
కాళేశ్వరంలో శివరాత్రి సందడి
కాళేశ్వర ముక్తీశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందడి నెలకొంది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు,
మహదేవపూర్: కాళేశ్వర ముక్తీశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందడి నెలకొంది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు దీపారాధన, గణపతి పూజలతో ఉత్సవాలు ప్రారంభ మయ్యూరుు. ప్రధానాలయం ఆవరణలోని కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీక్షా వస్త్రధారణ, దేవతాహవనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ఎదురుకోలు సేవ నిర్వహించారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలాచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ రెనొవేషన్ కమిటీ చైర్మన్ మోహనశర్మ, ఈఓ హరిప్రకాష్ పాల్గొన్నారు.
నేడు కల్యాణం
మంగళవారం సాయంత్రం ముక్తీశ్వరస్వామి-శుభానందదేవి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మంథని ఆర్డిఓ శ్రీనివాసరెడ్డి సోమవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరి నదీతీరంతో పాటు ప్రధాన రహదారుల్లో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మహదేవపూర డెప్యూటీ తహశీల్దార్ రవి, కాళేశ్వరం సర్పంచ్ మాధవి ఉన్నారు.