
కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానంలో 42 ఏళ్ల తర్వాత అరుదైన సంప్రోక్షణ ఘట్టాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు

తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానందసరస్వతిస్వామి చేతుల మీదుగా ప్రధాన ఆలయ గోపుర కలశానికి మహాకుంభాభిషేకం పూజా క్రతువు పూర్తి చేశారు

ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులు హాజరయ్యారు

















