Murali
-
ఆడ మగ అని చూడకుండా.. సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ బాధితులు
-
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాగిరి
-
పవన్ మాటలు వెనుక బీజేపీ ట్రైనింగ్
-
చిత్తూరు నేపథ్యంలో అఖిల్ కొత్త సినిమా ప్రకటన
అఖిల్ హీరోగా ‘వినరోభాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగిందని, ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారని టాక్. అలాగే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అని తెలిసింది. ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే రూరల్ లవ్‌స్టోరీ మూవీ అని ఫిల్మ్‌నగర్ భోగట్టా. -
చంద్రబాబు విన్యాసాలు.. కష్టాల్లో ఏపీ ప్రజలు
-
ఆ డైట్ చాలా సవాల్‌గా అనిపించింది: శ్రీ మురళి
‘‘మా అత్తగారిది నెల్లూరు. ఇంట్లో నా భార్య, అత్తగారు తెలుగే మాట్లాడతారు... అందుకే నాకు కూడా తెలుగు వస్తుంది. తెలుగులో విడుదలవుతున్న నా మొదటి సినిమా ‘బఘీర’. దేశమంతా చూడదగ్గ మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందిన చిత్రమిది. అందుకే తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అని కన్నడ హీరో శ్రీమురళి అన్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘ఉగ్రం’ ఫేమ్ శ్రీ మురళి, రుక్షిణీ వసంత్ జంటగా నటించారు. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ కన్నడ సినిమాని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ‘బఘీర’ విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ మురళి మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ నీల్గారి కథని సూరిగారు వంద శాతం అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. ‘బఘీర’ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఈ సినిమా షూటింగ్లో నాకు గాయాలైనా పట్టించుకోలేదు. నాకు నా సినిమానే ముఖ్యం. నేను ఫుడ్ లవర్ని. ఈ సినిమా కోసం మూడేళ్లు లిక్విడ్ డైట్ చేశాను. అది చాలా సవాల్‌గా అనిపించింది. ‘ఉగ్రం 2’ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు. -
టీడీపీకి షాక్.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మురళీకృష్ణంరాజు
-
టీటీడీ ప్రతిష్ట దిగజార్చడానికి కుట్ర..
-
డైట్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు
సాక్షి, అనకాపల్లి : అధికార పార్టీకి సంబంధించినవైతే చాలు పోలీసులు ఎలాంటి ఘోరాలు, నేరాలు అయినా నోరు మెదపడంలేదు. టీడీపీ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ అనకాపల్లిలో నడుపుతున్న దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆగడాలే ఇందుకు ఉదాహరణ. మెంటార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ మురళి తనను వేధిస్తున్నాడని ఇంజినీరింగ్ సెకండియర్ విద్యార్థిని చాలాకాలంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎట్టకేలకు అరెస్టుచేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు. కానీ, ఈ విషయాన్ని అనకాపల్లి టౌన్ పోలీసులు చాలా గోప్యత పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెంటార్ మురళి ఏడాది కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలు పేర్కొంటోంది. ప్రతిరోజు రాత్రులు తనకు ఫోన్‌చేసి మాట్లాడాలని, వాట్సాప్ మెసేజ్‌లు చేయాలని, కళాశాలకు వచ్చినప్పుడు తనను కలవాలని, హగ్ చేసుకోవాలని రకరకాలుగా వేధిస్తుండటంతో ఆమె నరకం అనుభవిస్తోంది. అతని వేధింపులు భరించలేక తన స్నేహితుడికి సమస్యలు వివరించడంతో.. ఇటీవల ఆ యువకుడు మురళిని ప్రశ్నించగా ‘నీకేందుకురా పో’.. అంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇద్దరి మధ్య వేరే సంబంధం ఉందని మీ తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. అధ్యాపకుడి ఫోన్‌కాల్ రికార్డింగ్ ఆధారంగా కళాశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో బాధిత విద్యార్థిని జిల్లా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సైతం ఈ విషయాలను రహస్యంగా ఉంచడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు.. తమ కుమార్తెపట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడ్ని 14రోజులపాటు రిమాండ్ విధించినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ విషయం సీఐ వెల్లడించకపోవడం గమనార్హం. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళి గతంలో చాలామందిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, కళాశాలలో మెంటర్ కావడంతో విద్యార్థులు మౌనంగా భరిస్తున్నారని ఇతర విద్యార్థులు చెబుతున్నారు. -
ఇదేం పని ‘గురువా’!
శాంతిపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందే మద్యపానం చేస్తూ ఫొటోలకు చిక్కాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి బాలయోగి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోని బాలుర హాస్టల్లో బుధవారం రాత్రి విద్యార్థులతో పాటు ఉన్న పీఈటీ మురళి అక్కడే మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పిల్లల ముందే వారు నిద్రించే పడకపై కూర్చుని హాయిగా మద్యం తాగుతూ ఎవరితోనో ఫోన్లో గొడవ పెట్టుకున్నాడు. పాఠశాలకు వచ్చి ఈ విషయాన్ని గమనించిన రామకుప్పం మండలానికి చెందిన ఓ దళిత నాయకుడు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగుచూసింది. దీనిపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేంద్రను వివరణ కోరగా.. పిల్లల మధ్య కూర్చుని మద్యం సేవిస్తున్న కాంట్రాక్ట్ పీఈటీ ఫొటోలు తనకు కూడా వచ్చాయన్నారు. తాను ఈ విషయాన్ని డీసీవో దృష్టికి తీసుకెళ్లానని.. ఆమె గురువారం విచారణకు వస్తున్నారని చెప్పారు. -
టీడీపీ నేతలపై కందిగోపుల మురళి ఫైర్
-
బాబుకు అనంత వెంకట రామిరెడ్డి వార్నింగ్
-
నా ఆత్మరక్షణ కోసం సీఐ గారి ముందే గన్ తీసాను...!
-
చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టు: వైఎస్సార్సీపీ నేత మురళి
సాక్షి, తాడేపల్లి: జేసీ కుటుంబం అరాచకాలపై తాడిపత్రి వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని ధ్వజమ్తెతారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాయలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వీడియో తీస్తుంటే మావాళ్ల ఫోన్లను లాక్కున్నారంటూ.. దాడి ఘటనను ఆయన వివరించారు.‘‘మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాల్ చేస్తే ఆయన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాను. కారులో వెళ్తుంటే నాపై దాడి చేసేందుకు జేసీ మనుషులు వచ్చారు. నేను భయపడి వెనక్కి వచ్చేశాను. కాసేపటికే వారంతా మా ఇంటి మీదకు వచ్చారు. వందల మంది వచ్చి దాడులు చేశారు. ఇనుప తలుపులను సైతం పగులకొట్టి లోపలకు వచ్చారు. మారణాయుధాలు చేతపట్టుకుని వచ్చి దాడి చేశారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. ఫోన్లు చేసిన పోలీసులు రాలేదు. పదేపదే ఫోన్లు చేస్తే 45 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు’’ అని మురళి చెప్పారు.‘‘నాకు గన్ లైసెన్స్ ఉన్నా ఫైరింగ్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి మా ఇంటిపై దాడి చేసి లూఠీ చేశారు. బంగారం దోచుకుపోయారు. ఇరవై ఏళ్ల తర్వాత జేసీ కుటుంబాన్ని ఓడించాం. మళ్లీ ఓడిస్తాం. ఏం ఉన్నా రాజకీయంగా పోరాడతాం. జేసీ కుటుంబం ఇలా ఇళ్లపై దాడులకు దిగటం మంచిది కాదు. రాయలసీమలో ఐదేళ్లుగా శాంతిభద్రతలు బాగున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.’’ అని మురళి పేర్కొన్నారు.15 ఏళ్లుగా నాకు గన్ లైసెన్స్ ఉంది. గొడవ అంతా అయిపోయిన తర్వాతే గన్ తీసుకుని బయటకు వచ్చాను. అయితే నేనే టీడీపీ వారిపై దాడి చేసినట్లుగా కేసులు పెట్టారు. చిన్నపిల్లలు, ఆడవారిపై జేసీ కుటుంబం దాడులు చేయడమేంటి?. జేసీ ప్రభాకరరెడ్డి చేసే రాజకీయాలు ఇవేనా?. చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టండి. ఒక విలేకరిని నేను బెదిరించినట్టుగా అక్రమ కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగొద్దు’’ అని మురళి అన్నారు. -
అరాచకం బట్టబయలు..వైరల్ గా మారిన జేసీ వర్గీయుల దాష్టీకం..
-
మేము బ్రతకాలా.. వద్దా...? కన్నీరు పెట్టుకున్న కందిగోపుల మురళి భార్య
-
సంగీతంలో అపశ్రుతి
సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు. తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు. ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్‌ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు. ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు. మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. -
ఫీజికల్ హెల్త్ పై మెంటల్ హెల్త్ ప్రభావం...!
-
Rajampeta : పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న ప్రవాసాంధ్రుడు
కడప: దృష్టి.. జీవన ప్రయాణంలో అత్యంత కీలకం. కళ్లు సరిగా ఉంటే.. ఏ పనయినా చేసుకోవచ్చు. కానీ కొందరు కళ్లను సరిగా పట్టించుకోకపోవడం వల్ల అది దృష్టి లోపానికి దారి తీస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కంట్లో శుక్లాలకు దారి తీస్తుంది. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలిచారు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు వల్లూరు రమేష్ రెడ్డి.ఆకేపాడు గ్రామంలోని అమర్నాథరెడ్డి నివాసంలో చెన్నై శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 రోజులపాటు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రవాణా సదుపాయంతో పాటు ఉండేందుకు వసతి కల్పించారు. ఈ శిబిరం ద్వారా ఏకంగా 238 మంది కంటి శస్త్రచికిత్సలు చేయించుకోవడం నిజంగా గొప్ప విషయం. శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నివేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలనే ఉద్దేశంతో పట్టణాన్ని సైతం వదిలి స్వగ్రామంలోనే నివాసం ఉంటూ నిత్యం వివిధ రకాల సేవలను పేదలకు అందిస్తున్న జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి సేవా తత్పరుడని కడప మేయర్ సురేష్ బాబు తెలిపారు. అలాగే వైఎస్సార్సిపి అమెరికా కన్వీనర్ వల్లూరు రమేష్ రెడ్డి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం 30 లక్షల రూపాయలు వెచ్చించి ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించి 238 మందికి కంటి చూపు తెప్పించడం చాలా అదృష్టమని అన్నారు. ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరవకుండా బడుగులకు సేవలు అందిస్తోన్న వల్లూరు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 12 రోజులు పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 1032 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 238 మందిని ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. పూర్తిగా ఉచితంగా ఈ చికిత్స అందించడంతో పాటు అద్దాలు, మందులను కూడా పంపిణీ చేశారు. ఎప్పుడో ఓసారి ఎక్కడో ఓ చోట ఏవైనా కార్పొరేట్ ఆసుపత్రులు ఒక్కరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారని కానీ 12 రోజులు పాటు ఏకతాటిగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని సురేష్‌బాబు కొనియాడారు. రమేష్ రెడ్డి చేసిన సేవకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరూ ఆకేపాటి అమర్నాథరెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారి వారి స్వగ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పుట్టిపెరిగిన గడ్డ అమ్మకు సమానమని, ఆ మాతృభూమికి ఎంతో కొంత సేవ చేసే అవకాశం నిజంగా అదృష్టమన్నారు రమేష్ రెడ్డి వల్లూరు. వైఎస్సార్ కడప జిల్లా నుంచి మూడు దశాబ్దాల కింద అమెరికా వెళ్లిన రమేష్ రెడ్డి ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి.లో స్థిరపడ్డారు. ఇటీవలే తన తల్లితండ్రుల స్మృతిలో భాగంగా శంకర నేత్రాలయ ద్వారా ఈ ఉచిత కంటి శిబిరానికి తన వంతుగా చేయూత నిచ్చారు. 👁️ Proud to share that I've made a my contribution to a health camp that provided free eye check-ups for 1000+ patients and free surgeries for 238 people. We’re making a difference in improving lives! 🙏 💪❤️ #HealthcareForAll #CommunityImpact #GivingBack #CMJagan #AndhraPradesh — Ramesh Valluru Reddy (@YSRDist_RameshR) September 7, 2023 ఈ శిబిరానికి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు గజేందర్ కుమార్ వర్మ, డాక్టర్ సురభి, డాక్టర్ శంకర్ హాజరై శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశారు. వీరికి శంకర నేత్రాలయ నుంచి అరుల్ కుమార్, రంజిత్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, వైసీపీ నాయకులు పోలి మురళి, దాసరి పెంచలయ్య, డీలర్ సుబ్బరామిరెడ్డి, మహర్షి, రమేష్ నాయుడు పాల్గొన్నారు. -
సమంత, విజయ్‌ల ఎమోషన్స్ ‘ఖుషి’కి బ్యూటీని తీసుకొచ్చాయి
ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ‘ఖుషి’ సినిమా నేపథ్యం. మణిరత్నం సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారు. అయితే అలాంటి సీన్స్ ను మేము కాపీ కొట్టలేదు. అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయి’అని సినిమాటోగ్రాఫర్ జి.మురళి అన్నారు. విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జి.మురళి సినిమాటోగ్రఫీ అందించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మురళీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నేను 2005 నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను. అందాల రాక్షసి మూవీకి పనిచేశాను. ఆ తర్వాత నేను చేసిన లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఖుషి’నే. మైత్రీ రవి గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఈ సినిమాకు మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి సినిమాల మీద ఉన్నంత ప్యాషన్ నేను ఇంకో ప్రొడక్షన్ లోనూ చూడలేదు. సినిమా బాగా వచ్చేందుకు ఏది కావాలన్నా సమకూర్చుతారు. ఫిలిం మేకింగ్ లో వాళ్లు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ► మైత్రీ రవి గారు ఫోన్ చేసి చెన్నైకి డైరెక్టర్ తో కలిసి వస్తున్నాం. మీరు కథ వినండి అని చెప్పారు. అలా శివ గారు కథ చెప్పారు బాగా నచ్చింది. ఆయన ప్రీవియస్ మూవీస్ గురించి తెలుసుకున్నా. అలాంటి మంచి డైరెక్టర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యా. ► లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘ఖుషి’ ఉంటుంది. ఇందులో విప్లవ్, ఆరాధ్య క్యారెక్టర్ లలో విజయ్, సమంత నటన మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వాళ్ల క్యారెక్టర్స్ మధ్య వచ్చే సందర్భాల్లో విజయ్, సమంత చూపించిన ఎమోషన్స్, డీటెయిల్స్ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చాయి. క్యారెక్టర్ లో ఎంతవరకు నటించాలో విజయ్ కు బాగా తెలుసు. ‘ఖుషి’లో అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. ఈ సినిమాతో తొలిసారి సమంతతో కలిసి పనిచేశాను. ► దర్శకుడు శివ నిర్వాణ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. సినిమా మేకింగ్ మీద ఇష్టం ఉన్న దర్శకుడు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయన మ్యూజిక్ సెన్స్ సూపర్బ్. ఇవాళ ‘ఖుషి’లో ఇంతమంచి మ్యూజిక్ వచ్చిందంటే దానికి శివ నిర్వాణ మ్యూజిక్ టేస్ట్ కారణం. ► నేను పనిచేసిన గత చిత్రాలు కాలా, సార్పట్ట వంటివి చూస్తే రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. కానీ ‘ఖుషి’లో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ విజువల్స్ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఫుల్ లైఫ్ తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూడటం పూర్తయ్యాక మీకొక కొత్త అనుభూతి కలుగుతుంది. కెమెరా ద్వారా ఆ ఎమోషన్ తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను. -
రైతుల ఆత్మహత్యలపై స్పందన ఏదీ?
పంజగుట్ట: రాష్ట్రంలో సిరులు కురిపిస్తున్న సేద్యం అని బీఆర్ఎస్ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని... అయితే రాష్ట్రం వచ్చిన 9 సంవత్సరాల్లో 7007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని పలువురు వక్తలు ఆరోపించారు. సోషల్ డెమొక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో “తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి?’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ పద్మజాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్డీఎఫ్ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి, కో కన్వినర్లు కన్నెగంటి రవి, పృధ్విరాజ్ యాదవ్, ప్రొఫెసర్ రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్ని పార్టీల అధ్యక్షులకు ఇచ్చి వారి మేనిఫెస్టోలో పెట్టాలని సూచించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఆకునూరి మురళి మాట్లాడుతూ... రాష్ట్రంలో 59 లక్షల రైతులు కోటి 45 లక్షల భూమిని సాగుచేస్తున్నారన్నారు. వారికి 3.2 టన్నుల విత్తనాలు అవసరమున్నదని రాష్ట్ర ప్రభుత్వం విత్తన అభివృద్ధి సంస్థ పాత్ర రోజురోజుకూ తగ్గించడంతో నకిలీ విత్తనాలు అమ్మే మోసగాళ్లు పెరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించి సమగ్ర చట్టం విత్తన విధానం తీసుకురావాలని సూచించారు. రైతుల వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడూ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో సహకరించేందుకు రాజ్యాంగ బద్ద సంస్థ ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం రూ. 100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిషన్ అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించడం, విత్తనాలు సరఫరా, నాణ్యమైన విత్తనలు, జన్యుపరంగా మార్పు చేసి ఇవ్వాలన్నారు. క్రిమి సంహారక మందులు కూడా ఏ పంటకు ఏ మేర క్రిమిసంహారక మందులు వాడాలో సూచించాలన్నారు. రైతుబంధు పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని కొనసాగిస్తూనే పది ఎకరాలు పైబడి మాగాణి, వర్షాధార భూములు ఉన్న వారికి ఇవ్వరాదన్నారు. ఆదాయపు పన్ను కట్టే ఏ రైతుకుటుంబానికి, భూ యజమానులకు రైతుబందు ఇవ్వకూడదని, ఇతరదేశాల్లో స్థిరపడి ఉన్న భూ యజమానులకూ ఇవ్వరాదని సూచించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎలాంటి పంటల బీమా లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రతి సంవత్సరం కరువుతోనో, అధిక వర్షాలతోనో రైతులు నష్టపోతూనే ఉన్నారని ఏ ఒక్క రైతుకూడా నష్టపోకుండా పటిష్టమైన పంటల బీమా వర్తింపచేయాలన్నారు. రైతులు బాగుపడేందుకు ప్రభుత్వం రూ. 38500 కోట్లు అవసరం అవుతాయని ప్రతి సంవత్సరం అదనంగా రూ. 6400 కోట్లు కేటాయించాలని సూచించారు. సమావేశంలో రంజిత్ కుమార్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
జైళ్ల శాఖ రెండో ఐజీగా మురళీబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖలో ప్రస్తుతం ఉన్న పోస్ట్‌కు అదనంగా.. మరో ఐజీ పోస్ట్ ఏర్పాటుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న మురళీబాబు త్వరలో ఐజీగా పదోన్నతి పొందనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినందున జైళ్ల శాఖలో డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) సమావేశమై మురళీబాబుకు ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇక లాంఛనప్రాయమే. ఈ మొత్తం ప్రక్రియ మరో వారంలోగా ముగిసే అవకాశం ఉండడంతో ఆ తర్వాత మురళీబాబు ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జైళ్లశాఖ ఐజీగా పనిచేస్తున్న రాజేశ్‌కుమార్, పదోన్నతిపై ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్న మురళీబాబుల మధ్య పని విభజన చేయనున్నారు. కాగా, ఈ ఇద్దరు అధికారులు ఒకే బ్యాచ్ అధికారులు. సీనియారిటీ అంశంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే దిశగా జైళ్ల శాఖలో రెండో ఐజీ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. మురళీబాబుకు పదోన్నతి లభించడంతో ఖాళీ అయ్యే డీఐజీ పోస్ట్ వరంగల్ సెంట్రల్ జైలు ఎస్పీ సంపత్‌కు దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత డీఐజీ శ్రీనివాస్‌తోపాటు సంపత్ డీఐజీ హోదా పొందనున్నట్టు సమాచారం. -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు
జయపురం: పట్టణంలో సంబరంగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శరన్నవరాత్రి సంబరాల్లో సందర్భంగా నిర్వహకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జయపురం రాజ్‌మహల్ కూడలి వద్ద విశాలమైన వేదికపై సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి, మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, సబ్ కలెక్టర్ దేవధర ప్రధాన్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పట్నాయక్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు మురళీ మహాపాత్రొ తన బృందంతో కలిసి సుమధుర గీతాలతో శ్రోతలను అలరించారు. అనంతరం మిగతా గాయకులు పాడుతుండగా.. కుర్చీ నుంచి వారిని ప్రోత్సహిస్తున్న ఆయన హఠాత్తుగా గుండె నొప్పితో వేదికపై ఒరిగిపోయారు. నిర్వాహకులు, తోటి కళాకారులు వెంటనే జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు ప్రకటించారు. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. దసరా వేడుకల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటన జరగడం దురదృష్టకరమని నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. చదవండి: (NIMS Director: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!) -
మదనపల్లె వైద్య కళాశాల పనులు ప్రారంభం
మదనపల్లె : రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న వైద్యకళాశాల స్థలంలో పనులు ప్రారంభమయ్యాయి. గురువారం ఆర్డీఓ ఎం.ఎస్.మురళి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ఆనందరెడ్డి, డీఈ కరీముల్లా తదితరులు ఆరోగ్యవరం వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన 95.14 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ స్థలంలో అంతరరోడ్ల నిర్మాణం, ప్రహరీ, సరిహద్దులను గుర్తించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈఈ ఆనందరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యవిద్యను చేరువ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుచేస్తామని ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా రాజంపేట పార్లమెంటరీ పరిధిలో రూ.475 కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తూ అనుమతిలిచ్చిందన్నారు. ఈ పనులకు సంబంధించి మేఘ ఇంజినీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ టెండర్లు దక్కించుకుందన్నారు. అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిందని, 30 నెలలలోపు నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. మొత్తం 13,31,812 చదరపు అడుగుల విస్తీర్ణంలో వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, ఆస్పత్రి భవనాలు, సిబ్బంది క్వార్టర్స్, ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ) నిర్మిస్తారన్నారు. ఆర్డీఓ ఎం.ఎస్.మురళి మాట్లాడుతూ మెడికల్ కళాశాల స్థలంలో పలుచోట్ల బండరాళ్లు ఉండటంతో వాటిని పగులగొట్టేందుకు బ్లాస్టింగ్ లైసెన్స్ కోసం కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకోవడంతో అనుమతులిచ్చేందుకు పరిశీలన చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య, తహసీల్దార్ సీకే.శ్రీనివాసులు, మేఘ సంస్థ ఇంజినీర్లు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఈఈగా ఆనందరెడ్డి మదనపల్లెలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజి ఈఈగా ఆనందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పెనుకొండ మెడికల్ కాలేజీ ఈఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను ప్రభుత్వం మదనపల్లె మెడికల్ కాలేజీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఆకట్టుకుంటున్న ‘మౌనం’ థియేట్రికల్ ట్రైలర్!
‘మల్లెపువ్వు’ఫేమ్ మురళి, ‘బిగ్ బాస్’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన తాజా చిత్రం ‘మౌనం’.‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ ట్యాగ్ లైన్. లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషన్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేశ్ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ వర్మ మాట్లాడుతూ.. ‘మణిరత్నం’ మౌనరాగం తరహాలో... తన మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ... ‘మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్ గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ ‘మౌనం’. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు. ఐశ్వర్య అడ్డాల, 'శివ' ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: అనిల్, స్క్రీన్ ప్లే-ఎడిటింగ్: శివ శర్వాణి. -
ఇంటర్ 2 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ.72వేల కోట్లకు అధిపతి
జీవితం అంటేనే సంతోషం, బాధ, గెలుపు, ఓటమి వీటన్నింటి కలయిక. ఈ రోజు మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య.. కొన్ని రోజుల తర్వాత చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే ఓడిపోయినప్పుడు.. కుంగిపోకూడదు. ధైర్యంగా ముందడుగు వేయాలి.. విజయం తప్పక వరిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచారు మురళి దివి. ఇంటర్ రెండు సార్లు ఫెయిలైన మురళి దివి.. నేడు 72వేలకు కోట్లకు అధిపతిగా నిలిచారు. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మురళి దివికి 12 మంది తోబుట్టువులున్నారు. మురళి తండ్రికి వచ్చే 10 వేల రూపాయల పెన్షనే వారికి జీవినాధారం. సరిపడా ఆదాయం లేనప్పటికి పిల్లల్ని చదువుకు దూరం చేయలేదు మురళి దివి తండ్రి. ఇంటర్‌కు వచ్చే వరకు కూడా కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మురళి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..!) మలుపు తిప్పిన సంఘటన ఇలా ఉండగా.. మురళి ఇంటర్ రెండు సార్లు ఫెయిలయ్యాడు. ఈ సంఘటన మురళి జీవితం మీద చాలా ప్రభావం చూపింది. తనను చదివించడం ఆర్థికంగా భారమైనప్పటికి తండ్రి అవేం పట్టించుకోలేదు. కానీ తాను మాత్రం రెండు సార్లు ఫెయిలయ్యాననే బాధ మురళిని పీడించసాగింది. ఆ తర్వాత నుంచి మురళి మరింత కష్టపడి చదివాడు.. అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. ఇంటర్లో ఫెయిలవ్వడం గురించి మురళి అంతర్జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘చదువు విషయంలో నేను చాలా నిజాయతీగా ఉండేవాడిని. చాలా కష్టపడేవాడిని. కానీ నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రెండు సార్లు ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు మా కుంటుంబ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి అర్థం అయ్యింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. బాగా చదివి.. మంచి ఉద్యోగం సాధించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని భావించాను. కష్టపడి చదివి.. అమెరికాలో ఉద్యోగం సాధించాను’’ అని తెలిపాడు. (చదవండి: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్) అమెరికా ప్రయాణం.. మురళి దివి తన అన్నల మాదిరిగానే కెమిస్ట్‌గా మారే మార్గంలో ఉన్నాడు. కానీ విధి రాత మరోలా ఉంది. ఈ క్రమంలో మురళి గ్రీన్ కార్డ్ పొంది 1976 లో అమెరికా వెళ్లాడు. ఫార్మసిస్ట్‌గా జీవితం ప్రారంభించాడు. అమెరికాలోని వివిధ కంపెనీలలో పని చేశాడు. చివరకు ఏడాదికి 65 వేల డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. కానీ ఇంటి మీద బెంగ, మాతృభూమి నుంచి వచ్చిన పిలుపు మురళీ దివిని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి.. అనే దాని గురించి ఏం ఆలోచించుకోలేదు మురళి. అప్పుడే అనగా 1984లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రారంభం అయ్యింది. దానిలో చేరాడు మురళి. ఆరేళ్ల తర్వాత రెడ్డీస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా దివిస్ లాబొరేటరీస్‌ని ప్రారంభించాడు. (చదవండి: ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే.. ఎందుకంటే!) బిలియనీర్‌గా ఎదిగాడు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, అనగా 2013లో మురళి బిలియనీర్ అయ్యాడు. 2018-19లో, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచాడు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ గత 3 సంవత్సరాలలో 400% కంటే ఎక్కువ పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ-నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ప్రకారం, మురళీ దివి, అతడి కుటుంబం రూ .72,000 కోట్ల (9.9 బిలియన్ డాలర్లు) నికర సంపదతో ప్రపంచంలోని 384 వ ధనవంతులుగా నిలిచారు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు -
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బందీగా ఉన్న ఏఎస్ఐ మురళీని హత్య చేశారు. అనంతరం మురళీ మృతదేహాన్ని గంగుళూరు వద్ద రహదారిపై పడేశారు. మృతదేహం వద్ద ఒక లేఖను వదిలి వెళ్లారు. ఈ నెల 21న గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలనార్ గ్రామంలో ఏఎస్ఐ మురళీని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి విదితమే. నాలుగు రోజుల తర్వాత కిడ్నాప్ ఘటన విషాదంతో ముగిసింది. మురళీని విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు విన్నవించిన మావోయిస్టులు కనికరించలేదు. ఏఎస్ఐ విడుదలకు గోండ్వానా సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ యత్నించిన సంగతి తెలిసిందే. చర్చలు జరిపే సమయంలోనే మురళీని మావోయిస్టులు హత్య చేశారు. చదవండి: కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో.. టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. -
బంధీగా ఉన్న మురళీని హత్య చేసిన మావోయిస్టులు
-
ఇంగ్లిష్‌లో ‘శతక సానెట్స్’
చేర్యాల(సిద్దిపేట): వివిధ సంస్థలు గత మే నెల 2వ తేదీ నుంచి నేటి వరకు నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ ఇంగ్లిష్ పద్యాల పోటీల్లో మండల పరిధిలోని గుర్జకుంట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రేణుకుంట్ల మురళి శతక సానెట్స్ పూర్తి చేసి 50కి పైగా అవార్డులు సాధించాడు. గురువారం మురళి విలేకరులతో మాట్లాడుతూ.. పీబీ పబ్లిషర్స్ కమ్యూనిటీ, అన్టచ్డ్ ఎమోషన్స్, వ్రైటర్స్ యునైట్, నాజ్మేహయత్ సంస్థలు ఆన్లైన్లో నిర్వహించిన ఇంగ్లిష్ పద్యాల పోటీల్లో పాల్గొని కన్స్టాలేషన్, మదర్ గాడ్డెస్, స్మైల్ చైల్డ్‌హుడ్ మెమొరీస్, గస్టీ విండ్స్, విల్టెడ్ రేయిన్బో మొదలైన అంశాలపై 100కు పైగా పద్యాలు రాసినట్లు చెప్పారు. అందుకుగాను 50కి పైగా అవార్డులను ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుచుకున్నట్లు తెలిపారు. తాను రాసిన పద్యాలలో కొన్నింటిని ఇన్సెంటివ్, ఇన్పినిటీ, బియాండ్, ఎంబర్, అరోరా, డియర్డాడ్, ఫోర్జెన్ ఫోలెన్, ఇంక్ పాబ్లెస్ లాంటి 20 ఆంథోళజీ పుస్తకాల్లో ముద్రించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, గ్రామర్ పుస్తకం రచించానని, ప్రచురణ జరుగుతుందన్నాడు. తాను రచించిన పుస్తకాలు అమేజాన్, అమేజాన్ కిండ్లే, నేషన్ ప్రెస్, పిబి పబ్లిషర్స్ వంటి ప్రముఖ పుస్తక విక్రయశాలల్లో లభిస్తాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన మురళిని కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు అభినందించారు. -
గొందిరెడ్డిపల్లి ఘటనపై కేసు
అనంతపురం ,రాప్తాడు: గొందిరెడ్డిపల్లి ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో జరిగిన ఘటనలో 34 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పది మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులపైన, ఎనిమిది మంది టీడీపీ నాయకులపైన, అలాగే కానిస్టేబుల్‌పై జరిగిన దాడికి సంబంధించి ఇరు పార్టీలకు చెందిన 16 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆరోజు ఏం జరిగిందంటే..? ఈ నెల నాలుగో తేదీన గొందిరెడ్డిపల్లిలో జరిగిన ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మిడతల శీనయ్య వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని చంద్రబాబు ఫొటోపై పాలు పోసి ప్రమాణం చేయాలని డ్వాక్రా మహిళలకు హుకుం జారీ చేశాడు. దీంతో కొందరు మహిళలు తాము చంద్రబాబుకు ఓటు వేయబోమని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తామని స్పష్టం చేశారు. రెచ్చిపోయిన మిడతల శీనయ్య ఓ మహిళను చెప్పుకాలితో తన్నాడు. దీంతో మహిళలు, గ్రామస్తులు శీనయ్యపై ఎదురు దాడికి దిగారు. పోలీసులు కూడా టీడీపీ నాయకులకే వత్తాసు పలకడంతో ఆగ్రహించిన మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత సోదరుడు, టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి, మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ అనుచరులు పెద్ద ఎత్తున గ్రామంలోకి వచ్చి హల్చల్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మహిళలు అనే ఇంగిత జ్ఞానం లేకుండా వారిని చితకబాదారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు మరో ఐదుగురుకు స్వల్పంగా గాయపడిన విషయం విదితమే. 8 మందిపై కేసు నమోదు టీడీపీ నేతలు దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. మిడతల శీనయ్య, ఈశ్వరయ్య, మహమ్మదయ్య, డీలర్ మల్లికార్జున, పుటుక నాగభూషణం, మిడతల ముత్యాలు, మిడతల ఉజ్జినయ్య, ఎం.బండమీదపల్లి మాజీ సర్పంచు దుగ్గపాటి శ్రీనివాసులుతో పాటు మరికొంత మంది ఘటనలో ఉన్నట్లు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపైనా.. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు మాత్రమే దెబ్బలు తగిలాయని, టీడీపీ కార్యకర్తలకు ఒక్కరికి కూడా గాయం కాలేదని గొందిరెడ్డిపల్లి వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. అయితే కేసును తప్పుదోవ పట్టించేందు కోసం టీడీపీకి చెందిన గోపాల్, మల్లికార్జున, రామాంజినేయులుకు దెబ్బలు తగలకున్నా దెబ్బలు తగిలాయంటూ ప్రభుత్వాస్పత్రిలో చేరారని తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వెంకట్రామిరెడ్డి, శశిధర్‌రెడ్డి, హన్మంత రెడ్డి, వివేకానందరెడ్డి, మంజునాథ్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నరసింహరెడ్డి, కొండారెడ్డి, చెన్నారెడ్డి, నరేష్ కుమార్‌రెడ్డిలతో పాటు మరి కొంతమందిపై కేసు కట్టారు. వీరిలో ఆరోజు ఎవరూ కుడా ఘటలో పాల్గొనకున్నా పోలీసులు కేసు నమోదు చేయడం గమన్హారం. కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో 16మందిపై కేసు ఈ ఘటనలో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ జయచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు ఇరు పార్టీలకు చెందిన 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో మిడతల శీనయ్య, శీనా, ఉజ్జినయ్య, డీలర్ మల్లికార్జున, గురవ మల్లికార్జున, మల్లప్ప, ఈశ్వరయ్య, మంజునాథ్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, పుల్లారెడ్డి, మధు, మిషన్ కొండారెడ్డి, లక్ష్మీదేవి, భాగ్యమ్మ, సింహాద్రిలతో పాటు మరి కొంతమంది ఉన్నారు. ధర్మవరపు మురళి పేరు తొలగింపు టీడీపీ నేతలు కొట్టిన దెబ్బలకు గాయపడి అనంతపురంలో చికిత్స పొందుతున్న బాధితులు హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మలు తమను గ్రామస్తులతో పాటు మంత్రి సోదరుడు ధర్మవరపు మురళి, పరిటాల శ్రీరామ్ అనుచరులు వచ్చి దాడి చేశారని, ధర్మవరపు మురళినే కొట్టించాడని, అతన్ని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. ధర్మవరపు మురళి తన కాన్వాయ్‌తో వచ్చి బా«ధితులపై రాళ్లు రువ్విన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పలు మీడియా చానళ్లలో కూడా ధర్మవరపు మురళి రాళ్లు రువ్విన దృశ్యాలను పదే పదే చూపిస్తున్నా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆయన మంత్రి పరిటాల సునీత సొదరుడు కాబట్టి. ధర్మవరపు మురళిని అరెస్ట్ చేస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయన్నది పోలీసుల భయం. ధర్మవరపు మురళితో పాటు మండల వ్యాప్తంగా పలువురు టీడీపీ నాయకులు ఈ ఘటనలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను చూస్తే పాల్గొన్నదెవరో పోలీసులకే తెలుస్తుంది. -
మహిళలపై స్వయంగా మంత్రి సోదరుడి దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో డ్వాక్రా మహిళలపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. స్వయంగా మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళీ మహిళలపై రాళ్లు రువ్వాడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి సోదరుడు మురళీ రెచ్చిపోయాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తామని ప్రమాణం చేయాల్సిందిగా పరిటాల వర్గీయులు అడుగగా.. అందుకు డ్వాక్రా మహిళలు నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి పరిటాల సునీత వర్గీయులు దాడులకు దిగారు. పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంత్రి సోదరుడు మురళీ, పరిటాల అనుచరుల దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
రెచ్చిపోయిన సునీత సోదరుడు మురళి
-
‘సాక్షి’ ఎడిటర్ వర్దెల్లి మురళికి మాతృ వియోగం
-
‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళికి మాతృవియోగం
సూర్యాపేట: సీపీఎం సీనియర్ నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు సతీమణి, ‘సాక్షి’ఎడిటర్ వర్ధెల్లి మురళి మాతృమూర్తి వర్ధెల్లి లక్ష్మమ్మ (78) గుండెపోటుతో మరణించారు. సూర్యాపేటలోని వారి నివాసంలో మంగళవారం మధ్యా హ్నం 1.30 గంటలకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె తుదిశ్వాస విడిచారు. వీరి స్వగ్రామం తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం కాగా సూర్యాపేటలోని విద్యానగర్‌లో నివాసముంటున్నారు. వర్ధెల్లి బుచ్చిరాములు, లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు మురళితో పాటు కుమార్తె పద్మ ఉన్నారు. విషయం తెలుసుకున్న సాక్షి ఎడిటర్ మురళి సూర్యాపేటకు చేరుకుని మాతృమూర్తి భౌతికకాయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ఇంటిపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మమ్మ మరణంపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా ప్రకటనల్లో తమ సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని సీపీఎం నాయకులు సందర్శించి నివాళులర్పించారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు బుధ వారం సూర్యాపేటలో జరుగుతాయని తెలిపారు. -
పరిటాల సునీత సోదరుడు వర్సెస్ మాజీ సర్పంచ్
సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత సోదరుడికి టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌కు విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పరిటాల సునీత సోదరుడు మురళి తమపై ఆధిపత్యం చెలాయించడంపై మరూరు టీడీపీ నేత, మాజీ సర్పంచ్ బోయ వెంకటేష్ మండిపడ్డారు. తనపై కావాలనే కక్ష్య కట్టాడని బోయ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అండదండలు చూసుకుని తనకు వచ్చిన కాంట్రాక్టు పనులను మురళి రద్దు చేయించారని ఆరోపించారు. జిల్లాలో బీసీల ఎదుగుదలను పరిటాల కుటుంబం ఓర్వలేకపోతుందని విమర్శించాడు. తాను ఇన్ని రోజులుగా టీడీపీలో పని చేసినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. -
7న రైతునేస్తం అవార్డుల బహూకరణ
సాక్షి, అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఏర్పాటు చేసిన రైతునేస్తం పురస్కారాలను ఈనెల 7న హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అందజేయనున్నట్టు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు జరిగే అవార్డుల బహూకరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులు, అగ్రిజర్నలిస్టులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రముఖ ఆరోగ్య ఆహార నిపుణుడు డాక్టర్ ఖాదర్ వలీ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, సాక్షి దినపత్రిక సంపాదకులు వి.మురళి, పలువురు వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు ఉన్నారు. -
కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు
-
కాంగ్రెస్‌లోకి కొండా దంపతులు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో తమకు టికెట్ కేటాయించలేదని పార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తిన కొండా సురేఖ, మురళీ దంపతులు.. కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుం బంపై విమర్శలు చేసిన తర్వాత సాయంత్రానికి వారిద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. దీంతో అందరూ ఊహించినట్టుగానే వారు కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నట్టు స్పష్టమైంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్నారని సమాచారం. తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే పార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకుం టామని కాంగ్రెస్ వర్గాలకు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. అయితే, ఆజాద్ భేటీ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలి సింది. కొండా దంపతులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవైపు కేటీఆర్‌కు సవాల్ విసిరిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం స్వాగతిస్తున్నట్లు తెలిసింది. -
మంత్రి తమ్ముడా.. మజాకా!
మంత్రాలయం: అధికారం ఉంటే ఎలాంటి మర్యాదైనా అలా నడిచివస్తుందేమో! మంత్రి తమ్ముడి రాకతో ఇక్కడి రెవెన్యూ అధికారులు రాచమర్యాదలు చేశారు. అడుగడుగునా వంగి వంగి దండాలు పెట్టారు. అడిగిన వెంటనే స్వామి దర్శనంతో పాటు పీఠాధిపతి ఆశీర్వచనాలూ అందజేయించారు. ఆఖరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లుగానూ మారిపోయారు. మండల మేజిస్ట్రేట్ మొదలు ఇద్దరు వీఆర్వోలు ‘తమ్ముడి’ సేవలో తరించారు. ఈ దృశ్యం చూసి భక్తులంతా ముక్కున వేలేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తమ్ముడు మురళీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చారు. రెవెన్యూ అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించి.. దగ్గరుండి ‘తమ్ముడి’ సేవలో తరించారు. విడిది కోసం వసతి మొదలు పీఠాధిపతి ఆశీర్వచనం వరకు దగ్గరుండి చేయించారు. తహసీల్దార్ చంద్రశేఖర్, వీఆర్వోలు జనార్దన్‌రావు, భీమయ్య వారి సేవల్లో తరించారు. గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీరాఘవేంద్రస్వామి దర్శనం, పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల ఆశీర్వచనాలు రాచమర్యాదలతో చేయించారు. ప్రసాదాల పార్శిళ్లతో పాటు ఆశీర్వచన ఫల, పూల మంత్రాక్షింతలు, శేషవస్త్రాలను రెవెన్యూ అధికారులే మోసుకుని ప్రదక్షిణ చేశారు. శ్రీమఠంలో చివరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి వీఆర్వో జనార్దన్‌రావు ఫొటోగ్రాఫర్‌గా మారిపోయారు. మంత్రులు వస్తే ఇవ్వాల్సిన ప్రొటోకాల్ వారి తమ్ముళ్లకు సైతం లభిస్తోందంటే నిజంగా దౌర్భాగ్యమని భక్తులు వ్యాఖ్యానించారు. కార్యాలయాల్లో పనులు పక్కనపెట్టి రెవెన్యూ అధికారులు ఇలా ‘తమ్ముడి’ సేవలో తరించడం విమర్శలకు తావిస్తోంది. -
ప్రజలు మెచ్చిన పాత్రికేయుడు మురళి
సనత్‌నగర్ : పాత్రికేయులు రాసే ఏ వార్తయినా ప్రజలకు అర్థమయ్యేట్టు ఉండాలని, లేకుంటే ఉపయోగం ఉండదని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. సామాన్య ప్రజలు మెచ్చుకునేలా, ఆకట్టుకునేలా వార్తలు రాయడంలో వర్ధెల్లి మురళి పేరుప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం–2018 ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి కళా సుబ్బారావు కళావేదిక (శ్రీ త్యాగారయ గానసభ)లో కనుల పండువగా జరిగింది. రాజకీయ ఉద్దండులు, సీనియర్ పాత్రికేయుల సమక్షంలో ‘సాక్షి’ దినపత్రిక సంపాదకులు వర్ధెల్లి మురళి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక సమితి, శ్రీత్యాగరాయ గానసభ, సాధన సాహితీ స్రవంతి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోశయ్య మాట్లాడారు. సేవాతత్పరుడు, స్వాతంత్య్ర ఉద్యమకారుడు, పాత్రికేయుడు మాదల వీరభద్రరావు పురస్కారాన్ని మురళికి ప్రదానం చేయడం సముచితమన్నారు. ప్రెస్ అకాడమీ పూర్వ అధ్యక్షుడు పొత్తురి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మచ్చలేని రాజనీతికి దర్పణంగా మాదల వీరభద్రరావు నిలుస్తారన్నారు. నాగార్జున ప్రాజెక్టుపై గోపాలకృష్ణ, మాదల రాసిన వ్యాసాలు ఎవరూ రాయలేదని, వారి వ్యాసాలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రేరేపించాయన్నారు. సీనియర్ పాత్రికేయుడు వరదాచారి మాట్లాడుతూ.. ప్రస్తుతం మీడియా రంగంలో సంచలనం పెరిగిందని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అవలంబిస్తున్న విధానాలపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. మురళిని అజ్ఞాత సూరీడుగా అభివర్ణించారు. తొమ్మిదేళ్లు సంపాదకులుగా ఉండి ఎక్కడా ఆయన వేదికలను పంచుకోలేదన్నారు. సబ్ ఎడిటర్ నుంచి అనుభవాన్ని గడించి ఎడిటర్ స్థాయికి ఎదిగిన వారు తక్కువ మంది ఉంటారని, అందులో మురళి ఒకరన్నారు. ఆ రోజుల్లో ఉన్నత విలువలు గలవారి వద్ద పనిచేయడం ద్వారా మురళి నేటికీ ఆ విలువలను పాటిస్తూ పాత్రికేయ వృత్తికి వన్నె తెస్తున్నారన్నారు. మురళిది అద్భుతమైన భాష అని, ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో ఆయన చూపిన పనితీరు స్ఫూర్తిదాయకమన్నారు. మహామహులైన సంపాదకులు అందుకున్న మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం మురళి అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. మురళి జర్నలిజంలోకి ఉద్యోగం కోసం రాలేదని, సామాజిక మార్పునకు దోహదపడాలనే కాంక్షతో వచ్చారన్నారు. తెలుగు జర్నలిజంలో కొత్త ఒరవడిన సృష్టించిన మురళికి మాదల పురస్కారం దక్కడం శుభపరిణామన్నారు. చారిత్రక నవలా చక్రవర్తి, విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మాట్లాడుతూ.. మాదల వీరభద్రరావు నిరాడంబరుడని, ఖద్దరు కట్టిన జాతీయవాదిగా జీవితాంతం రాజీలేని పోరాటం చేశారన్నారు. పురస్కార గ్రహీత వర్దెల్లి మురళి మాట్లాడుతూ.. 1984లో జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నానని, తనకు ఓనమాలు నేర్పిన వారిలో వరదాచారి ఒకరన్నారు. మాదల వీరభద్రరావు పురస్కారం అంటే గౌరవాన్ని పెంచుతుందని, ఆ ఉద్దేశంతోనే తాను స్వీకరించేందుకు అంగీకరించానన్నారు. స్వాతంత్య్ర సమరంలో ప్రత్యక్షంగా పోరాటం చేసిన మాదల రెండేళ్ల పాటు అజ్ఞాతవాసం కూడా చేశారన్నారు. 1935–50 వరకు ఉద్యమం చేసి, తరువాత పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి ఆ రంగాన్ని ప్రవర్ధమానం చేశారని కొనియాడారు. జలవనరులు, నదీ జలాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ అంశాలపై ఆ రోజుల్లో సమగ్ర సమాచారంతో మాదల వ్యాసాలు రాశారన్నారు. అలాంటి సబ్జెక్టులపై ఎంతో కష్టపడితే తప్ప రాయడం సాధ్యంకాదన్నారు. నేటితరం పాత్రికేయులు ఆయన ఆశయాలను కొనసాగిం చడం ద్వారా నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. ఈ సందర్భంగా మాదల వీరభద్రరావు తనయుడు, శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక సమితి కార్యదర్శి మాదల రాజేంద్రప్రసాద్ వీరభద్రరావు అందించిన సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, గానసభ అధ్యక్షులు వీఎస్ జనార్దనమూర్తి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిష్ట్రార్ టి.గౌరీశంకర్, సాధన సాహితీ స్రవంతి అధ్యక్షులు సాధన నరసింహాచార్య, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. కాగా మాదల వీరభర్రరావు శత జయంతి సందర్భంగా సీనియర్ పాత్రికేయులు రాసిన వ్యాసాలతో ప్రత్యేక సంచిక విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. -
ఎన్సీఎల్టీ సభ్యుడిగా రాతకొండ మురళి
సాక్షి, హైదరాబాద్: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ సభ్యుడిగా రాతకొండ మురళి నియమితులయ్యారు. అంతకుముందు ఆయన ఎన్సీఎల్టీ, బెంగళూరు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మురళిని హైదరాబాద్‌కు బదిలీ చేసి, ఇక్కడ ఎన్సీఎల్టీ సభ్యుడిగా ఉన్న విత్తనాల రాజేశ్వరరావును బెంగళూరుకు బదిలీ చేస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఎన్సీఎల్టీ సభ్యుడిగా మురళి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బిసెంట్ థియోసాఫికల్ కాలేజీలో మురళి బీఏ పూర్తి చేశారు. ఆయన తాత, తండ్రి కూడా న్యాయవాదులే. ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ డిగ్రీ పొందిన మురళి.. చిత్తూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1987లో జ్యుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2015లో కర్నూలు జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేశారు. -
మంచీ చెడూ త్వరలో...
‘‘గుడ్, బ్యాడ్, అగ్లీ ఈ మూడు కోణాలు మన అందరిలోనూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తుంటాయి. ఈ మూడు అంశాల మీదే ఈ సినిమా నడుస్తు్తంది. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. కథకు సూట్ అవుతుందనే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశాం’’ అన్నారు దర్శకుడు హర్షవర్థన్. మురళీ, శ్రీముఖి, కిశోర్ ముఖ్య పాత్రల్లో రచయిత హర్షవర్థన్ దర్శకత్వంలో అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో.. ‘‘సినిమా కంప్లీట్ అయింది. ఈ నెలాఖరులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘నా గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నన్ను నేను కొత్తగా చూసుకునే అవకాశం ఈ సినిమా వల్ల వచ్చింది’’ అన్నారు శ్రీముఖి. -
ఒక పల్లవి నాలుగు చరణాలు
అమ్మాయిలని నోట్స్ అడగడం కూడా చాలా కష్టమైన రోజులు అవి. వారి కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం తప్పు. పలకరించడం నేరం. కాఫీకి పిలవాలంటే న్యూక్లియర్ ఫార్ములాను డిరైవ్ చేసినంత పని. ఇక లవ్ లెటర్... హడల్. అబ్బాయిలు వేరు... అమ్మాయిలు పూర్తిగా వేరు అనుకునే 1990ల రోజులు అవి. పొడుగు జడలు, పవిటా పావడాలు, బిఎస్ఏ ఎస్సల్లార్ ఎక్కి తల వొంచుకుని వెళ్లి చదువుకునే అలాంటి రోజుల్లో ఇవాళ అమెరికాలో జరుగుతున్నట్టుగా, ఇండియాలో ఇంకా మొదలు కాలేదు, ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో ఉంటే? వారు రూమ్‌ను షేర్ చేసుకుంటే? స్నేహాన్ని పంచుకుంటే... ఒకరిని ఒకరు గౌరవించుకునేలా ఉంటే? ఇలాంటి కథా? ఇలాంటి కథే అన్నాడు త్రివిక్రమన్. తీశాడు. ప్రేక్షకుల ముందు ఉంచాడు. జనం ఏం చేశారు? వాళ్లల్లో ఒకడు తనను తాను ఎస్.పి.బి అనుకున్నాడు. ఇంకొకడు ఇళయరాజా అనుకున్నాడు. మరొకడు కె.వి.మహదేవనో, పుహళేందో. నలుగురూ మద్రాసు చేరారు మ్యూజిక్ రంగంలో రాణిద్దామని. ఎవరూ ఆదరించలేదు. ఏవీఎం, విజయా గార్డెన్స్ గేట్లు వారి కోసం తెరుచుకోలేదు. పాట అందుకుంటే, కీర్తన ఆలపిస్తే కడుపు నిండదు. తినడానికి డబ్బులు కావాలి. వారి దగ్గర లేవు. ఆత్మాభిమానానికి ఆకలి ప్రథమ శత్రువు. వాళ్లు నలుగురు స్ట్రీట్ సింగర్స్‌గా మారారు. చెట్టు కింద, పేవ్మెంట్ మీద, బీచ్‌లో, బస్టాండ్ సమీపంలో గుడ్డ పరిచి పాట మొదలుపెట్టారు. రోజూ నాలుగు చోట్ల కచ్చేరీలు. దారిన పోయేవాళ్లు ఆగి కాసేపు విని చిల్లర పడేస్తే ఆ పూటకు భోజనం. లేకుంటే లేదు. వాళ్లు బతకడమే కష్టం అనుకుంటే ఇంకో పొట్ట కూడా తోడు చేరింది. అమ్మాయి. ఇప్పుడేమవుతుంది? మద్రాసులో ఏదో అడ్రస్ కోసం వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఊరు విడిచి వచ్చింది. ఆ అడ్రస్‌లో ఆమెకు కావలిసినవారు లేరు. వీళ్లు కనిపించారు. ఆ అమ్మాయి వీరి వెంట నడిచింది. వయసులో ఉన్న కుర్రాళ్లందరూ గోడలు దూకేవాళ్లే అయి ఉండరు. కొందరు ఆశ్రయం కోరేవారికి పైకప్పుగా కూడా నిలబడగలుగుతారు. ఆ అమ్మాయి కష్టంలో ఉందని ఆ నలుగురు గ్రహించారు. తమ గదిలోనే చోటు ఇచ్చారు. వీధి ఆశ్చర్యపోయింది. హౌస్ ఓనరమ్మ ముక్కున వేలేసుకుంది. కాని మన ప్రవర్తనే మనకు సర్టిఫికెట్ ఇస్తుంది. త్వరలోనే వారిని ఆ వాడ యాక్సెప్ట్ చేసింది. డాబా మీద గది. రోజూ కనిపించే చందమామ. పిసినారితనం చూపకుండా హాయిగా వీచే చల్లగాలి. కొద్దిగా తిన్నా కడుపు నింపగల అన్నం. చేయగలిగిన కూర. బోలెడన్ని కబుర్లు. శ్వాస అంత సులభంగా తోడుగా ఉండే పాట. పాటలలోన జీవితమే పలికేను అంట.. మాటలలో చందనమే వెదజల్లేనంట... ఒక పల్లవికి నాలుగు చరణాలు తోడయ్యాయి. వాళ్లు జీవితంలో పైకి రావాలంటే వీధుల వెంట పాడటం మాని మంచి అవకాశాల కోసం ప్రయత్నించాలి అని ఆ అమ్మాయి వారికి చెబుతుంది. దాని కోసం జరిగే కాంపిటీషన్లో పాల్గొనడానికి ఏరోజుకారోజు డబ్బు కూడబెట్టేలా చేస్తుంది. ఈ లోపు ఆమె గతం కూడా వారికి చెబుతుంది. ఆమె ప్రేమించినవాడు దేశంలో లేడు. రేపో మాపో వస్తాడు... వస్తే అతడిని పెళ్లి చేసుకోవాలి... అందుకోసమే ఎదురు చూస్తోంది... ఆ విషయం తెలిసి వాళ్లు నలుగురు సంతోషపడతారు. అందరూ ఆ రాబోయేవాడి కోసం ఎదరు చూస్తూ ఉంటారు. కాని వచ్చేవాడు ఫల్గుణుడు కాదు. ఫాల్తు వెధవ. కుసంస్కారి. ఆడపిల్లకు వ్యక్తిత్వం ఉందని లోకం అంగీకరించదు. మగవాళ్లు స్నేహానికి, వ్యక్తిత్వానికి విలువ ఇస్తారన్నా లోకం నమ్మదు. ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో సంవత్సరం పాటు ఉంటున్నారంటే వాళ్ల మధ్య ఏమీ ఉండకుండా ఉంటుందా? కథ చూస్తున్న ప్రేక్షకులకు వారి మధ్య ఏమీ లేదని తెలుస్తూ ఉంటుంది. కాని పాత్రధారి అయిన ఆ అమ్మాయి ప్రియుడికి మాత్రం తెలియదు. అతడు తెలివి మీరుతాడు. ఏకంగా ఆ అమ్మాయిని తీసుకెళ్లి కన్యత్వ పరీక్ష చేయిస్తాడు. అమ్మాయి హర్ట్ అవుతుంది. ఎందుకు చేయించావ్ అని అడిగితే పావలా రీఫిల్ కొనేటప్పుడు కూడా నాలుగుసార్లు రాసి చూసి కొంటాము... జీవితాంతం చూసుకోవాల్సిన వ్యక్తి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటాడు. సీతకు కూడా అగ్నిపరీక్ష ఉందని అంటాడు. ‘సీత చెడిపోవాలనుకుంటే అయోధ్యలోనే చెడిపోయి ఉండవచ్చు. అశోకవనంలోనే కాదు’ అంటుంది ఆ అమ్మాయి. ‘ఎవరైతే నన్ను నమ్మాలో నువ్వు నన్ను నమ్మలేదు. ఎవరినైతే నేను అనుమానంగా చూడాలో వారు నన్ను నమ్మారు. ఇక నీకూ నాకూ పడదు. గుడ్‌బై’ అని ఆ అమ్మాయి అతణ్ణి వదిలి తను ఇష్టపడే, గౌరవించే నలుగురు స్నేహితుల దగ్గరకు వచ్చేస్తుంది. వాళ్ల ట్రూప్‌లో సభ్యురాలిగా ఉండిపోతుంది. ఆ ఐదుగురు కలిసి ఇప్పుడొక స్నేహగీతం అయ్యారు. దానిని సరిగా వినగలిగే సంస్కారం ఉన్నవాళ్లే వాళ్లకు తోడవుతారు. లేకుంటే? వాళ్ల దారిలో వారలా సాగిపోతూనే ఉంటారు. అమ్మాయి అబ్బాయి అనగానే ప్రేమ, కామం అని స్థిరపడిన లోకానికి వారి మధ్య స్నేహం కూడా సాధ్యమే అని చాలా తర్కబద్ధంగా, సంస్కారవంతంగా నిరూపించిన కథ కొద్దిగా అయినా ప్రేక్షకులను మారుస్తుంది. ఈ సినిమా అవసరం ఆ కాలం కంటే ఈ కాలం ఎక్కువగా ఉంది. ప్రేమ కోసం కత్తిపట్టుకునే వాళ్లంతా ఈ సినిమా డీవీడీ పట్టుకుంటే ఎంత బాగుండు? పుదు వసంతం దర్శకుడు విక్రమన్ తన తొలి సినిమాగా ప్రేక్షకుల మీదకు సంధించిన ఈ కొత్త తరహా కథ ‘పుదు వసంతం’గా 1990లో విడుదలయ్యి తమిళంలో సినిమా కథా ధోరణినే మార్చేసింది. పాడే హీరోలు, స్నేహం చేసే హీరోలు, నలుగురు కుర్రాళ్ల కథలు... ఇలాంటివి భారతీయ భాషలలో పుంఖాను పుంఖాలుగా రావడానికి ఈ సినిమా బీజం వేసింది. తమిళ నటుడు మురళి, ఆనంద్ బాబు, సితార వీళ్లంతా ఈ సినిమాతో చాలా పేరు సంపాదించుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఏ.రాజ్ కుమార్ ఈ సినిమా పాటలతో ఇళయరాజా ధాటికి తట్టుకుని నిలబడగలిగాడు. ‘స్త్రీని పరీక్షించే పురుష స్వభావాన్ని’ ప్రశ్నించినందుకే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్పాలి. ప్రఖ్యాత దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశారు. దీని ప్రభావంతో చిరంజీవి, సాక్షి శివానంద్లతో ‘ఇద్దరు మిత్రులు’ తీశారుకాని సఫలం కాలేదు. అలాగే తరుణ్ హీరోగా ఇదే ధోరణిలో 2002లో ఒక ‘నవ వసంతం’ వచ్చింది. సూపర్‌గుడ్ ఫిలిమ్స్ చౌదరి, విక్రమన్ కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమాలలో ‘శుభాకాంక్షలు’, ‘రాజా’, ‘మా అన్నయ్య’, ‘సూర్యవంశం’ తదితర భారీ హిట్స్ ఉన్నాయి. తమిళంలో విక్రమన్ది ఒక శకం. – కె -
‘మురళి ఆత్మహత్యపై అనుమానాలున్నాయ్’
హైదరాబాద్ : ఓయూ విద్యార్థి మురళి ముదిరాజ్ ఆత్మహత్య వెనక అనుమానాలున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిథి అద్దంకి దయాకర్ తెలిపారు. గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..ఈ ఘటనపై సర్కార్ సిట్టింగ్ జడ్జితో గానీ, రిటైర్డ్ జడ్జితో కానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఓయూకు రెండు మూడు కంపెనీల పోలీస్ లు ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసులను ఓయూకు పంపడం వెనక సర్కార్ కుట్ర దాగివుందని ఆరోపించారు. బాహుబలిలోని త్రిశూల వ్యూహం లెక్క పోలీసులను క్యాంపస్ లోకి పంపించారని వెల్లడించారు. తాము ఓయూలో ఎలాంటి గొడవ చేయలేదని, తామే గదిలోకి వెళ్లి గడి పెట్టుకుని స్వచ్ఛంద నిర్బంధం చేసుకున్నామని తెలిపారు. కేవలం మురళి కుటుంబానికి న్యాయం చేయమని, ఆర్థిక సాయం చేయమని మాత్రమే కోరామని తెలిపారు. డిసెంబర్ 3న శ్రీకాంత చారి సూసైడ్ చేసుకున్నాడు, అదేరోజు మురళి సూసైడ్ చేసుకున్నాడని వివరించారు. ఈ పాలన రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ పాలన లెక్క అన్పిస్తుందని చెప్పారు. జైల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయాలని, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్థులు మరో మిలిటెంట్ ఉద్యమానికి సిద్ధం కావాలని మరో నేత దరువు ఎల్లన్న పిలువునిచ్చారు. -
ఓయూలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవటంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మురళి ఆత్మహత్యపై గత రాత్రి నుంచి యూనివర్సిటీ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం విద్యార్థులు మరోసారి ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేట్టారు. మురళి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ర్యాలీ చేపట్టగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. తోపులాట జరిగింది. విద్యార్థులు రాళ్లు రువ్వటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఇక ఇప్పటిదాకా కవ్వింపు చర్యలకు పాల్పడిన 34 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ ప్రకటించారు. నేతలు క్యాంపస్‌లోకి రావటం వల్లే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆయన అంటున్నారు. ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానంటూ మురళి ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోగా.. విద్యార్థి సంఘాలు మాత్రం ఉద్యోగాల నోటిఫికేషన్లు రావటం లేదని తీవ్ర ఒత్తిడికిలో ఉన్న మురళీ మనస్తాపానికి లోనై బలవన్మరణం చెందాడని చెబుతున్నాయి. -
బెడిసికొట్టిన కిడ్నాప్ వ్యూహం
ఇద్దరు బాలుర అపహరణకు యత్నం.. ఒక నిందితుడి పట్టివేత జడ్చర్ల: ఇద్దరు బాలురను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ముగ్గురు ముఠా సభ్యుల్లో ఒకరు పట్టుబడ్డారు. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. జడ్చర్ల పట్టణం ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న వడ్డె వెంకటేశ్, కవిత దంపతులకు మురళి (14), అభి (11) కుమారులు ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం వెంకటేశ్ హత్యకు గురికాగా.. పిల్లలను సాకలేక ఆరేళ్ల క్రితం పరిచయం ఉన్న ఓ వ్యక్తికి కుమారుడు మురళిని తల్లి కవిత అప్పగించింది. దీంతో సదరు వ్యక్తి మురళిని కర్ణాటకకి తీసుకెళ్లి దొంగతనాలు చేయించేవాడు. ఆ తర్వాత చిన్న కుమారుడు అభిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఐదేళ్ల క్రితం కిడ్నాప్ చేసి అన్న మురళి దగ్గరకు చేర్చారు. అక్కడ వీరితో పాటు మరో బాలుడు కలసి రోజూ దొంగతనాలు చేస్తూ ముఠాసభ్యులకు అప్పగించేవారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం బాలుర తల్లి కవిత అనారోగ్యంతో మృతి చెందింది. 20 రోజుల క్రితం ఎలాగోలా అన్నదమ్ములు ముఠా నుంచి తప్పించుకుని రైలులో జడ్చర్లకు వచ్చారు. అయితే ముఠాకు చెందిన వెంకటేశ్, చంటిలు పిల్లలను వెతుక్కుంటూ జడ్చర్లకు వచ్చారు. తమకు పరిచయం ఉన్న శరణప్పను మధ్యవర్తిగా పెట్టుకుని పిల్లలను అప్పగించాలని కోరారు. అలా చేస్తే రూ.40 వేలు ఇస్తామని చెప్పారు. ఈ విషయం పిల్లల చిన్నాన్న మల్లేశ్‌కు తెలియగా ఆయన స్థానికుల సహకారంతో వారిని పట్టుకునే ప్రయ త్నం చేయగా వెంకటేశ్, చంటి పారిపోగా శరణప్ప దొరికాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హింసించి దొంగతనాలు చేయించేవారు కర్ణాటక బీజాపూర్‌లో తమను తీవ్రంగా హింసిస్తూ దొంగతనాలు చేయించే వారని బాలురు మురళి, అభి పోలీసులకు వివరించారు. పట్టుబడిన శరణప్ప రాయిచూర్ జిల్లా మాన్వీ తాలుకా హీరే కొట్నెకల్కి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. ఇక పారిపోయిన వెంకటేశ్, చంటి రంగారెడ్డి జిల్లా శంకరపల్లికి చెందినవారుగా గుర్తించారు. -
పెళ్లి సింపుల్‌గా.. షష్టిపూర్తి ఘనంగా...
నటుడు, రచయిత హర్షవర్ధన్ తొలిసారి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మురళి, శ్రీముఖి, కిశోర్, అజయ్ గోష్, హర్షవర్ధన్ ముఖ్య తారలుగా అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్.కె. విశ్వేష్‌బాబు సమర్పణలో అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ– ‘‘పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. కానీ, షష్టిపూర్తి కార్యక్రమాలు అలా జరగడం లేదు. పెళ్లి సైలెంట్‌గా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలనే ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. సినిమాలో ఏకైక లేడీ పాత్రను శ్రీముఖి చేశారు. 1988–89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో పాటు పక్కా కమర్షియల్ అంశాలూ ఉంటాయి. సంగీత దర్శకుడు కావాలనే నేను హైదరాబాద్ వచ్చా. అందుకే ఈ చిత్రానికి సంగీతం అందించా’’ అన్నారు. శ్రీముఖి, విశ్వేష్, కిశోర్, మురళి, సంతోష్, సురేష్, శ్రీధర్, కమల్, టిఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులుండీ...నిర్లక్ష్యం
– ఎంపీ నిధుల వినియోగంలోరాష్ట్రంలోనే చివరి స్థానం - రూ.17 కోట్లున్నా పట్టించుకోని వైనం - అంత నిర్లక్ష్యమేమిటంటూ ప్రజల ఆగ్రహం - పట్టించుకోని ఎంపీ మురళీ మోహన్ నిధులు ఉన్నాయి...ప్రతి ఏటా ఆ నిధులకు అదనంగా జతై రెట్టింపవుతున్నాయి. గత మూడేళ్లుగా రెండు పదుల కోట్లకు చేరుకున్నాయి. పాత నిధులను కూడా వీటితో కలిపి అభివృద్ధి పనులకు వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. బాధ్యత ఉన్న ఏ ప్రజా ప్రతినిధి అయినా ఏం చేస్తారు ... కనీసం తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రాంతంలోనైనా వెచ్చించి ప్రగతి పూవులు పూయిస్తారు. కానీ ఏడు శాసన సభా నియోజకవర్గాల పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మురళీ మోహన్ మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా ఎంపీ నిధుల కోటా కింద ఏటా రూ.5 కోట్లు చొప్పున గత మూడేళ్లలో రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందనంగా వచ్చి చేరాయి. ఈ లెక్కన మొత్తంగా రూ. 17.15 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది. ఇన్ని నిధులు తన ఖాతాలో మూలుగుతున్నా తనకు పట్టనట్టు వ్యవహరించారు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ. 2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో బొమ్మూరు గ్రామంలో మహిళలు ఆర్థికంగా సాధికారిత సాధించాలన్న ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) ఇది. ఇప్పటి వరకు ఇక్కడ వేలాది మంది మహిళలు శిక్షణ పొంది ఆర్థికంగా స్థిరపడ్డారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణం భవనం శిధిలావస్థకు చేరింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మూరు గ్రామం వచ్చినప్పుడు భవన సమస్యను అధికారులు వివరించారు. జిల్లా కలెక్టరు నుంచి ప్రజాప్రతినిధులందరికీ విన్నవించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ.50 లక్షలతో మరమ్మతులు చేస్తే సరిపోతుందని అంచనా కూడా వేశారు. కానీ రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు ఇదేమీ పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి సమస్యలు అనేకం వెంటాడుతున్నాయి. కానీ వాటిపై ఎంపీ దృష్టి పడటం లేదు. తనకొచ్చిన ఎంపీ నిధులు మురగడం తప్ప ఉపయోగం లేకుండాపోతోంది. సహ ఎంపీలు పోటీపడి ఖర్చు పెడుతున్నా ఈయనకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా ఉండడం లేదు. అంతేలే...చుట్టం చూపుకని నియోజకవర్గానికొచ్చే ఎంపీకి సమస్యలు ఎలా పడతాయని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తనకొచ్చిన నిధులను ఏదో ఓ రోజు తనకో, అనుయాయులకో లబ్థి చేకూరేలా ఖర్చు పెట్టేద్దామనుకుంటున్నారేమో గానీ మూడేళ్లగా వచ్చిన నిధుల జోలికి మాత్రం ఆయన పోవడం లేదు. నిధులు విడుదల ఇలా... ఎంపీ మురళీమోహన్‌కు ఏటా రూ.5 కోట్లు చొప్పున మూడేళ్లపాటు రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ లెక్కన మొత్తంగా రూ.17.15 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది. కానీ మురళీమోహన్‌కు చిత్తశుద్ధే లేదు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ.2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఇలా వినియోగించుకోవచ్చు... ఈ నిధులతో తాగునీటికి, రోడ్లకు, భవనాలకు, కల్వర్టులకు, విద్యకు, విద్యుత్ సౌకర్యానికి, కుటుంబ ఆరోగ్యానికి, ఇరిగేషన్‌కు, సంప్రప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి, రైల్వే రోడ్లు, రైల్వే వంతెనలకు, శానిటేషన్‌కు, క్రీడలకు, మత్స్యసంపద అభివృద్ధికి, వ్యవసాయానికి హేండ్లూమ్స్కు, పట్టణాభివృద్ధికి ఇలా ... ఎన్నింటికో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ విభాగాలకు సంబంధించిన ఏ ఒక్క సమస్య మురళీ మోహన్‌కు పట్టకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. నిధులుండీ నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అంతర్జాతీయ ఖ్యాతికి కృషి
- డిసెంబరు నాటికి ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు - త్వరలో పెద్ద విమానాల సేవలు - ఎయిర్‌పోర్టు అడ్వయిజరీ కమిటీ చైర్మెన్, ఎంపీ మాగంటి మురళీ మోహన్ వెల్లడి మధురపూడి : రాజమహేంద్రవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు ఎడ్వయిజరీ కమిటీ చైర్మెన్, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్ వెల్లడించారు. ఆయన అధ్యక్షతన శుక్రవారం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనంలో ఎడ్వయిజరీ కమిటీ (సలహా సంఘం) సమావేశం జరిగింది. దీనిలో ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి, మధురపూడి గ్రామంలో సర్వీసు రోడ్లు, పామాయిల్ తోటలిచ్చిన రైతులకు పరిహారం అందజేత, అభివృద్ధి, ప్రయాణికులకు సేవలు విస్తృతం, సౌకర్యాలు పెంపు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ 1,749 మీటర్లున్న రన్ వేను 3,165 మీటర్లకు విస్తరించినట్టు పేర్కొన్నారు. అలాగే ఒకేసారి 4 పెద్ద విమానాలు, 8 హెలీకాఫ్టర్లను పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఏఫ్రాన్ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పంటలు, పండ్లు, పూలను విదేశీ, స్వదేశాలకు పంపడానికి కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎమ్.రాజ కిశోర్ మాట్లాడుతూ కార్గో విమాన సర్వీసులతో రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. ఎంపీ మురళీ మోహన్ చైర్మన్‌గా ఉన్న కమిటీకి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కో–చైర్మన్‌గా, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. అయితే శుక్రవారం జరిగిన సమావేశానికి కలెక్టర్ మిశ్రా, ఎస్పీ రాజకుమార్‌లు హాజరు కాలేదు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం ఇన్చార్జి సబ్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామ రాజు, ఎయిర్‌పోర్టు అధికారులు పాల్గొన్నారు. ముగ్గురు సభ్యులు నియామకం ఎయిర్‌పోర్టు ఎడ్వయిజరీ కమిటీ సభ్యులుగా ముగ్గురు నియమితులయ్యారు. రాజమహేంద్రవరానికి చెందిన కాశీ నవీన్‌కుమార్, రాజానగరానికి చెందిన మోది సత్తిబాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అవంతి సీడ్స్ వ్యాపారవేత్త అల్లూరి ఇంద్ర కుమార్ రాజు నియమితులయ్యారు. -
బాలమురళి పేరిట సంగీత కళాశాల
శంకరగుప్తం గ్రామంలో ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం –‘మంగళంపల్లి’ 87వ జయంత్యుత్సవంలో ఆస్థానశిల్పి రాజకుమార్ ఉడయార్ రాజమహేంద్రవరం కల్చరల్ : సంగీత సామ్రాజ్య సార్వభౌమ, పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట ఆయన స్వగ్రామం శంకరగుప్తం గ్రామంలో సంగీత కళాశాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్రప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజకుమార్ వడయార్ ప్రకటించారు. గురువారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతసభ ఆధ్వర్యంలో విక్రమ్హాల్లో జరిగిన మంగళంపల్లి 87వ జయంత్యుత్సవ కార్యక్రమంలో ఆయన తాను రూపొందించిన బాలమురళి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగరంలో గోదావరి గట్టుపై, ఏవీ అప్పారావు రోడ్డులోని శారదానగర్‌లో ఉన్న బాలమురళీకృష్ణ పార్కులో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తానన్నారు. సభకు అధ్యక్షత వహించిన భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ మహామనిషి బాలమురళి మన మధ్యలో లేకున్నా ఆయన స్వరం మన జీవితాలను పండిస్తూనే ఉంటుందన్నారు. పిల్లలకు బాలమురళి కీర్తనల పోటీలు నిర్వహించాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిత్యవిద్యార్థి డాక్టర్ కర్రిరామారెడ్డిని ‘పుంరూప శారద’ బిరుదుతో సంగీతసభ తరఫున డాక్టర్ టి.వి.నారాయణరావు సత్కరించారు. కర్రి రామారెడ్డి మాట్లాడుతూ ఎన్నో డిగ్రీలు తీసుకున్న తాను ఈ సారి సంగీతంలో సర్టిఫికెట్ కోర్సు చేస్తున్నానని వెల్లడించారు. కొన్ని శాస్త్రీయ రాగాలు వినడం వలన మధుమేహ లక్షణాలు తగుగ్తాయని, గర్భిణులు మంచి సంగీతాన్ని వింటే, పుట్టిన బిడ్డలకు మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందన్నారు. అనంతరం విజయనగరం సంగీత కళాశాల అధ్యాపకుడు బి.ఏ.నారాయణను ‘మురళీమనోజ్ఞ సంగీత రత్నాకర’ బిరుదుతో నిర్వాహకులు సత్కరించారు. బీఏ నారాయణ గాత్రకచేరీ శ్రోతలను అలరించింది. పాత్రికేయుడు వీఎస్ఎస్ కృష్ణకుమార్ స్వాగత వచనాలు పలికారు. సంగీతసభ వ్యవస్థాపకుడు సాగి శ్రీరామచంద్రమూర్తి, వి.శేషగిరి వరప్రసాద్, వాడ్రేవు మల్లపరాజు, సంగీతాభిమానులు తదితరులు హాజరయ్యారు. -
‘మరణించి’ బతికాడు!
- 16 రోజుల అనంతరం కనిపించిన యువకుడు - నెల్లూరు జిల్లాలో వింత సంఘటన వెంకటగిరి: గుర్తు తెలియని మృతదేహం తమ వాడిదేనని ఒక కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి 16 రోజుల తరువాత అంతులేని ఆనందం లభించింది. మృతి చెందాడనుకున్న వ్యక్తి కనిపించాడు. తమ వాడు బతికే ఉన్నాడని తెలుసుకుని శనివారం రాత్రి అతడిని ఇంటికి తీసుకొచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పొక్కందల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు.. పొక్కందల గ్రామంలో పుల్లయ్య, పద్మమ్మ దంపతుల చిన్నకుమారుడు మురళి(29) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మురళికి భార్య మాధవి, ఏడాది వయసున్న పాప ఉన్నారు. నెల రోజుల కిందట విధుల కోసం ఇంటి నుంచి వెళ్లిన మురళి తర్వాత ఆచూకీ లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో గత నెల 25న సైదాపురం అటవీ ప్రాంతంలోని పల్లెమిట్ట గని గుంతలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఈ విషయం తెలిసిన మురళి కుటుంబసభ్యులు వెళ్లి మృతదేహాన్ని చూశారు. మురళి శరీరంపై ఉన్న గుర్తులు మృతదేహంపై ఉన్న ఆనవాళ్లతో సరిపోలడంతో వారు హతాశులయ్యారు. మృతుడి తల కింద, పొత్తి కడుపులో ఆపరేషన్లు అయినట్లు పోస్టుమార్టంలో వైద్యులు గుర్తించారు. మురళికి ఆ భాగాల్లోనే కొన్ని ఆపరేషన్లు జరిగాయని పుల్లయ్య పోలీసులకు తెలిపారు. దీంతో ఆ మృతదేహం మురళిదే అని అందరూ నిర్ధారణకు వచ్చి గత నెల 26న అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తిచేశారు. ఆచూకీ లభ్యం ఇలా: మండల కేంద్రమైన రాపూరుకు శనివారం శీతలపానీయాల లోడు లారీ వచ్చింది. ఆ లారీలో మురళి ఉండటాన్ని అతడి బంధువులు గమనించారు. వెంటనే వారు ఫొటో తీసి కుటుంబసభ్యులకు చేరవేశారు. కుటుంబసభ్యులు రాపూరు వెళ్లేసరికి ఆ లారీ చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో ఉన్న శీతలపానీయాల గోదాము వద్దకు వెళ్లింది. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి మురళిని కలుసుకున్నారు. రాత్రి ఇంటికి తీసుకుని వచ్చారు. మరోవైపు పల్లెమిట్ట గని గుంతలో లభించిన మృతదేహం ఎవరిదో తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. -
మడమల్లో నొప్పి... తగ్గేదెలా?
నా వయసు 42 ఏళ్లు. పొద్దున లేవగానే నడుస్తుంటే మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొనే నడవాల్సి వస్తోంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. హోమియో పరిష్కారం చెప్పండి. – సుధారాణి, కాకినాడ అరికాలిలో ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి, మడమ నొప్పి, వాపు కనిపిస్తాయి. ఉదయం పూట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి వస్తుంది. ఇలా ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది. కారణాలు: ∙డయాబెటిస్ ∙ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడం ∙తక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ∙ఎక్కువగా హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో). లక్షణాలు: ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ∙ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం ∙కండరాల నొప్పులు చికిత్స: మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. – డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
అర్ధరాత్రి బైక్‌పై కలెక్టర్ పర్యటన
భూపాలపల్లి: కలెక్టర్ మురళి జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2.30 గంటల వరకు భూపాలపల్లి నగర పంచాయతీలోని హనుమాన్‌నగర్, శాంతినగర్, ఎస్సీకాలనీ, సుభాష్‌కాలనీ, జంగేడు, సెగ్గెంపల్లి, గడ్డిగానిపల్లి, కాశీంపల్లి, కారల్‌మార్క్స్‌కాలనీ, అంబేద్కర్ చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై తిరిగారు. ఆయా వార్డులలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలను పరిశీలించారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పట్టణంలో వివిధ దుకాణాలు రాత్రి ఎప్పటి వరకు తెరిచి ఉంటాయని, గుడుంబా తయారీ, రవాణా జరిగే సమాచారం గురించి ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
పెనుకొండ/ హిందూపురం రూరల్ : జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు విద్యార్థి కాగా.. మరొకరు కర్ణాటకకు చెందిన యువకుడు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. రొద్దం మండలం తురకలాపట్నానికి చెందిన బోయ దినేష్ (17) జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మహేష్ అనే కెమిస్ట్రీ లెక్చరర్ తనకు ఎంతగానో ఆప్తుడైన విద్యార్థి దినేష్‌తో కలిసి పాతచెక్‌పోస్టు సమీపంలో గల ఓ హోటల్‌కు ద్విచక్రవాహనంలో వెళ్లారు. భోజనం ముగించుకుని కళాశాల వద్దకు బయలు దేరగా రోడ్డుపైకి చేరుకునే సమయంలో అనంతపురం నుంచి పెనుకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో దినేష్ తీవ్రంగా గాయపడగా.. మహేష్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మహేష్‌ను పెనుకొండ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లిదండ్రులు తిమ్మయ్య, శారద, ఇతర బంధువుల రోదనలు ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఆస్పత్రికి వచ్చి దినేష్‌ను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్ఐ లింగణ్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. హిందూపురం రూరల్ మండలం కిరికెర సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకలోని గౌరిబిదనూరు తాలుకా బసవపురం గ్రామానికి చెందిన మురళి (32) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో శ్రీనివాసులు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని హిందూపురంలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ నారాయణ శుక్రవారం తెలిపారు. -
సెన్సార్ బోర్డ్ తీరు బాధాకరం
‘‘యువతరాన్ని మేల్కొలిపేలా.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ క్లీన్ ఎంటర్టైనర్గా ‘శరణం గచ్ఛామి‘ సినిమా తీశాం. అయితే, సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. వారి తీరు ఆవేదనను కలిగిస్తోంది’’ అన్నారు చిత్ర దర్శక– నిర్మాతలు ప్రేమ్‌రాజ్, బొమ్మకు మురళి. నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటించిన చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అశ్లీలం, హింసను ప్రేరేపిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న సినిమాలకు ‘క్లీన్ సర్టిఫికెట్స్’ జారీ చేసే సెన్సార్ బోర్డ్ సభ్యులు, క్లీన్‌గా తెరకెక్కిన మా చిత్రానికి ఎందుకు ఇవ్వడం లేదో తెలియడంలేదు. సరైన కారణాలు చూపకుండా రివైజింగ్ కమిటీకి వెళ్లమనడం బాధాకరం. సెన్సార్ బోర్డ్ పక్షపాత ధోరణి, ఒంటెత్తు పోకడలను ప్రజల ముందుకు తీసుకువెళతాం’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు. -
మబ్బు కమ్మిన మాట
మబ్బొస్తే ఉరుమొస్తుందికానీ, ఈ మాట మబ్బు వేస్తే ఎందుకు మూగబోయింది?మనసుకున్న పొరలు మాటను కూడా కమ్మేస్తాయి.ఆ పొరలు విడిపోతేనే మాట మెరుపవుతుంది. ‘‘మీ వారికి మేం రావడం ఇష్టం లేనట్టుంది’’ పూర్ణ మాటలు చెవుల్లో గింగరుమంటున్నాయి స్వర్ణకు. పాప కీర్తన బర్త్‌డే పార్టీకి అన్ని ఏర్పాల్లు చేసింది స్వర్ణ. తన ఆఫీసు ఫ్రెండ్స్‌ని పిలిచింది. వచ్చినవారు సరిగ్గా భోజనాలు కూడా చేయకుండా వెళ్లిపోయారు. దీనికంతటికీ భర్త మురళి కారణమయ్యాడన్నది స్వర్ణ బాధ. మూగబోతోన్న మాట కొన్నాళ్లుగా మురళి ప్రవర్తన విసుగ్గా ఉంటోంది స్వర్ణకు. తమ పెళ్లై ఐదేళ్లవుతోంది. మురళి బంధువులబ్బాయే. ‘ఐటీ కంపెనీలో జాబ్, మంచి ప్రవర్తన గలవాడు’ అంటూ ఏరికోరి ఈ సంబంధం చేశారు తల్లిదండ్రి. తనకూ అన్నీ అనువుగానే అనిపించాయి. పెళ్లై మూడునెలలైనా సరిగా మాట్లాడింది లేదు. తనే చొరవ తీసుకొని మాటలు కలిపింది. గంటల గంటలు కూర్చొని కబుర్లు చెప్పేది. కానీ, మురళి ఏ విషయమైనా పొడి పొడిగా మాట్లాడేవాడు. అతనిలో ఆ కాస్త మార్పు తేవడానికి చాలానే కష్టపడింది. ఏడాది తిరక్కుండానే ఇంట్లోనే ఉండి వర్క్స్ చేస్తానని ఉద్యోగం మానేశాడు. జాబ్ చూసుకోమంటే ‘ఇంట్లో ఉండే సంపాదిస్తున్నాను’ కదా అంటాడు. ఏ చిన్న వస్తువైనా తనే బయటకె ళ్ళాలి. తను గర్భవతిగా ఉన్నప్పుడు హాస్పిటల్‌కి రమ్మన్నా వచ్చేవాడు కాదు. నెలల బిడ్డప్పటి నుంచీ పాప కేం కావాలన్నా బయట నుంచి తనే తెచ్చుకునేది. పాపకు ఆరోగ్యం బాగోలేకపోయినా తనే ఎవరో ఒకరి సాయం తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే తప్ప మురళి రాడు. పాపను స్కూల్లో వేయడానికి రమ్మని అడిగితే ‘‘అదేదో నువ్వే వెళ్లి చూడు..’’ అని సమాధామిచ్చాడు. అడిగి అడిగి విసుగొచ్చి తనే స్కూల్ పనులు కూడా పూర్తి చేసింది. ఇంటా బయట పనులన్నీ తనే చూసుకుంటోంది. ఆ తర్వా త్తర్వాత అడగడమే మానేసింది. విసిగిపోయి తనే ఓ ఉద్యో గం చూసుకుంది. పాపకు మూడో ఏడు. బర్త్‌డే పార్టీ చేద్దామంటే మురళి వినిపించుకోడు. ‘ఎందుకు, డబ్బులు దండగ’అనేవాడు. ఇప్పుడు తను సంపాదిస్తోంది. డబ్బుకు ఇబ్బంది లేదు. మురళి వద్దని చెప్పినా పాప బర్త్ డేకి తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచింది స్వర్ణ. అంతా ఇంటికి వచ్చారు. మురళి చాలాసేపటి వరకు రూమ్‌లో నుంచి బయటకే రాలేదు. బలవంతపెడితే తప్పదన్నట్టుగా వచ్చాడు. తన స్నేహితులందరినీ పరిచయం చేసింది. ముభావంగా, కొద్దిసేపు అతి కష్టంగా ఉన్నాడు. తర్వాత పని ఉందంటూ లోపలికెళ్లిపోయాడు. పార్టీ పూర్తయ్యేంతవరకు బయటకే రాలేదు. ‘‘మీ వారికి మేం రావడం ఇష్టం లేనట్టుంది’’ అంది స్నేహితురాలు పూర్ణ. ‘నిజమే!’ అన్నారు మిగతా అందరూ. ‘ఆయనకు ఒంట్లో బాగోలేద’ని అబద్ధం చెప్పిం ది వారితో. భర్త మీద విపరీతమైన కోపం వచ్చింది స్వర్ణకు. ‘‘ఇంటికి వచ్చినవారితో ఇలాగేనా ప్రవర్తించేది. మీరు అసలే లేకపోతే పిల్లకు తండ్రి లేడని ఎలాగోలా సర్దిచెప్పు కునేదాన్ని. మీ ప్రవర్తన వల్ల మేం ఎటూ కాకుండా పోతున్నాం.. ఈ రూమ్‌లోనే పడి చావండి’’ అంటూ తన బాధనంతా కోపంగా చూపించి అక్కణ్ణుంచి వెళ్లిపోయింది. మాటలేదు.. ఉత్తరం ఉంది.. ‘‘వరుణ్... బావగారిని ఆసుపత్రిలో చేర్చాం రా! నాకు భయంగా ఉంది’’ ఫోన్లోనే ఏడుస్తూ చెప్పింది స్వర్ణ తమ్ముడు వరుణ్‌తో. ఆఘమేఘాలమీద వచ్చాడు వరుణ్. రాత్రి మురళి నిద్రమాత్రలు మింగాడట. ఇరుగుపొరుగు సాయంతో హాస్పిటల్లో చేర్చానని చెప్పింది స్వర్ణ. మురళి రాశాడంటూ ఏడుస్తూనే ఓ ఉత్తరాన్ని తీసుకొచ్చి వరుణ్ చేతికిచ్చింది. ‘‘స్వర్ణా.. నన్ను క్షమించు. నా బాధ్యతలేవీ నిర్వర్తించలేకపోతున్నాను. కొత్తవారితో మాట్లాడాలంటే నాకు మాట పెగలదు. ఏదో భయంగా, గుండె దడగా ఉంటుంది. నత్తి వస్తుంది. చెమటలు పట్టేస్తాయి. ఈ భయం వల్లే ఉద్యోగానికి వెళ్లలేకపోయాను. బంధువుల అమ్మాయే అని నాకు నచ్చజెప్పి నీతో పెళ్లి జరిపించారు అమ్మానాన్న. నీతో సర్దుకుపోవడానికే నాకు కొన్నాళ్లు పట్టింది. ఉద్యోగం మానేశాక నలుగురిలో కలవడమే మర్చిపోయాను. పార్టీకి వచ్చినవారితో అలాగే మాట్లాడలేకపోయాను. నేను నత్తి నత్తిగా మాట్లాడితే ఏదో లోపం ఉందనుకుంటారు. అది నీకు అవమానం అని భయపడ్డాను. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదని, నేను చచ్చిపోతే బాగుండు.. అని పదే పదే అనిపిస్తోంది. నేను లేకపోతే నీకేసమస్య ఉండదన్నావు. అదే సరైనది అనిపించింది. అందుకే వెళ్లిపోతున్నాను...’’ మురళి రాసిన ఉత్తరం చదివిన వరుణ్‌కి నోట మాటరాలేదు. ‘‘అక్కా, ఇన్నాళ్లూ బావగారు ఒంటరిగా ఉంటుంటే అంతర్ముఖుడని, గర్వమని అనుకున్నాను. ఇలా అని తెలియక నేనూ తప్పుపట్టాను. బావగారిలో గూడుకట్టుకున్న ఈ భయాన్ని బయటకు తరిమేసే మార్గముంది. ఆయన కోలుకునేంతవరకు ఆగుదాం’’అని స్వర్ణకు ధైర్యం చెప్పాడు వరుణ్. గతం చేసిన గాయం థెరపీతో మాయం కౌన్సెలర్ మురళితో ‘‘మీ భయం తాలూకు ‘బ్లాక్’ మీ ఈ జీవితంలోనో గత జన్మలోనూ ఉండి ఉంటుంది. దానిని తెలుసుకొని, అర్థం చేసుకొని బయటకు రావడానికి ప్రయత్నించండి’’ అన్నారు. అది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ఇచ్చే క్లినిక్. ఏళ్లుగా గూడుకట్టుకున్న ఆవేదనలు తొలగేచోటు ఇదే అనిపిం చింది మురళికి. మురళి సరే అనడంతో ధ్యానప్రక్రియ మొదలైంది. ప్రశాంతంగా నిద్రపోయినట్టుగా ఉంది మురళికి. తన కళ్లముందు ఎన్నో అందమైన దృశ్యాలు.. ఆందోళన పరిచిన ఘటనలు కనిపిస్తున్నాయి. మెల్ల మెల్లగా వాటి నుంచి విడివడుతున్నాడు. కాసేపటికి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు కౌన్సెలర్. మురళి అంతర్గత ప్రయాణం మొదలైంది. 35 ఏళ్ల నుంచి పాతికేళ్లకు అటు నుంచి కాలేజీ రోజులకు, స్కూల్ వయసుకు చేరుకున్నాడు ఆ ప్రయాణంలో. అన్నేళ్లలో పట్టుచిక్కనిదేదో దొరికినట్టు ఉద్వేగపడిపోయాడు మురళి. తనకు కలిగిన అనుభవాన్ని చెబుతున్నాడు.‘‘క్లాస్‌రూమ్‌లో ఉన్నాను. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. నేను నా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాను. టీచర్ నన్ను తిడుతోంది. ఆమె చాలా కోపంగా ఉంది. నా బట్టలు విప్పేసి బెంచీ మీద నిలబెట్టింది. అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. నేను ఏడుస్తున్నాను. నేను మాట్లాడితే నన్ను కొడతారు, అందరూ హేళన చేస్తారు..’’ అని చెబుతున్న మురళి కళ్లు కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఆ ఉద్వేగం నెమ్మదించాక ‘ ఇంకా ప్రయత్నించండి... అమ్మ గర్భంలో ఉన్న క్షణాలు, ఆ తర్వాత కిందటి జన్మ రోజులను అవగతం చేసుకోండి...’ అని కౌన్సెలర్ సూచనలు అందుతున్నాయి మురళికి. అతని అంతర్గత ప్రయాణం మళ్లీ మొదలైంది. కాసేపటికి ఏదో దర్శించినట్టుగా మురళి చెప్పడం మొదలుపెట్డాడు. ‘‘నేను గూడెం నాయకుని కొడుకుని. నేనో అమ్మాయిని ప్రేమించాను. మేం మాట్లాడుకోవడం చూసిన పెద్దలు మమ్మల్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టారు. అందరూ మమ్మల్ని దోషులుగా చూస్తున్నారు. మమ్మల్ని తీవ్రంగా కొట్టారు. ఎదురు చెప్పానని నన్ను ఉరితీశారు’’ మురళి ఉద్వేగంగా చెబుతున్నాడు. కౌన్సెలర్ మాట్లాడుతూ -‘‘ఆ జీవితానికి ఈ జీవితానికి మధ్య ఉన్న అగాధాన్ని ఎలా పూడ్చుకుంటున్నారు?’’ అని అడిగారు. ‘‘టీచర్ నా పట్ల నిర్దయగా ప్రవర్తించింది. కానీ, ఆమెను క్షమిస్తున్నాను. అప్పటి గూడెం కట్టుబాట్లు ఆ జన్మకు మాత్రమే. వాటితో ఈ జన్మను బాధించుకోను. నన్ను నమ్ముకున్నవారికి అన్యాయం చేయను...’’ అని నెమ్మదించాడు మురళి. కౌన్సెలర్ ఇచ్చిన సూచనలతో థెరపీ పూర్తయింది. భయాలు తొలగిన సంబరం మురళి ఇంట్లో అంతా సందడిగా ఉంది. మురళి స్వర్ణల పెళ్లి రోజు పార్టీ సంబరంగా జరుగుతోంది అక్కడ. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న మురళిని కన్నార్పకుండా ఆనందంగా చూస్తోంది స్వర్ణ. - నిర్మల చిలకమర్రి భయాల బంధనాలు కొందరికి ఎత్తై ప్రదేశాలంటే భయం. మరికొందరికి నీళ్లంటే భయం. ఇంకొందరికి నిప్పు... ఇలా లోకంలో ఎంతో మందికి భయాల తాలూకు బాధలు ఉంటుంటాయి. అలాగే మురళికి నలుగురితో మాట్లాడాలంటే భయం ఉంది. దీనినే ‘సోషల్ ఫోబియా’ అంటారు. ఏ భయం ఎవరైతే అపరిమితంగా బాధిస్తుందో అది అప్పటిది అయి ఉండదు. తమ బాల్యంలోనో, గత జన్మలో అంతఃచేతనలోని పొరలలో పేరుకుపోయి ‘బ్లాక్స్’ రూపంలో ఉంటాయి. మురళికి ఉన్న సోషల్ ఫోబియా అతన్ని సమాజం నుంచి, తన ఇంటి నుంచి దూరం చేసింది. ఒంటరితనంలో కూరుకుపోయి డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్లాడు. సమస్యకు మూలం ఎక్కడ ఉందో తెలుసుకొని న్యాయాన్యాయాలు సరిచూసుకొని అవగతం చేసుకున్నాడు. ఆ గతం తాలూకు భయాలను విగతం చేశాడు. తిరిగి కుటుంబ జీవనాన్ని, సమాజంతో తన అనుబంధాన్ని మెరుగు పరుచుకునే ప్రయత్నాలు చేశాడు.- డాక్టర్ లక్ష్మీ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్,లైఫ్ రీసెర్చి అకాడమీ, హెదరాబాద్ జీవితమే మార్పు డాక్టర్ పీటర్ మ్యాక్ లండన్‌లోని వార్విక్ యూనివర్శిటీలో ప్రొఫెసర్. గత జన్మలో ఏర్పడిన బ్లాక్స్ ఈ జన్మపై చూపే ప్రభావాల గురించి విసృ్తతంగా పరిశోధనలు జరిపారు. మనుషుల్లో భయకంపితులను చేసే కలలు, నీళ్లు, పాములు అంటే ఉండే భయాలు, విజయం తాలూకు భయం, నలుగురితో మాట్లాడటం అంటే కలిగే భయాల గురించి క్షుణ్ణంగా పరిశోధించిన ఈ ప్రొఫెసర్ ‘లైఫ్ ఛేంజింగ్ మూవ్మెంట్ ఇన్ ఇన్నర్ హీలింగ్’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. -
విహారయాత్రలో విషాదం
జలపాతంలో ఈతకు దిగి యువకుడి గల్లంతు గల్లంతైన యువకుడుది విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతం సరియా వద్దకు విహారయాత్రకు వచ్చిన ఆరుగురు స్నేహితులు వీరంతా విశాఖ రైల్వే స్టేషన్ ఫుడ్ కౌంటర్లో సప్లయర్లు దేవరాపల్లి: స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు సరియా జలపాతం వద్దకు విహార యాత్రకు వచ్చిన ఓ యువకుడు గురువారం సాయంత్రం ఈతకు దిగి గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి వచ్చిన ఆరిలోవకు చెందిన మురళీ(30) ఈత కొడుతూ ఊబిలో చిక్కుకున్నాడు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని జనహరి ఫుడ్స సెంటర్లో ఫుడ్ సప్లయర్లుగా పని చేస్తున్న ఆరుగురు స్నేహితులు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు బైకులపై దేవరాపల్లి మండలం వాలాబుకు, అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీకి సరిహద్దులో ఉన్న సరియా జలపాతం వద్దకు వచ్చారు. విశాఖట్నంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆదపాక సారుు, ఆవాల అనిల్ కుమార్, చన్న సారుుకుమార్, పొట్నూరు నరసింగ్, వేంపాడ ప్రసాద్‌తో పాటు ఆరిలోవకు చెందిన మురళీ కూడా వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో వెంట తెచ్చుకున్న భోజనాలు చేసి, కొద్ది సేపు జలపాతం పరిసరాలలో ఉల్లాసంగా గడిపారు. అనంతరం వీరంతా కలిసి సరదాగా ఈతకొట్టారు. అందరూ చూస్తుండగా మురళీ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసిన ఫలించలేదు. చీకటి పడే వరకు మురళీ కోసం స్థానికుల సహాయంతో గాలించిన ఆచూకీ లభించక పోవడంతో మిగిలిన యువకులంతా దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌ను గురువారం సాయంత్రం సంప్రదించారు. జలపాతం అనంతగిరి మండలం పరిధిలోకి రావడంతో అనంతగిరి పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైన మురళీకి ఏడాదిన్నర క్రితం వివాహం కాగా, బాబు కూడా ఉన్నట్టు తెలిసింది. కళ్లు ముందే తమ స్నేహితుడు గల్లంతవుతున్నా రక్షించుకోలేక మిగిలినవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పేద బతుకు.. పెద్దమనసు
{పేమించి పెళ్లి చేసుకున్న రెండేళ్లకే వెంటాడిన విధి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన భర్త ఒంటరిగా మిగిలిన తల్లి బిడ్డ తిరుపతి మెడికల్: పేద కుటుంబం పెద్ద మనసును చాటుకుంది. తమను చీకట్లు ముసురుకున్నా ఆ కుటుం బసభ్యులు కొందరికి వెలుగులు పంచారు. కుటుంబానికి దిక్కుగా ఉన్న వ్యక్తి విగతజీవిగా మారినా అతని అవయవదానంతో కొందరికి ప్రాణభిక్ష పెట్టారు. పాకాల మండలం కె.వడ్డేపల్లి కావలివారి పల్లెకు చెందిన బుజ్జమ్మ, భాస్కర్ దంపతులకు ముగ్గురు సంతానం. రెక్కాడితే డొక్కాడని కుటుంబ నేపథ్యం. మురళి పెద్ద కొడుకు. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మారుు ప్రత్యేక ప్రతిభావంతురాలు కావడం, చిన్న కూతురుకి వివాహమైంది. మురళి (27) తిరుపతిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నారావారిపల్లెకు చెందిన అమ్మారుుతో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న బిడ్డ ఉంది. తిరుపతిలో కాపురం ఉంటున్న మురళి దీపావళి జరుపుకునేందుకు కావలివారిపల్లెకు 30వ తేది ఆదివారం బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బ్రెరుున్ డెత్ కేసుగా వైద్యులు తేల్చారు. దీంతో అతనికి చెందిన అవయవాలను దానం చేసి నలుగురిని బతికించాలని కుటుంబ సభ్యులు నిర్ణరుుంచారు. వెంటనే వైద్యులను సంప్రదించి గుండెను చెన్నైకి, లివర్‌ను వైజాగ్, రెండు కిడ్నీలను తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు దానం చేశారు. మురళి మృతితో కట్టుకున్న భార్య, ఏడాది వయసున్న ఆడ బిడ్డ రోడ్డున పడ్డారు. అసలే పేద కుటుంబం. ప్రేమ వివాహ కారణంతో కుటుంబాలు దూరంగా ఉన్నారుు. ప్రభుత్వం స్పందించి మురళి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి లో బ్రెయిన్‌డెడ్ కేసు
-
బీజేపీ బలోపేతమే లక్ష్యం
హన్మకొండ : తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం హన్మకొండ రాంనగర్‌లోని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈనెల 7న పార్టీ బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారన్నారు. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వస్తే, తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. ఆ రోజును తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవాలన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే ప్రధాని మోదీకి సెప్టెంబర్ 17 ఆవశ్యకతను వివరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మ, కార్పొరేటర్ చాడా స్వాతి, నాయకులు వన్నాల శ్రీరాములు, డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, బన్న ప్రభాకర్ పాల్గొన్నారు. -
కరెంటు షాక్‌తో యువకుడి మృతి
సిరివెల్ల మండలం కోటపాడులో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మురళి(21) అనే యువకుడు ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌కు గురై మరణించాడు. ఇనుపకడ్డీలు మోసుకుంటూ వెళ్తుండగా పైన ఉన్న 11కేవీ వైర్లకు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
బైక్‌ను ఢీకొట్టిన ట్యాంకర్: ఒకరి మృతి
హైదరాబాద్ : నగరంలోని సనత్‌నగర్ మెట్రోస్టేషన్ సమీపంలో వాటర్ ట్యాంకర్ ఓ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. కూకట్పల్లి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేస్తోన్న మురళి కృష్ణ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో మురళీ కృష్ణ కు తీవ్రగాయాలయ్యాయి. దగ్గరలోని ఆసుపత్రికి తరలించే లోపే అతను మరణించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి , ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీపాలు తయారుచేస్తున్న వ్యక్తి అరెస్ట్
నకిలీపాలు తయారుచేస్తూ డెయిరీలకు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్‌చేశారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన వేముల మురళి అనే వ్యక్తి చాలాకాలంగా పాల వ్యాపారం చేసేవాడు. యూరియా, వంటనూనె, పాలపిండి, చక్కెర, యూరియా మిశ్రమంతో నకిలీ పాలు తయారుచేసి డెయిరీలకు విక్రయించేవాడు. పలు ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం దాడిచేసి మురళిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 250 లీటర్ల నకిలీ పాలు, 80 లీటర్ల వంటనూనె, 30 కిలోల యూరియాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
29 బైక్‌లు స్వాధీనం
పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 29 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మురళి, అశోక్, తారుద్దీన్ అనే ముగ్గురు దొంగలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. -
మరో ముగ్గురు ‘ఎర్ర’దొంగలపై పీడీ చట్టం
చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బంగారుపాళ్యం మండలం తంబిగానిపల్లికి చెందిన దేవళ్ల రాజేష్, పుల్లూరు మురళి, తిరుపతిలోని గిరిపురానికి చెందిన చింతమాకుల ప్రవీణ్‌లను ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఏప్రిల్ 30న ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ముగ్గురిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు అనుమతి ఇస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం కింద వీరిని ఏడాది పాటు జైలులో ఉంచనున్నారు. -
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
మెదక్ : మెదక్ జిల్లాలోని పఠాన్ చెరు లో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్ధానిక రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీన్ పూర్ పెద్ద చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివరాలు... వాణి నగర్ కు చెందిన మురళి(9), రాజశేఖర్(10 ) లు పెద్ద చెరువుకు ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. రాజశేఖర్ మృత దేహాన్ని గమనించిన స్థానికులకు విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకుని మురళి మృత దేహం కోసం గాలింపు చేపట్టారు. -
కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక
-
ప్రేమ పేరుతో మోసగించిన ఒకరికి ఆర్నెళ్ల జైలు
నర్సంపేట : నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష పడినట్లు కొత్తగూడ ఎస్సై అరాఫత్ బుధవారం తెలిపారు. కొత్తగూడ వుండలం గాంధీనగర్‌కు చెందిన వుల్లెల కళావతిని నెల్లికుదురుకు చెందిన ఎర్రబోరుున మురళి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో సదరు మహిళ అప్పటి ఎస్సై సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయుగా 2012లో 417, 406, 420 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అప్పటి ఎస్సై నర్సంపేట కోర్టులో చార్జిషీటు వేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను కోర్టు కానిస్టేబుల్ స్వామినాయుక్ సకాలంలో ప్రవేశపెట్టగా పిటిషనర్ తరఫున ఏపీపీ వెంకటేశ్వర్లు వాదించారు. వాదనలు విన్న జడ్జి శ్రీదేవి వుురళీకి ఆరు నెలల జైలు శిక్ష లేదా 5 వేల జరివూనా విధించినట్లు తెలిపారు. -
పుట్టెంట్రుకలు ఇవ్వకనే ..
కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకోవాలని వెళుతున్న ఓ కుటుంబంలోని ఇద్దరిని మృత్యువు కాటేసింది. పిల్లాడి పుట్టెంట్రుకలు స్వామికి ఇవ్వాలనుకున్న ఆ కుటుంబం కోరిక నెరవేరనేలేదు. రెండేళ్ల బాలుడిని ఆర్టీసీ బస్సు బలితీసుకుంది. ఆ చిన్నారి తల్లినీ పొట్టనపెట్టుకుంది. అగరంపల్లె వద్ద శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే... తల్లి ఇంకొంతసేపటికే మృతిచెందింది. తండ్రీకొడుకు గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. ఐరాల/చిత్తూరుఅర్బన్: మండలంలోని అగరంపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి,కొడుకు మృతిచెందారు. కాణిపాకం ఎస్ఐ మురళి కథనం మేరకు గుడిపాల మండలం రామభద్రాపురం గ్రామానికి చెందిన మురళి(35),భవిత(30), వారి కుమార్తె డింపుల్, కుమారుడు ముఖేష్(2) ద్విచక్రవాహనంపై కాణిపాకం ఆలయానికి బయలుదేరారు. అగరంపల్లె టోల్‌గేటు వద్ద మలుపు తిరుగుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముఖేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. భవిత తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతిచెందింది. మురళి,డింపుల్‌ను వైద్యనిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆస్పత్రిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు కాణిపాకం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుం బీకులు, బంధువులతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగ ణం నిండిపోయింది. తల్లీకొడుకు భవిత, ముఖేష్ మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. తమ్ముడు కొత్త ఆటో కొనడంతో దానికి పూజలు చేసి, పిల్లాడి తలవెంట్రుకలు స్వామికి ఇవ్వడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని మురళి పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఆవరణలో చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టించింది. -
మైనర్ బాలికపై అత్యాచారం
భవానీపురం : ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిట్టినగర్ లంబాడీపేటలో బొడ్డు వీరమ్మ మూగ, చెవిటిదైన తన మనుమరాలుతో నివసిస్తోంది. ఈ మైనర్ బాలికకు తల్లిదండ్రులు చనిపోయారు. నాయనమ్మ వద్దే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన వీరమ్మ తన బంధువు ఒకరు సూర్యారావుపేటలోని ఒక హాస్పటల్లో ఉండడంతో పరామర్శకు వెళ్లింది. ఈ క్రమంలో బాలిక ఇంటిపై అంతస్తులో మార్బుల్ పని చేసుకునే మురళి అనే యువకుడు మైనర్ బాలికను టిఫిన్ పెడతా రమ్మని పైకి పిలిచి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక బాబాయి వీరమ్మకు సమాచారం అందించాడు. వెంటనే ఇంటికి వచ్చిన వీరమ్మ బాలిక నుంచి వివరాలను అడిగి తెలుసుకుని గురువారం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక పోస్టాఫీసు నుంచే ‘ఆసరా’
తొలిదశలో ఆరు జిల్లాల్లో అమలు మార్చి 1నుంచి పంపిణీకి సన్నాహాలు పట్టణాల్లో ‘ఐసీఐసీఐ’కు బాధ్యతలు! సాక్షి, హైదరాబాద్: సామాజిక భద్రతా పింఛన్ల(ఆసరా)ను ఇకమీదట పోస్టాఫీసుల నుంచి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో నల్లగొండ, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దీన్ని అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు ఆయా జిల్లాల్లో 3,855 గ్రామ పంచాయితీలను ఎంపిక చేశారు. ఎంపికైన గ్రామ పంచాయితీల్లో నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో అన్ని గ్రామాలు ఉండగా, మిగిలిన నాలుగు జిల్లాల్లో 50 శాతానికి పైగా ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని లబ్దిదారులకు ఫిబ్రవరి నెల పింఛన్లను మార్చి 1వ తేదీ నుంచి పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయనున్నారు. రెండోదశలో మిగిలిన జిల్లాలతో పాటు అన్నిగ్రామాల్లోని లబ్ధిదారులకు అందజేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘ఆసరా’ పింఛన్లకు ఎంపికైన వారు మొత్తం 33,42,969 మంది ఉండగా, వీరికి గత నాలుగు నెలల్లో రూ.1231.04 కోట్లు మాన్యువల్‌గా పంపిణీ చేశారు. ఇదిలాఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్ల పంపిణీ కోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ఇటీవల సంప్రదింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఐసీఐసీఐ బ్యాంకు ఒక్కటే ముందుకు వచ్చిందని సెర్ప్ సీఈవో మురళి బుధవారం ‘సాక్షి’తో చెప్పారు. త్వరలోనే ఆ బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. -
చెడు ఆలోచనలే విషక్రిములు
అదనపు జిల్లా జడ్జి ఆర్.మురళి విజయవాడ లీగల్ : చెడు ఆలోచనలే వ్యాధిని కలిగించే విషక్రిములని అదనపు జిల్లా జడ్జి ఆర్.మురళి అన్నారు. నగరంలోని సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్ అసోసి యేషన్(బీబీఏ)హాలులో స్వామివివేకానంద 152వ జయంత్యుత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జడ్జి మురళి మాట్లాడుతూ ప్రతీది తనకే కావాలనే వాడు స్వార్థపరుడన్నారు. రామకృష్ణ పరమహంస ముఖ్య అనుచరుడుగా వివేకానంద మంచి గుర్తింపు పొందారన్నారు. బీబీఏ అధ్యక్షుడు సంపరదుర్గ శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన వ్యక్తి వివేకానందుడన్నారు. మానవసేవే మాధవసేవని, మతం అంటే మానవత్వమని చెప్పారు. యువత శక్తికి ప్రతిబింభమన్నారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్, సీనియర్ న్యాయవాది జి.మురళీమోహన్రావు, బీజేపీ నేత వి.శ్రీనివాసరాజు, బీబీఏ ప్రధాన కార్యదర్శి వజ్జే వెంకట రవికుమార్, వివేకానంద సేవాసమితి కన్వీనర్ పి.డి.సత్యనారాయణ ప్రసంగించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్ర పటానికి జడ్జి మురళి, బీబీఏ ప్రతినిధులు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఎం.జయప్రకాష్, కొఠారి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, పిళ్ళా రవి, వై.డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు స్వామి వివేకానంద : నవనీతం గాంధీనగర్ : భారత ప్రాచీన నాగరికతను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు అన్నారు. హనుమాన్‌పేటలోని దాసరి నాగభూషణరావు భవన్ వద్ద స్వామి వివేకానంద 152వ జయంతి, జాతీయ యువజన దినోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. ఏఐవైఎఫ్ కార్యకర్తలు తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐవైఎఫ్ కార్యకర్తలు లంకా గోవిందరాజులు, సయ్యద్ అప్సర్, కనకాంజనేయులు, డి.సూరిబాబు, తమ్మిన గణేష్, కె.వి.రామారావు, నరసింహారావు, మొహిద్దీన్, శ్రీను, లక్ష్మణరావు, రాయప్ప, విజయప్రసాద్ పాల్గొన్నారు. -
కీచక కానిస్టేబుల్‌పై కేసు నమోదు
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన మురళి అనే కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు రాకపోవడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం రాత్రి గస్తీ పోలీసు మరో హోం గార్డుతో కలసి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అత్యాచార సంఘటనను సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఎస్పీ రాజేష్ కుమార్ .. ఏఎస్పీ భాస్కర్‌రావును విచారణ అధికారిగా నియమించారు. అత్యాచార సంఘటన వాస్తవమని విచారణలో తేలడంతో కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. (రాత్రి గస్తీ తిరిగే పోలీసులే అత్యాచారం చేశారు!) -
ధాన్యం కొనుగోలుకు...230 కేంద్రాలు
చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లాలో 2014-15 సంవత్సరానికి గాను సార్వా ధాన్యం కొనుగోలు కోసం 230 కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ జె.మురళి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో మద్దతు ధర చెల్లిస్తామని ఆయన చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం నియమించిన ఐకేపీ సిబ్బంది, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ సిబ్బంది ద్వారా 135, పీఏసీఎస్‌ల ద్వారా 95 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం ఎక్కడ ఎక్కువగా కొనుగోలు చేయడానికి వీలవుతుందో ఆయా ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కొక్క కేంద్రంలో నలుగురు సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ సిబ్బందికి ఈ నెల 26, 27, 28 తేదీల్లో విజయవాడలోని గొల్లపూడి డీఆర్డీఏ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1,400, సాధారణ రకం ధాన్యానికి రూ.1,360 చెల్లించనున్నట్లు వివరించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ఎక్కువ మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తేమ శాతంపై రైతులకు అవగాహన... జిల్లాలో 85 శాతం మంది రైతులు యాంత్రీకరణ ద్వారా ధాన్యం నూర్పిళ్లు చేస్తున్నారని, దీనివల్ల ధాన్యంలో 25 నుంచి 30 శాతం తేమ ఉండే అవకాశం ఉంటుందని జేసీ చెప్పారు. కొనుగోలు కేంద్రం సిబ్బంది, పౌరసరఫరాల సిబ్బంది రైతులకు యాంత్రీకరణ ద్వారా నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఎక్కువగా ఆరబెట్టే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ మించకుండా ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంత రైతులకు తెలియజేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్ శాఖ ద్వారా తేమను గుర్తించే యంత్రం, పోటు తొలగించే యంత్రం, గోనె సంచులు అన్నీ సిద్ధం చేసుకోవాలని సిబ్బందికి చెప్పారు. ఈ సమావేశంలో ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, డీఎస్వో ఎ.కృష్ణారావు, డీఎంసీ సివిల్ సప్లయిస్ జయదేవ్‌సింగ్, పీడీఎస్ డీటీలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
కడుపేదలకూ ‘ఆసరా’: సెర్ప్ సీఈవో
సాక్షి, హైదరాబాద్: దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న కడుపేదలకూ సంక్షేమపథకాలు అందించాలనేది ప్రభుత్వం లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ(సెర్ప్) సీఈవో మురళి తెలిపారు. అనాథలు, భిక్షాటన చేసేవారు, కాగితాలు ఏరుకునే వారు, మురికివాడల్లో జీవిస్తున్నవారు తదితరుల అర్హతను బట్టి సామాజిక భద్రతా పింఛన్ ‘ఆసరా’ను అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం అమలుపై శనివారం సెర్ప్ కార్యాలయంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఆసరా పింఛన్ ఇప్పించేందుకు ఎన్జీవోలు ప్రభుత్వంతో కలసి పనిచేయాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 50 వేలమంది సమగ్ర కుటుంబ సర్వే(ఎస్కేఎస్)లో వివరాలు నమోదు చేసుకోలేదని, వారికి మరోసారి అవకాశం కల్పిస్తున్నామని మురళి వెల్లడించారు. ఆసరాకు అర్హులైన వారికి ఆధార్‌ను ఇప్పించాల్సిన బాధ్యత కూడా చేపట్టాలని ఆయన ఎన్జీవోల ప్రతినిధులను కోరారు. -
మార్కెట్లోకి సెల్కాన్ ఎపిక్ క్యూ550
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల సంస్థ సెల్కాన్.. మిలీనియా సిరీస్‌లో ఎపిక్ క్యూ550 మోడల్‌ను ఆవిష్కరించింది. 8 మిల్లీమీటర్ల మందం, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణ. 24 రోజుల స్టాండ్ బై ఉంటుందని కంపెనీ తెలిపింది. 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ వన్ గ్లాస్ సొల్యూషన్ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్, క్వాడ్‌కోర్ 1.3 గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటివి అదనపు హంగులు. ఆటోఫోకస్, ఫ్లాష్‌తో 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ముందు కెమెరా ఉన్నాయి. 64 జీబీ వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. పెన్‌డ్రైవ్, మౌస్, కీ బోర్డును ఫోన్‌కు అనుసంధానించొచ్చు. ధర రూ.10,499. బరువు 143 గ్రాములు. బ్యాటరీని బయటకు తీయడానికి వీలులేని యూనిబాడీ డిజైన్‌తో ఫోన్‌ను రూపొందించినట్టు కంపెనీ ఈడీ మురళి రేతినేని ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. భారత్‌లో తొలిసారిగా.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల తొలి ప్రాధాన్యత బ్యాటరీ బ్యాకప్ అని సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. ఈ నేపథ్యంలో అధిక బ్యాటరీ బ్యాకప్‌తోపాటు తక్కువ మందంతో తేలికైన ఎపిక్ క్యూ550 మోడల్‌కు రూపకల్పన చేశామని చెప్పారు. ఇంత తక్కువ ధరలో, ఈ ఫీచర్లతో కూడిన మొబైల్ మార్కెట్లోకి రావడం దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. రిటైలర్ల నుంచి అనూహ్య స్పందన ఉందని గుర్తు చేశారు. 5.5 అంగుళాల స్క్రీన్ ఉన్న మోడళ్లకు గిరాకీ పెరుగుతోందన్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో ఫోన్ డిజైన్ చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఔట్‌లెట్లతోపాటు స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్లలో ఫోన్ లభిస్తుందని తెలిపారు. శ్రీలంక, నేపాల్, సింగపూర్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయనున్నట్టు వెల్లడించారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించండి
మున్సిపల్ వైస్‌చైర్మన్, కౌన్సిలర్ల సదస్సులో జేసీ మురళి మచిలీపట్నం టౌన్ : మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు తమ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి సూచించారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లకు రెండు రోజులపాటు నిర్వహించే అవగాహన కార్యక్రమం సోమవారం స్థానిక ఆర్కే ప్యారడైజ్‌లో ప్రారంభమైంది. బందరు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, కమిషనర్ ఎ.మారుతి దివాకర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని చెప్పారు. తద్వారా భవిష్యత్తులో చైర్మన్లుగా ఎదగాలని సూచించారు. ప్రతి కౌన్సిలర్ తమ విధులను, బాధ్యతలను గర్తెరిగి నడుచుకోవాలన్నారు. అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు కృషి చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, అభివృద్ధి పనులు వంటిపై దృష్టి సారించాలన్నారు. పొడి, తడి చెత్తలను వేరు చేసే విధానాన్ని అమలు చేస్తే మున్సిపాలిటీకి ఉపయోగం కలుగుతుందని పేర్కొన్నారు. తడిచెత్త ద్వారా వానపాముల ఎరువులను తయారు చేయవచ్చని, దీంతో సేంద్రీయ ఎరువుల వాడకం పెంపొందించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం కౌన్సిలర్ల సందేహాలను జేసీ నివృత్తి చేశారు. బందరు మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వైస్ చైర్మన్ కాళీవిశ్వనాథం, కమిషనర్ మారుతి దివాకర్ మాట్లాడుతూ ఈ అవగాహనా కార్యక్రమం నూతన కౌన్సిలర్లకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా గుడివాడ, నూజివీడు మున్సిపల్ కమిషనర్లు ప్రమోద్‌కుమార్, సీహెచ్ శ్రీనివాస్, బందరు మున్సిపల్ డీఈ పి. పోలీస్ పలు అంశాలపై కౌన్సిలర్లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులు, వీధి దీపాల నిర్వహణ, మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ, నూతన ఆస్తుల కొనుగోలు, పేదరిక నిర్మూలన, కౌన్సిల్ అధికారాలు, బడ్జెట్ ఆమోదం, చైర్మన్ విధులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలకు చెందిన వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు 104 మందికి గానూ 62 మంది మాత్రమే హాజరయ్యారు. నందిగామ మున్సిపాలిటీ నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా హాజరుకాలేదు. మంగళవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. -
రైల్వే బోర్డును ఏర్పాటు చేసిన సంవత్సరం?
బ్రిటిష్ ఇండియా - పారిశ్రామిక అభివృద్ధి ప్రాచీన కాలం నుంచే భారతదేశం పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచింది. పారిశ్రామికాభివృద్ధి కోసం నియమించిన కమిషన్ తన నివేదికలో ‘పశ్చిమ దేశాల నుంచి మొదటిసారి వ్యాపారులు ఇక్కడకు వచ్చినప్పుడు, భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధి ఏవిధంగానూ అభివృద్ధి చెందిన దేశాలకు తీసిపోనివిధంగా ఉంది’ అని వ్యాఖ్యానించింది. భారత్‌లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తులు, సహజసిద్ధంగా లభించే ముత్యాలు, సుగంధ ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేసేవారు. బంగారం, రాగి, జింకు, తగరం, సీసం, మత్తుపానీయాలు, గుర్రాలను ప్రధానంగా దిగుమతి చేసుకునేవారు. దిగు మతుల కంటే ఎగుమతులే ఎక్కువగా ఉండేవి. పత్తి, సిల్క్, ఉన్ని నాటి ముఖ్యమైన పరిశ్రమలు. బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు, లక్నో, అహ్మదాబాద్, నాగ్‌పూర్, మధుర పత్తి పరిశ్రమకు పేరుగాంచాయి. పంజాబ్, కాశ్మీర్లో నాణ్యమైన కంబళ్లు ఉత్పత్తి చేసేవారు. భారతదేశం అంతటా ఇత్తడి, రాగి, బెల్‌మెటల్ ఉత్పత్తయ్యేవి. వీటికి బెనారస్, తంజావూరు, పుణె, నాసిక్, అహ్మదాబాద్ ముఖ్యమైన కేంద్రాలు. ఆభరణాల తయారీ, బంగారు, వెండి నగిషీ పనులు, చందనం, దంతపు, గాజు పరిశ్రమలు కూడా ఉండేవి. వ్యాపారాన్ని ఎక్కువగా భారతీయులే నిర్వహిస్తుండేవారు. 18వ శతాబ్దం ప్రారంభం వరకు నౌకా నిర్మాణ పరిశ్రమ ఇంగ్ల్లండ్ కంటే భారతదేశంలోనే అధికంగా ఉండేది. భారతదేశ వస్త్ర పరిశ్రమాభివృద్ధి బ్రిటిష్ ఉత్పత్తిదారుల అసూయకు కారణమైంది. 19వ శతాబ్దం అర్ధ భాగం నాటికి భారతదేశంలో చాలా పరిశ్రమలు గడ్డు పరిస్థితిని ఎదుర్కున్నాయి. తక్కువ ధరకు లభించే యంత్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులు, భారతీయ కళలను ప్రోత్సహించే ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వానికి లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. అందువల్ల భారతదేశంలో వ్యాపార వాణిజ్యాలు దాదాపుగా అంతరించిపోయాయి. ఆధునిక పారిశ్రామికాభివృద్ధి భారతదేశంలో ఆధునిక పారిశ్రామికాభివృద్ధి లేదా భారీ పరిశ్రమల స్థాపన 19వ శతాబ్దపు రెండో భాగంలో ప్రారంభమైంది. 1850 ప్రాంతంలో నూలు దుస్తులు, జనపనార మిల్లులు, గనుల నుంచి బొగ్గు తవ్వి తీసే పరిశ్రమలతో భారత్‌లో యంత్ర యుగం ప్రారంభమైంది. ఈ పరిశ్రమల్లో ఎక్కువ భాగం బ్రిటిషర్లే పెట్టుబడి పెట్టారు. అందువల్ల ఇవి వారి ఆధిపత్యం కిందే ఉండేవి. అధిక లాభాలు ఆర్జించే అవకాశాలు కనిపించడంతో భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితమయ్యారు. కార్మికులు చౌకగా దొరకడం, ముడిసరుకుల సరఫరాకు కొదవ లేకపోవడం, ఉత్పత్తులకు దేశంలో గిరాకీ ఉండటం వీరికి కలిసి వచ్చింది. వాస్తవానికి బ్రిటన్‌లో మిగులు మూలధనం ఉండి, దాన్ని విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనే అభిప్రాయం ఏర్పడిన సమయంలో ఇక్కడ పారిశ్రామికాభివృద్ధి ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధికి ఒక చక్కటి అవకాశం కల్పించింది. యుద్ధకాలంలో విదేశీ పోటీ లేకపోవడం వల్ల అవసరమైన ప్రతి వస్తువును ఇక్కడే ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. ఈ అవకాశం ఎంతో కాలం కొనసాగలేదు. యుద్ధానంతరం ఏర్పడిన ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం భారతదేశంపై కూడా పడింది. రెండో ప్రపంచయుద్ధం ఒక కొత్త పారిశ్రామిక ఘట్టాన్ని ఆవిష్కరించింది. దిగుమతులు పరిమితమ య్యాయి. యుద్ధానికి సంబంధించిన వస్తువుల గిరాకీ బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం చాలా పరిశ్రమలకు యుద్ధం ముగిసిన తర్వాత కూడా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. వస్త్ర పరిశ్రమ భారతీయ వ్యాపారస్థులు మొదటిసారిగా 1818లో కలకత్తాలో పత్తి, తర్వాత బొంబాయి ప్రాంతంలో వస్త్ర పరిశ్రమను స్థాపించారు. ‘కౌస్జీ నానాభాయి’ 1853లో బొంబాయిలో మొదటి దుస్తుల మిల్లును నెలకొల్పాడు. 1879 నాటికి మనదేశంలో 56 వస్త్ర పరిశ్రమలు ఉండేవి. వీటిలో 43 వేల మంది కార్మికులు పనిచేసేవారు. 1851లో బొంబాయిలో నూలు మిల్లులను స్థాపించారు. వీటిలో వడకటం, నేతపని రెండూ జరిగేవి. 1861 నాటికి 12 మిల్లులు వచ్చాయి. 1860-70 దశాబ్దంలో ఈ పరిశ్రమకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అమెరికా అంతర్యుద్ధం వల్ల ముడి పత్తి ధర పెరిగింది. ఇది చేనేత పరిశ్రమను, దానిపై ఆధారపడి ఉన్న ఇతర రంగాలను దెబ్బతీసింది. రవాణా ఖర్చులు, దిగుమతి సుంకాలు పెరిగాయి. 1934 కాటన్ టెక్స్టైల్స్ యాక్ట్ ద్వారా బ్రిటిష్యేతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రభుత్వం సుంకాలను పెంచింది. జౌళి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఆది నుంచే జనపనార పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేది. 1830 వరకు ‘కిత్తనార’ సంచులు, జనపనార గుడ్డ, బెంగాల్ చేనేత పనివాళ్ల సొంత వ్యవహారంగా ఉండేవి. భారతదేశంలో తొలి జనపనార మిల్లును 1854లో స్థాపించినా, 1863 -64 వరకు ఆ పరిశ్రమ అభివృద్ధి చెందలేదు. 1882 నాటికి భారతదేశంలో 20 జనపనార మిల్లులు ఉండేవి. వీటిలో ఎక్కువగా బెంగాల్లోనే ఉండేవి. దేశీయంగా మార్కెట్ లేకపోవడంతో పత్తి, జనపనార పరిశ్రమలు ఎగుమతులపైనే ఆధారపడేవి. పత్తి కంటే జనుము వ్యాపారంలో అస్థిరత్వం ఎక్కువ. 1895 -96లో 28 జనపనార మిల్లులుండగా.. 1913-14 నాటికి 64కు, 1947 వరకు 113కు పెరిగాయి. తేయాకు టీ తోటలు: బ్రిటిష్ పాలనలో దీనికి అత్యంత ప్రాధాన్యం ఉండేది. 19వ శతాబ్దపు చివరి 30 ఏళ్లలో నిరంతరాభివృద్ధి చెందిన ఒకే ఒక పరిశ్రమ ఇదే. టీ తోటల వైశాల్యం 1885లో 2 లక్షల 84 వేల ఎకరాలు ఉండగా 1896 నాటికి 4,33,133 ఎకరాలకు విస్తరించింది. 1896 నాటికి బ్రహ్మపుత్ర, సుర్మా నదుల లోయల ప్రాంతంలో 67.4 శాతం టీ సాగులో ఉంది. దీంట్లో ఎక్కువ భాగం అస్సాంలో ఉండగా, బెంగాల్ వాటా 27.4 శాతం. పంజాబ్, హిమాలయ పర్వతాలు, దక్షిణాదిన నీలగిరిలోనూ ఈ తోటలను సాగు చేశారు. భారతదేశం, శ్రీలంక, తూర్పు ఇండియా దీవులు 1933 నుంచి టీ ఉత్పత్తి చేసే ముఖ్యమైన ప్రాంతాలుగా పేరుగాంచాయి. కాఫీ తోటలు: కాఫీ సాగు కూర్గ, మైసూర్, మలబారు ప్రాంతాలకే పరిమితమైంది. 1879 వరకు ఈ పరిశ్రమ లాభసాటిగానే ఉంది. 1889 తర్వాత బాగా దెబ్బతింది. బొగ్గు పరిశ్రమ ఇది 1880లో ఒక చిన్న పరిశ్రమగా ప్రారంభమైంది. 1886 తర్వాత రైల్వేల వ్యాప్తితో అభివృద్ధి చెందింది. 1885లో బొగ్గు ఉత్పత్తి 1,294,221 టన్నులు ఉండగా, 1894 నాటికి 2,800,562 టన్నులకు పెరిగింది. ఇనుము-ఉక్కు భారతదేశంలో ఇనుము-ఉక్కు ఉత్పత్తి 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. 1830లో ‘హీత్’ ఆధునిక పద్ధతుల్లో ఇనుము-ఉక్కు పరిశ్రమలను స్థాపించడానికి ప్రయత్నించాడు. 1875లో దుక్క ఇనుము ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించారు. 1907 నాటికి సంవత్సరానికి 50 వేల టన్నుల దుక్క ఇనుము ఉత్పత్తి అయ్యేది. జంషెడ్జీ టాటా 1907లో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. ఇదే టాటా - ఉక్కు కర్మాగారంగా ప్రసిద్ధి చెందింది. దీంట్లో 1913లో ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇతర పరిశ్రమలు ఇతర పరిశ్రమల్లో పంచదార, నూనెగింజలు, తోలు, మాంగనీస్, పెట్రోలియం, అభ్రకం ముఖ్యమైనవి. వీటిలో కొన్ని విదేశీ మార్కెట్‌ను కూడా సంపాదించాయి. బ్రిటిషర్లు భారతదేశం నుంచి వెళ్లేనాటికి ఈ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. మాదిరి ప్రశ్నలు 1. రైల్వే బోర్డును ఏర్పాటు చేసిన సంవత్సరం? 1) 1905 2) 1906 3) 1907 4) 1908 2. భారతదేశంలో మొదటిసారిగా 1818లో పత్తి మిల్లును ఎక్కడ స్థాపించారు? 1) బొంబాయి 2) కలకత్తా 3) సూరత్ 4) మద్రాస్ 3. బొంబాయిలో ఏ సంవత్సరంలో మొదటి పత్తి మిల్లును స్థాపించారు? 1) 1882 2) 1863 3) 1880 4) 1854 4. ‘స్వదేశీ ఉద్యమం’ ద్వారా భారతదేశంలో ఏ పరిశ్రమ అభివృద్ధి చెందింది? 1) పత్తి 2) వస్త్ర 3) తేయాకు 4) బొగ్గు 5. మొదటిసారిగా బెంగాల్లో జనపనార పరిశ్రమ స్థాపించిన సంవత్సరం? 1) 1853 2) 1855 3) 1854 4) 1856 6. 1899లో భారతీయుడి సగటు తలసరి జాతీయ ఆదాయం ఎంత? 1) రూ. 39 2) రూ. 25 3) రూ. 36 4) రూ. 30 7. దాదాబాయ్ నౌరోజీ అండ్ కంపెనీని ఎప్పుడు స్థాపించారు? 1) 1867 2) 1868 3) 1869 4) 1870 8. తిలక్ ఏ పరిశ్రమలో భాగస్వామిగా ఉండేవారు? 1) కాటన్, జిన్నింగ్ పరిశ్రమలు 2) తేయాకు 3) ఇనుము - ఉక్కు 4) బొగ్గు పరిశ్రమ 9. {పయాగ చక్కెర కంపెనీ యజమాని ఎవరు? 1) నెహ్రూ 2) లాలా లజపతిరాయ్ 3) తిలక్ 4) మదన్మోహన్ మాలవ్య 10. కాఫీలో భారత్‌తో పోటీ పడిన దేశం? 1) రష్యా 2) చైనా 3) బ్రెజిల్ 4) అమెరికా సమాధానాలు: 1) 1; 2) 2; 3) 4; 4) 1; 5) 2; 6) 1; 7) 3; 8) 1; 9) 4; 10) 3. -
సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
నేడు బెజవాడ రానున్న చంద్రబాబు విజయవాడ సిటీ : రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం విజయవాడ రానున్నారు. ఆయన పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో శుక్రవారం కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ మురళి ఏర్పాట్లను సమీక్షించారు. పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయంలో భారీ భద్రత చర్యలు చేపట్టారు. గన్నవరం నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారి పొడవునా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చంద్రబాబు ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 10.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆంధ్ర లయోల కళాశాలలో ఏపీఎన్జీవో అసోసియేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇరిగేషన్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. 3.05 గంటల నుంచి 4.05 గంటల వరకు జిల్లాలోని సీనియర్ అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం 6.30 గంటలకు బందరురోడ్డులోని శేషసాయి కల్యాణ వేదికలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.50 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. -
173 మద్యం షాపుల కేటాయింపు వాయిదా
కోర్టు ఉత్తర్వుల మేరకు జేసీ అధికారిక ప్రకటన నిర్వహణ తేదీ త్వరలో ప్రకటిస్తామని వెల్లడి మచిలీపట్నం : మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 173 మద్యం షాపుల కేటాయింపును వాయిదా వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మురళీ ప్రకటించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలోని మద్యం షాపులను లాటరీ పద్ధతిన కేటాయించే ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని షాపుల కేటాయింపు వాయిదా వేశారు. వాటి కేటాయింపు తేదీని త్వరలో ప్రకటిస్తామని జేసీ చెప్పారు. దీంతో విజయవాడ ఈఎస్ పరిధిలో షాపుల కేటాయింపు ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించారు. హైకోర్టు ఉత్తర్వులు తమకు అందలేదని, మద్యం షాపుల కేటాయింపు యథాతథంగా జరుగుతుందని ఎక్సైజ్ అధికారులు శనివారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు చెబుతూ వచ్చారు. మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని మద్యం షాపుల కేటాయింపును లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే జేసీ మురళీ మధ్యాహ్నం 2 గంటలకు మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని అన్ని మద్యం షాపుల కేటాయింపును వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించటంతో సస్పెన్స్‌కు తెరపడింది. -
ప్రజావాణికి సమస్యల వెల్లువ
కలెక్టరేట్ (మచిలీపట్నం): కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి సమస్యలు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ ఎం. రఘునందనరావుకు మొరపెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ప్రభావతి, జెడ్పీ సీఈవో సుదర్శనం తదితర అధికారులు ప్రజల నుంచి 175 అర్జీలు స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. తమ గ్రామంలో అనుమతులు లేకుండా యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వుతున్నారని కలిదిండి మండలం సీతారామపురం అగ్రహారానికి చెందిన చింతపాటి పద్మావతి ఫిర్యాదు చేశారు. ఈ చెరువులను పూడ్పిం చాలని విజ్ఞప్తిచేశారు. తమ గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మానం కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందని గుడివాడ మండలం నాగవరప్పాడుకు చెందిన దాసు శరబంది ఫిర్యాదుచేశారు. తమ ప్రాంతంలో 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న స్థలాలను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని గుడివాడకు చెందిన కడియం నాగరాజు అర్జీ దాఖలు చేశారు. ఐకేపీలో పనిచేస్తున్న వీవోఏలకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాల బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని, మండల, జిల్లా సమాఖ్యల నుంచి గుర్తింపుకార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని ఐకేపీ యానిమేటర్స్ (వీవోఏ) సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.సౌజన్య, గౌరవాధ్యక్షురాలు ఎ.కమల అర్జీ ఇచ్చారు. బందరు మండలం రుద్రవరం గ్రామంలో కృష్ణా యూనివర్సిటీ భవన నిర్మాణాల కోసం ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్న తమకు తెలియకుండా పొక్లెయిన్ ద్వారా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బందరు మండలం ఎస్.ఎన్.గొల్లపాలెం శ్మశానభూమికి రహదారి రహదారి సౌకర్యంలేదని గ్రామానికిచెందిన బి.రాజేష్, లక్ష్మణ్ తదితరులు అధికారులకు వివరిం చారు. గ్రామస్తులు చనిపోయినప్పుడు సరి హద్దు పొలాల యజమానులను బతిమలాడి మృతదేహాలను తీసుకువెళ్లాల్సి వస్తోం దని ఆందోళన వ్యక్తంచేశారు. శ్మశానానికి రహదారి వసతి కల్పించాలని అర్జీలో వేడుకున్నారు. మండల కేంద్రమైన గూడూరులో విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి రెండు వైపులా ఆర్ఎస్ నంబరు 393/1లో ఉన్న సుమారు 250 ఎకరాల గ్రామకంఠం భూమిలో పలువురు నివసిస్తున్నారని, ఈ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చేసేం దుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చారు. గూడూరు మండలం ముక్కొల్లు పంచాయతీ శివారు నాగవరం గ్రామంలో ఈ నెల 17వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఐఏవై కింద పక్కాఇళ్లు మంజూరు చేయాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో మచిలీపట్నంలోని రాజుపేట, దళితవాడ, మగ్గాలకాలనీ, యానాదుల కాలనీలో డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం చేపడ్తారని గతంలో అధికారులు ప్రకటించినా, ఇంత వరకు పనులు ప్రారంభించలేదని కేవీపీఎస్ నాయకుడు సీహచ్ రాజేష్ తదితరులు అర్జీ ఇచ్చారు. నిధులు మంజూరు చేసి డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెడన మండలం చోడవరం గ్రామంలో కేసుగుంట చెరువు పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ గ్రామానికి చెందిన పి.లక్ష్మీనారాయణ తదితరులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. ‘విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన సాయిశ్రీనివాస్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజయవాడ 53వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ నాయకులు కరీమున్నీసా తదితరులు అర్జీ ఇచ్చారు. -
తుంగ-భద్ర
గ్రంథం చెక్క తుంగభద్ర ఒక్క నది కాదు. తుంగ, భద్ర విడివిడిగా కొంత దూరం ప్రవహించి ఒక్కటై పోయాయి. తుంగడు యాదవ బాలుడు. గోవులను, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. వయసు ఇరవై వుండవచ్చు. యౌవనం అతనిలో తొణికిసలాడింది. తుంగడు మురళి వాయించేవాడు. గోవులూ, గొర్రెలు, చెట్లు, చేమలు తలలూపుతూ తన్మయత్వంతో వినేవి. ఆ ప్రాంతాన్ని ఒక కన్నడ రాజు పాలిస్తున్నాడు. అతని కూతురు పేరు భద్ర. అందాల రాశి. తుంగడు మోగించే మురళి విన్నది భద్ర. గోపాలకృష్ణుడి వద్దకు రాధ వెళ్లినట్లు భద్ర తుంగడి వద్దకు వెళ్లిపోయింది. ఇది కొన్నాళ్లు సాగింది. రాజుకు తెలిసింది. ఇద్దరినీ అడవిలో కదంబవృక్షం కింద పట్టుకున్నారు. ‘‘మమ్మల్ని యెవ్వరూ విడదీయలేరు’’ అంది భద్ర. తుంగణ్ణి చితక్కొట్టించాడు రాజు. అతని రక్తాన్ని తిలకంగా ధరించింది భద్ర. ఇద్దర్నీ విడదీశారు రాజభటులు. భద్ర కరిగి నీరై, నదియై ప్రవహించింది. తుంగడు కరిగి నీరై, నదియై ప్రవహించాడు. అలా విడివిడిగా ప్రవహిస్తూ వెళ్ళిపోయారు. రాజు గుండె పగలి చచ్చాడు. రాణి గుండె పగిలి చచ్చింది. మైళ్లు, బీళ్ళు, రాళ్ళు, బోళ్ళు, గుళ్ళు దాటి వెళ్లి ఒకచోట తుంగ+భద్ర కలుసుకొని తుంగభద్ర అయింది. వారు ప్రేయసీప్రియులు, భార్యాభర్తలు. కనుక ఇక సముద్ర సంగమం సాధ్యపడే విషయం కాదు. అందుకే తల్లిలాంటి కృష్ణవేణమ్మ వొడిలో చేరిపోయారు. -దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ నుంచి. -
వివాహేతర సంబంధంతో కొడుకు హత్య
తిరుపతి : మూడు రోజుల క్రితం తిరుపతి సమీపంలో జరిగిన బాలుడి మురళి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బాలుడి తల్లి అరుణ, ఆటో డ్రైవర్ సోమశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగానే వారు బాలుడిని హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తిరుపతి శివారులోని ఓ హోటల్లో విచారిస్తున్నారు. నిందితుడిని రాత్రికి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే...చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ ప్రాంతంలోని బైపాస్‌రోడ్డుకు సమీపంలో నిర్జన ప్రదేశంలో తొమ్మిదేళ్ల వయసు కలిగిన బాలుడిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ సంఘటన శనివారం వెలుగుచూసింది. బాలుడు 80 శాతం కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. అయతే మెడలోని తాయత్తు, చేతిలోని కంకణం ద్వారా మృతిచెందిన బాలుడు టిటిడి చైర్మన్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే మునిరత్నం కుమారుడు మురళిగా పోలీసులు గుర్తించారు. అతని చొక్కా జేబులో ఉన్న చాక్లెట్ కూడా అలాగే ఉంది. గుర్తుపట్టకుండా చేసేందుకు మాత్రమే ముఖంపైన పెట్రోల్ పోసి కాల్చివేశారు. మునిరత్నంరెడ్డి, భార్య అరుణ, కుమార్తె హేమశ్రీ(12), మురళి(9)తో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 5గంటల సమయంలో మురళి ఆడుకుంటానని ఇంటి నుండి వెళ్లి రాత్రి పదిగంటలు అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెదకి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించి మూడురోజుల్లోనే మిస్టరీని చేధించారు. -
పారిశ్రామిక విధానాల్లో స్పష్టత కావాలి
తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమల ప్రతినిధుల సూచన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పన్నులు, సింగిల్ విండో క్లియరెన్సులు, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు తదితర అంశాల విషయంలో పారిశ్రామిక విధానాల్లో నూతన ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని పరిశ్రమ ఆశిస్తోంది. సోమవారం తెలంగాణ రాష్ట్రానికి తొలి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా పారిశ్రామికవేత్తలు పలు సూచనలు చేసారు ఎమ్మెన్సీ సంస్థలు ఆఫ్‌షోర్ పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల లభ్యత, తక్కువ వ్యయం, మౌలిక వసతులు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ స్నేహపూర్వక విధానం పరిగణలోకి తీసుకుంటాయి. ఈ అంశాలనుబట్టి చూస్తే కంపెనీలు ఎంపిక చేసుకునే నగరాల్లో హైదరాబాద్ తన స్థానాన్ని కొనసాగిస్తుందని పెగా సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ సుమన్ రెడ్డి తెలిపారు. వ్యవస్థాపకత, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు అవసరమైన విధానాలను నూతన ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్న విశ్వాసం తమకుందని ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం తెలిపారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వెన్నుతట్టేందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలను విరివిగా స్థాపించాలని కోరారు. పరిశోధనను తదుపరి స్థాయికి చేర్చే రీసర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని విన్నవించారు. హైదరాబాద్ వెలుపల మరిన్ని పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించాలని ఇట్స్‌ఏపీ ప్రెసిడెంట్, ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ లోగనాథన్ తెలిపారు. స్టార్టప్‌లను ఉత్తేజ పరిచేలా ప్రోత్సాహం అవసరమని స్పష్టం చేశారు. -
కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల ధర్నా
సాక్షి, విజయవాడ/నందిగామ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లను అనుమతించకపోవడంతో వారంతా మంగళవారం ధర్నా నిర్వహించారు. విజయవాడ డివిజన్‌కు సంబంధించిన నియోజకవర్గాల ప రిధిలో ఓట్ల లెక్కింపును సిద్ధార్థ మహిళా కళాశా ల ఆవరణలో నిర్వహించారు. అభ్యర్థులకు ఎన్నికల కౌటింగ్ పై నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఒక్కొక్క ఎంపీటీసీ అభ్యర్థి వెంట ఒ క్కొక్క ఏజెంటును అనుమతిస్తామంటూ అధికారులు చెప్పారు. దీంతో విజయవాడ డివిజన్లోని జగ్గయ్యపేట, నందిగామ తదితర నియోజక వర్గాల నుంచి అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం ఎనిమిది గంటలకే కళాశాల వద్దకు చేరుకున్నారు. ‘అభ్యర్థి లేదా ఏజెంట్లలో ఎవ రో ఒకర్ని మాత్రమే పంపిసాం, జెడ్పీటీసీ అభ్యర్థుల వెంట ఏజెంట్లను పంపుతాం’అని పోలీ సులు అడ్డుచెప్పారు. దీంతో ఎంపీటీసీ అభ్యర్థుల వెంట వచ్చిన ఏజెంట్లంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నాకు దిగారు. తమకు ఇచ్చిన గుర్తింపు కార్డులు చూపిస్తూ నిరసన తెలియజేశారు. కేవలం అభ్యర్థిని మాత్రమే అనుమతిస్తామని ముందుగానే చెప్పి ఉండాల్సిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభ్యర్థులు చదువుకుని ఉండరని, అటువంటివారికి ఏజెంటే అన్నీ చూసుకుంటారని, ఇప్పుడు ఎవరో ఒకరే అంటే ఎలాగం టూ నిలదీశారు. సుమారు 10 గంటల వరకు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించి, ఏజెంట్లను పంపే అవకాశం లేదంటూ తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఏజెంట్లు తమ నిరసన వీడకపోవడంతో జాయింట్ కలెక్టర్ మురళి జో క్యం చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. జెడ్పీటీసీ ఓట్లు ఎక్కువగా ఉండడంవల్ల ఏజెం టును అనుమతించాలని, ఎంపీటీసీకి ఆ పరి స్థితి లేనందున ఏజెంటు అవసరం లేదని ఎన్నికలు నిబంధనలు చెబుతున్నాయని వివరించారు. అభ్యర్థి విశ్రాంతి కోసం బయటకు వ స్తే ఆయనకు బదులుగా ఏజెంటు కౌటింగ్ కేంద్రంలోకి వెళ్లవచ్చని నిబంధనలు చెబుతున్నాయన్నారు. నిబంధనలను పాటించేందుకు సహకరించాలనడంతో ఏజెంట్లు ధర్నాను విరమిం చారు. సౌకర్యాలు లేక నానా అగచాట్లు! ఒకవైపు మండుటెండ, మరోవైపు కౌటింగ్ కేం ద్రంలో తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా లభించని పరిస్ధితి ఏర్పడింది. బయటకు వెళ్లి వాటర్ బాటిల్ కొనుగోలు చేసి కౌటింగ్ కేం ద్రంలోకి రాబోయే అభ్యర్థుల ప్రతినిధుల్ని పో లీసులు అడ్డుకున్నారు. దీంతో కౌటింగ్ కేం ద్రాల్లోకి వచ్చిన మీడియా ప్రతినిధులు, అభ్యర్థు లు, ఏజెంట్లు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం జాయింట్ కలెక్టర్ మురళి దృష్టికి తీసుకువెళ్లగా తాము అభ్యర్థులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వలేదని, మం చినీటి సౌకర్యం అభ్యర్థులే చూసుకోవాలం టూ చెప్పారు. కేవలం డ్యూటీలో ఉన్న సిబ్బందికి మాత్రమే తాము సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పారు. మండుటెండలో మంచినీరు లేక సా యంత్రం వరకు అనేక ఇబ్బందులు పడ్డారు. సౌకర్యాలు లేక నానా అగచాట్లు! కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లకు భోజనాలకు అధికారులు టోకెన్లను ఇచ్చారు. ప్రింట్ మీడియా విలేకరులకు మాత్రం సౌక ర్యాలు కల్పించలేదు. వార్తల సేకరణకు లో పలి కి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. -
కాంగ్రెస్ నేతలకు పోలీసుల కౌన్సెలింగ్
అనంతపురం క్రైం, :ఒక రాజకీయ పార్టీలోకి చేరనందుకు అనంతపురంలోని ముగ్గురు కాంగ్రెస్ నేతలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లు అంటూ ఇంటి నుంచి స్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం స్టేషన్లో కళ్లకు గంతలు కట్టి పాశవికంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పీసీసీ కార్యదర్శి వజ్జల మల్లికార్జున అలియాస్ పాల మల్లి, అతని బావమరిది మాజీ కార్పొరేటర్ మురళి, కార్యకర్త విజయకుమార్ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను మురళితో కలిసి పాలమల్లి వివరించారు. ‘‘మాపై ఎలాంటి రౌడీషీట్లూ లేవు. ఏ చిన్న కేసుల్లోనూ జోక్యం చేసుకోలేదు. అలాంటి మమ్మల్ని ఓ సీఐ పోలీస్‌స్టేషన్‌కు రావాలని పలుమార్లు పిలిచాడు. రౌడీషీట్ ఉందని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని బెదిరించాడు. ఆయన వేధింపులు తాళలేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. ఆ అధికారికి న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన ఒక నేత మరొక పార్టీలోకి చేరబోతున్నాడు. తమను కూడా ఆహ్వానిస్తే నిరాకరించాం. దీంతో సీఐని అడ్డుపెట్టుకుని మమ్మల్ని బెదిరించేందుకు కుట్రపన్నాడు. అందులో భాగంగానే పోలీసులను ఉసిగొలిపాడు. ఆదివారం రాత్రి 8.30 గంటలకు వేణుగోపాల్‌నగర్‌లోని మా ఇంటికి వచ్చిన సీఐ ‘రేయ్ స్టేషన్‌కు రారా’ అని పిలిచాడు. ఎందుకని ప్రశ్నిస్తే నేను రమ్మన్నపుడు రాలేదు కదా..? ఈ రోజు కొట్టుకుంటూ తీసుకెళతా? అంటూ లాఠీలతో చితకబాదాడు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికిపోయారు. స్టేషన్లోకి వెళ్లాక కళ్లకు గంతలు కట్టి.. ‘కాంగ్రెస్‌లో ఎంతకాలం ఉంటావురా? వేరే దారి చూసుకోవా?’ అంటూ పాశవికంగా కుళ్లబొడిచారు. నాపై రౌడీషీట్ ఎత్తివేసినప్పటి నుంచి శాంతియుతంగా బతుకుతున్నాను. సీఐ ఏమో రౌడీషీట్ ఉందంటూ చావకొట్టారు. ఓ రాజకీయ పార్టీ మద్దతుదారుడైన సీఐ ఆ పార్టీ నేతల సూచనల మేరకే తమపై ప్రతాపం చూపుతున్నాడు. సీఐతోపాటు ఎస్ఐ జాకీర్ హుస్సేన్‌పై ప్రైవేట్ కేసు వేయడంతోపాటు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు. ఫోన్లో ఎంపీ పరామర్శ పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరిన బాధితులు పాలమల్లి, మురళి, విజయ్‌కుమార్‌లను అనంతపురం ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. పోలీసులతో మాట్లాడుతానని చెప్పినట్లు తెలిసింది. ఇదేం న్యాయం?: జేసీ బ్రదర్స్ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు లాఠీలతో కుళ్లబొడవడాన్ని ఖండించారు. పొలిటికల్ ఒత్తిడితో అమాయకులను చితకబాదడం కరెక్టు కాదన్నారు. రౌడీషీటర్లు అయినంత మాత్రాన ఆస్పత్రి పాలయ్యేలా కొడతారా? అంటూ ప్రశ్నించారు. -
మురళి ముందంజ
హైదరాబాద్: రాకెట్ బాల్ టోర్నమెంట్లో నరుమంచి మురళి, రాజ్ మోహన్ ముందంజ వేశారు. స్క్వాష్ తరహాలో జరిగే ఈ పోటీలు భారత్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి. ల్యాంకోహిల్స్‌లోని క్లబ్ జీయస్లో శనివారం జరిగిన తొలి రౌండ్ పోరులో మురళి 5-15, 15-9, 11-6తో వెంకటేశ్ బాగల్పై గెలుపొందగా, రాజ్‌మోహన్ 15-5, 15-4తో అవసరాల శ్రీనివాస్‌పై విజయం సాధించాడు. ప్రారంభ కార్యక్రమంలో భారత రాకెట్ బాల్ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ కందడాయి మాట్లాడుతూ ‘ల్యాంకోహిల్స్ ఇండియా ఓపెన్’ పేరిట జరుగుతున్న ఈ టోర్నమెంట్ ఇతర క్రీడల్లాగే ప్రాచుర్యం పొందాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మొత్తం 40 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. నెట్స్ ఉండవ్... స్క్వాష్ కాదు... ఆటగాళ్లు రాకెట్లతో బరిలోకి దిగుతారు. కానీ బ్యాడ్మింటన్ కాదు... టెన్నిస్ కానే కాదు... అసలు నెట్సే వుండవు. అలాగని స్క్వాష్ కూడా కాదు. స్క్వాష్ ఆటలాగే అనిపించినా కాస్త భిన్నంగా పోటీ సాగుతుంది. స్క్వాష్‌లో గోడకు లైన్ ఉంటుంది. దానిపైనే బంతిని కొట్టాలి. లేదంటే ఔట్ బాల్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ లైనే ఉండదు. గోడపై ఇష్టమొచ్చిన చోట కొట్టుకోవచ్చు. -
కొత్త జేసీకి సవాళ్లెన్నో
నేడు విధులకు హాజరు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రెండురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించి శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు జిల్లాకు వస్తున్న కొత్త జాయింట్ కలెక్టర్ మురళికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో గత కొంతకాలంగా పక్కదారి పట్టిన రెవెన్యూ పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఇసుక దొంగ రవాణా యథేచ్ఛగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతుండటం, అధికారులపై సైతం దాడులకు తెగబడుతుండటంతో వారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు సిబ్బంది భయపడుతున్నారు. కృష్ణానదీతీరంలో ఇసుక దొంగ రవాణాకు చెక్ పెట్టాలి. విజయవాడ రెవెన్యూ డివిజన్లోని పలు గ్రామాల్లో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుక రవాణాను అరికట్టాలి. ఇసుక మాఫియా ఆగడాలను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంది. మరోపక్క ప్రజాపంపిణీ వ్యవస్థ జిల్లాలో పక్కదారి పట్టింది. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు యథేచ్ఛగా తరలించేస్తున్నారు. జిల్లాలో కొందరు అధికారులు, డీలర్లతో కుమ్మక్కై ప్రజాపంపిణీ వ్యవస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రతీ మండలంలో ఫిర్యాదులు కోకొల్లలుగా ఉన్నాయి. బినామీ డీలర్లను ఏరేసి ఆ స్థానంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగేలా కొత్త డీలర్ల నియామకాలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో తహశీల్దార్ కార్యాలయాల్లో, రెవెన్యూ డివిజన్లలో పెండింగులో ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొన్ని మండల కేంద్రాల్లో పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీకి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు పిర్యాదులు ఉన్నాయి. సొమ్ము ఇవ్వలేని బక్కరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూవివాదాలు పరిష్కారం కాక అనేకమంది బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్సైజ్, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, సినిమాహాళ్ల నిర్వహణపై అజమాయిషీ కొరవడింది. ఎంతోకాలంగా వాటిపై తనిఖీలు లేకపోవటంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అన్నింటీకి మించి ఈ జిల్లాలో రాజకీయ పరిస్థితులు పెనుసవాలుగా మారనున్నాయి. -
ప్లాస్టిక్ నిషేధంపై తాత్సారం
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన తిరుపతిలో పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా సాగుతోంది. రోడ్లపక్కనే ఎక్కడ పడితే అక్కడ వాడిపడేసిన ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్‌తో ఇవీ ప్రమాదాలు.. ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాలు తీసుకోవడం వలన అందులో ‘టాక్సిన్’ అనే విషపదార్థం కలుస్తుంది. దీంతో స్త్రీలలో రొమ్ము కేన్సర్, పిల్లల్లో బుద్ధిమాంద్యం, జ్ఞాపక శక్తి తగ్గడం, యువకులలో ఆరోగ్యం క్షీణించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్లాస్టిక్ కవర్లను వాడి పడేస్తే 100 సంవత్సరాలైనా భూమిలో కరిగిపోవు. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవి రీసైక్లింగ్‌కు అనువుగా ఉండకపోవడంతో పర్యావరణానికి ప్ర మాదకరంగా మారుతున్నాయి. తిరుపతికి యాత్రికులు, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరిలో చాలామంది టిఫిన్‌కోసం హోటళ్లు, టిఫిన్ బండ్లు, పానీపూరి బండ్లను ఆశ్రయిస్తుంటారు. వీరికి ప్లాస్టిక్ కవర్లు, ప్యాకెట్లలో ఆహార పదార్థాలను విక్రయిస్తుం డటంతో వాటిని తిని రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఆదేశించినా.. పర్యావరణానికి ముప్పుగా మారిన 40 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉ న్న ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అప్పటి తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ జానకి ఆపై కమిషనర్‌గా బాధ్యత లు స్వీకరించిన ప్రసాద్ క్షేత్రస్థాయిలో కదలిక తీసుకొచ్చి నగరంలో ఏకధాటిగా ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలపై దాడు లు చేసి, జరిమానాలు విధించారు. రాజకీయ నాయకుల ఒత్తిడి పెరగడం తో ఆయన మిన్నకుండిపోయారు. అనంతరం కమిషనర్‌గా వచ్చిన మురళీ ప్లాస్టిక్ నిషేధం ఊసే ఎత్తలేదు. ప్రస్తుతం కమిషనర్‌గా పనిచేస్తున్న సకలారెడ్డి బాధ్యతలు తీసుకున్న మొదట్లో ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపుతామని, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పది రోజుల క్రితం మార్కెట్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిం చడం మినహా, నిషేధానికి ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. విక్రయాలపై చర్యలు శూన్యం కార్పొరేషన్ పరిధిలో సుమారు రెండు వేలకు పైగా దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటిలో ప్లాస్టిక్ కవర్ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. 50కి పైగా హోల్‌సేల్ దుకాణాలలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చెన్నై, బెంగళూరు నుంచి 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులు భారీగా తెప్పించుకుంటు న్నారు. వీటిని నగరంలోని ఇసుకవీధి, నెహ్రూవీధి, కొర్లగుంట, ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నాయకుల అండ ఉండటంతో కార్పొరేషన్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఒక వేళ దాడులు చేసి నిషేధిత ప్లాస్టిక్ కవర్లను టన్నుల కొద్దీ పట్టుకున్నా కేవలం నామమాత్రపు జరిమానా వేసి వదిలేస్తున్నారు. ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోవడం లేదు ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జూట్‌బ్యాగులను, గుడ్డ సంచులను వా డేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుడ్డ సంచులను తయారు చేసేందుకు స్వయంశక్తి మహిళా సంఘాలు ముందుకొస్తున్నా వారిని ప్రోత్సహించడం లేదని తెలిసింది. ఇకనైనా తిరుపతిలో పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
సుడాన్లో పోరంకి ఇంజినీర్ పాట్లు
=భారత్‌కు రావాలని 40 మంది ఎదురుచూపు = కుటుంబ సభ్యుల్లో ఆందోళన = ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి పెనమలూరు, న్యూస్‌లైన్ : సుడాన్ దేశంలో జరుగుతున్న అంతర్గత పోరు కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన ఓ యువ ఇంజినీర్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అతనితోపాటు భారతదేశానికి చెందిన 40 మంది పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సుడాన్లో ఉన్న వారిని సురక్షితంగా భారతదేశానికి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోరంకి గ్రామానికి చెందిన నల్లమోతు మురళీ కుమారుడు నల్లమోతు కిరణ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి గత ఏడాది దక్షిణ సుడాన్‌లోని పలోజాలో ఉన్న స్టార్ కాంట్రాక్టింగ్ ఆయిల్ ఆండ్ గ్యాస్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అతను గత మార్చి నెలలో భారత్‌కు వచ్చి జూన్‌లో తిరిగి సూడన్‌కు వెళ్లారు. ఆ దేశంలో అంతర్గత యుద్ధం సందర్భంగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సుడాన్ రాజధాని జుబ్బాకు 400 కిలోమీటర్ల దూరంలో పలోజాలో కిరణ్ పని చేస్తున్నారు. అక్కడ మిలిటెంట్ పోరు జరగడంతో కిరణ్‌తోపాటు మరో 40 మంది భారతీయులు కంపెనీలోనే చిక్కుకుపోయారు. వారు భారత్‌కు రావటానికి అవకాశం లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను మాత్రం ఆయా దేశాలు సురక్షితంగా తీసుకు వెళ్లాయి. అయితే భారత్‌కు చెందిన వారిని మాత్రం ఎవ్వరు పట్టించుకోవటంలేదని కిరణ్ స్వయంగా ఫోన్లో న్యూస్‌లైన్‌కు మంగళవారం తెలిపారు. తాము జుబ్బాకు చేరుకోగలిగితే భారత్‌కు రాగలుగుతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలి... సుడాన్లో చిక్కుకుపోయిన తమ కుమారుడు, మరో 40 మందిని ప్రభుత్వం భారత్‌కు తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కిరణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సుడాన్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినందున తక్షణం ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్న వారిని ఇక్కడకు సురక్షితంగా తీసుకువావాలని కోరుతున్నారు. -
ఎనీ గేమ్..సింగిల్ హ్యాండ్
ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. గణష్. ఇది సినిమా డైలాగ్. నిజ జీవితంలో కార్మికుడి కొడుకు ఆటైనా.. ఈతైనా.. పరుగైనా.. సైక్లింగైనా.. ఒంటి చేత్తో జాతయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. మణికట్టు లేకపోయినా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న మురళికి వికలాంగులే ప్రేరణ అయ్యారు. రామగుండం(కరీంగనర్), న్యూస్‌లైన్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖని రాంనగర్లో నివాసముంటున్న తడబోయిన రమేష్-లక్ష్మి దంపతులకు శ్రీనివాస్, మురళి, సరళ సంతానం. రమేష్ సింగరేణి రామగుండం-2 ఏరియా పరిధిలోని ఓసీపీ-3 మేయిం టనెన్స్ సెక్షన్లో జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు మురళికి పుట్టుకతోనే కుడి చేయి మణికట్టు లేదు. దీంతో మానసికంగా కృంగిపోయిన అతడికి కుటుంబ సభ్యులు, మిత్రులు, కోచ్‌ల ప్రోత్సాహం ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న మురళి పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. వికలాంగులే ప్రేరణ చిన్నతనంలో సెలవు దినాల్లో కామారెడ్డి సమీపంలోని ముత్యంపేట గ్రామానికి వెళ్లిన మురళి అక్కడ చూసిన ఆ దృశ్యం అతడి జీవితాన్నే మార్చేసింది. రెండుకాళ్లు, ఒక చేయి లేని వ్యవసాయ కూలి చెరువులో ఈత కొడుతుంటే చూసి ఆక్చర్యపోయాడు. అంతే కాదు.. తన తాత మల్లయ్యకు కంటి చూపు లేకున్నా గోదావరిలో ఈత కొడుతుంటే గమనించాడు. కరీంనగర్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మాదాసు శ్రీనివాస్‌కు రెండు కాళ్లు లేవు. ఆయన క్రీడల్లో సత్తా చాటి అర్జున అవార్డుకు ఎంపికవడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఈ సంఘటనలన్నీ దగ్గరగా గమనించిన మురళిలో ఏదైనా సాధించాలనే తపన పెరిగింది. క్రీడారంగలో అడుగులు ముందుకు వేయడానికి దారి చూపాయి. డిగ్రీ చదువుతున్న కాలేజీ డెరైక్టర్ రాజేందర్, లెక్చర్లు రాజయ్య, రవీందర్ మిత్రులుగా మారిపోయారు. తోటి క్రీడాకారులు అఖిల్షాఖన్, మధు, ఆనంద్, కోచ్‌లు కష్ణమూర్తి, కొండయ్య, శ్రీనివా స్, లైఫ్‌సేవింగ్ టీం మెంబర్ గౌతం ప్రోత్సాహం పుష్కలంగా లభించింది. తొలిసారి వరంగల్‌లో స్టేట్‌లెవల్ స్విమ్మింగ్ మీట్‌కు వెళ్లడానికి భయం పడుతుంటే.. మిత్రులు అఖిల్షాఖన్, ఆనంద్ కాలేజీకి డుమ్మాకొట్టి పోటీలకు తీసుకుపోగా ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం లో నిలిచాడు. ఇది మురళి క్రీడా జీవితంలో టర్నింగ్‌పాయింట్‌గా మారింది. దీంతో ప్రతీ ఈవెంట్‌ను ఛాలెం జ్గా తీసుకుంటూ ముందుకు సాగాడు. సాధించిన విజయాలు చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పారా ఒలంపిక్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటాడు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మూడు అంశాలలో(750 మీటర్ల ప్రీస్టైల్ స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైకిలింగ్, 5 కిలోమీటర్ల పరుగు పందెం) కోలకతాలో జరిగిన పారా ఒలంపిక్ త్రైత్లాన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో గత ఏడాది అక్టోబర్ 2న జరిగిన రాష్ట్రీయ క్రీడల్లో ఒంటి చేత్తో బ్యాడ్మింటన్ ఆడి బంగా రు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ పోటీలే లక్ష్యం అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించడమే తన లక్ష్యం. ఇందుకోసం అవసరమైన కసరత్తు చేస్తున్నాను. రక్షణ శాఖ లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేష న్(డీఆర్డీఓ)లో ఉద్యోగం చేయాలని ఉంది. -తడబోయిన మురళి -
నేత్రపర్వం..కలశజ్యోతి మహోత్సవం
విజయవాడ, న్యూస్‌లైన్ : బెజవాడ దుర్గమ్మ కలశజ్యోతి మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సత్యనారాయణపురంలోని శివరామకృష్ణక్షేత్రం నుంచి కలశజ్యోతి ప్రదర్శన ప్రారంభమైంది. ప్రత్యేకంగా అలంకరించిన పుష్పకవాహనంపై శ్రీ గంగాపార్వతీసమేత మల్లేశ్వరస్వామి కొలువుదీరారు. ఉత్సవమూర్తులకు ఇన్చార్జి ఈవో త్రినాథ్‌రావు పూజాదికాలు నిర్వహించి ప్రదర్శన ప్రారంభించారు. భవానీలు కలశాలను చేతబూని జై భవానీ, జై ైజై భవానీ నామస్మరణ చేస్తూ ముందుకుసాగారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ ప్రదర్శన కనులపండువగా సాగింది. బాల భవానీలు జ్యోతులను పట్టుకుని వడివడిగా అడుగులు వేశారు. ఉత్సవమూర్తులు కొలువుదీరిన వాహనంతోపాటు దేవస్థాన ప్రచార రథంతో ఊరేగింపు గాంధీనగర్, అలంకార్ టాకీస్, చల్లపల్లి బంగళా మీదుగా ప్లైఓవర్ ఎక్కి కెనాల్ రోడ్డు, టోల్‌గేటు మీదుగా ఓం టర్నింగ్ వరకు సాగింది. అక్కడ జ్యోతులను ఉంచి భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. కలశజ్యోతి ఉత్సవంలో స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాదశర్మ, మల్లేశ్వరాలయ ప్రధాన అర్చకులు యనమండ్ర మల్లయ్యశాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు మురళి, షన్ముఖ, అర్చకులు కోట ప్రసాద్, శంకరమంచి ప్రసాద్, యజ్ఞనారాయణ, ఆలయ ఈఈ కోటేశ్వరరావు, స్తపతి రామబ్రహ్మం, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రామాయంపేట, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెండాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం దామరచెర్వు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానిక ఏఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన మహ్మద్ యూనస్(43) సోమవారం తన కూతురిని అత్తగారింట్లో దింపేందుకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి వెళ్లాడు. తిరిగి సరూర్‌నగర్ వెళ్తున్న క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట బైపాస్‌లో బస్సు దిగి, పట్టణ శివారులోని దామరచెర్వు 44వ జాతీయ రహదారిపై నడుచుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యూనస్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఏఎస్ఐలు మురళి, బాలక్రిష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మురళి తెలిపారు.