. సూపర్ స్పాసేజ్ వంతెనల ద్వారా అడవుల నుంచి, వాగుల ద్వారా పారే కాల్వ ల నీటిని ఇతర చెరువులకు తరలిస్తారు. అండర్ టన్నెల్ వంతెనల ద్వారా కాల్వ కింద ఉన్న బెడ్ నుంచి నీటిని తరలిస్తారు. ఇన్లెట్ వంతెనల ద్వారా చిన్న వర్షాలకు వచ్చే నీటిని యథావిధిగా కాల్వ గుండా తరలిస్తారు. ఎకో వంతెనలు అడవుల్లోని వన్యప్రాణులు ఇటు నుంచి అటు తిరగడానికి వీలుగా నిర్మించారు. వాటికి అనుగుణంగా అక్కడక్కడా చెట్ల పెంపకం చేపట్టనున్నారు. కాల్వను పరిశీలించడానికి ఇరువైపుల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఎడమ వైపు 5.5, కుడి వైపు 1.8 కిలోమీటర్లు పూర్తయింది. -
పాలమూరు, డిండికి గోదావరి నీళ్లు
సాక్షి, హైదరాబాద్: నీటి కొరతను ఎదుర్కొంటున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గోదావరి నీటిని మళ్లించాలన్న ఆలోచనలకు ప్రభుత్వం పదును పెడుతోంది. గరిష్ట నీటిలభ్యత, సముద్రంలో ఏటా వృథాగా పోతున్న గోదావరిజలాలను మళ్లించి కృష్ణాబేసిన్ లోని పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు తరలించడం ద్వారా నీటికొరతను అధిగమించవ చ్చని భావిస్తోంది. దీనిపై ఇంజనీర్లు ఇదివరకే కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచగా, తాజాగా 100 టీఎంసీల గోదావరినీటిని పాలమూరు, డిండిలకు తరలించే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. దీనితో ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయి నీటి లభ్యత అందుబాటులో ఉంచవచ్చని పేర్కొన్నారు. గోదావరి పరిష్కారం.. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 120 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 90 టీఎంసీ నీటిని పాలమూరు–రంగారెడ్డికి, మరో 30 టీఎంసీ డిండికి మళ్లించాలని నిర్ణయించారు. పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీల నీటితో 12.3 లక్షల ఎకరాలకు, డిండికి 30 టీఎంసీ నీటితో 3.41లక్షల ఎకరా లకు నీరివ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు మించి నీరివ్వడం సాధ్యంకాదు. ఈ నేపథ్యం లో 90 టీఎంసీలతో 12.3 లక్షల ఎకరాలకు నీరివ్వ డం దాదాపు అసాధ్యం. కృష్ణాలో 120 వరద రోజుల ఆధారంగా లెక్కలు కట్టగా, కృష్ణాబేసిన్‌లో వరద 30 రోజులకు మించి ఉండట్లేదు. ఈ వరద రోజుల్లో 60 టీఎంసీలకు మించి నీటిని తీసుకోలేం. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు 100 టీఎంసీల మేర నీటి కొరత ఏర్పడుతోంది. ఈ నీటి కొరతను గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా మళ్లించడం ద్వారానే తీర్చుకోగలమని హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం తేల్చింది. ఇలా మళ్లించొచ్చు.. కాళేశ్వరంలో భాగంగా ఉన్న సంగారెడ్డి కెనాల్ కాల్వ నుంచి పాలమూరు లో భాగంగా ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌కు రోజుకు 0.8 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీటిని తరలించవచ్చని ఇంజనీర్ల సంఘం పేర్కొంది. దీనికోసం 2.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని సూచించింది. దీనిద్వారా కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద నిర్ణయించిన 4.13 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు మొత్తంగా 7 లక్షల ఎకరాలకు నీరి వ్వొచ్చని పేర్కొంది. కాళేశ్వరంలో చివరిదైన బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించొచ్చని సూచించింది. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపింది. ఏదుల నుంచి పాత డిండి వరకు కృష్ణా నీటిని తరలించే పనులకు అయ్యే వ్యయం కన్నా, శివన్నగూడెం ద్వారా డిండి ఎత్తిపోతలకు గోదావరి నీటిని తరలించే వ్యయం తక్కువగా ఉంటుందని తేల్చిచెప్పింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి, చర్చించాక నిర్ణయం చేసే అవకాశం ఉంది. -
రామగుండం ఎన్టీపీసీని సందర్శించిన కేసీఆర్
సాక్షి, రామగుండం: పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రామగుండం ఎన్టీపీసీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎన్టీపీసీలో సీఎం కేసీఆర్ విస్త్రత సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత రామగుండం ఎన్టీసీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్-1 ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. పవర్ ప్లాంట్‌కు సంబంధించిన పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్‌కు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పెద్దపలి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు కేసీఆర్ రామగుండం వచ్చారు. పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రికి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్‌లో కేసీఆర్ బస చేస్తారు. ఇక రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని కేసీఆర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపు హౌస్, మేడిగడ్డ బరాజ్ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో భాగంగా తెలంగాణ కోసం రామగుండం ఎన్టీపీసీలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తుండగా, తొలి విడుతలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. రూ.10,598.98 కోట్ల వ్యయంతో రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను 2016 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం కోసం మే 2015లోనే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. కాగా, దీనికి ఒడిశాలోని మందాకిని-బీ మైన్ నుంచి బొగ్గు సరఫరా చేస్తారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ పర్యావరణ అనుమతులను కూడా సాధించగా, పనులు శరవేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన -
కాళేశ్వరంతో రైతులకు మేలు
కాళేశ్వరం/ధర్మారం(ధర్మపురి)/సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర 15వ ఆర్థిక సంఘం సభ్యులు అశోక్ లహరి, రీటా లహరి అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆర్థిక సంఘం సభ్యులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు కింద పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆర్థిక సంఘం సభ్యులు మొదట హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీ పనులను పరిశీలించారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు ప్రాజెక్టు పురోగతిని ఫొటో ఎగ్జిబిట్ ద్వారా వారికి వివరించారు. 80 శాతం వరకు పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, త్వరగా నిర్మించి రైతులకు సాగు నీటిని అందించాలని అన్నారు. ప్రాజెక్టుకు ఆర్థిక సంఘం తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం భేష్! తెలంగాణ ప్రభుత్వం తక్కువ సమయంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని సభ్యులు ప్రశంసించారు. కాళేశ్వరంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి మేడారం రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు ప్యాకేజీ 6 కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మిస్తున్న అండర్ టన్నెల్ పనులను పరిశీలించారు. 6వ ప్యాకేజీలోని విద్యుత్ సబ్‌స్టేషన్, పంప్‌హౌస్, సర్జిపూల్ పనుల గురించి తెలుసుకున్నారు. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న కేటాయింపులనుంచి ప్రతిరోజు 2 టీఎంసీల నీరు ఎత్తిపోసి 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో కలిపి మొత్తం 36 లక్షల ఎకరాలకు సాగు నీరిందిస్తామన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, కాలువలు ప్రవహించే దారిలోని గ్రామాల తాగునీటి అవసరాలను సైతం తీర్చే బృహత్తర పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 6వ ప్యాకేజీ పనులను రూ.5,046 కోట్లతో ప్రారంభించి ఇప్పటి వరకు 95 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. జూన్ నెలాఖరులోగా వందశాతం పనులు పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 టీఎంసీలను తరలించటానికి అవసరమైన సివిల్ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాగు, సాగునీటికి ప్రాధాన్యం కల్పిస్తూ, మత్స్య పరిశ్రమ, టూరిజం పెరిగేలా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మిషన్ భగీరథ పనుల పరిశీలన: రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం బాగుందని వారు కితాబిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అగ్రహారం వద్ద చేపట్టిన మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఆదివారం వారు సందర్శించారు. రాష్ట్రంలో 1.3 లక్షల కిలోమీటర్ల పైపులైన్‌ను భగీరథలో ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో 15వ ఆర్థిక సంఘం సభ్యులు అరవింద్ మెహతా, రవి కోట, ఆంటోని ఫిరాయిక్, సీఎస్ ఎస్కే జోషీ, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, మిషన్ భగీరథ సీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. శంషాబాద్‌లో స్వాగతం: రాష్ట్ర పర్యటనకోసం వచ్చిన 15వ ఆర్థిక సంఘం సభ్యులకు ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, సీఎస్ ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్వాగతం పలికారు. ఆర్థిక సంఘం సభ్యులు ఈనెల 20 వరకు రాష్ట్రంలో పర్యటిస్తారు. -
చేయూతనివ్వండి!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం 15వ ఆర్థిక సంఘం తలుపుతట్టనుంది. రాష్ట్రంలో 32 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టుకు ఉదారంగా నిధులిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ రానున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది. ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందించి చేయూతనివ్వాలని కోరనుంది. నిర్వహణకే భారీ నిధులు అవసరం... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల కాలానికి విద్యుత్ అవసరాలకు వెచ్చించే ఖర్చు, నిర్వహణ భారం కలిపి రూ.40,170 కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. వీటిలో విద్యుత్ అవసరాల ఖర్చు రూ.37,796 కోట్లు కాగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374 కోట్లు ఉండనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ అవసరం 4,627 మెగా వాట్లు కాగా, ఇందులో 2020–21 నుంచి విద్యుత్ చార్జీల కిందే రూ.2,310 కోట్లు మేర చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.11,220 కోట్లు అవసరం ఉంటుందని లెక్కలేసింది. ఈ నిర్వహణ భారాన్ని కేంద్రమే భరించేలా చూడాలని ప్రభుత్వం కోరనుంది. ఇక ప్రాజెక్టు పనుల కోసం రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరగ్గా, ఇందులో రూ.35,787 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.28,291 కోట్ల మేర పనులు చేయాల్సి ఉంది. మిగతావి ఓఅండ్‌ఎంకు కేటాయించారు. ఇందులో రూ.9,874 కోట్ల మేర ఇప్పటికే తీసుకున్న రుణాలు అందాల్సి ఉంది. ఇవి పోనూ భవిష్యత్తు నిధుల అవసరాలు రూ.18,417 కోట్ల మేర ఉండనున్నాయి. ఇందులోనూ కొంత భారాన్ని కేంద్రం భరించాలని రాష్ట్రం కోరే అవకా శం ఉంది. ఇప్పటికే నీతి ఆయోగ్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసినా, అలాంటిదేమీ జరగ లేదు. దీంతో ఇప్పుడైనా సానుకూల నిర్ణయం చేయాలని కోరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం కోరేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించాయి. నేడు కాళేశ్వరం సందర్శన.. 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12కి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకుని పనులను పరిశీలిస్తారు. తర్వాత ప్యాకేజీ–6లోని పంప్‌హౌజ్ పనులను చూస్తారు. అక్కడే ప్రాజెక్టు పనులపై సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్రావుతో కూడిన బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. అనంతరం మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల పనులను సంఘం ప్రతినిధులు పరిశీలించే అవకాశం ఉంది. -
సేకరిస్తే..అదే ‘పది’వేలు!
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింది ఆయకట్టుకు వచ్చే వానాకాలానికి పూర్తి స్థాయిలో నీరు పారించాలంటే ప్రాజెక్టు పరిధిలో భూసేకరణే అత్యంత కీలకం కానుంది. ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని పారించే ఎస్సారెస్పీ స్టేజ్–2, ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ), కాళేశ్వరంల పరిధిలోని కాల్వల పనలకు ఏకంగా పదివేల ఎకరాల భూమిని సేకరణ చేస్తే కానీ నీటిని తరలించడం సాధ్యంకాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేలా సహకరించాలని గరువారం రాత్రి ఎస్సారెస్పీ ప్రాజెక్టుపై జరిపిన సమీక్ష సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సేకరిస్తేనే సాగయ్యేది.. ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద మొత్తంగా 14.40లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఇందులో 6లక్షల ఎకరాలకు మించి నీరందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లతో కాల్వల ఆధునికీకరణ చేపట్టింది. కాల్వల సామరŠాధ్యన్ని పెంచారు. దీనికి తోడు ఎస్సారెస్పీ దిగువ తీరం నుంచి 20 టీఎంసీల వరద నీటిని వినియోగించుకుంటూ 2.20 లక్షల ఎకరా లకు నీటినిచ్చేలా ఇందిరమ్మ వరద కాల్వని చేపట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టు పరిధిలో మార్పులు చోటుచేసుకొని దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని 2లక్షల ఎకరాల మేర ఆయ కట్టును వరద కాల్వ పరిధిలోకి తెచ్చారు. దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టుకు కొత్తగా వరద కాల్వ ద్వారా నీటిని అందించాలంటే 3.3 కిలోమీటర్ల అదనపు టన్నెల్ నిర్మాణంతో పాటు 48 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్ తవ్వాల్సి ఉంది. దీంతో పాటే మిడ్‌మానేరు రిజర్వాయర్ కెనాల్ తొలి నుంచి 36 కిలోమీటర్ల వరకు కెనాల్ సామర్థ్యాన్ని 2,600 క్యూసెక్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచా లని ప్రతిపాదించారు. దీనికి తోడు గౌరవెల్లి రిజర్వా యర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8,23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి పెంచారు. దీంతో వరద కాల్వ కింద భూసేకరణ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ 5,978 ఎకరాల మేర సేకరణ చేయాల్సి ఉందని ఇటీవలి సమీక్షలో సీఎంకు ఇంజనీర్లు నివే దించారు. పది నియోజకవర్గాల పరిధిలో భూసేక రణ చేయాల్సి ఉండగా, ఇందులో అధికంగా హుస్నాబాద్‌లో 3,943 ఎకరాలు, స్టేషన్ ఘణ పూర్లో 863, జనగామలో 498 ఎకరాలు ఉంటుం దన్నారు. వచ్చే వానాకాలానికి గౌరవెల్లి రిజర్వా యర్ వరకు 80వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణ యించారు. ఈ దృష్ట్యా మానుకొండూరు, హుస్నా బాద్, సిద్ధిపేట, చొప్పదండి నియోజక వర్గాల్లో భూసేకరణ జరిగేలా చూడాలని సీఎం స్థానిక ఎమ్మెల్యేలకు ఆదేశించారు.ఇక ఎస్సారెస్పీ స్టేజ్– 2లో 3.92లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఇవ్వాల్సి ఉండగా, ఇక్కడ కేవలం 135 ఎకరాల సేకరణ అవసరం ఉంది. దీన్ని పరిష్కారించేలా చూడాలని డోర్నకల్, పాలేరు, సూర్యాపేట, తుంగతుర్తి నియో జకవర్గ ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టును అనుసంధా నిస్తున్న క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న 4,869 ఎకరాల సేకరణ సైతం అత్యంత కీలకంగా మారుతోంది. ఇందులో సిద్ధిపేటలో 1,146 ఎక రాలు, సిరిసిల్లలో 855 ఎకరాలు, వేముల వాడలో 685 ఎకరాలు,, గజ్వేల్‌లో 595 ఎకరాల మేర చేయా ల్సి ఉంది. దీన్ని వేగిరపరచాలని సీఎం ఆదేశిం చారు. ఒకటి, రెండు నెలల్లో ఈ మొత్తం భూసేకరణ చేస్తేనే జూన్ నాటికి ఎస్సారెస్పీ కింది 14.40లక్షల ఎకరాలకు నీటిని తరలించే ఆస్కారం ఏర్పడనుంది. -
కాళేశ్వరం కాల్వల పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దిగువన పూర్వ మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో కాల్వల నిర్మాణ పనులకు నీటి పారుదల శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం రూ.1,094.56 కోట్ల పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించింది. సంగారెడ్డి కాల్వలను కొండపోచమ్మ దిగువన వర్గల్ మండలం గౌరారం నుంచి మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామం వరకు 37 కి.మీ కాల్వను తొలి రీచ్‌గా విభజించారు. దీనికి రూ.365.54 కోట్లకు టెండర్ పిలిచారు. జీడిపల్లి నుంచి నర్సాపూర్ మండల పరిధిలోని చిప్పలపర్తి వరకు 73 కి.మీ కాల్వను రెండో రీచ్ గా విభజించి రూ.375.54 కోట్లతో టెండర్లు పిలిచా రు. కొండపోచమ్మ సాగర్ దిగువన ఉన్న రావల్కోల్ కాల్వల ద్వారా శామీర్‌పేట్ చెరువు నింపడం, దాని కింద 31 కి.మీ.ల బొమ్మలరామారం కాల్వల ద్వారా 15,676 ఎకరాలకు నీరివ్వడం, ఇదే చెరువు నుంచి కీసర కాల్వ ద్వారా 20 కి.మీ మేర కాల్వలు తవ్వి 4,324 ఎకరాలకు నీళ్లిచ్చే పనులకు మరో రూ.353. 48 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఈ నెల 8 నుంచి 21 వరకు టెండర్లు స్వీకరిస్తారు. 22న టెక్నిక ల్ బిడ్, 27న ప్రైస్ బిడ్ తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తారు. మార్చిలోనే ఈ పనులను ఆరంభించే అవకాశాలున్నాయి. -
చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా.. మిషన్ ఎస్సారెస్పీ
సాక్షి, హైదరాబాద్: రానున్న ఖరీఫ్ సీజన్లో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని మళ్లించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. ఆలోగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద చేపట్టిన అన్ని రకాల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. వర్షాలు కురిసే జూన్ నాటికి ఎస్సారెస్పీ పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చేందుకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ఈ నెల 10 నుంచి లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్ఎండీ) దిగువన ఉన్న ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.కాగా, గురువారం నీటిపారుదల అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిచంనున్నారు. సీఎం ఆదేశాలతో కీలక భేటీ ఎస్సారెస్పీ ఆయకట్టు పునరుజ్జీవంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ఇంజనీర్లతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని ఆయకట్టు పరీవాహక ఎమ్మెల్యేలకు మంగళవారం ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా జూన్, జూలై నుంచే 90 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయని.. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ కింద ఉన్న 14.40లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ అధికారు సమన్వయ భేటీ బుధవారం జలసౌధలో జరిగింది. ఈ భేటీకి మాజీ మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్, సుంకే రవిశంకర్, నన్నపనేని నరేందర్, సోలిపేట రామలింగారెడ్డి, సీతక్క, ఆరూరి రమేష్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్ కుమార్, సీఈ శంకర్ తదితరులు హాజరయ్యారు. రబీ సాగునీటి విడుదల, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ పనులు, ఆయకట్టు లక్ష్యాల పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. జూన్ చివరికి 100% పనులు: ఈటల ఎస్సారెస్పీ ద్వారా 14.40లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉన్నా, గతంలో 5 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు ఇవ్వలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ చేపట్టి ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు నీళ్లివ్వాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇదే సమయంలో ‘ప్రాజెక్టులో ఇప్పటికే తవ్విన కాల్వలకు 3వేల క్యూసెక్కుల సామర్థ్యం నుండి 6వేల క్యూసెక్కుల సామర్థ్యం వరకు నీటిని వదిలి పరీక్షించాం. ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సమావేశంలో చర్చించాం. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్‌ను బలోపేతం చేసుకోవాల్సి ఉంది. దీంతో పాటే చెరువులు, కుంటలు నింపాలని సీఎం చెప్పారు. ఇలా చేస్తే భూగర్భజలాలు, మత్స్య సంపద పెరుగుతుంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి కేటాయించిన నిధుల్లో 100% ఖర్చు చేస్తాం. అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చుకుంటాం’అని ఈటల పేర్కొన్నారు. కొన్ని చోట్ల భూసేకరణలో సమస్యలున్నాయని, వాటిపైన పూర్తి దృష్టిసారిస్తామన్నారు. ఈ ఎండాకాలంలో రైతాంగానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామని, ఫిబ్రవరి 10నుంచి లోయర్ మానేరు కింది పంటలకు ఒక తడి నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. వర్షాకాలనికి గౌరవెళ్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని, కాళేశ్వరం నీళ్లు వీటికి అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు. కొనసాగుతున్న ఎల్ఎండీ పనులు! ఎస్సారెస్పీ పరిధిలో ఎల్ఎండీ ఎగువన 145వ కిలోమీటరు వరకు పనులు కేవలం 30–40% మాత్రమే పూర్తవగా, దిగువన 146వ కిలోమీటర్‌నుంచి 284కి.మీ వరకు కాల్వల ఆధునీకరణ పనులను రూ.400 కోట్లతో చేపట్టగా, ఇక్కడ 60% పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నీటి విడుదల కొనసాగుతు న్న దృష్ట్యా పనులు జూన్ నాటికి పూర్తి చేయా లని ఎమ్మెల్యేలు సూచించారు. డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.230 కోట్ల పనులను జూన్ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చూడాలని ఆదేశించారు. ప్రాజెక్టు స్టేజ్–1 కింద 9.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 6 లక్షల ఎకరాల వరకు నీరందుతోంది. స్టేజ్ –1 కింద ఉన్న 4.80 లక్షల ఎకరాల ఆయకట్టులో గరిష్టంగా నీరందించేలా చూడాలని సూచించారు. మిడ్‌మానేరు కింద 80వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు. -
సాగు నీరు.. నిధుల జోరు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించే క్రమంలో భాగంగా వచ్చే బడ్జెట్లోనూ భారీగా నిధులు పారించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు అందించాలన్నదే తమ ముందున్న ప్రధాన లక్ష్యమంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందుకు తగ్గ్గట్టే నిధుల కేటాయింపు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గడిచిన రెండు, మూడు బడ్జెట్ల్లో కేటాయించిన మాదిరే ఈసారి కూడా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా కేటాయింపులు చేసి సాగునీటికి అగ్రపీఠం కట్టబెట్టాలని, అందుకు తగ్గట్లే పనులు చేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రూ.26,452 కోట్లతో ఇప్పటికే ప్రాథమిక బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ప్రభుత్వ పరిశీలనకు పంపిన అనంతరం రూ.25 వేల కోట్లకు సర్దుబాటు చేసే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. రుణాలతో గట్టెక్కారు... 2018–19 ఆర్థిక ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ.18,450 కోట్ల మేర ఖర్చు చేశారు. మరో రూ.5,535 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.24 కోట్ల మేర పనులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ.10,476 కోట్ల రుణాలు తీసుకొని బిల్లులు చెల్లించారు. ఇక సీతారామ, దేవాదుల, ఎఫ్ఎఫ్సీ, ఎస్సారెస్పీ–2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,439 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.13 వేల కోట్లు రుణాల ద్వారా సేకరించగా, రాష్ట్ర ప్రభుత్వం తన పద్దు నుంచి కేవలం రూ.5,535కోట్లు కేటాయించింది. మొత్తంగా రుణాల ద్వారానే ఈ ఏడాది బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులన్నీ గట్టెక్కాయి. మొదటి ప్రాధాన్యత కాళేశ్వరానికే... సీఎం ఆలోచనలకు తగినట్లుగా ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తంగా రూ.26,452 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో మళ్లీ తొలి ప్రాధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కనుంది. ప్రాజెక్టుకు గత ఏడాది రూ.6,157 కోట్ల మేర నిధులు కేటాయించారు. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖరీఫ్ నాటికి నీళ్లందించాలని సీఎం లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్‌లతో పాటు ఎల్లంపల్లి దిగువన మల్లన్నసాగర్ వరకు ఉన్న అన్ని బ్యారేజీల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీని కోసం వచ్చే బడ్జెట్లో ఏకంగా రూ. 9,205 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తర్వాతి స్థానంలో పాలమూరు–రంగారెడ్డికి రూ.3,214 కోట్లు కేటాయించాలని కోరారు. దేవాదుల పరిధిలో లింగంపల్లి బ్యారేజీతో పాటు ఇతర పైప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున ఇక్కడ రూ.2,052 కోట్లు, ఖమ్మం జిల్లాలోని సీతారామ సహా ఇతర చిన్న తరహా ప్రాజెక్టులకు కలిపి రూ.1,346 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేసేందుకు రూ.1,346 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇక మైనర్ ఇరిగేషన్ కింద చిన్న నీటి వనరుల అభివృద్ధి, మిషన్ కాకతీయకు రూ.2,727 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. సీతారామ, పాలమూరుపై ఫోకస్.. ఇక కొత్త ఏడాదిలో జనవరి నుంచి పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టిన ముఖ్యమంత్రి అందుకు తగ్గట్టే ఆర్థిక వనరులను సమకూర్చేలా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది మార్చి నుంచి సుమారు రూ.1,500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దృష్ట్యా నిధుల కొరత లేకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.17వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు నిర్ణయం జరగ్గా, చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చర్చలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి ఏప్రిల్ నుంచి పనులను వేగిరం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఇక సీతారామ ఎత్తిపోతలకు రుణాల ప్రక్రియ కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టును వేగిరం చేసే దిశగా కేసీఆర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరికొన్ని రోజుల్లో స్వయంగా ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ప్రతిపాదనలు ఇలా..(రూ.కోట్లలో) ప్రాజెక్టు బడ్జెట్ ప్రతిపాదన కాళేశ్వరం 9,205 పాలమూరు–రంగారెడ్డి 3,214 కంతనపల్లి 845 ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు 1,346 ఆదిలాబాద్ ప్రాజెక్టులు 922 వరద కాల్వ, ఎల్లంపల్లి 1,121 దేవాదుల 2,052 నల్లగొండ ప్రాజెక్టులు 1,621 ఎస్సారెస్పీ 338 మైనర్ ఇరిగేషన్ 2,727 -
‘పాలమూరు’ను పరుగులు పెట్టించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మందకొడిగా సాగుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఈమారు పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో ఇచ్చిన మాట మేరకు ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి నీళ్లందించేలా అప్పుడే ప్రణాళికలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రధాన అడ్డంకులను దాటుతూనే, సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచే చర్యలపై ఆయన పార్టీ ముఖ్యులతో చర్చించినట్లుగా తెలిసింది. రుణాలు ఇచ్చేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్న దృష్ట్యా, వాటి సహకారంతో పనులను అనుకున్న సమయానికి పూర్తి చేద్దామని ఆయన పార్టీ జిల్లా నేతలతో అన్నట్లుగా తెలిసింది. నిధుల కొరతతో తగ్గిన వేగం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిగినా విడుదల మాత్రం జరుగలేదు. దీంతో వివిధ ప్యాకేజీల్లో పనులు నెమ్మదించాయి. ప్యాకేజీ–1 పనులను రూ.3,208 కోట్లతో రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలను తీసుకునేలా సర్జిపూల్, ఒక్కో విద్యుత్ మోటారు 145 మెగావాట్ల సామర్థ్యం గల 8 పంపులను ఏర్పాటు చేసే లక్ష్యంతో చేపట్టారు. అయితే ఈ ఆగస్టులో శ్రీశైలంలో నీటిమట్టం పెరగడంతో పనులు ఆగాయి. సొరంగం పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వీటికి తోడు బిల్లుల చెల్లింపు నెమ్మదించడంతో పనుల్లో వేగం తగ్గింది. రెండు ప్యాకేజీల్లో అంజనగిరి రిజర్వార్ పనులు 50 శాతం మేర మాత్రమే పూర్తయ్యాయి. పదో ప్యాకేజీలోని వట్టెం రిజర్వాయర్ పనులు, ప్యాకేజీ–9, 11 ప్యాకేజీల్లోని పనులు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఈ ప్యాకేజీల్లో కేవలం 20 శాతం పనులే పూర్తి చేశారు. రుణాల కోసం ప్రయత్నాలు ముఖ్యంగా కాళేశ్వరం సహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం, వాటికే నిధులు వెచ్చించడంతో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో వెనుకబడింది. దీంతో రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వరద జలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్ పనులకు రుణాలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఈ పనులకు రూ.17 వేల కోట్లు అవసరం ఉండగా అంత మొత్తం రుణాలిచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ముందుకొచ్చినా ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ప్రస్తుత కొత్త ప్రభుత్వంలో దీన్ని పూర్తి చేసి మార్చి నాటికి రుణాలు పొందాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రుణాల ప్రక్రియ కొలిక్కి వస్తే ప్రాజెక్టు పనులు వేగిరం కానున్నాయి. -
కాళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ఉధృతి
కాళేశ్వరం/ఏటూరునాగారం: మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి మరింత పెరిగింది. ఎగువన ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శుక్రవారం ఉదయం నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద కాళేశ్వరం మీదుగా తరలిపోతోంది. అటు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి సైతం వరదనీరు వస్తుండడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.6 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. మొత్తంగా 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు తరలిపోయినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. 2016, 2017లో వచ్చిన వరదల కంటే ఈ ఏడాది అధికంగా ప్రవాహం నమోదైందని తెలిపారు. నీటమునిగిన పంటలు గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పంట చేలు నీట మునిగాయి. పలుగుల, మద్దులపల్లి, కాళేశ్వరంలోని పూస్కుపల్లి గ్రామాల్లో వంద లాది ఎకరాల పత్తి పంటను వరద కమ్మేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఎత్తివేత.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు శుక్రవారం ఉపసంహరించారు. గురువారం రాత్రి 9.30 సమయంలో 8.97 మీటర్లకు చేరిన ప్రవాహం శుక్రవారం ఉదయం 9.3 మీటర్లకు వచ్చింది. ఆ తర్వాత సాయంత్రం వరకు క్రమేణ తగ్గుతూ 8.36 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాల్లోని వరద నీరు ఇంకా చేరలేదని ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ నరేందర్ తెలిపారు. కాగా, ముల్లకట్ట వద్ద గోదావరి 76 మీటర్ల ఎత్తున రెండు కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. -
ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై తమతో బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సవాల్ చేశారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినా లేదంటే మంత్రులు హరీశ్, కేటీఆర్‌లు వచ్చినా తాము చర్చకు సిద్ధమన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రాజెక్టు వద్దకు రమ్మంటే అక్కడికి వస్తామని, ఇది పార్టీ నిర్ణయమని చెప్పారు. రూ.38 వేల కోట్ల అంచ నా వ్యయంతో తాము ప్రారంభించి రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిన డాక్టర్. బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్లకు మిగిలిన రూ.28 వేల కోట్లు వెచ్చించి పూర్తి చేయాల్సింది పోయి రూ.లక్ష కోట్లకు అంచనాలను ఎలా పెంచారని ప్రశ్నించారు. అంబేడ్కర్ పేరుతో ఉన్న ప్రాజెక్టును తాము మార్చలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు కాళేశ్వరం ఎక్క డి నుంచి వచ్చిందని నిలదీశారు. పాత ప్రాజెక్టును తాము మార్చలేదని, అది కొత్త ప్రాజెక్టు కాదని కేంద్రానికి నివేదిక ఎలా పంపారని ప్రశ్నించారు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది అయితే ప్రాణహి త–చేవెళ్ల ఏమైందని ప్రశ్నించారు. అంబేడ్కర్ ప్రాజెక్టును పేరుమార్చి రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లకు అంచనాలు పెంచారని, దీనిపై తాము చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులు రూ.1,421 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేవని, రూ.12 వేల కోట్లకు అంచనాలను పెంచి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని భట్టి చెప్పారు. కాంగ్రెస్ నేతలను లుచ్ఛాగాళ్లంటూ ప్రాజెక్టులపై చర్చ జరగకుండా కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నా ర న్నారు. కాంగ్రెస్ నేతలు ఎందుకు లుచ్ఛాగాళ్లో కేటీఆర్ చెప్పాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేయనందుకు, మూడెకరాల భూమి ఇవ్వనందుకు, కేజీ టూపీజీ విద్యను అమలు చేయనందుకు కాంగ్రెస్ వాళ్లు లుచ్ఛాగాళ్లా అని ప్రశ్నిం చారు. ఇలాంటి భాషను పత్రికల్లో చదివినందు కు సిగ్గుపడుతున్నానన్నారు. -
కాళేశ్వరం అమ్మవారి పట్టుచీర చోరీ
-
ఉప్పొంగిన గోదారి
కాళేశ్వరం/ఆదిలాబాద్/చర్ల: గోదారి గలగలమంటూ కదలి వస్తోంది.. ఇప్పటిదాకా నీటిచుక్క కోసం ఆకాశం వైపు చూసిన అన్నదాతలో ఆనందం కనిపిస్తోంది.. రాష్ట్రంలో ఇటీవలి వరకు స్తబ్ధుగా ఉన్న సాగు పనులు ఇక జోరందుకోనున్నాయి! ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ వర్షాలు రైతన్నకు మేలేనని, ఇప్పటికే నాటిన విత్తుకు ప్రాణం పోస్తాయని అధికారులు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రాణహిత వరద కలవడంతో సోమవారం గోదారి ప్రవాహం మరింత పెరిగింది. ఆదివారం ఇక్కడ గోదావరి 7.1 మీటర్ల ఎత్తున ప్రవహించగా.. సోమవారం సాయంత్రానికి 7.2 మీటర్లకు చేరింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. కాళేశ్వరం వద్ద 2.43 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీ వద్ద 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు తరలుతోంది. అలాగే మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటేక్వెల్ వద్ద గోదావరి నీటిమట్టం 8.4 అడుగులకు చేరింది. వాజేడు మండలం పేరూరు వద్ద ఆదివారం సాయంత్రం 5.57 మీటర్లు ఉన్న గోదావరి ప్రవాహం సోమవారం సాయంత్రానికి 8.47 మీటర్లకు పెరిగింది. నిండిన కడెం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 697.625 అడుగులకు చేరింది. 10,732 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే రెండు గేట్ల ద్వారా 12,496 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భైంసాలో గల సుద్దవాగు గడ్డెన్న ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు కాగా, 357.5 మీటర్లకు చేరుకుంది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. మత్తడివాగు ప్రాజెక్టు నీటిమట్టం 277.5 మీటర్లు కాగా, 275 మీటర్లకు చేరింది. కుమురం భీం ప్రాజెక్టు ఫ్లోర్లెవల్ 243 మీటర్లు కాగా 240 మీటర్లకు నీరు చేరుకుంది. గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నాయి. పెద్దవాగు పరిసర లోతట్టు ప్రాంతాలైన వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, దహేగం, పెంచికల్‌పేట మండలాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. దహేగాం మండలం పరిధిలోని పెద్ద చెరువు నీరు పెరగడంతో కాగజ్‌నగర్, దహేగాం ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. మండల కేంద్రంతో పాటు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరుకు భారీ వరద ఉమ్మడి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు చెందిన 7 గేట్లను ఎత్తారు. 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్ట్ వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. నీల్వాయి వాగులో రైతు గల్లంతు ఆదిలాబాద్ జిల్లాలోని నీల్వాయి వాగు దాటుతూ ఓ రైతు గల్లంతయ్యాడు. ప్రాజెక్ట్ పునరావాస కాలనీ గెర్రెగూడెంకు చెందిన మోర్ల సోమయ్య (60) సోమవారం సాయంత్రం నీల్వాయిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు రుణం కోసం వెళ్లాడు. అప్పుడు వాగులో వరద ప్రవాహం లేదు. తిరుగు ప్రయాణంలో వాగు వద్దకు రాగానే మత్తడి నుంచి వాగులోకి వరద రావడం మొదలైంది. వరద ఉధృతి పెరగడంతో జనం చూస్తుండగానే సోమయ్య వాగులో పడి గల్లంతయ్యాడు. కుటుంబీకులు, గ్రామస్తులు వాగులో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. -
కారడవిలో కార్చిచ్చు..
భూపాలపల్లి : కాళేశ్వరం–మహదేవపూర్ ప్రధాన రహదారిలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు ఆరడం లేదు. గురువారం కుదరుపల్లి అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో దారి వెంట వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విలువైన వన సంపద, అడవిలోని జీవరాశులు అగ్నికి ఆహుతవుతున్నాయి. -
తెలంగాణ ప్రభుత్వానికి ఫైనాన్స్ కమిషన్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: నిధుల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసల జల్లు కురిపించింది. శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల తీరును కొనియాడింది. తెలంగాణలోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం సభ్యులు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి అరవింద్ మెహతా మాట్లాడుతూ.. కాళేశ్వరం పనుల వేగం దేశ చరిత్రలోనే ఒక నమూనా అని కొనియాడారు. మిషన్ భగీరథ పథకం ఇతర రాష్ట్రాలకు మోడల్ అని ఆయన అన్నారు. -
బడ్జెట్‌పై కోటి ఆశలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సారైనా సరిపడేన్ని నిధులు కేటాయిస్తుందని అంచనాలు వేసుకుంటోంది. గడిచిన మూడేళ్లు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో చెప్పుకోదగ్గ కేటాయింపులు లేకపోవటం తెలంగాణను నిరాశకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు తగినంత ఆర్థిక సాయం చేయాలని పదే పదే కేంద్రానికి విన్నవించినప్పటికీ ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగడం లేదు. ఏకంగా నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వకపోవటం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో 2018–19 బడ్జెట్లోనైనా తెలంగాణకు తగినన్ని నిధులు వస్తాయనే ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. నీతి ఆయోగ్ సిఫారసులు అమలయ్యేనా? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయించాలని ఇటీవలే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ అధికారుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలసి విన్నవించింది. అలాగే 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను కలసి రాష్ట్రానికి నిధుల అవసరాన్ని ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకానికి రూ.19 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని నీతి ఆయోగ్ గతేడాదిలోనే కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు సాయమందించాలని సూచించింది. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం ఇప్పటివరకు పట్టించుకోలేదు. కాళేశ్వరానికి సాయమందేనా.. గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల సాయమందించాలని రాష్ట్రప్రభుత్వం ఇదివరకే కేంద్రాన్ని కోరింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీతో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు విడుదల చేసే నిధులు సైతం దాదాపు రూ.7 వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈసారి బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఈటల అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు గిరిజన, హార్టికల్చర్ యూనివర్సిటీలకు, కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌కు తగినన్ని నిధులు కేటాయిస్తుందో లేదో చూడాలి. బడ్జెట్లో తెలంగాణకు ఈ సారి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. -
లక్ష మెజారిటీతో గెలుపు తథ్యం
కురవి (మహబూబాబాద్ జిల్లా): ‘మీరంతా కలిసి ఉంటే కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోతుంది. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, సమిష్టిగా పని చేయాలి. ఐకమత్యం అవసరం. అందరూ కలిసి పని చేయాలి. ఇదే స్ఫూర్తి ఇకముందు కూడా కొనసాగించాలి. నాకెలాంటి అనుమానం లేదు. డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీ మనకొస్తుంది’ అని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని కురవిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీష్ ప్రసంగించారు. ‘కాళేశ్వరం పూర్తికాకముందే ఎసారెస్పీ స్టేజ్1, స్టేజ్2 పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రెండు దశలలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 440 కోట్లతో కాకతీయ ప్రధాన కాలువను ఆధునీకరిస్తున్నాం. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి నీరు పారిస్తాం. కాంగ్రెస్ హయాంలో ఎపుడూ ఎసారెస్పీని పట్టించుకోలేదు. మేడిగడ్డ దగ్గర 300 రోజులు నీళ్ల నిల్వ ఉంటాయి. కాళేశ్వరంలో ఒక రోజుకు 2 లక్షల సిమెంట్ బస్తాలు వాడుతున్నాం. ఇలాంటి భారీ ప్రాజెక్టు, ఇంత వేగంగా పనులు జరిగే ప్రాజెక్టు మరొకటి తాము చూడలేదని కేంద్ర జలసంఘం ప్రతినిధులు స్వయంగా కాళేశ్వరం పనులను చూసి ఆశ్చర్యపోయారు' అని హరీష్‌రావు తెలిపారు. ‘డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. చివరి భూములకూ నీరందేలా చూస్తున్నాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకూ సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నడుం బిగించారు. కాళేశ్వరంతో ఎస్సారెస్పీని అనుసంధానంచేస్తున్నందున శ్రీరాంసాగర్ రెండో దశ పనులు పూర్తి చేస్తున్నాం. ఎల్ఎండీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లోని కాల్వల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండాచూస్తున్నాం. శ్రీరాంసాగర్ నీరు ఇప్పటిదాకా చూడని జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’ అని హరీశ్‌రావు అన్నారు. -
పదకొండేళ్లకు.. పడవ దొరికింది!
కాళేశ్వరం(మంథని): గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగ డంతో కాళేశ్వరం వద్ద పదకొండేళ్ల క్రితం వరదలో కొట్టుకుపోయిన నాటుపడవ మంగళవారం గంగపుత్రులకు దొరికింది. 2006, ఆగస్టులో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచకి చెందిన గంగపుత్రులు గోదావరిపై ప్రయాణికులను తెలంగాణ–మహారాష్ట్రకు చేరవేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో కాళేశ్వరం గోదావరి ఒడ్డున నగరానికి చెందిన నాటుపడవను కర్రకు కట్టి గంగపుత్రులు నిద్రించారు. అర్ధరాత్రి ఒక్కసారిగా గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి పెరగడంతో ఆ నాటుపడవ వరదలో కొట్టుకుపోయింది. పడవ కోసం గంగపుత్రులు రూ. లక్షన్నర ఖర్చు చేసినా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర వం తెనకు దగ్గరలో జాలర్లు చేపల కోసం వలలు వేయగా కర్రకు ఏదో అడ్డు తగిలింది. అనుమానం వచ్చిన గంగపుత్రులు నీటమునిగి చూసి పడవగా గుర్తిటంచారు. దానిపై ఇసుక కప్పేయడంతో మంగళవారం 40 మంది గంగపుత్రులు ఇసుకను తోడుతూ పడవను సాయంత్రం వరకు బయటికి తీశారు. ప్రస్తుతం పడవ విలువ రూ.6 లక్షలకుపైగా ఉంటుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. -
కాళేశ్వరా... ముక్తీశ్వరా..
తెలంగాణాలోని మహా శైవక్షేత్రాలలో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల భక్తుల పూజలతో విరాజిల్లుతుంది. ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. ఈ లింగాలలో ఒకటి కాలుడు (యముడు), మరొకటి ముక్తీశ్వరుడు(శివుడు). ముక్తీశ్వర లింగానికి రెండు నాసికారంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్ళు పోసినా, బయటికి కనిపించవు. ఆ నీరు భూ అంతర మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని స్కాందపురాణం చెబుతోంది. గర్భగుడికి నాలుగుదిక్కులా నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం ప్రత్యేకత. కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుండి ప్రవహిస్తున్న ప్రాణహితనది, మంచిర్యాల జిల్లా నుండి ప్రవహిస్తున్న గోదావరినది, అంతర్వాహిని సరస్వతీ నదులు కలసిన ముచ్చటైన క్షేత్రం కాళేశ్వరం. ఇది మూడు నదుల సంగమం. క్షేత్రపురాణం యమధర్మరాజు ఒకసారి ఇంద్రలోకం వెళ్లాడు. అక్కడ ప్రజలందరూ యమలోకానికి రావడానికి ఇష్టపడక ఆ మహాశివుని పూజిస్తూ, ఎంతో వైభవంగా ఉన్నట్లు తెలుసుకొన్నాడు. విశ్వకర్మ వద్దకు వెళ్ళి స్వర్గలోకాన్ని మించిన మహానగరాన్ని నిర్మించాలని వేడుకొన్నాడు. ఈ మేరకు విశ్వకర్మ గోదావరి, ప్రాణహిత నదుల సంగమానికి దక్షిణదిశలో కాళేశ్వర పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత యముడు ఘోర తపస్సుతో శివుని ప్రత్యక్షం చేసుకుని, తనకు శివుని పక్కన చోటుకావాలని కోరగా శివుడు సమ్మతించాడు. ఒకే పానవట్టంపై యముడు, శివుడు కొలువైనారు. అప్పటినుంచి యుముని కొలిచిన తరువాతనే శివుణ్ని కొలుస్తారు. జీర్ణోద్ధరణ 11వ శతాబ్దం అనంతరం దేవాలయం శిధిలావస్థకు చేరుకుంది. రోడ్డు, రవాణా సౌకర్యాలు లేవు. దేవతామూర్తుల విగ్రహాలు పూర్తిగా భిన్నమై ఉండేవి. ఆ తర్వాత శ్రీశృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు విద్యాతీర్థ మహాస్వామి, భారతీ తీర్థ మహాస్వామి వార్లచే కాళేశ్వర మహాక్షేత్రంలో మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటినుంచి కాళేశ్వర క్షేత్ర ప్రాÔ¶ స్త్యం దేశ నలుమూలలకూ పాకింది. ఇతర సందర్శనీయ స్థలాలు ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం, శుభానందదేవి, సరస్వతి, రామాలయం, సంగమేశ్వర, దత్తాత్రేయ ఆలయాలు, దుర్గాదేవి, మహాగణపతి, వీరభద్ర, విజయ గణపతి, అన్నపూర్ణ, చింతామణి, బైరవ, ఆంజనేయ, మత్స్యనారాయణ, మహావిష్ణు, జ్యేష్టాదేవి, సుబ్రమణ్యస్వామి, బాలరాజేశ్వర, కాశీవిశ్వేర, కాలభైరవ, సూర్యాలయాలున్నాయి. కాలసర్ప, శని పూజలకు ప్రసిద్ధి శ్రీ కాళహస్తి తరువాత కాలసర్ప, శనిదోష నివారణ పూజలకు కాళేశ్వర క్షేత్రం ప్రసిద్ధి పొందింది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కాలసర్పదోష నివారణ పూజలు, నవగ్రహాలయంలో శనిదోష నివారణకు శనిపూజలను నిర్వహిస్తున్నారు. పితృదేవతలకు పిండప్రదానాలు పితృదేవతలకు పిండ ప్రధాన పూజలు, కర్మకాండలు ఇక్కడ ప్రత్యేకత. అస్థికలను త్రివేణీ సంగమంలో కలుపుతారు. ప్రతి సోమవారం స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. వసతి సౌకర్యాలు వేములవాడ రాజరాజేశ్వరస్వామి వసతి గృహం, సింగరేణి వసతిగృహం, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహం, హనుమంతరావు కాటేజీ, పర్యాటకశాఖ త్రివేణి వసతి గృహం ఉన్నాయి. క్షేత్రానికి చేరే మార్గం.... హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి కాళేశ్వరానికి రావచ్చు. రైలు మార్గంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు వస్తే, అక్కడి నుంచి బస్సులో వెళ్ళొచ్చు. వరంగల్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సులున్నాయి. ప్రయివేటు వాహనాల ద్వారా అయితే, హైదరాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, కరీంగనర్, పెద్దపల్లి, మంథని, కాటారం మహదేవపూర్ నుంచి కాళేశ్వరం రావచ్చు. లేదా బోనగిరి, జనగామ, ఆలేరు, వరంగల్, పరకాల, భూపాలల్లి, కాటారం, మహదేవపూర్‌ల నుండి కూడా రావచ్చు. – షేక్ వలీ హైదర్ సాక్షి, కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా -
కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ నింపుతాం
వచ్చే ఏడాది నుంచే డీ–53 కింద రెండు పంటలకు నీరందిస్తాం ► కాళేశ్వరంతో మిడ్‌మానేరుకు లింక్.. కింది ప్రాంతాలకు నీళ్లు ► పోచంపాడు నీళ్లు సమృద్ధిగా వాడుకునేలా ప్రణాళికలు ► రూ. వెయ్యి కోట్ల మంజూరు.. టెండర్లు పూర్తి ► రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సాక్షి, జగిత్యాల: ‘ఇకపై నారుమళ్లు పోసుకుని.. కాల్వ నీళ్ల కోసం ఎదురుచూసే పరిస్థితులుండవు.. వచ్చే ఏడాది నుంచి జూన్‌లోనే నాట్లు వేసుకునేలా ఎస్సారెస్పీ ద్వారా సాగునీరందిస్తాం.. డీ–53 కింద రెండు పంటలకు సాగునీరందించి తీరుతాం.’అని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రైతులకు అభయమిచ్చారు. గతంలో పోచంపాడు నిండి పొంగితేనే వరదకాల్వ గేట్లు లేపి లోయర్ మానేరు డ్యామ్‌కు నీళ్లు పంపేవాళ్లమని, ఇకపై వరదకాల్వనే రిజర్వాయర్‌గా మార్చి కాళే శ్వరం నీళ్లను వరదకాల్వ ద్వారా పోచంపాడును నింపేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతు న్నా యని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. పనుల టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిందని వివరించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్, ధర్మపురి మండలాల్లో 14 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేలా రూ.60 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌లతో కలసి మంత్రి హరీశ్ ప్రారంభించారు. అనంతరం ధర్మపురిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాళేశ్వరం పూర్తయితే గోదావరిలో వరద రాకపోయినా.. పోచంపాడులో నీళ్లులేక పోయినా కాలమైనా.. కాకపోయినా.. బాధ పడా ల్సిన అవసరం లేదన్నారు. ఎస్సారెస్పీ నీళ్లన్నీ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలకు వాడుకునే వీలుంటుందన్నారు. ‘వాస్తవానికి ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 9.60 లక్షల ఎకరాలకు పారాలి. సీఎం కేసీఆర్ ప్రతి ఎకరాకు నీరందించేలా.. రూ.650 కోట్లతో ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలు.. డిస్ట్రిబ్యూటరీ కాల్వల మరమ్మతు కార్యక్రమం చేపట్టారు. రెండేళ్ల కాలంలో కాల్వ మరమ్మతు, ఆధునీకరణ కోసం రూ.186 కోట్లు ఖర్చు చేశాం’ అని హరీశ్ చెప్పారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రెండేళ్లలో రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రూ.30 వేల కోట్లతో ఇంటింటికీ నీళ్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేత కేసీఆర్ అని కొనియాడారు. కవిత మాట్లాడుతూ ఎన్నికల ముం దు జగిత్యాల జిల్లా ఏర్పాటు, రోళ్లవాగు ఆధునీ కరణ, బోర్నపల్లి బ్రిడ్జి నిర్మాణాలకు హామీలిచ్చా మని, వాటిని అమలు చేసి నిరూపించుకున్నా మన్నారు. 60 ఏళ్లలో 296 సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ద్వారా 1.30 లక్షల మంది విద్యార్థులు విద్య పొం దగా.. మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో 496 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో 1.40 లక్షల మంది విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారని చెప్పా రు. సభలో ప్రభుత్వ చీఫ్ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెసోళ్లు నకిలీ లీడర్లు.. మంత్రి హరీశ్‌రావు.. కాంగ్రెస్ నాయకులను నకిలీ లీడర్లుగా అభివర్ణించారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఏర్పాటుచేయాలని పూనుకుంటే.. కాంగ్రెస్ నాయకులు చనిపోయిన వారి పేరిట కోర్టులో కేసులువేసి వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిలోగా ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. సీఎం కేసీఆర్.. కోటి ఎకరాలకు సాగునీరందించే కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులు, కాల్వల ఆధునీకరణ పను లను అధికారులు టాప్ ప్రయారిటీగా తీసుకోవాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇరి గేషన్.. రెవెన్యూ అధికారులను రాయపట్నం వద్ద నిర్వహించిన సమీక్షలో హెచ్చరించారు. సెల్ఫీలొద్దు.. విధులపై ధ్యాస పెట్టండి..! ‘మీకు చెప్పిందేమిటీ..? మీరు చేస్తుందే మిటీ..? వెళ్లి పని చేయమంటే సెల్ఫీలు దిగి.. అవే ఫొటోలు మళ్లీ నాకే పంపుతారా..? సెల్ఫీలపై ఉన్న ధ్యాస విధులపై లేదా..? తీరు మార్చుకోండి.’అంటూ మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. ఎస్సారెస్పీ ప్రధాన... డిస్ట్రిబ్యూటరీ కాల్వల స్థితిగతులు తెలుసుకుని నివేదిక ఇవ్వాల్సిన ఉద్యోగులు.. ఆ కాల్వలపై సెల్ఫీలు దిగి వాటిని ఇరిగేషన్ గ్రూపులో పెట్టడంతో ఆగ్రహించిన హరీశ్‌రావు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శంకర్‌ను పిలిచి ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. -
కాళేశ్వరం అనుమతులకు ధన్యవాదాలు
- పర్యావరణ మంత్రి భేటీలో సీఎం కేసీఆర్ - హరితహారానికి రావాల్సిందిగా ఆహ్వానం సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశకు అనుమతులిచ్చిన నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌కు సీఎం కె.చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కేంద్రమంత్రి బండారు దత్తా త్రేయ, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.వేణుగోపాలాచారి తదితరులతో కలసి పర్యావరణ మంత్రితో భేటీ అయ్యారు. దత్తాత్రేయ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతులకు మేలు జరుగు తుందని, దీనికి సహకరించినందుకు కేంద్రా నికి ధన్యవాదాలు తెలిపినట్లు వివరించారు. తెలంగాణలో భారీ ఎత్తున నిర్మిస్తున్న పవర్ ప్లాంటుకు అనుమతులు దక్కడం గొప్ప విశేషమని వివరించారు. రాబోయే రోజుల్లో కాంపా నిధులు విడుదల కావాల్సి ఉందని, దీనికి సంబంధించి నిబంధనల రూపకల్పన అనంతరం విడుదల అవుతాయని పర్యావ రణ మంత్రి తెలిపినట్లు వివరించారు. భేటీ వివరాలను వేణుగోపాలాచారి మీడియాకు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమ తులు ఇచ్చినందుకు కేసీఆర్ కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. జూలైలో హరిత హారం ప్రారంభానికి రాష్ట్రానికి రావా లని హర్షవర్ధన్‌ను ఆహ్వానించినట్లు తెలిపా రు. ‘రాష్ట్రానికి బకాయి ఉన్న కాంపా నిధు లను విడుదల చేయాలని సీఎం కోరారు. కొత్త రాష్ట్రంలో నీటిపారుదల రంగం అభివృ ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయా లను కేంద్రమంత్రికి వివరించారు. దేశంలోనే నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయించినట్లు వివరిం చారు’ అని వేణుగోపాలాచారి వెల్లడించారు. -
కదులుతున్న కాళేశ్వరం
► యుద్ధ ప్రాతిపదికన మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణం ► భారీ యంత్రాలు.. వేల మంది కార్మికులు.. ► రాత్రిపూటా పనులు ► బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు సమాంతరంగా.. చకచకా.. ► వచ్చే ఖరీఫ్ నాటికి 100 టీఎంసీలను ఎల్లంపల్లికి తరలించడమే లక్ష్యం ► వచ్చే మేలో ట్రయల్ రన్ నిర్వహిస్తాం: అధికారులు కాళేశ్వరం బ్యారేజీ ప్రాంతం నుంచి సోమన్నగారి రాజశేఖరరెడ్డి ఎక్కడ చూసినా లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, కంకర కుప్పలు.. భారీ యంత్రాలు.. వేల మంది కార్మికులు.. రాత్రి పూట ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లోనూ పనులు.. 360 డిగ్రీల కోణంలో నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..! గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతానికి దిగువన కాళేశ్వరం వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనుల దృశ్యమిదీ!! బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల మధ్య పోటీ పెట్టారా అన్నట్టుగా నిర్మాణ పనులు మహాయజ్ఞంలా సాగుతున్నాయి. రోజుకు ఒక్కో బ్యారేజీ వద్ద 15 వేల టన్నుల సిమెంట్ వినియోగిస్తూ కాంక్రీట్ పనులు చేస్తున్నారు. వర్షాలు కురిసినా, గోదావరి నుంచి నీరొచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తి చేసి, డీ వాటరింగ్ పద్ధతిన నీటిని తొలగించే పనులు చకచకా జరుగుతున్నాయి. ఆరునూరైనా వచ్చే ఖరీఫ్ నాటికి 100 టీఎంసీల గోదావరి నీటిని ఎల్లంపల్లికి తరలించాలన్న సంకల్పంతో ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మూడు ప్రధాన జలాశయాలు.. మేడిగడ్డ నుంచి 180 టీఎంసీల నీటిని మళ్లించి 18.40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నీటి నిల్వల కోసం కొత్తగా 147.71 టీఎంసీల సామర్థ్యం గల 20 జలాశయాలను నిర్మించనుండగా, అందులో ప్రధానమైనవి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల. ఈ మూడింటినీ కలిపి సుమారు 30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. మొత్తంగా రూ.13,811 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఇందులో పంప్‌హౌజ్‌ల నిర్మాణాలకు రూ.7,998 కోట్లు, బ్యారేజీల నిర్మాణాలకు రూ.5,813 కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులన్నింటినీ ఒకేమారు ఆరంభించి చేపట్టారు. కీలకం.. మేడిగడ్డ పంప్‌హౌజ్ 16.17 టీఎంసీల సామర్థ్యంతో మేడిగడ్డ బ్యారేజీ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 1,650 టీఎంసీల నీటి లభ్యత ఉండనుండగా.. గోదావరి ఏకంగా 1.3 కి.మీ. వెడల్పుతో ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరిలో 10 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ నదిపై 1.63 కి.మీ. పొడవులో బ్యారేజీ నిర్మాణం జరుగుతోంది. ఈ బ్యారేజీ ప్రాంతం మహారాష్ట్రకు సరిహద్దు. ఆ రాష్ట్రంలో 170 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీంతో ఆ రాష్ట్ర సహకారంతో రెండు వైపులా బ్యారేజీ పనులు మొదలు పెట్టారు. మనవైపు (తెలంగాణ) ప్రాంతంలోని పనులు వేగంగా జరుగుతున్నాయి. పనిని మొత్తంగా 8 బ్లాక్‌లుగా విభజించి 6 బ్లాక్‌ల పనులు మొదలు పెట్టారు. ఏడో బ్లాక్‌లో పనులు చేసుకునేందుకు వీలుగా.. గోదావరి సహజ ప్రవాహానికి ఇబ్బంది కలగకుండా కాపర్ డ్యామ్‌లు పూర్తి చేశారు. వీటితోపాటే గోదావరి బెడ్‌లెవల్‌లో రాఫ్ట్ పనులు పూర్తయ్యాయి. 16 ఎక్స్కవేటర్లు, 55 టిప్పర్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. మొత్తంగా రూ.65 కోట్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బ్యారేజీ పనులను పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 22 కిలోమీటర్ల దిగువన పంప్‌హౌస్ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా 11 పంపులను ఏర్పాటు చేయనుండగా మరో 6 పంప్‌లను భవిష్యత్ అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ 64 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ పని జరగాల్సి ఉండగా 45 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మరో 45 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తయింది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కాకున్నా.. పంప్‌హౌస్ పనులు పూర్తయితే 92 మీటర్ల లెవల్ నుంచి ప్రవహించే గోదావరి నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ్నుంచి వచ్చే ఖరీఫ్ నాటికి కనీసం 100 టీఎంసీలు అయినా పంపింగ్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డిప్యూటీ ఇంజనీర్ సూర్యప్రకాశ్ తెలిపారు. పనుల్లో ముందు.. అన్నారం మేడిగడ్డ పంప్‌హౌస్ నుంచి 13.2 కి.మీ. దూరంలో 11 టీఎంసీల కెపాసిటీతో అన్నారం బ్యారేజీ నిర్మాణం జరుగుతోంది. 1.2 కి.మీ. పొడవుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. భూసేకరణ పూర్తవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 6 బ్లాక్‌లుగా పనులు చేపట్టగా 4 బ్లాక్‌ల్లో పని మొదలైంది. ఇక్కడ రోజుకు 1,600 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తున్నారు. రాఫ్ట్ పనులకు అత్యంత అధునాతన వాహనాలు వినియోగిస్తున్నారు. సుమారు వెయ్యి మంది మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారు. మొత్తంగా రూ.152 కోట్ల పనులు పూర్తయ్యాయి. జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బ్యారేజీ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో 12 పంపులతో పంప్‌హౌస్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 6 బ్లాక్‌లుగా పని విభజన చేయగా.. అన్నింటా పనులు మొదలయ్యాయి. ఇక్కడ ఇప్పటికే రూ.200 కోట్ల పనులు పూర్తి చేసినట్లు డీఈ మధు తెలిపారు. 425 ఎకరాలకుగానూ మరో 67 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని, పంప్‌హౌస్‌ను జూన్ నాటికే సిద్ధం చేస్తామని వివరించారు. సుందిళ్ల ఓకే.. మిగతా బ్యారేజీలు, పంప్‌హౌస్‌లతో పోలిస్తే సుందిళ్ల బ్యారేజీ పనులు కాస్త ఆలస్యమైనా వేగంగానే జరుగుతున్నాయి. భూసేకరణకు ఆటంకాలు లేకపోవడంతో బ్యారేజీ పనుల్లో వేగం కనిపిస్తున్నా.. పంప్‌హౌజ్ పనులు కాస్త నెమ్మదించాయి. అన్నారం పంప్‌హౌస్‌కు 3 కిలోమీటర్ల ఎగువన 3.11 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన బ్యారేజీ పనులను 6 బ్లాక్‌లుగా విభజించగా.. మూడు బ్లాకుల్లో పని మొదలైంది. రోజుకు వెయ్యి క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా పనులు జరుగుతున్నాయి. వచ్చే జూలై నాటికి మొత్తం 68 రేడియల్ గేట్లు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. బ్యారేజీ వరకు రూ.50 కోట్ల పనులు పూర్తయ్యాయి. దీనికి 15 కి.మీ. దూరంలో పంప్‌హౌస్ నిర్మాణం చేయనుండగా.. 12 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ 51 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ పనులు పూర్తవగా.. కాంక్రీట్ పనులు ఈ వారంలో ఆరంభించేలా చర్యలు తీసుకున్నారు. వచ్చే ఖరీఫ్‌కు 100 నుంచి 120 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి తరలిస్తామని, మే నెలలో ప్రాజెక్టు ట్రయల్ రన్, జూన్‌లో వెట్ రన్ నిర్వహిస్తామని సీఈ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. -
వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా.. ‘కాళేశ్వరం’ పూర్తి
► బ్యారేజీలు పూర్తిచేసి కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి ఎస్సారెస్పీ ద్వారా నీళ్లందించాలి: సీఎం కేసీఆర్ ► రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాక ముందే కాల్వల ద్వారా చెరువులు నింపాలి ► ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించాలి ► చివరి ఆయకట్టుకు నీరివ్వాలి.. సొరంగ మార్గం, ఇతర పనులపై సంతృప్తి ► సాగునీటికి ఏడేళ్ల ప్రణాళిక రూపొందించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. బ్యారేజీ నిర్మాణాలకు ముందే కన్నెపల్లి పంప్‌హౌజ్ ద్వారా నీటిని తోడాలని, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సారెస్పీ, ఇతర కాల్వల ద్వారా సాగునీటి అవసరాలకు, గ్రామాల్లోని చెరువులకు నీరందించాలని ఆదేశించారు. కాళేశ్వరం పనులు ఎక్కడికక్కడ సమాంతరంగా, వేగంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు ఉన్న మార్గంలో 81 కిలోమీటర్ల మేర ఆసియాలోనే పెద్దదైన సొరంగ మార్గం తవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే 78.55 కి.మీ. మేర తవ్వకం పూర్తి కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మిగతా పనులు కూడా వేగంగా పూర్తి చేసి, రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందివ్వాలని కోరారు. ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కాకముందే కాల్వల ద్వారా చెరువులు నింపే పని జరగాలని కోరారు. నీటి పారుదల ప్రాజెక్టులపై సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆరు గంటల పాటు సాగిన ఈ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు, జల వనరుల నిర్వహణ కమిటీ చైర్మన్ వి.ప్రకాశ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సలహాదారు పెంటారెడ్డి, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈలు వెంకటేశ్వర్లు, హరిరామ్, అనిల్, శంకర్, నాగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేలు పాల్గొన్నారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, వాటి నిర్మాణ దశలపై అధికారులతో సీఎం కూలంకశంగా చర్చించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలను పెట్టి, వాటిని ప్రగతిభవన్‌కు అనుసంధానం చేశారు. ఆ పనులను ప్రగతి భవన్ నుంచే సీఎం వీక్షించారు. సమన్వయంతో ముందుకెళ్లాలి.. ప్రాజెక్టుల పనుల విషయంతో అత్యంత వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించారు. ‘‘వర్షాలు లేనప్పుడు ఏ పనులు చేయాలి? వర్షాలున్నప్పుడు ఏ పనులు చేయాలి? వరదలు వస్తే ఎలా వ్యవహరించాలి? అనే విషయంలో ప్రత్యేక కార్యాచరణలు రూపొందించుకోవాలి. బ్యారేజీలు, ఇన్‌టేక్ వెల్స్, పంప్ హౌజ్‌ల నిర్మాణం జరుగుతుండగానే గేట్లు, పంపుల తయారీ, విద్యుత్ సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం సమాంతరంగా జరగాలి. ఎక్కడికక్కడ పనులు సమాంతరంగా చేస్తూ.. అంతిమంగా అన్నింటినీ లింక్ చేయాలి. ఒకదాని తర్వాత ఒక పని చేద్దామని భావన ఉండొద్దు. వర్కింగ్ ఏజెన్సీల పనిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వారు కావాల్సిన పనులను సకాలంలో చేస్తున్నారో లేదో కూడా గమనించాలి. విద్యుత్ అధికారులతో కూడా సమన్వయం ఉండాలి. కాళేశ్వరం నుంచి ఎల్ఎండీ దాకా ఎన్ని పంపులు పెడుతున్నాం? ఎంత కరెంటు కావాలి? అనే విషయాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఏర్పాట్లు చేసుకోవాలి. కాళేశ్వరానికి ఎక్కువ సామర్థ్యం కలిగిన పంపులను ఆస్ట్రియాలో తయారు చేయిస్తున్నం. అక్కడికి వెళ్లి వాటి నిర్మాణాన్ని పరిశీలించి, వాటి పనితీరుపై అక్కడి తయారీ సంస్థలు, నిపుణులతో చర్చించి నిర్వహణ అంశాలపై అవగాహన పెంచుకోవాలి’’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్లంపల్లి–మిడ్ మానేరు లింక్ పూర్తవ్వాలి కాళేశ్వరం పనులు జరుగుతుండగానే అదే సమయంలో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గోదావరి నీటిని తరలించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ‘‘ఇప్పటికే సిద్ధంగా ఉన్న కాల్వలను వాడుకోవాలి. ఎల్ఎండీకి ఎగువన ఉన్న సరస్వతి, లక్ష్మి కాల్వలు, ఎల్ఎండీకి దిగువన ఉన్న కాకతీయ కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేయాలి. నీటి ప్రవాహ సామర్థ్యం పెంచాలి. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కాల్వల ద్వారా నీళ్లు పంపాలి. చెరువులు నింపాలి. ఈ నీళ్లను చివరి ఆయకట్టు వరకు పంపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాళేశ్వరం దగ్గర పుష్కలమైన నీటి లభ్యత ఉంది. దాన్ని సమర్థంగా వాడుకోవాలి. దేవాదులను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇప్పటికే దానిపై 8 వేల కోట్లు ఖర్చు చేశారు. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి గోదావరిపై బ్యారేజీ కూడా నిర్మిస్తున్నాం. దేవాదులపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి, ఇంకా ఏం చేయాలో నిర్ణయించాలి. సిద్దిపేట సమీపంలోని ఇమాంబాద్‌లో 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. 8.5 కి.మీ. పొడవున్న ఈ రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చడానికి అంచనాలు రూపొందించాలి’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులు నింపేందుకు కార్యాచరణ గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు కట్టడానికన్నా ముందే ఆ మార్గంలో కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ‘‘మల్లన్నసాగర్, గంధమల్ల, బస్వాపూర్, కొండపోచమ్మ పరిధిలోని చెరువులను నింపాలి. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని బట్టి లిఫ్టులను వాడాలి. సింగూరుకు లిఫ్టులు పెట్టి నారాయణ ఖేడ్, జహీరాబాద్‌కు నీళ్లు పంపాలి. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను నిర్మించాలి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు చెరువులు నింపడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి’’అని చెప్పారు. ‘‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది. రాష్ట్ర బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయరంగానికి పెట్టుబడులు ఎక్కువ చేసుకుందాం. రైతులకు సాగునీరు అందించడానికి అవసరమైతే రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లులు కట్టడానికి కూడా తెలంగాణ రాబోయే కాలంలో సిద్ధంగా ఉంటుంది. సాగునీటి రంగానికి సంబంధించి ఏడేళ్ల ప్రణాళిక రూపొందించాలి’’అని సీఎం చెప్పారు. -
డీపీఆర్ లేకుండా ‘కాళేశ్వరం’ చేపట్టడమేంటి?
-
2013 చట్టాన్ని అమలు చేయాలి
• డీపీఆర్ లేకుండా ‘కాళేశ్వరం’ చేపట్టడమేంటి? • నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాకే పనులు చేపట్టాలి • వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సందర్భంగా 2013 చట్టాన్ని అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశా రు. భూసేకరణ సందర్భంగా జీవనోపాధి కోల్పోతున్న కుటుంబాలకు తమ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఒకరోజు రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రీడిజైనింగ్ పేరుతో ఇష్టారీతిగా అంచనాలు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపడుతోందన్నారు. ఇంత వరకు డీపీఆర్ సిద్ధం చేయకుండా రైతుల నుంచి భూములు సేకరించడం ఎంతవరకు సబబని ప్రశించారు. 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల వల్ల భూమి, భుక్తి కోల్పో యే రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో మల్లన్నసాగర్ తరహా ఉద్యమం వస్తుందని శ్రీకాంత్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. వైఎస్సార్ పేరు చెప్పకపోవడం సరికాదు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారీ ఎత్తున ప్రాజెక్టులు కట్టి, రైతుల పొలాల్లోకి నీరు పంపింది.. ఉచిత విద్యుత్ ఇచ్చింది కేవ లం దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమేనని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రాజెక్టులు మేమే కట్టామని చెబు తున్న కాంగ్రెస్ నేతలు, అందుకు కారణమైన జలయజ్ఞ ప్రదాత వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోలేదన్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సెగ్గెం రాజేశ్ ఆధ్వర్యంలో ఈ దీక్ష నిర్వహించారు. -
వేగంగా ‘కాళేశ్వరం’ భూసేకరణ
ప్రాజెక్టు పురోగతి సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం పట్టా భూముల పరిహారమే అసైన్డ్ భూములకూ ఇవ్వండి రైతుల త్యాగం వెల కట్టలేనిది.. వారిని నొప్పించకుండా పనులు చక్కబెట్టండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పురోగతిని సీఎం కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అందువల్ల అలసత్వం పనికిరాదని సూచించారు. ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భూసేకరణ పనుల పురోగతిని హరీశ్‌రావు గురువారం అసెంబ్లీ హాలులో సమీక్షించారు. ప్రభుత్వంతోపాటు కాంట్రాక్టు ఏజన్సీలకూ ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైనదని... అందువల్ల అధికార యంత్రాంగం, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత వ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భూసేకరణ పూర్తయిన చోట నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కాంట్రాక్టు ఏజెన్సీలను మంత్రి కోరారు. బ్యారేజీల నిర్మాణ ప్రాంతం వద్ద ఇసుక తవ్వకానికి అనుమతులివ్వాలని కలెక్టర్లకు సూచించారు. భూసేకరణ వ్యవహారంలో ఆర్డీఓలు చురుగ్గా పనిచేయాలని... కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చెందిన డ్రాయింగ్లు, డిజైనులు త్వరితగతిన పూర్తి చేసి ఏజెన్సీలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే రైతుకు పరిహారం చెల్లింపులు జరగాలని, చెల్లింపుల్లో జాప్యం తగదన్నారు. పట్టా భూములకు ఇచ్చినట్లే అసైన్డు భూములకూ అదే స్థాయిలో పరిహారం ఇవ్వాలన్నారు. భూములిచ్చే రైతుల త్యాగం వెలకట్ట లేనిదని, వారితో మర్యాదగా మెలగాలని, గౌరవంగా మాట్లాడాలని హరీశ్‌రావు సూచించారు. రైతులకు అవగాహన... రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన రైతులకు ప్రయోజనం కలిగించే కాళేశ్వరం ప్రాజెక్టును ఏదోవిధంగా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుతంత్రాలు పన్నుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రతిపక్షాల వలలో రైతులు పడకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనులపై హైదరాబాద్ నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా నిర్మాణ స్థలం నుంచి వీడియో కెమెరాలను జలసౌధకు అనుసంధానించే ప్రతిపాదనలపై అధికారులతో హరీశ్‌రావు చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషీ, ఈఎన్సీ మురళిధర్‌రావు, జయశంకర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు మురళి, అమృత వర్షిణి, కన్నన్, సీఈలు పాల్గొన్నారు. -
కాళేశ్వరంలో బాంబే న్యాయమూర్తుల పూజలు
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన న్యాయమూర్తులు భూషణ్ గవాయి, ప్రదీప్ దేశ్‌ముఖ్, సూర్యకాంత్ షిండేలకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారికి ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. -
కాళేశ్వరంపై విషం కక్కుతున్న కాంగ్రెస్ : బాల్క సుమన్
ఎంపీ బాల్క సుమన్ మండిపాటు సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి మాట గిట్టని కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కుతోందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. అభివృద్ధిలో రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దన్న దుర్బుద్ధి కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోందని విమర్శించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌తో కలసి శుక్రవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వెంగళరావు హయాంలోనే ప్రాణహిత ప్రాజెక్టు ఒప్పందం జరిగితే, లెండి, లోయర్ పెన్‌గంగ, ప్రాణహిత పనులు ఎందుకు ముందుకు సాగలేదని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, జీవన్‌రెడ్డి, టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని అంశాలను శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేసిన తర్వాతనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని పేర్కొన్నారు. -
మల్లన్న సాగర్‌తో ఇందూరుకే లబ్ధి
నిజామాబాద్ అన్నపూర్ణ అవుతుంది ‘కాళేశ్వరం’తో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిజాంసాగర్ : మల్లన్న సాగర్ నిర్మాణంతో ముందుగా లబ్ధి చేకూరేది నిజామాబాద్ జిల్లాకేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. అటువంటి మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శనివారం సాయంత్రం మాగి గాయత్రి కార్మాగారంలో సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మించడంతో మంజీర నదిలో గలగలలు తగ్గాయని, ఇన్‌ఫ్లో లేక నిజాంసాగర్ ప్రాజెక్టు మైదానంలా మారిందని పేర్కొన్నారు. సముద్రం పాలవుతున్న గోదావరి జలాల మళ్లింపునకు చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నిజాంసాగర్ ప్రాజెక్టుకు తీసుకు వచ్చి ఇందూరు జిల్లాను అన్నపూర్ణగా మారుస్తామన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న మల్లన్నసాగర్ నిర్మాణాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని, ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా మల్లన్నసాగర్ నిర్మించి తీరుతామని పేర్కొన్నారు. రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్కసీటూ గెలవలేకపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అదే గతి పడుతుందని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు నిర్మాణ పనుల వేగవంతానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడానని హరీశ్‌రావు తెలిపారు. త్వరలో లెండి పనులు పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, జుక్కల్, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, భూపాల్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్ రావు పట్వారి, సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు వినయ్‌కుమార్, గంగారెడ్డి, విఠల్, సత్యనారాయణ, మోహన్‌రెడ్డి, మాగి గాయత్రి కార్మాగారం జనరల్ మేనేజర్ సత్యనారాయణరెడ్డి, కేన్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో అన్యాయం.. పిట్లం : పిట్లంలో శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో జుక్కల్ నియోజకవర్గంలో 5 వేల మెట్రిక్ టన్నుల గోదాము ఉండేదని, తెలంగాణ వచ్చాక రూ. 13.50 కోట్లతో 22,500 మెట్రిక్ టన్నుల గోదాములను మంజూరు చేశామని పేర్కొన్నారు. వెంపల్లి మత్తడి, పుప్పల వాగుకు బీపీఆర్ పూర్తి కాగానే అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. మంజీర నదిలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి పైప్‌లైన్ ద్వారా రైతులకు సాగునీరందిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం విద్యుదాఘాతంతో మరణించిన బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన కుర్లా సాయిలు అనే రైతు కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం అందించారు. కుట్రలు మానుకోవాలి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, అడ్డంకులు సృష్టించినా మల్లన్నసాగర్ నిర్మాణం ఆగబోదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నిర్మిస్తే జిల్లా రైతాంగానికి మేలు కలుగుతుందని, నిజామాబాద్ సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ముదిరెడ్డి ప్రమీల వెంకట్ రాంరెడ్డి, బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్.శ్రీహరి, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సాయాగౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ రియాజొద్దీన్, ఎంపీపీలు రజనీకాంత్‌రెడ్డి, సునంద గంగారెడ్డి, లలిత అశోక్ పటేల్, బస్వంత్ రావ్ శెట్కార్, బసంత్ రావ్ పటేల్, జెడ్పీటీసీ సభ్యులు ప్రతాప్ రెడ్డి, సంది సాయిరాం, మాధవ్‌రావ్ దేశాయ్, బస్వరాజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
మిగిలింది 48 గంటలే!
హడావుడి లేని అంత్యపుష్కరాలు ప్రభుత్వం చిన్నచూపు గోదావరి వద్ద ఏర్పాట్లు శూన్యం ఈనెల 31న పుష్కరాలు ప్రారంభం కాళేశ్వరం : గోదావరిలో లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించి ఏడాది పూర్తయింది. పన్నెండు రోజులపాటు నదితీరం మూడు కిలోమీటర్ల మేర భక్తులతో కిక్కిరిసిపోయింది. అప్పుడు అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేశారు. ఆదిపుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ తీసుకొని ఘనంగా నిర్వహించింది. ఈనెల 31 నుంచి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఒక్క గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల హడావుడి కనిపించడంలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. దేవగురువు బృహస్పతిలో ఒక్కో సంవత్సరం ఒక్కోరాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఆయా రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆరాశిగల నదికి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించడంతో గోదావరినదికి గత ఏడాది జూలై 14 నుంచి 25 వరకు ఆది పుష్కరాలు వచ్చాయి. 12 రోజులు పాటు భక్తజనంతో గోదావరి తీరం కిక్కిరిసింది. దేవ గురువు కన్యారాశిలో ప్రవేశించే సమయం ఆసన్నమైంది. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే చివరి 12 రోజులు అంత్యపుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో ఈనెల 31 నుంచి వచ్చే నెల 11 వరకు గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించనున్నారు. అన్ని నదులకంటే భిన్నంగా గోదావరికి ఏడాది పొడవునా పుష్కరుడు ఉంటాడు. దీంతో ఈ నదిలో ఎప్పుడు స్నానమాచరించినా పుణ్యఫలం దక్కుతుందని వేదపడింతులు పేర్కొంటున్నారు. అయితే ఆదిపుష్కరాల్లో స్నానమాచరించిన వారంతా అంత్యపుష్కరాల్లో స్నానమాచరిస్తారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లేమి చేయకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. గోదావరి, ప్రాణహిత పరవళ్లు గోదావరి, ప్రాణహిత నదులు ఎగువ కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో నిత్యం వర్షాల కురుస్తుండం కారణంగా గోదావరి ఉరకలేయనుంది. గజ ఈతగాళ్ల అవసరమూ ఉంటుంది. సూదూరప్రాంతాల నుంచి వచ్చే వారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరిలో నీళ్ళుఅధికంగా ఉన్నాయి. కనీస వసతులు కరువు.. గతేడాది అన్నిశాఖల అధికారులు సమస్వయంతో పనిచేయడంతో పుష్కరాలు విజవంతమయ్యాయి. ఈసారి అంత్యపుష్కరాలకు ప్రభుత్వ పరంగ ఎలాంటి ఏర్పాట్లు ప్రారంభం కాలేదు. కరీంనగర్లో ఈనెల 15న జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పుష్కరాల ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. మరునాడు మంథని ఆర్డీవో బాలే శ్రీనివాస్ అధ్యక్షతన అన్నిశాఖల అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. అంతే.. ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభంకాలేదు. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. అంత్యపుష్కరాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. çసమాన ఫలం – ఫణీంద్రశర్మ, దేవస్థానం అర్చకుడు ఆదిపుష్కరాల్లో స్నానమాచరించినా.. అంత్యపుష్కరాల్లో ఆచరించినా సమాన పుణ్యఫలం లభిస్తుంది. సంవత్సరమంతా పుష్కరుడు గోదావరిలో ఉండడంచేత గోదావరినదికి అంత్యపుష్కరాలు ఉంటాయి. 12 రోజుల పాటు పిండప్రదానాలు, పితృతర్పణాలు, దానధర్మారలు ఆదిపుష్కరాల మాదిరిగానే చేయొచ్చు. ఏర్పాట్లు చేస్తున్నాం.. డి.హరిప్రకాశ్‌రావు, కాళేశ్వరం దేవస్థానం ఈవో అంత్యపుష్కరాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. రోజుకు 10 వేల మంది పుణ్యస్నానం ఆచరించే అవకాశం ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఆలయానికి చెందిన నిధులే ఖర్చుచేయాలని పై అధికారులు పేర్కొంటున్నారు. 31 వరకు అన్నిశాఖల సమస్వయంతో ఏర్పాట్లు పూర్తిచేస్తాం. భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం. -
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేసీఆర్ భూమిపూజ
-
జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదన రాలేదు
‘కాళేశ్వరం’పై కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలనే ప్రతిపాదననేది తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర జల సంఘానికి అందలేదని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సహాయమంత్రి సన్వర్‌లాల్ జాట్ తెలిపారు. లోక్‌సభలో గురువారం టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ 16 ప్రాజెక్ట్‌లను కేంద్రం ఇప్పటికే జాతీయ ప్రాజెక్ట్‌లుగా ప్రకటించిందని, అదనంగా 14 ప్రాజెక్ట్‌లను జాతీయ ప్రాజెక్ట్‌లుగా ప్రకటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపాయని చెప్పారు. తెలంగాణకు చెందిన ప్రాణహిత- చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలనే ప్రతిపాదన అందిందని, అయితే, ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు చెందిన సలహా సంఘం ఆమోదం లభించాల్సి ఉందని సన్వర్‌లాల్ తెలిపారు. కాళేశ్వరంపై కేంద్రమంత్రి ఇచ్చిన జవాబుతో జితేందర్‌రెడ్డి అంగీకరించలేదు. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, అందుకు అనుగుణంగానే కాళేశ్వరం, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌లను జాతీయ ప్రాజెక్ట్‌లుగా ప్రకటించే ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధానమంత్రి, జలవనరులశాఖ మంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి గతనెలలో లేఖ రాశారని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జువ్వాది చొక్కారావు ఎత్తిపోతల పథకానికి సంబంధించి సవరించిన వ్యయ అంచనాలతో కూడిన పెట్టుబడులకు సంబంధించిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం ఇంకా అందించాల్సి ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి: ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎంపీ బి.వినోద్‌కుమార్ కేంద్రాన్ని కోరారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. -
గ్రావిటీని కాదని ఎత్తిపోతలెందుకు?
* కాళేశ్వరం ప్రతిపాదనపై అఖిలపక్ష నేతలు, ఉద్యమకారుల మండిపాటు * గజ్వేల్, సిద్దిపేట కోసం రాష్ట్ర ప్రయోజనాలను సమాధి చేశారని విమర్శ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం దగ్గర్లోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను అఖిలపక్ష నేతలు, జలసాధన సమితి, ప్రాజెక్టు పరిరక్షణ సమితి సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల లబ్ధికోసం మొత్తం తెలంగాణ ప్రయోజనాలకు ప్రభుత్వం సమాధి కడుతోందని విమర్శించారు. ప్రాణహితకు అనుమతులన్నీ లభించి జాతీయ హోదా దక్కే సమయంలో డిజైన్ మార్పుతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడమేనని అన్నారు. ఇప్పటికే జరిగిన ఒప్పందాలను విస్మరించి కొత్తగా రాష్ట్రానికి నష్టం కలిగేలా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టడమే అని ధ్వజమెత్తారు. గురువారం ప్రాణహిత-చేవెళ్ల-కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష నేతలు, జల సాధన సమితి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉపనేత టి.జీవన్‌రెడ్డి, తెలంగాణ బచావో మిషన్ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్, జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్, ప్రాణహిత పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రతాప్, నీటి పారుదల రంగ నిపుణుడు సారంపల్లి మల్లారెడ్డిలు ఇందులో పాల్గొన్నారు. పరీవాహక జిల్లాలకే మొదటి హక్కు : టి.జీవన్‌రెడ్డి ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే సుమారు 80 కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంది. దీనిపై 2012లో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. కానీ గత ఏడాది మహారా్రష్ట్ర గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ తర్వాత కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా నిర్ణయాలు చేశారు. నిజానికి గోదావరి పరీవాహకం ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు గోదావరిపై మొదటి హక్కుంది. ఆ జిల్లాల అవసరాలు తీరాకే మెదక్‌కు నీటిని తరలించాలి. మెదక్ జిల్లాలో నిర్మించే రిజర్వాయర్లను ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మించాలి. అలా కాకుండా ప్రతిపక్షాలు, మేధావుల సూచనలను పక్కనపెట్టి ఇష్టారీతి నిర్ణయాలు చేస్తే చూస్తూ ఊరుకోం’. గ్రావిటీ వదిలి ఎత్తిపోతలా..: నైనాల గోవర్ధన్ ‘మహారాష్ట్రతో తాజాగా కుదుర్చుకున్న ఒప్పందంవల్ల గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని రాష్ట్రం కోల్పోతుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలన్న నిర్ణయంతో అదనపు ఖర్చుతో పాటు అధిక విద్యుత్తు అవసరం. అదీగాక 152 మీటర్ల వద్ద మహారాష్ట్ర భూభాగంలో 1,852 ఎకరాలు మాత్రమే ముంపు ఉండగా, మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే 3,075 ఎకరాల ముంపు ఉంటుంది. మహారాష్ట్ర అంత ముంపును ఎలా అంగీకరించిందో ప్రభుత్వం చెప్పాలి’. కమీషన్ల కోసమే : యెన్నం ‘కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ అంటున్నారు. ఆ డబ్బుతోనే జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయాలు చేశారు’. నాటకాలు ఆడుతున్నారు: రాజారాం యాదవ్ ‘అధికారం రాకముందు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ఇప్పుడు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు కూడబెట్టుకునేందుకు నాటకాలు ఆడుతున్నారు’. -
ఇందూరుకు కాళేశ్వరం నీరు
* నిజాంసాగర్ ప్రాజెక్టుకు పునర్వైభవం * నిజామాబాద్ జిల్లాకు అదనంగా రెండు వేల ఇళ్లు * జిల్లా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ జిల్లాకు సాగునీటిని అందించే ప్రణాళికకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాకు గరిష్ఠంగా లాభం జరుగుతుందని అన్నారు. మల్లన్నసాగర్ నుంచి ఈ నీటిని తీసుకునేందుకు వీలుగా జిల్లాలో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కాల్వలన్నింటినీ పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి 3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని చెప్పారు. ప్రాజెక్టుల రీ డిజైన్ ద్వారా వచ్చే కొత్త ప్రాజెక్టులతో ఎక్కువ వ్యవసాయ భూమి సాగయ్యేలా రిజర్వాయర్లు, కాల్వలు నిర్మించాలన్నారు. అంతర్రాష్ట ప్రాజెక్టు లెండి ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని, ఆ ప్రాజెక్టు పనులూ వేగంగా జరగాలని చెప్పారు. మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, భూ సేకరణకు కావా ల్సిన నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా బాల్కొం డ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు నీరందించేందుకు జరుగుతున్న పనులను యథావిధిగా కొనసాగించాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో అమలయ్యే వివిధ ప్రభుత్వ పథకాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీలు కవిత, బిబి పాటిల్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, హనుమంతు షిండే, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, గంగాధర్, జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ రాజు, సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుతమున్న సాగునీటి ప్రాజెక్టులైన నిజాంసాగర్, ఎస్సారెస్పీల పరిస్థితిని సీఎం సమీక్షించారు. మిషన్ కాకతీయ ద్వారా ఎక్కువ చెరువులను పునరుద్ధరించాలన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించే విషయంలోనూ జిల్లాలో పురోగతి కని పించాలని ఆదేశించారు. జిల్లాకు అవసరమైతే రెండు వేల ఇళ్లు అదనంగా కేటాయించడానికి సీఎం అంగీకారం తెలిపారు. కనీసం 50 ఇళ్లు ఒకేచోట ఉండేలా లే అవుట్ రూపొందించి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టాలని సీఎం సూచిం చారు. గృహకల్ప ద్వారా గతంలో కట్టిన ఇళ్లలో చాలా తక్కువ సంఖ్యలో నివాసముంటున్నారని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన విధానం రూపొందించాలని చెప్పారు. మహిళల పేరు మీదనే ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. -
భక్తులు వదిలేసిన ఆహారం తిని మూడు పశువులు మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న పుష్కరాల్లో భక్తులు వదిలేసిన ఆహార పదార్థాలను తిని గురువారం మూడు పశువులు మృతి చెందగా, మరో 40 పశువులు అస్వస్థతకు గురయ్యాయి. నదిలో పుష్కర స్నానమాచరించిన భక్తులు తెచ్చుకున్న ఆహార పదార్థాలు, పూజలకు వినియోగించే సరుకులను ఖాళీ ప్రదేశాల్లో పడేశారు. మేత కోసం గోదావరి ఒడ్డుకు వచ్చిన పశువులు వాటిని తిన్నాయి. దీంతో వాటిలో మూడు పశువులు మృతి చెందగా, మరో 40 పశువులు అస్వస్థతకు గురయ్యాయని మండల పశువైద్యాధికారి రాజబాబు తెలిపారు. పశువులు అస్వస్థతకు గురైతే 8790997731 నంబర్ కు సమాచారమివ్వాలని, ఇద్దరు పశువైద్యులు, 8 మంది పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. కాగా మిగిలిపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించేలా శానిటేషన్ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. పశువుల యజమానులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు నష్టపరిహారం వచ్చేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. -
కాళేశ్వరంలో శివరాత్రి సందడి
మహదేవపూర్: కాళేశ్వర ముక్తీశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందడి నెలకొంది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు దీపారాధన, గణపతి పూజలతో ఉత్సవాలు ప్రారంభ మయ్యూరుు. ప్రధానాలయం ఆవరణలోని కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీక్షా వస్త్రధారణ, దేవతాహవనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ఎదురుకోలు సేవ నిర్వహించారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలాచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ రెనొవేషన్ కమిటీ చైర్మన్ మోహనశర్మ, ఈఓ హరిప్రకాష్ పాల్గొన్నారు. నేడు కల్యాణం మంగళవారం సాయంత్రం ముక్తీశ్వరస్వామి-శుభానందదేవి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మంథని ఆర్డిఓ శ్రీనివాసరెడ్డి సోమవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరి నదీతీరంతో పాటు ప్రధాన రహదారుల్లో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మహదేవపూర డెప్యూటీ తహశీల్దార్ రవి, కాళేశ్వరం సర్పంచ్ మాధవి ఉన్నారు.