
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మిడ్‌మానేరు నుంచి దిగువ కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించే పనుల పర్యవేక్షణ నిమిత్తం సీఎం కేసీఆర్ త్వరలోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించే అవకాశముంది. పర్యటనలో భాగంగా ప్యాకేజీ–10 మోటార్లను ప్రారంభించడంతోపాటు మిడ్‌మానేరు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ చేస్తారని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గురువారం సీఎం నీటి పారుదల ఈఎన్‌సీలతో చర్చించినట్లుగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment