
కాళేశ్వరంలో బాంబే న్యాయమూర్తుల పూజలు
కాళేశ్వర క్షేత్రాన్ని బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు.
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానికి విచ్చేసిన న్యాయమూర్తులు భూషణ్ గవాయి, ప్రదీప్ దేశ్‌ముఖ్, సూర్యకాంత్ షిండేలకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారికి ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.