తెలంగాణ ప్రభుత్వానికి ఫైనాన్స్‌ కమిషన్‌ ప్రశంసలు | 15th finance commission praises telangana govt | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 10 2018 8:34 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

15th finance commission praises telangana govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిధుల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసల జల్లు కురిపించింది. శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల తీరును కొనియాడింది. తెలంగాణలోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా చేపడుతున్న సంగతి తెలిసిందే.

రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం సభ్యులు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ఫైనాన్స్‌ కమిషన్‌ కార్యదర్శి అరవింద్‌ మెహతా మాట్లాడుతూ.. కాళేశ్వరం పనుల వేగం దేశ చరిత్రలోనే ఒక నమూనా అని కొనియాడారు. మిషన్‌ భగీరథ పథకం ఇతర రాష్ట్రాలకు మోడల్‌ అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement