
సాక్షి, మెదక్ : మంత్రి హరీష్ రావు, ఎమ్యెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో పర్యటించారు. ఈ సందర్భంగా సి.సి రోడ్డు, డంప్ యార్డ్, గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామం ప్రారంభోత్స కార్యక్రమాలను నిర్వహించారు. ధర్మారం గ్రామ చెరువులో 1 లక్ష 76వేల చేపపిల్లలను వదిలారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1596 చెరువులలో ఐదు కోట్ల చేపపిల్లలను ఉచితంగా అందజేస్తున్నాం అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా గ్రామాల్లో వేసవిలోనూ చెరువులు నిండిపోతున్నాయి. గతంలో చెరువులు నిండితేనే చేప పిల్లల పెంపకం జరిగేది కానీ నేడు ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపుతాం. ఇప్పటికే మెదక్ జిల్లాలో 400 చెరువులు నీటితో నిండాయి. మత్స్యకారులకు ప్రమాద బీమా సౌకర్యం ఆరు లక్షల రూపాయలకు పెంచాం. గతంలో ఇతర రాష్ట్రాల నుండి చేపలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది కానీ కానీ నేడు ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసే విధంగా మత్స్యకారులను అభివృద్ధి చేస్తున్నాం అని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment