
కాళేశ్వరం – మహదేవపూర్ ప్రధాన రహదారిలోని అటవీ ప్రాంతంలో విస్తరిస్తున్న మంటలు
భూపాలపల్లి : కాళేశ్వరం–మహదేవపూర్ ప్రధాన రహదారిలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు ఆరడం లేదు. గురువారం కుదరుపల్లి అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో దారి వెంట వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విలువైన వన సంపద, అడవిలోని జీవరాశులు అగ్నికి ఆహుతవుతున్నాయి.